మిత్రులు పెద్దలు అందరికీ దీపావళి పండుగ. శుభాకాంక్షలు
ఇక దీపావళి అమావాస్య ఏమి చేయాలో చూద్దాం.
అమావస్య రోజున ఏ పని ప్రారంభం చేయరు .కానీ ..దీపావళి అమావాస్య మాత్రం చాలా శ్రేష్ఠమైన ది అని పెద్దలు చెబుతారు ..అంతేకాదు ..కొంతమంది వర్తకులు కొత్తగా దస్త్రం పెట్టుకుంటారు .అంటే కొత్తగా వ్యాపారంలో లెక్కలు,లాభ నష్టాలు వ్రాసే కొత్త పుస్తకం..
ఇక వర్షాలు కురిసి ,కురిసి కొత్త కొత్త చెడు కీటకాలు ,దోమలు వస్తాయని ,వాటిని చంపెందుకు మందు గుండు ,కొద్దిగా సల్ ఫర్ తో ట పాకాయలు కాల్చేవారు .అది క్రమేణా ముదిరి వాయుకాలుష్య0, శబ్ద కాలుష్యం కి దారి తీశాయు .ప్రతి మతం లోను ,ప్రతి ఆచార0 లోను ఇటువంటి వి జరుగుతూనేవున్నాయు. జ్ఞానం తో చేసే ది మంచి కి దారి తీస్తుంది .మితిమీరి చేస్తే అజ్ఞాన0 ఆయు లాభము కలిగించక అది ,ఆరోగ్యం పాడుచేసే మూఢ నమ్మకాలు గా మిగిలిపోతాయి . ఏదైనా అతి సర్వత్రా వర్జియేట్ .
అలానే ఈ పర్వ దినములో అందరూ వారి వారి శక్తి కి తగ్గట్టు కొత్త బట్టలు కట్టుకుంటారు.
ముఖ్యం గా నువ్వుల నూనెతో వెలిగించే దీపాలు ఆరోగ్యాన్ని ,పర్యావరణరక్షణ ఇస్తాయి (.ఆముదం దీపాలు కూడా అంతే .అయితే ఇప్పుడు అవి వాడరు .)
అయితే. మట్టి ప్రమీదలోరెండు వత్తులు వేసి వెలిగించాలి ..దేవుని మందిరములోను, ఇంటి ఆవరణలో ను ,గడపల కు ఇరువైపులా ,ఇంటికి అన్ని దిక్కులలోను కొద్దీ స0ఖ్య లో నైనా దీపాలు పెడుతుంటారు ఆయుదు తక్కువ కాకుండా సరి సంఖ్య వచ్చేటట్టు గా ఎన్ని అయినా పెట్టుకోవచ్చు ఆరు,పన్నెండు, పదహారు .ఇక వత్తులు కొంతమంది దేవుని వద్ద మూడు వత్తులు వేసి,లేక అయిదు వత్తులు వేసి కూడా వెలిగిస్తుంటారు
.ఇక సాయంత్రం వేళ దీపారాధన చేసి లక్ష్మీదేవి కి మొక్కుతారు ,లక్ష్మీ పూజ చేసుకుంటారు .ఆ దీపాలన్ని ఒకచోట పెట్టి. కంకంపెట్టి నైవేద్యం ఒక పండు .లేక వండి సిద్దం చేసుకున్న పాయసం ని ఆ దీపాలు కు చూపించి అదే నైవేద్యం పెట్టి .అప్పుడు దీపాలన్నీ ఒక ట్రే లో ఉంచి అని వైపులకు తీసుకొని వెళ్లి వరుసగా పెడతారు.అదే దీపావళి
ఇక దక్షిణ దిక్కు లో ముఖ్యంగా రెండు ప్రమీదలు పెట్టాలంటారు అవి యమధర్మరాజు కి సంభందించిన వి ,వాటి వల్ల ఇంట్లో వారందరికీ అపమృత్యుదోషం ఉండదు ,రోగాలు ,రొస్టులూ లేక ఆరోగ్యం గా వర్ది ల్లి నిండు జీవితం గడుపుతారని చెబుతారు
అలానే ఇంట్లోని మగవారు ఒక దివిటి లేక ఒకజ్యోతి పైకి పట్టుకొని దక్షిణ దిశ లో పైకి ఎత్తి పట్టుకొని అటూ ఇటూ మెల్లగా చూపుతారు .దాని అర్థం పై లోకల్లోని పితృదేవతలకు వెలుగు దారి చూపడం అంటారు. అలా చూపి కాళ్ళు కడిగి లోపలికి వచ్చి తీపి పదార్థం ఏదైనా తింటారు .దీని లో ఆంతర్యం పెద్దవాళ్లను అంటే తాతలు,తండ్రులు వాళ్ళను తల్చుకోవడానికి వాళ్ళ జ్ఞాపకాలను పిల్లలతో పంచుకోవడానికి అని కూడా పండితులు చెబుతారు .
అలానే కొందరి కుటుంబాలలో ఉదయం వేళా నవ్వులతో పితృదేవతలకు తర్పణం ఇచ్చే ఆచారం కూడా ఉంటుంది .
ఏడి ఏమైనా నువ్వులు తో చేసే తినుబండారాలు ఎక్కువ గా ఉపయోగించాలి .ఎందుకంటే ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకొనే విధమైనవి వేడి ఇచ్చే నువ్వులు . వాటితో చేసిన చిమ్మిరి ,బెల్లం కలిపి అందరికి పంచి పెడతారు .పప్పు నూనె ను ఎక్కువ గా వంట లో వాడుతూఉంటారు.
