అలా ప్రయత్నాలు చేసి , చేసి విసిగి పోయిన రత్నాచార్యుడు ఇంటికి చేరుకుంటున్నాడు . ఇంతలో ఇంటిలోనుండి ఏవో అరుపులు పెద్దగా వినిపిస్తున్నాయి . దానితో ఆందోళన చెంది కంగారుగా పరుగున వచ్చి లోనికి చూసాడు . అతని భార్యా , కుమార్తె లోపల గదిలో తలుపులు వేసుకుని ఉన్నారు . రాజకుమారుడు రాజేంద్ర ఎదురుగా ఒక పెద్ద పులి నిలబడి ఉంది . ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ , వెర్రి చూపులు చూసే రాజేంద్ర పులిని చూసిన హతాత్పరినామం తో అటూ ఇటూ ఆయుధం కోసం వెతకసాగాడు . రత్నాచార్యుడు రాజేంద్ర ఏమి చేస్తాడా అని చూస్తున్నాడు . కానీ అతనికి కూడా భయం గానే ఉంది . ఎందుకంటే రాజేంద్ర కు ఏమి విద్యలు వచ్చో పూర్తిగా తెలియదు . అందుకే తన దగ్గర ఉన్న బాకు తీసుకుని సిద్ధం గా ఉన్నాడు ఆ పులిపై విసరటానికి . కానీ ఇంతలో రాజేంద్ర అటూ ఇటూ చూసి అక్కడ అన్నం ఉడుకుతున్న పొయ్యిని చూసాడు . వెంటనే వేగం గా ఆ పొయ్యి లోని మండుతున్న కట్టెను తీసుకుని పులికి చూపించాడు . దానితో దాని ముందుకు వచ్చి ఆ మంటను చూపి దడిపించసాగాడు . ఆ మంటను చూసి భయపడి పులి అడవి లోకి పారిపోయింది . ఆ విషయం చూసి వైద్యుడు చాలా ఆనందించాడు . ఇంతలో ఈ కదలికల కారణంగా అలిసిన రాజేంద్ర కళ్ళు తిరిగి కింద పడ్డాడు . వెంటనే వైద్యుడు , ఇంట్లో ఉన్న అతని భార్య , కూతురు గబగబా అతని దగ్గరకు వచ్చారు . వైద్యుడు అతని ముఖం పై నీరు చల్లి అతనికి స్పృహ రప్పించాడు . స్పృహ వచ్చిన రాజేంద్ర వైద్యుడిని చూసి " ఆచార్యా ! మీరు ఎవరు ? నేను ఇక్కడ ఎందుకు వున్నాను ? నన్ను పొడిచిన మంత్రి కుమారుడు ఏమయ్యాడు " అని ప్రశ్నించాడు రాజేంద్ర మాటలు విన్న వైద్యుడు "కుమారా ! నువ్వు కోలుకున్నవా ? నీ ఆరోగ్యం గురించి నేను చాలా ఆందోళన పడ్డాను . నువ్వు ఆ భగవంతుని దయ తో మామూలు స్థితి కి చేరుకున్నావు . " అంటూ ఆనంద భాష్పాలు తో రాజేంద్రను హత్తుకున్నాడు . అతనికి జరిగిన విషయం అంతా వివరంగా చెప్పాడు రత్నాచార్యుడు. " ఇన్నాళ్ళూ మా కుటుంబం అంతా నీ సేవ లోనే ఉన్నాము . ఈమె నా భార్య సౌదామిని , ఇదిగో ఈమె నా కుమార్తె గిరిజా రత్న తిలక . అని పరిచయం చేసాడు వైద్యుడు . యువరాజు కు తెలివి వచ్చి అంతా మాములుగా మాట్లాడుతున్నాడు అని ఆనంద పడింది గిరిజ . అతని వంక సూటిగా చూడలేక సిగ్గు తో ముడుచుకు పోయింది మొగ్గలా . ఆమెను చూసి రాజేంద్ర చాలా ఆశ్చర్య పోయాడు ఆమె అందానికి ముగ్ధుడై పోయాడు . ఇంత అందాల రాసిని నేను ఎక్కడా చూడలేదు . అని ఏవో ఊహల్లో మునిగిపోయాడు రాజేంద్ర .
ఇంతలో " కుమారా ! నీకు గతం గుర్తు వచ్చింది కదా ! నీ తండ్రి గారు ఎవరూ ? మీ రాజ్యం ఎక్కడా ? మీ తండ్రి గారి నామధేయం ఏమిటి ? అసలు ఏమి జరిగిందో వివరం గా చెప్పగలవా ?" అని ప్రశ్నించాడు వైద్యుడు .
ఇంతలో " కుమారా ! నీకు గతం గుర్తు వచ్చింది కదా ! నీ తండ్రి గారు ఎవరూ ? మీ రాజ్యం ఎక్కడా ? మీ తండ్రి గారి నామధేయం ఏమిటి ? అసలు ఏమి జరిగిందో వివరం గా చెప్పగలవా ?" అని ప్రశ్నించాడు వైద్యుడు .
0 comments:
Post a Comment