Pages

Bloodmoon/Lunar Eclipse details

 చంద్ర గ్రహణం గురించి పూర్తి వివరాలు

చంద్ర గ్రహణం ఎప్పుడు కలదు ?
ఆషాఢ శుద్ధ పూర్ణిమ అనగా తేది : 27 - 07 - 2018 , శుక్రవారము రోజు.


చంద్ర గ్రహణం మనకు వర్తిస్తుందా ?
ఆషాఢ శుద్ధ పౌర్ణమి అనగా తేది : 27 - 07 - 2018 , శుక్రవారము రోజు ప్రారంభమగు చంద్ర గ్రహణము.... ఖగ్రాస చంద్ర గ్రహణము.అనగా సంపూర్ణ చంద్ర గ్రహణము కలదు.ఈ గ్రహణము మన దేశములో కనిపిస్తుంది.కావున ఇట్టి చంద్ర గ్రహణం మనకు వర్తిస్తుంది.గ్రహణ నియమాలను తప్పక పాటించాలి.


గ్రహణ సమయ వివరాలు :-

గ్రహణ స్పర్శ కాలము :
తేది : 27 - 07 - 2018 , శుక్రవారము , రాత్రి 11:54 ని॥లకు

గ్రహణ మధ్య కాలము :
తేది : 28 - 07 - 2018 , శనివారము , తెల్లవారు జామున 01:52 ని॥లకు( 01:52 am )

గ్రహణ మోక్ష కాలము :
తేది : 28 - 07 - 2018 , శనివారము , ఉదయం 03:41 ని॥లకుఅంటే ఈ చంద్ర గ్రహణము తేది : 27 - 07 - 2018 , శుక్రవారము రాత్రి 11:54 ని॥లకు ప్రారంభమై , తేది : 28 - 07 - 2018 , శనివారము ఉదయం 03:41 ని॥లకు ముగుస్తుంది.

ఇట్టి చంద్ర గ్రహణ పుణ్య కాలము మొత్తం 03:55 ని॥లు కలదు.

ఇది 21 వ శతాబ్దములోనే అతి పెద్ద చంద్ర గ్రహణము.

గ్రహణ నియమాలు ఏ సమయం నుండి పాటించాలి ?
గ్రహణ వేధారంభ సమయం నుండి గ్రహణ మోక్ష సమయం దాకా గ్రహణ నియమాలను పాటించాలి.గ్రహణ వేధారంభం తేది : 27 - 07 - 2018 , శుక్రవారము మధ్యాహ్నము 12:45 ని॥ల నుండి , గ్రహణ మోక్ష సమయం తేది : 28 - 07 - 2018 , శనివారము , ఉదయం 03 : 41 ని॥ల వరకు గ్రహణ నియమాలను పాటించాలి.


వృద్ధులు ,  పిల్లలు , వ్యాధి గ్రస్థులు మరియు గర్భిణీ స్త్రీలు తేది : 27 - 07 - 2018 , శుక్రవారము , సాయంత్రం 05:30 ని॥ల నుండి గ్రహణ మోక్ష కాలం వరకు గ్రహణ నియమాలను పాటించాలి.
వయస్సు రీత్యా , వ్యాధి తీవ్రత రీత్యా వృద్ధులు , ఆరోగ్య రీత్యా గర్భిణీ స్త్రీలు అన్ని గంటల పాటు గ్రహణ నియమాలను పాటించలేని , గత్యంతరము లేని స్థితి ఉన్నప్పుడు మాత్రము గ్రహణ స్పర్శ కాలము నుండి గ్రహణ మోక్ష కాలము వరకైనా గ్రహణ నియమాలను పాటించాలి.

ఇట్టి చంద్ర గ్రహణం..... ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలం కలదు ?

మేష రాశి , సింహ రాశి , వృశ్చిక రాశి , మీన రాశుల వారికి శుభ ఫలం
వృషభ రాశి , కర్కాటక రాశి , కన్యా రాశి , ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలం
మిథున రాశి , తులా రాశి , మకర రాశి , కుంభ రాశి వారికి అశుభ ఫలం


*గ్రహణాన్ని ఎవరు వీక్షించకూడదు ?

