Pages

మూలాలను తెలుసుకోండి

         అన్ని మతాలలోను , అన్ని కులాల్లోనూ  గొప్పతనం ఉంది .  భారతీయ సంస్కృతిలో ప్రతి చెట్టుకు ప్రతి పుట్టకు , ప్రతి జంతువుకు ...ఒక గొప్పతనం ఆపాదించబడింది .  అంతదాకా ఎందుకు రాక్షసులను హీనం గా చూస్తాము .  కానీ , రాక్షసులు కూడా వారి వారి పూర్వజన్మలలో మంచివారిగా ఉండి ఒక చెడ్డపని వల్ల శాపం పొంది అలా పుట్టారని పురాణాల్లో చెప్పబడింది .
       పాము , పంది, దగ్గర్నుంచి ఉడుత వరకు అన్ని ప్రాణులు భగవంతుని స్వరూపం అని మన సంస్కృతి చెబుతోంది .  మల్లెచెట్టు పువ్వులకు మంచి పరిమళం ఉంది, అది మనసుకు వైద్యం చేస్తుంది .  అలానే జిల్లేడు చెట్టు పువ్వుకు ఒక గొప్పతనం ఉంది . అది శరీరానికి వైద్యం చెయ్యటానికి పనికివస్తుంది .  పెద్దగా కనిపించే వేపచెట్టు గొప్పతనం వేప చెట్టుదే .  ఇలా ఎన్నో భగవంతుని సృష్టిలో అన్నింటిలోను ఏదో ఒక గొప్పతనం ఉంది .  ఒక చెట్టు గొప్పతనం చూసి వేరొక చెట్టు దాని గొప్పతనాన్ని తక్కువ చేసుకుని ఈర్ష్య పడటం లేదు .  అలానే అన్ని ప్రాణులూ , జీవులూ కూడా ... ఒక్క మనిషి తప్ప ....భగవంతుని సృష్టి లో అన్నీ సమానమే అన్న సత్యం ప్రతి మనిషి తెలుసుకోవాలి .  ఈర్ష్య , ద్వేషం  రగుల్చుకుంటూ పొతే మనిషి , ఈ ప్రపంచం ఏమవుతుంది ?           పురాణపురుషులు, పురాణాలు , పురాణాలు వ్రాసినవారు అందరూ బ్రాహ్మణులు కాదు .  శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , వ్యాసుడు , వాల్మీకి , శబరి , గుహుడు ఇంకా అనేక మంది ఉన్నారు  బ్రాహ్మణులు కానివారు .   కానీ వారిని అందరినీ బ్రాహ్మణులు నెత్తిన పెట్టుకుని , వారి మర్గాన నడుచుకోమని చెబుతున్నారు .  మరి బ్రాహ్మణులే పురాణాలు , కట్టుకధలు వ్రాసారు అని అనుకుంటే పైన చెప్పిన వాళ్ళు అందర్నీ వాళ్ళు మా వారే అని వ్రాసి ఉండవచ్చు కదా .
       ప్రతి ఒక్కరు పురాణాలు కాని , చరిత్రలు కానీ మూలాలు చదవండి . మధ్యన వచ్చిన వారి వ్యాఖ్యానాలు , అర్ధాలు , వ్రాతలు చదివి అదే నిజం , అవే గొప్పవి , యదార్ధమైనవి అని అనుకోవద్దు . ఉదాహరణకు  రావణాసురుడు , మహిషాసురుడు , నరకాసురుడు మొదలైన వారంతా దోపిడీకి గురి అయినవారని , మంచి వారు అయినాగాని కుల వివక్ష తో వారిని అలా చిత్రీకరించారని , వారంతా మనకు ఆదర్శ పురుషులు అని చెబుతున్నారు.  అలా చెప్పేవారు ఎవరైనా వాల్మీకి రామాయణం గాని తులసి దాసు రచన గాని  చదవలేదు .  వారు రామాయణ , భారతాలు చదవలేదు . వారికి అంత ఓపిక ఓర్పు లేవు .  పైగా మేము ఆ పురాణాలు చదవలేదు అని గర్వం గా చెబుతున్నారు . వారికి అంత ఓర్పు , ఓపికా లేవు .  మిత్రులారా ! దయ చేసి మూలాలు చదవండి అది చరిత్ర అయినా , పురాణం అయినా సరే .   చరిత్రలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చెయ్యటం, వాస్తవాలను వారి వారి దృష్టికోణం లో చూపటం జరుగుతోంది .  దానికి రాజకీయ , సామాజిక కారణాలు ప్రభావాలు చాలా ఉండచ్చు .  