Pages

Few more health tips

  
           మిత్రులారా !  ఈ బ్లాగ్ లో నేను కొన్ని హెల్త్ టిప్స్ కూడా పొందు పరుస్తున్నాను .  దీనివల్ల మనకు చాలా ఉపయోగం గా ఉంటుంది .  మీరు కూడా మీకు తెలిసిన చిట్కాలు మీ కామెంట్స్ లో వ్రాయండి .  మనం అందరం కొత్త విషయాలు తెలుసుకోవచ్చు .


1. రోజూ 2 లేక 3 ఎందు ఖర్జూర పండ్లు తింటూ ఉంటె ఎముకల వ్యాధులు రావు .
2.  ఎముకల బలానికి టొమాటోలు కూడా బాగా ఉపయోగ పడతాయి . వీటిలో సోడియం అధికం గా ఉంటుంది .  కాని టొమాటోలు పచ్చిగా కంటే ఉడికించి తీసుకుంటే ఎక్కువ ఉపయోగం గా ఉంటుంది .
అధిక బరువు తగ్గాలనుకునే వారు  రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో పాటు రెండు టొమాటోలు కొద్దిగా నువ్వుల నూనె తో ఉడికించి దానిలో ఉప్పు కొద్దిగా మిరియాల పొడి కలిపి తింటుంటే మంచి ఫలితం ఉంటుంది .
3.  ఎముకలు బలానికి , ఇంకా విరిగినవి అతకటానికి కూడా తేనే ఉపయోగ పడుతుంది .  రోజు ఉదయం , సాయంత్రం కూడా ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 1 లేక 2 చెంచాలు తేనే కలిపి తాగితే ఎముకలు అతుక్కుంటాయి.
 

Few Health Tips

         1.  డయాబెటిస్ తో బాధ పడే వారు ప్రతిరోజూ ఉదయం 4 కరివేప రెమ్మలు నిద్ర లేవగానే తింటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి .
         2.  దాల్చినచెక్క  మెత్తగా పొడి చేసి రోజు ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 1/2 చెంచా పొడి కలిపి ఆ నీటిని ప్రతిరోజూ  మధ్యాహ్నం , రాత్రి భోజనానికి అరగంట ముందు తాగితే అది చాల సమస్యలకు మందు .దానివల్ల షుగర్ , బి .పీ ., కొలెస్ట్రాల్  అదుపులో ఉంటాయి .  అలాగే అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది .
        3.  రోజు ఒక జామకాయ తింటే గుండె జబ్బులు కూడా రావు .  మనకి కావలసిన విటమిన్ c. లభిస్తుంది .

