Pages

A Short Story - మంత్రం చాటు కుతంత్రం Part - 1 ( by Marimganti. Ranganayakamma)

       అది కోసల రాజ్యం .  ఆ రాజ్యం పొలిమేరల్లో  అంతా దట్టమైన అడవితో నిండి పోయింది .  దాని మధ్యలో అడ్డం గా పరవల్లు తొక్కుతూ ప్రవహిస్తున్న మహానది .  అక్కడ ఎన్నో మూలికలు , ఔషధ మొక్కలు ఉన్నాయి .  ఎవర్నీ పట్టించుకోకుండా తనకు కావలసిన మూలికలు తెమ్పుకుంటున్నాడు వైద్యుడు  రత్నాచార్యుడు.  అక్కడికి దగ్గరలో ఉన్న ఒక వేప చెట్టు కింద ఇద్దరు రాజకుమారులు భోజనం చేస్తున్నారు .  వారి మాటలు ఈ వైద్యుని చెవిన పడుతున్నాయి .         ఫణీoద్రా!  నీవు మంత్రి గారి అబ్బాయివి .  నేను రాజు గారి అబ్బాయిని .  ఇద్దరం ఇంత వరకు ఎటువంటి భేషజాలు లేకుండా సంతోషం గా గడిపాము .  చాలా బాగుంది .అన్నాడు రాజ కుమారుడు రాజేంద్రుడు .   ఇక చదువులతో పని లేదు .  నీవు కోసల రాజ్యానికి మహామంత్రి వి అవుతావు.  నీకు ఏమి తక్కువా ?  మా తండ్రి గారు శూరసేన మహారాజుకి మీ కుటుంబం అంటే  చాలా ఇష్టం కదా !"  అలా అలా మాట్లాడుతూనే ఉన్నాడు రాజేంద్రుడు .  ఏమిటి ఫణీoద్ర! ఇంతసేపు నేనే మాట్లాడుతున్నాను , నువ్వు ఏమి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.  పైగా ఏంటి తీక్షణం గా చూస్తున్నావు ? అంటూ గంభీరం గా అడిగాడు రాజేంద్రుడు . 
      " నా కంటే చదువు , తెలివి తేటలు అన్నిట్లోనూ అర్హతలు సాధింఛి పై స్థాయి లో ఉన్నాడు .  రాజ్యానికి తిరిగి వెళ్ళాక నేను రాజ దర్బారు లో మా తల్లితండ్రుల ముందు , సామంతుల ముందు , ఇతర అధికారుల ముందు నేను తల దించుకుని నిల్చోవలసి వస్తుంది .నేను విద్య లో ఎలా రాణించ గలను ? రాజ కుమారుడు బాగా చదివి ఎన్నో అర్హతలు , పతకాలు సంపాదించాడు .  నా దగ్గర ఒక్కటి కూడా లేదు .   నన్ను అందరూ తెలివి తక్కువ వాడు , వెర్రి వాడు  అని అంటారేమో ?  అని బాధ పడుతున్నాడు  మంత్రి కుమారుడు ఫణీoద్రుడు.  అంతేకాదు , తన చేతగానితనం  తో రాజకుమారుడి పై ఈర్ష్య తో , ద్వేషం తో రగిలి పోతున్నాడు .  మంత్రి పరిషత్తు వారు నన్ను సభ లో లేకుండా చేస్తారేమో , నా భవిష్యత్తు ఏమిటి ":అని ఆలోచిస్తూ కోపం తో ఊగిపోతున్నాడు  మంత్రి కుమారుడు .
  ఈ ఆలోచనలతో రాజేంద్రునితో మాట మాట పెంచాడు . చివరకు తన ఒరలోని కత్తిని  తీసి రాజేంద్రుని డొక్కలో పొడిచాడు ఫణీoద్ర.
   మా తండ్రి గారు , మీ తండ్రి గారు  మా తండ్రి గారు మంచి స్నేహితులు .  నిన్ను కూడా మంచిగా చదివించాలని ఇక్కడకు పంపించారు . మేం నీకు ఏమి ద్రోం చేసామని ఇలా తెగబడ్డావు ? అంటూ రాజేంద్ర గట్టిగా అడిగాడు .
   " నువ్వు కోసల రాజ కుమారుడవు . నువ్వు రాజ్యం చేరకూడదు .  నువ్వు చేరితే నా ప్రతిభ బైట పడుతుంది .  నా డొల్ల తనం , నా తెలివి తక్కువ తనం , అంత తెలిసిపోతుంది .  రాజ దర్బారు లో నాకు ఇక స్థానం ఉండదు .  అందుకే నిన్ను చంపుతున్నాను ." అంటూ కసిగా సమాధానం చెప్పాడు ఫణీoద్ర.     అసలు విషయం తెలుసుకున్న రాజేంద్రుడు చాలా ఆశ్చర్యం లో మునిగిపోయాడు .  చాలా బాధ పడ్డాడు .  "  నీ చివరి కోరిక ఏమిటో చెప్పు , అది నేను తీరుస్తాను  అంటూ వికటాట్టహాసం తో అడిగాడు ఫణీoద్ర. 
      దానికి రాజేంద్ర ఆలోచించి ఒక పత్రం ఇవ్వమని అందులో  యు . రా . శి. ఖ .  అని వ్రాసి , ఇది ఒక మంత్రం .  దీన్ని చదివితే , అర్ధం చేసుకుంటే రాజ్యానికి మంచిది , అందుకే దీన్ని రాజు గారికి అందించగలవు  అని అంటూ పడిపోయాడు రాజేంద్ర .
    ఫణీంద్ర  ఆ కాగితాన్ని అటూ ఇటూ తిప్పి చూసుకున్నాడు .  ఎంత చదివినా ఆ మాట అర్ధం కాలేదు .  చివరకు దాన్ని కూడా దాచుకున్నాడు .  నిస్తేజం గా పడివున్న రాజేంద్ర ని తీసుకుని గుర్రం పై అడవిలోనికి కొంత దూరం తెసుకు వెళ్ళాడు . 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online