కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
🙏🌹మా తండ్రి గారు .. స్వాతంత్ర్య సమర యోధులు శ్రీమాన్ మరింగంటి భట్ట రా చార్యుల వారి వర్థoతి సంద ర్భంగా నివాళి🙏🌹
🙏ముచ్చట అనే ఈ పేపర్ ని....క్రింద ఇచ్చిన id తో ఓపెన్ చేసి చదవండి 🙏
ముచ్చట అనే వెబ్ న్యూస్ పేపర్ లో కొన్ని మంచి చిత్రాలు తీసిన దర్శకుడు గురించి తెలుసుకుందాము
🙏 ఈరంకి శర్మ ... చిలకమ్మ చెప్పింది 🙏
https://muchata.com/this-is-about-telugu-director-eeranki-sharma/
🌹🙏Ramanujacharyavisistadwitampart 24 ...రామనుజాచార్యులవారి విశిష్టాద్వైతం పార్ట్24🌷🙏
🌹 ఓం నమో నారాయణాయ ...ఓం నమో వేంకటేశాయ🌹
🌹 శ్రీమతే రామానుజాయై నమ:🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏😀కొంతమంది అభిప్రాయం వాట్సప్ లో ఇలా....🙏😀
🙏కొంతమంది జనాల ఇలా కూడా ఆలోచిస్తున్నారా ..అనిపిస్తోంది 🙏
తిరుమల తిరుపతి దేవస్థానం ..శ్రీ వేంకటేశ్వరుని ది ...పూర్వకాలంలో ఎంతోమంది శ్రీ వైష్ణవ జనాలు. ..మా మతం ఒకటి ఉంది వినండి అని చెప్పే ప్రయత్నం కూడా చేయనిచ్చే వాళ్ళు కారు కొందరు ...అయినా ఎన్నో తరాలు ఎంతోమంది వైష్ణవ భక్త శిఖా మణులు ..వాళ్ళని వాళ్ళు అర్పించుకొంటే కానీ అప్పుడు నేను వాళ్ళ ప్రతినిధిని అంటూ ఎన్నో యు గాలనుంచి అక్కడే ఉన్న దైవం.. నేను ఆ సంప్రదాయం ని సమ్మతిస్తూన్నాను అని నిలబడ్డ స్వామి శ్రీనివాసుడు శ్రీ వేంకటేశ్వరుడు ..ఆ భక్త జనులు మౌనవిప్లవ0 కి ...చాలా కాలానికి వాళ్ళు ..శివ కేశువులకు భేదం లేదని విష్ణువు ని ..దగ్గర కు చే ర్చుకున్నారు .(.వైష్ణవు లపై హింస ఎలా జరిగిందో కమల్ సినిమా దశా వతారం లో నీళ్ళ లో పారేస్తారు ఒక ఆళ్వారుని కట్టేసి .)..ఇప్పటికి పురాణం చెప్పే కొందరు వాళ్ళ రీతిలో వైష్ణవ జనాలను విమర్శిస్తూ నే వున్నారు ...అటువంటి వారిలో ఒకరిని టిటిడి లో నియమించారు ..వారి పాత వీడియో లు చూడండి ..శ్రీ మహా విష్ణువు అందంగా లేదని నల్లగా ఉంటాడని ..శివుడు అందగాడని తెల్లగా ఉంటాడని శివుడు అందం చూసి విష్ణువు తన కమలా ల వంటి కన్నులు పీకి ఆ శివుడి పాదాల పై పెట్టి వెళ్ళిపోయా డని చాలా సార్లు చిదంబరం గురించి చెప్పిన పురాణములో ..సందర్భం లేకపోయినా మరీ చిలువలు పలువలతో నొక్కి చెప్పారు ..విష్ణువు గొప్పతనం వచ్చి నప్పుడు కూడా మనస్సు పూర్తిగా ఒప్పుకొనెడి వారు కాదు డొ0క తిరుగుడు గా చెప్పేవారు ..పెద్ద జీయర్ స్వామివారి గురించి కానీ ..రామానుజులవారిగురించి కానీ ఎక్కడైనా ఒక్క మాట చెప్పిన విషయం ఉందా .ఇక కంచి పరమాచార్యులు వారి గురించి రోజూ చెబుతూనే వుంటారు ..ఓకే ..మహానుభావులు అందరి గురించి చెప్పడం మాకు ఆనందమే ... అక్కడ ఏ అధికారిని ఏ రూపేణా ప్రభుత్వం నియమించి నా ఆ అళ్వార్ ల రచించిన వాజ్ఞ మయం ఆ సాహిత్యం లో నిష్ణాతులైన వారు ఉండాలి
