Pages

ప్రేమ కు మరొక వైపు short story part - 4

వెన్నెల పుచ్చ పువ్వు లా పసుపు రంగు లో ప్రకాశిస్తుంది .చంద్రుడు మేఘాలలో కి జారిపోతూ సయ్యాటలు ఆడుతున్నాడు .ఇంటిచుట్టూ పెద్ద పెద్ద చెట్ల లో నుంచీ వెన్నెల కాంతి పొగ లా క్రిందికి పడుతోంది .డాబా పైన ఉయ్యాల బల్ల పై కీర్తి ,శ్రీ రామ్ కూర్చోని మెల్ల మెల్ల గా ఊగుతున్నారు .ఏమ్మా ,కీర్తి శ్రీరామ్ ఏమంటున్నాడు ,మీ ఇద్దరి పెళ్లి గురించి మీ అమ్మా ,నాన్నల తో మాట్లాడాను .రెండు రోజుల్లో ముహూర్తాలు వ్రాసుకొని ఇక్కడికి వస్తాం అని చెప్పారు కొంచం నవ్వుతూ గంభీరమైన స్వరం తో చెప్పాడు వెంకట్రావ్ .కొంచం సిగ్గుగా తల వంచుకొని ముసి ముసి గా నవ్వుతోంది కీర్తి .మెల్లగా కీర్తి నడుం ని నొక్కుతున్నాడు శ్రీరామ్ .

సెల్ చూసుకొంటూ షాక్ అయుపోతోంది పూజ .నా వాట్సప్ లో కి లోకేష్ ఎలా వచ్చాడు .మంచిగా ఇంటికి చేరుకున్నారా ,మా వూరు లలో వెన్నెల బాగా నచ్చిందా , ఇక బాగా ఎంజాయ్ చేయండి .చదివి మళ్ళీ టైపు చేస్తుంది పూజ .మీకు నా నె౦బర్ ఎవరు ఇచ్చారు ,ముందు చెప్పండి . దాని ది ము౦ది లేండి ,మనస్సయుతే మార్గం అదే దొరుకుతుంది .మీరు మాకు బంధువులు కూడా అవుతారట ,మా నాన్న గారు మీరు వెళ్ళిన తరువాత అంతా చెప్పారు అంటూ .లోకేష్ టైపు చేశాడు .మనస్సు అవడం ఏమిటి ?దాని అర్థం తెలుస్సా ?అవి పిచ్చి మాటలు తెలుసుకోండి .కోపంగా టైపు చేసింది పూజ .నేను ఏమైనా మనువాడతాను లాంటి ప్రేమ పదాలు వాడలేదు గా మేడం మీకు అంత కోపం అయుతే మూసుకోండి ,మేం కూడా మా మనస్సు లోపల పెట్టుకొని జిప్ప్ వేసుకొంటా౦ . మే౦ అంత అల్లాటప్పా మనుషులం కాము .మేము అస్సలు సిస్సలు గ్రామీణుల౦ .ఏదో మా గ్రామాల్లో చూడాల్సిన ప్రదేశాలు గురించి చెబుదాం ,హెల్ప్ చేద్దాం అనకున్నా ,మీరు అలా తప్పులు కడితే నాకు అవసరం లేదు బై ఇక వుంటాను .బెట్టు చేస్తూ చాటింగ్ నుంచీ తప్పుకున్నాడు లోకేష్ . ఖంగు తింది పూజ .


