Pages

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-5

      అస్సలు భగవంతుడు మానవుడి లా అంత తేలిగ్గా  మీసాలు పెంచో .నున్నగా షేవ్ చేసుకునో .ఆయుధాలు పట్టుకోనో .పక్కన పిల్లలను పట్టుకొనో కనిపిస్తారా అని కొంతమందికి సంశయం  .పండితులు అరిషడ్వర్గము లు[ అంటే కామ ,క్రోధ ,లోభ ,మోహ ,మద ,మాత్సర్యములు] మనలోని రాక్షసులు అంటూ .క్షీరసాగర మధనం అంటే మన మనస్సు ని తర్కించుకోవటంఅని ఒక్కోదానికి పోల్చి చూపిస్తూ వుంటారు .అయి తే ఈ బ్రమ్మాండం లో ఎన్నో జీవులు వున్నాయి .ప్రతి జీవిలో మళ్ళీ అదే బ్రహ్మ౦ డము కొద్దిరూపములో నిండి వుంటుంది.  బ్రమ్మాండ ౦ లో ఉన్నదే కొద్ది కొద్ది గా ప్రతీ జీవిలో సూక్ష్మ రూపములో చిన్న  చిన్న బిందువు ల్లగా వుంటుంది .ఉదాహరణకు బైట పురాణాల్లో రాక్షసులు ,వాళ్ళు చేసే అరాచకాలు వింటూ ఉంటాము .అది బైట ప్రపంచములో జరిగినది నిజమే .మనలో వున్న రాక్షసులూ నిజమే అదే ఇలా చెప్పారు అని పోల్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదు . ఉదాహరణకు దశావతారములు తీసుకున్నాము .బ్రహ్మ్మ౦ డము లో భగవంతుడు అలా అవతారములుగా వచ్చి ఉండవచ్చు అది బైట జరిగింది

     అలానే మానవుడి లేక జీవపరిణామం చేపలు,తాబేళ్లు పంది సగం మనిషి సగం జంతువు కోతులు పోట్టిమానవుడు తెల్విగల మానవుడు ,ఆ తరువాత  అలా జీవ పరిణామం జరుగుతూవచ్చింది .దీనినే విదేశీయులు డార్విన్ ,జీన్ బ్లాస్తిస్ లమార్క్ లాంటివాళ్ళు ఈ ఆధునిక కాలములో నిరూపించారు .కాబట్టి ఇక్కడభగవంతుడిలో మనం వున్నాము .మనలో భగవంతుడు వున్నాడు .కాబట్టి భగవంతుడికి మనకు బేధము లేదు అదే అద్వైతము .అంటే రెండు కాదు ఒక్కటే   భగవంతుడు ,,నేను అంటే జీవుడు ఇద్దరం ఒక్కటే అనే వాదం ఈ వాదాన్ని అద్వైతముఅంటారు దీనిని జగద్గురు శంకరాచార్యులవారు ఆవిష్కరించారు .