భక్తి కాలమ్

       చాలా మంది  సాయి బాబాది ఏ కులం , ఏ మతం, అని అడుగుతుంటారు .  నన్ను నా మిత్రులు కొంత మంది అడిగితే నేను చెప్పను సాయికి ఒక మతం , ఒక కులం అని ఏమి లేవు . అయినా భగవంతుడికి ఏ కులం, ఏ మతం, అని అంటే ఏమి చెప్పగలము ?  అన్ని మతాలూ , అన్ని కులాలు , జాతులు , జీవులు సమస్తం సృష్టించిన వాడు , అన్నిటిలో ఉన్నవాడే భగవంతుడు అని చెప్పాను .
    అయితే భక్తీ , వేదాంతం కోణం లో కాదు వాస్తవం గా ఎక్కడినుండి వచ్చాడు , ఎలా వచ్చాడు అని సందేహం అన్నారు .         చాలా చారిత్రిక గ్రంధాలు , బాబా జీవిత చరిత్ర పారాయణ పుస్తకాలు , చూస్తె అందులో " కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుడు వెంకూసా అని ఉండేవారు .  ఆయన దగ్గర శిష్యుడే సాయిబాబా అని ఓ ఆధారం ఉంది .   ఆయన దగ్గర శిష్యుడే  సాయిబాబా అనే ఒక ఆధారం ఉంది .  అలానే ఒక పేద బ్రాహ్మణ దంపతులకు ఆయన జన్మించాడు  అని కూడా కొన్ని మరాథి గ్రందాల వల్ల తెలుస్తోంది .   బాల్యం లోనే తల్లిదండ్రులను కోల్పోవటం వల్ల ఒక ముస్లిం కుటుంబం బాబా ని పెంచి పెద్ద చేసారు .  ఆ సందర్భంలో బాబా వారు ముస్లిం కట్టుబాట్లు , ఆచారాలు , నమాజ్ పద్దతుల్లో పెరిగారు అని చెబుతారు .  ఇటు హిందువు కూడా అయినందున ఆయనకుఅక్ భగవద్గీత , రామాయణ , భారతాలు వాటియందు కూడా సంపూర్తి గా జ్ఞానం సంపాదించారు అని తెలుస్తోంది . శ్రీకృష్ణుడు , శ్రీరాముడు లాగానే బాబా కి కూడా తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పే గ్రంధాలు ఉన్నాయి .  ఏది ఏమైనా బాబా నేనే భగవంతుడు అని ఎప్పుడు చెప్పలేదు .  అల్లాహ్  భగవంతుడు అని ,పాండురంగడు భగవంతుడు అని చెప్పేవారు .  ఏది ఏమైనా పేద బ్రాహ్మణుడిగా పుట్టి ,  ఆ తరువాత ముస్లిం బాబాగా అయి , ఆపై కృష్ణ భక్తుడిగా , సుఫిమతం లో ఉండి షిర్డీ లో నివాసం ఉన్నట్లు తెలుస్తోంది . ఈ రకం గా చుస్తే ఆయన కుల మతాలూ లేని , వాటికి అతీతమైన భగవత్ స్వరూపం అని తెలుసుకోవాలి .
      అలానే శ్రీ వేంకటేశ్వరుడు కూడా ఆకాశ రాజు కు అల్లుడు అని , ఆయన క్షత్రియుడు అని , ఆయన కత్తిని ధరించి ఉంటాడు అని , ఇంకా వేటకు వెళ్ళాడు అని అడిగారు .  "లోక పరంగా హిందూ ధర్మ శాస్త్రం లో ప్రధానం గా 4 కులాలు ఉన్నాయి .  అందులో క్షత్రియుడు అనే కులం వాళ్ళు తప్పనిసరిగా దేశరక్షణ , ప్రజారక్షణ చేయాలని ధర్మం .  అందుకే రక్షించే వాడు , అందుకై యుద్ధం చేసేవాడు  తప్పనిసరిగా క్షత్రియుడై ఉండాలని సూత్రం .  ఇంకా  నా విష్ణు : పృధివి పతిహి  అని అంటారు  అంటే రాజు సాక్షాత్తు విష్ణువు అంశ అని చెబుతారు .  అందువల్లనే ఆయన చుట్టూ జనం , సింహాసనం , ఆడంబరత్వం , వైభవం , అలంకార ప్రియత్వం అన్నీ ఉంటాయి . ప్రతిసారి ఏదో ఒక అవతారం ఎత్తి , దుష్ట శిక్షణ , శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు .  రక్షణ కోసం ఎన్నో పన్నాగాలు చేసే ప్రక్రియ రాజులో ఉంటుంది.  ఇవి అన్ని ఉండటమే రాజ తత్వం , అదే విష్ణు తత్వం అని ",
శివుడు లయకారుడు .  నిజానికి ఒక్కడే పరమాత్మ అనేక అవతారాలుగా మారి కనిపిస్తూ ఉంటాడు.  మరి శ్రీరాముడు , శ్రీకృష్ణుడు శివ పూజ చేసారు కదా అని కొందరు ప్రశ్నించారు . నిజమే వైకుంట వాసుడైన శ్రీ మహావిష్ణువు బయలుదేరి భూమిపై మానవునిగా అవతరించాడు  కాబట్టి పైన దైవం శివునికి నమస్కరించి విధేయుడిగా ఉండాలి . అంతే కాదు మానవుడు దైవాన్ని స్మరించాలి అన్న సత్యాన్ని మనకు బోధించటం కోసం శ్రీరాముడు , శ్రీకృష్ణుడు  ఆ విధం గా ఆచరించి చూపించారు .  నిజానికి బ్రహ్మ , విష్ణువు , మహేశ్వరులు  మూడు రూపాలు ఒక్కటే .  మనకు ఆధారం కావాలంటే శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనం దృశ్యాన్ని గుర్తు తెచ్చుకుంటే అందులో అందరు దేవతలు కనిపిస్తారు . అంటే పరమాత్మ ఒక్కడే , చేసే పని కోసం , జీవులకు సౌలభ్యం కోసం, దేనికోసం దానిగా విభజించుకొని భక్తవత్సలుడై జీవులకోసం , జీవులపై ప్రేమను కురిపిస్తూ , జీవులందరూ తన సంతానమే అని, అందరిని చూసి మురిసిపోతుంటాడు .కోరికలు కర్మలలో పడకుండా తన బిడ్డలందరూ తన వద్దే ఉండాలని ఆయన స్వార్ధం .  మనమే కోరికలు పెంచుకొని , కర్మలను పెంచుకుని ఆయనకు దూరమై కష్టాలు పడుతుంటాము.      ఇక్కడ స్వామివారు ప్రభువు , రాజాధిరాజు , రక్షించేవాడు , అన్ని హక్కులు , శక్తియుక్తులు కల వాడు అని అర్ధం .  అంటే రాజు క్షత్రియుడు అయినాడని ఒక నమ్మకం .  అంతేకాని భగవంతుడికి కులం , మతం అని , ఇంకా ఇతరామైన తేడాలు ఏమి ఉండవు .  ఎందుకంటే విశ్వం అంత ఆయనే .  అడుగు అడుగు వ్యాపించి ఉంటాడు .  ఆయన తయారు చేసిన ఒక మేజిక్ ఈ విశ్వం .  అంతటా వ్యాపించి ఉండటంవల్లె విష్ణువు అయినాడు .  ఆ విష్ణువు అవతారం శ్రీనివాసుడు .  కలియుగానికి అధిపతి గా ఉంటూ , లోకం లో పాపాలన్నీ పటాపంచలు చేస్తూ భక్తజనులను రక్షిస్తూ ఉంటాడు .  ఆ బాధ్యత ఆయన తీసుకున్నాడు .  కనుక కలియుగం లో తొట్టతొలి గా వెంకటేశ్వరునికి నమస్కారం చెయ్యాలి .  ఆ తరువాత మనకు ఇష్టదైవాన్ని పూజించవచ్చు .

