బుజ్జీ ..ఓ ..బుజ్జీ ఏ వూరు ఎల్లా ల ,ఎవురింటికి ? చుట్ట తీసి చెవులో వాటి వల్ల బైట ఏమీ కనిపించడంలేదు . ఎక్కడినుంచో ఎగురుకొంటూ వచ్చిన కోడి ఎగిరి వచ్చి కీర్తి తలపై ఎక్కి కూర్చుంది . ఒక్క ఉదుటున లేచి క్రిందికి విదిలించి పడేసింది కీర్తి .కండక్టర్ ని లెఫ్ట్ రైట్ తిట్టి ఆరేసింది .ఓ ఎందుకమ్మా అలా అంటవ్ నా బుజ్జి ది . ఇస్మాయుల్ గాడు ఎన్ని వందలు ఇస్తా అన్నా ఆడికి ఇవ్వలా .వూళ్ళో వదిలి వచ్చాను అనుకో ఆడు వం డే సుకొని నాకేస్తాడు .అందుకే ఏ వూరు పొతే ఆ వూరు తీసుకు పోతుంట .దీనిని .తలపాగా చుట్టుకొంటూ చెప్పుకుపోతున్నాడు ఓ ఆసామి .బీరపల్లి ఎవరైనా వున్నారా ఎల్లిపోతోంది ,ఎవరో కేక వేశారు .కీర్తి లేచి పడుతూ ,లేస్తూ ముందుకి నడిచింది .ఏయ్ ఆపవ య్యా .నీకు సెన్స్ లేదా మాకు ఈ వూరు కొత్త ,వూరు రాగానే ఆపమని చెప్పానా ?లేదా ఈడియట్ విస్సుక్కొంటూ బస్సు దిగుతోంది కీర్తి .అదే బుజ్జీ నువ్వు అట్టా ఇంగిలీస్ తిడ్తంటే నాకు భయం అందుకే చెప్పడం మర్శి పోయా గొ ణు క్కు౦ టున్నాడు .లగేజీ గుంజు కొంటూ బైట పడే ప్రయత్నం చేస్తున్నారు .కీర్తి,పూజా లు .
ఓ దాటి పో యున్దమ్మ పర్లా కూసోం డి వచ్చేట ప్పుడు వాళ్ళే దింపుతారు లేమ్మా ఇంకో ఆసామి చెప్పాడు .స ణుక్కొం టూ దిగారు .ఆ ఇద్దరు .ఎలా? ఇదంతా వూరు బైట అన్పిస్తోంది ఇప్పుడు ఏ౦ చేద్దాం .ఆత్రుతగా అడిగింది పూజ .ఫోన్ చేసి ఆంటీ తో మొత్తుకొంది కీర్తి .అక్కడే వుండండి నేను కార్ పంపిస్తాను అని అత్త రాఘవమ్మ సముదాయి ౦ చి౦ది . కారు రాగానే కాస్తంత చల్లబడింది మేనకోడలు కీర్తి .కారు లో ఆంటీ ఇంటికి వచ్చి పడ్డారు ఆ ఇద్దరు .ఆ బంగ్లా అంతా హడావిడి గా వుంది .కీర్తి అంకుల్ వేంకట రావు ఆ వూరి సర్పంచ్ అవటంవల్ల ఎవరో ఒకరు రాజకీయ నాయకులు , లేక ఎవరో ఒక పబ్లిక్ గొడవలు పెట్టుకొని ఇక్కడకి చేరుతుంటారు . ఇక ఆ రోజు యం .ల్ .ఏ వచ్చినందువల్ల టీ లు, కాఫి లు తో హడా విడి గా వుంది సర్పంచ్ గారి ఇల్లు .ప్రయాణం లో అలసిపొయు న కీర్తి ,ఆమె స్నేహితురాలు పూజ విశ్రాంతి తీసుకొంటున్నారు
*. * * * *
