ఇక ట్రీగ్లిసెరైడ్స్ అంటే అవి రక్త నాళాలలో ముద్ద కట్టే స్వభావము కలిగి ఉంటాయి .లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయుంచుకున్నప్పడు ఈ ట్రీగ్లిసెరైడ్స్ 150 వరకు ఉండచ్చుఅంటారు. కొంతమందికి ఎక్కువగా వుంటూవుంటాయి. అలాంటివారు బోజనానికి ముందు పచ్చి కూరగాయ ముక్కలు తినాలి. అంటే క్యారెట్, ఉల్లిపాయ, క్యాప్సికం, బీట్రూట్,టమాటో,కీర దోసకాయ లాంటి పచ్చికూరగాయ ముక్కలు ముందు కొద్దిగా తినాలి. తిని భోజనం ప్రారంభించాలి. ఇక తరువాత పచ్చి సలాడ్స్, పండ్లు తింటూవుండాలి. స్వీట్స్ బాగా తగ్గించాలి. వేగముగా రోజూ వాకింగ్ చెయాలి. ఇక పల్స్ లో తేడాలు ఉన్నవారు ఆయుర్వేదంలో అశ్వగంధారిష్ట సిరప్ వాడటం చాల మంచిది. కొనుకొని వాడచ్చు. ఇక ట్రీగ్లిసెరైడ్స్ ఎక్కువగా వున్నవాళ్లు ట్రైగ్లైజ్ అనే టాబ్లెట్స్ ఆయుర్వేదంలో ఉంటాయి. అవి రోజు ఒక మాత్ర వాడవచ్చు. అవి కూడా సేఫ్ డ్రగ్. ఈ సమస్య ఎక్కువగా ఉంటె మార్నింగ్ ఒకటి ఈవెనింగ్ ఒకటి వాడవచ్చు తక్కువగా ఉంటే రోజు ఒకటి చాలు. మార్నింగ్ టిఫిన్ తరువాత లేక భోజనము తరువాత కానీ వాడవచ్చు.
ఇంకా వీళ్ళు హృదయారిస్తా టానిక్ కూడా వాడితే మంచిది. ఈ హృదయారిస్తా ఎవ్వరైనా తీసుకోవచ్చు. భవిష్యత్తులో క్లాట్స్ రాకుండా ఉంటాయి .ఆయుర్వేదంలో అర్జున అనే మూలికా చాల గొప్పదనం కలిగీవుంది. అర్జున అనే మూలిక గుండె లో కాని, రక్తనాళాల్లో కానీ ఏ అడ్డంకులు కానీ, బ్లాక్స్ కానీ కరిగిస్తుంది. అశ్వగన్ధ అనే మూలిక బలాన్ని ఇస్తుంది. ఇవి షుగర్ వాళ్ళకి చాలా మంచిది లేదా మెంతులు రోజు నీటిలో ఒక స్పూన్ రాత్రివేళ నానబెట్టి ఉదయమే ఆ నానిన మెంతులు తిని ఆ నీళ్లు కూడా త్రాగితే ట్రైగ్లిసెరైడ్స్ తగ్గిపోతాయి. షుగర్ కూడా కంట్రోల్కి వస్తుంది. అలానే దాల్చినచెక్క (cinnamon.) ఒక స్పూన్ పొడి ఓ కప్పు గోరు వెచ్చని నీటిలో రోజు పరగడుపున త్రాగితే షుగర్, కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్ అవుతాయి .
0 comments:
Post a Comment