Pages

What evolution really means??

ప్రియ మిత్రులారా ఎప్పటిలాగే  ఈ వ్యాస రచయుత  బ్రాహ్మణులు ,హిందూవులు , పురాణాలు ,ఋషులు పై  దాడి చేసారు .మొత్తముగా భారతీయ సంస్కృతి పై  నే దాడి .ఇతర మతాల జోలికి  కాని ,ఇతరకులాల జోలికి కాని వెళ్ళే సత్తా ,దమ్ము లేవు .ఒకవేళ వెళ్ళితే పరిణామాలు ఎలా ఉంటాయో వీళ్ళకు బాగా తెలుస్సు . వీళ్ళ రాతలకు ఇక కాలం చెల్లిపోతుంది .ఎం దుకంటే అందరు చదువుకొంటున్నారు ,అన్ని దేశాలు వెళ్ళీ అక్కడ సంస్కృతి ,నాగరికత  లు పరిశీలించి చూస్తున్నారు .అక్కడ లేని విలువలు ఇక్కడ మన దేశములో  ఏమి వున్నాయి ?అని వాళ్ళంతట వాళ్ళే స్వంతముగా అర్థం చేసుకొంటున్నారు .ఇక ఇటువంటి రచయుతలు వ్రాసేది ఎప్పుడూ ఒక్కటే అది  .మన దేశ సంస్కృతి  ని  తిట్టుకుంటూ ,మా సంస్కృతి లో ఎమీ లేదు ,అన్నీ మూడనమ్మకాలే ,ఇతర మతాలవారుమనదేశానికివచ్చినాగరికత,సంస్కృతి ,అన్నిశాస్త్రాలు ,జ్ఞానంవిజ్ఞానంమనకు నర్పారు.వేదాలు ,ఉపనిషత్తులు ,బ్ర్హహ్మసూత్రాలు భగవద్ఘీత  అంతా మూఢనమ్మకాలే .18 పురాణాలు ఉత్త డొల్లె వాటిలోనుంచి నేర్చుకోనేది ఏమి లేదు అట .ఈ వ్యాస రచయుత చెప్పేది అది .
 
అంతేకాదు కాదు వీళ్ళు చెప్పే బౌద్ధమే  చాలా కచ్చితమైన నిజం   .ఇప్పుడు ప్రపంచానికి   ఎక్కడో పుట్టిన   మార్క్స్ ,ఏంజెల్స్ ,మావో లు  చెప్పిన  సిద్దాంతాలు కావాలి అట .  ము ఖ్యముగా మన దేశానికి వాళ్ళే ఆదర్శం అట ,దీనిని ఆచరించే వాళ్ళు నిజమైన మనుషులు ,దేశ భక్తులు  అట .ఇక ఆ వాదం కి బలం  చేకూరాలని కొంతమంది మార్కిసిస్ట్ భావజాలం ,లేదా నాస్తిక వాదం మెండుగా ఉన్నవారి రచనలు వెతికి తెచ్చి ఉదహరిస్తూ వుంటారు .వీరి అందరికి రాహుల్ సాంక్రుత్సాయన్ వ్రాసిన పుస్తకాలు ,ముప్పాళ రంగనాయకమ్మ , కంచే ఆయు లయ్య ,గౌరీ లంకేష్  వీరి రచనలు  , ఇంకా హిందువులను  ,తిట్టే రచనలు వెతికి పట్టుకొని తీసుకువస్తారు. .ఒక్క పురాణం కాని ఒక్క ఉపనిషత్ శాంతి మంత్రం కాని వీళ్ళ ముఖాలకు రావు .కనీసం పంచ సూక్తాలు ఉంటాయి .వాటిలో ఒక్కటి చదివి తెల్సుకున్న బాగుంటుంది ,అవన్నీ వదిలేయండి .కనీసం శ్రీమద్భాగవతము పూర్తిగా చదివినా చాలు .చదివిన వారు ఎవరైనా సరే   వితండ వాదానికి కాని , నాస్తిక వాదానికి కాని ,ఇంకో ఇతర మతం లోనికి కాని వెళ్ళలేరు .విమర్సించే వారు ఎవరినా సరే ముందు మూలం చదవండి ,అంతే కాని ఎవరో వ్రాసిన riview లు చదివి విమర్సలకు దిగకండి .మిడి మిడి జ్ఞానం తో హిందూవుల మత గ్రంథాలు జోలికి పోవద్దు .
 
