రాత్రి వేల మేడ పైన కూర్చుని ఆలోచనల్లో పడ్డాడు శ్రీరామ్ నిండు జాబిలి ని దాటుకొంటూ నీలి నీలి మేఘాలు పరు గులు పెడుతున్నాయి .చక్కని చల్లని గాలి తెమ్మెరలు మెల మెల్ల గా తాకుతూ వున్నాయి .కీర్తి విషయములో ఇప్పుడు ఏ౦ చేస్తే బాగుంటుంది ?అనుకొంటూ ఆలోచిస్తూ వున్న శ్రీరామ్ ని వాళ్ళ అమ్మ గారు పిలుచుకుంటూ పైకి వచ్చింది .ఏరా నాన్నా ,మీ అత్త గారు వాళ్ళు ఫోన్ చేశార్రా ,కీర్తి ని కొద్ది రోజుల్లో తీసుకొచ్చి దింపు తాము ,మమ్మలిని క్షమించండి ఆలశ్యం అయునందుకు అని చెప్పారు ,నీకు కూడా విషయం చెప్పమన్నారు నాన్నా ,మన రంగారావు గారు లేరు ,వాళ్ళు పగలు మన ఇంటికి వచ్చారు ,కొద్దిసేపు కూర్చున్నారు ,నీ గురింఛి అడిగారు ,అవు ను వాళ్ళ నడుపుతున్న స్కూల్ అమ్మేస్తార ట ,మంచి వాళ్ళు ఎవరైనా వుంటే చెప్పమన్నారు ........ఏమిటమ్మా ....టౌన్ లో అదే …. పేట లో పెట్టిన స్కూల్ అమ్మేస్తారా ? ఏదో ఒక కొత్త ఆలోచన మైండ్ లో ఫ్ల్లాష్ అయుం ది శ్రీరామ్ కి ,అమ్మా మనం తీసుకొని నడుపుదాం అమ్మా ,మీ కోడలు కూడా చదువుకున్నది .కొంచం ఆత్రుత గా అడిగాడు శ్రీరామ్ .
ఏమో బాబు మీ నాన్నగారి ని అడుగు ,వారు ఎలా చెబితే అలా చేద్దాము .అన్నది తల్లి రాఘవమ్మ. రాత్రంతా తండ్రి వెంకట్రావు తో చర్చింఛి స్కూల్ కొనటానికి ఒప్పించాడు శ్రీరామ్ . ఇక కీర్తి కూడా కాస్తంత బిజీ అయుపోతుం ది .పైగా దగ్గర గా పట్టణం లో నివాసం ఉండచ్చు .ఇది విద్య ,చదువు కి సంభందించిన ది కాబట్టి తను కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంది .ఇలా ఊహల్లో తేలిపోతూ చాలా వేగముగా పనులు చేసేస్తున్నాడు శ్రీరామ్ .స్కూల్ దానికి దగ్గరలో ఓ ఇల్లు కూడా తీసేసుకున్నాడు . ఇంతలో కీర్తి ని వెంట పెట్టుకొని వాళ్ళ అమ్మా ,నాన్నలు కూడా వచ్చారు .వాళ్ళ సమక్షం లో నే కొత్త స్కూల్ భాధ్యతలు అన్నీ కీర్తి కి అప్పచెప్పాడు .శ్రీరామ్ ....... మంచి పని చేశారు అల్లుడుగారు అని అత్తా మామలు పొగిడారు . అమ్మాయు కి అన్ని జాగ్రత్తలు చెప్పి . అలా కొద్ది రోజులు వుండి తిరిగి వాళ్ళ వూరు వెళ్ళిపోయారు .అత్తా మామలు. .స్కూల్ భాద్యతలు లో తల మునిగి వున్న ప్పటికి వాళ్ళ ఇంటి పైనే ,హైదరాబాద్ పైనే మనస్సు గుంజుతో౦ ది కీర్తికి .
