Pages

పీవీ నరసింహారావుగారి జీవితం లో జరిగిన ఓబాధాకరమైన సంఘటన

పీవీ జీవితంలో చ‌ద‌వ‌ని పేజీ ... చేతిలో కాసు లేదు.. ఇల్లు అమ్మేసి.. ఆ డ‌బ్బులతో..
By R Bhanu , 2 Hours ago
 2004వ సంవ‌త్స‌రం, డిసెంబ‌రు నెల 9వ తారీకు. ఢిల్లీ tvలోని ఆల్ ఇండియా మెడిక‌ల్ సైన్సెస్(ఎయి మ్స్‌) ఆసుప‌త్రిలో వైద్యులు.. సిబ్బంది.. ప‌రుగులు తీస్తున్నారు. బ‌య‌ట నుంచి కుయ్‌.. కుయ్‌.. అని కూ త పెట్టుకుంటూ.. ఈ ఆసుప‌త్రికే చెందిన అంబులెన్స్ ర‌య్య‌న దూసుకువ‌చ్చి.. ప్ర‌ధాన కాంపౌండ్ లోకి చేరిం ది. అప్ప‌టికే స్ట్రేచ‌ర్‌, ఆక్సిజ‌న్‌తో సిద్ధంగా ఉన్న ప్ర‌ధాన వైద్యుల బృందం స‌హా.. సిబ్బంది అంబు లెన్స్‌లో నుంచి అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితిలో ఊపిరాడ‌క అల్లాడుతున్న మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహా రావును పూల పొట్లంలా ప‌ట్టుకుని స్ట్రేచ‌ర్‌పైకి ఎక్కించారు. రెప్ప‌పాటులో ఐసీయూకు త‌ర‌లించారు. ఈలో గా.. మ‌రెన్నో కార్లు.. ఆసుప‌త్రి ప్రాంగ‌ణానికి వ‌చ్చి చేరాయి.


సూటూ బూటుతో ఉన్న ఓ వ్య‌క్తి.. ఓ కారులోంచి దిగుతూ దిగుతూనే.. డోర్ కూడా వేయ‌కుండా... హుటాహు టిన ఆసుప‌త్రి లోప‌లికి ప‌రుగు ప‌రుగున చేరుకున్నారు. `సార్‌కి ఇప్పుడు ఎలా ఉంది?  వైద్యులు ఏమ‌న్నా రు?  ప్రాణాపాయం లేదుక‌దా?.. అయినా.. మీరు నిన్నే ఆసుప‌త్రికి తీసుకువ‌చ్చి ఉంటే బాగుండేది.` అం టూ.. ఆసుప‌త్రి ప్ర‌ధాన హాలు లో కుర్చీలో జార‌బ‌డి శూన్యంలోకి చూస్తూ.. ఉబికి వ‌స్తున్న క‌న్నీటిని ప్ర‌య ‌త్న పూర్వ‌కంగా ఆపుకొంటున్న‌ పీవీ గారి పెద్ద కుమారుడు రంగారావు భుజం త‌డుతూ.. ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించేశారు ఆ వ‌చ్చిన వ్య‌క్తి. రంగారావు.. నిమ్మ‌ళంగా చెప్పారు.. `ఇప్పుడే ఐసీయూలోకి తీసుకువెళ్లారు. మేం కూడా వెయిట్ చేస్తున్నాం.. ఇప్ప‌టికైతే.. ప్రాణాపాయం లేద‌నే చెప్పారు` అని!


దీంతో.. ఆ వ‌చ్చిన మ‌నిషి.. `హ‌మ్మ‌య్య‌!. అయితే, ఫ‌ర్వాలేదు. అంతా ఆ వేంక‌టేశ్వ‌ర‌స్వామే చూసుకుం టారు. మీరు ధైర్యంగా ఉండండి!!`` అంటూ.. ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ రూమ్ వైపు వ‌డివ‌డిగా అడుగు లు వేశారు. ఆయ‌నే.. పీవీ దృష్టిలో మిత్రుడు.. నిజాయితీప‌రుడు.. ప్ర‌జా సేవ‌కుడు.. ఐఏఎస్ అధికారి పీవీ ఆర్ కే ప్ర‌సాద్. కొన్ని గంట‌లు గ‌డిచాయి.. ``సార్‌ని చూడొచ్చు!!`` వైద్యులు.. పీవీఆర్ కే ప్ర‌సాద్‌, పీవీ కు మారుడు రంగారావు ఉన్న రూమ్‌కు వ‌చ్చి చెప్పారు. దీంతో వారిద్ద‌రూ ఉన్న‌ప‌ళాన‌.. పీవీగారున్న రూమ్ వైపు అడుగులు వేశారు. ఐసీయూలోకి తీసుకు వెళ్తున్న స‌మ‌యంలో పీవీగారి ముఖానికి పెట్టి ఉన్న ఆక్సి జ‌న్ ఇప్పుడు లేదు. అంటే.. ఆయ‌న స్వ‌యంగా శ్వాస తీసుకోగ‌లుగుతున్నారు. `ద‌గ్గ‌ర‌గా వెళ్లి మాట్లాడొచ్చు!`-అనుకున్నారు రంగారావు.. ప్ర‌సాద్ గార్లు!


ఇంత‌లో సూప‌రింటెండెంట్ వీరిదగ్గ‌ర‌కు ప‌రుగు ప‌రుగున వ‌చ్చారు. ``సార్‌.. ప్లీజ్ ఇప్పుడే వ‌ద్దు! మీరు వెయిట్ చేయండి. చూశారుగా.. ఇక‌, కూర్చోండి`` అని అభ్య‌ర్థ‌నా పూర్వ‌క ఆదేశం ఇచ్చారు. దీంతో ఇద్ద‌రూ వెనుదిరిగారు.. కొన్ని నిముషాలు గ‌డిచాయి.. మ‌ళ్లీ అదే సూప‌రింటెండెంట్‌.. అదే రూం వ‌ద్ద‌కు వ‌చ్చి.. ``సార్‌.. ప్ర‌సాద్ గారూ.. సార్ మీతో ఏదో మాట్లాడ‌ట‌.. ర‌మ్మ న్నారు. ఆయ‌న‌ను ఖంగారు పెట్టే మాట‌లు మాట్లాడొద్దు.. ఎక్కువ సేపు ఆయ‌న‌తో మాట్లాడించొద్దు.. గాబ‌రా పెట్టొద్దు..`` అంటూ.. పీవీఆర్‌కే ప్ర‌సాద్‌కు జాగ్ర‌త్త‌లు చెప్పారు. దీంతో త‌న దేవుణ్ని(పీవీని ప్ర‌సాద్‌గారు ఇలానే అనేవారు సార్ స్థానంలో స్వామి అని పిలిచేవారు) mచూసుకునే అవ‌కాశం వ‌చ్చింద‌ని ప‌రుగు ప‌రుగున మ‌ళ్లీ పీవీగారిని ఉంచిన రూమ్‌లోకి వెళ్లారు.


హ‌ఠాత్తుగా వ‌చ్చిన గుండెపోటుతో ఆసుప‌త్రిలో చేరిన పీవీలో ఎక్క‌డా ఖంగారు లేదు.. చ‌నిపోతానేమోన ‌న్న భ‌య‌మూ లేదు. ఆయ‌న క‌ర్మ యోగి(పెద్ద కుమారుడు రంగారావు ఇలా పిలిచారు. చాలా మంది మ‌న్మోహ‌న్ సింగ్‌ అన్నార‌నే ప్ర‌చారం చేస్తున్నారు. చేసిన ప‌నిని న‌మ్ముకున్నారే త‌ప్ప.. ఫ‌లితంపై పీవీ ఎప్పుడూ ఆశ‌లు పెట్టుకోలేదు(భ‌గ‌వ‌ద్గీత‌లో శ్రీకృష్ణుడు ఇదే క‌దా చెప్పాడు). త‌న రూంలోకి వ‌చ్చి.. త‌నున్న బెడ్‌కు కొంచెం దూరంగా నిల‌బ‌డ్డ పీవీఆర్‌కే ప్ర‌సాద్ క‌ళ్ల‌లోకి క‌ళ్ల పెట్టి చూస్తూ.. ద‌గ్గ‌రగా ర‌మ్మ‌ని పీవీ సైగ చేశారు. దీంతో ఆయ‌న రెండ‌డుగులు ముందుకు వేసి.. పీవీకి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు.



``(తెలుగులోనే)చూడు ప్ర‌సాదూ.. నేనెవ‌రికీ బాకీ అయితే లేను. కానీ, కొంత మందికి రుణ ప‌డిపోయాను. నా త‌ర‌ఫున ప‌ది ప‌దిహేను మంది లాయ‌ర్లు.. కోర్టుల్లో కేసుల‌పై వాదించారు. వారికి నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేదు ప్ర‌సాదూ.. ఇప్పుడు ఇద్దామంటే.. నాద‌గ్గ‌ర పైసా కూడా లేదు. రంగారావు కూడా ఇబ్బందుల్లో ఉన్నాడు. వాడికి చెబితే బాధ‌ప‌డ‌తాడు. కానీ, రుణ ప‌డిపోయి.. `పోవ‌డం` నాకిష్టం లేదు ప్ర‌సాదూ.. నువ్వు నాకోసం ఒక‌‌ప‌ని చేసి పెట్టు``- ఆగుతూ.. ఆగుతూ.. వ‌స్తున్న స్వ‌రం.. కొన్ని నిముషాలు మూగ‌బోయింది. పీవీఆర్ కే ప్ర‌సాద్ క‌ళ్లు సుడిగుండాల‌య్యాయి! `ఎలాంటి నాయ‌కుడు.. ఎలాంటి జ్ఞాని.. మ‌న దేశం కాకుండా విదేశాల్లో పుట్టి ఉంటే.. ప్ర‌పంచ‌మే పూజించేది క‌దా.. పువ్వుల‌పై న‌డిపించేది క‌దా!!`  ప్ర‌సాద్ మ‌స్కిష్కంలో ఆలోచ‌నల ప‌రంప‌ర‌.. పెను వేగంతో సాగింది.


మ‌ళ్లీ పీవీ నోరు విప్పారు.. ``ప్ర‌సాదూ.. నాకు బంజారాహిల్స్ ఓ ఇల్లు ఉంది. నువ్వు ఇప్పుడు వెళ్లి.. దాన్ని అమ్మి పెట్టు. ప‌త్రాల‌న్నీ సిద్ధం చేసి.. రాజికి(పీవీ గారి వంట మ‌నిషి) చెప్పాను.. ఎక్క‌డ ఉన్నాయో చూపి స్తాడు. ఆ డ‌బ్బులు.. నా కేసుల‌పై వాదించిన లాయ‌ర్ల‌కు ఫీజుగా ఇచ్చెయ్‌! ఇదే ప్ర‌సాదూ.. నేను నిన్ను అడిగేది!`` పీవీ గారి కంఠం మ‌ళ్లీ మూగ‌బోయింది. కొన్ని రోజులు గ‌డిచాయి. పీవీఆర్ కే ప్ర‌సాద్‌గారు.. పీవీ ఇల్లు అమ్మేశారు. ఈ విష‌యం చెప్పేందుకు.. ఆయ‌న మ‌ళ్లీ ఢిల్లీ బ‌య‌ల్దేరారు. అది డిసెంబ‌రు 23. పీవీఆర్ కే ప్ర‌సాద్ బేగంపేట‌లోని విమానాశ్ర‌యానికి చేరుకుని ఢిల్లీ వెళ్లే.. విమానం కోసం ఎదురు చూస్తున్నారు. ``స్వామీ మీరు చెప్పిన‌ట్టే.. మీ ఇల్లు అమ్మేశాను. వ‌చ్చిన డ‌బ్బును లాయ‌ర్ల‌కు ఇచ్చేశాను.. మీరు ధ‌న్యులు. రుణ విముక్త‌ల‌య్యారు. ప్ర‌శాంతంగా చిర‌కాలం జీవించండి. మాబోటి వారికి మార్గ‌ద‌ర్శులు కండి``- అని పీవీని క‌లిసి చెప్పాల‌ని మ‌న‌సులో సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంత‌లోనే ఓ వార్త‌.. పీవీఆర్‌కే మ‌న‌సు ఛిద్ర‌మైంది.. ఆయ‌న హృద‌యం నిశీధిగా మారింది.. అదే పీవీ అస్త‌మించారు..