ఉదాహరణకు బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని పాలించినప్పుడు మన చరిత్రని వారికి నచ్చిన విధం గా మార్చివేసారని కొందరి అభిప్రాయం .  అలాగే రాహుల్ సాంకృత్యాయన్ , కౌసంబి వంటి వారు కూడా వారు చూసిన కమ్యూనిస్ట్ కోణంలోనే చరిత్రని చూసి భాష్యం వ్రాసారు .  అదే ఫైనల్ అన్నారు .  మూలాలు చదువుకునే పండితులు అయితే భాష్యాలను పట్టించుకోరు .  కానీ మనవంటి సామాన్యులు అవి చదివి అదే నిజమని నమ్ముతున్నాము .  అది కరెక్ట్ కాదు .  ప్రతి దాని మూలం చదువుకోవాలి .
          ఇప్పటి వార్తా పత్రికలలో రాజకీయ పార్టీల పత్రికలూ కూడా ఉంటున్నాయి .  ఆ పత్రికలలో వచ్చే వ్యాసాలూ చాలావరకు తప్పుదోవ పట్టిస్తున్నాయి ప్రజలని .  పైగా గురువు ఎవరైనా అన్ని చదువుకున్న వారు దొరకటం చాల అదృష్టం ఇప్పటి రోజుల్లో .   ఉదాహరణకు మన సంస్కృతీ లో సంఘ స్వరూపం గురించి ఐతరేయ బ్రాహ్మణా పురుష సూక్తం లో ఓ విషయం ఉంది .  అదేమిటంటే " బ్రాహ్మణులూ విరత్పురుషుని ముఖం నుండి పుట్టారని , క్షత్రియులు భుజాలనుంది , వైశ్యులు ఊరువుల నుండి , శూద్రులు పాదాల నుండి పుట్టారని వ్రాసి ఉంది .  అది యదార్ధమే .  కాని ఇక్కడ కొంతమంది ఈ విషయాన్ని ఆసరాగా తీసుకుని సూద్రుల మెప్పు కోసం , వారిని రెచ్చ గొడుతూ  చూసారా ! మిమ్మల్ని పాదాలతో పోల్చారు , ఇదంతా బ్రాహ్మణుల కుట్ర అని ఏదేదో వ్రాస్తూ ఉంటారు .  దానికి ఇంకొంత మంది అగ్నికి ఆజ్యం పోసే విధం గా దినపత్రికలలో రెచ గొట్టే వ్యాఖ్యలు వ్రాస్తూ ఉంటారు .  పైగా మేము ఇలా రాసి అసలయిన శూద్రులకు , పేదలకు బడుగు వర్గాల వారికి మేలు కోసం అంటూ వార్తల్లోకి వస్తుంటారు .  ఇదంతా తమని తాము వార్తల్లోకి తెచ్చుకోవతనికే .ఇటువంటివి చదివి అదే నిజమైన జ్ఞానం అని అనుకోకండి .  అసలైన జ్ఞానం నిస్వార్ధ పరులైన గురువుల నుండి తెలుసుకోండి .  అసలు పైన చెప్పిన విషయం లో నిజమైన గురువుల అర్ధం ఏంటంటే అయ్యా ! మిమ్మల్ని పాదాలతో పోల్చారు అని మీరు బాధ పడుతున్నారు కానీ దానిలోని పరమార్ధం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ శరీరం దేని మీద ఆధారపది ఉందొ తెలుసా ?  పాదాల మీదనే.  కాళ్లు లేకపోతె ఈ దేహం నిలవదు .  కుప్పకూలిపోయి దాని స్వరూపం నిర్మాణమే దెబ్బ తింటుంది .  ఒక భవనానికి పునాది ఎక్కడ ఉంటుంది ?  అట్టడుగున ఉన్న భూమిలో ఉంటుంది .  అలానే సూద్రుడు పైనే ఆధార పది ఉంది ఈ సంఘం .  సూద్రుడు గట్టిగా ఉంటేనే ఈ సంఘం , సంస్కృతి , పాడి పంటలు అన్నీ .  మనం అంతా అన్నం తినగలుగుతాము అందుకే ఎవరైనా దణ్ణం పెట్టేటప్పుడు పాదాలకి పెడతారు .పాదాలు పట్టుకుంటారు తెలుసా !  మీకు ఈ సత్యం బోధ పడే ఉంటుంది ఇప్పుడు .  కాబట్టి ప్రతి విషయాన్ని మంచి గురువుల దగ్గర అభ్యాసం చేసి , లోతుగా ఆలోచించి స్వయం గా పరిశీలించి అర్ధం చేసుకోవాలి .  అంతేకాని ఏవో కొన్ని పత్రికలూ , పుస్తకాలు , ఇంటర్నెట్ లో వ్యాసాలూ చదివి అదే నిజమని భ్రమ పడకండి .  మూలాలను తెలుసుకోండి .