కొంతకాలం పాటు స్కూల్ ని ఎలా చేద్దాం ,కొత్త విద్యార్ధులను ఎలా ఆ కట్టుకొని తేవాలి విషయాలపై సిబ్బంది తో చర్చలు జరుపుతోంది . నువ్వు ఎమీ టెన్షన్ పడకు కీర్తి మనం వున్నవాళ్లలో బాగా చదివించి పనులు చేయుస్తున్నారు .కాలం వేగంగా గడిచి పోతుంది .సంక్రాంతి పండగ కి స్కూల్ కి సెలవులు ఇచ్చారు .శ్రీరామ్ మనం కూడా సంక్రాంతి కి మా అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్లి వద్దాం .ఎమ౦ టారు .మొహం అంతా నవ్వు పులుముకొని అడిగింది కీర్తి . ఆమె లో అంత సంతోషం ఈ మధ్య కాలములో చూడలేదు .శ్రీరామ్ కొంచం కోపం వచ్చినా పైకి కనపడకుండా మేనేజ్ చేశాడు .కాదు కీర్తి ఈ సంక్రాంతి పల్లెల పండుగ .ఇక్కడే వుండి చక్కగా అన్నీ ఎంజాయ్ చేయవచ్చుగా .శ్రీరామ్ కొద్ది గా చిరునవ్వు ఇస్తూ చెప్పాడు .కీర్తి మొహం ఒక్కసారిగా డల్ అయుపోయుంది . ఓకే సరే ఓకే నీవు అంతగా ఏమి వర్రే అవకు వెళ్దాం .
రెండు రోజుల తరువాత శ్రీరామ్ వాళ్ళ అమ్మ ,నాన్న లను ఒప్పించి కీర్తి వాళ్ళ ఇంటికి బయలు దేరారు .చూడండి వదిన గారు మీరు ఊరు వెళ్ళిపోతే ఇక్కడ పండగ వేడుకలు ,చాల చాలా మిస్స్ అవుతారు ,సరే ఆనక మీ ఇష్టం ఇక నేను చెప్పేది ఏమిటంటే మా అన్నయ్య మీ కోసం అనే ఈ స్కూల్ తీసుకున్నాడు .అంతా మీ చేతులోనే వుంది మీ భవిష్యత్తు ,ఆలోచించుకొని మీ వూరు లో పండగ కాగానే బయలు దేరి వచ్చేయండి .మనం అంతా కల్సి కష్ట పడదాం ,తరువాత ఓ కాలేజీ కూడా ఒకటి పెడదాం .మీరు మాకు సహకరిస్తే చాలు అంతా గట్టిగా వివరించి చెప్పాడు శ్రీరామ్ దోస్త్ లోకేష్ . పండగకువాళ్ళ వూరు చేరుకోవడం ,అక్కడ కొన్ని రోజులు గడిపి వచ్చేశాడు శ్రీరా మ్ .కీర్తి మాత్రం తరువాత వస్తానం ది .మళ్ళీ రోజులు అలానే వేగంగా గడచిపోతున్నాయు ఒకరోజు శ్రీరామ్ మామ గారు హైదరాబాద్ నుంచీ షడ్ న్ గా దిగారు .ఏమిటి మామయ్య ఒక్కరే ఇంత అత్యవసరం గా వచ్చారు ,ఫోన్ లేదు కబురు లేదు .కొంచం నవ్వు కుంటూ అడిగాడు శ్రీరామ్ ఏమి లేదు బాబు మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి ,దీనం గా కొంచం బాధ పడుతూ అన్నాడు మామగారు .