అవి అన్ని ఏమి ఆలోచించ కుండా ప్రతి వాళ్ళను తెచ్చి అక్కడ వేసేస్తూ వుంటారు
దీనిని ఏం అనాలి .....మిడి మిడి జ్ఞానం తెలిసిన నేటి యవతరం ..కంపూటర్ వ్యుద్యోగులు ఇదేదో గొప్ప మహత్తు అని భుజాలు జర్చుకోవడానికి చాలా బాగుంటుంది ...కాకపోతే క్రిస్టియన్ పెట్టలేదు సంతోషం అని ఆనంద పడటం తప్ప ఇతర గొప్పతనాలు చెప్పే అంత మహత్తులు ఆయన ను నియమించు టలో ఏమి లేదు ......అలా అంటున్నారు జనులు 🙏
(వాట్సప్ లో చాగంటి గారి పై చక్కర్లు కొడుతొంది ఇలా )
🌹🙏రామనుజాచార్యులవారి విశిష్టాద్వైతం23 వ .Ramanujacharya visistadwaita part23 🙏🌹
🙏ఓం నమో నారాయణా య..ఓం నమో వేంకటేశాయ🙏
:🌹🙏శ్రీమతే రామానుజాయై నమ:🌹🙏
🙏🙏కళా తపస్వి విశ్వనాథ్ గారికి 🙏🙏...🌹..నివాళి🌹
🙏💐కళా తపస్వి విశ్వనాధ్ గారికి 🙏💐 🙏నివాళి🙏
(ఒక సామాన్యుడిగా నా అనుభవాలు మిత్రులతో పంచుకోవాలని )
నేను ....నా మిత్రుడు ఎన్ రవి ..చదువు కొనసాగిస్తూనే కధలు వ్రాస్తుండే వాళ్ళం డిగ్రీ తరువాత హైదరాబాద్ చేరుకున్నాం ఉస్మానియా విశ్వవిద్యాలయం లో సీటుకొట్టాం ..అప్పుడు బాగా కుర్ర కుంకలం ..సినిమా రంగం లో దర్శకుల0 కావాలని కలలు కంటూ ...ముందుగా శిష్యరికం కోసం ..ఆ రోజుల్లో ప్రతీ దర్శకుడి ని కలుస్తూ ఉండేవాళ్ళం ..ఈ లోపు మాకు అర్ధం అయుంది ..అంత తేలిక కాదని .....ఇంట్లో వాళ్ళు కూడా తిట్టిపోశారు..ఇక మార్గంతప్పించి ..అలా టీచరు .. .యం డి ఓ ..వ్యుదోగాల కోసం కష్టపడి చదివి వ్రాశా ము ..మిత్రుడు సెలెక్ట్ అయి వెళ్ళిపోయాడు ..నేను మాత్రం పీహెచ్. డి పరిశోధనలో దిగాను ..మళ్ళీ అంకురం వుమా మహేశ్వర రావు ..దాసరి నారాయణరావు ..కృష్ణ వంశీ ...మధ్య మధ్య మణిరత్నం హైదరాబాద్ వచ్చినప్పుడు అలా కొంచెము టైమ్ వెచ్చించి శిష్య్ రకం కోసం తిరుగుతూ ఉండేవాడిని ఒకసారి జయప్రద గారి తో ఇంటర్వ్యూ తీసుకుందామని హాలిడే ఇన్ కృష్ణ గ్రాండ్ హోటల్ రేడియో తరుపున వెళ్ళాను .అక్కడ ఆమె భర్త నహతా గారు నన్ను కూర్చో బెట్టారు ఇంతలో విశ్వనాథ్ గారు అక్కడకు వచ్చారు కొద్దిసేపు.మళ్ళీ నేను మొ ర పెట్టుకున్నాను .ఈసారి చూస్తాను లే అన్నారు...అని ..చెన్నై వెళ్లిపోయారు ....ఆ పక్క రూ0 లోనే రాజశేఖర్ గారిని జీవిత లను కోలుకోవడం జరిగింది ...అలా అలా వేటూరి సుందరామ్మూర్తి గారు ..అంకురం ఉమా మహేశ్వరరావు గారితో హైదరాబాద్ గోల్కొండ హోటల్ లో బాగా గడుపుతూ ఉండేవాడిని వేటూరి గారు కాఫీ కలుపుకొని నాకు కూడా ఒక కప్పు ఇచ్చేవారు ..