Pages

Toli Ekadashi

తొలి  ఏకాదశి  నాడు  పేలాల  పిండి  తినడంలో  అంతరార్ధం  ఏమిటి  ?

ఆషాడ  శుద్ద ఏకాదశిని  తొలి  ఏకాదశి అని  అంటారు  .
దీనినే  శయన  ఏకాదశి  అని  కూడా  పిలుస్తారు .


ఈ నాలుగు నెలలు  శ్రీమన్నారాయణుడు  శయనిస్తారని  అందువలన  లోక  కళ్యాణార్ధము ఋషులు  , స్వామీజీలు  చాతుర్మాస  దీక్షను  ప్రారంభిస్తారని  చెప్తారు .

ఈ  రోజున  అన్ని  దేవాలయములలో  పేలాల  పిండిని  ప్రసాదంగా  ఇస్తారు .
పేలాలలో  బెల్లపు పొడి  మరియు  యాలకుల పొడిని  వేసి   దంచి  ఈ  పేలాల పొడిని  తయారు  చేస్తారు .
గ్రీష్మ  ఋతువు నుండి  వర్ష ఋతువు  కు  మారుతున్న  సమయం  కనుక  సహజంగా  ఏర్పడే  శారీరక  ఋగ్మతలను  ఈ  పేలాల  పిండి  తీసుకొనటం  వలన  మన  శరీరంలో  వ్యాధి  నిరోధక  శక్తి  పెరుగుతుంది  .ఈ రోజు  పేలాల  పిండిని  మన  పితృ దేవతలను  స్మరించుకుంటూ  తీసుకొనడం వలన  వారు  సంతుష్టులై  మనని  కాపాడుతారని  పెద్దలు  చెప్తారు.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online