ఒక్క సారిగా ప్రసాంతతను భగ్నం చేస్తూ పెద్ద శబ్దం నీళ్ళలో . దానికి అదిరిపోయిన పక్షులు చెట్లగుబుర్ల లోనుండి రెక్కలు టపటపా శబ్దం చేస్తూ గాల్లోకి ఎగిరిపోయాయి . అక్కడే మూలికలు ఏరుకుంటున్న రత్నాచార్యుడు ఆ శబ్దానికి ఉలిక్కిపడి పక్కకి చూసాడు . గుర్రపు డెక్కల అలికిడి విని చెట్ల గుబుర్ల చాటున దాక్కుని ఎవరికీ కనపడకుండా అంతా గమనించ సాగాడు .
ఇతనిని గమనించని ఫణీంద్ర , రాజేంద్ర ను నీళ్ళలోకి పడవేసి వెంటనే గుర్రం పై వేగంగా వెళ్ళిపోయాడు . ఆటను వెళ్ళిన తరువాత కొంత సేపు వేచి చూసి అప్పుడు చెట్ల గుబురులో నుండి బయటకు వచ్చి నది వైపుకు వెళ్ళాడు వైద్యుడు . అక్కడ నీళ్ళలో ఉన్న రాజేంద్ర ను చూసాడు . నీళ్ళు తగలటం తో స్పృహ లోకి వఛ్చిన రాజేంద్ర కొద్దిగా కదులుతూ మూలుగుతున్నాడు . పరీక్షగా చూసిన వైద్యుడు రత్నాచార్యుడు ఫరవాలేదు , ఇతనిని బ్రతికించా వచ్చు అని అనుకున్నాడు . అటూ ఇటూ పరికించి చూసి ఒక తాడు తెఛ్చి నీళ్ళలో కనిపిస్తున్న రాజేంద్ర కాలికి ఉచ్చు వేసి తన గుర్రానికి కట్టి మెల్లిగా నీటినుండి బయటకు తీసాడు . ఆ తర్వాత అతన్ని తన నివాసానికి తీసుకు వచ్చాడు . అతని గాయానికి మందు పూసి పక్క పై పడుకోబెట్టాడు .
పక్షుల కిల కిలా రావాలు విని కళ్ళు తెరిచి చూసాడు వైద్యుడు . అప్పుడే తెలతెల వారుతోంది . సూర్య కిరణాలు ముఖం పై పడుతున్నాయి . రాత్రి అంత కాపలా గా ఉండటంవల్ల కొంచం అలిసిపోయి నిద్రల్లోకి ఎప్పుడు జారుకున్నదో తెలియలేదు . నిద్ర లేవగానే వెంటనే ఒక్కసారి అంత గుర్తు వచ్చింది . వెంటనే ఆత్రుతగా రాజేంద్ర వైపు చూసాడు .ఆటను ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు . సూర్య కిరణాలు ముఖం పై పడటం తో మెల్లమెల్లగా కళ్ళు తెరిచి కాళ్ళు చేతులు కదిలిస్తూ లేవటానికి ప్రయత్నిస్తున్నాడు రాజేంద్ర . అతనిలో కదలికలు చూసి రత్నాచార్యుడు ఆతను బ్రతుకుతాడని ఆనంద పడ్డాడు . ఇక గుర్రం పై చాలా దూరం ప్రయాణం చేసి మంత్రి కుమారుడు కోసల రాజ్యం చేరుకున్నాడు . మంత్రిగారి బంధువులు , రాజకుమారుని స్నేహితులు , రాజ భటులు అందరు ఎదురేగి స్వాగతం పలికారు రాకుమారుడు రాజేంద్ర గురించి అందరూ ఆరా తీయసాగారు . ఫణీంద్ర ముందుగా తన తండ్రి గారైన మంత్రి వద్దకు వెళ్లి ఆయన కౌగిలించుకొని ఏడవటం మొదలు పెట్టాడు . దానితో కంగారు పడ్డ తల్లిదండ్రులు ఇద్దరూ ఏమి జరిగిందని అడగటం మొదలు పెట్టారు . రాజకుమారుడు తిరిగి రాలేదన్న వార్త తెలిసిన రాజ దంపతులు పరుగు పరుగున వచ్చి ఆందోళన పద సాగారు . అసలు ఏమి జరిగిందో చెప్పు కుమారా ! నేను సైన్యాన్ని పంపుతాను అని లాలిస్తూ అడగ సాగాడు మంత్రి . రాజుగారు కూడా ఫణీంద్ర ను దగ్గరకు తీసుకుని " నాయనా ! నాకు అయినా చెప్పు . అసలు ఏమి జరిగింది ?" అని బ్రతిమలాడ సాగాడు .
