Pages

A small story about the importance of Good people

సత్సంగం మరియు సజ్జన సాంగత్యం యొక్క ప్రాశస్తి
 
 
నాగరాజైన ఆదిశేషుడు సమస్త భూమండలాన్ని తన వేయి పడగలపై మోస్తున్నాడు. ఒక రొజు బ్రహ్మ దేవునికి దీటుగా సృష్టికి ప్రతి సృష్టి గావించిన రాజర్షి అయిన విశ్వామిత్రుడు వచ్చి నాగరాజును తనతో రమ్మన్నాడు. ఆందుకు ఆదిశేషుడు మిక్కిలి వినయ విధేయతలతో “ ఓ బ్రహ్మర్షి! ఈ సమస్త భూమండలం నా శిరస్సుపైనే వుంది. దీనిని పరిరక్షించడమే నా కర్తవ్యం. నేను ఈ కార్యాన్ని విస్మరించినట్లైతే ఈ భూమండలం పాతాళం వైపు పడిపోవడం తధ్యం. అప్పుడు అనేక కోట్ల జీవ రాశులు నాశనమైపోతారు” అన్నాడు.
 
 
ఆందుకు విశ్వామిత్ర మహర్షి చిరునవ్వు నవ్వి “ అటువంటిదే గనక జరిగితే నేను నా అమోఘమైన తపశ్సక్తితో దానిని ఆపుతాను” అన్నాడు.
అందుకు నాగరాజు ఒప్పుకోలేదు. విశ్వామిత్రుడు ఎన్ని విధాలుగా నచ్చ జెప్పి చూసినా ఆదిశేషుడు తన నిర్దేశిత కార్యాన్ని వదలనని మొండిపట్టు పట్టాడు. ఆదిశేషుని మంకుపట్టు చూసి విశ్వామిత్రునికి తీవ్రమైన కోపం వచ్చింది. కమండలం ఎత్తి శపించబోయేంతలో ఆదిశేషుడు భయపడి ఇక చేసేది లేక భూమిని పక్కకు పెట్టి వచ్చాడు.
 
 
అంతలొనే ఘోరమైన విపత్తు సంభవించింది. ఇన్ని వేల యుగాలుగా ఆదిశేషుని వేయిపడగలపై బధ్రంగా వున్న భూగొళం వెంటనే పాతాళం వైపు పడిపోవడం ప్రారంభించింది. దానిపై నివాసముంటున్న వేల కోట్ల జీవరాశులు ప్రాణ భయంతో ఆర్తనాదాలు చేయడం ప్రారంభించాయి.
ఆదిశేషుడు జరిగిన దానిని చూసి తీవ్రమైన దుఖంతో మాంపడిపోగా తప్పశ్శక్తి సంపన్నుడన్న గర్వంతో విశ్వామిత్రుడు కమండలం లోని నీరు ధారపొసి ఆగు అంటూ భూమిని ఆజ్ఞాపించాడు. భోగోళం పతనం ఆగలేదు. పైపెచ్చు ఆది మరింత వేగంగా పడిపోవడం ప్రారంభించింది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి పట్టరాని ఆగ్రహంతో “ నా తప శ్సక్తి అంతా ధారపోస్తున్నాను,వెంటనే ఆగు” అంటూ ఆజ్ఞాపించాడు.అయినా ఫలితం లేకపోయింది.
అప్పడు విశ్వామిత్రునికి అహంకార మైకం తొలిగిపోయింది. భూమిని ఆపడానికి తన తప: శ్సక్తి చాలదని తెలుసుకున్నాడు. ఏం చేయలా అని ఆలోచిస్తుండగా నారద మహర్షి అక్కడికి వచ్చి జరిగిన దానిని తెలుసుకొని” ఓ మహర్షి! నీవు ఎప్పుదైనా సజ్జన సాంగత్యం చేసి వుంటే ఆ ఫలితాన్ని వెంటనే ధారపొయు. భూపతనం ఆగిపోతుంది” అని సెలవిచ్చాడు.
 
 
అప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు.తాను అందరితో తగవులు పెట్టుకోవడమే కాని సజ్జన సాంగత్యం చేసింది లేదు.సాటి ముని పుంగవులతో సజ్జన సాంగత్యం , సత్సంగం చేసింది కూడా లేదు.అయినా తాను వశిష్ట మహర్షి వద్దకు వెళ్ళిన సంగతి జ్ఞప్తికి తెచ్చుకొని ఆ పుణ్యాన్ని ధారపోయగా వెంటనే భూగోళ పతనం ఆగిపోయింది. ఆది శేషుడు యధావిధిగా తిరిగి భూమండలాన్ని తన తలకు ఎత్తుకున్నాడు.
మానవులలో దానవ మానవ గుణాలు రెండూ నిక్షిప్తమై వుంటాయి.సమయం సంధర్భం బట్టి ఏదో ఒక గుణం బయటకు ప్రకటితమౌతూ వుంటుంది. దుర్జనులతో సాంగత్యం చెస్తే అసుర గుణం బలీకృతమై ఎన్నో చెడ్డ పనులను చేస్తాం.
 
 
అందు వలన పైన వివరించినట్లుగా చెసిన పాప కర్మల తాలూకు ఫలితాన్ని అనుభవించేందుకు జనన మరణ చక్ర భ్రమణంలో పడిపోతాం.సజ్జన సాంగత్యం మనలో రజో తమో గుణాలను తగ్గించి సాత్విక భావాలను పెంచుతుంది.భగవత్ ధ్యానం, నామ స్మరణ,సంఘ సేవ, యజ్ఞ యాగాదులను నిర్వహించుట,పరుల పట్ల కరుణా కటాక్షాలను కలిగి వుండుట వంటి చక్కని కర్మలను చేసేందుకు ఎంతగానో సజ్జన సాంగత్యం తోడ్పడుతుంది. ఎక్కడ సత్సంగం జరుగునో అచ్చట దేవతలు స్థిర నివాసం చెస్తారన్నది శాస్త్ర వాక్యం. సత్కర్మలు భగవంతుని సన్నిధికి చేరేందుకు దారి చూపిస్తాయి.
 
 
కలి ప్రాభవాం అధికంగా వున్న ఈ రోజులలో సత్సంగం అంత త్వరగా దొరకదు. మానవులు ధనార్జనే ముఖ్య ధ్యేయం గా బ్రతుకుతూ మానవతా విలువలకు త్రిలోదకాలిస్తున్నారు.అరిష డ్వర్గాలకు బానిసలైపోతూ దానవ గణానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు.మంచితనం అన్నది మచ్చుకైనా కనిపించదం లేదు.
 
 
అంతటా స్వలాభం, స్వార్ధం, అవినీతి, హింసా విలయ తాండవం చేస్తున్నాయి.అటువంటి పరిస్థితులలో సత్సంగం దొరకడం బహు కష్టం. కాని ఆశావహ ధృక్పధంతో, సానుకూలంగా యత్నిస్తే సజ్జన సాంగత్యం దొరకడం కష్టమే కాని దుర్లభం కాదు. అయితే ఈ సత్సంగం అనే పూదోతలో కలుపు మొక్కలు విరివిగా మొలకెత్తడం అనివార్యం. అట్టివారి మాయలో పడక,అప్పడప్పుడు ఆ కలుపు మొక్కలను ఏరిపారవేయడం చేస్తుండాలి.లేకపోతే అద్బుతమైన పూదొట కలుపు వనంగా మారే ప్రమాదం వుంది.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online