మరుసటి రోజు తెల తెల వారుతో ౦ ది .లే లేత కిరణాలు అలా అలా పరుచుకొంటు న్నాయు . ఇంటి పెరట్లోని పక్షులు అన్నీ కిల కిలా రావాలతో సందడి చేస్తూన్నా యు .ఆవులు ,గేదెలు రోడ్డు నిండా వ్యాపించి మేతకు బయలు దేరినట్లు తెగ ఉత్సాహంగా వున్నాయి .బుజ్జి దూడలు అల్లరి గా తల్లి ఆవుల మధ్య దోబూచు లాడు తున్నా యు . వెంకటరావు గారు పూజ అయుపోయు జంద్యా న్ని సవరించు కొంటున్నారు .రాఘవమ్మ తులసి కోట దగ్గర ఆవు కి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది . ఈ దృశ్యాలన్నీ కళ్ళు నలుపుకొంటూ ,ఆవులించుకొంటూ ,బద్దకంగా మేడ పై నుంచీ కీర్తి ,ఆమె దోస్తు పూజ అదే పని గా చూస్తున్నారు . .శ్రీరామ్ స్పోర్ట్స్ షూ వేసుకొని ట్రాక్ ప్యాంట్ బిగించి ట్రాక్టర్ డ్రైవింగ్ మొదలు పెట్టాడు .ఇంతలో పైన వున్న కీర్తి వాళ్ళను చూసి ట్రాక్టర్ ఆపేసి పైకి ఎక్కి వస్తూన్నాడు . హలో గాళ్స్ ... ఎలా వున్నారు ? నిద్ర లేచారా?ఇంకా నిద్ర లేవలేదేమో అనుకున్నా .కొంచం ఫన్నీ గా మాట్లాడుతున్నాడు శ్రీరాంమ్ .
బాబు మేం వచ్చి సగం రోజు గడిచిపాయింది .ఇప్పుడు తీరింది సార్ కి . నిన్న మేం వొళ్ళంతా విరగ్గొట్టుకొని ,చాలా కస్టపడి మీ వూరు వచ్చాం . బస్సు లో అయుతే ఒకొక్కళ్ళు గుచ్చి గుచ్చి ,తినేసే టట్లు చూస్తున్నారు . గోడుగా చెప్పుతోంది కీర్తి . ఆ అవును అందమైన మీగడ లాంటి అమ్మాయులు , అందులోను ,పట్టణం ను౦ చీ వస్తున్నారు .అది సహజమే కదా . వాట్ ? కోపం తో కీర్తి ముఖం ఎర్రబడింది . సారీ ...సారీ ఓకే నేను రాత్రి వరకు కారు పెట్టుకొని పేట లోనే వున్నా,నువ్వు హైదరాబాద్ బస్ దిగి నాకు రింగ్ చేస్తావని ,చాలాసేపు ఎదురు చూశాను .పైగా నేను చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తోంది . సరే మేడం అ యాం సారి .ఓకే మీ దోస్త్ ని పరీచయం చేయవా? తన పేరు పూజ ఎం. బి .ఎ నమస్కారం చేసింది పూజ . నా పేరు శ్రీరామ్ ,ఏదో కొద్దిగా చదువుకున్నాను .శ్రీ రామ్ చెప్పడం పూర్తికాకుండానే ,అవును మరీ డాక్టర్ శ్రీరామ్ ఈ మద్యనే ఫీ ,హెచ్ ,డి పూర్తి చేశారు .అంటూ పరీచయం చేసింది కీర్తి . .మీకు ఇక్కడ కొత్త అని ఫీల్ అవ్వొద్దు .మా అందరిని స్వంత వాళ్ళం గా భావించి మీకు ఏం కావాలన్నా అడగవచ్చు , ఓకే క్రింద నా కోసం వెయుటిం గ్ నేను ,రాజు కల్సి పొలం దాక వెళ్ళి రావాలి ,మీరు మీ పనులు అన్నీ పూర్తిచేసుకోo డి ,వస్తాను అంటూ ట్రాక్టర్ తోలుకొని వెళ్లి పోయాడు శ్రీరామ్
