Pages

Festival of Light - Deepaavali

మిత్రులు పెద్దలు అందరికీ దీపావళి పండుగ. శుభాకాంక్షలు  

ఇక దీపావళి అమావాస్య ఏమి చేయాలో చూద్దాం.
అమావస్య రోజున ఏ పని ప్రారంభం చేయరు .కానీ ..దీపావళి అమావాస్య  మాత్రం చాలా శ్రేష్ఠమైన ది అని పెద్దలు చెబుతారు ..అంతేకాదు ..కొంతమంది వర్తకులు కొత్తగా దస్త్రం పెట్టుకుంటారు .అంటే కొత్తగా వ్యాపారంలో లెక్కలు,లాభ నష్టాలు వ్రాసే కొత్త పుస్తకం..
ఇక వర్షాలు కురిసి ,కురిసి కొత్త కొత్త చెడు కీటకాలు ,దోమలు వస్తాయని ,వాటిని చంపెందుకు మందు గుండు ,కొద్దిగా సల్ ఫర్ తో ట పాకాయలు కాల్చేవారు .అది క్రమేణా ముదిరి వాయుకాలుష్య0, శబ్ద కాలుష్యం కి దారి తీశాయు .ప్రతి మతం లోను ,ప్రతి ఆచార0 లోను  ఇటువంటి వి జరుగుతూనేవున్నాయు. జ్ఞానం తో చేసే ది మంచి కి దారి తీస్తుంది .మితిమీరి చేస్తే అజ్ఞాన0 ఆయు లాభము కలిగించక అది ,ఆరోగ్యం పాడుచేసే మూఢ నమ్మకాలు గా మిగిలిపోతాయి .  ఏదైనా అతి సర్వత్రా వర్జియేట్ .
అలానే ఈ పర్వ దినములో అందరూ వారి వారి శక్తి కి తగ్గట్టు కొత్త బట్టలు కట్టుకుంటారు.
ముఖ్యం గా నువ్వుల నూనెతో వెలిగించే దీపాలు ఆరోగ్యాన్ని ,పర్యావరణరక్షణ ఇస్తాయి (.ఆముదం దీపాలు కూడా అంతే .అయితే ఇప్పుడు అవి వాడరు .) 
అయితే. మట్టి ప్రమీదలోరెండు వత్తులు వేసి  వెలిగించాలి ..దేవుని మందిరములోను, ఇంటి ఆవరణలో ను ,గడపల కు ఇరువైపులా ,ఇంటికి అన్ని దిక్కులలోను  కొద్దీ స0ఖ్య  లో నైనా దీపాలు పెడుతుంటారు ఆయుదు తక్కువ కాకుండా సరి సంఖ్య వచ్చేటట్టు గా ఎన్ని అయినా పెట్టుకోవచ్చు ఆరు,పన్నెండు, పదహారు .ఇక వత్తులు కొంతమంది దేవుని వద్ద మూడు వత్తులు వేసి,లేక అయిదు వత్తులు వేసి కూడా వెలిగిస్తుంటారు  
   .ఇక సాయంత్రం వేళ దీపారాధన చేసి లక్ష్మీదేవి కి మొక్కుతారు ,లక్ష్మీ పూజ చేసుకుంటారు .ఆ దీపాలన్ని ఒకచోట పెట్టి.  కంకంపెట్టి  నైవేద్యం ఒక పండు .లేక వండి సిద్దం చేసుకున్న పాయసం ని  ఆ దీపాలు కు చూపించి అదే నైవేద్యం పెట్టి .అప్పుడు దీపాలన్నీ ఒక ట్రే  లో  ఉంచి అని వైపులకు   తీసుకొని వెళ్లి   వరుసగా పెడతారు.అదే దీపావళి 
ఇక దక్షిణ దిక్కు లో ముఖ్యంగా రెండు ప్రమీదలు పెట్టాలంటారు అవి  యమధర్మరాజు కి  సంభందించిన వి ,వాటి వల్ల  ఇంట్లో వారందరికీ అపమృత్యుదోషం ఉండదు ,రోగాలు ,రొస్టులూ లేక ఆరోగ్యం గా వర్ది ల్లి నిండు జీవితం గడుపుతారని చెబుతారు
అలానే   ఇంట్లోని మగవారు  ఒక దివిటి లేక ఒకజ్యోతి పైకి పట్టుకొని దక్షిణ దిశ లో  పైకి ఎత్తి పట్టుకొని అటూ ఇటూ మెల్లగా చూపుతారు .దాని అర్థం పై లోకల్లోని పితృదేవతలకు వెలుగు దారి చూపడం అంటారు. అలా చూపి కాళ్ళు కడిగి లోపలికి వచ్చి తీపి పదార్థం ఏదైనా తింటారు .దీని లో ఆంతర్యం  పెద్దవాళ్లను అంటే తాతలు,తండ్రులు వాళ్ళను తల్చుకోవడానికి   వాళ్ళ జ్ఞాపకాలను పిల్లలతో పంచుకోవడానికి అని కూడా పండితులు చెబుతారు .
అలానే కొందరి కుటుంబాలలో  ఉదయం వేళా నవ్వులతో పితృదేవతలకు తర్పణం ఇచ్చే ఆచారం కూడా ఉంటుంది .
ఏడి ఏమైనా నువ్వులు తో చేసే తినుబండారాలు ఎక్కువ గా ఉపయోగించాలి .ఎందుకంటే ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకొనే విధమైనవి వేడి ఇచ్చే నువ్వులు .  వాటితో చేసిన చిమ్మిరి ,బెల్లం కలిపి అందరికి పంచి పెడతారు .పప్పు నూనె ను ఎక్కువ గా వంట లో వాడుతూఉంటారు.
