Pages

Proof of existance of Dwaraka


paityantakam - some uses

మనం ఇదివరలో ఆయుర్వేద మం దులు వాటి గురించి తెలుసు కుంటు న్నాం కదా. అందులో భాగంగా మనము రోజు పైత్యామ్ తకము గురించి తెలుసు కుందా ము.

  మనము చీటీకి, మాటికి ప్రతీచిన్న విషయానికి డాక్టర్ దగ్గర కు వెళ్ళటం, వాళ్ళే మో ప్రతిసారీ యాంటీబయోటెక్స్ మందులు ఇవ్వడం జరుగుతూ వుంటుంది. ఉదాహరణకి కొన్ని కాలాల్లో సీజన్ బట్టి వాతం వేడి పైత్యం.వస్తాయి దానినే ఆయుర్వేదంలో వాత పిత్త కఫo లు అని పిలుస్తుంటారు.అలాంటి వాటిలో ఒకటి పైత్యం పైత్యం చాలా రకాలుగా వుంటుంది, వస్తూవుంటుంది కూడా అది కొంతమందిశరీరం పై దద్దుర్లు రావడం దురదగాఉండటం ,కొంతమందిలో తల తిరగటం ,వాంతులు అవడం నిద్ర1పట్టకపోవడం ఆకలి లేకపోవడం నోట్లో నీళ్లు ఊరడం పిచ్చి, పిచ్చి ఆలోచనలు రావడం, మైండ్ కాస్త తిక్క, తిక్క గా వుండటం లాంటీవి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా body లో పైత్యం పెరగడం వల్ల లక్షణాలు అని చెప్పవచ్చు.

 కొంతమంది లో చాలా రోజులు జ్వరం తగిలి తగ్గిన తరువాత కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తూవుంటాయి, ఇంకా ఎక్కువగా ఇంగ్లీషు మందులు వాడే వారిలో కూడా లక్షణాలు కనిపిస్తూవుంటాయి.అలానే మినరల్ వాటర్ తాగే వారిలో కూడా ఈ లక్షణాల కనిపిస్తాయి. ఇంకా వర్షాకాలంలో వచ్చే కొత్త నీరు వల్ల కూడా ఇటువంటి పైత్యం కి సంభo!ధి o చిన వి వస్తూవుంటాయి. ముఖ్యంగా యాంటీ బయోటిక్ మందులు వాడినప్పుడు ,జ్వరం మందులు ఎక్కువకాలం వాడినప్పుడు ఇలా జరుగుతూవుంటుంది, అందుకే మధ్య డాక్టర్లు పా oటా జొల్ ,పాంటో డెక్ పాంటాప్20,ఫాంటప్40 ఇలా ప్రతీమ o దుల కోర్సుకు ఒక ఏంటాసిడ్ తప్పకుండా ఇస్తారు ,అయితే ఇటువంటి పైత్యం రోగాలకు ఆయుర్వేదము లోను,గృహ వైద్యములోను మంచి మందులు, sideffects లేకుండా చాలా వున్నాయి. ఇక దీనికి నివారణ గృహ వైద్యమ్ లో చాలా చేసుకోవచ్చు

      అస్సలు మనలో ,,,.కొద్ది కొద్దిగా లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ప్రతి రోజు అల్లం చిన్నముక్క+కొద్దిగా ధనియాలు+కొద్దిగా జీలకర్ర +ఒక కప్పు నీరు పోసి మిక్సీ పట్టాలి దానిలో ఇంకోo చెమ్ నీరు పోసి స్టవ్ పై పొంగించుకోవాలి కొంచం మరిగి పొం గా నే దించి కొద్దిసేపు చల్లారిన తరువాత చిన్న కప్పుడు ఉండాలి కషాయం దానిని పరకడుపన త్రాగాలి .అలా కొద్దిరోజులు త్రాగాలి ఇంకా లెక్కగా కావాలంటే కుంకుడు కాయ అంత అల్లం ముక్క , రెండు చెమ్చాలు ధనియాలు ఒక చెంచా జీలకర్ర కొంచం అటు ఇటుగా అయినా పర్వాలేదు , ఇక మీకు ఉన్న సమస్య తీవ్రతను పట్టీ మూడు రోజులు ,]అయిదు రోజులు అలా తీసుకోవచ్చు ఇది ముఖ్యముగా జ్వరం వచ్చి తగ్గినవాళ్లకు ,]లేక బాగా ఇంగ్లీషు మందులు వాడుతూ వికారం గా ఉన్నవాళ్లకు మంచిగా పనిచేస్తుంది . .

