Pages

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-2

     హరి హరులు ఇద్దరు ఒక్కరే,  ఒక్కరే రెండు రూపాలలో వున్నారు,   అంతేకాని మనం అనుకొనే శృ౦గారం కాదు.  మనుషుల్లోలా గర్భిణి, సెక్స్ లు  కావు అవి.   ఐనా వైష్ణవులు మళ్లి చెబుతూ ఒకవిష్ణు సాలగ్రామాన్ని పూజిస్తే కాశిలో కోటి శివలింగాలు పూజి౦చినట్లే అని పద్మపురాణములో సాక్షాత్తు శివభగవానుడు చెప్పినట్లు వు౦దికదా అని వాళ్ళు మరల మరల ఉదాహరిస్తువుంటారు.  ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి.   ఒక హీరో గురించి ఒక పుస్తకం వ్రాస్తున్నాము అన్కోండి, ఆ హీరో గొప్పతనం గురించే వ్రాస్తారుకాని ఇంకో కరి గొప్పతనం గురించి వ్రాయరు కదా!  ఏ దేవుడి గురించి వ్రాస్తే ,ఏ దేవత గొప్పతనం గురించి ఆ దేవుడే గొప్ప అని వ్రాస్త్తారు కదా అంతే అని తెలుసుకోవాలి, పైగా ఈ దేవుడే,మిగతాదేవతల కంటే గొప్ప అని వ్రాసి వుంటుంది అని కూడా తెలుసుకోవాలి . 

       శ్రీమత్ రామాయణం కూడా శివ మరియు విష్ణు భక్తుల వాదనల ఘట్టం అనే వారు వున్నారు .బ్రాహ్మణ మరియు క్షత్రియ రాజుల  మద్య వ చ్చిన యుద్ధం అనే వాళ్ళ వున్నారు ,శంకరాచార్యుల వారు అయుతే అన్ని దేవుళ్ళ పై స్తోత్రాలు పాడి మన చేత పాడించ టానికి సిద్దం చేసి ఇచ్చారు .ఇక బౌద్ధమతము వారు అయుతే దశాఅవతారములలో బుద్దుడు అంటే ఎవరో తెలియదు.   ఇప్పుడు మనం చదివే శాక్య వంశపు రాజు బుద్దుడు చెబుతారు .  ఇది నిజం కాదు .  పురాణములలో నారాయణుని అవతారము వేరే బుద్దభగ్ వానుడు వున్నాడు అది తెలుసుకోవాలి. ఇక ఈ బౌద్దులు అయునా బుద్ధుడు చెప్పిన మధుమాంస ములు వదిలిపెట్టుట ,అహింస ను ఆచరించుట చేస్తున్నారా అంటే అది ఎప్పుడో వదిలేశారు.  బుద్దుడి ఆచరణ లేదు కాని బొమ్మలు మాత్రం ప్రతిచోట పెడుతుంటారు.  ప్రతి ప్రాణి లోను,  అన్ని జంతువుల్లోనూ భగవంతుడు వున్నాడు.   దేనిని హింసించకూడదు అని చెబితే ఎవరు ఆచరి౦చడం లేదు.  సరికదా జంతువులను హింస పెడుతూ అనేక ఆటలు,పోటీలు పెట్టి రకరకాల హింసలకు గురి చేస్తున్నారు  .పెద్దవాళ్ళు,గొప్పవాళ్ళు కూడా వంతపాడటము విడ్డూరంగా వుంది. 

       ఇక మెడిటేషన్ ,యోగ అంటూ కొన్ని కొత్త మత మార్గాలు వచ్చాయి.వాళ్ళు చెప్పేది ఏమిటంటే మెడిటేషన్ చేస్తే చాలు .ఏ దేవుడి గుడి కి వెళ్లక్కరలేదు .ఎందుకంటే ఆ గుడిలో వుండే దేవుడి కంటే మనమే ఎక్కువ ,మనలో వున్నశక్తి గుడికి వెళ్తే  ఆ గుడిలోని దేవుడు మనలోని శక్తిని లాగేస్ట్టాడు అని తెగ ప్రచారము చేసేస్తున్నారు .గృహప్రవేశము లాంటి శుభకార్యాలలో కూడా ఏ వ్రతాలు చేసుకోకుండా ఆ మెడిటేషన్ పెద్దల ,ఫోటోలు పెట్టుకుంటున్నారు.ఎవరి ఇష్టం వారిది కాని ఇక్కడ మనము వివిధ రకాల భక్తిని తెలుసుకుంటున్నాము.రాముడు,కృష్ణుడు శివుడు వాళ్ళకంటే మా వేవ్స్.మా మెడిటేషన్ చాలా పురాతనమయినది అని వాళ్ళు చెబుతారు .అంతేకాదు ఆ మెడిటేషన్ చెప్పిన గురువుకి దేవుడిగా భావించి అసలు పూర్వమునుంచి చెప్పుకొనే దేవుడి చిహ్నాలు ను ఆ గురువు కాళ్లదగ్గర పెట్టటం ఇతరులకి భాధాకరం గా గోచరిస్తుంది .అంటే శ౦ఖ చక్రాలు ,స్వస్తిక్లు, శ్రీ యంత్రాలు గురువు పాదాలపై ,పాదాల దగ్గర  పెట్టటము తులసి ,తులసిదండలు గురుపాదాలపై పెట్టటం  కూడా కొందరి సనాతన భక్తులకి భాదాకరముగా వుంటుంది  
 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online