        ఇక జీవుడు ,భగవంతుడు ఒకటే ఎలా అవుతారు కాదు ఎప్పటికి అలా కాదు భగవంతుడు సర్వ శక్తిమంతుడు ఆయనచే సృష్టింప బడినవాడు జీవుడు ,అందుకే జీవుడు ఒకడు ,భగవంతుడు ఒకడు ఇద్దరు వేరు వేరు అని మద్వా చార్యులు వారు చెప్పారు ఆ సిద్దాంతాన్ని ద్వైతము అంటారు అయుతే మరి ప్రకృతివిషయం ఒక్కటి వుంది తెలుస్సా దానిని ఏమి చేద్దాము అన్నారుభగవద్  రామానుజాచార్యులువారు అప్పుడు వారు ఒకటి కాదు , రెండు కాదు మూడు అని చెప్పారు దానినే తత్త్వ త్రయం అంటారు అంటే మూడు తత్త్వాలు  ఈ సిద్దాంతాన్ని విశిష్టఅద్వైతము అంటారు ఇది చక్కగా అర్థం కావాలంటే ఓభార్యాభర్తలుకలసినడుచుకుంటూ వస్తూన్నారు ఆ ఇద్దరు చుస్తే వేరువేరు అంటే ద్వైతము . అలానే కొంతకాలానికి భార్యకు కడుపు వచ్చింది ఇప్పుడు ఆమె అద్వైతం రూపానికి ఉదాహరణ. ఇప్పుడు ఆమె లో రెండు తత్వాలు కాని పైకి కనబడేది ఒక్కటే ఇక కొంతకాలానికి ఆమెకు కొడుకు పుట్టాడు లేక సంతానం కలిగింది ఆ ముగ్గురు అంటే తల్లి తండ్రి  కొడుకు నడుచుకొంటూ వస్తూన్నారు  ఈ కనపడే రూపం  విశిస్టా ద్వైతం  ..ఈ 3 భగవంతుడు – జీవుడు – ప్రకృతి  ఆధునిక సైన్స్ లో మనం చెప్పుకొనే ఎలక్ట్రాన్ –ప్రోటాన్ –న్యూ ట్రా న్  .రామానుజలువారు ఏమి చెప్పారంటే ఈ మూడు కలసినట్టే, కలసి ఉన్నట్టే  చూస్తే మూడు వేరు వేరు     .అలానే   ఉదాహరణకు  మనం ,మన ప్రక్కన వున్న క్లోజ్ ఫ్రెండ్ లేక బంధువు ఇంటి తో సత్సం సంభందం పెట్టుకున్నాము అనుకోండి.పై పై ఆలోచనలు కలిసే ఉంటాయి .  పండుగలు పబ్బాలు కల్సి చేసుకుంటాము ,మాటలాడుకుంటామ్  కాని ఒకే కుటంబం కాదు ,ఇవి రెండు వేరు వేరు కుటుంబాలు అలాంటి సంభంధమే ఈ భగవంతుడు –జీవుడు –ప్రకృతి 

        జీవుడు  శేరీరం లో వున్నప్పుడు లోపల బైటా  తనప్రక్కన వున్నది భగవంతుడు , ,ప్రకృతి,  అందుకే ఆరు బైట కనిపించే   ప్రకృతి లో కనపడే తూఫానులు ,సుడిగుండాలు,వేడి ,శీతలం అలజడులు  ఆకాశం ,పంచభూతాలు అన్నీమనలో కూడా కనబడుతూ ఉంటాయి ప్రకృతి లో యూనివర్సల్ గా  ఒక్కటే అంతా నిండి వుంటుందిఅదే  .ప్రకృతి ధర్మం అంటాం ఉదాహరణకు ఆవు తన దూడను ప్రేమిస్తుంది .విత్తనాలను మొక్కలు నలుదిసెలా ప్రేమతో ఇష్టం తో వెదజల్లుతాయి .ఇక్కడ ఒక విషయం ఆవు తన దూడనే ప్రేమించు కుంటుంది ఇంకో దాని దూడ విషయం దానికి అనవసరం .అలానే మొక్కలు ,జంతువులు,మనుషులు ఇప్పుడు మనం ప్రకృతి గురించి చర్చిస్తున్నాము .ఒకవేళ మీ మనస్సు లో మీకు అనిపించవచ్చు .కొన్ని జంతువులు .మనుష్యులు ఇతరుల పై శ్రద్ద చూపిస్తూవుంటా యి  మరి అది ఏమిటి అని అడగవచ్చు . ఇక అది ప్రేమ ,అనుభందం  యూనివర్సల్ ప్రేమ   అది భగవతత్త్వం .ప్రకృతి విషయములో బైట ప్రకృతి ,మనలోపల ప్రకృతి గురించి చర్చిస్తున్నాము కదా

walking and its uses

నడకవల్ల జీర్ణ శక్తి బాగా పెరుగుతుంది .మలబద్దకం సమస్య పోతుంది deprression ,ని మానసిక ఆందోళన ని తగ్గిస్తుంది చురుకు దనాన్ని,చైతన్యాన్ని కలిగిస్తుంది .నీరసాన్ని తగ్గిస్తుంది.