అస్సలు పురాణముల లెక్క ప్రకారం అగ్ని దేవుడు దేవతలకు ముఖంలేదా నోరు వంటి వారు అని యజ్ఞము లలో,హోమములో ఇచ్చే హావిస్సులు ,లాంటివి అన్నీ కూడా అగ్ని ముఖతా దేవతలకు ఆయావేదమంత్రాలు బట్టి ఆ..ఆ.. దేవతలకు చెందుతాయి అందుకే అగ్నిని పూజిస్తే దేవతలు ను పూజించినట్టే అని పురోహితులు చెబుతారు.
పూర్వ కాలంలో అగ్నిహోత్రం నిర్వహించే వారు , అంటే నియమ నిష్ఠలతో అగ్ని వెలిగించి ఆరాధన చేసి అప్పుడు అన్న పానాదులు.. తీసుకునేవారు. వారిని నిత్య అగ్నిహోత్రులు అని పిలిచేవారు ....ఇప్పుడు ఈ కాలంలో అగ్ని కి బదులు ..జ్యోతి ని వెలిగించడం ,ఆరాధించడం అని చెప్పుకోవచ్చు .
పంచభూతాత్మక స్వరూపమే దీప జ్యోతి అని చెబుతారు ..పరమాత్మ స్వరూపం జ్యోతి అని అది అంతర్యామి గా వెలుగుతూ ఉంటుంది అని అదే జీవచైతన్యం అని చెబుతారు .కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుఁడు కి సంబంధించిన ఆగమములో శ్రీ వెంకటేశ్వరుడు వడ్లపు గింజ కొన పరిమాణంలో జీవాత్మ లో నీలపు వర్ణము లో వెలుగొందుతూ ఉంటాడుఅని . ఆ జ్యోతి ని స్మరించుకోవడానికే ఈ జ్యోతి ఆరాధన అనేది పెద్దలు చెబుతారు
అలానే దీపం జ్యోతి రూపములో బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులు ముగ్గురు ఉంటారు ,అలాగే అచ్చ0గా జ్యోతి లోతెలుపు, పసుపు,ఎరుపు, మూడు రంగులు కనిపిస్తాయి. దానిని బట్టి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహదుర్గా ఈ మూడు రూపాలు కూడా కనిపిస్తాయి.
"దీపము జ్యోతి పర బ్రహ్మం ..దీపం సర్వ త మోపహము.. దీపేన....సాధ్యతే సర్వం.....సంధ్యా దీపం నమోస్తుతే"
ఇంకో విషయం అసతో మా ..సద్గమయా.. తమసోమా జ్యోతిర్గమయా .మృత్యో మా...అమృత0గమయా ..లో చెప్పినట్లు జ్యోతి వెలుగు అనే జ్ఞానం ని చూపిస్తూ చీకటి అనే అజ్ఞానాన్ని పొగుట్టమని .దాని ద్వారా మంచి మార్గములో నడిపించి జీవితం సార్ధకత చేసుకోవడం , ప్రతిసారి పుట్టటం ..చావడం అనే చక్రం లో నుంచీ రక్షించి అమృతత్వమైన మోక్షం ని ఇవ్వమని అడగడమే ఈ జ్యోతి ఆరాధన లో ఆంతర్యం అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి.
ఇక షిర్డీసాయి బాబా వారు కూడా దీపా లను వెలిగించడం లోనే అత్యంత ఆనందం,సంతృప్తి చెందేవారు .తద్వారా జీవులందరికి జ్ఞానం అనే వెలుగు చూపించేవారు అందుకే సాయినాధభగవానుడు ..నిత్యాఅగ్నిహోత్రుడు అయిన బ్రాహ్మణుడే అని కూడా చెబుతారు ..
ఏది ఏమైనా ..ఈ పండుగలన్నీ. ఈ ఉత్సవాల అన్నీ కూడా భగవంతుడి పట్ల భక్తి ని కలిగించి తద్వారా భగవద్ రామానుజలవారు చెప్పిన ప్రపత్తి ని పొంది త ద్వారా మోక్షం ని పొందడం కోసం ఉపయోగిస్తాయి అని తెలుసుకోవాలి .
అంతే కాదు ఈ నాటి యా0త్రిక యుగములో పరుగులు పెట్టి అలసిపోయి ఎవరికి వారే ఎక్కడో అక్కడ విడి విడి గా బ్రతుకుతూ వుండే వాళ్ళందరికీ ఈ పండుగలు అందర్నీ ఒకటి గా చేసి ఆనందం, సంతోషం ఇచ్చి,పుచ్చుకునే అంతరార్థం కూడా మనందరికీ అనుభవమే .
ఇక ప్రతి పండుగ కు ఇవ్వన్నీ ఆచరించే ఓపిక, శక్తీ లేనటువంటి వారు మీ ఇష్టం వచ్చిన దైవ నామ స్మరణ పైకి చేసుకున్న లేక మనస్సులో ధ్యానించుకున్న కూడా అందరికీ వచ్చే ఫలితం. మీకూ సమానం గా వస్తుంది. భగవంతుని కి కావలసినది ఆడంబరం కాదు మనస్సు త్రికరణ శుద్ధి తో చేస్తే ఆయన తొందరగా ప్రసన్నం అవుతాడు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి .
ఇక చాలా మంది ..ఈ. నాటి ఉదయం నరక చతుర్దశి, ....రాత్రి వేళ దీపావళి జరుపుకుంటున్నారు .ఇంకొంతమంది రేపు కూడా జరుపుకోవచ్చు.

0 comments:
Post a Comment