వైద్యుడు రత్నాచార్యుడు రాజేంద్ర ను ఎలాగోలా లేపి కూర్చుండ పెట్టాడు . అతనిని అతని గురించిన ప్రశ్నలు అడగటం మొదలు పెట్టాడు . కానీ రాజేంద్ర తలకు తగిలిన గాయం వల గతం మర్చిపోయాడు . ఏమి అడిగినా చెప్పలేక పోతున్నాడు . మాటిమాటికీ తడబడుతూ వెర్రి చూపులు చూస్తూ ఏమి గుర్తు లేక తడబడుతున్నాడు . అతని స్థితిని అర్ధం చేసుకున్న వైద్యుడు అతని గాయాలకు లేపనం పూసి ,ఏదో కషాయం అతనికి పట్టించి అతనికి సపర్యలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు . కాలం అలా గడుస్తోంది . ఇక్కడ కోసల రాజ్యం లో రాజు గారు ఎందఱో పండితులను పిలిపించి యువరాజు పంపిన ఆ "యు . రా .సి .ఖ ." అన్న దాని అర్ధం తెలుసుకోవటానికి ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు . ఎంత ప్రయత్నం చేసిన దాని అర్ధం తెలియటం లేదు . రాజు గారు తన తరువాత రాజ్యానికి వారసులు లేరని దిగులు పడుతున్నాడు . వయో భారం తో బాధ్యతలు నిర్వహించటం కష్టం గా ఉంది రాజు గారికి . మహా మంత్రి కూడా వృద్ధుడు అవటం తో ఫణీంద్ర మహా మంత్రి అయ్యాడు . ఇంకా రాజ కార్యాలు అన్నీ ఫణీంద్ర చక్క బెట్టవలసి వస్తోంది . కానీ ఫణీంద్ర కి ఏమాత్రం అనుభవం లేదు పైగా దుడుకు స్వభావం . దానివల్ల కొందరు అధికారులు రాజుగారితో మోర పెట్టుకున్నారు .కానీ ఏమి చేయలేక రాజుగారు "చేతికి అంది వఛ్చిన యువరాజుని దూరం చేసావు . అతనే ఉంది ఉంటె నాకు, ప్రజలకు ఈ బాధలు తప్పేవి . ఇంకా మనస్సాంతి ఉండేది అని , ఇలా ఎందుకు చేసావు భగవంతు ఇక్కడ అడవిలో వైద్యుడు రత్నాచార్యుడు రాజేంద్ర ను మామూలు మనిషిని చెయ్యటానికి పరిపరివిధాలుగా ప్రయత్నిస్తున్నాడు . అతనికి రాజేంద్ర యువరాజు అని తెలుసు . కానీ ఎ రాజ్యానికి వారసుడో తెలియదు . ఆటను ఎక్కడివాడో తెలుసుకోవటానికి అడవి అంతా గాలిస్తున్నాడు . నదిలో అతడు పడిన చోటులో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని వెతికాడు కానీ ఏమి దొరకలేదు . యువరాజుకి గతం గుర్తుకు రావటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు . సంజీవని మూలిక దొరికితే బాగుండు అని అనుకుంటున్నాడు . తన చిన్న తనం లో ఒక కద ప్రచారం లో ఉండేది . కీకారణ్యం లో కాకులు పెట్టిన గూడు చూడాలి . అందులో పాము పడుకుని ఉన్నదా అని చూడాలి ఒక వేల అలా కనిపిస్తే ధైర్యంగా ఆ గూడు తీసుకుని పారే నీళ్ళలో వెయ్యాలి అప్పుడు ఆ పాము కాస్తా పుల్లలా మారుతుందట . అదే సంజీవని అని చెప్పేవారు . కానీ వైద్య శాస్త్రం లో అటువంటివి లేవు . అందువల్ల అది అంత బోగస్ అని అనుకున్నాడు . డా అంటూ దేవుని దగ్గర మోర పెట్టుకుంటున్నాడు రాజుగారు .
skip to main |
skip to sidebar
కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
0 comments:
Post a Comment