Pages

ప్రేమ కు మరొక వైపు short story part - 5

ఇక పెళ్లి జరిగిపోవడం ,శ్రీరామ్ ,కీర్తి లు దంపతుల అయు పుట్టినింటికి ,మెట్టినింటికి తిరుగుతూ వున్నారు .పూర్తి వ్యవసాయ భాధ్య తలు శ్రీరామ్ చూసుకోవాల్సి వస్తోంది .ఇక గ్రామంలో ప్రజలు కూడా శ్రీరామ్ ని సర్పంచ్ గా పోటీ చేయమంటున్నారు .వచ్చేవాళ్ళు ,పోయే వాళ్లకు గౌరవ మర్యాదలు చేస్తూ క్షణం తీరిక లేకుండా బిజీ బిజీ గా గడిపేస్తోం ది .కీర్తి . ........లోకేష్ ....పూజా మధ్య పరిచయం ,స్నేహం గా మారి ... మూడు కోపాలు ఆరు సరసాలు గా మారి ప్రేమ గా రూపాంతరం చెంది పోయింది .ఏదో పని పై హైదరాబాద్ వస్తూ వెళ్ళుతూ పూజ ను కల్సుకొంటూ నే వున్నారు . యూనివర్సిటి క్యాంపస్ లో లైబ్రరీ నుంచీ బైటకు వచ్చాడ ,లోకేష్ .బైట ఏదో ఉద్యమం గోల ఎక్కువ గా వుండటం తో కొంచం దూరము గా నడుస్తున్నాడు .దారి అంతా బ్రాహ్మణుడి పై వెటకారం గా వేసిన చిత్రాలు ,పొంతన లేని సంస్కృత శ్లోకాలు , భారతీయ సంస్కృతి లో ,మనువు ,పురాణాలు స్త్రీ ని బానిస గా తయారుచేశాయి .అని ఒక పెద్ద వ్యాసం వ్రాసి యత్ర నార్యం తు పూజ్యతే తత్ర రమ్యం తే దేవతాః అనే శ్లోకం వ్రాసి మహిళ ను ఇలా ఆట వస్తువు గా ఆడుకున్నారు .అని వ్రాస్తారు ఇటువంటివి యూనివర్సిటి నిండా కనపడుతూనే ఉంటాయి .ఇంకో చోట గుడిలోకి వస్తే జనం చేత చొక్కాలు విప్పిస్తారు ఆచారం మాటున పూజారులు వాళ్ళ కులం వాళ్ళు జంధ్యం వేసుకున్నవాళ్ళు ఎంతమంది అని వెతుక్కొంటూ వుంటారట .ఇవి వీళ్ళకు తెల్సిన విజ్ఞానం .నవ్వుకొంటూ ముందుకు వెళ్ళుతున్నాడు లోకేష్

.ఒక పెద్ద చెట్టు చూసుకొని అక్కడ సెటిల్ అయ్యాడు . పూజ కోసం ఎదురు చూస్తున్నాడు . చిరు జల్లు ప్రారంభం అయుంది . పెద్ద పెద్ద చెట్లన్ని పూవ్వులతో నిండి ఉన్నాయు .అడవి కి పెట్టిన కంచె మాటున నెమళ్ళు పూరి విప్పి ఆడుతున్నాయి . ఎప్పుడు కలుసుకొనే లొకేషన్ కాబట్టి గబా గబా పరిగెత్తుకుంటూ లోకేష్ ని చేరుకొంది పూజ .ఇంతలో వర్షం పెద్దగా పడటం ప్రారంభం అయుం ది .ఇద్దరు కల్సి పాత బడిన ఇంటి లోకి వెళ్లి తల దాచుకున్నారు.ఇంటి చుట్టూ వర్షం లో మాత్రం ఆవులు ,గేదెలు మేత మేస్తున్నాయి . పాత పాక లో పిచ్చుకల సందడి బాగా చేస్తున్నాయి .చల్లటి గాలికి ఇద్దరు దగ్గరకు అంటుకొని కూర్చున్నారు .