చాలా విషయాలు మాట్లాడుకునే వాళ్ళం ..మళ్ళీ నేను రేడియో లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుండే వాడ్ని ..ఇంకో పక్క పత్రికల్లో జర్నలిస్ట్ మళ్ళీ ఇలా బిజీ ..బిజీ ఇక విశ్వనాథ్ గారిని పట్టుకొని ఆయన శిష్యరికం చేయాలని మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించాను ..కష్టపడి ఎన్ని సార్లు కలిసినా ఇప్పుడు కాదు...అనేవారు ..ఒకసారి శుభ సంకల్ప0 సినిమా వంద రోజుల ఉత్సవం హైదరాబాద్ లో రవీంద్రభారతి లో నిర్వహించ టానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ..అప్పుడు సీఎం ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతి ..కమల్ ..బాలు ..శ్రీరామ్ ఫోటో గ్రఫి ఇంకా వేటూరి ..సోమయాజులు ఇంకా నాన్న గారు భట్టరాచార్యులు వారిని ఇలా ప్లాన్ చేసి అందరిని గ్రీన్ పార్క్ హోటల్ కి పిలిపించారు ...సత్తుపల్లి నుంచి నాన్నగారు బయలు దేరి వచ్చారు ..నాన్న గారు ..కమల్ హస్సన్ కి ఒకే రూమ్ బుక్ చేశారు పక్క రూమ్ లో విశ్వనాథ్ గారు ..బాలు గారు శుభలేఖ సుధాకర్ శైలజ గారు (ఇంకా అప్పట్లో వాళ్ళ చిన్న పిల్లల్ని ఎత్తుకొని తిప్పాను ఆ రోజు ) ..ఇలా బుక్ చేసుకున్నారు.... కమల్ గారు బాగా లేటుగా వచ్చారట ..ఉదయం ఇక హడావిడి ..అయినా కమల్ నాన్నగారు చాలాసేపు మాట్లాడుకున్నారు నాన్నగారి వద్ద భద్రాచలం స్వామి వారి ప్రసాదం ఉంది కమల్ కి ఇచ్చారు ..అది తీసుకొని కమల్ ..నాన్నగారికి పాదాభి వందనం చేశారు నేను కమల్ కి పాదాభివందనం చేశాను ....అప్పుడు చెన్నై అడ్రెస్ లు ఫోన్ నెంబర్ లు వ్రాసి ఇచ్చారు ..నాన్నగారి ని తీసుకొని ఒక సారి చెన్నై రావాల్సిందిగా గట్టిగా చెప్పారు ...అక్కడ హొటల్ ..బయట అందరూ ..హాలు లో కూర్చుని వున్నారు ...అప్పుడు విశ్వనాథ్ గారిని మళ్ళీ కలిశాను ....బాబూ చూడు ఇది కత్తి మీద సాము ..నువ్వు చదువు అంటే నీ రీసెర్చి పూర్తి చేసుకొని అప్పుడు అడుగు పెట్టు .అప్పుడు ..ముందు నా దగ్గర స్క్రిప్ట్ అసిస్టెంట్ గా ప్రారంభం చేద్దువు గానీ అంతే కాని రెండు పడవల మీద డాన్స్ వద్దు ..అయినా ముందు చదువు పూర్తి చేయు ..అదిమన జీవితానికి రక్ష ని ఇస్తుంది ..ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో ....అని గంభీరంగా చెప్పారు ....నాకు కొంచెము కోపం బాధ కలిగాయి ..ఇక ఆ తరువాత సభా కార్యక్రమ0 ..అందరూ పాల్గున్నారు .ఆ ఫోటో లు చాలా ఉండేవి సత్తుపల్లి లో చెదలు పట్టి పాడై పోయాయు .ఇక ఆ తరువాత జీవన యాన0 ..ఇంట్లో తిట్లు ..పరిస్థితులు అలా అలా పీ హెచ్ డి పూర్తి అవ్వడం..