*. * * * *
ఇల్లు అంతా ప్రశాంతము గా వుంది .కీర్తి ,పూజా జామ కాయలు తింటూ క్యారమ్స్ ఆడుతున్నారు .ఎమ్మా కీర్తి ఇంకా ఏమిటి విశేషాలు , ఏమోనమ్మా మేము పెద్దవాళ్ళం అయుపోయాం ,శ్రీకాంత్ కి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేస్తే మా భాధ్యత పూర్తి అవతుంద మ్మా .చిన్నప్పటి నుంచీ నువ్వు ,బావ ఒకళ్ళకు ,ఒకళ్ళు వ్రాసి వుంది అనుకొనేవాళ్ళం .మీ అమ్మా నాన్న లకు కూడా శ్రీరామ్ అంటే చాలా ఇష్టం .మరి మీ చదువులు కూడా అయుపోయునా యు .త్వరలో మీ ఇద్దర కి మూడు ముళ్ళు వేయాలని అనుకొంటూ వున్నాం .కొంచం గట్టిగా ,ఆనందంగా చెప్పుకొంటూ పోతుంది శ్రీరాంమ్ తల్లిరాఘవమ్మ .కొంచం సిగ్గు పడుతూ ,బుగ్గలు ఎర్రగా కంది పోతుంటే ,ఎర్రని పెదవులు పై కొంచం చిరు నవ్వుతో అక్కడ నుంచీ పైన చున్ని సరిచేసుకొని బెడ్ రూమ్ లోకి వెళ్లి lపో యింది .కీర్తి .
కొద్దిసేపటికి శ్రీరామ్ రావడం అందరు కల్సి భోజనాలు చేయడం . కారు లో కీర్తి ,పూజ ను తీసుకొని పట్టణం పేట లో ఫ్రెండ్ లోకేష్ ఇంటికి వచ్చాడు .శ్రీరామ్ .లోకేష్ కి కీర్తి ,పూజ లను పరీచయం చేశాడు .లోకేష్ అగ్రికల్చర్ లో పీ .జి పూర్తి చేశాడు రీసెర్చ్ కూడా అయుపో వస్తుంది .అలా మొదటి పరిచయములోనే లోకేష్ కళ్ళు పూజ పై పడ్డాయి . సరే రా ఆమె నీ మేనకోడలు ,మరీ ఆ మేడం ని పరీచయం చేయవా ఆత్రుతగా అడిగాడు లోకేష్ . పూజ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎం .బి .ఏ . ఇదిగో ఈ గొప్ప వూరు రావడానికి పూజ ని హెల్ప్ తెచ్చుకున్నా ను .పరిచయం చేస్తుంది కీర్తి . పూజ ను చూడగానే ఫస్ట్ సై ట్ లో నే తెగ నచ్చిపో యుంది లోకేష్ కు .ఎర్రని సున్నా చుట్టినట్లు పెదవులు ,కోల ముక్కు ,పోనీ టైల్ జడ ,టీ షర్టు లో అందమైన కోణాలు ,అతికినట్టు సరి పోయున నల్లని జీన్స్ మంచి మేలి ఆడ గుర్రం లా కనిపిస్తుంది పూజ . భగవంతుడా ఎంతో అందమైన కీర్తి శ్రీరామ్ కి మరదలు అంటే వుడ్ బీ ,అందుకే నేను పరిశీలణ గా ఆమె వైపు చూడలేదు .కనీసం నాకు ఈ పూజ నైనా సెట్ చేయరా బాబు ,కొంపదీసి ఈమెకు ఏ మేనరికాలు లేవు కదా ? కలల్లో తేలిపోతు న్నాడు .
