Pages

Naraka chaturdasi subhakankshalu


మిత్రులు పెద్దలు అందరికీ దీపావళి పండుగ. శుభాకాంక్షలు
దీపావళి అంటే అర్థం దీపముల వరుస అని అర్థం .దీపాన్ని ..దీపలక్ష్మీ అంటారు .దీపం సాక్షాత్తూ లక్ష్మీఅమ్మవారే అందుకే మనం దీపం వెలిగించగానే కుంకుమ,పువ్వులు తో అల0కరిస్తాం .ఇక ప్రతీ పూజకు, ఉత్సవానికి ముందుగా  దీపము వెలిగించి ..ప్రారంభం చేస్తాము. ఆ అమ్మవారు వచ్చి  అక్కడ కూర్చి0దీ అంటే ..చాలు మిగతా దేవతలంతా వాళ్లే వచ్చేసి కూర్చు0టారు." దాశీభూత సమస్త దేవవనితాం ..లోకైక దీపంకురామ్.. అని అమ్మవారి స్తోత్రం లో ఉంది .అంటే ఇక్కడ లౌకిక0 గా ఆలోచించినా కూడా ధన0 ...క్యాష్ వు0టే ..అందరూ వచ్చేస్తారు ,అన్నిపనులు అవే ప్రారంభం అయిపోతాయి.అయితే ధనం ఒక్కటే అని ఆలోచించకూడదు .ఇక నరకాసుర కధ అందరికి తెలిసిందే .సత్యభామ ..సహాయంతో ఆడది అబల కాదు సబల జాగ్రత్త అనే ఒక సందేశం కోసం కూడా శ్రీ కృష్ణ భగవానుడు ..ఆమెతో యుద్ధం నడిపించి విజయం చూపించాడు .నరకాసురుడిని వధించి వేలమ0ది గోపీకా స్త్రీలను వారి  ,కష్ట,నష్టాలను0చి విముక్తి చేశాడు భగవానుడు.ద్వాపరయుగంలో జరిగినది అయినా ఇహంలో లేదా లౌకికములో తీసుకుంటే మనస్సులో ,దేహములో ఎన్నెన్నో చెడు ఆలోచనలు పై దైవస్మరణ ద్వారా చేసే యుద్ధం.. తండ్రి తో పాటు తల్లి,  లేదా భార్య. సహాయం తో  చేసే జీవన సమరం .స్త్రీ, పురుషులు  జీవిత రథానికి రెండు ఎద్దులు .ఇద్దరు సమానమే అని కూడా తెలుసుకోవాలి .ఇక బైట ప్రపంచములో మానవులను ,జీవులను ఇబ్బందులు గురిచేసే రాక్షసులను చూస్తూనే ఉంటాము .అలానే కామ.క్రోధ,లోభ,మోహ, మద. మాత్సర్యాలను.కూడా మనలో ఉండే రాక్షసులు అని తెలుసుకోవాలి .అలానే ద్వాపర యుగములో జరిగిన కథ అప్పట్లో దేవుని అవతారపురుషులు ,అలానే వింత వింత రాక్షసులు తిరిగే యుగాలు కూడా అయుఉండవచ్చు .అప్పుడు జరిగిన సంఘటన ప్రకారమే  దుష్టత్త్వం పై. మ0చి గెలుచుకున్న విజయమే ఈ పండుగ .ఇప్పటికి మన0 ఆ గస్ట్ పదిహేను స్వాతంత్ర్యదినోత్సవం జరుపుకుంటున్నాము కదా అదీ అంతే.           ఆదివారం నరకచతుర్దశి నాడు చేయవలసినది.
ఇక ఆదివారం నరకచతు ర్దశి  అంటే ఉదయాన్నే పిల్లలు,పెద్దవాళ్ళు నిద్ర లేచి మాడున నువ్వులనూనె పెట్టుకోవాలి .ఇంట్లో పెద్దవాళ్ళు స్త్రీలు పిల్లలకు మాడు పైన ఆ నూనె పెడతారు  కొంతమంది ఎలా ఉంటే అలా నే  ఆ మాడు నూనె ధరించే ఇంట్లోని వారందరు  శ్రీకృష్ణుడి ఫోటో కి హారతి ఇస్తారు.ఆ సమయంలో ఏ మడి అవసరం లేదు  .ఆ తరువాత కుంకుడు కాయరస్0 రుద్దుకొని   తలస్నానం  చేస్తారు .(ఇప్పుడు అంతా షా0పూ ల యుగ0 కదా ).ఎందుకంటే నువ్వులనూనె లో దీపావళి, కార్తీకమాసం రోజు ల్లో లక్ష్మి అమ్మవారు కొలువై ఉంటుంది .అలానే ఏ కాలువ ,భావి నీరు ఆయునా గంగా మాత ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది

ఇక సోమవారం దీపావళి అమావాస్య ఏమి చేయాలో చూద్దాం.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online