రోగనిరోధక వ్యవస్థ ని సరి చేసి ,కండరాలకు ,ఎముకలకు బలాన్ని పెంచుతుంది.  మోనోపాజ్, మేనోపాజ్ వాళ్ళు రోజు నడుస్తూ వుంటే బ్రెయిన్ క్యాలిషియం ఉత్పత్తిని ఎముకలకు సహ్జసిద్దముగా పెంచుతుంది .

stress.టెన్షన్ లు తగ్గి మైండ్ ప్రశాంతముగా వుంటుంది .మెదడు చురుగ్గా పని చేస్తుంది .చెడు కొలిస్త్రోల్ ని తొలగిస్తుంది .ఊపిరితిత్తుల పనితీరుని మెరుగు పరుస్తుంది .శ్వాస లోపాలను సరిచేస్తుంది .gastrouble ని పోగుడుతుంది, అసిడిటిని తగ్గిస్తుంది . చక్కటి నిద్ర ని కలిగిస్తుంది ఈ నడక
.
ఇంకా ఈ నడకవల్ల చెమట పట్టి చెమట ద్వారా విషపదర్దాలు బైటకు పోతాయి .దానితో అన్ని అవయవాలు మంచిగా పని చెస్తాయి .నడకవల్ల ఉత్సాహం పెరుగు తుంది పాజిటివ్ మూడ్ కలిగిస్తుంది .శ రీరములోకి కొత్త శక్తి ని కలిగిస్తుంది

శరీరమునకు కావలసినంత ఆక్సిజన్ వచ్చి  రక్తం పరిశుబ్రం అవుతుంది ,blood circulation బాగుపడుతుంది .

Some medicinal uses of cardamom

చిట్కా గృహ వైద్యం [యాలకులతో]
 
ఒక గ్లాసువేడి నీటిలో చిటెకెడు యాలకుల పొడి ,చిటికెడుమిరియాల పొడి ,కాస్తంతయండబెట్టిన అల్లం ,ఒక చెంచాతేనె కలిపి రొజూ తీసుకోవడం వల్ల ఆస్తమా .బ్రాంకైటిస్ నుంచి ఉపసెమనంపొందవచ్చు .

బోజనానికి ముందు ఒక యాలక్కాయ ,ఒక లవంగం నోటిలో వేసుకొని నమలడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది.   అపానవాయువులు, గుండె మంట కూడా తగ్గు ముఖం పడతాయి .యాలకులు  ఒకటి ,అల్లం కొద్దిగా ,ఒక లవంగం కొంచం కొత్తిమిర రసం కలిపి తీసుకోవటం వల్ల అజీర్ణ సమస్యలు తగ్గిపోతాయి .అజీర్ణం వల్ల వచ్చే తలనొప్పి పోవాలంటే యాలకులు వేసి తయారు చేసిన టీ త్రాగితే మంచిఫలితం వుంటుంది .మానసిక వత్తిడి [స్ట్రెస్] నుంచి కూడా బైట పడవచ్చు.
 
 మంచి ఫలితం లభిస్తుంది ,కాని అతిగా యాలకుల పొడి వాడకూడదు.  గ్రీన్ టీ లో గాని ,బ్లాక్ టీ లో గాని ఒక చిటెకెడు యాలకుల పొడి వేసుకొని త్రాగటం వల్లరక్తం లో కేఫ్ఫిన్ తగ్గిపో యి మూత్రపిండాలు ,గాల్ బ్లాడర్ ని శుబ్రం చేస్తుంది
యాలకుల పొడిని అరటి ఆకు తో కలిపి నూరి ఆ మిశ్రమాన్ని ఉసిరి కాయ రసం లో కలిపి రోజుకు 3 సార్లు తీసుకోవటం వల్లగనేరియా లాంటి సుఖ వ్యాధులు తగ్గి పోతాయి.
 