ఎన్నాళ్ళిలా ??

  ఈ column. లో వ్రాసిన దానికి , అగ్ర కులాలకు ఏమిటి సంబంధం ?  ఎపుడో వేదాలు చదవనివ్వలేదు అనే విషయం ఇప్పుడు అవసరమా ?  నీచం గ చూసారు నీచంగా చూసారు  అని , మాది నీచపు జాతి అనీ మీరే అరిగిపోయిన రికార్డు లా మాటి మాటికీ గుర్తు చేస్తున్నారు . 
   ఇక్కడ సందర్భం దళితుడిని కొట్టింది కొందరు O.B.C. వారు .  అగ్ర కులాలు , బ్రాహ్మణులూ , వేదాలు మొదలైన విషయాలు ఇక్కడ సందర్భం కాదు .  ప్రతి దానిక్కి ఇవే కారణాలు కాదు , అలాగే ప్రతిరోగానికి ఒకటే మందు కాదు .  ఇలా అన్నింటికీ ఒకటే విధం గా చూడటం , అన్నిటికి ఒకటే కారణం చూపటం డొల్లతనం గా ఉంది .  మేధావులు ఇకనైనా మారండి . దళిత సోదరులలో ఉన్న ఆత్మా న్యూనతా భావాన్ని ( inferiority-complex) తొలగించటానికి ప్రయత్నం చేస్తే జాతి , సమాజం అభివృద్ధి చెందుతాయి .

మన భవిత

మిత్రులారా !  నేను ఇక్కడ కొన్ని వార్తపత్రికల్లోని వ్యాసాలు మీ ముందు ఉంచుతున్నాను .  అవి మీరు కూడా చదవండి . పైన వ్యాసాలలో మనం ఒక విషయం గమనించ వచ్చు .  అసలు జరిగిన విషయం ఒకటైతే  వ్రాసిన వ్యాఖ్యానం మరొకటి .  ఎవరి అభిప్రాయం వారి సిద్ధాంత కోణం లోకి వెళ్లి వ్రాస్తున్నారు .  అసలు జరిగిన సంగతి వదిలేసి దాన్ని వారికి నచ్చిన , వారు నమ్మిన సిద్ధాంత పరంగా చూసి ఆ మూస లోనే దాన్ని వ్యక్తీకరిస్తున్నారు మనం చిన్నప్పుడు చదివిన ఆవు వ్యాసం లాగా . చివరకి ఈ పెద్దల రాతల వల మనం కూడా అన్ని విషయాలని కులం , మతం అనే కోణం లోనే చూస్తున్నాం .  అసలు అవి మర్చిపోయి బ్రతకలేక పోతున్నాం .  కొన్ని క్రింది కులాల గురించి ఆధునిక తరం వాళ్ళు మర్చిపోయారు . వీరి ఇంటికి వారు , వారి ఇంటికి వీరు వస్తు పోతూ ఉన్నారు , కలిసి చదువుకుంటున్నారు , పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు . ఇలా జనం ఆలోచనా విధానం లో మార్పులు వచ్చినా ఈ పైన ఉదహరించిన లాంటి వ్యాసాల వల్ల వీరు కొన్ని కులాల వారి గతాన్ని తవ్వి చూపుతున్నారు .  నిజానికి విజ్ఞాన యుగం లో కూడా మన మనసులకి సంకెళ్ళు వేస్తున్నారు .    ఒక విషయం మాత్రం నిజం అది ఏమిటంటే ప్రతి జీవి ఇంకొక జీవిని దోచుకోవటం నిజం  కాదు  కాదు .. సహజం అయిపొయింది .  నిజానికి అన్ని మతాలలోను , కులాలలోను ధనవంతులు , బీదవారు ఉన్నారు అందువల్ల ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వారిని గుర్తించి ఆదుకోవాలి .తెలివితేటలూ ఉండి ఆర్ధిక కారణాల వల్ల చదువుకోలేని వారికి సహాయం చెయ్యాలి .  ఈ మేధావులు అటువంటి విషయాలపై చర్చలు జరిపి , వ్యాసాలూ రాసి జనాన్ని చైతన్య పరచాలి .  అంతేగాని ఇలా అన్నిటిని ఒకే మూసలో చూసి అన్నిటికి ఒకటే అర్ధం తీయరాదు .  అందరికి మంచి జరగాలి .  మనం ఆ దిశగా అడుగులు వెయ్యాలి  






   


 
 
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online