ముందు లోపలికి పదండి అమ్మా .... హైదరాబాదు నుంచీ మామయ్య గారు వచ్చారు . క్షేమ సమాచారం మాట్లాడుకొని ,కొద్దిసేపు విశ్రాంతి తరువాత ఇక అస్సలు సంభాషణ మొదలుపెట్టాడు మామగారు .బాబు అల్లుడుగారు నేను మా అమ్మాయి వల్ల పెద్ద చిక్కులో పడ్డాను ,అంటూ మొదలు పెట్టేసరికి ఇంట్లో అందరు టెన్షన్ లో పడిపోయారు . ఇలా అడుగుతున్నందుకు మీరు అందరు ముందుగా నన్ను మన్నించాలి . అల్లుడు గారు మా వూరు వచ్చి కొంతకాలం మా ఇంట్లో వుండగలరా ? దీనంగా అడిగాడు మామగారు
.అస్సలు ఏం జరిగింది మామయ్యా ,వివరంగా చెప్పండి .కొంచం విసుగ్గా తల పట్టుకొని అడిగాడు శ్రీరామ్ . మా అమ్మాయి ఈ వూరు రాలేను అంటుంది .ఎంత చెప్పినా ఈ వూరు అంటే తనకు ఇష్టమే లేదు అంటూ వుంది .. ఓ సి ఇదేనా మామయ్యా నేను మాట్లాడి చూస్తాను అని శ్రీరామ్ అంటూ వుండగానే శ్రీరామ్ తండ్రి వెంకట్రావ్ మద్యలో కలిగించు కొని ఇవి చదువుకున్న వాళ్ళల్లో మామూలే ,దానిది ఏముంది కొంతకాలం అలవాటు పడిందాకా శ్రీరామ్ నువ్వే వెళ్లి అక్కడ వుండు .లోకేష్ ,పూజ వాళ్ళిద్దరూ కలిసి స్కూల్ చూసుకొంటారు .ఆర్డర్ వేస్తున్నట్లు గా చెప్పాడు శ్రీరామ్ తండ్రి వెంకట్రావ్ . సరే మామయ్యా నేను వీలు చూసుకొని మీ సిటీ కి వస్తాను .మీరు ముందు విశ్రాంతి తీసుకోండి అంటూ మాట్లాడి అక్కడ నుంచీ వెళ్లి పోయాడు శ్రీరామ్ .ఆ వక్క రోజు వున్న వాళ్ళ మామగారు మ ళ్ళీ మళ్ళీ తన రిక్వెస్ట్ చెప్పి వాళ్ళ వూరు తిరిగి వెళ్లి పోయారు .
ఇక్కడి విషయాలు అన్నీ తెలుసుకున్న కీర్తి ఒకరోజు శ్రీరామ్ కి ఫోన్ చేసింది . నేను కీర్తి ని మాట్లాడుతున్నాను . చెప్పు కీర్తి ,నీ సమస్య మొత్తం మీ నాన్నగారు చెప్పారు .నేను నీకు కోపరేట్ చేస్తాను . నేను కొద్ది రోజుల్లో అన్ని పనులు చక్కబెట్టు కొని బయలు దేరి వస్తాను .ఓకే నా....... కొంచం ఆప్యాతను రంగరించి మాట్లాడాడు శ్రీరామ్ .అడికాదం డీ శ్రీరామ్ మీరు ఎంతో ప్రేమా ,అనురాగాలతో మీ అమ్మ నాన్నలను చూసుకొంటున్నారు ,మిమ్మల్ని విడదీసి నేను పాపం మూటకట్టుకోలేను ,ఇది ఒక నెల ,ఒక సంవత్సరం తో తీరే సమస్య కాదు ,ఇక నాకు అయుతే మన బంధం పట్ల ఇష్టం లేదు ,నేను కొనసాగించలేను . మీరు ఇక దీని గురించి ఆలోచించడం మానేయండి ,ఇక ఏ ప్రయత్నాలు దయచేసి చేయవద్దు సారీ ఇక వుంటాను .