దాల్చిన చెక్క ను యలకులతో కలిపి కషాయం చేసి పుక్కిలించడం ,గొంతుకి తగిలేలా గాగులు చేయటం వల్ల గొంతు నొప్పి ,జలుబు తగ్గి పోతాయి .అలా 2 లేక 3 రోజు లు చేయాలి.  కప్పు నీళ్ళల్లోరెండు యాలకులు ,5 పుదీనా ఆకులు తో చేసిన కషాయం త్రాగితే వెక్కిళ్ళు తగ్గి పొతాయి. 

 ఏదైనామంచిది మంచి ఫలితం లభిస్తుంది కదా అని దానిని అతిగా వాడరాదు.  అప్పుడు అది వికటించి చెడు ఫలితం ఇస్తుంది.  అలానే అతిగా యాలకుల పొడి వాడకూడదు ,ఎక్కువసార్లు అదేపనిగా రొజూ త్రాగరాదు నపుంసకత్వంవచ్చే  ప్రమాదం వుంది .

ugadi subhakankshalu

                                       






                                          మిత్రులు, సన్నిహితులు అందరికి హేమళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

 

HADHOD a herb for bones n joints

HADJOD herbfor bone and joint wellness  

   నల్లేరు అనే మూలిక గురించి మీరు విని ఉంటారు.  HADJOD. అనేది ఈ మూలిక యొక్క హిందీ పేరు. మన Generation, వారికి ఈ నల్లేరు, అవిసె పువ్వులు వంటి వాటిని వంటకాలు గా వాడేవారు అని తెలియదు.  కానీ మన అమ్మమ్మ - నాయనమ్మ ల తరాల వారు వాటిని ఆహారం గా తీసుకునేవారు.  మన దురదృష్టం కొద్దీ మనం ఇటువంటి పోషక విలువలు ఉన్న ఆహారాలు తినక పోవటం వలన వ్యాధి బారిన పడటం, వాటినే మందులుగా తీసుకోవలసి వస్తోంది .

       కీళ్ళ నెప్పులు మరియు ఎముక నెప్పులు  శేరీరంలో ఎక్కడ వున్న ఈ ఆయుర్వేదం మందు వాడవచ్చు .బాగా పనిచేస్తుంది .ఈ మందు లో ప్రధాన మూలిక నల్లేరు .అయితే ఆయుర్వేదం మందు ఏదైనా చాలా ఇతర ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది.  ఊబకాయం తగ్గిస్తుంది ,షుగర్ వ్యాధి వాళ్ళకు చాలా మంచి ది.శరీరములో రోగనిరోధకశక్తిని పెంచుతుంది  కోలెస్ట్రా లను తగ్గిస్తుంది.  ఆస్తమా వూపిరితిత్తుల సమస్యలను అదుపులో ఉంచుతుంది .  పూర్వ కాలములో దీనిని పచ్చడి గా చేసుకొని తినేవారు .అంతేకాదు విరిగిన ఎముకల పై వేసి ఈ నల్లెరుతో కట్టు కట్టేవారు.

     ఈ మూలిక ఇప్పుడు టాబ్లెట్స్ రూపం లో కూడా లభిస్తోంది .ఉదయం టిఫిన్ తరువాత 1 tab వేసుకోవచ్చు వ్యాధి తీవ్రత పట్టి 2 tab రాత్రి పూట కూడా వేసుకోవచ్చు.  astiposhak తో పాటు దీనిని కూడా వాడవచ్చు. ఇక పెయిన్ కిల్లర్ గా sallaki tabs వాడవచ్చు . అశ్వగంధతైలం  లేదా నారయణ తైలం లేదా moove లాంటి వి పైన రుద్ది వేడి నీళ్ళ తో కాపడం పెట్టుకుంటే మంచిది.