అస్సలు పురాణముల లెక్క ప్రకారం అగ్ని దేవుడు దేవతలకు ముఖంలేదా నోరు వంటి వారు అని యజ్ఞము లలో,హోమములో  ఇచ్చే హావిస్సులు ,లాంటివి అన్నీ కూడా అగ్ని ముఖతా దేవతలకు ఆయావేదమంత్రాలు  బట్టి ఆ..ఆ.. దేవతలకు చెందుతాయి అందుకే అగ్నిని పూజిస్తే దేవతలు ను పూజించినట్టే అని పురోహితులు చెబుతారు.
పూర్వ కాలంలో అగ్నిహోత్రం  నిర్వహించే వారు , అంటే నియమ  నిష్ఠలతో  అగ్ని వెలిగించి  ఆరాధన చేసి అప్పుడు అన్న పానాదులు.. తీసుకునేవారు. వారిని నిత్య అగ్నిహోత్రులు అని పిలిచేవారు ....ఇప్పుడు ఈ కాలంలో అగ్ని కి బదులు ..జ్యోతి ని వెలిగించడం ,ఆరాధించడం అని చెప్పుకోవచ్చు .
పంచభూతాత్మక స్వరూపమే దీప జ్యోతి అని చెబుతారు ..పరమాత్మ స్వరూపం జ్యోతి అని అది అంతర్యామి గా వెలుగుతూ ఉంటుంది అని అదే జీవచైతన్యం అని చెబుతారు .కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుఁడు కి సంబంధించిన ఆగమములో  శ్రీ వెంకటేశ్వరుడు  వడ్లపు గింజ  కొన పరిమాణంలో  జీవాత్మ లో నీలపు వర్ణము లో వెలుగొందుతూ ఉంటాడుఅని . ఆ జ్యోతి ని స్మరించుకోవడానికే ఈ జ్యోతి ఆరాధన అనేది పెద్దలు చెబుతారు 
అలానే దీపం జ్యోతి రూపములో బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులు ముగ్గురు ఉంటారు ,అలాగే అచ్చ0గా జ్యోతి లోతెలుపు, పసుపు,ఎరుపు,  మూడు రంగులు కనిపిస్తాయి. దానిని బట్టి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహదుర్గా   ఈ మూడు రూపాలు కూడా కనిపిస్తాయి.
"దీపము  జ్యోతి పర బ్రహ్మం ..దీపం సర్వ త మోపహము.. దీపేన....సాధ్యతే సర్వం.....సంధ్యా దీపం నమోస్తుతే"
ఇంకో విషయం అసతో మా ..సద్గమయా.. తమసోమా జ్యోతిర్గమయా .మృత్యో మా...అమృత0గమయా ..లో చెప్పినట్లు జ్యోతి   వెలుగు అనే    జ్ఞానం ని చూపిస్తూ చీకటి అనే అజ్ఞానాన్ని పొగుట్టమని .దాని ద్వారా మంచి మార్గములో నడిపించి జీవితం సార్ధకత చేసుకోవడం ,  ప్రతిసారి పుట్టటం ..చావడం అనే చక్రం లో నుంచీ రక్షించి అమృతత్వమైన  మోక్షం ని ఇవ్వమని అడగడమే ఈ జ్యోతి ఆరాధన లో ఆంతర్యం అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి.
ఇక షిర్డీసాయి బాబా వారు  కూడా దీపా లను వెలిగించడం లోనే అత్యంత  ఆనందం,సంతృప్తి చెందేవారు .తద్వారా జీవులందరికి జ్ఞానం అనే వెలుగు చూపించేవారు  అందుకే  సాయినాధభగవానుడు ..నిత్యాఅగ్నిహోత్రుడు అయిన  బ్రాహ్మణుడే  అని కూడా చెబుతారు ..
ఏది ఏమైనా ..ఈ పండుగలన్నీ. ఈ ఉత్సవాల అన్నీ కూడా భగవంతుడి పట్ల భక్తి ని కలిగించి తద్వారా భగవద్ రామానుజలవారు చెప్పిన ప్రపత్తి ని పొంది త ద్వారా మోక్షం ని పొందడం కోసం ఉపయోగిస్తాయి అని తెలుసుకోవాలి .
అంతే కాదు ఈ నాటి యా0త్రిక యుగములో పరుగులు పెట్టి అలసిపోయి ఎవరికి వారే ఎక్కడో అక్కడ విడి విడి గా బ్రతుకుతూ వుండే వాళ్ళందరికీ  ఈ పండుగలు అందర్నీ ఒకటి గా చేసి ఆనందం, సంతోషం ఇచ్చి,పుచ్చుకునే అంతరార్థం కూడా మనందరికీ అనుభవమే .
ఇక ప్రతి పండుగ కు  ఇవ్వన్నీ ఆచరించే ఓపిక, శక్తీ లేనటువంటి వారు మీ ఇష్టం వచ్చిన దైవ నామ స్మరణ పైకి చేసుకున్న లేక మనస్సులో ధ్యానించుకున్న  కూడా అందరికీ వచ్చే ఫలితం. మీకూ సమానం గా వస్తుంది. భగవంతుని కి కావలసినది ఆడంబరం కాదు మనస్సు త్రికరణ శుద్ధి తో చేస్తే ఆయన  తొందరగా ప్రసన్నం అవుతాడు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి .
ఇక చాలా మంది ..ఈ. నాటి ఉదయం నరక చతుర్దశి,  ....రాత్రి వేళ దీపావళి జరుపుకుంటున్నారు .ఇంకొంతమంది రేపు కూడా జరుపుకోవచ్చు.

