Pages

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-4

     మానవ అవతారములో వచ్చిన శ్రీరాముడు ,శ్రీకృష్ణుడు .వైకుంతం వదిలి వచ్చిన శ్రీ మహావిష్ణువుఆయన రూపానికి ఆయనే పూజ ఎలా చేస్తారు . అందుకే శివ భగవానునికి మానవరూపములో వున్న వాళ్ళు పూజలు చేసారు .ఇక షిర్డీసాయిబాబావారు ,రామకృష్ణపరమహంస, రమణమహర్షి, శంకరాచార్యులవారు,  భగవద్ రామానుజాచార్యులువారు, మధ్వాచార్యులువారు, గురురాఘవేంద్ర స్వామివారు వీరు అంతా భగవంతుడు పైన వున్నవాడు అని ,ఆయన అన్ని శక్తులు యుక్తులు గలవాడు ఆయనే అంటూ ఆయనపై స్తోత్రాలు చదివేశారు.  నేనే భగవంతుడిని అని ఎక్కడాచెప్పలేదు.

       శ్రీకృష్ణభగవానుడు భగవద్ఘీత లో యోగాన్ని పరిచయం చేశాడు.  దానిపై ఒక అద్యాయం వుంది.  అలా౦టి ధ్యానం,యోగం వీళ్ళుతీసుకొని మేము కనిపెట్టాం అని చెబుతూ పైగా ఆ దేవాలయాలలోకి వెళ్ళకండి మన శక్తి ఆ గుళ్ళో దేవుడు లాగేసుకుంటాడు అని చెప్పటం విడ్డూరముగా వుంది .ఇంకా భగవద్ఘీత లో శ్రీకృష్ణపరమాత్మ అన్ని ,సమస్త జీవులలో నేనే అంతరాత్మ గా వున్నాను అని ఆయనే స్వయంగా చెప్పారు.

     భగవంతుడిఆరాధన  5 క్రమాలుగా వుంటుందిఅని హిందూ పురాణాలు చెప్పాయి .1 పర 2 వ్వ్యూహ ౩ విభవ 4 అంతర్యామి 5 అర్చన.  1. పర అంటే పై లోకాలు కైలాసం , వైకుంటం ఇక 2. వ్యూహం అంటే సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న రూపాలుగా వుండే .భగవంతుడు .ఇక 3. విభవ అంటే వైభవం దేవాలయాలు .మందిరాలు క్షేత్రాలు తీర్దాలు లో వుండే భగవంతుడు  తరువాత4. అంతర్యామి అంటే అందరిలో వుండే భగవంతుడు  ఇదే అందరు కూర్చుని చేసే మెడిటేషన్ అంటే మన లోపలి భగవంతుడి ని జ్యోతి గా ఆరాధించటం .ఇక తరువాత 5. అర్చన  అనగ మనం ఇళ్ళలో చేసుకునే పూజలు ,  ఇలా 5 రకాలుగా వుంటుంది ఇదివరలో ఉన్నదే ఈ మెడిటేషన్  కాకపోతే ఈ కలియుగములో అంతర్యామి ని తెలుసుకోవటం ,ధ్యానం కోసం ఏకాగ్రత వుండటం కష్టం అని అర్చన పెట్టారు .మెడిటేషన్  అందరికి సాద్యంకాడు పరమాత్మ కి స్నానం .అభిషేకం పూలదండలు వేయటం ఇవ్వన్నిసాద్యంకాడు . పరమాత్మ కి పూల దండ వేయాలంటే మెడిటేషన్ చేస్తూన్నవాళ్ళుపూల దండ ని మెళ్ళో వేసుకోలేరు కదా.

      ఉపనిషత్తుల్లో భగవంతుడి గురించి జ్ఞానము చెప్పబడినది .హిందూ మతములో జ్ఞాన శాఖ ,భక్తిశాఖ అని రెండు మార్గములుగా చెప్పబడినది . ఈ మెడిటేషన్  జ్ఞానశాఖ లో భాగము అని చెప్పవచ్చును.  అనేక రుచులతో వండిన ఓ పులుసు కుండ ఒకటి వుంది అనుకోండి . దాని లో నుంచి ఓ ముక్క తీసుకొని పిండితే అదే అన్ని రుచులు గల పులుసు ని ఇస్తుంది .అంటే ఇక్కడ ప్రపంచం అంతా భగవంతుని తో ని౦డివున్నది.అని ,ఈ ప్రపంచములో ఏ వస్తువు ,ఏ జీవి ,ఏ ప్రాణి ని పిండిన అదే భగవతత్వం కనిపిస్తుంది.  అంతేకాదు ఉపనిషత్తులో చెప్పిన విధముగా ఒక కుండ లో నీరు నింపి అందులో ఉప్పు కలపండి ,ఇప్పుడు అది ఉప్పునీరు అవుతుంది .ఇప్పుడు ఎవరైనా ఉప్పుని తీసి చూప గలమా  లేదే . అలానే ప్రపంచం,  ప్రపంచం లోని అన్ని జీవుల్లోను భగవంతుడు ,భగవత్ తత్వం ని౦ డి వుంది .మనలిని మనం పిండి చూసుకోవటమే మెడిటేషన్ అంటే లోపలి అంతర్యామి గా వున్నది ఆ మహావిష్ణువు పైన శరీరం అనే పంచభుతాత్మక౦ శివుడు అని చెప్పబడినది .

       ఈ మెడిటేషన్ అనే విధానం కొత్త ఏమి లేదు ,కాకపోతే మెడిటేషన్ చెప్పేవాళ్ళం దేవుళ్ళం మమ్మల్ని కొలవండి .మేము మనలో వుండే తరంగాలు [వేవ్స్] ని ఎటు కావాలంటే అటు తిప్పెస్తాము .ఇక్కడ కూర్చుని విశ్వాన్ని శాసిస్తాము ,గుళ్ళో దేవుడి కంటే మేము ,మా శక్తి చాలా గొప్పది ,ఓస్థలం, ఓ విగ్రహంలోని, ఓఫోటో లోని జీవం మేము కనిపెట్టి చెబుతాము . ఇవ్వన్ని ఎంతవరకు నిజం ,ఎంతవరకు సబబు మనం కాస్త ఆలోచించాలి .అలానే సాయుబాబా వారు రాఘవేంద్ర స్వామి వారు ని ఆరాధించేవాళ్ళం మనం చాలామంది వున్నాము కదా .మరి మన పరిస్తితి ఏమిటి అనుకోవచ్చు నిజముగా వారు దైవ దూతలే.  అంతేకాదు బ్రహ్మ ,విష్ణు మహేశ్వర రూపాలే అనుకోవాలి.   అంతేకాని ఒక దేవుడి గొప్పతనం చెప్పటానికి ,ఇంకో దేవుడి ని తక్కువగా చెప్పగూడదు,చూపగూడదు.  పైగా  పురాతనము గా వస్తూన్న దైవరూపాలను ,దేవుళ్ళను విమర్శించి, మొన్న మొన్న సాధు సంత్, బాబా లను, మాతాజీ లను ఆరాధిస్తూ, కృత యుగము నుంచి వస్తున్నదైవాలను, దైవ రూపాలను  తూలనాడటం కూడా మహాపాపం అని తెలుసుకోవాలి.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online