మిథున రాశి , తులా రాశి , మకర రాశి , కుంభ రాశి వారు మరియు గర్భిణీ స్త్రీలు ఇట్టి చంద్ర గ్రహణాన్ని వీక్షించకూడదు.

గ్రహణ దోష నివారణ కొరకు ఎవరు ఏ దానాలు , ఏ పూజలు చేయాలి ?
 
గ్రహణ మిశ్రమ ఫలం ఉన్న రాశుల వారు చేయవలసిన దానాలు :
గ్రహణ మిశ్రమ ఫలం కలవారు అనగా వృషభ రాశి , కర్కాటక రాశి , కన్యా రాశి మరియు ధనుస్సు రాశి వారు ఒక నూతన ఇత్తడి పాత్రలో నిండుగా ఆవు నెయ్యి వేసి అందులో వెండి చంద్రుని ప్రతిమ మరియు వెండి నాగ ప్రతిమ ఉంచి దానం ఇవ్వాలి.


గ్రహణ అశుభ ఫలం కలిగిన రాశుల వారు చేయవలసిన దానాలు :

ఒక నూతన ఇత్తడి పాత్రలో నిండుగా ఆవు నెయ్యి పోసి అందులో బంగారం చూరు , వెండి చంద్ర ప్రతిమ , వెండి నాగ విగ్రహము , ఒక మంచి ముత్యం వేసి దానమివ్వాలి.
తప్పకుండా గ్రహణ హోమము చేయించాలి.తెల్లటి వస్త్రము మరియు బియ్యం కూడా దానమివ్వాలి
గ్రహణ మోక్ష కాలము పూర్తయిన తర్వాత స్నానమాచరించి , సద్భ్రాహ్మణుడికి దక్షిణ తాంబూల సమేతంగా , సంకల్పయుక్తంగా పై సూచించిన దానాలు ఇవ్వాలి.


అపాత్ర దానం శూన్య ఫలాన్నిస్తుందని గరుణ పురాణంలో పేర్కొనబడినది.కావున ఎవరికిపడితే వారికి కాకుండా మీ మీ ప్రాంతాలలో ఉన్న సదాచార సంపన్నులు , నిష్ఠా గరిష్ఠులు , నిత్య జప-తప-హోమ యాగ క్రతువులు చేయువారు , నిత్య దేవతార్చన చేయువారు , వేదాధ్యయనము చేసిన వేద మూర్తులైన బ్రాహ్మణ పండితులకు దానమీయవలెను.అప్పుడే దాన ఫలితము లభించును.

క్రింది చంద్ర గాయత్రిని గ్రహణ సమయములో జపము చేసుకోవచ్చు.

ఓం క్షీర పుత్రాయ విద్మహే , అమృత తత్వాయ ధీమహి
తన్నో చంద్ర ప్రచోదయాత్ .


గ్రహణ సమయంలో నదీ స్నానం చేసి , నదీ తీరములో అనుష్ఠానము చేసుకోవడం సంపూర్ణ ఫలప్రదము,పుణ్య ప్రదము.

*భారత దేశముతో పాటు మిగితా ఏ ఏ దేశాలలో ఏ ఏ ప్రాంతాలలో చంద్ర గ్రహణం కనిపిస్తుంది ?
భారత దేశముతో పాటు యూరప్ , దక్షిణ అమేరికా , రష్యా , ఆస్ట్రేలియా , న్యూజిల్యాండ్ తదితర దేశాలలో , ఆసియా ఖండము , ఆఫ్రికా ఖండములలో , పసిఫిక్ మహా సముద్రం , హిందూ మహా సముద్రం , అట్లాంటిక్ మహా సముద్రము తదితర ప్రాంతాలలో ఇట్టి చంద్ర గ్రహణం కనిపిస్తుంది.



కావున పై సూచించిన దేశాలలో నివసించేవారికి చంద్ర గ్రహణం వర్తిస్తుంది.గ్రహణ నియమాలను పాటించాలి.
 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online