Naraka chaturdasi subhakankshalu


మిత్రులు పెద్దలు అందరికీ దీపావళి పండుగ. శుభాకాంక్షలు
దీపావళి అంటే అర్థం దీపముల వరుస అని అర్థం .దీపాన్ని ..దీపలక్ష్మీ అంటారు .దీపం సాక్షాత్తూ లక్ష్మీఅమ్మవారే అందుకే మనం దీపం వెలిగించగానే కుంకుమ,పువ్వులు తో అల0కరిస్తాం .ఇక ప్రతీ పూజకు, ఉత్సవానికి ముందుగా  దీపము వెలిగించి ..ప్రారంభం చేస్తాము. ఆ అమ్మవారు వచ్చి  అక్కడ కూర్చి0దీ అంటే ..చాలు మిగతా దేవతలంతా వాళ్లే వచ్చేసి కూర్చు0టారు." దాశీభూత సమస్త దేవవనితాం ..లోకైక దీపంకురామ్.. అని అమ్మవారి స్తోత్రం లో ఉంది .అంటే ఇక్కడ లౌకిక0 గా ఆలోచించినా కూడా ధన0 ...క్యాష్ వు0టే ..అందరూ వచ్చేస్తారు ,అన్నిపనులు అవే ప్రారంభం అయిపోతాయి.అయితే ధనం ఒక్కటే అని ఆలోచించకూడదు .ఇక నరకాసుర కధ అందరికి తెలిసిందే .సత్యభామ ..సహాయంతో ఆడది అబల కాదు సబల జాగ్రత్త అనే ఒక సందేశం కోసం కూడా శ్రీ కృష్ణ భగవానుడు ..ఆమెతో యుద్ధం నడిపించి విజయం చూపించాడు .నరకాసురుడిని వధించి వేలమ0ది గోపీకా స్త్రీలను వారి  ,కష్ట,నష్టాలను0చి విముక్తి చేశాడు భగవానుడు.ద్వాపరయుగంలో జరిగినది అయినా ఇహంలో లేదా లౌకికములో తీసుకుంటే మనస్సులో ,దేహములో ఎన్నెన్నో చెడు ఆలోచనలు పై దైవస్మరణ ద్వారా చేసే యుద్ధం.. తండ్రి తో పాటు తల్లి,  లేదా భార్య. సహాయం తో  చేసే జీవన సమరం .స్త్రీ, పురుషులు  జీవిత రథానికి రెండు ఎద్దులు .ఇద్దరు సమానమే అని కూడా తెలుసుకోవాలి .ఇక బైట ప్రపంచములో మానవులను ,జీవులను ఇబ్బందులు గురిచేసే రాక్షసులను చూస్తూనే ఉంటాము .అలానే కామ.క్రోధ,లోభ,మోహ, మద. మాత్సర్యాలను.కూడా మనలో ఉండే రాక్షసులు అని తెలుసుకోవాలి .అలానే ద్వాపర యుగములో జరిగిన కథ అప్పట్లో దేవుని అవతారపురుషులు ,అలానే వింత వింత రాక్షసులు తిరిగే యుగాలు కూడా అయుఉండవచ్చు .అప్పుడు జరిగిన సంఘటన ప్రకారమే  దుష్టత్త్వం పై. మ0చి గెలుచుకున్న విజయమే ఈ పండుగ .ఇప్పటికి మన0 ఆ గస్ట్ పదిహేను స్వాతంత్ర్యదినోత్సవం జరుపుకుంటున్నాము కదా అదీ అంతే.           ఆదివారం నరకచతుర్దశి నాడు చేయవలసినది.
ఇక ఆదివారం నరకచతు ర్దశి  అంటే ఉదయాన్నే పిల్లలు,పెద్దవాళ్ళు నిద్ర లేచి మాడున నువ్వులనూనె పెట్టుకోవాలి .ఇంట్లో పెద్దవాళ్ళు స్త్రీలు పిల్లలకు మాడు పైన ఆ నూనె పెడతారు  కొంతమంది ఎలా ఉంటే అలా నే  ఆ మాడు నూనె ధరించే ఇంట్లోని వారందరు  శ్రీకృష్ణుడి ఫోటో కి హారతి ఇస్తారు.ఆ సమయంలో ఏ మడి అవసరం లేదు  .ఆ తరువాత కుంకుడు కాయరస్0 రుద్దుకొని   తలస్నానం  చేస్తారు .(ఇప్పుడు అంతా షా0పూ ల యుగ0 కదా ).ఎందుకంటే నువ్వులనూనె లో దీపావళి, కార్తీకమాసం రోజు ల్లో లక్ష్మి అమ్మవారు కొలువై ఉంటుంది .అలానే ఏ కాలువ ,భావి నీరు ఆయునా గంగా మాత ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది

ఇక సోమవారం దీపావళి అమావాస్య ఏమి చేయాలో చూద్దాం.

20 Benefits of walking 30 min. a Day


A small clarification

క్రింద వ్రాసిన వ్యాసం  "కొంచం ఆరోగ్యం - కొంచం భక్తి రసం" లో  విష్ణు నామాల్లో పూతాత్మనే నమః అనే నామానికి బదులుగా పూతవర్జితాయా నమః అని వచ్చింది .  మీరు దానిని  "పూతాత్మనే నమః " అని చదువుకొనగలరు .

కొంచెం ఆరోగ్యం, కొంచం భక్తి రసం

ప్రతీ రోజు. ఒక జామకాయ తినండి ,ఉప్పు,కారం, అలా ఏదీ రాసుకోకుండా తినండి .డయా బెటీస్ వాళ్లకు చాలా మంచిది షుగర్  కంట్రోల్ కి వస్తుంది .ఇక రోజూ తింటూ ఉన్నవారికి గుండె జబ్బులు రావు ,అలానే జామ ఆకు లు ఒక నాలుగు లేక ఆయుదు తీసు కొని. వాటిని మిక్సీలో కొద్దీ నీళ్ళు కలిపి  నూరి. రోజూ ఉదయం పరగడుపున లేక కాఫీ /టీ కానీ త్రాగిన  తరువాత అయినా త్రాగవచ్చు. ,అలా త్రాగిన వారికి ఖచ్చితంగా బి.పి కంట్రోల్ కి వస్తుంది.


అలానే కామాక్షి లేక కామంచి మొక్క అంటారు .అది పడుబడిన గోడలపై, తోటల్లో ను ఒకమదిరి మొక్కలు ,వాటికి నల్ల వి చిన్న పూసలు వంటి కాయలు ఉంటాయి.ఆ చెట్టు. ఆకులను కూరగాకానీ, పప్పులో కానీ ఎలాగో అలా తినేయండి మీకు కంటి చూపు బాగా పెరుగుతుంది ,కళ్ళ సమస్యలు చాలా తీరిపోతాయి .అలానే అది కొద్దిరోజులపాటు ఎక్కువ మొత్తం లో తింటే లివర్ సమస్యలు మటు మాయం అవుతాయి. అంతే కాదు చివరి దశలో ఉన్న లివర్ కూడా ఆ ఆకులు ను ఎక్కువ మొత్తం లో లోపలికి తీసుకు 0టే లివర్ పూర్తి స్తాయి ఆరోగ్యానికి వచ్చేస్తుంది .కాబట్టి కనీసం అప్పుడప్పుడు ఆ కామంచి ఆకు కూర తినడం అలవాటు చేసుకోగలరు .ఆరోగ్యం కోసం వాడే మ0దులు ఎప్పుడైనా ఓం ధన్వంతరి నారాయణాయనమహా"అనీచదివి తూర్పు వైపు తిరిగి మందులు సేవిస్తే చాలా ఫలితం ఉంటుంది.