 
Photo
 

some remedies for knee and joint pains - part 1

     ఇప్పుడు ఈ మద్య కాలములో చాలా మంది మోకాళ్ళనెప్పులుతో,కీళ్లనెప్పులతోబాధలు పడుతూ వున్నారు.చాలామందికి మోనోపాజ్ [స్త్రీలలో 40,45 లలో ] అలానే మగవారిలో [మేనోఫాజ్ ] లలో హార్మోన్స్ సమతుల్యం లేకపోవటంతో ఈ సమస్యలు వస్తూవుంటాయి.అయితే ఈ రోజులలో చాలామందికి చిన్నవాళ్ళకి కూడా సమస్యలు వస్తూ వున్నాయి.దానికి చాలా కారణాలు వున్నాయి.శారీరకశ్ర మ  తగ్గిపోవటం .కల్తీపదార్దాలు రసాయానికపురుగుమందులు.రసాయనిక ఎరువులు  ఆహారం తో,   లోపాలకి పోవటం ,రోజూ త్రాగే పాలు కలుషితం అవుతున్నాయి .బర్రెలకు .గోవులకు పాలు కార్చే యాలని ఇంజక్షన్స్ఇస్తువుంటారు అవి కూడా లోపలికి పోయ శ రీరములో కలిసి వయస్సు తో పాటు సంబంధం లేకుండా అందరికి షుగర్ ,బి .పి లు .థై రాయుడు లాంటివి వస్తూ వున్నాయి.
 
      పీల్చే గాలిలో కూడా అనేక రకాల కాలుష్యం లోపలికి పోతూవున్నది. అందుకోసం కనీసం మొక్కలు బాగా పెంచాలి .కార్లకిబదులుగా సైకిళ్ళు వాడాలి .పంటలకు సహజ సిద్ద మైన పేడ, .ఎరువులు పంటలకోసం వాడాలి .సరే ఇక ఈ రోజుల్లో మోనోపాజ్ ,మెనోపాజ్ వాళ్లలో మోకాళ్ళ నెప్పులకు, కీళ్ళ నెప్పులకు ముఖ్యమైన కారణం D vitaman ,క్యాలిషియం ,అని తెలుసుకోవాలి .ఇదే విషయాన్ని పైన ఇదివరలో తెలుసుకున్నాం .ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలను చూద్దాము .మనం తిన్న ఆహారం లో ని క్యాలిష్యం శరీంరం లోకి చేరటానికి vitminD ఎంతో అవసరం అది బ్లడ్ టెస్ట్ ద్వారా చూసుకోండి .అది సరిపడా వుంటే ఇక వాడక్కర్లేదు
.
      ఎందుకంటే విటమిన్స్ ఎంతో మేలు అని ఎడాపెడా ఇష్టం వచ్చినట్లు వాడకూడదు విటమిన్స్ ఎక్కువగా వాడితే .వాటి పరిమితి పెరిగినా  కూడాsideeffects ఉంటాయి అని మరిచి పోవద్దు .ముశ్రూమ్స్ అంటే పుట్టగొడుగులు తినటం .మాంసాహారులు అయితే చేపలు తినటం మంచిది. ఉదయం సూర్యోదయంతరువాత ఏడు గంటలవరకు సూర్యరశ్మి లో గడపాలి .అలా D vitamin కావలసినంత లేకపోయినా triglisarides, bad cholestral కూడా బాగా పెరిగిపోతా యి .