మౌసం ఎలా వుంది మేడం చుట్టూ చేతులు వేస్తూ చిరునవ్వులు చిందిస్తూ అడిగాడు లోకేష్ .బాబూ నాకు మాత్రం మీ వూళ్ళో వున్నట్లు గా అనిపిస్తోంది .ఏమంటున్నారు మీ వాళ్ళు మన పెళ్లి గురించి ఆత్రుత గా అడిగాడు .లోకేష్ . ఏముంది బాబు పెళ్లి లో ఒకళ్ళు నన్ను చూశారట .నేను బాగా నచ్చాను అట వాళ్ళు వచ్చి మా డాడీ ని అడిగారు .కొంచం హొయలు పోతూ ,దీర్ఘాలు తీస్తూ చెప్పింది పూజ .మరి ఇంకేం ఒప్పెసుకోపోయావా ? వెటకారంగా అన్నాడు లోకేష్ .నాదే౦ పోయుంది బాబు మీకు ఒక మాట చెప్పి వెళ్ళితే బాగుంటుంది అని ఆగాను .తను కూడా వెటకారం గా చెప్పింది . అబ్బా అంత సీన్ లేదులే కానీ మీ నాన్న గారు ఏమన్నారో చెప్పు .మళ్ళీ కొంటెగా అడిగాడు లోకేష్ .ఏముంది మా చుట్టాల్లోనే మగధీర వున్నాడు ,వాడిదే కూన అని చెప్పారు దీర్ఘాలు తీస్తూ చెప్పింది పూజ . ఇక లేవండి బాబు మా ఇంట్లో చెప్పాను మిమ్ములను తీసుకొని వస్తాను అని ,ఎలా అయునా ఇప్పుడు మీరు మా ఇంటికి రావాల్సిందే ?అని పూజ పట్టు పట్టడం తో లోకేష్ పూజ వాళ్ళ ఇంటికి బయలు దేరి వెళ్ళారు .

.లోకేష్ ఇంటికి రాగానే పూజా వాళ్ళు ఘనం గా స్వాగతం పలికారు . కుశల ప్రశ్నలు కాగానే అంతా పిచ్చా పాటి మాట్లాడుకొంటున్నారు . బాబు మా అమ్మాయికి మీ వూరు ,మీ ఇల్లు బాగా నచ్చాయి .మీ కుటుంబం అంతా నచ్చారు .గబా గబా ఆనంద౦ గా చెప్పుకు పోతూవున్నది పూజ తల్లి ప్రస్సన్న .సరే నండి ఇంతకు అంతా నచ్చారు ,ఓకే మరి నేను నచ్చానో లేదో అది అడిగారా లేదా ?కొంటెగా అడిగాడు లోకేష్ .మీరు భలేవారు బాబు మీ వల్లనే కదా అంతా నవ్వుతూ పూజ తల్లి ప్రస్సన్న .అవునండీ లోకేష్ గారు మా అమ్మ ఏం చెప్పింది ,ఏమేమి నచ్చాయో లిస్టు చెప్పింది ,దాని లో మీ విషయం లేదు కదా ,ఇంకా డౌట్ ఎందుకో అబ్బాయి గారికి ?చిలిపిగా కనుబొమ్మలు ఎత్తి అడుగుతోంది పూజ .కానీ నా లిస్టు లో మాత్రం మొదటి గా నచ్చింది మీ కొంటె కోణ౦గే నండి ,చిరునవ్వుతో చెప్పాడు లోకేష్ . బాబు కోణ౦ గి ....కొంగ అంటే బాగుండదు .ఇంకా పెళ్లి కాలేదు .కొంచం కోపం నటిస్తూ అన్నది పూజ .సారి ...,మేడం గారు సారీ నవ్వుతూ చెప్పాడు లోకేష్ .సరే బాబు మీ అమ్మా నాన్న గారితో మాట్లాడటానికి మేం వస్తాం ఓకే నా .పూజా .... బాబు కి తినడా నికి ఏమైనా పెడుతున్నావా లేదా కేక వేసింది పూజ తల్లి ప్రసన్న .

* * * * కీర్తి ,శ్రీరామ్ లు సరదాగా పంటపొలాల కేసి వెళ్ళారు .వర్షం కుండపోతగా కొడుతోంది . రైతు కూలీలంతా అటూ ఇటూ పరిగెత్తి అక్కడ అక్కడ నక్కారు ,ఫార్మ్ హౌసు దగ్గరలో వుండటం తో దానిలోకి దూరారు .కిరీటీ దగ్గర కూర్చుండిపోయారు . పెద్ద కిరీటీ అవడం వల్ల వర్షం తోటల్లో కురూస్తున్న దృశ్యం చాలా అందంగా కనిపిస్తోంది .శ్రీ రామ్ పెద్ద బల్లపై పడుకొని కబుర్లు చెప్పుతున్నాడు . కొంచం దూరం గా కనిపిస్తూవున్న భావి భావి గోడ పై కొన్ని కాకులు నిలబడి తలలు విదిలిస్తున్నా యు .పండు పచ్చి మేరప కాయలు శుబ్రం గా కడిగినట్లు మెరుస్తున్నాయి .వర్షం లో కూడా కాకులు ఎర్రగా పండిన చీమ చింత గుబ్బలను పొడుచుకొని తింటూ ఎంజాయ్ చేస్తున్నాయి .ఆకు పచ్చ రామ చిలుకల జంట కొబ్బరి చెట్లపై గుబురుల్లో సైఆట లు ఆడుతున్నాయి .ఒక గోరువంక కొబ్బరి చెట్టు తొర్ర లో దూరి పిల్లలకు ఆహారం అంది స్తోంది .ఒకటి బైట కాపలా గా అన్ని వైపులా పరికించి చూస్తో ది . శ్రీ రామ్ ప్రక్కన సగం వాలిపోయున కీర్తి కూడా ఆత్రుత గా చూస్తోంది . మనస్సులో మాత్రం తన పట్టణం ,అక్కడి ఫ్రెండ్స్ ,సినిమాలు ,క్లబ్బులు తెగ గుర్తు కు వస్తున్నాయి . వానలు బురద రొచ్చు ,పశువుల పాకలు ఇవన్నీ ముళ్ళ పై కూర్చున్నంత గా ఫీలయుపోతుం ది .కీర్తి .