కాల0 కదిలిపోయుంది ..మా వైఫ్ వాళ్లకు దగ్గర బంధువు విశ్వనాథ్ గారు అని తెల్సింది ..నియోగి బ్రాహ్మణులు అందులోనూ లింగ ధా రులు అంటే శివ లింగం మెడలో లేక జంధ్యానికి కట్టుకుంటారు ..చంద్రమోహన్ ..బాలు ...చాగంటి వీళ్ళంతా ఒకటే నియోగి బ్రాహ్మణు లే కానీ లింగ ధా రుల శాఖ వారు ..వారి ఆచారాలు వేరుగా ఉంటాయి ..కొంత కాలం క్రితం వారిని మళ్ళీ కలుద్దాం అని ప్రయత్నం చేశాను ..సాగర సంగమం డ్యాన్స్ కొద్దీ స్టెప్పులు అయినా వేసి పాద నమస్కారం చేద్దామని అనుకొని ..ప్రయత్నం చేశాను ..ఓపిక లేదండి తరువాత చూద్దాం అంటూ దాట వేశారు అలా అది కలగానే అయిపోయింది. సాగర సంగమం ఒక యోగం ..కదా....వారి జ్ఞాపకాలను మనన0 చేసుకొని ఆ కళా తపస్వి ..ఆ మహర్షి ఆ యశస్వి కి శిరస్సు వంచి చేతులు జోడించి ..సాష్టాంగ ప్రణామం ఆచరించడమే నా లాంటి సామాన్యుడు అర్పించే నివాళి 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌷🌷🌷🌷🙏🙏🙏డాక్టర్ మరి0గంటి మురళీకృష్ణ భట్ట రాచార్య మణికొండ హైదరాబాద్9866049495🌷
🌹🙏నటీమణి విలక్షణమైన అందమైన అలనాటి తార జమున గారికి నివాళి🌹🙏
🙏 అందాల నటి జమునా రమణారావు గారికి నివాళి🙏
హైదరాబాద్ యూనివర్సిటీ లో చదువుకొంటూ వార్తా పత్రిక ల్లోనూ ...రేడియో దూరదర్శన్ లోను విస్సా లాంటి కొన్ని ఛానల్స్ లోను ...హైదరాబాద్ లో పని చేశాను ...అప్పట్లో 90 నుంచి 2005 వరకూ కూడా అనేక సాంస్కృతిక సంస్థలు
కళాకారుల సంఘాలు మీటింగ్స్ ...సన్మాన సభలకు ఆ..వార్తలు కవర్ చేయటానికి .సంగీతం ..నాట్యం .సాహిత్యం ల గురించి కాస్తంత పరిచయం ఉందని ..నన్ను పంపించే వారు అలా ఎందరినో కలుసుకొని ముచ్చటి0చే .అదృష్టం లభించింది...ఇంకో అవకాశం ఎక్కడో ఏదో సభలో మా నాన్న గారు
మరి0గంటి భట్టరా చార్యుల వారు పాల్గునే వారు ..అలా కూడా తోడుగా వెళ్ళాల్సి వస్తూవుండేది ..అప్పుడు చాలాసార్లు కనిపించిన వారు ..అక్కినేని గారు...జమున గారు ..వీళ్ళు ప్రతీ సభలో కనిపిస్తూ వుండే వారు ..ముఖ్యంగా త్యాగరాజ గాన సభ లో ....అలా అక్కినేని గారు ..అయితే నాన్న గారిని దీక్షితులు గారు ..అని పిలిచేవారు ...జమున గారు బాగా మాట్లాడేవారు ..ఇదంతా ఒక ఎత్తు అయితే ...జమున గారి భర్త ప్రొపెసర్ రమణారావు గారు నేను యూనివర్సీ టీ లో బాగా కలిసి మాట్లాడుకునేవారం ..వారు కూడా చాలా ఆత్మీయంగా మాట్లాడేవారు ..నా రీసెర్చ్ టాపిక్ ఎలా నడుస్తోంది అడిగి తెలుసుకొనే వారు
కొన్ని మెలుకువ లు కూడా చెప్పేవారు ..ముఖ్యంగా ఓ యూలోఒక బ్యాంకు ఉంది