( .............................సేకరణ..................)


Speciality of Puri Jagannadh temple

శంకు ఆకారంలో ఉండే క్షేత్రం ఒర్రిస్సా లోని పూరి జగన్నాధ్ స్వామి దేవాలయం .                                     

జగన్నాథ్ స్వామి ఎప్పుడూ  నిద్రపోరు.             
 అందుకు నిదర్శనం జగన్నాథ్ స్వామి కి కనురెప్పలు ఉండవు.                 

ఇప్పటికీ ఇంద్రాదిదేవతలు స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఒకసారి విభీషణుడు పూరీ వచ్చిన యదార్థగాథ ఉంది.               ప్రళయకాలములో ఎలాంటి సమస్య లేకుండా స్థిరంగా వుండే క్షేత్రం  " శంఖ చక్ర క్షేత్రం " పురుషోత్తమపురి. పురుషోత్తముడు, జగన్నాధుడు తన అగ్రజుడు బలరాముడు, సోదరి సుభద్రతో కొలువు తీరి భక్తులకు దర్శనం ఇచ్చి, కోరిన కోర్కెలు తీర్చే దివ్య ధామము.
ఈ క్షేత్రం శంఖు ఆకారములో ఉంటుంది..

ఒరిస్సా లోని పూరి జగన్నాధ స్వామి క్షేత్రం..




నమ్మాళ్వారు ఎవరు Nammalwar?

#నమ్మాళ్వార్

శఠగోపయతి... నమ్మాళ్వార్

#శఠారి :- శఠము అనగా 'మాయ' ... అది పుట్టగానే మానవుని పట్టుకుంటుంది. దానివలన " భగవంతుడు మనకు రక్షకుడై ఉన్నాడు" అనే జ్ఞానం నశించి... ఏమీతెలియని అజ్ఞానంతో ఏడుస్తాం . కానీ విశ్వసైన్యాధిపతి ఐన విశ్వక్సేనులవారి అంశతో జన్మించిన వీరు - మాయ(శఠము) తనదగ్గరకు రాకుండా హుంకరించారు .... మాయను  పారిపోయేటట్లుభయపెట్టారు కనుక "శఠారి" అని పిలువబడినారు... భగవంతుడు శ్రీమన్నారాయణుడు వరమిస్తానని వస్తే "నిత్యం నీపాదుకులను నాతలపైధరించి సంసారులైనవారికి నీపాదాలను అందించే అవకాశం ఇవ్వుము" అన్నారు. లోకముపై వారికి ఎంతప్రేమ. తనకోసం ఏమీకోరలేదు. అందుకే విష్ణుదేవాలయములయందలి భగవంతుని పాదుకలను "శఠారి" లేదా "శఠగోపం" అంటారు.

అటువంటి శఠగోపయతి (శఠారి) గురించి తెలుసుకుందాం...

వృషభేతు విశాఖాయాం....
కురుకాపురి కారిజమ్ |
పాండ్యదేశే కలే రాదౌ....
శఠారిం సైన్యపం భజే ||

  కలియుగ ప్రారంభం లో వృషభమాసం (సౌరమానమును అనుసరించి రవి వృషభరాశిలో సంచరించు కాలం వృషభమాసం)లో విశాఖ నక్షత్రంలో .... విశ్వమునకు సైన్యాధిపతియైన శ్రీవిశ్ష్వక్సేనులవారి అంశతో.... పాండ్యదేశములోని కురికాపురి అను పురమునకు రాజైన కారి అనుపేరుగల రాజునకు పుత్రుడై అవతరించారు - శఠారులైన నమ్ ఆళ్వార్....

శఠారి యైన నమ్మాళ్వారు పాదములే మనకు రక్ష 

మాతాపితా యువతయః తనయావిభూతిః,
సర్వం యదేవ నియమేన మదన్వయానామ్౹
ఆద్యస్య నః కులపతేర్వకుళాభిరామమ్,
శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా ||

ఇక కలియుగం ఆరంభమైన 42 వ రోజున ఒక మహానుభావుడు అవతరించాడు. అంటే సుమారు 5100 సంవత్సరాల క్రితం అన్న మాట. కారిమారులనే దంపతులకు భగవత్ ప్రార్థన చేస్తే ఒక చిన్న శిశువు పుట్టింది. ఆ శిశువు పుట్టగానే మాట లేదు, కదలిక లేదు, ఎట్లాంటి స్పందన లేదు. ఆ పిల్లవాడు పాపం ఆహారం ముట్టడం లేదు, ఆ పిల్లవాడి ప్రవృత్తి ఏం పనికి వచ్చేలా లేదు.

కారణం...శిశువు గర్భంలో ఉన్నప్పుడు పుట్టే ముందు ఆ శిశువుకి తన పూర్వ దశ అన్నీ తెలుస్తాయి. తల్లి గర్భం నుండి ప్రకృతిలోకి వచ్చేప్పుడు "శఠ" అనే వాయువు జ్ఞానద్వారాన్ని కప్పివేస్తుంది. అందుకే మందమతులం లేక శఠులం అవుతాం పుట్టగానే. మనం చేసిన పనులే మనకు జ్ఞాపకం ఉండవు సరిగ్గా. కానీ ఈ శిశువు శఠ అనే వాయువును కోప్పడి ఆ శఠ అనే వాయువుకి శత్రువు అయ్యాడట. 'అరి' శత్రువు, అందుకే శఠారి లేక "శఠకోపులు" అయ్యారు. మనకు శఠ అనే వాయువు వల్ల దాహం, ఆకలి వేస్తుంది. కాని ఆశిశువుకు ఆకలి లేదు, దప్పికలేదు, ఒక శిశువు గర్భంలో ఎట్లా ఉంటుందో అట్లానే ఉన్నాడు. లోన భగవత్ తత్వాన్నే అనుభవిస్తున్నాడు.

 తల్లి తండ్రులకు ఏంతోచక ఆళ్వారు తిరునగరి అనే ఊరి దేవాలయం వద్ద వదిలి వెళ్ళారు. ఆశ్చర్యం ఆ శిశువు క్రమేపి జరగడం ప్రారంబించింది, ఆ గుడిలో ఉన్న చింతచెట్టు క్రిందకు చేరింది. మాట లేదు, చూపు లేదు, ఎట్లాంటి ప్రవృత్తి లేదు. కేవలం కూర్చొని ఉంది. అట్లా 16 సంవత్సరాలు గడిచాయి, శరీరం మాత్రం పెరుగుతూ వచ్చింది. అందరికి ఆశ్చర్యంగా అనిపించేది, క్రమంగా అందరూ మరచి పోయారు.

#మధురకవి ఆళ్వారులు నమ్మాళ్వారులను సేవించడం .....

అదే ఊరికి ప్రక్కనే తిరుక్కోరూర్ అనే ఊరు ఉంది. ఆ ఊరికి చెందిన ఒక మహానుభావుడు అందమైన కంఠస్వరం కల్గినవాడు, అందంగా పాడగలడు. అందుకే మధురకవి అని పేరు. చాలా కాలం ఉత్తర దేశ యాత్ర చేస్తూ అక్కడే ఉండి పోయాడు. అలా తన యాత్ర సాగిస్తూ అయోధ్యాపురంలో ఉన్నప్పుడు, ఒక నాడు రాత్రి ఆకాశంలో అధ్భుతమైన తారక కనిపించింది. కొత్తగా ఆ నక్షత్రం ఉంది, పైగా అది దక్షిణం వైపు నడుస్తున్నట్లు కనిపించింది. అది కదులు తున్నట్లుగా రాత్రి అంతా ప్రయాణం సాగించాడు. తెల్లవారే సరికి నక్షత్రాలు కనిపించవు. రోజంతా అలసట తీర్చుకొని, మళ్ళీ రాత్రి ఆ నక్షత్రం నడిచిన వైపు ప్రయాణం సాగించాడు. అయితే కొన్నాల్లకు ఈ శిశువు ఉన్న ఊరికి చేరాక ఆ నక్షత్రం కనిపించడం మానేసింది.

ఆశ్చర్యం అనిపించింది. ఈ ఊర్లో ఏమైనా వింత జరుగుతుందా అని ఆ ఊరి పెద్దలని అడిగాడు. పెద్దగా ఎవ్వరికీ జ్ఞాపకం లేదు ఆ శిశువు గురించి. ఆ ఊరి దేవాలయంకి వెళ్ళి చూసాడు. అక్కడ చింతచెట్టు తొఱ్ఱలో నీలిరంగు శరీరం కల ఒక 16 ఏండ్ల బాలుడు కనిపించాడు. ఆకాశంలో కనపడ్డ నక్షత్రం యొక్క కాంతి ఈ బాలుడు దేహంలో కనపడింది. మాట లేదు పలుకు లేదు, బొమ్మలా ఉన్నాడు . ఏమైన మాట్లాడగలదడా అని తెలుసుకుందామని ఆ ప్రక్కనే చెట్టు ఎక్కి ఒక పెద్ద శబ్దం వచ్చేలా ఒక రాయిని కిందికి విసిరాడు. ఆ శబ్దానికి బాలుడు ఒక్క సారి కనులు తెరిచి చూసాడు. మరి మాటేమైనా వచ్చునా అని ఒక  ప్రశ్న వేసాడు. ప్రకృతిలో చచ్చిన దానినుండి సూక్ష్మం పుట్టి ఎక్కడ తినును ...ఎక్కడ పరుండును ...అని ప్రశ్నించాడు ...అప్పుడు అక్కడే తినును ...అక్కడే పరుండును అని బదులు చెప్పాడు

.అబ్బో  వేదాంతం కూడా తెలుసును అని అనుకున్నాడు. ఇలా ఆ శిశువు మాటలకి మెచ్చి, ఆ శిశువునే ఆశ్రయించుకొని ఉన్నాడు. ఆ 16 సంవత్సరాలు లోన ఏదో దివ్యమైన దర్శనాన్ని పొంది, ఆ దర్శనం వల్ల పొందిన ఆనంద అనుభూతిని గానంచేశారు .. అదే తిరువాయ్ మొజి.

 శఠకోపులవారి పాటలను విని శ్రీరంగనాథుడే స్వయంగా 'నా' ఆళ్వార్ అనిపిలిపించుకున్నాడు,  అందుకే నమ్మాళ్వార్ అని పేరు వచ్చింది.

