Pages

The meaning of the shloka Raamaaya raama bhadraya

ప్రసిద్ధమైన   "రామాయ రామభద్రాయ" శ్లోకంలో అంతరార్థం ఇది.


రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః


భావం

రాముని కొరకు,  రామభద్రుని కొరకు, రామచంద్రుని కొరకు, విష్ణుస్వరూపుడై అన్నింటిని  విధించే  వానికొరకు  రఘునాథుని కొరకు, నాథుని కొరకు, సీతాపతికొరకు  నమస్కారం.

ఇది పై పైన కనిపించే అర్థం.

దీని ఆంతరార్థం ఇది

రాముణ్ణి ఎవరెవరు ఎలా పిలుచుకొనేవారో చెప్పే అత్యద్భుత శ్లోకమిది.

1.రామాయ- దశరథ, కౌసల్య, సుమిత్ర, కైకేయిలు  పిలిచే పేరు

2. రామభద్రాయ- భద్రస్య ఆసౌ- రామభద్రః - రామునిపరిపాలనలో ఏవిధమైన అశుభాలు లేవని ఆయనను కీర్తిస్తూ సుమంత్రుడు మొదలైన మంత్రులు  పిలిచే పేరు

3.రామచంద్రాయ- చంద్ర ఇవ రామః - అయోధ్యా ప్రజలు పిలుచుకొనే పేరు. రామున్ని చూడనివాడు- రామునిచేత చూడబడనివాడు  ఆనాడు అయోధ్యా నగరంలో  బాధపడేవారు

4.వేధసే -విష్ణౌ చ వేథాః- విధతీతి వేధాః- విధించేవాడు వేధ.విష్ణు స్వరూపము రామ బ్రహ్మమని తెలుసుకొన్న మునులు అలా పిలిచేవారు.

5.రఘునాథా- ,రామునికి  లాలి పోసి పెంచిన దాదులు రఘునాథా-  అని  పిలిచేవారు

6.నాథా- సీతమ్మ నాథా  పిలిచేది

7.సీతాయాః పతయే - రామున్ని మిథిలా నగరంలో ప్రజలు- మా సీతమ్మ మొగుడు- సీతాపతి అని  పిలుచుకొనేవారట.

1 comments:

Anonymous said...

sri rama jaya rama jaya jaya rama

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online