Pages

Sun ecilipse 21june2020

*సూర్యగ్రహణం*
 తేదీ : 21-06-2020  ఉదయం 11:58  శ్రీశార్వరినామ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య ఆదివారం .మృగశిర -4 , ఆరుద్ర -1 పాదాలు మిథున రాశి లో రాహుగ్రస్త అంగుళ్యాకారంలో సూర్య గ్రహణం సంభవిస్తోంది .

ఈ గ్రహణం భారతదేశముతో పాటు ఆసియా , ఉత్తర ఆస్ట్రేలియా , పాకిస్తాన్ , శ్రీలంక , ఆఫ్రికా మొదలగు ప్రాంతములయందు కూడా కనిపించును . చాలా ప్రాంతములలో పాక్షికముగా కనిపించును , డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ ) లో సంపూర్ణంగా కనిపించును .
*మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రముల వారు , మిథునరాశి వారు ఈ గ్రహణం అసలు చూడరాదు.*

*తెలంగాణ రాష్ట్రానికి*
గ్రహణ ఆరంభకాలం : ఉ . 10.14
గ్రహణ మధ్యకాలం : ఉ . 11.55
గ్రహణ అంత్యకాలం : మ . 1.44
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 30 నిమిషాలు
*ఆంధ్ర రాష్ట్రానికి*
గ్రహణ ఆరంభకాలం : ఉ . 10.23
గ్రహణ మధ్యకాలం : మ .12.05
గ్రహణ అంత్యకాలం : మ . 1.51
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 28 నిమిషాలు
*గ్రహణ నియమాలు*
గ్రహణం రోజు అనగా 21-06-2020 ఆదివారం నాడు  ఉదయం 6 గంటల వరకు సామాన్య మానవులు అందరూ అన్నపానాదులు ముగించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం  ఉదయం 8 గంటల వరకు తినవచ్చు. అది కూడా అల్పాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ గ్రహణం మిధున రాశి వారు  మృగశిర, ఆరుద్ర  పునర్వసు  నక్షత్ర జాతకుల వారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ గ్రహణం చూడరాదు.

గ్రహణ పట్టు ,మధ్య , విడుపుస్నానాలు ఆచరించే వారు యాధావిధిగా స్నానం ఆచరించి,మంత్రానుష్టానములను నిర్వహించుకొవచ్చును.

గ్రహణం సమయంలో ఎవరి నక్షత్ర జపం వారు చేసుకోవచ్చును. లేదా మీకు ఏదైనా మంత్రానుష్టానం ఉంటే ఆ మంత్రం జపం చేసుకోవచ్చు. లేదా సూర్య గాయత్రి మంత్రం జపం చేసుకోవచ్చు.

*సూర్య గాయత్రి - ఓం ఆదిత్యాయచ విద్మహే మహా శుభగాయచ ధీమహి, తన్నోఆదిత్య ప్రచోదయాత్.*

   గ్రహణం  రోజు అనగా ఆదివారం మధ్యాహ్నం గ్రహణం విడుపు తర్వాత అనగా మధ్యాహ్నం 2  గంటలకు ఇల్లు శుభ్రంగా కడుగుకుని, స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు,రెండు హారతి కర్పూరం బిల్లలను చూర్ణం చేసుకుని నీళ్ళలో వేసుకుని తప్పక అందరూ తల స్నానం చేసుకోవాలి.ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్రపరచుకుని గాయత్రి ( జంధ్యం ) ని మార్చుకుని, దేవత విగ్రహాలను,యంత్రాలను "పులికాపి" చేయాలి. శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు,యంత్రాలు ప్రోక్షణ చేసి దీపారాధన అలంకరణం చేసి మహా నైవేద్యం కొరకు బెల్లంతో చేసిన మరమాన్నం వండి దేవునికి నివేదన చేసి హారతి ఇచ్చి మనస్సును ప్రశాంతగా ఉంచుకుని మూడు ప్రదక్షిణలు నిధానంగా చేసి మనస్సులో సమస్త గ్రహాదోష నివారణ కలిగించమని సాష్టాంగా నమస్కారం చేస్తూ విన్నవించుకోవాలి, ఆడవారు సాష్టాంగ నమస్కారం ఎప్పుడు ,ఎక్కడ చేయకూడదు.ఆడవారు కేవలం మోకాళ్ల పైనే చేయాలి.ముఖ్యంగా గర్భిణిలు నిలబడే నమస్కరించుకోవాలి,

     ముఖ్యంగా గర్భవతులు ఎలాంటి భయందోళన పడవలసిన అవసరం లేదు. గర్భవతులు ఎవరైన గ్రహణం ప్రత్యక్షంగా చూడ కూడదు, మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మీకు మరీ మంచిది. గ్రహణ సమయంలో కదలకూడదు,మల,మూత్ర విసర్జన చేయకూడదు. గ్రహణం ప్రారంభానికి ముందే కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఎవరినైనా పెద్దవారిని పక్కన కూర్చోబెట్టుకుని వారి ద్వారా సపర్యలు పొందాలి.

  ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి, దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల వచ్చును. మిధున, కర్కాటక,వృచ్చిక మీన రాశుల వారు తగు గ్రహాణ దోష పరిహార ప్రక్రియలను మీకు అనుకూలమైన పండితులను సంప్రదించి దోష పరిహార జప,దానాదులను చేసుకోవాలి.ద్వాదశ రాశుల వారు గోమాతకు బియ్యం, తోటకూర,బెల్లం గోధుమలు కలిపి ఆవునకు తినిపించాలి. గోమాత మనం పెట్టిన దాన్యం తినేప్పుడు మూడు ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను గుమ్మంపై నుండి తీసివేసి మళ్లి కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితులచే పూజించి ఇంటికి,వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి.గ్రహణం తర్వత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి,కొబ్బరి కాయలు శక్తి కోల్పోతాయి.కాబట్టి తిరిగి మనకు,మన కుంటుబ సభ్యుల కొరకు ,ఇంటికి,వ్యాపార సంస్థల రక్షణ కొరకు తప్పక కట్టుకోవాలి.
*శుభఫలం* మేష , మకర , కన్య , సింహ రాశులకు
*మధ్యమ ఫలం* వృషభ , కుంభ , ధనుస్సు , తుల రాశులకు
*అధమ ఫలం* మిథున , మీన , వృశ్చిక , కర్కాటక రాశులకు వారికి అధమ ఫలం .
మిథునరాశివారు ఖచ్చితంగా గ్రహణ శాంతి చేయించుకోవాలి  .
.  ప్రజలు అందరూ కూడా ఈ సమయంలో సూర్యభగవానుడు కి తగిన శాంతులు చేసి ఈ కరోనా నుండి ప్రపంచాన్ని కాపాడమని వేడుకుందాం...

అన్నింటికంటే భగవంతుని దయ ముఖ్యం ....మీ ఇష్ట దైవాన్ని నమ్ముకొని నడుచుకోవాలి ...అప్పుడు ఆయన. ..మనలను కాపాడుతూఉంటాడు ..స్వామి వారి.. లేక అమ్మ వారి పాదాలను గట్టిగా పట్టుకోవాలి ..మనస్సులో .....పట్టుకొని ప్రార్థిస్తున్నట్లు ...ధ్యానం చేసుకున్నా పర్వాలేదు ..సాయుసచ్చరిత పారాయణం......లేక శ్రీవిష్ణు సహస్రనామాలు చదువుకోవచ్చు ...లేదా శివాభిషేకం చేయంచుకోవచ్చు ....లేదా గోవింద నామాలు చదువుకోవచ్చు ...హనుమా న్ చాలీసా ...ఓం నమో వెంకటేశాయనమః ....ఇక మీ ఇష్ట0 ...ఒక్కరే దైవం ...రూపాలు అనేకం ..
  గ్రహణం   తరువాత ..    ఇక ఇల్లు అంతా ...సర్దుకోవడం కుదరదు ...ఓపిక ..తీరిక ఉండకపోవచ్చు ...గ్రహణం తరువాత రోజు అయినా తల స్నానం పూర్తి చేసి ..ఇల్లు అంతా పసుపు నీళ్ళు చల్లుకో0డి ...దేవుని గది లేక అలమర కొద్ది గా తుడుచుకుని పసుపునీళ్లు కొద్దీ కొద్దిగా జల్లు కోవచ్చు
ఏది.. ఏమైనా ..జ్యోతిష్యం.. సోషల్ మీడియా... లో భయ భ్రాంతులకు .మనం లోను కాకూడదు .ఎందుకంటే ...భగవంతుడిలోనుంచి ...ఈ ప్రపంచం పుట్టింది .....అందుకే ..శివ కేశవుల ఆజ్ఞ లేనిదే ఏమి జరగదు ...అన్నిరూపాలు ...వారే ..కాబట్టి భగవంతుని పైభక్తి కల్గి ఉండండి ...భగవంతుని ...మనస్సులో ఒక్కనిమిషం తలుచుకొని ధ్యానం చేయండి ....భగవంతుని కోసం తపించండి ....చాలు .కనీసం ఆయన నామం ...మనస్సులో ఉచ్ఛరించండి.  నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online