బైబిల్ చదివితే క్రిస్టీ యానిటి అర్థం అవతుంది .అలానే ముస్లిం ఖురాన్ చదివితే ఇస్లాం అర్థం అవుతుంది .కాని ఒక మతగ్రంధం చదివితే హిందూమతం తెల్సుకోవడం కష్టం .ఎందుకంటే చాలామంది మునులు ,మహర్షులు ,ప్రకృతి ,జంతువులు కళలు ,వైద్యం ,విద్య చాల ఉంటాయి .కేవలం భక్తీ ,వేదా౦ తమే కాదు అందుకే అది ఓ మతం కాదు ఓ జీవన విధానం .అయునప్పటికి ఏదైనా ఓ శ్రీమద్భాగవతము  లేక  గీత ఒకసారి చదవండి .మూఢనమ్మకాలు ప్రతీ మతములో ,ప్రతీ దేశ ములోను వున్నాయి .కొన్ని దేశాలలో క్రిస్టియన్ మతం  వ్యాప్తి చెందుతూ వున్న తరుణములో ముఖ్యముగా ఆఫ్రికన్ దేశాలలో కొన్ని జాతుల ను అంతమొంది౦ చటానికి మహిళల ,,పురుషుల రహస్య అంగాలను సైతం ఖండించి మతమార్పిడులు లాంటి ఆగడాలు   హిందూ మతం  ఎప్పుడు  చేయలేదు .ఈ దేశములో ఏ మతం వారు ఏమి చేసినా  సహించి౦ది .పైగా అన్ని మతాలలోని మంచిని ఏరుకొని ఆచరిస్తూ అందరిని కుటుంబ సభ్యుల్లా  చూడటం అల్వర్చుకొంది. కొన్నివందల సంవత్సరాలు  ఏమి పాడుచేస్తున్నా ,వారికి కమ్మ్యునిస్ట్లు  లు వంత  పాడుతూన్న సహించి వూరుకొంది .ఇక ఇప్పుడు నెత్తిన ఎక్కి చాతకాని దద్దమ్మలు అంటే మాత్రం భరించ లేక ఎదురుదాడి కి తెగపడుతున్నారు హిందూవులు .
 
 అన్ని మతాలూ ఈ సనాతన మతం నుంచే ఉద్భవించాయి. చంద్రుడు ,సూర్యుడు నక్షత్రం లాంటి ఆరాధనీయ చిహ్నాలన్నీ ఈ హిందూమతములో ఆరాధిమ్పబడుతున్నవే,  ఇది అన్ని మతాలవారికి తెలుస్సు అయునా   ఏమి తెలీయనట్టు నటిస్తుంటే ఎంత అని చెప్పగలం .నిరంజన నిరాకర స్వరూపం , ఏ విగ్రహం  లేకుండా ఆరాధన చేయటం హిందూమతం లో ఉన్నదే .అదే యోగ ,medetation అదే ధ్యానం . భద్రాచలం  శ్రీసీతారామకళ్యాణం  కు నవాబులు పంపించే తలంబ్రాలు అబద్దమా ,తిరుపతి వెంకన్న కి ఓ ముస్లిం 108 పెద్ద సైజు కమలాలు ( ప్రతి మంగళవారం ఉదయం 7.౩౦ కి svbc TTD ఛానల్ లో అష్టదళ పాద పద్మారాధన మనం చూడవచ్చు ) అబద్దమా ? మదురై మీనాక్షి దేవాలయములో బ్రిటిష్ వాళ్ళ district  collecter  రోజ్ పీటర్ ని ప్రమాదం నుంచి బైట పడేసిన విషయం అబద్దమా ?ఒకవేళ మీరు నాస్తికులయితే ఓకే మీరు అన్ని మతాలను సమానముగా criticize చేయండి .ఒక్క హిందువులనే టార్గెట్ చేయటం మానుకోండి .