story-- మొగలి రేకులు - part-3

  పెద్ద నులక మంచం ,  దానిపై పరుపు , ఆ పరుపు నిండా గౌరీ పూలు తెఛ్చి పోసింది .  తను గంధం పూసుకుంది చాలక తనకీ మెడ నిండా పూసింది .  అత్తరు పూసుకుంది కొండ మల్లెలు జడలో నింపుకుంది  మొగలి రేకులు తల కింద పెట్టింది అయ్యగారింటి నుండి కిళ్ళీలు కట్టుకొచ్చింది . అది ఒకటి తీసుకుని తనకి ఒకటి ఇచ్చింది .  తన మీద పడుకుని ఒకటే అల్లరి చేసినా తనకి ఏందో ఏం అర్ధం కాలేదు .           తర్వాత మనసు అంట ఏదోలా అయిపొయింది .  వొళ్ళంతా బద్దకంగా అయ్యింది , గౌరీ అటూ ఇటూ గింజుకుంటున్నా తనని గట్టిగా వాటేసుకుని పెదాలు సప్పరించేసాడు  తను . గౌరీ కూడా అట్టనే సేస్తూ ఉంటె తనకు ఏంటో హాయిగా అనిపించింది .  తామిద్దరూ కలబడుతున్నట్లు మంచం మీద పడిపోయారు . తనని గౌరీ తనకేసి నొక్కుతుంటే ఆమె సేతులు వెచ్చంగా అనిపిస్తున్నాయి .  అలా ఎంతసేపు ఒకరితో ఒకరు ఎన్ని సిలిపి పనులు సేసామో ,   ఇప్పటికి అది యాడికి వస్తే మనసు తేలిపోతుంది .  ఇంకా ఆ కొండ మల్లెల గాలి , మొగలిరేకుల పరిమళం ఇంకా మనసుకి తెలుస్తూనే ఉంటుంది .  మళ్ళీ బిన్నీ ఆ రాత్రి జ్ఞాపకాలలోకి వెళ్ళాడు .  పెద్ద నులక మంచం ,  దానిపై పరుపు , ఆ పరుపు నిండా గౌరీ పూలు తెఛ్చి పోసింది .  తను గంధం పూసుకుంది చాలక తనకీ మెడ నిండా పూసింది .  అత్తరు పూసుకుంది కొండ మల్లెలు జడలో నింపుకుంది  మొగలి రేకులు తల కింద పెట్టింది అయ్యగారింటి నుండి కిళ్ళీలు కట్టుకొచ్చింది . అది ఒకటి తీసుకుని తనకి ఒకటి ఇచ్చింది .  తన మీద పడుకుని ఒకటే అల్లరి చేసినా తనకి ఏందో ఏం అర్ధం కాలేదు .                గౌరి దీపం ఆర్పెసిందో  లేక అదే ఆరిపోయిందో గుర్తు రావటంలేదు .  ఆఖరుకు ఆ సీకట్లో ఎన్ని సిలిపి పనులు చేసుకున్నామో  తెల్లారేసరికి తన లాల్చి ,పైజమా గౌరి తొడుక్కుంది , గౌరి కుర్తా తను తొడుక్కున్నాడు . అవునులే సీకట్లో ఏమి తెలియలేదులే బుల్లోడా ! అని గౌరి తనను ఆట పట్టించలా! 
         ఫోటో చేక్కపెట్టే అడుగున ఒక మూలగా కనపడటం తో దానిపై తన సూపు పడింది .  తన శోభనం జ్ఞాపకాలనుండి బయట పడి బిన్నీ ఆ ఫోటో తీసి చూస్తూ కూర్చుండిపోయాడు .  ఇంతలో "ఎరా  బిన్నిగా ! మేకలు వచినాయి గాని గొర్రెలు రాలేదురా . ఎడపోయినాయో ఏంటో పోరా చొక్రిగా " అరుచుకుంటూ వచ్చింది అవ్వ .  అదిరిపడ్డాడు బిన్నీ .
        అవ్వ పరిశీలనగా చూస్తూ ఓరిచొక్రిగా! నీకు పోటుక యాడిదిరా? అమ్మో నాకు తెలియకుండా ఇద్దరు కలిసి తిరునాళ్ళలో పోటుక దిగారా ?  కట్నం రొక్కం తీసుకురాని ఆ పోరి పోటుక ఎందుకురా ! అవ్వ కోపం తో విసిరేసింది .  బిన్నీ విసుగ్గా లేచి ఆ ఫోటో మళ్ళీ ఏరుకుని తన బీడు లోకి పరిగెత్తాడు .
        మరుసటి రోజు ఎత్తైన పచ్చని కొండలు , ఎటు చూసినా పచ్చిక బయళ్ళు . గొర్రెలు మేకలు వాటి మేతలో లీనమై మేస్తున్నాయి .  ఎప్పుడు చూసినా పారే  సెలయేరు ఆ యేరు    ఆ ఇంటి ముందు కొంకి కర్ర పట్టుకుని నీళ్ళను చూస్తూ అలానే కూర్చుంది పోయాడు బిన్నీ .         "ఒరె బిన్నీ ! ఎక్కడినుంచో ఒక కేక .  పచ్చని కొండల్లో నుంచి వచ్చే మార్గం వైపు చూసాడు బిన్నీ .  అయ్యగారు , తనకి పిల్లనిచ్చిన మావా కలిసివస్తున్నారు .