కీర్తీ ఫోన్ పెట్టకు .... నీకు ఏమైనా తిక్క ,ఇది ఏమైనా బొమ్మల పెళ్లి అనుకుంటున్నావా ? మన ఇద్దరం పెద్దల సమక్షములో పెళ్లి చేసుకున్నాం . మరి నీకు ఇష్టం లేకపోతె అప్పుడే చెప్పక పోయావా ? బాగా ఆలోచించుకో ,మంచి కుటుంబ౦ చేతులారా కూల గొట్టుకోకు .నా వల్ల ,మా వాళ్ళ వల్ల తప్పులు వుంటే సరిదిద్దుకుంటాం .మరొక సారి ఆలోచించుకో ,తొందరపడకు ప్లీజ్ ఫోన్ పెట్టేసింది కీర్తి . ఒక్కసారిగా శ్రీరామ్ ఫోన్ పట్టుకొని కూలపడి పోయాడు .కళ్ళల్లో నీళ్ళు తుడుచుకుంటూన్న శ్రీరామ్ ని వెనక నుంచీ వచ్చిన వాళ్ళ అమ్మా ,నాన్న లు భుజం పట్టుకొని పైకి లేవదీసారు .అమ్మా చూడమ్మా ,ఎలా చేస్తుందో కీర్తి అంటూ కళ్ళు వత్తుకు౦టు న్నాడు శ్రీరామ్ .
మొత్తం విన్నాం నాన్నా శ్రీరామ్ .నువ్వు ఎందుకు నాన్నా భాధపడతావు .నిన్ను మిస్ అవుతున్నందుకు కీర్తి బాధ పడాలి .నచ్చ చెబుతున్నారు శ్రీరామ్ తల్లి తండ్రులు .కాదమ్మా బంధువులలో ,స్నేహితులలో పరువు పోతుంది కదమ్మా శ్రీరామ్ తల బాడుకొంటు న్నాడు . పరువు ఏమిట్రా అస్సలు ఈ కాలం లో అమ్మాయులు అంతా అట్లానే పెళ్లి అనే దానిని లైట్ గా తీసుకొ౦ టున్నారు ,ఇదివరలో అబ్బాయులు చేసిన పిచ్చిపనులు అన్నీ ఇప్పుడు అమ్మాయులు చేస్తున్నారు ఇక నేను వాళ్ళ తల్లి త౦డ్రు లను గట్టిగా అడిగేస్తాను .అంటూ శ్రీరామ్ ని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళారు రాఘవమ్మా ,వెంకట్రావు లు . ఇక తరువాత లోకేష్ ,పూజ లు కూడా చాలా ప్రయత్నాలు చేశారు .పెద్దవాళ్ళు అంతా కల్సి అనేక ప్రయత్నాలు చేసినా ఫలించ లేదు .దానితో శ్రీరామ్ కూడా కొంతకాలం వేచి చూశాడు ,అయునా కీర్తి లో ఏ మార్పు రాలేదు .కీర్తి పై శ్రీరా మ్ కి బాగా కోపం వచ్చింది .కారణం లేకుండా నువ్వు వద్దనుకుంటూ వుంటే నేను ఏమైనా పిచ్చోడినా అనుకొంటూ ఆలోచనల్లోపడిన శ్రీరామ్ లాయరు ని కలిసి అన్ని విషయాలు చర్చించాడు . ఈ లోపుగా శ్రీరామ్ కి పోస్ట్ లో విడాకులు కావాలని లీగెల్ నోటీసులు పంపించింది కీర్తి . కొద్ది నెలలు కోర్టు చుట్టూ తిరిగి ఎట్టకేలకు విడాకులు తీసుకొని విడిపోయారు .స్కూల్ అంతా పూజ ,లోకేష్ లు చూసుకొంటున్నారు .కొంతకాలం మానసిక ప్రశా ౦ తత కోసం ఎటు అయునా వెళ్లి పోవాలని వెతుకులాడుతున్న సమయములో నాకు ఈ ఫేమస్ విద్యా సంస్థ లో జాబ్ గురించి నేను ఎంపి క అవడం మళ్ళీ ఈ గ్రేట్ మేడం శృతి ని కలుసుకోవడం ఇలా నా జీవితం పై సినిమా చూపించ డం .నవ్వుని పెదవుల పై తెప్పించు కొంటూ ,లోపల బాధ ని దాచుకొం టూ నటిస్తూన్నాడు శ్రీరామ్ .
