Pages

అమ్మవారికి ఏ తిథి రోజున ఏ అబిషేకం , ఏ నైవేద్యం పెట్టాలి?

అమ్మవారికి ఏ తిథి రోజున ఏ అబిషేకం , ఏ నైవేద్యం పెట్టాలి? తిదులలో ఏ అభిషేకం , నైవేద్యం ?

పాడ్యమి రోజు - ఆవు నేయి తో అభిషేకం చేస్తే సకల రోగలు నివారణ అవుతాయి.

విదియ రోజు - చక్కర తో అభిషేకమ చేస్తే దీర్గాయువు కలుగుతుంది.

తదియ రోజు - ఆవు పాలు తో అభిషేకం చేస్తే ఎలాంటి అకాల మృత్యు దోషాలు తొలిగిపోతాయి ,

చవితి రోజున - పిండివంటలు నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు లబిస్తాయి.

పంచమి రోజు - అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం వలన మేధస్సు , బుద్ది శక్తి పెరుగుతుంది.

షష్టి రోజున - తేనే తో అమ్మవారిని అభిషేకించి , బ్రాహ్మణునికి దానం ఇవటం వలన కాంతి పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది.

సప్తమి వెండి గిన్నెలో ఆవు పాలు మరియు చెరుకు ముక్కలు నివేదన చేయడం వలన దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది.

అష్టమి రోజున - బెల్లం నీటి తో అభిషేకించి, మంచి బెల్లం ఎవరికయినా దానం ఇవటం వలన అష్ట కష్టాలు అంటారు కదా అలాంటివి అనీ తీరిపొతయి అంటారు.

నవమి రోజున - పేలాలు నైవేద్యం పెట్టడం వలన సకల సుభాగ్యలు కలుగుతాయి.

దశమి రోజున - నల్ల నువ్వులు తో చేసిన పదార్ధాలు నైవేద్యం పెట్టడం వలన సకల రోగలు పోతాయి అని , దీర్ఘాయుసు పెరుగుతుంది.

అమ్మవారికి ఇష్టమయిన అన్నం 
పులగం - అన్నం + పెసరపప్పు
పాయసన్నం
పెరుగు అన్నం
బెల్లం అన్నం

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online