      బిన్నీ మనసు రెక్కలు వచ్చినట్లు ఆనందం తో ఒక్కసారే నింగికి ఎగసినట్లు అయ్యింది .  ఒక్క నిమిషం లో పరుగు తీసి వాళ్ళను కలుసుకున్నాడు .
      " నమస్కారం అయ్యగారూ !"
       ఏరా బిన్నీ ! నీకు సుభ వార్త చెబితే ఏమి ఇస్తావురా ?"
      " అయ్యా ! నేను తవరికి ఎమివ్వగలను ? పెదోన్నిగా !
        " ఒరె అల్లుడు ! ఇందా గొర్రెలు అమ్మి రొక్కం పట్టుకొచ్చా  తీసుకో" , అంటూ ఇవ్వబోయాడు మావ.         "మావా  నన్ను చమించు .  మా అవ్వ ఏదో సెపితే ఏదో సేశాను .  నాకు డబ్బు వద్దు , ఏమి వద్దు .గౌరీ  కావాలి .  గౌరీ గౌరీ !"  అని ఏడుస్తూ చిన్న  పిల్లాడిలా మావను కౌగిలించుకున్నాడు బిన్నీ .
        అయ్యగారి పాదాలకు వందనం చేసాడు .  "లే లేరా ! బిన్నీ  గౌరి మా ఇంటి దగ్గర ఉంది .  రా  పోదాం ". అన్నాడు అయ్యగారు .
        అక్కడ అయ్యగారింట్లో  గౌరి కూడా బిన్నీ ని జ్ఞాపకం చేసుకుంటోంది .  ఎట్టయినా కండలు తిరిగిన దేహం , నల్లని ఒత్తయిన జుట్టు , బలమైన చేతులు , పెద్ద కళ్ళు , ఎర్రని మోము ,బలిష్టమైన ఛాతి, మెడలో తాయత్తు కట్టిన నల్లని తాడు     తోడగొట్టే మగతనం ఉట్టిపడే నా మావ బిన్నీ .  కాని నిన్న తిరునాళ్ళలో చూసినప్పుడు చాల బాధ కలిగింది .  ఎలా ఉండే నా బిన్నీ ఎలాగైపోయినాడు ?  అని ఆలోసిస్తా ఉంది . ఇంతలో గౌరీ గౌరీ ! అని బిన్నీ గొంతు .  బావా అంటూ కళ్ళ వెంట నీళ్ళు పెట్టేసుకుంది  ఇలా చిక్కిపోయవేంటి బావా ! అని అంది గొంతు జీరబోతుండగా .
      నేను ఎలా ఉంటె , నీకు ఏమైద్దిలే .  నీవు వాడ్ని ఎవడ్నో జోడి కట్టుకుని తిరుగుతున్నవుగా తిరనాళ్ళలో సంబరంగా , వాడు చొక్కా , ప్యాంటు వేసుకున్నోడు, పైగా మంచోడు కదా . పోవేపో  అని అమాయకంగా బాధగా అన్నాడు బిన్నీ .         అయ్యగారు కలిగించుకొని " అదా బిన్నీ నీ సందేహం!  అది నేను ఆడించిన నాటకం రా ! గౌరీ తల్లి , తండ్రి నన్ను పెద్దమనిషిగా ఎన్నుకుని నాకు వాళ్ళ సమస్య చెప్పుకున్నారు .  ఆ తర్వాత నీకు జ్ఞానం కలిగించాలని , నీకు కనపడేటట్లు వాళ్ళ బాబాయి కొడుకుని వేసుకుని తిరగమని నెన్నె చెప్పా .  అందులోను వాడిది వేరే దేశం రా , నువ్వు వాడిని చూడలా, అందుకే నీకు తెలియదు ."
   ఒరె బిన్నీ ! నీ స్థానం గౌరీ మనసులో అట్లనే భద్రం గా ఉందిరా .  ఈ మాట పూర్తి అవుతుండగానే గౌరిని కౌగిలించుకున్నాడు బిన్నీ .
   గౌరీ తన చేతిలో మూట విసిరేసింది .  ఇద్దరు ఒకళ్ల నొకళ్ళు పూర్తిగా అల్లుకుపోయారు .
     " మా అవ్వ దగ్గరికి పోవద్దు .  మళ్ళీ మనల్ని విడదీస్తుంది . డబ్బు కోసం వెల్లగొడుతుంది."
      అయ్యగారు డబ్బు మూట తీసి బిన్నీ కి ఇచ్చారు .  " నాకు ఎందుకు ఈ డబ్బులు ? ఇవి గౌరివి " అని గౌరికి ఇచ్చ్చాడు బిన్నీ .
       దీనితో వేరే ఇల్లు కట్టుకుందాం  అని సంతోషం గా చెప్పింది గౌరీ .
       ఆశీర్వదించాడు అయ్యగారు .    