 పరమ ప్రయోజనం భగవంతుడే అనే విశ్వాసంతో  ఎవరు పూజిస్తారో వారికి లభిస్తాడు భగవంతుడు. నాకు సమస్తం అతడే 'వాసుదేవః సర్వం' అని కోరిన నమ్మాళ్వార్ లాంటివారు దొరకడం ఎంత కష్టం అనుకున్నాడు పరమాత్మ. 'ఉన్నుం శోరు పరుగు నీరు తిండిం వెత్తిలయుం ఎల్లాం కన్నన్' నాకు తినే తిండి త్రాగే నీరు విళాసమైన వస్తువులు అన్నీ కృష్ణుడే అనుకున్నారు నమ్మాళ్వారు.  అట్లా అనుకున్నందుకు నమ్మాళ్వార్ తన స్థానం కూడా వదిలిపెట్టి వీరి హృదయాన్నే తన స్థానంగా చేసుకున్నాడు. వీరికి భగవంతుడిపై వ్యామోహం కాదు భగవంతుడికే నమ్మాళ్వార్ అంటే వ్యామోహం. నమ్మాళ్వారిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను అనే పిచ్చి భగవంతుడికి కల్గేట్టు చేసారు. అందుకే నమ్మాళ్వార్ కి 'కృష్ణ తృష్ణా తత్వం' అని పేరు పెట్టారు పూర్వ ఆచార్యులు. అందుకే నమ్మాళ్వార్ ని పట్టుకుంటే కృష్ణుడు దొరక పోవడం అనేది ఉండదు. భగవంతుడి ప్రేమకి లక్ష్య భూతమైన వారు నమ్మాళ్వార్.

నమ్మాళ్వారు భగవంతుని అందరికీ నీ అనుగ్రహం లభించాలి అని కోరారు...

నీద్వారా వచ్చిన వారినే అనుగ్రహిస్తాను అన్నాడు పరమాత్మ...

ఐతే నీపాదుకలను నాతలపై ఉంచుకుని వారిని నీదయకు పాత్రులుగా చేస్తా అన్నారు నమ్మాళ్వారు.

 అందుకే మన ఆలయాల్లో తల శఠగోపం తలపై  తాకిస్తారు. శఠగోపం అంటే నమ్మాళ్వారే. అట్లా తాకించుకుంటే ఆయన కృప మనకు లభించినట్టే.   అందుకే భగవత్ కృప మూర్తీభవించిన ఆ ఆళ్వార్ని పట్టవే మనసా ఇక చేయాల్సిన కృత్యాలు ఏమి ఉండవు అని అనుకుంటారు భక్తులు . అట్లా భావించే వారే నాకు సర్వస్వం అని భగవంతుడు అనుకుంటాడు.

భగవంతుడు ఎవరినైతే ప్రేమించాడో వారిని ఆళ్వారులు అని అంటాం.

భగవద్గీత 7 వ అధ్యాయంలో పరమాత్మ తనని కోరే వారు నాలుగు రకాలుగా ఉంటారని చెబుతూ ఒకనాడు అనుభవించి కోల్పోయిన సంపదలను కాంక్షించేవారు కొందరైతే ఇది వరకు లేని సంపదలను కాంక్షించేవారు మరి కొందరు, ఇలా వీరిని ఆర్థులు, అర్దార్థులు అని చెప్పి, మరి కొందరు ఆత్మ సాక్షాత్కారం కోరే వారు, వారిని జిజ్ఞాసువులు అని, నాలుగవ రకానికి చెందినవారిని జ్ఞాని అని చెప్పాడు స్వామి. . ఈ నాలుగు రకాలవారు సుకృతులు, ఏం కావాల్సినా నన్నే కోరుకుంటారు. ఈ నలుగురిలో ముగ్గురిని ఒక విభాగం చేసాడు. ఒకరిని ఒక విభాగం చేసాడు. అయితే ఈ ముగ్గురూ నన్నూ కోరుకుంటారు, నేను ఇచ్చేవి కోరుకుంటారు. నేను ఇస్తాను కనక నన్ను కోరుకుంటారు. అందుకే వారు ఏక భక్తులు కారు, ద్వి భక్తులు. "తేషాం జ్ఞాని నిత్య యుక్తః ఏక భక్తిః విశిష్యతే"

కానీ జ్ఞాని అనేవాడు ఏక భక్తి కలిగి ఉంటాడు, కేవలం నన్నే కోరుకుంటాడు, నేను ఇచ్చేవాటియందు ప్రేమ ఉండనే ఉండదు. ఎప్పటికి నన్నే కూడి ఉంటాడు.  మరి జ్ఞానికి నీకు ఉండే అనుబంధం ఎట్లాంటిది అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా "ప్రియోహి జ్ఞానినోహి అహం అత్యర్థం సచ మమ ప్రియః" వాడికి నా జ్ఞానం కంటే గొప్ప ఇష్టం నేనంటే, నాకూ జ్ఞాని అంటే అంత ఇష్టం.అన్నాడు భగవానుడే స్వయంగా.... వారే ఆళ్వారులు... వారిలో నమ్ళ్వారులు ప్రధానమైనవారు.

నువ్వుల నూనెతో ఎన్నోలాభాలుsesameoilbenefits

*నువ్వుల నూనె*

     ఈ భూమిపై లభించే ఉత్తమమైన ఆహారాల గురించి మాట్లాడుకుంటే, అప్పుడు *నువ్వుల నూనె* పేరు ఖచ్చితంగా వస్తుంది.

 మరియు ఈ ఉత్తమ పదార్థం మార్కెట్లో అందుబాటులో లేదు.  రాబోయే తరాలకు దాని గుణాలు కూడా తెలియదు.

     ఎందుకంటే  ఈ కొత్త తరం జనం, టీవీ వాణిజ్య ప్రకటనలను చూసిన తర్వాత మాత్రమే అన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.

    మరియు కంపెనీలు నువ్వుల నూనెను ప్రోత్సహించవు.

ఎందుకంటే దాని లక్షణాలను తెలుసుకున్న తరువాత, మీరు ఆ కంపెనీల నూనె అని పిలువబడే ద్రవ కందెన(కొవ్వు)ను తీసుకోవడం మానేస్తారు.

    _*నువ్వుల నూనెను నూనెలకు నూనె అంటారు.*_

    నువ్వుల నూనెకు చాలా బలం ఉంది, అది రాయిని కూడా చీల్చుతుంది. 

మీరు ప్రయత్నించండి.

      ఒక కొండ రాయిని తీసుకొని ఒక గిన్నెలాగ  తయారు చేసి, ప్రపంచంలో నీరు, పాలు, ఆమ్లం లేదా ఆమ్లం ఉంచండి, ప్రపంచంలో ఏదైనా రసాయన, ఆమ్లం, అదే రాయిలో అలాగే ఉంటుంది.

  కానీ… మీరు ఆ గిన్నెలో నువ్వుల నూనెను, ఆ గొయ్యిలో నింపండి .. 2 రోజుల తరువాత మీరు చూస్తే, నువ్వుల నూనె… రాయిలోకి ప్రవేశించి రాయి కిందకు వస్తుంది. 
 
 ఇది నువ్వుల నూనె యొక్క బలం. ఈ నూనెతో మసాజ్ చేయడం వలన, అది ఎముకలను దాటి,  ఆ ఎముకలను బలపరుస్తుంది.

       నువ్వుల నూనెలో భాస్వరం ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

     నువ్వుల నూనెను ఏదైనా గానుగ నుండి కొనండి.

    తైలం అనే పదం "తిల్" అనే పదం నుండి వచ్చింది.

    అంటే, నూనె యొక్క నిజమైన అర్ధం "నువ్వుల నూనె" అని అర్థం.

     నువ్వుల నూనె యొక్క గొప్ప గుణం ఏమిటంటే, ఇది శరీరానికి ఎంతో శుభప్రదంగా పనిచేస్తుంది ..

మీకు ఏ వ్యాధి ఉన్నా, దానికి వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభిస్తుంది. 

    ఈ గుణము ఈ భూమి మీద ఇతర ఆహార  పదార్థాలలోను కనుగొనబడలేదు.

    100 గ్రాముల తెల్ల నువ్వులలో, 1000 మి.గ్రా కాల్షియం లభిస్తుంది.  నువ్వులు, బాదం కన్నా 6 రెట్లు ఎక్కువ కాల్షియం కలిగి ఉంటాయి.

    నలుపు మరియు ఎరుపు నువ్వులు, ఇనుముతో సమృద్ధిగా ఉంటాయి, ఇది రక్త లోపానికి చికిత్స చేయడంలో ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేస్తుంది.

    నువ్వుల నూనెలో ఉన్న లెసిథిన్ అనే రసాయనం, రక్త నాళాలలో కొలెస్ట్రాల్ ప్రవాహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.

    నువ్వుల నూనెలో సహజంగా , సీస్మోల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా చాలా త్వరగా క్షీణించటానికి అనుమతించదు.

    *ఆయుర్వేద చరక సంహిత లో, వంట చేయడానికి ఇది ఉత్తమమైన నూనెగా పరిగణించబడనది.*

    నువ్వుల నూనెలో, విటమిన్-C మినహా అన్ని అవసరమైన పోషక పదార్థాలు ఉన్నాయి, ఇవి మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
    నువ్వులు విటమిన్ -బి మరియు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి.
    ఇది మీథోనిన్ మరియు ట్రిప్టోఫాన్ అని పిలువబడే రెండు ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంది, ఇవి పప్పు దినుసులు, వేరుశెనగ, బీన్స్, చోలాస్ మరియు సోయాబీన్స్ వంటి చాలా శాఖాహార ఆహారాలలో కనిపించవు.

    ట్రిప్టోఫాన్‌ను ప్రశాంతమైన పదార్థం అని కూడా పిలుస్తారు, ఇది గాఢ నిద్రను కలిగించే సామర్ధ్యం కలిగి ఉంటుంది. 

    ఇది చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

    మెథోనిన్ కాలేయాన్ని సరిచేస్తుంది మరియు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది.

     టిల్బీస్ జీవక్రియను పెంచే ఆరోగ్యకరమైన కొవ్వుల యొక్క పెద్ద మూలం.

    ఇది మలబద్దకాన్ని కూడా అనుమతించదు.

     నువ్వు గింజల్లో ఉండే పోషక అంశాలు కాల్షియం, ఐరన్ వంటివి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి.

    నువ్వుల నూనెలో తక్కువ సంతృప్త కొవ్వు ఉంటుంది, కాబట్టి దీని నుండి తయారైన ఆహారాలు అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

    సాధారణ అర్ధం ఏమిటంటే, మీరు సేకరించిన స్వచ్ఛమైన నువ్వుల నూనెను క్రమం తప్పకుండా తీసుకుంటే, అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా తక్కువ.

     అనారోగ్యంతో లేనప్పుడు, చికిత్స అవసరం ఉండదు.  ఇది ఆయుర్వేదం చెబుతోంది.

     ఆయుర్వేదం యొక్క ప్రాథమిక సూత్రం ఏమిటంటే, సరైన ఆహారమే మాత్రమే శరీరాన్ని ఆరోగ్యంగా  ఉంచుతుంది. అపుడు శరీరానికి చికిత్స అవసరం ఉండదు.

     కొంతమంది ప్రజలు మార్కెట్లో నువ్వుల నూనె పేరిట మరికొన్ని నూనెలను విక్రయిస్తున్నారని గుర్తుంచుకోవాలి ..

    ఇది గుర్తించడం కష్టమవుతుంది.  అటువంటి పరిస్థితిలో, మీ ముందు తీసిన నూనెను మాత్రమే నమ్మండి.  ఈ పని కొంచెం కష్టం, కానీ మొదటిసారి చేసిన ప్రయత్నంగా, ఈ స్వచ్ఛమైన నూనె మీకు అందుబాటులో ఉంటుంది.

