కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
🌷శంకరాచార్యులవారి అద్వైతభక్తి వేదాంతతత్వం భాగం 8 shankaracharyaadvaitaphilosphy part8
🌷🙏శ్రీ హనుమత్ సమేతశ్రీరామదేవుని మహాత్మ్యం🌷🙏
శ్రీ హనుమత్ సమేతశ్రీరామదేవుని మహాత్మ్యం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడు ఏడున్నర సంవత్సరాలు ఉంటే
ఆ కాలాన్ని "ఏలిన నాటి శని"
అంటారు. ఏలిన నాటి శని ప్రభావం త్రిమూర్తుల మొదలు సామాన్యుల వరకు తప్పనిసరిగా వుంటుంది.
ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది. వానరవీరులంతా రాముడికోసం సేతువు నిర్మిస్తున్న సమయం.
శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు.
అక్కడ వానరులందరూ
సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీ రాముడు
ఒక బండ మీద ఆశీనుడై
పర్యవేక్షిస్తున్నాడు.
అప్పుడు శనీశ్వరుడు రామునివద్దకు వచ్చి
" నేను హనుమంతుని పట్టుకొనే
కాలం వచ్చింది." అని
శ్రీ రాముని అనుమతి అడిగాడు.
" నన్నెందుకు అనుమతి అడగడం.. నీ విధిని నీవు చెయ్యి " అని
అన్నాడు శ్రీ రాముడు.
హనుమంతుని వద్దకు వెళ్ళి శని " నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను." అన్నాడు శనీశ్వరుడు.
"నేను రామ కార్యంలో నిమగ్నమైయున్నాను ఇపుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు .
" సరి , ప్రస్తుతానికి ఏడున్నరమాసాలు వుంటాను ,సరేనా " అన్నాడు. అందుకు హనుమ ఒప్పుకోలేదు.
...ఏడున్నర వారాలు .. అంటూ
కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు
శనీశ్వరుడు .
హనుమంతుడు , రామనామం ఆపకుండా
జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టుకోవాలసిందిగా కోరాడు.
అప్పుడు శనీశ్వరుడు "నీ కాళ్ళలో ప్రవేశించనా"
అని అడిగాడు.
హనుమంతుడు "వద్దు ...
సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి .. పరిగెత్తాలన్నా, నడవాలన్నా కాళ్ళు అవసరం"
అన్నాడు.
" సరి, నీ చేతులు పట్టుకోనా"
అన్నాడు శనీశ్వరుడు .
ఆ రాళ్ళని చేతులతోనే కదా మోసిబి
తెస్తున్నాను. చేతులు పట్టుకోవద్దు. అన్నాడు
హనుమంతుడు.
"అయితే, నన్ను ఏం చెయ్యమంటావు?
నీ భుజాల పైన ఎక్కమంటావా" అన్నాడు
శనీశ్వరుడు.
"రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకుని వెడుతున్నాను. అందువలన
భుజాలు ఎక్కడానికి వీలులేదు " అన్నాడు హనుమంతుడు.
" పోనీ, నీ హృదయం లో వుండవచ్చునా?"
అని అడిగాడు శనీశ్వరుడు.
"ఈ హృదయంలో, మహాలక్ష్మీరూపిణి అయిన సీతాదేవి,
నా దేవుడైన
శ్రీరాముడు
నిరంతరంగా నివసిస్తూ వున్నారు ...అక్కడ నీకు
చోటు లేదు. " అన్నాడు
హనుమ." సరే , చివరకు నీ శిరస్సు ఒక్కటే
ఖాళీగా వున్నది. అక్కడే వుంటాను "అని
శనీశ్వరుడు , హనుమంతుని శిరస్సు
పైన ఎక్కి కూర్చున్నాడు.హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సు పై( అంటే శనీశ్వరుని
మీద) పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలెట్టాడు.
ఆ బండరాళ్ళ బరువును మోయలేక
శనీశ్వరుని కళ్ళుతేలేసాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే,
శనీశ్వరునికి ఊపిరి సలపక
గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని
సముద్రంలో వేసిన మరుక్షణమే
శనీశ్వరుడు హనుమ శిరస్సుపైనుండి కిందకి దూకేశాడు.
" మారుతీ, నీ వల్ల నాకు శ్రీ రాముని సేవించుకునే
భాగ్యం కలిగినది . నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీముందు నా శక్తిచాలదు. నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావా అంటూ చేతులెత్తేసి ఒకే పరుగుపెట్టాడు శనీశ్వరుడు.