      

story-- మొగలి రేకులు - part-2

      అది విన్న అయ్యగారు " ఒరేయ్ ! బిన్నీ ! ఆశ్చర్యం ఏమిటంటే నీకు ఆ గౌరి చిలిపి చేష్టలు గుర్తుకొస్తున్నాయి  అంటున్నావే , మరి నీవు కొట్టిన దెబ్బలు తిట్టిన తిట్లు గుర్తుకురావటం లేదా ?  అసలు నీవు ఎవర్రా కొట్టటానికి ? మగాడ్ని అనేగా ధీమా ! ఏదైనా తప్పు చేస్తే , అది నీకు తప్పు అనిపిస్తే వాళ్ళ పెద్దవాళ్ళకు చెప్పాలి .  అంతకూ  న్యాయం జరగక పొతే పదిమందికి చెప్పుకోవాలి .  సరే !ఇంతకీ నన్ను ఇప్పుడు ఏమి చెయ్యమంటావు చెప్పు ?"
      "అది కాదయ్యా ! గౌరి   వాళ్ళ బావ తో తిరునాళ్ళలో తిరుగుతుందయ్యా . నన్ను చూసి ఎటో తప్పించుకుందయ్యా. అదీ నా బాధ " బిన్నీ ఆందోళనగా చెప్పాడు .
       అవునురా నువ్వు సంవత్సరం గౌరి గురించి పట్టించుకోకుండా ఉండిపోయావు . ఇది రెండో వేసవి కాలం అంటున్నావు . ఇంత కాలం దాని వైపు చూడలేదా ?  కనీసం దాని ధ్యాస కూడా లేదుట్రా నీకు ?  తిరునాళ్ళకు వెళితే అక్కడ గౌరి పక్కన దాని బావ ఉన్నాడని చూసి నీలో ధ్యాస మొదలయ్యింది .  మరి తప్పు ఎవరిదిరా ?  అదీ ఉప్పు , కారం తినే మనిషి కదరా !  దానికి కోపతాపాలు , కోర్కెలు ఉంటాయి కదరా !కొట్టి ఇష్టం వచ్చినట్లు తిట్టి వేల్లగోట్టినవాడివి అట్లానే వదిలెయ్యరాదూ  తన దారి తనుచూసుకుంటుంది కదరా !" సూటిగా ప్రశ్నించాడు అయ్యగారు .          " అది కాదయ్యా !అయిపోయిందేదో అయిపొయింది .  నేను కావాలని కొట్టలేదు .  ఆచ్చనం అత్తా జరిగిపోయింది .  మీరు నాకు చిన్న  సాయం చేస్తే ...."  నసుగుతూ అన్నాడు బిన్నీ .           "ఏమిటో చెప్పు , నావల్ల  అయితే తప్పకుండా సహాయం చేస్తాను". అయ్యగారు అభయం ఇచ్చారు . 
       "మీరు రోజూ దివాణం లోకి పోతూ ఉంటారు కదయ్యా ! అక్కడ మా మావ పని చేస్తూ ఉంటాడు . మీరు మా మవకు గట్టిగ సేప్పందయ్యా !  మీఎరు సెబితే వింటాడు .  ఇక నుండి మేం బుద్ధిగా ఉంటాం .  మా అవ్వ మాట విని దాన్ని కొట్టాను మీరే సాక్ష్యం అయ్యా !".అన్నాడు .
      సరే వెళ్ళు , నేను అటు దివాణం వైపు వెళ్ళినప్పుడు గౌరి తండ్రి భాక్రా  తో మాట్లాడతాను  అని అన్నాడు అయ్యగారు .
     అంతే బిన్నీ లో పట్టలేని ఆనందం
     తను గౌరి ని కలుసుకోబోతున్నాడు త్వరలో . ఏదో పట్టరాని సంతోషం .  ఆ సంతోషం తో తన కండువా ని గాల్లోకి విసిరి పట్టుకుంటూ  ఇంటికి చేరుకున్నాడు .  ధోవతులు , లాల్చిలు , కండువా ఉతుక్కున్నాడు .  చక్కగా చెంబు ఇస్త్రి చేసాడు .  మంచిగా గడ్డం గీయించుకుని దరిద్రం వదిలిన మనిషిలా నూతన తేజం తో శుభ్రం గా ఉన్నాడు .
        తన దగ్గర చెక్క పెట్టెలో గౌరి , తను క్రితం సంవత్సరం తిరునాళ్ళలో దిగిన ఫోటో కోసం చూస్తున్నాడు .  ఇంతలో ఆ పెట్టెలో వాళ్ళ ఆచారం ప్రకారం శోభనం నాడు కట్టుకున్న తన బట్టలు గౌరి కుర్తా లో చుట్టి దాచి పెట్టింది .  వారిని చూస్తున్న బిన్నికి మనసు గత కాలపు జ్ఞాపకాల లోకి వెళ్ళిపోయింది .  ఆ రోజు గౌరి ఎంత చిలిపి చేసింది !.  