     ఈ నువ్వుల నూనెలో మోనో-అసంతృప్త కొవ్వు ఆమ్లం ఉంటుంది, ఇది మంచి కొలెస్ట్రాల్‌ను (HDL) అందించటం ద్వారా శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

    ఇది గుండె జబ్బులు, గుండెపోటు మరియు అథెరోస్క్లెరోసిస్ అవకాశాలను తగ్గిస్తుంది.

  క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది :

      నువ్వులు సెసామిన్ అనే యాంటీఆక్సిడెంట్ కలిగివుంటాయి, ఇది క్యాన్సర్ కణాలు పెరగకుండా ఆపుతుంది మరియు దాని మనుగడ రసాయన ఉత్పత్తిని ఆపడానికి సహాయపడుతుంది.

     ఊపిరితిత్తుల క్యాన్సర్, (Lung cancer), కడుపు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రభావాలను తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుంది.

  ఒత్తిడిని తగ్గిస్తుంది.

    ఇందులో నియాసిన్ అనే విటమిన్ ఉంటుంది, ఇది ఒత్తిడి మరియు నిరాశను తగ్గించడంలో సహాయ పడుతుంది.

  గుండె కండరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది.

    ఈ నూనెలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ మరియు సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి, ఇది గుండె కండరాలు సజావుగా పనిచేయడానికి సహాయ పడుతుంది మరియు క్రమమైన వ్యవధిలో గుండె కొట్టుకోవడానికి సహాయపడుతుంది.

   శిశువుల ఎముకలను బలపరుస్తుంది.

    నువ్వులు  ప్రోటీన్ మరియు అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి, ఇది పిల్లల ఎముకల పెరుగుదలను బలోపేతం చేయడానికి సహాయ పడుతుంది.

     ఉదాహరణకు, 100 గ్రాముల నువ్వులు 18 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటాయి, ఇది పిల్లల అభివృద్ధికి చాలా ముఖ్యమైనది.

  గర్భిణీ స్త్రీ మరియు పిండం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

   నువ్వుల లో ఫోలిక్ ఆమ్లం ఉంటుంది, ఇది గర్భిణీ స్త్రీ మరియు పిండం యొక్క అభివృద్ధి మరియు ఆరోగ్యకరమైన అభివృద్ధికి సహాయపడుతుంది.

  నువ్వుల నూనె శిశువులకు మసాజ్‌ చేయడానికి పని చేస్తుంది.

    అధ్యయనం ప్రకారం, నువ్వుల నూనెతో శిశువులకు మసాజ్ చేయడం వల్ల వారి కండరాల బలానికి, వాటి అభివృద్ధికి ఉపయోగపడుతుంది.
    ఆయుర్వేదం ప్రకారం, ఈ నూనెతో మసాజ్ చేయడం ద్వారా, పిల్లలు హాయిగా నిద్రపోతారు.

  బోలు ఎముకల వ్యాధితో పోరాడటానికి సహాయపడుతుంది.

    నువ్వుల నూనెలో జింక్ మరియు కాల్షియం ఉన్నాయి, ఇది బోలు ఎముకల వ్యాధి అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

  డయాబెటిస్ మందులను సమర్థవంతంగా  పని చేయిస్తుంది.

     తమిళనాడులోని వినాయకా మిషన్ విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ అధ్యయనం ప్రకారం, ఇది అధిక రక్తపోటును తగ్గించడంతో పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని 36% తగ్గిస్తుంది.  యాంటీ-డయాబెటిక్  ఔషధం, గ్లిబెన్క్లామైడ్తో కలిపినప్పుడు సహాయపడుతుంది. 
    అందువల్ల, టైప్ 2 డయాబెటిక్ రోగికి ఇది సహాయపడుతుంది.

    నువ్వులు, పాలతో పోలిస్తే మూడు రెట్లు కాల్షియం కలిగి ఉంటాయి.  ఇందులో కాల్షియం, విటమిన్ బి మరియు ఇ, ఐరన్ మరియు జింక్, ప్రోటీన్ మరియు కొలెస్ట్రాల్ పుష్కలంగా  ఉంటాయి.

  ఇవి పాలల్లో లేవు.

    నువ్వుల నూనె, చాలా సంవత్సరాలు పాడవదు, వేసవి రోజులలో కూడా అదే విధంగా ఉంటుంది.

  నువ్వుల నూనె సాధారణ నూనె కాదు.

    ఈ నూనెతో  మసాజ్ చేస్తే, శరీరం గొప్ప ఉపశమనం పొందుతుంది.  పక్షవాతం వంటి వ్యాధులను కూడా నయం చేసే సామర్థ్యం దీనికి ఉంది.
 
  దీనితో, మహిళలు తమ రొమ్ముల కింది నుండి పైకి మసాజ్ చేస్తే, అప్పుడు రొమ్ములు బలపడతాయి. 

    శీతాకాలంలో మీరు ఈ నూనెతో శరీరానికి మసాజ్ చేస్తే, జలుబు అనిపించదు.

  నువ్వుల నూనెతో   ముఖానికి మసాజ్ చేస్తే,  ముఖం యొక్క అందం మరియు మృదుత్వాన్ని కాపాడుతుంది. 
    పొడిగా ఉన్న చర్మానికి ఇది ఉపయోగపడుతుంది.

    నువ్వుల నూనెలో, విటమిన్ A మరియు విటమిన్ E సమృద్ధిగా ఉంటాయి.
    ఈ కారణంగా, ఈ నూనెకు ఇంత ప్రాముఖ్యత  ఉంది.
    ఈ నూనెను వేడి చేసి చర్మంపై మసాజ్ చేయడం వల్ల, చర్మము నిగారింపు పొందుతుంది.

   జుట్టు మీద పూస్తే, వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి.

   మీకు కీళ్ల నొప్పులు ఉంటే, నువ్వుల నూనెలో కొద్దిగా శొంఠి పొడి, చిటికెడు ఇంగువ పౌడర్ వేసి వేడి చేసి మసాజ్ చేయండి. 

    నువ్వుల నూనె ఆహారంలో సమానంగా పోషకమైనది.

    మను ధర్మం లో కూడా నువ్వులు లేకుండా ఏ కార్యము సిద్దించదు, పుట్టుక, మరణం, పరానా, యజ్ఞం, శ్లోకం, తప, పిత్ర, పూజ మొదలైనవి నువ్వులు లేకుండా ఉన్నట్లు రుజువు లేదు.
    నువ్వులు మరియు నువ్వుల నూనె లేకుండా ఇది సాధ్యం కాదు, కాబట్టి ఈ భూమి యొక్క అమృతాన్ని అవలంబించి జీవితాన్ని ఆరోగ్యంగా చేసుకోండి. 

      🙏సర్వేజనాఃసుఖినోభవంతు🙏

పురుషుడుఅంటే ఎలా ఉండాలో ధర్మశాస్త్రము..

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...🚶🏿‍♀
పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది📚

కానీ ఎందుచేతో ఈ పద్యం జన
బాహుళ్యం లో లేదు

కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః,
సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు
ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)📚⚖

1.కార్యేషు యోగీ 💰:
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి🏹

2. కరణేషు దక్షః 🤺:-
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.🏌🏾

3. రూపేచ కృష్ణః🙏:-
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.👌

4. క్షమయా తు రామః🏹:-
ఓర్పులో రామునిలాగా ఉండాలి.పితృవాక్య పరి
పాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి

5. భోజ్యేషు తృప్తః🍲🥘🍛
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.

6. సుఖ దుఃఖ మిత్రం🤼‍♂:-
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.⛹🏼🎻

ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు 🏇🏼ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.                                                   🙏🏻🙏🏻🙏🙏

కలియుగములో...? Kaliyuga surprises

కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు కృష్ణ భగవానుని సమాధానం.
ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు.
శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు.
అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు.
భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.
నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యమేసింది. వెనుదిరిగాడు.
ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు.
నలుగురూ కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు.
ఆయన చెప్పనారంభించాడు.
కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు.
కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు.
కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తలిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం
చేస్తారు.
కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనం అవుతారు. భగవన్నామమనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడ లేరు.
....ఉద్ధవ గీత
శ్రీమద్భాగవతం

Eightwonders of sree puri jaganathmandir

‌Eight Wonders of Sree Puri Jagannath Mandir:

శ్రీ పూరి జగన్నాథుని ఆలయం గురించి ఎనిమిది అద్భుత విషయాలు:

1) ఆలయంపై జెండా ఎప్పుడు గాలికి “Opposite direction” లో రెప రెపలాడుతుంటుంది.

2) ఆలయంపై ఉండే సుదర్శన చక్రాన్ని మనం పూరి పట్టణంలో ఎక్కడ నుండి చూసినా మనవైపు చూస్తునట్టే కనిపిస్తుంది.

3) మామూలుగా అయితే సముద్రం నుంచి భూమి మీదకి గాలి వస్తుంది మరియు సంధ్యా వేళలో దానికి వ్యతిరేకంగా ఉంటుంది.
కానీ పూరి పట్టణంలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది.

4) పక్షులు గానీ, విమానాలు గానీ ఆలయ గోపురం మీద నుండి వెళ్ళవు.

5) ఆలయ గోపురం నీడ ఏ సమయంలోనూ, ఏ దిశలోనూ   కనిపించదు.

6) ఆలయంలో వండిన ప్రసాదం మొత్తం సంవత్సరం అంతా అలానే ఉంటుంది. దానిని దాదాపు 20 లక్షలు మందికి పెట్టవచ్చు. అయినా అది వృధా అవ్వదు, తక్కువ అవ్వదు!

7) జగన్నాథుని ఆలయంలోని వంటశాలలో వంట చెఱకుతో వెలిగే పొయ్యిలపై 7 మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు.
అయినా అన్నిటి కంటే పైన ఉండే మట్టిపాత్ర ముందు వేడి అవుతుంది, చివరిగా క్రింద ఉండేది వేడి అవుతుంది.

8) ఆలయంలోని సింహ ద్వారంలోకి ఒక అడుగు పెట్టగానే సముద్ర శబ్దం వినపడదు, అదే ఒక అడుగు వెనక్కి వేస్తే శబ్దం వినిపిస్తుంది.

జై జగన్నాథ్,
జై జై శ్రీ పూరీ జగన్నాథ్ జీకీ జై ...    ....సేకరించబడినది.....

Shri kalahasteeswara harati

*సూర్య గ్రహణ సమయంలో శ్రీ కాళ హస్తీశ్వరుని దివ్య దర్శనం శుభ ప్రదం. ముక్తి దాయకం.*

A beautiful devotional song


Sun ecilipse 21june2020

*సూర్యగ్రహణం*
 తేదీ : 21-06-2020  ఉదయం 11:58  శ్రీశార్వరినామ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య ఆదివారం .మృగశిర -4 , ఆరుద్ర -1 పాదాలు మిథున రాశి లో రాహుగ్రస్త అంగుళ్యాకారంలో సూర్య గ్రహణం సంభవిస్తోంది .

