Pages

The meaning of Hare Rama Hare Krishna Mantra

*హరే కృష్ణ మంత్రమునకు భాష్యము


ఈ దివ్య శబ్దము యొక్క ఉచ్ఛారణ *హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే.


మన కృష్ణ చైతన్యమును పునరుద్ధరించు కొనుటకు గల అద్భుతమైన పద్ధతి, సులభ మార్గము. జీవాత్మల మగుట చేత నిజానికి మన మందరమూ కృష్ణ చైతన్యము కలవారమే, కానీ అనాది కాలంగా ఈ భౌతిక పదార్థంతో గల సాంగత్యం వలన, మన చైతన్యం ఇప్పుడు భౌతిక వాతావరణం చేత కలుషిత మైనది. ఇటువంటి కలుషితమైన జీవన విధానంలో మనమందరమూ భౌతిక పకృతి యొక్క సంపదను స్వార్థ ప్రయోజనాల కొరకు ఉపయోగించుకొనుటకు ప్రయత్నిస్తున్నాము, కానీ నిజానికి మనం మరింతగా భౌతిక ప్రకృతి యొక్క ఉచ్చులో చిక్కుకుపోతున్నాము. ఈ భ్రమను మాయ అని పిలుస్తారు లేదా ఉనికి కోసము చాల కష్ట పడటము, భౌతిక ప్రకృతి యొక్క కఠిన నియమాల కోరల్లో చిక్కుకుని ఉన్నప్పటికినీ మనమందరం ఈ భౌతిక పకృతిపై ఆధిపత్యం చెలాయించాలని అనుకొనుట. భౌతిక ప్రకృతిపై మనం చేస్తున్న ఈ మిథ్యా ప్రయత్నము ఒక్కసారిగా ఆగిపోవును మన కృష్ణ చైతన్యమును పునరుద్ధరించుకోవడం ద్వారా.కృష్ణచైతన్యము మనస్సుపై విధించబడే కృత్రిమ మార్గము కాదు.


 ఈ చైతన్యం అనేది జీవాత్మ యొక్క సహజ శక్తి. మనము ఈ దివ్య శబ్దమును శ్రద్ధగా వినినప్పుడే ఈ చైతన్యము పునరుద్ధరించబడుతుంది. ఈ యుగమునకు ఈ పద్ధతి ప్రామాణికులచే సూచించబడినది. ఆచరణాత్మక అనుభవం ద్వారా, మనము ఈ మహా మంత్రాన్ని ఉచ్చరించుట ద్వారా మనము తెలుసుకొనవచ్చు, లేదా ఈ మహా విముక్తి మంత్రమును ఉచ్చరించి తద్వారా స్వయముగా ఆధ్యాత్మిక జగత్తు నుండి వచ్చు దివ్యానంద పారవశ్యమును పొందవచ్చును. ఒక వ్యక్తి వాస్తవానికి ఆధ్యాత్మిక అవగాహన స్థితిలో ఉన్నప్పుడు. ఇది దిగువ స్థాయి ఇంద్రియ, మానసిక ,బుద్ధి మరియు అహంకార స్థితులను అధిగమించి, వారు ఆధ్యాత్మిక సహజానంద స్థితిలో నిలిచిపోతారు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఈ దివ్య ఉచ్ఛారణ, నేరుగా ఆధ్యాత్మిక స్థితి నుండే జరుపబడును. అది ఇంద్రియాలకు, మానసిక మరియు బుద్ధికి సంబంధించిన అన్ని తక్కువ స్థితి చైతన్యాలను అధిగమించును. మంత్రం యొక్క అర్థమును తెలుసుకోవలసిన అవసరం లేదు, మానసిక కల్పనలను చేయనవసరం లేదు.


 ఈ మహా మంత్రాన్ని కీర్తన జపము చేయడం కోసం బుద్ధి సంబంధమైన ఇతర సర్దుబాట్లను చేసుకోవలసిన అవసరం లేదు. ఇది సహజముగా ఆధ్యాత్మిక స్థితి నుండి ఉద్భవించింది మరియు ఎవరైనా ఆధ్యాత్మిక శబ్ద కీర్తనలో పాల్గొనవచ్చును ఏ మునుపటి అర్హత లేకుండా,ఈ కీర్తనలో పారవశ్యంతో నృత్యం చేయ వచ్చును
మనము ఆచరణాత్మకంగా చూశాము. ఒక పిల్లవాడు కూడా ఈ కీర్తనలో పాల్గొనవచ్చును ఇలా ఒక కుక్క కూడా పాల్గొన వచ్చును ఈ మహా మంత్రము భగవత్ ప్రేమ కలిగిన శుద్ధ భక్తుడు ఉచ్ఛరించినప్పుడు అప్పుడు వెంటనే ప్రభావం పొందవచ్చును అలాగే వీలైనంత వరకూ అభక్తుని నోటి నుండి ఈ మహా మంత్రమును వినరాదు అది సర్పం యొక్క పెదవులతో తాకబడిన పాలవలే విష ప్రభావమును కలిగి ఉండును.
హరా అను పదము భగవంతుని అంతరంగ శక్తికి సంబోధిస్తుంది. కృష్ణ మరియు రామ పదములు భగవంతుని నేరుగా సంబోధిస్తుస్తున్నాయి కృష్ణ లేదా రామ అనగా పరమానందము శాశ్వతమైన, హరా అనగా భగవంతుని యొక్క మహోన్నతమైన ఆనంద శక్తి. ఈ శక్తిని, హరే అని సంభోధించినప్పుడు మనకు భగవంతుని చేరుకొనుటకు సహాయపడును


మాయ అనబడు భౌతిక శక్తి కూడా భగవంతుని విభిన్న శక్తులలో ఒకటి మనము కూడా భగవంతుని యొక్క తటస్థ శక్తికి చెందిన వారము. జీవాత్మలు భౌతిక శక్తి కంటే ఉన్నతమైనవిగా వర్ణించబడినవి ఎప్పుడైతే ఉన్నత శక్తి అధమ శక్తి సాంగత్యం లోకి వస్తుందో అప్పుడు అసంగత పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఉన్నతమైన తటస్థ శక్తి, ఆధ్యాత్మిక ఉన్నత శక్తి హరా తో సంబంధమును ఏర్పరచుకున్నచో జీవాత్మ సహజ ఆనందమయ స్థితిలో నెలకొనును


హరా, కృష్ణ మరియు రామ మూడు పదములు ఆధ్యాత్మిక బీజములు మంత్రోచ్ఛారణ అనేది ఆధ్యాత్మిక పిలుపు వంటిది భగవంతుని మరియు అతని అంతరంగిక శక్తి, హరా కోసం బద్ధజీవాత్మకు రక్షణ కల్పించటం కోసcc ం ఈ జపము తల్లి కొరకు బిడ్డ చేయు సహజ రోదన వంటిది తల్లి హరా తండ్రి హరి లేదా శ్రీకృష్ణుని కృపను పొందుటకు భక్తునికి సహాయం చేయను నిజమైన భక్తునికి భగవంతుడే స్వయంగా ప్రకటిత మగును.
ఆత్మ సాక్షాత్కారానికి ఈ యుగంలో దీనికి మించిన మరొక మార్గం ప్రభావవంతముగా లేదు మహా మంత్ర ఉచ్ఛారణ వలె


*హరే కృష్ణ హరే కృష్ణకృష్ణ కృష్ణ హరే హరేహరే రామ హరే రామరామ రామ హరే హరే



 


 






















 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online