ఆ బ్యాంకు లో పని మీద వచ్చి నప్పుడు చాలా సేపు మాట్లాడుకొంటూ కూర్చునే వాళ్ళ0 ..చాలా చక్కగా ..ఆచి తూచి మాట్లాడుతూ వుండే వారు .సినిమా రంగం లో వారి వి కూడా కొన్ని సంభ0దాలు ...కూడా చెప్పారు ...నా కు అప్పట్లో స్థిర మైన ఆదాయం లేక ధైర్యం చేయలేదు ఎన్నో సార్లు నాన్న గారిని తీసుకొని ఇంటికి రమ్మని ఆహ్వానించే వారు ....నాన్న గారు ఇక్కడ స్థిరంగా నివాసం వు 0డ లేక పోవడం ...నేను అప్పట్లో స్థిర పడకపోవడం ..లాంటి కారణాలతో వెళ్లలేక పోయాము ..తరువాత కొంత కాలానికి హైదరాబాద్ చేరి స్థిర పడే టైమ్ కి రమణారావు గారు పరమ పదించడం ఇక్కడికి చేరేసరికి నాన్న గారు పెద్దవాళ్ళు అయి ఇంటికే పరిమితం అవడం ..ఆ తరువాత వారూ వెళ్లిపోవడం అలా ...అలా జరిగిపోయాయి ..మనస్సులో మంచివాళ్ళు ..మంచిని కోరేవాళ్ళు మంచిగా జీవించి నా లాంటి సామాన్యులు మరియు అందరి జనుల గుండెల్లో సు కీర్తిని ఆ చంద్ర తారార్కం ..నింపిన..ఎందరో మహానుభావులు అందరికి కోటి సాష్టాంగ ప్రాణామాలు అర్పిస్తూ అందమైనసోయగాలనటి జమునా రమ ణా రావు గారికి అశ్రునయనాలతో నివాళులు సమర్పించు కొంటున్నాను .
🙏🙏🙏🌹🌹🌹.డాక్టర్ మరి0గంటి మురళీకృష్ణభట్టరాచార్య .హైదరాబాద్
Blog Archive
-
▼
2026
(234)
-
▼
September
(24)
- ఒకసారి చూడండి వినండి
- ఓం నమో వేంకటేశాయ
- జంతువులు మనకు గురువులు
- మూగ జంతువుల దాహం తీర్చిన హీరో ..మొనగాడు మీరు.కూడాస...
- హనుమంత వాహనం పై కలియుగ దైవం చూడండి తరించండి
- మోహిని అవతారం లో కలియుగ దైవం చూడండి తరించండి
- మనసులో గట్టి నమ్మకం ఉండాలి కానీ వయస్సు ఒక లెక్క కా...
- మనసు లో కసిగా పెట్టుకొని సాధించి ఆశయం ముందు వైకల్...
- షుగర్ రీడింగ్స్ కంట్రోల్ కావాలంటే controle sugar r...
- కొద్దిసేపు రిలాక్స్ ....స్ట్రెస్ రిలాక్స్
- వినాయక వ్రత పూజా విధానం వింటూ పూజ చేసుకోవచ్చు
- కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవలకు అంబ...
- పురాతన మైన శివాలయం
- జై హనుమాన్ జై జై హనుమాన్ జయ శ్రీరామ్
- ఎండి పోయిన నదుల్ని తిరిగి తెచ్చిన ఒక ఆయుర్వేద వైద్...
- విదేశ0 లో హిందువులు దీవి
- పర్యావరణ హితం ..ఒక పరిశ్రమ
- ఓ రహస్య గురువు చాలా గొప్ప శిష్యులు
- కొన్ని కేసులు ఇలానే..రాజకీయాలు వల్ల వ్యవస్థలు బ్...
- ఓ గొప్ప జంతువు విశ్వాసం అంటేనే కుక్క ఆ కధని వింట...
- భారతదేశం లో మొత్తం జనాలు ఎల్లవేళలా గుర్తుంచు కోవాల...
- ఒక మంచి ప్రతిభ కలవాని గురించి
- https://telugu.greatandhra.com/mbs/reservation-and...
- Golkonda నవాబు దగ్గర ఉన్న బంగారం చూద్దామా
-
▼
September
(24)
Followers
About Me
- Dr.M muralikrishna