అప్పుడు ఫణీంద్ర "రాజా ! ఏమి చెప్పమంటారు ? మేమిద్దరం చాలా దూరం ప్రయాణం చేయటంవల్ల అలిసిపోయి అడవిలో ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుంటే మాకు కొంచం నిద్ర పట్టింది . నేను తిరిగి మెలకువ వచ్చి చూసే సరికి విషపు పురుగు కాటుకు గురి అయ్యి బాధ పడుతున్నాడు రాజేంద్ర . నేను ఏంటో ప్రయత్నించి చూసాను . కాని నా మిత్రుడిని దక్కించుకోలేక పోయాను . ఇక చేసేది ఏమి లేక అక్కడే నదిలో శవాన్ని పడవేసి ఏడ్చుకుంటూ తిరిగి వచ్చాను " అని చెప్పాడు ఫణీంద్ర .తమ కుమారుని మరణ వార్త విన్న రాజ దంపతులు దుక్ఖితులై రోదించ సాగారు . అందరు వారిని పరామర్శించ సాగారు . తను చెప్పిన విషయాన్ని అందరు నమ్మడం తో ఫణీంద్ర సంతోషించాడు .
ఇక్కడ అడవిలో వైద్యుని ఇంట్లో ఉన్న రాజేంద్ర ను బ్రతికించటానికి రత్నాచార్యుడు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు . సపర్యలు చేస్తూ రాత్రింబగళ్ళు కంటికి రెప్పలా కాపాడుతున్నాడు . మెల్ల మెల్ల గా రాజేంద్ర మత్తు లో నుండి బయటకు వచ్చాడు . కాని తలకు తగిలిన గాయంకారణం గా ఎక్కువ గా ఏమి మాట్లాడ లేక పోతున్నాడు . ఫణీంద్ర అతడిని నదిలో పడవేసినప్పుడు ఒక రాయి గట్టిగా తగలటం వాళ్ళ తలకు గాయమైంది రాజేంద్రకు . ఈ కారణం గా పదేపదే నిద్రలోకి జారుకుంటున్నాడు రాజేంద్ర . అతడిని మామూలు స్థితి లోనికి తీసుకు రావటానికి రత్నాచార్యుడు తన వైద్య విద్యా పరిజ్ఞానాన్ని అంత ఉపయోగిస్తున్నాడు .
ఇక్కడ కోసల రాజ్యం లో ఫణీంద్ర ను అన్ని వివరాలు గ్రుచ్చి గ్రుచ్చి అడుగుతున్నారు . అతను కూడా ఎవరికీ అనుమానం రాకుండా బ్రహ్మాండం గా నటిస్తూ రాజేంద్ర నుతలుస్తూ ఏడుస్తున్నాడు . అందువల్ల అక్కడి వారు ఎవరూ కూడా అసలైన విషపు పురుగు వీదేనని గుర్తించ లేక పోయారు . ఇంతలో ఫణీంద్ర రాజుగారితో "రాజా ! నా మిత్రుడు నాకు ఒక పత్రము పై ఏదో రాసి ఇచ్చాడు . అది మీకు అందించమని చెప్పాడు అంటూ " ఆ పత్రాన్ని రాజుకు అందించాడు . ఆ పత్రాన్ని చదివితే అందులో " యు .రా .సి .ఖ " అని మాత్రం రాసి ఉంది . ఎంత ప్రయత్నం చేసినా అక్కడ ఉన్న సభికులు ఎవ్వరికీ దాని అర్ధం బోధ పడలేదు . రాజు గారు దాని అర్ధం తెలుసుకోమని మంత్రి పరిషత్తు కు అప్పచెప్పారు . త్వరగా దీని రహస్యాన్ని చేదించండి అని ఆజ్ఞ జారి చేసాడు .

0 comments:
Post a Comment