హనుమంతుని ముందా కుప్పిగంతులు!
నిర్మల భక్తితో , నిశ్చల మనస్సుతో శ్రీ రాముని సేవలో నిమగ్నమైయున్న ఎవరిని కూడా శనీశ్వరుడు
రెండు క్షణాలు కూడా
పట్టుకొనలేడు.
పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం
శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి
విముక్తి కలిగి తీరుతుంది.
*జై శ్రీరామ్ 🚩*
*జై హనుమాన్ 🚩*శని రాహువు గ్రహ బాధితులు ఎక్కువ గా ఆంజనేయ స్వామి వారిని పూజించి బైట పడుతూవుంటారు ..ఆంజనేయస్వామి వారికి ..మాట ఇచ్చాడు శనీ శ్వరుడు ...నీ పూజ లు చేసేవారిని ..నీభక్తులను నేను ఏమి చేయజాలను ..అని ..ఇంకా శ్రీ రామ నామం కూడా జపిస్తే ..అన్ని రకాల బాధలు పటా పంచలు అయిపోతాయి... జయ జయ హనుమ జయ జయ హనుమ ..జయ శ్రీరామ జయ జయ శ్రీరామ 🌹
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🙏🌹శంకరా చార్యులవారి అద్వైత వేదాంత తత్త్వం భాగం 7 ....shankaracharya advaita 7 part🌹
🌷🌷 🙏 శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం 🙏 🌹🌹
🌹🙏 శంకరాచార్యులు వారి అద్వైత వేదాంత తత్త్వం6 వ భాగం ...shankaracharya advaita philosphy part6
మరి ఒక ఉత్తమ చిత్రం. .😀😄.నూట ఒక్క జిల్లాల అందగాడు. 😀😀 ..తప్పక చూడండి
🌹జీయర్ స్వామి వారి గురించి గిరిజన మహిళలు వివరించి చెబుతున్న ఒక వీడియో🙏
🙏🙏 జై శ్రీమన్నారాయణ ....జై జై శివ నారాయణ ..ఓం నమో వే0కటేశాయ 🙏🙏
Blog Archive
-
▼
2026
(234)
-
▼
September
(24)
- ఒకసారి చూడండి వినండి
- ఓం నమో వేంకటేశాయ
- జంతువులు మనకు గురువులు
- మూగ జంతువుల దాహం తీర్చిన హీరో ..మొనగాడు మీరు.కూడాస...
- హనుమంత వాహనం పై కలియుగ దైవం చూడండి తరించండి
- మోహిని అవతారం లో కలియుగ దైవం చూడండి తరించండి
- మనసులో గట్టి నమ్మకం ఉండాలి కానీ వయస్సు ఒక లెక్క కా...
- మనసు లో కసిగా పెట్టుకొని సాధించి ఆశయం ముందు వైకల్...
- షుగర్ రీడింగ్స్ కంట్రోల్ కావాలంటే controle sugar r...
- కొద్దిసేపు రిలాక్స్ ....స్ట్రెస్ రిలాక్స్
- వినాయక వ్రత పూజా విధానం వింటూ పూజ చేసుకోవచ్చు
- కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవలకు అంబ...
- పురాతన మైన శివాలయం
- జై హనుమాన్ జై జై హనుమాన్ జయ శ్రీరామ్
- ఎండి పోయిన నదుల్ని తిరిగి తెచ్చిన ఒక ఆయుర్వేద వైద్...
- విదేశ0 లో హిందువులు దీవి
- పర్యావరణ హితం ..ఒక పరిశ్రమ
- ఓ రహస్య గురువు చాలా గొప్ప శిష్యులు
- కొన్ని కేసులు ఇలానే..రాజకీయాలు వల్ల వ్యవస్థలు బ్...
- ఓ గొప్ప జంతువు విశ్వాసం అంటేనే కుక్క ఆ కధని వింట...
- భారతదేశం లో మొత్తం జనాలు ఎల్లవేళలా గుర్తుంచు కోవాల...
- ఒక మంచి ప్రతిభ కలవాని గురించి
- https://telugu.greatandhra.com/mbs/reservation-and...
- Golkonda నవాబు దగ్గర ఉన్న బంగారం చూద్దామా
-
▼
September
(24)
Followers
About Me
- Dr.M muralikrishna