వేదాలు అబద్దం అంటారు .ఉపనిషత్తులు అభద్డం అంటారు ,ఇక గీత ,పురాణాలు పచ్చి అభద్డం .కానీ మీరు చెప్పే కాలం చెల్లిన ఎర్ర జండా మాటలు మాత్రం నిజాలు .బౌద్ధం నిజం ,ఇతర మతాల గ్రంథాలు మాత్రం నిజాలు .ఒక్క భాగవత పద్యం మీ జన్మ లో ఎప్పుడైనా విన్నారా ,కనీసం చదవటానికి ప్రయత్నం చేసారా ? అవునులే నోరు తిరిగి చావదు కదా ,ఆ అక్కసు అంతా పండితులు ,బ్రాహ్మణులు పై తీర్చుకోవడం .శృతి,స్మ్రుతి ,పురాణ ,ఇతిహాసం  లు వీటి ఆధారము గా భారతదేశ చరిత్రను అంచనా వేస్తారు .అంతేకాని సంస్క్తుత  పంచ కావ్య ములు అంటే తెలియని వాళ్ళు ,ఏదో వేమన పద్యాలూ రెండు నోటికి రాగానే నేను సాహితీవేత్తను ,పండితుడిని ,అనేసుకొని ఏకంగా వేదాలు ,ఉపనిషత్తులు డొల్ల అనే హిందువుల మనోభిప్రాయాల పై దెబ్బ కొట్టద్దు. పురాతన పండితులవి ,ఆ శాస్త్రాలు అబద్దం అంటున్నారు ,మరి మీరు ఇచ్చిన కొటేషన్లు ,వికటకవులు ,మీ రాతలు మేము నమ్మాలి .సర్వేపల్లి రాధా కృష్ణన్ ,రాజేంద్ర ప్రసాద్ మోక్షగుండం ,అబ్దుల్ కలాం,pvనరసింహారావు ఓ తిరుమల తిరుపతి దేవస్తానం ,ఓ బెనారస్ ,ఓ ఉడిపి ఓ వాజపేయు .ఓ ఆయుర్వేదవైద్యం ,భారతీయ కర్నాటక సంగీతం రాజులు కట్టించిన పెద్ద పెద్ద దేవాలయాలు ఇవన్ని వుత్తోత్తివే ,మీరు ,త్రిపురనేని రామస్వామి ,కంచ ఐలయ్యా  ,లక్ష్మయ్య,  ఏచూరిసీతారం ,అరుంధతిరాయ్ ,  ముప్పాళ్ళ రంగానయక మ్మ , మీరు చెప్పినవే వేదం అని తలచి కోటానుకోట్ల సంవత్సరాలు భారతీయసనాతన సంస్కృతిని ,మట్టిలో పూడ్చి దానిపై ఎర్ర జండా ఎగరవేసి రష్యా వారికీ గాని ,చైనా వారికి గాని లేక మైనారిటీ మతాల వారి దేశాలకు గాని అప్పచేప్పితే మీకు ,మీ వాదానికి చాల గొప్ప సంతోషం కదా .నేను మీకు చెప్పేది ఒక్కటే ఎవరో వికటకవులు వ్రాసినవి చదవకండి ,మూలం పుస్తకాలు తెచ్చి చదవండి ,అవి జర్నలిస్ట్ లకు అర్థం కావు అప్పుడు ఒక పండితుడి దగ్గరకు వెళ్లి అర్థం చెప్పించుకొని చూడండి .ఇంకో విషయం  కొన్ని కొన్ని శాస్త్రాలు సమ కాలీన సమాజ పరిస్తితులను పట్టి ఉంటాయి  వేల సంవత్సరాల నాటి రచనలు ఇప్పుడు చదివి ఈ నాటి  కాలానికి ,సమాజానికి ,ప్రజానీకానికి ,ఆచారాలకు అన్వయుం చు కొ కోడదు .ex ఇప్పటి రాజ్యాంగాన్ని ,కొన్ని వేల సంవత్సరాలు తరువాత చదివి విమర్శిస్తే పొంతన సరిపోదు ,కాలాన్ని ,యుగ ధర్మాన్ని బట్టి కొన్ని పురాణాలు ఉంటాయి .అని చెప్పడం  నా ఉద్దేశం .
 