     ఇక D విటమిన్ కావాల్సినంత పెంచుకున్నతరువాత క్యాలిషియంకూడా పెంచుకోవాలి .దానికోసం రోజు ఒక ఉసిరికాయతింటే చలామంచిది . దానిలోని C విటమిన్ కూడా D ని పెంచి క్యాలిష్యం పెరుగుదలకు దోహదపడుతుంది .ములగచెట్టు ఆకు లో సహజసిద్ధమైన క్యాలిష్యం విపరీతముగా వుంది .కా లీ ఫ్లవర్ లో కూడా క్యాలిష్యంవ  వి పరీతముగా వున్నది 
.                                     
     కాలి ఫ్లవర్ +5 మిర్యాలుపొడి  +HALFSPOON జీలకర్ర  +2 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి   +కొద్దిగా SALT కల్పి సూప్ లా చేసుకొని కొద్దిరోజులు పరగడుపున త్రాగితే కీళ్ళ నెప్పులు ,మెడ నెప్పులు మోకాలి నెప్పులు తగ్గిపోతాయి .


     పలుచని మజ్జిగ 1గ్లాసుడు తీసుకొని దానిలో రెండు స్పూన్లు[ మీడియంస్పూన్ ] మెంతుల పిండి బాగా కలిసేలా తిప్పి ప్రతిరోజూ త్రాగితే కూడా మోకాలి నెప్పులు తగ్గిపోతాయి రోజు మొత్తంలో ఎప్పడైన త్రాగవచ్చు,ముఖ్యముగా మోకాలి నెప్పులు కి బాగా పని చేస్తుంది .షుగర్ వాళ్ళకి చాలా మంచిది .ఇక తరువాత```250గ్రాము లు  మెంతులు ,100గ్రాములు వాము ,50 గ్రాముల నల్లజీలకర్ర ఈ మూడింటిని కలిపి  కొద్దిగా వేయుంచి పొడి తయారు చేసుకోండి .రొజూ రాత్రి భోజనం తరువాత ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక spoon పొడి కల్పుకొని త్రాగవలెను[ ,వేడినీటితో మాత్రమె ]ఇది తీసుకున్న తరువాత ఎటువంటి ఆహారం తీసుకోరాదు ,కాని 3 నెలలు మాత్రం తప్పక వాడితేనే మంచి ఫలితం వస్తుంది .

     పారిజాతం ఆకులు ఓ 5  ఆకులు తీసుకొని కషాయం కాచి చల్లార్చి తాగితే కీళ్ళ నెప్పులు ,మోకాలి నెప్పులు తగ్గిపోతాయి .ఎక్కవ ఆకులు వేసుకోవద్దు వేడి చేస్తుంది.  నేలవేము పొడి ఆయుర్వేదం షాప్ లలో దొరుకుతుంది దానిని తెచ్చి కొద్దిగా వ్యా ధి  తీవ్రత బట్టి 1 లేదా 2 స్పూన్లువేసిఒక గ్లాసు నీరు పోసి కషాయంకాచి త్రాగితే[ కావాలంటే తాటికల్కండ లేదా తేనె వేసుకోవచ్చు ] కీళ్ళ నెప్పులు అన్నీతగ్గిపోతాయి .ముఖ్యముగా కీళ్ళ వాతం,కీళ్ళ జ్వరం ,చికెన్ గున్యా వచ్చిన వాళ్ళకి ఈ మందు అద్బుతము గా పని చేస్తుంది .

     1/4  spoon పసుపు + 1 spoon జీలకర్ర , 1/2  spoon తాటికల్కండ ఓ గ్లాస్ నీరు పోసి  కషాయంకాచుకోవాలి బాగా ఇగిరిన తరువాత దానిని .రెండుపూటలా 50 mlనుంచి 100ml వరకు త్రాగుతువుంటే కీళ్ళల్లోవాపు ఎరుపు రంగు stiffness ,నొప్పి తగ్గిపోతాయి .ముఖ్యముగా ఇది artharities, మైగ్రే న్  వాళ్ళకు ఎక్కువ ఈ రకం నొప్పులు వస్తూవుంటా యి .