ఈ గ్రహణం భారతదేశముతో పాటు ఆసియా , ఉత్తర ఆస్ట్రేలియా , పాకిస్తాన్ , శ్రీలంక , ఆఫ్రికా మొదలగు ప్రాంతములయందు కూడా కనిపించును . చాలా ప్రాంతములలో పాక్షికముగా కనిపించును , డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ ) లో సంపూర్ణంగా కనిపించును .
*మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రముల వారు , మిథునరాశి వారు ఈ గ్రహణం అసలు చూడరాదు.*

*తెలంగాణ రాష్ట్రానికి*
గ్రహణ ఆరంభకాలం : ఉ . 10.14
గ్రహణ మధ్యకాలం : ఉ . 11.55
గ్రహణ అంత్యకాలం : మ . 1.44
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 30 నిమిషాలు
*ఆంధ్ర రాష్ట్రానికి*
గ్రహణ ఆరంభకాలం : ఉ . 10.23
గ్రహణ మధ్యకాలం : మ .12.05
గ్రహణ అంత్యకాలం : మ . 1.51
గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 28 నిమిషాలు
*గ్రహణ నియమాలు*
గ్రహణం రోజు అనగా 21-06-2020 ఆదివారం నాడు  ఉదయం 6 గంటల వరకు సామాన్య మానవులు అందరూ అన్నపానాదులు ముగించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం  ఉదయం 8 గంటల వరకు తినవచ్చు. అది కూడా అల్పాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ గ్రహణం మిధున రాశి వారు  మృగశిర, ఆరుద్ర  పునర్వసు  నక్షత్ర జాతకుల వారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ గ్రహణం చూడరాదు.

గ్రహణ పట్టు ,మధ్య , విడుపుస్నానాలు ఆచరించే వారు యాధావిధిగా స్నానం ఆచరించి,మంత్రానుష్టానములను నిర్వహించుకొవచ్చును.

గ్రహణం సమయంలో ఎవరి నక్షత్ర జపం వారు చేసుకోవచ్చును. లేదా మీకు ఏదైనా మంత్రానుష్టానం ఉంటే ఆ మంత్రం జపం చేసుకోవచ్చు. లేదా సూర్య గాయత్రి మంత్రం జపం చేసుకోవచ్చు.

*సూర్య గాయత్రి - ఓం ఆదిత్యాయచ విద్మహే మహా శుభగాయచ ధీమహి, తన్నోఆదిత్య ప్రచోదయాత్.*

   గ్రహణం  రోజు అనగా ఆదివారం మధ్యాహ్నం గ్రహణం విడుపు తర్వాత అనగా మధ్యాహ్నం 2  గంటలకు ఇల్లు శుభ్రంగా కడుగుకుని, స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు,రెండు హారతి కర్పూరం బిల్లలను చూర్ణం చేసుకుని నీళ్ళలో వేసుకుని తప్పక అందరూ తల స్నానం చేసుకోవాలి.ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్రపరచుకుని గాయత్రి ( జంధ్యం ) ని మార్చుకుని, దేవత విగ్రహాలను,యంత్రాలను "పులికాపి" చేయాలి. శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు,యంత్రాలు ప్రోక్షణ చేసి దీపారాధన అలంకరణం చేసి మహా నైవేద్యం కొరకు బెల్లంతో చేసిన మరమాన్నం వండి దేవునికి నివేదన చేసి హారతి ఇచ్చి మనస్సును ప్రశాంతగా ఉంచుకుని మూడు ప్రదక్షిణలు నిధానంగా చేసి మనస్సులో సమస్త గ్రహాదోష నివారణ కలిగించమని సాష్టాంగా నమస్కారం చేస్తూ విన్నవించుకోవాలి, ఆడవారు సాష్టాంగ నమస్కారం ఎప్పుడు ,ఎక్కడ చేయకూడదు.ఆడవారు కేవలం మోకాళ్ల పైనే చేయాలి.ముఖ్యంగా గర్భిణిలు నిలబడే నమస్కరించుకోవాలి,

     ముఖ్యంగా గర్భవతులు ఎలాంటి భయందోళన పడవలసిన అవసరం లేదు. గర్భవతులు ఎవరైన గ్రహణం ప్రత్యక్షంగా చూడ కూడదు, మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మీకు మరీ మంచిది. గ్రహణ సమయంలో కదలకూడదు,మల,మూత్ర విసర్జన చేయకూడదు. గ్రహణం ప్రారంభానికి ముందే కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఎవరినైనా పెద్దవారిని పక్కన కూర్చోబెట్టుకుని వారి ద్వారా సపర్యలు పొందాలి.

  ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి, దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల వచ్చును. మిధున, కర్కాటక,వృచ్చిక మీన రాశుల వారు తగు గ్రహాణ దోష పరిహార ప్రక్రియలను మీకు అనుకూలమైన పండితులను సంప్రదించి దోష పరిహార జప,దానాదులను చేసుకోవాలి.ద్వాదశ రాశుల వారు గోమాతకు బియ్యం, తోటకూర,బెల్లం గోధుమలు కలిపి ఆవునకు తినిపించాలి. గోమాత మనం పెట్టిన దాన్యం తినేప్పుడు మూడు ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను గుమ్మంపై నుండి తీసివేసి మళ్లి కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితులచే పూజించి ఇంటికి,వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి.గ్రహణం తర్వత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి,కొబ్బరి కాయలు శక్తి కోల్పోతాయి.కాబట్టి తిరిగి మనకు,మన కుంటుబ సభ్యుల కొరకు ,ఇంటికి,వ్యాపార సంస్థల రక్షణ కొరకు తప్పక కట్టుకోవాలి.
*శుభఫలం* మేష , మకర , కన్య , సింహ రాశులకు
*మధ్యమ ఫలం* వృషభ , కుంభ , ధనుస్సు , తుల రాశులకు
*అధమ ఫలం* మిథున , మీన , వృశ్చిక , కర్కాటక రాశులకు వారికి అధమ ఫలం .
మిథునరాశివారు ఖచ్చితంగా గ్రహణ శాంతి చేయించుకోవాలి  .
.  ప్రజలు అందరూ కూడా ఈ సమయంలో సూర్యభగవానుడు కి తగిన శాంతులు చేసి ఈ కరోనా నుండి ప్రపంచాన్ని కాపాడమని వేడుకుందాం...

అన్నింటికంటే భగవంతుని దయ ముఖ్యం ....మీ ఇష్ట దైవాన్ని నమ్ముకొని నడుచుకోవాలి ...అప్పుడు ఆయన. ..మనలను కాపాడుతూఉంటాడు ..స్వామి వారి.. లేక అమ్మ వారి పాదాలను గట్టిగా పట్టుకోవాలి ..మనస్సులో .....పట్టుకొని ప్రార్థిస్తున్నట్లు ...ధ్యానం చేసుకున్నా పర్వాలేదు ..సాయుసచ్చరిత పారాయణం......లేక శ్రీవిష్ణు సహస్రనామాలు చదువుకోవచ్చు ...లేదా శివాభిషేకం చేయంచుకోవచ్చు ....లేదా గోవింద నామాలు చదువుకోవచ్చు ...హనుమా న్ చాలీసా ...ఓం నమో వెంకటేశాయనమః ....ఇక మీ ఇష్ట0 ...ఒక్కరే దైవం ...రూపాలు అనేకం ..
  గ్రహణం   తరువాత ..    ఇక ఇల్లు అంతా ...సర్దుకోవడం కుదరదు ...ఓపిక ..తీరిక ఉండకపోవచ్చు ...గ్రహణం తరువాత రోజు అయినా తల స్నానం పూర్తి చేసి ..ఇల్లు అంతా పసుపు నీళ్ళు చల్లుకో0డి ...దేవుని గది లేక అలమర కొద్ది గా తుడుచుకుని పసుపునీళ్లు కొద్దీ కొద్దిగా జల్లు కోవచ్చు
ఏది.. ఏమైనా ..జ్యోతిష్యం.. సోషల్ మీడియా... లో భయ భ్రాంతులకు .మనం లోను కాకూడదు .ఎందుకంటే ...భగవంతుడిలోనుంచి ...ఈ ప్రపంచం పుట్టింది .....అందుకే ..శివ కేశవుల ఆజ్ఞ లేనిదే ఏమి జరగదు ...అన్నిరూపాలు ...వారే ..కాబట్టి భగవంతుని పైభక్తి కల్గి ఉండండి ...భగవంతుని ...మనస్సులో ఒక్కనిమిషం తలుచుకొని ధ్యానం చేయండి ....భగవంతుని కోసం తపించండి ....చాలు .కనీసం ఆయన నామం ...మనస్సులో ఉచ్ఛరించండి.  నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. 

16thjune20and14thjuly2020 importance

జయ జయ శంకర - హర హర శంకర

భౌమాశ్విని - 16th-Jun-2020 & 14th-July-2020

భౌమాశ్విని (అశ్విని నక్షత్రంతో కూడిన మంగళవారం అరుదుగా లభ్యమయ్యే యోగం.) నాడు దేవీ అధర్వశీర్షం ప్రకారం దేవీమంత్రపారాయణ చేయడం ద్వారా మహామృత్యువును కూడా తరమవచ్చు. కంచి కామకోటిపీఠ మూలామ్నాయ సర్వజ్ఞపీఠాధిపతులు,  జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ మహాస్వామి వారి సందేశ సారం

భౌమాశ్విన్యాం మహాదేవీసన్నిధౌ జప్త్వా మహామృత్యుం తరతి !
స మహామృత్యుం తరతి ! య ఏవం వేద ! ఇత్యుపనిషత్!

భౌమాశ్విని పర్వదినం నాడు అనగా 16 Jun 2020 మంగళవారం, ఏకాదశి తిథి, అశ్విని నక్షత్రం నాడు అమ్మవారి అనుగ్రహం కోసం సర్వులూ శంకరులు కైలాసం నుంచు తెచ్చిన మంత్రరూపమైన స్తోత్రం సౌందర్యలహరి, లలితా సహస్ర నామ పారాయణం, విరాట పర్వంలోని అమ్మవారి స్తోత్ర పారాయణం, సప్తశ్లోకి పారాయణం, దుర్గా చంద్రకళా స్తుతి పారాయణం, అచ్యుతానంతగోవింద నామజపం యథాశక్తి చేయవలెను. చండీపాఠ పారాయణం, జపం, హోమం ఇంట్లోకానీ, గుడిలోకాని ప్రజలు ఎక్కువ గుమిగూడకుండా, ప్రజా క్షేమం కోరి నిర్వహించాలి. ఈ భౌమాశ్వని పర్వకాలంలో చేసే అనుష్ఠానానికి మన నిత్య అనుష్ఠానానికన్నా ఎక్కువ ఫలితాలుంటాయి. యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ..

రోగానశేషా నపహంసి తుష్టా దుష్టాతుకామాన్ సకలాబభీష్టాన్
త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యా శ్రయతాం ప్రయాంతి !!

స్వర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి
ఏవమేవ త్వయా కార్యం అమద్వైరి వినాశనం !!

ఈ సందర్భంగా అమ్మవారి అనుగ్రహం తో పరాశక్తి అనుగ్రహంచేత మహాశక్తిమంతులుగా మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రార్థన - ప్రయత్నం రెండూ చేసుకోవాలి...

- కంచి కామకోటిపీఠ జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ మహాస్వామి

జీవుడు పైకి వెళ్ళి మాళ్ళీ భూమి పై ఎలా పుడతాడు ...what about rebirth

🕉️🟢🕉️🟢🕉️🟢🕉️🟢

*జీవాత్మ - పుట్టుక*

      మరణ సమయంలో జీవాత్మ మరోలోకంలోకి వెళ్ళి,
     తన కార్యాల ఫలాన్ని అనుభవిస్తూ,
      ఆకాశంలోకి ప్రవేశిస్తాడు.
 