 ఏమిటి మేడం ఉలుకు లేదు పలుకు లేదు అంటూ నడుం పై సింగారం గా చేయు వేశాడు శ్రీరామ్ .అబ్బా ఉండండి మీ రైతులు ఎవరైనా చూస్తే బాగుండదు అంటూ కొంచం విస్సుగ్గా చేయు తీసేసింది కీర్తి .మీకేం బాబు బురద లో పడి లసుకు ,పిసుక్కోం టూ వెళ్ళాలి .కీర్తి అలా విస్సుగు గా మాట్లాడుతుంటే శ్రీరామ్ ఆశ్చర్యం గా ఆమె వైపు నిర్ఘాంతపోయి చూస్తున్నాడు . .అదేమిటి నీవు చూస్తావని తీసుకొచ్చాను ,నీకు ఇష్టం లేకపోతె చెప్పచ్చుగా ,సరదాగా ఎద్డ్ల బండి పై అన్నీ చూడచ్చు అని ఇలా తీసుకొని వచ్చా ,మరి ముందే చెబితే నేను వత్తిడి చేసే వాడిని కాదు కదా శ్రీరామ్ కాస్త బాధ పడుతూ చెప్పాడు . మీరు పిలిచారు రాకపోతే మీ అమ్మగారు ఊరుకుంటారా ?విసుగ్గా ముఖం పెట్టుకొని చెప్పింది కీర్తి .మా అమ్మ అటువంటిది కాదు .ఇష్టం లేకుండా పని చేయద్దు అన్ని నాకు ఎన్నో సార్లు చెప్పింది .కొంచం కటువుగా చెప్పాడు శ్రీరామ్ . ........కొద్ది సేపు మౌనం .....సరే కార్ పంపమని ఇంట్లో చెప్పాను .ఇక ప్రశాంతం గా వుండు .కార్ లో వెల్లిపోదాం .చిన్నగా చెప్పాడు శ్రీరామ్


ఏమిటో ఆమె బాధ నాకు అర్థం కావడం లేదు ,ప్రతీ దానికి విసుగే ,చేతిలో అందరూ పనివాళ్ళు వున్నారు .అంత కష్ట పడేది కూడా ఎమీ లేదు.ఎందుకు అలా ప్రవర్తిస్తో౦ది ,అమ్మ తో చెబితే ఏ౦ అపార్థం చేసుకొంటుం దో ,సరే కానీ ఎలా అయునా నేనే తెల్సుకుంటాను .అలా ఆలోచనల్లో పడిపోయాడు శ్రీరామ్