అంతే కాదు ,భారతీయ పురాణాలలో ఎక్కువ శాతం క్రింది కులాల వారే వున్నారు ex:18పురాణాలువ్రాసినవ్యాసుడు,వాల్మికి ,శ్రీకృష్ణుడు,శ్రీరాముడు ,గుహుడు ,శబరి,ఆళ్వార్లు ,విశ్వామిత్రుడు వీరు అంతా బ్రాహ్మణులు కాదు ,కాని బ్రాహ్మణులు అంతా వీరు చెప్పిన మార్గములో నడిచారు .మూఢనమ్మకాలు పై తిరగుబాటు చేసిన బ్రాహ్మణులే అడవుల్లోకి  వెళ్లి ఉపనిషత్తులు ,అరణ్యకాలు రచించారు .భోదాయనుడు ,గౌతముడు ఇద్దరు మహర్షులు ,వారిలో గౌతముడిని అంబేత్కర్ అను సరించాడు.. హిందూ మతం ఓ మహా సముద్రం దానిలోకి చాల పిల్లకాల్వలు వస్తాయి .పోతాయి .ఆ మహా సముద్రాన్ని ఎవరు అపవిత్రం చేయలేరు .చాలామంది ప్రయత్నం చేసి దెబ్బతిని పోయారు .కొంత కలుషితం చేసారు  అయుతే అది తాత్క్కాలికము   మాత్రమే.అనాదినుంచ.ఎవ్వరినీ ఇబ్బందులకు గురిచేయకుండా అనేక దెబ్బలకు గురిఅయున మాట వాస్తవం .అందుకే ఇప్పుడు హిందూవాదులలో భరించే సహనం దాటిపో యింది .  అందుకే హిందూ మతంలో అతివాదులు సహజసిద్దముగా పుట్టుకొని వస్తున్నారు ,వాళ్ళు ఎవరూ కుహనా లౌకిక వాదం వినే స్తితి లో లేరు . రసో వై స;   ఇది ఫాణిని అస్టాద్యాయ లోనిది .అది ఒక్కటి చాలు దానిని 8 రకాలుగా పరిశోధించి చెప్పాడు .ఆ రోజుల్లోనే శ రీరములో రసాలు స్రవించే గ్రంధులు గురించి చెప్పిన విధం ఆ 8 లో ఒక రకం .హిందూ మతం లో ఆచరణ లో కానీ ,పురాణాలలో కానీ విజ్ఞాన శాస్త్రం చాలా వుంది .మీకు చే తనైతే పరిశోధన చేయండి .మీరు నాస్తికులా ఓకే ,అన్ని మతాల జోలికి వెళ్ళండి .విప్పి చెప్పుకోండి .



చివరలో మీరు వ్రాసిన మనువు ,యాజ్ఞవల్క్యుడు ,భ్రుగువు ,పరాశరుడు లాంటి వారి రచనలు కు నేను చెప్పినది వర్తిస్తుంది . ప్రతీ విషయం కూడా మూడు రకాల అర్థాలు కలిగి వుంటుంది . ఒకటి సంధర్బం రెండు పదానికి అర్ధం ,మూడు అనుభవం నాలుగు ఆచారం,సంప్ర దాయం ప్రాంతీయవాడుక కాబట్టి మనం కొన్ని పుస్తకాలు కొనేసి చదువుతా అంటే కుదరదు ఓ గురువు దగ్గర కు వెళ్లి చదువుకోవాలి .   అంతే కాదు ఇప్పుడు మన  వేష భాష లు కూడా,మనల్ని కన్న తల్లితండ్రులు ,తాతలు ,భాష ,సాహిత్యం ,కళలు etc    భారతీయ సంసృతి కి సంభందిచినవే అని గుర్తుఎరిగితేమంచిది .
  