       వెలక్కాయ  లేదా వెలగపండు ఏదోవిధముగా లోపలికి తీసుకొంటే  అంటే పండులో షుగర్ వేసుకొని తిన్టమో లేక  వెలగ క్కాయని పచ్చడి గా చేసుకొని తిన్టమో చేస్తుంటే మనిషికి కావాల్సినంత క్యాలీషియం వచ్చి పడుతుంది.  మోనోపాజ్, మెనోపాజ్ వాళ్ళకు క్యాలిష్యంలోటు తీరితే చాలా సమస్యలు కీళ్ళకు సంబందించి పోతాయి .దానికోసం కొద్దిగా  బార్లీ గింజలు తీసుకొని కొద్దిగా salt వేసి ఉడికించి పెట్టుకోవాలి . దానిలో కొంచం కాచిన పాలు పోసి లోపలికి తీసుకొంటే రోజు అలా కొద్ది రోజులు చేస్తే కావలసినంత కాల్షియం  వచ్చి పడుతుంది.

      మోకాలు నొప్పితో బాధపడేవారు ప్రతిరోజూ ఓ కప్ లో అటుకులు వేసుకొని కొద్దిసేపు నానపెట్టుకొనితింటూ వుంటే ఆ రోజూ కి కావాల్సిన క్యాలిష్యం మనిషికి వచ్చేస్తుంది .పోహా[అటుకులు ]నానబెట్టుకొని ఉప్మాచేసుకొని  తింటూ వుంటే కూడా క్యాలిష్యంకావసినంత వచ్చి ఎముకల నెప్పులు,సమస్యలు తగ్గిపోతాయి .  బెండకాయలోను,తోటకూరలోను ,క్యాప్సికంలోను రాగుల పిండి  లో కూడా క్యాలిష్యం ,ఐరన్ పిచ్చిపిచ్చిగావుంటుంది .
  
        ఇక పైన వన్ని మేము చేసుకోలేము అంటే ఆయుర్వేదం షాప్ లలో దూత్ తాపెస్వర్ కంపెనీ లో అస్తిపోష్ క్ డబ్బా /110 rsవుంటుంది అది తెచ్చుకొని వాడుకోవచ్చు .అది వాడితే నేరేడు,కాకర కాయలు తినకూడదు .కాని కొద్దిరోజుల్లోనే కీళ్ళ నెప్పులు ,మోకాలి నెప్పులు తగ్గిపొతాయి .ఇంగ్లీష్ మందుల్లా రాళ్ళు వస్తాయి అనే భయం వుండదు.


      పైన చెప్పిన వన్నిచేయాలనిలేదు .మనకు వీలుగా వున్నవి ఒకటి ,రెండు చేసుకొని బైట పడవచ్చు .ఎదిఎమైన ఇంగ్లీష్ మందుల్లగా వెంటనే పని చేయవు ,ఆయుర్వేదం ,సిద్దవైద్యం కొంత టైం తీసుకుంటా యి .కానీ సంపూర్ణమైన ,శాస్వతమైన ఫలితాలను ఇస్తుంది .ఇంగ్లీష్ మండుల్లా sideeffects వుండవు .కాని మనం పైన చెప్పుకున్న ఆయుర్వేదం లేదా గృహ వైద్యం కొద్దిరోజులు అ యి నా వాడితే మంచి ఫలితాలు ఇస్తుంది .

       నిలబడి నీరు త్రాగకండి.కూర్చుని త్రాగండి .కూర్చుని భోజనం చేయటం ఎంతో మంచిది .నిలోచోనిమూత్రం పోయకండి క్రింద కూర్చుని పోసుకోవటం చాలా మంచిది.