 అలానే ఇంకో విధానo లో కొంచం జీలకర్ర తీసుకొని దోరగా వేయిo o డి .దానిని మిక్సీ లో పౌడర్ గా పట్టుకొని భోజనం కు తొలి ముద్ద లో ఒక స్పూన్ జీలకర్ర పొడి ని తీసుకొనికొ ద్ధిగా నెయ్యి వేసుకొని (అది ఆవు నేయుఅయితే మరింత శ్రేష్ఠం) మొదటగా తినాలి .ప్రత్యేకముగా శరీరంలో పైత్యం లక్షణాలు నిపిస్తున్నప్పుడు తిన్న అన్నం సహించక పోవడం బయటకు వా o తు లా అవుతున్నట్టు ,గ్యాస్ ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ గా వున్నప్పుడు ,నోరు ఒక రకం గా ఏదో పచ్చిఆకు తిన్న ట్లుగా నోరు అరుచి గా వున్నపుడు విధానం బాగా పని చేస్తుంది. ఇక ఇక్కడ మనం చెప్పుకున్నవి. అన్నీ కూడా గృహ వైద్యం క్రిందకు వస్తాయి.

 ఇక ఇవేమీ చేసుకోలే ని వారు మీ దగ్గర లో ఆయుర్వేదం షా పు ఉంటే అక్కడ పైత్యాo తకంపేరు కల ఒక సీసా కొనుక్కోండి ,అది చిన్నపిల్లలకు, పెద్ద వాళ్లకు అందరికి పనికీవస్తుంది మీకు అన్నివేళ ల్లో పనికి వస్తుంది. అది తెచ్చుకొని సెనగగింజ అంత ముద్ద తీసికొని ఒక ఏదైనా చిన్న ప్లేటులో కానీ ,లేక అర చేతిలో వేసుకోనైన సరే దానిపై. స్పూన్ తేనె వేసుకుని వ్రే లితో మొత్తం రంగరించి కల్పి పరకడుపున మూడు లేక అయిదు రోజులు నాకాలి . తీసుకున్నతరువాత 1o నిమిషాలు వరకు ఏమీ తీసుకోవద్దు .ఇక ఇదే వైద్యం రాత్రిపూట ఉద్యోగం చేస్తూ నిదుర కాసే వాళ్ళకి కూడ పైత్యం పెరుగుతుంది వాళ్లకు కూడా మంచిది .ఇంకా మానసిక రుగ్మత ఉన్న వా ళ్లకు, డిప్రెషన్ తో బాధ పడుతున్న వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. అలాగే ఊరేకె అస్తమానం వులించే వాళ్లకు కూడా వీటిలో ఏది ఆయనను ఆచరించ వచ్చును.

 శుభం భూయాత్ ****



 

Lunar eclipse - some special things we do


గురు పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం .  చంద్రమా మనసో జాయతే .అని వేదం చెప్తుంది.  సూర్య చంద్రులు వేదం చెప్పినట్లుగా భగవంతునికి రెండు కళ్ళు.  అయితే లౌకిక ప్రపంచం లో చంద్రుడు జీవుల మనస్సును, సూర్యుడు జీవుల నేత్రాలకి మరియు జీవుల ఆరోగ్యానికి కారకుడు.  అయితే ఈ గురు పూర్ణిమ రోజునే చంద్ర గ్రహణం వస్తోంది.  యోగులు, మంత్రం సాధన చేసేవారు ఈ పౌర్ణమి రోజు ఇలా రావటం, ఇలా పండుగ రోజు కావడంవారికి ఎంతో విశేషం.