డయాబెటిక్ వాళ్ళు వరి అన్నం తగ్గించి కూర ఎక్కువ వండుకొని తింటే షుగర్ కంట్రోల్ కి వస్తుంది. ఒక్కొక్కసారి మొత్తం కూరని మాత్రమే ఎక్కువగా వండుకొని తినే వాళ్ళు వున్నారు.విదేశీ యులు కూడా అచ్చం గా వంకాయ ,దొండకాయ,   టమాటాఆలు ,కలిపి! ఇలా రుచికరంగా వండుకొని తింటూ ఉంటారు.  మనం ఓ గుప్పెడు అన్నం లేక రెండు గుప్పెడులు అయినా అన్నము వేసుకొని తినేయచ్చు .అప్పుడు కూడా షుగర్ కంట్రోల్ కి వస్తుంది. ఇక పొట్టు గోధుమలతో చేసిన పిండి  ని మాత్రమే వాడండి ,దానివల్ల గ్లై స్మిక్  ఇండి క్స్  బాగుంటుంది .(అంటే మెల్ల మెల్ల గా బ్లడ్ లోకి షుగర్ వెళ్లే ప్రక్రియ)

అలానే ఓల్ వీట్ ,దానినే బ్రౌన్ వీట్ బ్రెడ్ అంటారు అది వాడితే షుగర్,వాళ్లకు కొలెస్ట్రాల్ వాళ్లకు చాలా మంచిది.అలానే మైదాపిండి అస్సలు వాడకుండా ఉంటే జీవితానికి చాలా లాభము .ఇక గోధుమ రొట్టెలు ...వరి అన్నం కు బదులు గా తినమ0టా రు .కానీ రెండిటి లోను కార్బోహైడ్రేట్లు సమానమే ,కాకపోతే రొట్టెలు,చపాతీలు అయితే లెక్క ప్రకారం తినవచ్చు అని చెబుతారు అంతే. అయితే పొట్టుగోధుమల పిండి తో అయితే మాత్రం కొంచెం షుగర్ వాళ్లకు ,కొలెస్ట్రాల్ వాళ్లకు చాలా మంచిది ,ఇక ఆకుకూరలు ,వెజితెరియన్ ఫుడ్ మాత్రం. షుగరు వాళ్లకు ,కోలేస్ట్రాల్ వాళ్లకు మంచిది అని మరిచిపోకండి. ఇక ఏదైనా నూనెలో వేయు0చి తింటే క్యాలారీస్ పెరుగుతాయి అందుకే మామూలుగా ఉడికించి తినండి ఫ్రై లు పూర్తిగా మరిచిపోవడం మేలు .అలానే షుగర్ వాళ్ళు జీలకర్ర. ,పసుపు దాల్చినచెక్క, ఉసిరికాయ, సొంపు   మెంతులు,కరివేపాకు     ఇవి రోజూ ఏదో ఒక రకంగా కడుపులోకి పంపిస్తూఉంటే షుగర్ వాళ్లకు, కొలెస్ట్రాల్ వాళ్లకు చాలమంచిది.

మజ్జిగ ...పలుచగా చేసి త్రాగండి అది షుగర్ ...వాళ్లకు, కొలెస్ట్రాల్ వాళ్ళకు. ..క్యాల్షియం వాళ్లకు చాలా మంచిది.. రాత్రి వేళల్లో పెరుగు బదులు మజ్జిగ వాడండి  ఆయువృద్ది అని ఆయుర్వేదం చెబుతు0దీ

అరటి చెట్టు ఊచ, లేక దవ్వ.. చెట్టు కాండం లోని తెల్లని మట్ట భాగం తింటే కిడ్నీ రాళ్లు కరిగి పోతాయి.. కొద్దీ రోజులు దంచిరసం త్రాగిన కూడా రాళ్లు కరిగిపోతాయు. అలానే ముల్ల0గి రసం త్రాగినా కరిగిపోతాయి .కూర అప్పు డప్పుడు తింటూ ఉంటే కూడా. రాళ్ళు రాకుండా వుంటాయి.