* * * *
లోకేష్ ఇంట్లో పెళ్లి హడావిడి మొదలైపో యింది .లోకేష్ వాళ్ళు పెళ్ళికూతురు పూజ ఇంటికి తరలి వెళ్ళుతూ వున్నారు .శ్రీరామ్ ని కీర్తి ని కూడా తన వెంట రమ్మని పట్టుదల పట్టాడు లోకేష్ . విషయం తెలుసుకోగానే కీర్తి లో ఆనందం ఉప్పొంగి పోయింది . మార్పు చూసిన శ్రీరామ్ తనలో తను ఆశ్చర్య పడ్డాడు .ఏమోలె కీర్తి డి కూడా వాళ్ల ఊరే కాబట్టి ఆనంద పడుతూంది అనుకున్నాడు . తరువాత శ్రీరామ్ ,కీర్తి కల్సి లోకేష్ పెళ్లి జరిపించారు .ఇక శ్రీరామ్ తిరిగి వాళ్ళ వూరు కి బయలు దేరాడు .కీర్తి తరువాత వస్తాను అని చెప్పి పంపేసింది .కొద్దికాలం అలా గడిచిపో యుంది .ఏమిటమ్మా అల్లుడు గారు వెళ్లి కూడా వారం అయుపోతు౦ది .నువ్వు ఏమిటి అలా వున్నావు ?గుచ్చి గుచ్చి అడిగాడు కీర్తి తండ్రి గారు ,చాలాసేపు వాదనలు అయునతరువాత నాన్నగారు పల్లె టూర్ వెళ్ళి నేను ఉండలేను .గట్టిగా చెప్పి అక్కడ నుంచీ లేచి వెళ్లి పో యింది కీర్తి .మరి పెళ్లి చేసుకొనేటప్పుడు తేలీ యదా ? అది పల్లుటూర్ అని అదే అత్తగారి వూరు అవుతుంది అని ,గట్టిగా గర్జి స్తున్నాడు కీర్తి తండ్రి గారు .అబ్బ ఒక్క నిమషం మీరు ఆగండి నేను తెలుసుకుంటా ను అంటూ భర్త ని సముదాయి ఛి నది .కీర్తి తల్లి సుభద్ర వాదోపవాదాలు ,సర్దిచెప్పటా లు ,బ్రతిమి లాడి చెప్పడం అన్నీ పూర్తయు టప్పటి కి కొన్ని రోజులు పట్టింది . ఒకరోజు శ్రీరాంమ్ ఇంటికి ఫోన్ చేసింది కీర్తి తల్లి సుభద్ర .వదిన గారు అమ్మాయుని పంపడం కొంచం ఆలశ్యం అవుతొ౦ది .మరోలా భావించ కండి . కొద్ది రోజుల్లో బయలు దేరి తీసుకొచ్చి మీ దగ్గర దింపు తాం .క్షమిచండి .అల్లుడు గారికి కూడా తెలియపరచ గలరు .అంటూ వినయం గా చెప్పి ఫోన్ పెట్టేసింది సుభద్ర

 . ... .ఒకరోజు లోకేష్ ఇంటికి వెళ్ళాడు శ్రీరామ్ .శ్రీరామ్ మరియు కొత్త దంపతులు తోట లో కూర్చొని పిచ్చా పాటి మాట్లాడుకొంటున్నారు .మాటల్లో కీర్తి విషయం వచ్చింది .ఇంకా కీర్తి అక్కడ నుంచీ రాలేదా .ఆశ్చర్యం గా అడిగాడు లోకేష్ .ఏ౦ చెప్పమంటావు రా ,మొదట్లో బాగానే వుంది ,తరువాత మెల్లగా మార్పు వచ్చి మూడిస్ట్ లా చేస్తుంది .నాకు ఏమి పాలుబోవడం లేదు ,ఇంట్లో అంటే వాళ్ళు ఏదేదో ఊహించి బాధపడ తారేమో అని భయం .తనలోని బాధ ను వ్యక్తం చేశాడు శ్రీరామ్ . అదేమిటిరా బాబు నీ వల్ల మేము ప్రేమించుకొని ,మా బంధుత్త్వాలు తెలుసుకొని మే౦ పెళ్లి చేసుకున్నాం .అని చె బుతూన్న లోకేష్ మాటలకు అడ్డం వచ్చిన పూజ అన్నయ గారు నాకు అంతా తెలుస్సు ,మొదటి నుంచీ తను అన్నట్లే చేస్తుంది కీర్తి . కారణం ఏమిటో నీకు తెలుస్సా మ్మా పూజ .హమ్మయ్య కాస్త చెప్పవా రాత్రింబవళ్ళు ఆలోచించి చస్తూన్నా ,కాస్తంత నిట్టూర్పు విడుస్తూ అడిగాడు శ్రీరామ్ ,కాస్త ఏమిట్రా మొత్తం చెప్పాల్సిందే లేకపోతె పూజ పని చెబుతా నేను ,ఘీంకరిస్తూ న్నాడు లోకేష్ .అదిగో అదే వద్దన్నా కళ్ళు పెద్దవి చేసింది పూజ .వాడిని నేను చూసుకుంటాలేమ్మా చెప్పు తల్లీ . ఏ౦ లేదు అన్నయగారు ఒకరోజు నాతొ శ్రీ రామ్ నాకు బావ ,పెళ్లి సంబంధం ఓకే కాని పల్లె టూర్లు తనకు నచ్చలేదు ఏమి చేయాలో అని తల పట్టుకొని కూర్చొ౦ ది .అప్పుడు నేను చెప్పాను .మీరు ఇద్దరు చదువుకున్న వాళ్ళే కాబట్టి ఇక్కడే వుండి పోనక్కరలేదు ,భవిషత్తు లో సిటీ కి మారవచ్చు ,కొద్ది కాలం ఓపిక పట్టు అని చెప్పాను .మరి నాతొ ఓకే అలానే అన్నది .ఇలా ఎందుకు చేస్తున్నదో నాకేమి అర్థం కావడం లేదు ,నేను మెల్లగా తెలుసుకుంటాను అని కొంచం బాధను వ్యక్తం చేస్తూ చెప్పింది పూజ .

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online