      ఆకాశంలోకి ప్రవేశించిన జీవాత్మ,

(i) గాలిగా మారి, అగ్నిలో చేరతాడు,
(ii) పొగగా మారి, జలంలో చేరతాడు.
(iii) జలంగా మారడం వల్ల, మేఘంలో చేరతాడు.
(iv) మేఘం వర్షించినప్పుడు, ఆ జీవాత్మ, చెట్లు - చేమలలో ప్రవేశిస్తాడు.
(v) చెట్లు - చేమల నుంచీ వచ్చే ఆహారంగా అన్నంలోకి ప్రవేశిస్తాడు.
(vi) అన్నం నుంచీ శుక్ల - శోణితాలుగా రక్తంగా మారుతాడు.

      అప్పుడు జీవాత్మ తనకు తగిన శరీరంలోకి ప్రవేశించి,
      మాతృగర్భంలో పెరిగి,
      మరల జన్మిస్తాడు.

      ఈ విధంగా జీవాత్మ అంతంలేని పరకాయ ప్రవేశాలు చేస్తూ, లెక్కలేనంతమంది జీవాత్మలలో తానూ ఒకడవుతాడు. అదే మళ్ళీ జనన.. మరణ చక్రం లోకి ప్రవేశించడం ...పైన లోకాల్లో పుణ్యం... అంటే స్వర్గం
పాపం అంటే నరకం ...ఈ రెండూ అనుభవించి మళ్ళీ జన్మ ల్లోకి ప్రవేశించి భూలోకం లోకి వస్తాడు ..ఇది హిందువులు నమ్మకం అందుకే ...ప్రతిసారి ఇలా జన్మ లు ఎత్తడం ..కష్ట నష్టాలు పడటం ఇదంతా ఎందుకు ఇది తప్పించుకోవడమే మోక్షం ...దానికోసం కృషి చేయాలి ...దాన్నికోసమే ..మనిషి జన్మ చివరివరకు భగవంతుని సేవ చేయాలి ..ఆయన నామం సదా జపిస్తూనే ఉండాలి ...పుణ్యం చేసినా గుర్తుపెట్టుకోకూడదు ..ఏమీ ఆశించకుండా ...భగవంతునికే ..ఆ ఫలితం ..ఆ క్రెడిట్ ఆయనదే ..అని ఆయన కే సమర్పించివేయాలి  .ఎల్లప్పుడూ గోవింద నామాన్ని భజించమని చెప్పారు ..ఇక అదే స్నానం..అదే పానం ఆయనరూపాన్నీ మనస్సులో.నింపుకొని.. జపం చేసుకోవడమే ...శంకరాచార్యులవారు చెప్పిన భజగోవిందం ..
ఇక ...నాస్తిక వాదులు ...ఆధునికులు ....అస్సలు మోక్షం అంటే ..చనిపోయి ఈ కష్ట.. నష్టాలు నుంచి బయట పడటమే .....salvation ..అంటారు...అలానే భూమి మీద కష్టాలు నష్టాలు రోగాలు ఇవన్నీ శిక్షలే ..సుఖాలు.. భోగాలు ..ఇవి అన్నీ స్వర్గాలు ..అంతే కాని పై లోకాల్లో నూనె డబ్బాలు ...గ్యాస్ పోయిలు ..పెనాల్లో వేయుంచడం ...ఇవన్నీ ఏమి లేవు బోగస్ అని కొట్టి పడేస్తూఉంటారు .ఏది ఏమైనా ఒకళ్ళకు ...ఒక జీవి కి ఏ కష్ట నష్టాలు పెట్టకుండా ..మన బ్రతుకు మనం బ్రతికి తే అదే దైవత్త్వం ...అదే పుణ్యం .

"పునరపి జననం - పునరపి మరణం
 పునరపి జననీ జఠరేశయనం I
 ఇహ సంసారే బహుదుస్తారే
 కృపయాపారే పాహి మురారే ॥"
 
 "భజ గోవిందం భజ గోవిందం I
     భజ గోవిందం మూఢమతే ॥"

                          =x=x=x=

బాల్యములో..శ్రీ కృష్ణభగవానునిఒక గొప్పలీల

భాగవతం, దశమస్కంధంలో 'ఉలూఖల బంధనం' అనే ఒక అద్భుతమయిన శ్రీకృష్ణ లీల ఉంది. భాగవతం మొత్తం మీద తలమానికమయిన లీల ఇది.

బాల కృష్ణుడి అల్లరి అధికం కావడం చూసిన యశోద ఇలా అనుకుంది - 'అయితే, గోపికలు చెప్పింది యథార్థమేనన్నమాట. వీడు చాలా అల్లరి చేస్తున్నాడు, ఏదో ఒకటి చెయ్యాలని, తాడుతో కట్టి పడేస్తానని' అనుకుంది. అక్కడున్న గోపకాంతలందరూ యశోద ఏమి చేస్తుందా? అని పరిశీలిస్తున్నారు. అపుడు యశోద, 'కన్నయ్యా! ఈవేళ నిన్ను పట్టుకుంటాను, కట్టేస్తానని' అంది. అలా, అనగానే కోతులకు పెడుతున్న వెన్నను వదిలేసి ఆ రోలు మీదనుంచి దూకేశాడు కృష్ణయ్య. కృష్ణుడిని పట్టుకుందామని ఆవిడ వెతుకుతూ దగ్గరకు వెళ్ళింది. ఆయన పరుగెత్తుకుంటూ వెళ్ళి స్తంభం చాటున నక్కేవాడు. 'అమ్మా నేనింక ఎప్పుడూ దొంగతనం చేయను, ఎవరింటికీ వెళ్ళను, వెన్న తిననే తినను, నన్ను కొట్టకని' కళ్ళు నులిమేసుకుని ఏడవడం మొదలుపెట్టాడు. అలా, కళ్లు నులుపుకోవడంతో అరచెయ్యి, బుగ్గలు అంతా కాటుక అయిపొయింది. ఈ లీల జరుగుతుంటే 33 కోట్ల మంది దేవతలు, బ్రహ్మదేవుడు ముక్కున వేలేసుకుని చూశారు. ఆ బాలకృష్ణుడు, ఆ రోజున అంత భయాన్ని నటించాడు.

యశోద ఎంత అదృష్టవంతురాలో! ఎవరికీ దొరకని పరమాత్మ ఆమె చేతికి దొరికిపోయాడు. అపుడు ఆమె కృష్ణుడిని కట్టెయ్యడం కోసమని, అక్కడ కవ్వానికున్న తాళ్ళు తీసి, కన్నయ్య బొజ్జ చుట్టూ తిప్పుతే, రెండంగుళాలు తక్కువ పడింది. ఎన్ని తాళ్లు తెచ్చి ముడివేసి కట్టినా, రెండంగుళాలు తక్కువ వస్తోంది. అప్పుడు పోతనామాత్యుడు అద్భుతమైన పద్యం వ్రాస్తాడు.

                      *చిక్కడు సిరి కౌగిటిలో,*
                      *జిక్కడు సనకాది యోగి చిట్టాబ్జములం*
                      *జిక్కడు శృతిలతికావలి*,
                      *జిక్కెనాతడు లీల దల్లి చేతన్ రోలన్.*

'ఆయన, లక్ష్మీదేవి కౌగిలించుకుందామనుకుంటే ఆమె కౌగిలికి దొరకడు, సనక సనందనాది మహర్షుల మనస్సులకు చిక్కడు, వేదమంత్రాలకు దొరకడు, ఇప్పుడు అమ్మ చేతికి దొరికి రోటికి కట్టబడ్డాడని' అంటాడు.

అలా, చివరికి యశోదాదేవి కృష్ణుడిని త్రాటితో రోటికి కట్టేసి నీతులు చెప్పడం ప్రారంభించింది. అపుడు నిజంగా కొడుతుందని భయపడిన వాడిలా అమాయకంగా చూస్తున్న స్వామికి, శరీరం పైన శ్రీవత్స చిహ్నం తప్ప మరొక మచ్చలేని స్వామికి, పొట్టభాగం అంతా తాడుతో నలిగిపోయి గుర్తు పడిపోయింది. రెండంగుళాల తాడు తక్కువ అవడం అంటే? భగవంతుని పూజ చేసేటప్పుడు మనం ఎందుకు పూజ చేస్తున్నామో మరిచిపోవాలి. నా స్వామికి ఇది చేయకుండా నేను ఎలా ఉండగలను? అనే భావాన పెరగాలి. అపుడు మనం చేసిన పూజకు ఫలితముంటుంది. ఒక ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నాను, నేను ఈ పూజను చేస్తున్నాను అనే రెండు భావనలను మరిచిపోవాలి. అపుడు పూజలో తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోతారు. ఈ రెండు భావనలను మరచి పోవడమే తాడు రెండు అంగుళాలు తక్కువ అవడం. (ఇక్కడ కొంతమంది వ్యాఖ్యాతలు ఆ రెండంగుళాలే అహంకార, మమకారాలు. వీటిని మరచిపోతే పరమాత్మ మన మనస్సులో బంధింపబడుతాడని అంటారు. ఇది కూడా బాగుంది). అట్టి తాదాత్మ్యానికి ఈశ్వరుడు పొంగిపోతాడు. కేవలము భక్తి చేత మాత్రమే పరమాత్మ వశుడవుతాడని చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనం. ఇక్కడ పరమాత్మ యశోద ప్రేమపాశానికి లొంగి ఆమెకు పట్టుబడిపోయాడు.⁠⁠⁠⁠ అలాగే, అంతటి నిష్కల్మషమైన భక్తిని చూపించి చరితార్థులైన భక్తాగ్రగణ్యులు మన భారతదేశంలో ఎంతో మంది జన్మించి చరితార్థులయ్యారు. వారిని ఇప్పటికీ స్మరిస్తూనే ఉన్నాము ...................................... సేకరణ......

Gas trouble some remedies part - 2


.ఇప్పటివరకు మనం gastrouble గురించి చర్చించాము ..దీనిలో ఇంకొక ముఖ్య విషయం acid refluxion అనేది ఒక ముఖ్య సమస్య మనం ఆహారం తీసుకోగానే ఈసోపేగస్. ..అనేఒక ట్యూబ్ లాంటి ప్రేగుద్వారా అది జీర్ణశయం లోకి వెళ్తుంది .అక్కడ ఆహారం జీర్ణం చేయడం కోసం అక్కడ ఆమ్లం ..అదే acid వ్యుత్పత్తి అవుతుంది అక్కడ తగినంత ఆహారం లేకపోతే ..ఆమ్లం అక్కడి ప్రేగు కండరాలపై ప్రభావం చూపిస్తుంది ..acid అనేది దేనినైనా కాల్చేస్తుంది ..అందుకే కడుపులో మంట వస్తూ వుంటుంది.ఇంకా పొగలు లా పైకి గొంతువరకు చిమ్ముతుంది అందుకే కొంతమందికి పొడిదగ్గు గొంతుమంట కూడా వస్తూఉంటుంది నోట్లోకి కి కూడా చేదు గా వస్తూఉంటుంది .ముఖ్యంగా కొద్దిపాటి ఖాళీ కూడా మిగల్చకుండా ఫుల్లుగా తినేయడం ..తినగానే పడుకోవడం ...ఆహారం లో కొవ్వులు ఎక్కువగా ఉండటం ,ఉప్పు, కారం మసాలాలు అధికంగా తినడం,..మనం తినే ఆహారంలో పీచుపదార్థాలు అస్సలు లేకపోవడం (...అలాంటప్పుడు ప్రేగు కండరాలు పై acid ప్రభావం ఎక్కువగపడుతుంది )ఇలాంటి పొరపాట్లు వల్ల కడుపులో మంట ,అది ముదిరి అల్సర్లు వస్తాయి . ఆహారనాళం జీర్ణకోశం కలిసే చోట ఒక జంక్షన్ లాంటి భాగం ఉంటుంది ఆ జంక్షన్ పై మూత లాంటి నిర్మాణం ఉంటుంది ...దీనిని వైద్యులు జీ ఈ జంక్షన్ అని పిలుస్తారు .ఇది ఒక రకం మూత లాంటి ది ...ఒకసారి ఆహారం జీర్ణకోశం లోకి వెళ్ళిన తరువాత ...ఈ మూత లాంటి ది అడ్డుపడి ఆహారాన్ని మళ్ళీ పైకిరాకుండా చేస్తోంది ...అయితే కొన్ని సందర్భాల్లో ఈ మూత బలహీనంగా అవడం వల్ల మెతుకులు గొంతులోకి రావడం ,gas రావడం acid రావడం జరుగుతూఉంటాయు...అయితే కండరాలు మృదువుగా ఉండాలి ,అక్కడ ఎంజైములు సక్రమంగా స్రవించాలి అప్పుడు ..ఆ.. మూత మంచిగా మూసుకుపోతుంది అయితే .. కొన్నిరకాల మందుల వాడకంవల్ల కడుపులోని ఆ మూత కండరాలకు మంచిగా ఆదేశాలు అందకపోవడం వల్ల మూత బలహీన పడిపోతుంది .ఆలానే ఆల్కహాల్ త్రాగడం వల్ల కూడా ...ఆ మూత కండరాలకు బద్దకం వస్తుంది ....ఆహారం..వాళ్లకు కూడా తాగి పడుకున్నప్పుడు నోట్లోకి చేదుగా ఆహారం వస్తుంది .అంతే గాక కొన్ని రకాల మందుల వల్ల కూడాగ్యాస్ బాధ వస్తూఉంటుంది .

