శ్రీమద్భాగవతము
సృష్టి దిగివచ్చిన క్రమము.... శబ్దబ్రహ్మము ప్రణవ స్వరూపము. దానిని వైఖరీ వాక్కుగా ఉచ్చరించుట వలన అవ్యక్తమైన బ్రహ్మ స్థితి నుండి వ్యక్తమైన సృష్టి పుట్టినది.
బ్రహ్మకు కూడా పైనున్న పరమాత్మ స్వరూపుడైన దైవము అవ్యక్తుడై ఉండి, ఈ ఉచ్ఛారణముల వలన వైఖరీ వాక్కు మూలమున వ్యక్త స్వరూపుడై ఉన్నాడు.
ఈ రెండు స్థితులలో ఉన్న మొత్తము పరమాత్మ పరిపూర్ణ స్వరూపుడు. ఇట్లు సృష్టిగా అతడు ఉచ్ఛారణ రూపమున వెలువడుచున్నపుడే ఇంద్రాదులు తనయందు శక్తులుగా ఇమిడి ఉండిరి. వారితో నిండి ఉండియే అతడు వ్యక్త స్వరూపుడగును....?శ్రీమద్భాగవతము 3(2)-౩౮౮
పైన వీడియో లోని శ్రీభాగవతం విషయం ఇందులో కాంటెక్స్ట్ ఒకసారి కలిపి ఆలోచించండి
0 comments:
Post a Comment