లోకేష్ .ఏమై౦ దిరా ,ఎక్కడ వున్నావ్ ? శ్రీరామ్ పిలుపుతో ఈ లోకం లోకి వచ్చాడు లోకేష్ .కొద్దిసేపు అలా మాట్లాడుకొంటూ ఇంటి వెనుక తోట లోకి వెళ్ళారు .తోట లో ఓ చేట్టుక్రింద కుర్చీల్లో కూర్చున్నారు కీర్తి పూజిత లు . .శ్రీరామ్ కి ఆయుర్వేదం మందుల మొక్కలు అన్నీ చూపిస్తున్నాడు లోకేష్ . ఏమే పూజిత మా అత్తయ్యా చంపేస్తుంది ,పెళ్లి అని ,అటువైపు కూడా మా అమ్మ ,నాన్న లు తొందర పెడుతున్నారు .కొంచం ఇబ్బందిగా .మొహం పెట్టింది కీర్తి . ఏమైంది నీకు శ్రీరామ్ అంటే ఇష్టం లేదా ? ఇష్టం ఎందుకు లేదు ?కానీ నాకు ఈ పొలాలు ,ఈ చీకటి పల్లెలు ఇష్టం లేదు ,కానీ శ్రీరామ్ మన హైదరాబాద్ కు వచ్చేస్తే బాగుండును .కొంచం ఆవేదన గా అంటో౦ ది .కీర్తి . అలా ఎట్లా అనుకొంటా వే పాపం వాళ్లకు శ్రీరామ్ ఒక్కడే గా కొంచం ఆవేశం గా అనేసింది పూజ . .అందుకే గా నేను ఆలోచనల్లో పడ్డాను . ఒక పని చేయు పెళ్లి చేసుకొని కొద్దికాలం అటూ ఇటూ తిరుగుతూ వుండండి . తరువాత ఎలాగు మీ ఇద్దరూ చదువుకొన్నవాళ్ళేగా మెల్లగా ఏదో ఒకటి చెప్పి హైదరాబాద్ కి వచ్చే యచ్చు.ఎలా వుంది అయుడి యా ?గాలిలోకి చిటిక వేసి అడిగింది పూజ .అవునులే ఇది కూడా మంచి ఆలోచనే అంటూ మనస్సు తేలిక పడినట్లుగా నిట్టూర్పు విడిచింది పూజ .కాసేపు లోకేష్ ఇంట్లో అందరి పరిచయాలు ,ముచట్లు .టీ లు అల్పాహారాలతో ఆ రోజు చీకటి పడిపో యుంది .
కీర్తి కారు డ్రైవ్ చేస్తుంటే ,శ్రీరామ్ ,పూజ మాటల్లో పడ్డారు . పూజా ... మీ లాగే లోకష్ కూడా చాలా స్పీడ్ .ఇట్టే అందరి తో కల్సిపోతాడు .మేం రెండు కుటుంబాలవా ళ్ళం ఎప్పుడూ కలసే తిరు గుతూ వుంటాం .లోకేష్ కి తోటలు ,దేవాలయాలు అంటే మహా ఇష్టం .చెప్పుకొంటూ పోతున్నాడు శ్రీరామ్ ....ఏమో శ్రీరామ్ నాకు మాత్రం ఈ వూరు ,మీ వూరు ఈ అడవులు .ఆ బర్డ్స్ నాకు పిచ్చి పిచ్చి గా నచ్చాయి అనుకో౦ డి .అస్సలు సిటీ లో కాకులు ,పిచ్చుకలు ఎంత కాలం అయుం దో కనపడక .అని చెప్పుతూ పూజ చెబుతూ వుంటే డ్రైవ్ చేస్తూ నే కోపం గా ఓ లుక్ ఏసింది కీర్తి .కీర్తి నాకు అర్థం అయుంది లే ముందు చూడు నవ్వుకొంటూ అంది పూజ .ముందేమిటి ఇల్లు వచ్చేసింది .ఇక దిగండి . కార్ పార్కింగ్ లో పెట్టి లోపలికి వెళ్ళిపోయారు అంతా . భోజనాలు పూర్తి అయు అంతా డాబా పైకి ఎక్కారు .అందరికి అక్కడ మంచాలు వేసి ఉన్నాయు .
0 comments:
Post a Comment