   పై న  రచయుత వుదహరించి న రసాయన శాస్త్రవేత్త సత్యపాల్ ఆలోచించినది ఏమిటంటే  ఏదో సంస్థలో వుద్యోగం చేసినంత మాత్రాన ఆ సంస్థ కు జాతి సంస్కృతి ని ,నాగరికత ని ,భారతీయతని తాకట్టు పెట్టి అమ్ముకోవాల్సిన పని లేదు .పైన రచయు త  వివేకనందని  కనీస౦ వివేకానంద అని  చాలా తేలిగ్గా సంభోదిచాడు ,అంటే ఈయన గారి పాండిత్యానికి  వివేకానందా కూడా సరిపోవడం లేదు .ఓకే  ఆ   వివేకానందే విదేశం వెళ్ళినప్పుడు భగవద్ఘీతను  సభలో ఓ రాశి లో అట్టడుగు లోనున్నప్పుడు    పైకి తెచ్చి పెట్టి ఉపన్యాసం మొదలు పెట్టాడు .విదేశం నుంచి స్వదేశం రాగానే ఇక్కడి నేలను ,మట్టిని ముద్దాడాడు ,అంతేకాని దాస్ కాపిటల్ విదేశి పుస్తకాన్ని  ఏమి నెత్తిన పెట్టుకోలేదు . ఆయన గురువు కాషాయం ధరించిన రామకృష్ణుడు ,ఇక మీకు ఇవన్ని అంటరానివి కదా మరి వాళ్ళని ఎప్పుడూ తల్వకండి .ఇక జాతి మొత్తం కూడా మెండల్ కనిపెట్టిన హై బ్రీడ్ తిని ఎంత ఆరోగ్యముగా ఉంటున్నారో మీకు తేలీ యనిది కాదు ,అలానే విదేశీయులు కనిపెట్టిన పురుగు మందులు కూడా కడుపులోకి పోయి చిన్న చిన్న పిల్లలకే ఎలాంటి రోగాలు వస్తూవున్నాయో అందరికి తెలుస్సు .సుభాస్ పాలేకర్ స్వదేశి ,ప్రకృతి వ్యవసాయానికే    రైతులంతా వెళ్ళుతున్నారు .ఇక లమార్క్  ,,మెండ ల్ గురించి చాలా చదివాము ,వాళ్ళకంటే  ముందుగా ,ఎప్పుడో మన పురణాలలోనే దశావతారములు ఘట్టం ఈ జీవపరిణామ సిద్దాంతాన్ని వివరించి చెబుతోంది అని చాలా మంది విదేశీయులు రీస ర్చ్ పేపర్స్ తయారుచేశారు .పరిశోధనలు ఎప్పుడూ ఒకేలా వుండవు .కొత్త కొత్త విషయాలు ఎక్కడో అక్కడ బైట పడుతూనే ఉంటాయి .ఒకప్పుడు షుగర్ వ్యాధి వాళ్ళను చిలకడదుంప ,బంగాల దుంప తినవద్దు అనే వారు పరిశోధకులు ,కానీ ఇప్పుడు ఏమి చెబుతున్నారు ఉడికించి తినవచ్చు,నూనెలో వేయుంచి తినవద్దు  ఎందుకంటే   ఎక్కువ కేలోరీస్ వచ్చి షుగర్ పెర్గుతుంది ,అని వాళ్ళు కొత్త పరిశోధనలో చెబుతున్నారు .కాబట్టి పరిశోధనలు కూడా అనేక రకాలు   స్వదేశి   ,విదేశి లు .కాకపొతే ప్రతీ విషయాన్ని ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకొని సంఘ పరివారు కు అంటగట్టి సంది జ్వరం వచ్చిన వాళ్ళులా ఏదేదో మాట్లాడకూడదు .తెల్ల కళ్ళద్దాలు అయుతే స్వచ్ఛముగా అన్నీ కనిపిస్తాయు  అది గమనించి నడుచుకోవడం మంచి ఆరోగ్య వంతుడి లక్షణం .లేకపోతె  మీ ఆవేశం పరివార్ కే అత్యంత లాభం కలిగిస్తుంది
 


 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online