story: మొగలి రేకులు part-1

           బీజాపూర్  దుర్గమ్మ తిరునాళ్ళు  కోలాహలంగా జరుగుతున్నాయి .   కన్నుల పండుగగా జనం కనిపిస్తున్నారు .  ఎక్కడ చూసినా స్త్రీలు ఎక్కువ సంఖ్య లో కనిపిస్తున్నారు .  ఎ దుకాణం లో చూసినా సరే గాజులు కొనుక్కున్తోనొ , పూసలు కొని మేడలో వేసుకొని , అందమైన  సంఖంలాంటి మెడని అద్దంలో  చూసుకుంటూనో , చెవికి రింగులు సరి చూసుకుంటూనో , జడకుచ్చులు కట్టుకున్టూనో, ఎంతోమంది స్త్రీలు వారి బేరసారాల సంబరాల్లో మునిగి తేలుతున్నారు .
         ఒక్కో దుకాణం చూసుకుంటూ వస్తున్నా బిన్నీ అకస్మాత్తుగా ఆగిపోయాడు .  ఏమైందో !  ఖచితంగా ఒక సంవత్సరం క్రితం ఆనందం , అనుభూతి  కేకలు మనస్సు లోయల్లో ప్రతిధ్వనించాయి .
       తనూ , గౌరీ ఒకళ్లంటే  ఒకళ్ళకు ఎంత ప్రేమా , అసలు గౌరి అందం ఎవరికుంతాది.  ఇద్దరం పోద్దుపోడిసేఎల జొన్న చేలోకి సద్ది కట్టుకుని ఎల్లేవాళ్ళం .
        అన్నెం పున్నెం ఎరుగని నా గౌరి కళ్ళు , ప్రేమ చిందించే కొలనులాంటి కళ్ళు , మా దుర్గమ్మ గుడిపై బొమ్మ కున్న లాంటి సన్నని ముక్కు , ఎర్రని బుగ్గలు , కసికసిగా బుంగమూతి పెట్టి కోర్కెలు పుట్టించే ఆ పెదవులు , నా చేతులతో పట్టుకుని ఎన్నిసార్లో ఊపిన సన్నని చిన్ని గడ్డం , మోచేతులవరకు సింతపూల రవిక .
      ఆ రైక పై వాక్కోటు  కింద కుర్తా , మైమరపించి మురిపించే మెడ కనపడకుండా  శాస్త్రప్రకారం గా తల పైనుంచి బలమైన జబ్బాల వరకు కప్పుకున్న పలుచని ముసుగు .  కొద్దిగా ముసుగు పైకి జరుపుకుని చిరునవ్వులు చిందిస్తూ , తను గడ్డిమోపు తలపై పెట్టుకుని పొలం గట్లపై నడుస్తా ఉంటె నా గౌరీ నన్ను పిచ్చేక్కించేది .
  గౌరి అంటే పడిసచ్చే వాడ్ని , ఎప్పుడు చీకటి పడుద్దా, నా గౌరి దుప్పట్లో దూరిపోవాలని తహతహ లాడే వాడ్ని .  సంవత్సరం తర్వాత మళ్ళీ  నా అందమైన గౌరి .  అవును  నా గౌరి .                 గౌరీ - గౌరీ , అని పెద్దగా పిలుస్తూ అటూ ఇటూ చూసాడు బిన్నీ .  దుకాణం లో ఉన్న గౌరి అక్కడనుంచి  తప్పించుకుంది .  గౌరి పక్కన ఎవరయి ఉంటాడు వాడు -- దాని బావ కాదూ , ఆ -దాని బావే ! బావను ఏసుకుని తిరనాల్లో తిరుగుద్దా?  సెపుతా ఉండు .
      అటూ ఇటూ ఆందోళనతో వెతికాడు బిన్నీ .  గౌరీ కనపడలేదు .  విసుగుతో తల గోక్కున్నాడు .  ఇంకా ఎంతో మంది మిసమిస లాడే , కళ్ళతో చూపులతో ఊసులాడే , మెళ్ళో కాసులతో గల గల లాడే , నవ్వులతో కిలకిలలాడే  తుంటరి భామలు కనిపిస్తున్నా  తనకు మనస్సు ఏమాత్రం స్పందించటంలేదు . గౌరి జ్ఞాపకాలు ముసురుతున్నాయి .  కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి తిరిగి వచ్చాడు .  "అవ్వా ! అవ్వా !"  అని పిలిచాడు .