అలానే ఇదివరలో చెప్పుకున్నాం . .త్రిఫల చూర్ణం లాభాలు అనేకం వాత, పిత్త కఫం అనే మూడు లక్షణాలు సరి సమానం గా లేకపోవడమే మనిషి లో అనేక సమస్యలు, రోగాలకు కారణం   ..అయితే త్రిఫల చూర్ణం లేదా ఆ టాబ్లెట్ ఏదైనా సరే మనిషి లోని ఆ మూడు  గుణాలను  సమానం చేసి సమస్యలను పోగుడుతుంది.. ముఖ్య0గా. నేత్రసమస్య లు ,అజీర్ణం. గ్యాస్ .    మల బద్దకం  లాంటివి,  మాత్రం త్వరగా తగ్గుతాయి .దీనిలో ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ లు సమభాగా లుగా కలిపి తయారు చేస్తారు.

ఇక మోషన్ కాకుండా ఇబ్బంది పడుతున్నవారు ఆయుర్వేదం షాపుల్లో.కొన్నిచోట్ల ఇంగ్లీషు మందులషాపుల్లో "  కాయ0చూర్ణ0 "  అనే పొడికల డబ్బా దొరుకుతుంది  దానిలో సునాముఖి ఆకు ,వాము ,లా0టి వి కలుస్తాయి .రాత్రి భోజనము కాగానే  ఒక స్పూన్ పొడి ఒక గ్లాస్ నీటిలో కలిపి త్రాగి పడుకుంటే ఉదయం సుఖవిరోచనం ఫ్రీమోషన్ అవుతుంది .సమస్య ను బట్టి ఇంకొంచం పొ డి వేసుకోవచ్చు .

ఇక అది కుదరకపోతే .  ".అభయాదిమోద క్ "   అనే ఆయుర్వేద టాబ్లెట్ దొరుకుతాయి అది తెచ్చుకొని రాత్రి భోజనం తరువాత ఒక్క టాబి లెట్ వేసుకున్నా చాలు .అతిగా వేసుకోకూడదు పవర్ చాలకపోతే రెండోరోజు ఇంకో అర ముక్క ఎగస్త్రా వేసుకొండి ,అంతే కాని అతిగా వేసుకుంటే ఎక్కువసార్లు మోషన్ అయితే నీరసం వస్తుంది .రెండు.మూడు సార్లు వెళ్లినా కంగారు పడ కుండా ..మీకు వీలు పట్టి డోస్ తగ్గించుకొండి.

ఇక శారీరక ఆరోగ్య0 కోసం శ్రీ విష్ణు సహస్రనామ మములలో గల ఒక నామం"ఓం భూతభావనాయనమః"  అనే నామం 28సార్లు ప్రతిరోజూ ప్రశాంతముగా కూర్చొని మీ మనసులో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని లేక శ్రీమన్నారాయణుని కానీ నిలుపుకొని,లేక ఫోటో ముందు కూర్చొని ధ్యానం చేయండి లేక మీకు ఎంత సంఖ్య కుదిరితే అన్ని సార్లు చేయండి.

అలానే మానసిక ఆరోగ్యానికి, డిప్రెషన్ పోవడానికి పైన లాగానే   "ఓం పూతాత్మనే నమః"  అనే శ్రీ విష్ణు సహస్రనామ0 28 సార్లు లేక మీకు ఎంత వీలు అయితే అంత ఎక్కువ సార్లు చేయండి.
ఇక కంటి చూపు,కంటిసమస్యలు ,ఇక మొత్తం ఆరోగ్యం కోసం అరుణకాంతుల సూర్యునికి ఎదురుగా నిలబడి రావి చెంబులో ఎర్ర పూవ్వు ఒకటి వేసి లేక,2,3 ఆయునా వేసుకొని సూర్య నారాయణునికి ఆర్గ్యం ఇవ్వండి .అంటే కుడిచేతులోపోసుకుంటూ సూర్యుని ని వైపు వదిలివేయడం చేస్తూ ఓం నమో నారాయణాయ,అని పలుకుతూ ,ఓం సూర్యాయ నమః, ఆదిత్యా యనమః,ఓం భాస్కరాయనమః,అంటూ చదువుకొంటూఆర్గ్యం ఇవ్వండి   ఎందుకంటే.  ఆరోగ్యం భాస్కరాధి చేత్ .అని  వేద ధర్మ0  చెబుతుంది

 ఇక సర్వాకాల,సర్వావస్థలందు, ఎవరైనా శ్రీవిష్ణుసహస్ర నమాలుచదుకోవచ్చు,లేక శ్రీ షిర్డీ సాయినాథుని సచ్ఛరితం రోజూ ఒక పేజీ చదుకోవచ్చు సమయం లేకపోతే సాయినాథుని 11 నామాలు చదువుకుంటే కూడా చాలా మంచిది ప్రధమ0సాయినాదాయా,ద్వితీయం ద్వారక మాయునే, తృతీయం తీర్ధరాజాయ చతుర్దం భక్తవత్సలే ,పంచమ0 పరమాత్మాయా ,ష స్ట్ మం షిర్డీవాసనే,   సప్తమ0 సద్గురు నాథాయ     అష్టమం అనాధనాధయే, నవమం నిరాడంబరాయ, దశమం దత్తాత్రేయా నమః ఏ దశ నామని త్రికాలే పాటునిత్యం సర్వ దు:ఖ నాశనం .సర్వకష్ట నివారణం ఇలా కూడా సాయినాథుని స్మరించి చదువు కుంటే అంతా మంచి జరుగుతుంది .

