ప్రియ మిత్రులారా ,
చంద్ర గ్రహణం 5 pm నుంచి అన్నప్పటికీ 6-15 నుంచి 7.77 వరకు ఎక్కువ ప్రభావం కలిగిస్తుంది.ఎక్కువ భయపడాల్సిన పని ఏమి లేదు .ఆ కాస్మటిక్ కిరణాలు ఆహార పదార్ధాల పైనా ,జీవుల బుద్ధి పైనా పడి వ్యతిరేక భావాలు కల్గుతాయని జాగ్రత్తలు తీసుకోమన్నారు ,అంతేకానీ మనలను ఏ రాక్షసులూ మి౦గరు.భగవంతుడు ఒక్కడే వివిధ రూపాలు ,వివిధ పేర్లు ,వివిధ రకాల మతాలూ కాబట్టి ఎవరైనాసరే ఇష్ట దేవతా ప్రార్ధన చేసుకోవచ్చు ,ఒకసారి చేసిన ప్రార్ధనకు లక్షల రెట్లు ఫలితం అధికం గావుంటుంది .ఏది రాకపోయునా ఓం నమ్హ;శివాయ ,లేక ఓం నమో నారాయణాయ ,లేక హరే రామ హరే రామ రామ రామ హరే హరే అలానే హరే కృష్ణ ఏదైనా చదువుకోవచ్చు .స్త్రీలు విష్ణు సహస్ర నామావళి ,లలితసహస్ర నామావళి లాంటివి చదువుకోవచ్చు .గర్భిణుల ను కదలకుండా వుండ మంటారు కారణం చంద్రమా మనసో జాతః అ౦టు౦ది వేదం .కాబట్టి ఆకాశం నుంచీ వచ్చే చంద్ర కిరణాలు మనస్సు ,బుద్దిపై ప్రభావం చూపుతాయి తద్వారా లోపలి పిండం పై చర్య పడుతుంది అని మనవాళ్ళుముందు జాగ్రత్త చెప్పారు అంతే
దానికి నాస్తికులు ,హేతువాదులు మేము ఆ గ్రహన౦ సమయములో గర్భిణుల ను తిప్పాము ఎమీ కాలేదే అంటారు .అయుతే శాస్త్రం ముందు జాగ్రత్త చెప్పింది ,ఖచ్చితంగా జరగాలని ఏమి లేదు ,గర్భిణులు లేచి తిరిగినా ఏమి కాదు .ఒకవేళ ఎఫెక్ట్ పడుతుందేమో జాగ్రత్త అనిఅర్థం. వైద్యులు సిగరెట్టులు తాగితే జబ్బులు వచ్చి చస్తారు అంటారు .అంత మాత్రం చేత తాగని వారికి జబ్బులు రావడం లేదా ,త్రాగిన వారు కూడా ఎక్కువ కాలం బ్రతకడం లేదా ?కాబట్టి జరుగవచ్చు అని ముందు జాగ్రత్త అలానే ,పెళ్ళిళ్ళు ముహూర్తములు కూడా అంతే ,ఏ టైం లో అయునా చేసుకోవచ్చు ,ఎమీ కాదు కాని ఒకవేళ చెడు జరగా టానికి మన వైపు నుంచీ అవకాసం ఎందుకు ఇవ్వాలి అనేదే శాస్త్ర ఉద్దేశ్యం .
ఇక దానధర్మాలు ఇచ్చు కొనే శక్తి లేనివారు మరుసటి రోజు తలస్నానం చేసి శివాలయం కానీ ,ఆంజనేయ స్వామీ వారి ఆలయం చుట్టూ కాని లేక ఏ దేవాలయం అయునా సరే మీ వేసలుబాటు పట్టి కొన్ని ప్రదక్షిణాలు చేసి ఓ కొబ్బరికాయ కొట్టండి ,మీ గోత్ర నామాలతో పూజ చేయున్చుకోండి .ముఖ్యముగా ఆశ్లేష ,పుష్యమి ,మఖ వారు జాగ్రత్తలు తీసుకోవాలి .కొద్దిగా శక్తి వున్నవారు తెల్ల పంచ కండువాలు సత్ బ్రాహ్మణులకు మీ గోత్ర నామాలు చెప్పి కాళ్ళు కడిగి దానం ఇచ్చి ఆసేర్వాచనం తీసుకోండి . ఇంకా కొద్ది శక్తి వున్నవారు బియ్యం,తెల్లవెండి చంద్ర ప్రతిమ ,వెండి పాము పడిగ ఇలా కూడా దానాలు ఇవ్వవచ్చు .ఇక అన్నురాసులవారు ఎవరైనా తెల్ల బియ్యం దానము గా ఇవవచ్చు .ఇక రేవతి నక్షత్రం వారికి పంచమం లో ప్రభావం కాబట్టి వారు కూడా దానం ఇవ్వవచ్చు ,కాకపోతే సంతాన విషయం కాబట్టి రేవతి వారు సంతాన వేణు గోపాల స్వామీ ని గ్రహణ సమయములో ధ్యానం చేస్తే వారికి సంతానం కలగట ము లో ఆటంకములు తొలగిపోతాయి .ధైర్య౦ అన్నిటికి మంచి మందు అని తెలుసుకొని నడుచుకొంటే చాలా లాభం.
0 comments:
Post a Comment