యు ఆర్ గ్రేట్ శ్రీరామ్ నిజం గానే నాకు సినిమా చూపించావు .ఇప్పటికి చాలా టైం అయుం ది మీ వాళ్ళు ఏం అనుకొంటున్నా రో టైం చూసుకొంటూ ఆన్నాడు శ్రీరామ్ .మా నాన్నగారు ఇంతక్రితం బైటకు వచ్చి చూశారు ,మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు .ఇక్కడే కూర్చుని మాట్లాడుతున్నాం కదా .పర్వాలేదు.చెప్పింది శృతి . సరే మేడం ఇది నా కు వున్న ఫ్లాష్ బ్యాక్ .మీరు చాలా కాలం నుంచీ నన్నే మనస్సులో వుంచు కొన్నారని మొత్తం మన నేస్తం లక్ష్మి నాకు చెప్పింది .నా తప్పు లేకుండా మొత్తం అంతా వివరించి చెప్పాను ,ఇక మీరు ఆలోచించు కొండి . మెల్లగా చెప్పాడు శ్రీరాంమ్ . మరి ఇంకో అమ్మాయిని మీరు మీ జీవితం లోకి ఆహ్వానించగలరా ? కొంచం గట్టిగా అడిగింది శృతి . నన్ను మనసార ఇష్టపడే అమ్మాయి ,నా పాత కధను మరపించే శక్తి వున్న అమ్మాయి కావాలి .నా కంటే మా తల్లి తండ్రుల మనస్సుకు స్వాంతన కలిగించడం అత్యవసరం . ఇంకా ఆలోచిస్తున్నారా శ్రీరామ్ .
నేనే ఆ అమ్మా యుని అనుకొని అడగలేరా నన్ను ,అంటూ శ్రీరామ్ ని చుట్టేసుకుంది శృతి . శ్రీరామ్ మీరు నాకే దక్కాల్సి వుంది అందుకే మీరు నా కోసం ఇంత దూరం వచ్చారు ,ఇక ఇస్సారి నేను మిమ్ములను జారవిడుచుకోను చిరునవ్వు లతో మెలికలు తిరిగిపోతూ .అయు లవ్ యు అంటూ చెవిలో చెప్పింది శృతి .నా ప్రేమ కు మరో వైపు ఏమిటో తెల్సి౦ది కాబట్టి ఇక మీ వూరు నేను వచ్చేస్తాను ,అత్తా ,మామలకు ,మీరు పెట్టిన కొత్త స్కూల్ కు , నా జీవితం అంతా మీ తోడునీడ గా నడచుకొంటాన ని ప్రమాణం చేస్తున్నాను .గుడిలో గంట పెద్దగా కొడుతున్న శబ్దం వినిపిస్తోంది .శ్రీరామ్ ,శృతి నవ్వుకొంటూ ఇద్దరూ బైటకు వస్తుంటే అది చూసిన మూర్తి గారు మా అమ్మాయు ఎప్పటికి ఇలానే సంతోషంగా వుండాలి అని దేవునికి దండం పెట్టుకుంటున్నాడు . శ్రీరామ్ వాళ్ళ అమ్మతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు ,అమ్మా ,నీకు నాన్నగారికి ఓ శుభవార్త అంటూ ప్రారంభింఛి మొత్తం చెప్పేశాడు .వింటున్న మూర్తిగారు అమ్మాయి ని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు అంటూ ఆశీర్వదించాడు .
.. .......... శు భం THE END....................
0 comments:
Post a Comment