ఇక్కడ మంత్ర సాధన అంటె ఒకరకo వారు పాము,తేలు మంత్రము లు పెట్టేవాళ్లు గ్రహణం ప్రారంభం లోతలస్నానం చేసి ,తడిబట్టలు తోనేఒక ఆకు పసరు పైనుంచీ క్రిందికి మళ్లీ క్రింది నుంచీ పైకి పట్టి స్తూ మంత్రా లను పటిస్తూఉంటారు అలా గ్రహణం పూర్తిఅయ్యేoతవరకు చేసి తలస్నానం చేసి బైటకు వస్తారు.

ఇది ఒక రకo ఇం కొ రకం ఏమిటంటే ఈమంత్ర జపం చేసే వాళ్ళు గురువు ఎవరైనా లేక కుల గురువు , లేక పీఠాధిపతులు ఇలా వాళ్ళ వాళ్ళ ఇష్ట దేవత పై మంత్రం ఇస్తారు ఉదా; ఓం నమ; శివాయ లేక ఓం నమో నారాయణాయ లేక బీజాక్షరముల తో ఉన్న ఏదైనా అమ్మవారి మంత్రం అలా ఇస్తూవుంటారు .వాటిని గ్రహణం రోజు ,గ్రహణం సమయములో జపము చేసుకుంటూ కూర్చుంటారు.

 ఇక మంత్రం లేకపోతే మీ వద్ద దేవత స్తోత్రం పుస్తకం ఉన్న అది చదువుకోo డి .ఎన్నిసార్లోకి అయినా చదువుకోవచ్చు తప్పులేదు కానీ పూజ లాంటివి చేయకూడదు ఎదో ఒక చోట ఆసనం పైన కదలకుండా కూర్చుని చదువుకోవాలి అంటే అర్థం బిగతీసుకొని కూర్చోమని కాదు ,ఇల్లు అంతా తిరగకుండాఒక
ఒకచక్కని ప్రదేశములో కూర్చుని చదువుకోవడం ఏమి రాకపోయినా ,తెలియక పోయినా మీకు నోటికి వచ్చిన మంత్రం చదువుకోవడం ఉత్తమo.

శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాన నే అనే తారక మంత్రం చదువుకున్నా కూడా ఎంతో మంచిది ,లేక ఓమ్ నమో వేoకటేశాయనమః అని చదువుకున్నా కూడా చాలా ఉత్తమం కలియుగములో అన్ని విషయాలు స్వామి అధీనంలోనే ఉంటాయి .

ఇక ఈసారి గ్రహణం వల్ల అన్నీరా సుల వారికి కొo ఇబ్బంది కలగనున్న ది . అయితే కొన్ని రాజులకు ఎక్కువ ఉన్న మాట వాస్తవం .ఏది ఏమైన అందరు కూడా చంద్ర గ్రహణం కాబట్టి చంద్రుని రించిన పార్వతీ పరమేశ్వరులను దర్శించుకోవాలి అభిషే కమ్ చేయుo చుకోవాలి .సుబ్రహ్మణ్యస్వామి వారి పూజ చేయుo చుకున్నపరావాలేదు.పాలు. పెరుగు లేదా తెల్లని వస్త్రాలు లేదా తెల్ల ని పువ్వులు దానo చేయవచ్చు.

మన పెద్దలు ఇంట్లో నిలువ ఉంచే పదార్ధాల మీద దర్భలు వెయ్యమని చెప్తారు ఎందుకంటే దర్భాలకి రేడియేషన్ తట్టుకునే శక్తీ ఉంటుంది అని.  మనకి అందరికీ అవి అందుబాటులో ఉండక పోవచ్చు.  అప్పుడు మనకి గరిక దొరికితే అది కూడా వాడచ్చు.

మీకు దర్భలు దొరకక పోయినట్లయితే మరు నాడు ఉదయం పసుపు నీటిని ఇంట్లో చల్లండి.


ఏది ఏమైనా భగవంతుడు ని నమ్ముకుని నడుచుకుంటూ ఉంటే ఏదో రకం గా బైటపడతాం ఏదీ కుదరక పో తే మీ దగ్గరలో ఏదో గుడి కి వెళ్లి దైవ ప్రార్థన చేసుకోండి ఎప్పుడైనా భగవంతుడు ఒక్కడే వివిధ రూపా లలో కనిపిస్తూఉంటాడు.
 
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online