Pages

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-3

          మాతృదేవోభవ ,పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిధి దేవోభవ ఈ నాలుగు ప్రతి వాళ్లకి కలిగించేది ఆ పైన వున్న భగవంతుడే .మాతా పితలు జన్మ ఇచ్చి ప్రపంచాన్ని పరిచయం చేస్తారు .గురువు దేవుడి  చేరుకునేమార్గాన్ని చూపిస్తాడు .అతిది పుణ్యాన్ని ఇస్తాడు .ఈ సందర్భాలలోకొన్ని కళలు ,కొన్ని మాయలు ప్రదర్సి౦చవలసిరావచ్చు .అంతమాత్రము చేత పైన వున్న భగవంతుడికి lఎవ్వరు సమానము కాలేరు ,గురువులు రెండు రకాలు లౌకిక గురువులు ,అలౌకిక గురువులు లౌకిక గురువులు అంటే ఏ కోర్స్ చేయాలి,ఏ చదువు చదవాలి ఎలా చదివితే అనకున్న ఆశయం సాధిస్తాము ,అది బోధించే వాళ్ళు .ఆ గురువులు కూడా చాలా అవసరమే ముందు బ్రతుకు జీవితమే ముఖ్యం కదా.

           ఇకఅలౌకిక గురువులు వీళ్ళు మోక్షాన్ని జ్ఞానాన్ని .పుణ్యాన్ని ,ఎలా సంపాదించుకోవాలో ,చెబుతారు .కొందరు గురువులు ,పీతాదిపతులు అయితే ఓ దైవ మంత్రం కూడా ప్రసాదించి ఉపాసనావిధానం అవ్వన్నీ ప్రసాదిస్తారు .ఆ సందర్భాలలో కొంతమందిగురువులకు  కొన్నిరకాల అతీంద్రియ శ క్తులు వస్తూవుండవచ్చు అంతమాత్రము చేత .ఎవ్వరు ఆ పైన వున్న కనపడని భగవంతుడు కాలేరు .అయుతే అటువంటి వారిని దైవాంససంభూతులు అని పిలవవచ్చు .ఎప్పుడైనా ఆత్మ, మహాత్మా.పరమాత్మ అని మూడు స్తితులు ఉంటాయి .ఆత్మ అంటే మనలాంటి  సామాన్యులు ,మహాత్మ అంటే గొప్పవారు పరమాత్మ అంటే పైన వున్న భగవంతుడు

         గురువులు  పీటాధిపతులు ని  మహాత్ములు అని చెప్పవచ్చు.అయితే శ్రీరాముడు,శ్రీకృష్ణుడు ని దైవాలుగా గుడి కట్టి పూజించటం లేదా అని ఒక సందేహం రావచ్చు ,కాని ఒక విషయం తెలుసుకోవాలి రాముడు ,కృష్ణుడు వాళ్ళది ఈ యుగం కాదు .ఆ యుగములలో దేవతలు , నారదుడు భూలోకములో చక్కగా విహరించేవాళ్ళు.కాబట్టి దైవము యొక్క పరిపూర్ణ శక్తి జ్యోతిలా ప్రకాశిస్తూ  ఓ తేజస్సు ఆ రూపాల చుట్టూ కనపడేది .కాని ఇది కలియుగం కలి ప్రవేసించిభూలోకములో అందరిని కలుషితము చేసుకుంటూ పోతువుండటం ఈ యుగం లక్షణం .అందుకే భగవంతుడు ప్రత్యక్షముగా రాడు.కనిపించడు.వస్తే గిస్తే దైవం మానుష రూపేణ అన్నారు కాబట్టి ఆపదల్లో .కష్టాల్లో .నిజమైనభక్తులకు మనిషిగా కనపడి .లేదా మనిషి లో వుండిసహాయం చేసి వెళ్ళిపోతాడు .కాబట్టి భగవంతుడి కి వున్న శక్తులు ,లీలలు ,అర్థం కావటమే కష్టం ఇక ఆయన శక్తులు మానవుడికి అందులో కలియుగములో అసాధ్యం .

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online