.... ఒకేసారి ఎక్కువ ఆహారాన్నికాకుండా కొంచెం ..కొంచెం గా తింటూ ఉండాలి ..లేదా కొంచెం తక్కువ ఆహారం తినాలి ..పొగత్రాగడం ..మధ్య పానం లాంటి అలవాట్లు మానుకోవాలి ...రాత్రిపూట చాలా ఆలస్యంగా భోజనం చేయకూడదు ...ఆ సమయంలో చిరుతిండ్లు తినడం మంచిది కాదు ...అలానే తినగానే పడుకోకూడదు కొద్దిసేపు. గ్యాప్ ఉండాలి వైద్యులు రెండు గంటలు గ్యాప్ ఉండాలి అంటారు .కానీ కొంతమందికి అంత గ్యాప్ ఉంటే నిద్ర పట్టదు ...అందుకే అలాంటి వారు తిన్నతరువాత మీకు ఎంత గ్యాప్ అయితే మీకు వీలుగా ఉంటుందో అది చేసుకొండి ...కాకపోతే...గ్యాస్ బాధితులు ఎవరైనా సరే రాత్రివేళ ఎడంవైపుకు...ఒరిగి పడుకోవాలి ..అదే కుడివైపుకు తిరిగి పండుకుంటే ఆ స్ట్రింకర్ ..మీద వత్తిడి పడి తెరుచుకొని ఆహారం.. ..యాసిడ్ గ్యాస్ మళ్ళీ వెనక్కు రావచ్చు .అందుకు కొద్దిసేపు అయినా ఎడమ వైపుకు తిరిగి పడుకోవాలి ...అలానే తలగడ కూడా తలవైపు ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి..అదికూడా మెడ క్రింద భుజాలు వరకు ఉండేలా దిండు పెట్టుకోవాలి .ఇక ఆహారం లో ఎక్కువ ఆకు కూరలు వాడటం చేస్తూఉండాలి....ఇంకా పుల్లని పెరుగు ,పుల్లని మజ్జిగ వాడకూడదు,అలానే చిక్కని పుల్లని పులుసులు వాడకూడదు .దానివల్ల ప్రేగులలో acid సమస్య ఎక్కువ అవుతుంది ...అందుకే కడుపులో తాజాగా వుండే పెరుగు ను తీసుకోవడం వల్ల ..అక్కడ ..బాక్టీరియా నియంత్రించబడి కడుపులో మంటను తగ్గిస్తాయి

.....ఇంగ్లీష్ మెడిసిన్ లో gas refluction tఒక్కోక్కసారి 8onic medical షాప్ లో దొరుకుతుంది ..అది భోజనం కాగానే రెండు స్పూన్ లు నీటితో కల్పిత్రాగ మని వైద్యులు చెబుతారు ..ఆ tonic ఎక్కువగా ఊరి బాధపెడుతున్న acid ని పీల్చేసుకుంటుంది .....ఇంకా ముదిరికడుపులో పుళ్ళు ,మంట గాయం తో బాధ పడుతూఉంటారు వాళ్ళకు ..పండిన బొప్పాయగుజ్జు తినాలి అది గాయాల ను సూతి0గు లా చేస్తోంది ..ఆలోవేరా లోని గమ్ బిళ్ళలు ని తీసి కొద్దిగా 3,..4 స్పూన్ లు రెండుపూటలా త్రాగితే కూడా గాయం నయం అవుతుంది ..ఇక ఆయుర్వేదంలో ద్రాక్షాస్తవం అనే టానిక్కు తెచ్చుకొని దానిని కూడా త్రాగవచ్చు అయితే పులుపు కారం మసాలా జంక్ ఫుడ్ మానేసి బార్లీ జావా ,పులుపులేని మజ్జిగ తో అన్నము తింటూఉండాలి దీనికి గృహ వైద్యం లో ఎండు.ద్రాక్ష 3 +కరక్కాయ చూర్ణం 3 గ్రాములు కలిపి 3పూటలా లోపలికి తీసుకోవాలి. ఏలక్కాయ1+జీలకర్ర పావుచెంచా +అరచెంచా ధనియాల పొడి ...మొత్తం కలిపి మూడుపూటలా సేవించాలి ఇంకా కడుపులో పుండ్లు అల్సర్ నయం కావడానికి అశ్వగంధ లేహ్యం లేదా చూర్ణం ఉదయం సాయంత్రం లోపలికి తీసుకుంటూ దానితో పాటు ..కూష్మండ లేహ్యం అంటే గుమ్మడికాయ తో చేస్తారు ..దానిని పావు స్పూన్ ఉదయం ...పావుస్పూన్ సాయంత్రం లోపలికి తినాలి.

 .. ఇక క్రింద నుంచి అపాన వాయువు సమస్య కొంతమందిలో ఉంటుంది .....చాలా వేగంగా ఆహారం తినేవారు ,వేగంగా త్రాగేవారు ,పొగ త్రాగడం ,చూయింగ్ గమ్ నమిలే వారు ,కూల్ డ్రింక్స్ ఎక్కువగా త్రాగేవారు ,వదులుగా కట్టుడుపళ్ళు ఉండేవారు ...వీరు అంతా గ్యాస్ ఎక్కువగామ్రింగేస్తుంటారు .అలానే బీన్స్ ,బ్రాకూలీ,కాలీ ప్లవర్ ,క్యాబేజీ ఉల్లిగడ్డలు పీయర్స్ ,యాపిల్స్ గోధుమలు, చీజ్, ఐస్ క్రీమ్స్ ,బ్రెడ్స్ తినే వారిలో క్రింద నుంచి gas అపాన వాయువులు సమస్య ఎక్కువగా ఉంటుంది .దీనికి మలబద్దకం లేకుండా ఉత్త gas అయితే వాసన ఉండదు అలా ఉత్త gas కడుపుఉబ్బరం తో బాధ పడుతుంటే అవిపత్తికర్ టాబ్లెట్ స్ అని ఆయుర్వేదం లో ఉంటాయి .ఒక డబ్బా తెచ్చుకొని రాత్రివేళ ఒక టాబ్లెట్ భోజనం అయిన తరువాత వేసుకొవాలి .అలా కొద్దికాలం వాడితే సమస్య పోతుంది ..కొంతమందికి మలబద్దకం ఉండి smell తో కూడిన gas పెటుతూవుంటారు ...వాళ్ళు కాయంచూర్ణం అనే ఒక డబ్బా తెచ్చుకొని రాత్రివేళ భోజనం తరువాత పడుకొనేముందు ఒక స్పూన్ కాయంచూర్ణం పొడి తీసుకొని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని త్రాగి పడుకోవాలి ఉదయం 6 గంటలకు మోషన్ అయిపోతుంది ..దేనిని వృద్ధులు కూడా వాడుకోవచ్చు ...లేదా ..అభయాదిమోద క్ అనే ఆయుర్వేద టాబ్లెట్స్ దొరుకుతాయి అవి తెచ్చుకొని రాత్రి పడుకునే ముందు ఒక టాబ్లెట్ వేసుకుంటే ఉదయం మోషన్ అవుతుంది .

ఇంకో సమస్య IBS అంటే irretible bavel syndrome ...దీనివల్ల సాధారణ ఆరోగ్యానికి ప్రమాదం కానీ ఇబ్బంది కానీ ఏమీ ఉండదు .కాకపోతే మామూలు జీవనానికి ఒక ఇబ్బంది .ఇది ఎక్కువగా కొన్ని రకాల టెన్ష్ న్స్ అప్పుడు వస్తూఉంటుంది ..బైటకు ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు ,ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు ..బస్సు ప్రయాణం అన్నా అలాంటప్పుడు వచ్చే యాంగ్జైటీ వల్ల బాత్రూముకి ,..లెట్రిన్ కి వస్తున్నట్లు అనిపించే ఒక సైకాలాజికల్ పరిస్థితి .ఒక్కోక్కసారి భోజనం పూర్తికాగానే వెళ్ళాల్సివస్తుంది ..ఒక్కసారిగా కడుపులో నొప్పి ..నీళ్ళవిరేచనాలు ..కొద్దికొద్ది గా వెళ్ళాల్సిరావడం అలా వెళ్లివస్తుంటే కడుపులో నొప్పి తగ్గుతూవుంటుంది .ఇక ఇది కేవలం సైకాలజికల్ ప్రాబ్లమ్ ఇది ఎక్కువ stress.. డిప్రెషన్ లో ఉన్నవాళ్లకు ఈ సమస్య కనిపిస్తుంది .దీనికి కూడా ulserx అని ఆయుర్వేదంలో టాబ్లెట్స్ వుంటాయి.అది ఒక డబ్బా తీసుకొని పరగడుపున ..1....రాత్రి పడుకొనేటప్పుడు..1 వేసుకోవాలి ...లేదా ఇంగ్లీష్ మందుల్లో అయితే zentac150 ఉదయం brekfast తరువాత1....రాత్రి పూట తిన్నతరువాత ...1..వేసుకోవచ్చు అలా కొద్దిరోజులు వాడి ...stress.. depression తగ్గించుకుంటే మందులు అవసర0 లేదు ..కాకపోతే ...ఈ రెండు మందులు...safedrugs అనిచెప్పవచ్చు.అస్సలు ...gas.. సంభంధం.. మైన అన్నింటికోసం ఇంగ్లీష్ వైద్యులు pantop..20....ఇంకా సమస్యలు.. ఎక్కువగా ఉంటే pantop40 .పరగడుపున వేసుకోమని ఇస్తూఉంటారు ..కొద్దిరోజులు వాడించి మా నిపిస్తారు ....