లేదా కలి యుగములో అనేక భ్రమ లు ,అనేక మాయలు,భయాలు పట్టి బాధపడుతుంటాము .కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుని కూడా ప్రార్ధిం చి కూడా బైట పడవచ్చు  ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి వచ్చి ఏడుకొండల పై  అవతరించగానే స్వామీ భక్తులు అందరం మిమ్ములను ఏ పేరుతో  కొలవాలి.అని అడిగినప్పుడు "శ్రీవేంకటేశ్వర శ్రీనివాసపరబ్రహ్మణేనమః "అని నామస్మరణ చేస్తుంటే  వాళ్లను నేను కాపాడుతూ ఉంటాను అని స్వామివారు చెప్పారు .అయితే దానికి మన పెద్దలు ,పురాణ పండితులు ఇలా చెప్పారు "శ్రీవేంకటేస్వర శ్రీనివాసగోవింద పరబ్రహ్మణే నమః " అనే నామ0 చాలా గొప్పదైనది,త్వరగా ,ఫలితం ఇస్తోంది. అని .అలానే మానసిక సమస్యలతో సతమతం అవుతూన్న వారు సాయంకాలం వచ్చే షిరిడీ సాయిబాబా వారి హారతి వినడం,కలిసి పాడటం, సాయి గుడి దగ్గర్లో ఉంటే వెళ్లి పాలుగోవడం కకనీసం టి.వి లో అయినా వింటూ భజన చేసినా కూడా   మంచి ఫలితం ఉంటుంది  .

History of Antarvedi Lakshmi Narasimha Swami Temple

వశిష్ఠుని కోసం శ్రీమహావిష్ణువు వెలసిన... విశిష్ఠ క్షేత్రం!

తెలుగు నేలపై వెలసిన అతి పురాతన నారసింహ క్షేత్రాల్లో మహా విశిష్టమైనది అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ధామం. తూర్పుగోదావరి జిల్లాలోని వశిష్ఠ గోదావరి తీరాన కొలువయ్యారు స్వామి వారు.

సముద్రంలో గోదావరి అంతర్వేదికగా ఉండటం మూలాన ఈ క్షేత్రం 'అంతర్వేది' అయింది. ఇక ఈ నారసింహ క్షేత్రం 'సఖినేటిపల్లి' మండలం పరిధిలోకి వస్తుంది. సఖినేటిపల్లి అనే పేరు వెనుక ఆసక్తికరమైన పురాణ కథనం ఉంది.

త్రేతాయుగంలో రామచంద్రమూర్తి సీతమ్మతో కలసి లక్ష్మణ సమేతుడై ఇక్కడి స్వామివారి దర్శనానికి వచ్చాడు. ప్రస్తుత సఖినేటి పల్లి లో విరామం తీసుకున్నాడు. అప్పటికే బాగా పోద్దుపోవడంతో, ''సఖీ! నేటికి ఈ పల్లెనే మన విడిది'' అని పలికాడు. ఆ కారణం చేతనే ఈ ప్రాంతానికి సఖినేటిపల్లి అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతుంటారు.

అంతర్వేది క్షేత్ర స్థలపురాణం ప్రకారం కృతయుగంలో తనని బ్రహ్మర్షిగా గుర్తించని వశిష్ట మహర్షి పై విశ్వామిత్రుడు కోపాన్ని పెంచుకున్నాడట. హిరణ్యాక్షుడి కుమారుడైన రక్త లోచనుడితో వశిష్ట మహర్షి 100 మంది కొడుకులను కౌశికుడు చంపించాడు. పుత్ర శోకాన్ని భరించలేక పోయిన కుంభ సంభవుడు నారసింహ స్వామిని వేడుకున్నాడు. దుష్ట శిక్షణ చేయడానికి నృసింహ మూర్తి ప్రత్యక్షమయ్యాడు.

