Pages

Maha Shivaratri

శివరాత్రి పర్వదినం కూడా ముక్కోటి ఏకాదశి లాగానే అత్యంత పవిత్రమైనది .శివునకు ,లేదా శైవులకు సంభందిచిన మోక్ష ప్రదేశం కైలాసం , అలానే శ్రీ వైష్ణవులకు వైకుంఠం మోక్ష ప్రదేశం .ఏది ఏమైనా ఒక్కటే బ్రహ్మ పదార్ధం ,అంటే భగవంతుడు ఒక్కడే వివిధ రూపాలలో ,ఎవరకి ఎలా కావాలో అలా కనిపిస్తూవుంటాడు .ముఖ్యముగా హిందూవుల పండుగలు ప్రతీ రోజూ ఏదో ఒక విశేషం తో సంవత్సరం అంతా అలరిస్తూనే ఉంటాయి .ప్రపంచములో ఎవరి సంస్క్ర్యతి ,ఎవరి నాగరికత వారి వారి కి చాల గొప్పది .అయుతే మన భారతీయ సంస్కృతి మాత్రం ,అది ఒక జీవన విధానం .అది ఒక మహా సముద్రం నీకు ఎంత కావాలో అంత వరకే సీసా లో ద్రవములా పట్టుకొని వాడుకోవచ్చు .

   ఏకాగ్రతతో స్వామికి దండం పెట్టుకొని తరిస్తావా అలా అయునా తరించవచ్చు ,కాదు పూవులు అర్పించి ,అర్చన చేస్తానంటావా ,అలా కూడా చేయవచ్చు ,కొద్దిసేపు దేవాలయములో స్వామి వారి ని చూసుకొంటూ ధ్యానం లేక భజన ఏదో ఒకటి చేసుకొంటాను అంటావా అల కూడా చేసుకొని తరించవచ్చు లేదు పురాణం చెప్పి తరించవచ్చు ,స్వామి వారి ని పొగడి లేక కీర్తనలతో పాడి కూడా తరించవచ్చు లేక భగవంతుడి పేరు పై మానవసేవ చేయవచ్చు ,జీవులకు ఆహారం పెట్టవచ్చు ..అలా కాదు కాసిని నీళ్ళు అర్ఘ్యం,ఇచ్చుట లేక అర్పించుటనో చేసి కూడా తరిస్తానంటే అల కూడా చేయచ్చు . అదిగో అదే నేటి శివ రాత్రి నాడు చేసే ముఖ్య మైన తంతు .అభిషేకం .శివ భగవానుడు అభిషేక ప్రియుడు ,కాసిని నీళ్ళు ఆయన పై గుమ్మరించి రెండు పూలు పెట్టి మనస్సు పలకం పై ఆయన రూపం స్మరించి తే చాలు ఎంతో మేలు ,ఎంతో మంచిది . కాని నేటి రోజుల్లో ఆడంబరత్త్వం పెరిగి భక్తి తగ్గిపోతుంది .


ఉపవాసం ,జాగరణ ,అంటూ ఏదో కాలక్షేపం వెతుక్కొంటూ న్నారు .అస్సలు నా దృష్టిలో ప్రతిరోజూ జపతపాదులు చేసుకోనేవాళ్ళ కు ప్రత్యేకంగా అంటూ ఏమి వుండదు .ఆచారం అంటూ వూరికే కష్టం పెంచు కొని మనలిని తిట్టుకొంటూ చేయాల్సిన పని లేదు .అర్ధరాత్రి లింగోద్భవం వరకు ఉండలేని వారు ,అవి అన్ని పా టించలేని వారు సింపుల్ గా దేవుని ఎదుట కూర్చొని కొద్ది సేపు ఆయనను మనస్సులో స్మరించి ,తీర్ద్ ప్రసాదాలు తీసుకొని వెళ్ళినా చాలు ,మనం చేసుకున్న జీవాత్మ connection rechaarge అయు పోతుంది .కావలిసింది మంచి మనస్సు ,మనస్సు తో చేసే పని ముఖ్యం .దానిని కలిగించటానికి ఇన్ని రకాల సేవ లు పెట్టారు .అది తెల్సుకోండి చాలు . దీ కుదరక పొతే ఓం నమ శివాయ అని మీకు కుదిరిన అన్నిసార్లు జపం చేసుకొని నమస్కారం పెట్టి హాయుగా పడుకోండి .పంచ భూతాత్మక మైన రీరమే శివం ,ఇక లోపల అంతర్యామి గా నారాయణుడి ఉంటాడు అని పెద్దలు చెబుతారు .ఇది ఏమైనా భక్తీ గా ,ఆర్తిగా భగవంతుడిని పూజించండి ,భజించండి అంతేకాని మూడనమ్మకాలను పెంచుకొని రీరాన్ని కష్ట పెట్టుకోకండి ,మీ పెద్దలను ,పిల్లలను భాధలకు గురిచేయకండి ,మనలోను ,బైట అంతటా భగవంతుడు నిండి వున్నాడు ,మీరు ఎలా అయునా ఆయనను స్మరించుకొని తరించవచ్చును .భగవంతుని కి కావలసినది శుద్దమైన మనస్సు .దానిలో రెండు నిమషాలు ఆయన చిత్రం ఊహించుకొని నమస్కారం చే సుకొని మీ విన్నపాలు చెప్పుకోండి .జరిగే మంచి ఎలాగూ జరుగుతుంది కదా .



 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online