  ఏమ్మా పూజ నువ్వు ఏమి మాట్లాడటం లేదు ,మా ఇల్లు ,మా వూరు ఎలా ఉన్నాయు ఏమిటి ,ముఖ్యంగా మా శ్రీరామ్ ,కీర్తి కాబోతున్న పెళ్లి జంట పై నీ అభిప్రాయం చెప్పలేదు .ఇంతకు మరి నీ పెళ్లి ఎప్పుడు ప్రశ్నల పై ప్రశ్నలు కురి పి స్తున్నాడు పెద్దాయన వేంకట రావ్ . నవ్వుకుంటూ తల వంచుకొంది పూజ ..పిచ్చాపాటి గా కొద్దిసేపు మాట్లాడుకొని అందరు లోపలికి వెళ్ళిపోయారు . అక్కడ లోకేష్ ఆరు బైట వెన్నెలలో నిద్ర రాక మంచం పై అటూ ఇటూ దొ ర్లుతున్నాడు . నేను అనవసర౦ గా తొ౦దరపడ్డానేమో మేడం కంటే ముందే నావాట్స్ ప్ లోంచి బైటకు రావడం , ఛా అస్సలు రాక రాక ఒక లవ్ బర్డ్ దొరికింది అనుకున్నాను .ఇంతలోనే మిస్ అయుపోయి౦ ది .పెదవి విరిచి ఆలోచనల్లో పడిపోయాడు . జాబిలి కాస్త నల్లటి కారు మేఘంలో ఇరుకున్నాడు .


* * * * కొద్దిరోజుల తరువాత ,కీర్తి వాళ్ళ అమ్మ ,నాన్న లు రావడం .మళ్ళీ చాలా నెలల వరకు ముహూర్తా లు లేవు అని తెల్సి ,ఎప్పటినుంచో అనుకొంటూ వున్న సంభందం కదా ,ఇంకా ఆలశ్యం ఎందుకు ?ఒక మంచి ముహూర్తములో అందరిని పిలి ఛి శ్రీరామ్ కి ,కీర్తికి పెళ్లి ఘనంగా పెళ్లి జరిపించారు . పెళ్లి లో పూజ లోకేష్ ని చూస్తూ వున్నా పెద్ద గా పట్టించు కోలేదు .లోకేష్ కు లోపల కొంచం బాధ వున్న పైకి తను కూడా పూజ పట్ల నటిస్తున్నాడు . పూజ వాళ్ళ తల్లి తండ్రులు , లోకేష్ వాళ్ళ తల్లి తండ్రులు మాత్రం వాళ్ళ బంధుత్వా లు గురింఛి మాట్లాడు కొంటున్నారు శ్రీరామ్ వైపు లోకేష్ వుంటూ వున్నాడు .కీర్తి వైపు పూజ వుండి అన్ని వేడుకలు జరిపిస్తున్నారు .పెళ్లి వేడుకల్లో కూడా తలంబ్రా లు ఘట్టములో శ్రీరామ్ ,కీర్తి లను వదిలేసి కసి కసి గా ఒకరిపై ఒకరు అక్షింతలు విసురుకున్నారు .చాలా వాటిలో కొద్దిగా మోసం చేసి కీర్తి వాళ్ళను ఓడించి శ్రీరామ్ ని గెలిపించాడు లోకేష్ . .బిక్క మొహం వేసుకొని కూర్చున్న పూజ చెవిలో మేడం ఇకనుంచి మీదే గెలుపు ,మీరు సంతోషం గా మాత్రం కనపడాలి ,అంటూ అక్కడనుం చీ వెళ్ళిపోయాడు లోకేష్ . రక రకాల తంతు లు సంబరాలతో రోజు గడచి పోయింది . ఇంటికి చేరుకున్న లోకేష్ సెల్ ఫోన్ ని పక్కకు పడేసి హాయుగా నిద్రపోయాడు .తెల్లవారి సెల్ ఫోన్ మోగుతుంటే అప్పుడు చూసుకున్నాడు ,దాని నిండా అన్నీ పూజ పంపిన మెసేజ్ లు .లోకేష్ మీరు చేసిన ఏర్పాట్లు అన్ని బాగున్నాయి .వి అయు పి దగ్గరనుంచి సామాన్యుల వరకు ఇబ్బంది రాలేదు .అందరు మీ గురించే చెబుతున్నారు థాంక్స్ గుడ్ నైట్ .ఇలా గుడ్ మార్నింగ్ వరకు వున్న వి చదువుకొని ఉబ్బి తబ్బిబ్బు అయు పోతున్నాడు లోకేష్ .

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online