రక్త లోచనుడికి తన రక్తం నుంచి మరి కొందరు రాక్షసులు పుట్టుకొచ్చే వరం ఉండేది. దానికి విరుగుడుగా నరసింహ స్వామి తన సోదరి అయిన 'అశ్వ రూఢాంబ'ను రంగంలోకి దింపాడు. ఆమె రక్త లోచనుడి రక్తం ఒక్క బొట్టు కూడా కింద పడకుండా యుద్ధరంగమంతా తన నాలుకను విస్తరించింది. అప్పుడా రక్త లోచనుని ఉగ్ర నారసింహుడు సంహరించాడు. వశిష్ట మహర్షి కోరిక మేరకు లక్ష్మీ సమేతుడై అక్కడే వెలిశాడు కూడా. అయితే, పురాణంలో పేర్కొన్న అశ్వ రూఢాంబయే ప్రస్తుతం 'గుర్రాలక్కమ్మ' పేరుతో ఇప్పటికీ పూజలందుకుంటోంది.

అంతర్వేదీశ్వరునికి కేశవదాసు అనే పశువుల కాపరి మొట్ట మొదటగా చిన్నపాటి ఆలయాన్ని నిర్మించాడని స్థానికులు చెబుతారు. కాలక్రమంలో అదే ప్రసిద్ధి చెందుతూ వచ్చి మొగల్తూరు రాజైన శ్రీ రాజా బహద్దూర్ వారి ఆధ్వర్యంలో, దాతల సాయంతో మహాభివృద్ధి పొందింది.

అంతర్వేదిలో ఏటా మాఘ మాసాన పది రోజులు స్వామివారికి కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. 'భీష్మ ఏకాదశి' నాడు లక్షలాదిగా నృసింహ భక్తులు ఇక్కడికి చేరుకుని స్వామిని సేవించి తరిస్తుంటారు. మాఘంలోనే కొన్ని రోజులపాటు సూర్యాస్తమయ వేళ భానుని అరుణ కిరణాలు నరసింహ స్వామి పాదాలను స్పృశిస్తాయి.

అంతర్వేది క్షేత్రంలో మనం శ్రీ వెంకటేశ్వర స్వామి, భూదేవి, రాజ్యలక్ష్మీ తాయారు, సంతాన వేణుగోపాల స్వామి వార్లను కూడా దర్శించుకోవచ్చు.

Vijaya Dasami - Sami puja Shlokam


శమీ శమయతేపాపం శమీ శతృ వినాశినీ
అర్జునస్య ధనుర్థారి  రామస్య ప్రియదర్శిని

శ్రీ దుర్గా మాత  ఆశీస్సులతో  సకల శుభాలు మీకు మీ కుటుంబీకులకు కలగాలని  ఆశిస్తూ..
విజయదశమి శుభాకాంక్షలు

అమ్మవారికి ఏ తిథి రోజున ఏ అబిషేకం , ఏ నైవేద్యం పెట్టాలి?

అమ్మవారికి ఏ తిథి రోజున ఏ అబిషేకం , ఏ నైవేద్యం పెట్టాలి? తిదులలో ఏ అభిషేకం , నైవేద్యం ?

పాడ్యమి రోజు - ఆవు నేయి తో అభిషేకం చేస్తే సకల రోగలు నివారణ అవుతాయి.

విదియ రోజు - చక్కర తో అభిషేకమ చేస్తే దీర్గాయువు కలుగుతుంది.

తదియ రోజు - ఆవు పాలు తో అభిషేకం చేస్తే ఎలాంటి అకాల మృత్యు దోషాలు తొలిగిపోతాయి ,

చవితి రోజున - పిండివంటలు నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు లబిస్తాయి.

పంచమి రోజు - అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం వలన మేధస్సు , బుద్ది శక్తి పెరుగుతుంది.

షష్టి రోజున - తేనే తో అమ్మవారిని అభిషేకించి , బ్రాహ్మణునికి దానం ఇవటం వలన కాంతి పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది.

సప్తమి వెండి గిన్నెలో ఆవు పాలు మరియు చెరుకు ముక్కలు నివేదన చేయడం వలన దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది.

అష్టమి రోజున - బెల్లం నీటి తో అభిషేకించి, మంచి బెల్లం ఎవరికయినా దానం ఇవటం వలన అష్ట కష్టాలు అంటారు కదా అలాంటివి అనీ తీరిపొతయి అంటారు.

నవమి రోజున - పేలాలు నైవేద్యం పెట్టడం వలన సకల సుభాగ్యలు కలుగుతాయి.

దశమి రోజున - నల్ల నువ్వులు తో చేసిన పదార్ధాలు నైవేద్యం పెట్టడం వలన సకల రోగలు పోతాయి అని , దీర్ఘాయుసు పెరుగుతుంది.

అమ్మవారికి ఇష్టమయిన అన్నం 
పులగం - అన్నం + పెసరపప్పు
పాయసన్నం
పెరుగు అన్నం
బెల్లం అన్నం

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online