ఇంగ్లీష్ మందుల్లో ని painkillars ని ఎక్కువగా వాడటం మంచిది కాదు .అయితే ఇంగ్లీష్ మందుల్లో ultracet సేఫ్ డ్రగ్ అంటున్నారు అది కూడా ఎక్కువ వాడకూడదు , ఆయుర్వేదంలో painkillars గా  sallaki టాబ్లెట్స్400mg వాడవచ్చుదీనిలో ఇంకాస్త పవర్ ,strong,forte, అని వుంటుంది కొంచం costవుంటుంది.  అది కూడా మంచిదే

      చింతగింజలపొడి [coffepodi షాప్ లో దొరుకుతుంది ] కొంత తీసుకొని దానికి సమానముగా తుమ్మబంక [ఆయుర్వేదం షాప్ లో దొరుకుతుంది ] ఈ రెండు మిక్స్ చేసి లోపలికి ప్రతి రోజు కొంత తీసుకోవాలి దానివల్ల మోకాలి చిప్పలలో అరిగి పోయున చోట గుజ్జు వచ్చి మోకాలి నొప్పులు తగ్గిపోతాయి .అలానే మొకాలిచిప్పలపై కలబంద గుజ్జు గుండ్రముగా పట్టిచ్చండి కొన్నిఘంటలువుంచి రుద్దండి.కదిగేసుకోండి ‘లేదా నువ్వులనూనె లో చింత గింజల పొడి కల్పి రాత్రి పడుకోనేటప్పుడుమొకాలిచిప్పలు పై పట్టించి గుండ్రముగా వ్రాసి పైన గుడ్డ కట్టు కొండి రాత్రంతా వుంచి తెల్లవారి కడిగేసు కోండి.



Photo
 

Legumes n Lentils help in reducing obesity

   Today am going to write about legumes n Lentils.  These super r foods packed with vital nutrients.  They r high in protein, low in fat.  They r packed with some carbohydrates n dietary.  They provide us vitamins B6, A, C. They provide calcium, iron, Folate, Zinc n some other vital minerals which r essential for our health. 

    In Indian cooking these Lentils n Legumes r an essential part.  we all have some favourite dishes like Rajma chaval, Chole Bature, Kaabuli chana Moong daal kichidi etc.....  we do remember our Mothers adding green peas n chickpeas in some curries like cabbage, brinjal, grated coconut n some leafy vegetables also.  In our temples also especially in South India they give cooked chickpeas as Prasad on some festivals.

   These foods help us in fighting obesity also.  We can loose weight without loosing the intake of vital nutrients.  If u include these in ur daily meals, u can easily achieve the requisite results.  Beans, chickpeas, Kidney Beans, Lobia, double beans, Peas n Peanuts r some Legumes.  Nuts also come under this category.  Lentils r also of this group. 

   We all know eating sprouts is good for health.  We prepare n eat Lentil sprouts along with vegetable sprouts.  Here am going to give u one easy recipe with any of these seeds to reduce weight.  It is really easy to prepare n u can have it as it tastes really good.

   Take just 100 grams of any of these Beans, Peas, like Kidney beans, green peas, Lobia, chickpeas etc.... soak them in water over night.  in the morning remove the water n clean them.  cook them without oil by just adding water. Take 3 r 4 Tomatoes n cut them in to pieces. When the beans r half cooked, then add these Tomatoes, later on add salt to taste, some pepper powder.  When they r completely cooked, take half tea spoon cow ghee n heat it, when it is hot add half a spoon jeera n some curry leaves n pour the mix just like tadka.  U can add coriander leaves r mint leaves also to garnish.  It serves to 2 people. 

   If u r on a strict diet, then just eat this as it is without any roti r bread.  Other wise u can eat it with two slices of multigrain bread r brown bread, some rotis r pulkas also.  U can have this as breakfast r dinner.  It is good for children as a snack in the evening.  We tried this recipe at home n had good results. Pls. try this.  Have good health.  Eat healthy n reduce weight at the same time by eating some low calorie foods.
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online