    ఎవరూ ఇంట్లో కనిపించలేదు .  కొంకి కర్ర తీసుకుని గొర్రెలను తోలుకుంటూ వెనకాల బీడులోకి వెళ్ళాడు .  అక్కడ ఒక పెద్ద చెట్టు ,  ఆ చెట్టు క్రింద రాధాకృష్ణ విగ్రహం .       ఎన్నిసార్లు గౌరి తనతో  " అదిగో  ఆ రాధమ్మ నేను అయితే నువ్వు ఆ కిష్టయ్యవి " అని సెప్పి ఆట పట్టించేది .  నా ముక్కు పట్టుకుని పిండేది .  నేను దాహం అయి సోరకాయలో నీళ్ళు తాగుతుంటే ఉండేలుతో రాళ్లు విసిరి సయ్యని కొట్టేది .  నాకు కోపం వచ్చిందాకా సేసి గోర్రెల్లో పది అటూ ఇటూ ఉరికేది .
    తడాలున నేను పట్టుకుంటే నా తలను తన కౌగిట్లో రాసుకుంటూ , తెల్లని పలువరుసతో కిలకిల నవ్వేది .  ఎర్రని పెదాలతో నా నుదుటిపై , బుగ్గలపై ముద్దులు పెట్టేది .  కర్ర లాక్కుని చిన్న  చిన్న దెబ్బలు కొట్టేది పలక పై అక్షరాలూ దిద్దబెట్టేది .  బాస మంచిగా మాట్లాడాలని నాకు ఎన్నో విషయాలు నేర్పింది .
     "నీకు ఎలా ఇయ్యన్నీ వచ్చినాయీ!" అని అడిగితే  నేను మా ఊరి గుళ్ళో పూజారి గారింట్లో అచ్చరాలు దిద్దుకున్నా , కొద్దిగా సదువుకున్నా, ఆ అయ్యగారు , అమ్మగారే  మంచి బాస మాట్లాడటం నేర్పారు , అని నన్ను కూడా నేర్చుకోమని బలవంతం చేసేది          బిన్నీ ఆ జ్ఞాపకాల ముసురులకు తట్టుకోలేక  గొర్రెలను , మేకలను  బీడులో వదిలేసి ఇంట్లోకి వచ్చ్చి పడ్డాడు . 
    ఏందిరో పెద్దాడా ! గొర్రెలు అన్నీ ఆడే వదిలేసావు?  అస్సలు ఏమైందిరా నీకు , అట్లున్నావు ? అని అవ్వ నిలదీసింది .
      నీకు తెలవదే  అవ్వా !  నీకు సెప్పినా అర్ధం కాదులే . పో , నా పాణాన   నన్ను బతకనీవే  అంటూ కళ్లపై  చేతులు పెట్టుకుంటూ మంచం పై అటూ ఇటూ దొర్లుతున్నాడు బిన్నీ .
      "నాకు ఎరుకేలేరా ! ఆ గౌరమ్మ కోసమేగా నీ బాధ .  వత్తదిలే . ఇక అట్లానే పోయిద్ది అనుకున్నావా ?  బాకీ ఉన్న పెండ్లి రొక్కం ఇవ్వమన్నాము . అంతేగా , అది పట్టుకుని బేగిరా వస్తాదిలేరా " రాగాలు తీస్తోంది అవ్వ . 
       ఇంతలో బిన్నీ కి ఓ ఆలోచన మెరిసింది .  వెంటనే లేచి ఒక్క పరుగుతో ఊరి దివాణంలో పురాణం చెప్పే అయ్యగారి ఇంటికి వెళ్ళాడు .  దండాలు అయ్యగారు అంటూ బిన్నీ నేలపై కూర్చున్నాడు .
        "ఒరే బిన్నీ ఏమిట్రా ఈ మధ్య  గౌరి కనిపించటం లేదు ? అని అడిగాడాయన .  అదే అయ్యా ! మీతో నా మనసు గోడు చెప్పుకోవాలని వచ్చ్చాను " అంటూ తిరిగి తనే ఇలా చెప్పాడు -
        "నా పెళ్ళాం గౌరి , నా అవ్వా ఇద్దరూ పోరు పెట్టుకున్నారు .  అయ్యా ! మా అవ్వ మీద గౌరి తిరగబడింది  అని దాన్ని దెబ్బలు కొట్టి  మా అవ్వా నేను కలిసి ఎల్ల గొట్టినమయ్యా ఆది ఏడుసుకుంటూ  గోర్రేపిల్లని ఎత్తుకుని వాళ్ళ ఊరు వేల్లిన్దయ్యా
            అప్పటినుండి నాకు యాడ సూసినా గౌరే కనపడుతున్దయ్యా !  దాని అల్లరి లక్షణాలు , సిలిపి కళ్ళు  అన్నీ పడ్డాకా గురుతు కొస్తున్నాయయ్యా "  బాధ గా చెప్పుకున్నాడు బిన్నీ . 
   

