గురు పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం . చంద్రమా మనసో జాయతే .అని వేదం చెప్తుంది. సూర్య చంద్రులు వేదం చెప్పినట్లుగా భగవంతునికి రెండు కళ్ళు. అయితే లౌకిక ప్రపంచం లో చంద్రుడు జీవుల మనస్సును, సూర్యుడు జీవుల నేత్రాలకి మరియు జీవుల ఆరోగ్యానికి కారకుడు. అయితే ఈ గురు పూర్ణిమ రోజునే చంద్ర గ్రహణం వస్తోంది. యోగులు, మంత్రం సాధన చేసేవారు ఈ పౌర్ణమి రోజు ఇలా రావటం, ఇలా పండుగ రోజు కావడంవారికి ఎంతో విశేషం.
ఇక్కడ మంత్ర సాధన అంటె ఒకరకo వారు పాము,తేలు మంత్రము లు పెట్టేవాళ్లు గ్రహణం ప్రారంభం లోతలస్నానం చేసి ,తడిబట్టలు తోనేఒక ఆకు పసరు పైనుంచీ క్రిందికి మళ్లీ క్రింది నుంచీ పైకి పట్టి స్తూ ఆ మంత్రా లను పటిస్తూఉంటారు అలా గ్రహణం పూర్తిఅయ్యేoతవరకు చేసి తలస్నానం చేసి బైటకు వస్తారు.
ఇది ఒక రకo ఇం కొ రకం ఏమిటంటే ఈమంత్ర జపం చేసే వాళ్ళు గురువు ఎవరైనా లేక కుల గురువు , లేక పీఠాధిపతులు ఇలా వాళ్ళ వాళ్ళ ఇష్ట దేవత పై ఓ మంత్రం ఇస్తారు ఉదా; ఓం నమ; శివాయ లేక ఓం నమో నారాయణాయ లేక బీజాక్షరముల తో ఉన్న ఏదైనా అమ్మవారి మంత్రం అలా ఇస్తూవుంటారు .వాటిని గ్రహణం రోజు ,గ్రహణం సమయములో జపము చేసుకుంటూ కూర్చుంటారు.
ఇక ఏ మంత్రం లేకపోతే మీ వద్ద ఏ దేవత స్తోత్రం పుస్తకం ఉన్న అది చదువుకోo డి .ఎన్నిసార్లోకి అయినా చదువుకోవచ్చు తప్పులేదు కానీ పూజ లాంటివి చేయకూడదు ఎదో ఒక చోట ఓ ఆసనం పైన కదలకుండా కూర్చుని చదువుకోవాలి అంటే అర్థం బిగతీసుకొని కూర్చోమని కాదు ,ఇల్లు అంతా తిరగకుండాఒక
ఒకచక్కని ప్రదేశములో కూర్చుని చదువుకోవడం ఏమి రాకపోయినా ,తెలియక పోయినా మీకు నోటికి వచ్చిన మంత్రం చదువుకోవడం ఉత్తమo.
శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాన నే అనే తారక మంత్రం చదువుకున్నా కూడా ఎంతో మంచిది ,లేక ఓమ్ నమో వేoకటేశాయనమః అని చదువుకున్నా కూడా చాలా ఉత్తమం కలియుగములో అన్ని విషయాలు ఆ స్వామి అధీనంలోనే ఉంటాయి .
ఇక ఈసారి గ్రహణం వల్ల అన్నీరా సుల వారికి కొo త ఇబ్బంది కలగనున్న ది . అయితే కొన్ని రాజులకు ఎక్కువ ఉన్న మాట వాస్తవం .ఏది ఏమైన అందరు కూడా చంద్ర గ్రహణం కాబట్టి చంద్రుని ద రించిన పార్వతీ పరమేశ్వరులను దర్శించుకోవాలి అభిషే కమ్ చేయుo చుకోవాలి .సుబ్రహ్మణ్యస్వామి వారి పూజ చేయుo చుకున్నపరావాలేదు.పాలు. పెరుగు లేదా తెల్లని వస్త్రాలు లేదా తెల్ల ని పువ్వులు దానo చేయవచ్చు.
మన పెద్దలు ఇంట్లో నిలువ ఉంచే పదార్ధాల మీద దర్భలు వెయ్యమని చెప్తారు ఎందుకంటే దర్భాలకి రేడియేషన్ తట్టుకునే శక్తీ ఉంటుంది అని. మనకి అందరికీ అవి అందుబాటులో ఉండక పోవచ్చు. అప్పుడు మనకి గరిక దొరికితే అది కూడా వాడచ్చు.
మీకు దర్భలు దొరకక పోయినట్లయితే మరు నాడు ఉదయం పసుపు నీటిని ఇంట్లో చల్లండి.
ఏది ఏమైనా భగవంతుడు ని నమ్ముకుని నడుచుకుంటూ ఉంటే ఏదో రకం గా బైటపడతాం ఏదీ కుదరక పో తే మీ దగ్గరలో ఏదో గుడి కి వెళ్లి దైవ ప్రార్థన చేసుకోండి ఎప్పుడైనా భగవంతుడు ఒక్కడే వివిధ రూపా లలో కనిపిస్తూఉంటాడు.
0 comments:
Post a Comment