ఇంకా గృహ వైద్యం లొచేసుకునే ఓపిక ఉంటే ........త్రికట్టుచూర్ణంకొద్దిగా (అనగా.శో0ఠి+మిరియాలు+పిప్పళ్ళు ) ...తీసుకొనిదానికి రెండుయాలకులు +జీలకర్ర కొద్దిగామొత్తం దంచి కషాయం కాచి ..దానిలో తాటికలకండ వేసుకొని షుగర్ వాళ్లుకొద్దిగా వేసుకోవాలి వేసుకోకపోయినా పరవాలేదు ......భోజనం తరువాత... అర్థగంట తరువాత..త్రాగితే కడుపుఉబ్బరం ,మంట ,పుల్లని త్రేల్పులు అన్నీ పోతాయి ...లేకపోతే ఆయుర్వేదం షాప్ లో హింగువాస్ట్ క చూర్ణం తెచ్చుకొని ఒక పావు చెంచా నోటిలో వేసుకొని ....భోజనం తరువాత ..నీళ్లు త్రాగిన.కూడా same result ఉంటుంది ..
...ఉసిరికాయల పెచ్చులు తీసి మిక్సీ లో రసం తీసుకోవాలి ..+...అలానే కొద్దిగా అల్లం రసం కూడా తీసుకోవాలి దీనిలో తాటికలకండ వేసి మరిగించాలి చిక్కని రసం అయిన తరువాత ...తీసి పక్కన పెట్టుకోవాలి ..తరువాత 1 స్పూన్ రసం దానిలోనించి తీసుకొని +దానికి 2 స్పూన్ల మంచినీరు కలిపి భోజనం చేసిన అర్థ గంట తరువాత త్రాగాలి ..సమస్య ఎక్కువగా ఉంటే రెండుపూటలా చేయండి ....దీనివల్ల పుల్లని త్రేల్పులు ..కడుపుఉబ్బరం ..అజీర్ణం ..నాలుక..నోరు లో రుచి లేకపోవడం ..ఈ సమస్యలు ను తగ్గించి ..కడుపుని సరిచేసి జీర్ణశక్తిని, జీర్ణక్రియ ని మెరుగుపరచి మూలమైన జట
రాగ్ని ని పెంపొందింపచేస్తుంది ..అని ఒక గొప్ప ఆయుర్వేద పండితులు మణి ఒకసారి టీవీ లో చెప్పారు కూడా .

ఇక ..సూత శేఖర రస అనే tablets ఆయుర్వేదంలో ఉంటాయి ..ఒక డబ్బా తెచ్చుకొని రోజూ వాడిన కూడా పై సమస్యలు అన్నింటికీ పరిష్కారం లభిస్తుంది.
..ఇంకా గృహ వైద్యం లో తెల్ల ఉల్లిపాయ ను ఎక్కువగా వాడతారు ...ఇదికూడా ఒక పెద్దాయన మణి తమిళనాడు ఆయుర్వేద వైద్యులు టీ.వి లో చెప్పినదే ..నేను ఇక్కడ వివరిస్తున్నాను ..ఒక తెల్ల ఉల్లిపాయ ను తీసుకొని పేస్ట్ లా చేసుకోవాలి .ఒక గిన్నె తీసుకొనిదానిలో కొద్దిగా నువ్వుల నూనె వేసుకోవాలి .దానిలో తెల్లఉల్లిపాయ పేస్ట్ +కలబందుగుజ్జు బిళ్ళ తీసుకొని పంపుక్రింద ఏడు సార్లు కడగాలి ..దానిని కూడా వేయాలి +కొంచెం జీలకర్ర వేయాలి కొద్దిగా నీళ్ళు పోసి వుడికించాలి ...ఆ కషాయం తీసుకొని రోజూ పరగడుపున ఒక స్పూన్ త్రాగాలి ...దానివల్ల కడుపులో గ్యాస్ ,పుండు ,అల్సర్ అన్నీ తగ్గిపోతాయి, కడుపులో మంట ,పుల్లని త్రేల్పులు ,కడుపుఉబ్బరం అన్నీ తగ్గిపోతాయి.ముఖ్యంగా మందులువాడుతూ stress free ని చేసుకోవడం మంచిది .భోజనం వేళలు పాటించడం ,ఉప్పు,కారం పులుపు బాగా తగ్గించి తినాలి ...పులుసులు ,సాంబార్లు కొంతకాలం మానివేసి పలుచని టమాట చారు కానీ ,మామిడికాయ తో చారు కానీ భోజనం తీసుకోవాలి .



P.s. Alsarex పరగడుపున ఒక tablet రోజూ వేసుకోవాలి ...gas సమస్యలు కు మంచిపరిష్కారం.. సమస్య ఎక్కువగా ఉంటే సాయంత్రం కూడా ఒక టాబ్లెట్ వేసుకోవచ్చును ...
అలానే పైన మందులు కూడా gas సమస్యలు కు మంచి పరిష్కారం 









Namakam... chamakam. Rudramvisistata

🌹రుద్రం విశిష్ఠత  🌹

శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది.

రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. ఇది వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది. రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చేది మొదటి భాగం. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వలన దీనిని చమకం అంటారు.

నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ |
నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||

నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతి దినం ఎవరు చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం  ప్రాప్తిస్తుంది.

🌹 నమకం విశిష్టత : 🌹

నమక, చమకాలలో 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని “అనువాకం” అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయుధాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.

🌻 అనువాకం – 1:
తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి,  జబ్బులనుండి కాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనం చేస్తుంది.

🌻 అనువాకం – 2 :
ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.

🌻 అనువాకం – 3:
ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. ఈ అనువాకం వ్యాధి నివారణకు కూడా చదువుతారు.

🌻 అనువాకం – 4:
ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.:

🌻 అనువాకం – 5:
ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా – సృష్టి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింప బడడం మరియు మోక్షప్రదానం.

🌻 అనువాకం – 6:
ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.
ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షణకు కూడా చదువుతారు.

🌻 అనువాకం – 7:
నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, మొక్షంకోసం కూడా చదువుతారు.

🌻 అనువాకం – 8:
ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాయ్జ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.

🌻 అనువాకం –9:
ఈ అనువకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ శక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం,  మంచి సహచారి కోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.

🌻 అనువాకం – 10:
ఈ అనువాకంలో మరలా రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపశమించి, పినాకధారియైన, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వ వలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.

🌻 అనువాకం – 11:
ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. ఈ అనువాకాన్ని  తమ సంతాన సౌఖ్యం కోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్థ దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.

🌹 చమకం విశిష్టత: 🌹

నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని  తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది.

జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని  ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేదు. సమస్తం అతనినుంది ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే..
🌹 🌹 🌹 🌹 🌹🌹🌹
🙏.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సేకరణ........

Benefits of walking


1౦8శ్రీవైష్ణవ దివ్య క్షేత్రములు 108 sree vaistnva divya kshetras

జైశ్రీమాన్న్నారాయణ...
108  వైష్ణవ దివ్యక్షేత్రాలు....
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
వైష్ణవులకు అత్యంత పవిత్రమైన  క్షేత్రాలు 108 వున్నాయి. పన్నిద్దరు (12)ఆళ్వారులు  తమ  రచనలైనా  పాశురములలో  ఈ 108 విష్ణు రూపాలను కొలిచారు. ఇందులో 105 భారతదేశం లో  1 నపాల్  మరియు మిగతా 2దివ్య తిరుతులు  భూమిలి   వెలుపల వున్నాయి... 
🌷🌷🌷🌷🌷🌷🌷
1  శ్రీరంగం
2 ఉఱైయూర్
3 తంజ మా మణి క్కో యల్
4 తిరువన్ బిల్
 5  కరంబనూర్
6 తిరువెళ్ల రై
7 పు ళ్ళం పూదంగుడి
8 తిరుప్పే ర్  నగర్
9 ఆధనుర్
10 తిరువళందూర్
11 శిరుపులియూర్
12 తిరుచ్చేరై
13 తలైచ్చంగణాన్మదియం
14 తిరు క్కుడం ధై
15 తిరు క్కండి యూర్
16 తిరువిణ్ణగర్
17 తిరువాలితిరునగర్
18 తిరుకన్నాపురం
19 తిరునాగై
20 తిరునరైయూరు
21తిరునందిపురం
22 తిరువిందల్లుర్
23 తిరుచిత్రకూటం
24 శ్రీరామవిన్నగర్
25 కుడలూర్
26 తిరుక్క ణ్ణంగుడి
27 తిరుక్కణ్ణ మంగై
28 కపిస్థలం
29 తిరువ్వెళ్ళియంగుడి
30 తిరుమణిమాడ క్కోయిల్
31 వైకుంఠవిన్నగరం
32 తిరుఅరివేయవిణ్ణగరం
33 తిరుత్తేవనా ర్ తొగై
34 తిరువణ్ణపురుషోత్తం
35 తిరుశెమ్పాన్ శేయ్ కోయిల్
36 తిరుత్తియం బలం
37 తిరుమనిక్కు డం
38 తిరుక్కావళ్ళం పాడి 39 39 తిరు వేళ్ళక్కుళ్ళం
40 తిరుప్పార్తా న్ పళ్ళి
41 తిరుమళిరుంశెలై మలై
42 తిరుక్కోటియుర్
43 తిరుమె య్యం
44 తిరుపల్లా ణి
45 తిరుత్తంగాల్
46 తిరుమోగుర్
47 తెన్ మధురై
48 శ్రీవిల్లిపుత్తూర్
49 తిరుక్కురుగుర్
50 తిరుతుఱైవిల్లిమంగళం
51 శిరివరమంగై
52 తిరుప్పళింగుడి
53 తెంతిరుప్పేర్
54 శ్రీవైకుంఠం
55తిరువరగుణమంగై
56తిరుక్కళ్ళం ధై
57తిరుక్కురంగుడి
58తిరుక్కొళూర్
59 తిరువనంతపురం
60 తిరువన్ పరిశరం
61 తిరుక్కాట్ కరై
62 తిరుమురీక్కళ్ళం
63 తిరుప్పాలియూర్
64 తిరుచిత్తార్
65తిరునావాయ్
66తిరువల్లనాల్
67తిరువన్ వండుర్
68తిరువాట్టర్
69తిరువిత్తు వక్కోడు
70తిరువక్కడిత్తానం
71తిరువారన్ విళ్ళై
72తిరువహీంద్ర పురం
73 తిరుక్కోవళ్లూర్
74పెరుమాల్ కోయిల్
75 శ్రీఅష్టభుజమ్
76 తిరుత్తంకా
77 తిరువేళ్ క్కై
78తిరుప్పా డ గం
79 తిరునీరగం
80 తిరునిలాతింగళ్  తుండం
81తిరువెక్కా
82తిరువూరంగం
83 తిరుక్కారగం
84 తిరుక్కార్వానం
85 తిరుక్కళ్వనూర్
86 తిరుపవలవణ్ణం
87 పరమేశ్వరవిన్నగరం
88 తిరుప్ప ళ్ కుళి
89 తిరునిర్ర పూర్
90 తిరువేవ్వు ళూర్
91 తిరునిర్మలై
92 తిరువిడ వెండై
93 తిరుక్కడల్ మల్లై
94 తిరువల్లిక్కేణి
95 తిరుగటిగై
96 తిరుమల
97 అహోబిల
98 అయోధ్య
99 నైమిశారణ్యం
100 సాలగ్రామం
101 బదరికాశ్రమం
102 కండమెన్రుమ్ కడినగర్
103 తిరుప్పి రిది
104 ద్వారక
105 బృందావనం
106 గోకులం
107 క్షీరాబ్ది
108  పరమపధం

        జై శ్రీమన్నారాయణ......…సేకరణ...రామాయణం శ్రీదేవి
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online