నీ కోసం

కనుల కొలనులో నీ రూపం కదలాడింది
మనసు  సముద్రమై  ఉప్పొంగింది
యవ్వన తోటలో ఆశలన్నీ పువ్వుల దోసిల్లై
నీకోసం వెతికాయి
పచ్చిక బయలుపై మంచు ముత్యాలు అన్నీ
నీకోసం మాల గుచ్చాను
నీ ఎర్రని పెదవులపై నిస్వార్ధమైన
నా అక్షరాలు  రాయాలని
జీవన బాట అంతా తివాచీలు పరిచాను
నీ రాకకై
మండుటెండల్లో విధిని సైతం ఎదిరించాను
మనసు లేని కొండల్ని పెకిలించాను
బండరాతి మనుషులపై నడిచాను
ప్రేమ సౌధం నిర్మాణానికి
ప్రణయ శిల్పానికి ఎన్ని ఉలి దెబ్బలో
నీ చిరునవ్వులు ఎన్నో
ఒక్క నీ అంగీకారం చాలు
ఇక సప్త సముద్రాలు ఆనందం తో ఈదటానికి
మురళీకృష్ణ

 

ఎదురీత

ప్రతి  మనసుకు ఉంటుంది ఆశయం
సాధించాలంటే ప్రతిదీ ఓ పద్మవ్యూహం
స్వార్ద శక్తులు మార్గం అంతట కంటకాలను పరుస్తాయి
మనసుని విమర్సల అస్త్రాలతో తూట్లు చేస్తారు
గాట్లు పెడతారు , విధి నెత్తిన ఎక్కి వస్తారు
మేధస్సును శిధిలం చేసి వెనక్కి లాగుతారు
జంకిపోయి బెదిరిపోయి వెక్కి వెక్కి ఏడవకు
విధి నిన్ను చూసి వెక్కిరిస్తుంది
నీ వాళ్ళే నిన్ను నమ్మించి దగా చేస్తారు
నవ్వులపాలు చేసి తన్నిపోతారు
ఎ ఎండకు ఆ గొడుగు పడతారు
నీ చుట్టూ నిరాశా నిస్పృహలు   కారు చీకట్లలా దట్టంగా ఆవరిస్తాయి
లోకులు కాకులై పొడుస్తారు
నీ పక్షాన ఎవరు ఎక్కడా కనిపించరు
జాడ తెలియని రాత్రిళ్ళు కీచురాళ్లై గోల పెడతారు
నిర్లిప్తమైన శూన్యం నిన్ను ఆవరిస్తుంది
భయపడి  ముడుచుకోకు
ప్రాణాలకు తెగించి ప్రయత్నం చెయ్యి
ఓటమి తోక ముడిచి పారిపోతుంది
శరీరం ముక్కలు అయినా పర్వాలేదు
మనసును ముక్కలు కానివ్వకు
ఒకవేళ మనసు బూదిడైపోయినా
బాగా వెతికి పట్టుకో ఏదో మూల చిన్న  నిప్పురవ్వ ని
బలంగా లేచి చిన్ని ఆశతో
పగిలిన మనసుని అంటించుకో
నిప్పురవ్వ ను కష్టపడి నిప్పు కణికగా రగుల్చు
నువ్వు ఎంతో నష్టపోయి ఉండవచ్చు
కష్టాన్ని నమ్ముకో అది నిన్ను గట్టేకిస్తుంది
అంకితభావం , క్రమశిక్షణ  కృషి అనే కొలిమిలో
మనసుని రగిలించు
అప్పుడు ఏ స్వార్ధ శక్తి నీకు ఎదురైనా
కాలి భస్మం అయిపోతుంది
అప్పుడు నీదే పై చేయి , నీదే విజయం

spiritual


Life


 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online