Pages

kaarthika puranam - 20th chapter

కార్తికపురాణం  - 20 వ అధ్యాయము



పురంజయుడు దురాచారుడగుట



జనక మహారాజు, చతుర్మాస్య వ్రత ప్రభావము వినినపిమ్మట వశిష్టునితో " గురువర్యా! కార్తీక మాసమహాత్మ్యమును యింక ను విన వలయును నెడి కోరికకల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకనువిశేషములు గలవా! యను సంశయము గూడాకలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్నివుదాహరణలు వినిపించి నన్ను కృతార్దునిగా జేయు"డనెను. అ మాటలకు వశిష్టుల వారు మంద హాసముతో " ఓ రాజా! కార్తీక మాస మహాత్మ్యము గురించి అగస్త్యమహాముని, అత్రి మునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు.దానిని వివరించెదరు ఆలకించు" మని అ కథావిధానమును యిట్లు వివరించిరి. పూర్వ మొకప్పుడుఅగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి" ఓ అత్రి మహామునీ!నీవు విష్ణువు అంశయందు బుట్టి నావు. కార్తీకమహాత్మ్యమును నీకు ఆ ములాగ్రమున తెలియును, కానదానిని నాకు వివరింపుము" అని కోరెను.



 అంత "ఓ అత్రిమహామునీ! నీవు విష్ణువు అంశ యందు బుట్టి నావు. కార్తీకమాస మహాత్మ్యము నీకు ఆ మూలాగ్ర ముగా తెలియును,కాన దానిని నాకు వివరింపుము " అని కోరెను. అంతఅత్రిమహముని "కుంభ సంభ వా! నీ వడిగిన ప్రశ్నవాసుదేవునికి ప్రితికరముగుటచే నుత్త మమయిన ది. కార్తీక మాసముతో సమాన ముగ మాసము. వేద ముతోసమాన మగు శాస్త్రము. ఆరోగ్య సంపదకు సాటి యగుసంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటె వేరుదేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమునునదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందుదీపారాధ న చేసిన ను, లేక దీ పదానము చేసిన ను గలుగుఫలితము అపార ము. ఇందుకొక యితిహాసము వినుము.త్రే తాయుగా మును పురంజయుడ ను సూర్య వంశపురాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొనిరాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివిపట్టభి షి క్తుడై న్యాయముగా రా జ్యపాలన చేసెను.ప్రజలకెట్టి యా పదలు రాకుండ పాలించుచుండెను.అట్లుండ కొంత కాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతును, రాజ్యాధి కార గర్వముచెతను జ్ఞాన హినుడైదుష్ట బుద్ది గలవాడై దయాదాక్షి ణ్యములు లేక దేవబ్రాహణ మాన్యములు లాగుకొని, పరమలోభి యై, చొరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలుచేయించుచు దొంగలు కొల్ల గొట్టుకొని వచ్చిన ధనములోసగమువాటా తీ సికోనుచు ప్రజలను భి తావ హులనుచేయుచుండెను. ఇటుల కొంత కాలము జరుగగా అతనిదౌష్ట్య ములు నలుదిక్కులా వ్యాపించెను. ఈవార్త కాంభో జరాజును నాయకునిగా చేసుకోని రధ, గజ, తురగ, పదాతిసైన్య బలా న్వితులైర హస్యమార్గ ము వెంట వచ్చిఅయోధ్య నగర మును ముట్టడించి, నలు వైపులాశిబిరములు నిర్మించి నగర మును ది గ్భ౦ధముచేసి యుద్దమునకు సిద్ద పడిరి.



 
అయో ధ్యా నగరమును ముట్ట డి ౦చిన సంగతినిచారులవలన తెలిసికోనిన పురంజయుడు తానుకూడాసర్వ సన్నద్దు డై యుండెను. అయిన ను యెదుటి పక్ష మువారధి కబలాన్వితులుగా నుండుటయి తానుబలహినుడుగా నుండుటయు విచారించి యే మాత్రముభితి చెందక శాస్త్ర సమన్విత మైన రాథ మెక్కి సైన్యాధపతులను పూరి కొల్పి, చతురంగ బల సమేత మైనసైన్యముతో యుద్ద సన్నద్దు డై - న వారి ని యెదు ర్కొనభేరి మ్రోగించి, సింహనాద ము గావించుచు మేఘములుగర్జించునట్లు హు౦కరించి శత్రు సైన్యములు పైబడెను.



 ఇట్లు స్కాంద పురాణాతర్గ త వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్యమందలి వింశాద్యాయము-
ఇరవ య్యోరోజు పారాయణము సమాప్తము.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online