Poetry
మహాసముద్రయానం జీవితం
భయానక సమస్యలు తో నిండిన ఆ జీవన రాత్రిళ్ళు
దిక్కు తోచని చీకట్లలో కిటికీ నుంచీబైటకు చూస్తున్నాను
ఎటు చూసినా,ఎక్కడ విన్నా కీచు రాళ్ళ శ బ్డమే
కాలం మెల్ల మెల్ల గా సాగి పోతుంది
ఒక్కో రేవు చేరుతుంది , జీవితనౌక . ఒక్కో అంకం ముగుస్తుంది .
ఒక్కో అందం తగ్గిపోతుంది .
తెగ కష్టపడుతూ తెడ్లు వేస్తున్న సారధులు .
కాలం వయస్సు తెచ్చే బరువులతో కొంచం కొంచం ఒడిగిపోతున్నారు .
నడిమధ్యసముద్రంల్లోకి చేరుకున్నాము .
ఇక మా చేతుల్లోకి వచ్చేసింది నౌక సారధ్యం
మునుగుతూ ,లేస్తూ అలల విసురులపై గింగ రాలు తిరుగుతుంది నౌక.
కొన్ని రేవులు పట్టణాలు గ్రామాలు దాటిపోయాయి.
ఎన్ని అవమానాలు ఎన్ని అవరోధాలు ,
అయున వారు చేసిన అపరాధాలు,
కాని వారు పెట్టిన కష్ట నష్టాలు , స్వంత వాళ్ళే చేసిన అవమానాలే,
అయునా లెక్కచేయని సారధులు అమ్మా నాన్నల అండదండలు .
.అమృతం అద్దిన ఆప్యాయతలు ,అనుభంధాలు ,
ఆ దృశ్యాలు గుండెల్లో తడుతూ రీలు లా తిరిగిపోతున్నాయు .
ఇంతకాలానికి ఆరుబైయట సముద్రం ప్రశాంతము గా వుంది .
ఎందుకో ఆ రోజులే బాగున్నాయి .కృషితో ,కసితో రేయు అనక పగలు అనక పడిన కష్టం ,ఉత్కృష్ట౦ .
కళ్ళల్లో కన్నీళ్ళుసుడులు తిరుగుతున్నాయి .ఇప్పటికి గాడిలోకి వచ్చింది నౌక .
ఒకొక్కసారి సారధులు చుక్కాని తప్పి ప్రయాణాల మజిలీలు .
ఆ ఆటు పోటుల భయంకర దృశ్యాలు ,చావు బ్రతుకుల మధ్య ఊగిసలాటలు .
ఇప్పుడు మాత్రం ఆరు బైట వెన్నెల కాస్తుంది
ఏమి లాభం ఆస్వాదించటానికి ఆ సారధులు లేరు .
వారి జ్ఞాపకాల ముసురుల్లో చేస్తూన్న ప్రయాణం .కన్నీటి పర్యంతం
పాత రోజుల్లో సముద్రపు హారులు ఎన్ని వున్నా ,ఎన్ని తూఫానులు ముంచెత్తినా
కళ్ళ ముందు ఆ సారధులు కనిపిస్తుంటే చాలు ,
సముద్రాన్ని దోసిలిలో పట్టేసినంత హాయు
ఇప్పుడు కిరిటీలోనుంచీ వెన్నెల చూడలేను
చూడాలంటే ఏదో బాధతో కలిగే భయం
అనంత జీవన గమనములో జీవిత నౌక సాగిపోతూనే వుంది
సారదులూ మారిపోయారు ,సంతోషాలు మారి పోయాయు
కొత్త అనుభంధాలు బై చెప్పాయి .కొంగ్రొత్త బంధాలు స్వాగతించా యు .
గతం అంతా విధి ఆడించిన వింత నాటకాలు
జీవన సముద్రములో నౌక ఎన్నిసార్లు మునిగిపోయుందో
కాలం మూసిన భయంకర చీకట్ల లో
భయం లేదురా నాన్న ,కన్నా అంటూ వాళ్ళు మునిగిపోతున్నా
అకుంఠిత ధైర్యం తో చేతులు పై ఎత్తుకొని ఈదేవారు .
ఎదురు వచ్చే భయానికి ,సై అంటూ కాలు దువ్వాలి .
భార్యాభర్తలు ఓ పవిత్ర బంధం ,అమ్మా నాన్న ఓ మధుర అమృత తుల్యం
అన్నా చెల్లి ,అక్కాతమ్ముడు , నానమ్మ తాతయ్య లు తీయని బ౦ధాలు
భయాన్ని వ౦గ పెట్టి నడ్డి విరిచి వేయాలి
దారిలో అయునా దేనిలోఅయునా యుద్దం .
ఎప్పుడైనా ,ఎక్కడైనా ఎలా అయునా సరే మేం సిద్దం
ఏమి పోయినా , ఏది వచ్చిన ఏదీ కాదు శాశ్వతం .
ఉన్నంత లోనే సాధించుకోవాలి ఆనందం
నమ్ముకున్న కష్టం లోనే వుంది అమృతం
ఇక ఏ రేవు అయునా , ఏ దేశం అయునా
అప్పుడే జీవిత నౌక పదిలం ,అ౦దుకు మేము ఎల్లవేళలా సనద్దం .
ఇదే సారధులు వారసులకు పెంచి ,పంచి ఇచ్చిన సందేశం
0 comments:
Post a Comment