Pages

పీవీ నరసింహారావుగారి జీవితం లో జరిగిన ఓబాధాకరమైన సంఘటన

పీవీ జీవితంలో చ‌ద‌వ‌ని పేజీ ... చేతిలో కాసు లేదు.. ఇల్లు అమ్మేసి.. ఆ డ‌బ్బులతో..
By R Bhanu , 2 Hours ago
 2004వ సంవ‌త్స‌రం, డిసెంబ‌రు నెల 9వ తారీకు. ఢిల్లీ tvలోని ఆల్ ఇండియా మెడిక‌ల్ సైన్సెస్(ఎయి మ్స్‌) ఆసుప‌త్రిలో వైద్యులు.. సిబ్బంది.. ప‌రుగులు తీస్తున్నారు. బ‌య‌ట నుంచి కుయ్‌.. కుయ్‌.. అని కూ త పెట్టుకుంటూ.. ఈ ఆసుప‌త్రికే చెందిన అంబులెన్స్ ర‌య్య‌న దూసుకువ‌చ్చి.. ప్ర‌ధాన కాంపౌండ్ లోకి చేరిం ది. అప్ప‌టికే స్ట్రేచ‌ర్‌, ఆక్సిజ‌న్‌తో సిద్ధంగా ఉన్న ప్ర‌ధాన వైద్యుల బృందం స‌హా.. సిబ్బంది అంబు లెన్స్‌లో నుంచి అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితిలో ఊపిరాడ‌క అల్లాడుతున్న మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహా రావును పూల పొట్లంలా ప‌ట్టుకుని స్ట్రేచ‌ర్‌పైకి ఎక్కించారు. రెప్ప‌పాటులో ఐసీయూకు త‌ర‌లించారు. ఈలో గా.. మ‌రెన్నో కార్లు.. ఆసుప‌త్రి ప్రాంగ‌ణానికి వ‌చ్చి చేరాయి.


సూటూ బూటుతో ఉన్న ఓ వ్య‌క్తి.. ఓ కారులోంచి దిగుతూ దిగుతూనే.. డోర్ కూడా వేయ‌కుండా... హుటాహు టిన ఆసుప‌త్రి లోప‌లికి ప‌రుగు ప‌రుగున చేరుకున్నారు. `సార్‌కి ఇప్పుడు ఎలా ఉంది?  వైద్యులు ఏమ‌న్నా రు?  ప్రాణాపాయం లేదుక‌దా?.. అయినా.. మీరు నిన్నే ఆసుప‌త్రికి తీసుకువ‌చ్చి ఉంటే బాగుండేది.` అం టూ.. ఆసుప‌త్రి ప్ర‌ధాన హాలు లో కుర్చీలో జార‌బ‌డి శూన్యంలోకి చూస్తూ.. ఉబికి వ‌స్తున్న క‌న్నీటిని ప్ర‌య ‌త్న పూర్వ‌కంగా ఆపుకొంటున్న‌ పీవీ గారి పెద్ద కుమారుడు రంగారావు భుజం త‌డుతూ.. ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించేశారు ఆ వ‌చ్చిన వ్య‌క్తి. రంగారావు.. నిమ్మ‌ళంగా చెప్పారు.. `ఇప్పుడే ఐసీయూలోకి తీసుకువెళ్లారు. మేం కూడా వెయిట్ చేస్తున్నాం.. ఇప్ప‌టికైతే.. ప్రాణాపాయం లేద‌నే చెప్పారు` అని!


దీంతో.. ఆ వ‌చ్చిన మ‌నిషి.. `హ‌మ్మ‌య్య‌!. అయితే, ఫ‌ర్వాలేదు. అంతా ఆ వేంక‌టేశ్వ‌ర‌స్వామే చూసుకుం టారు. మీరు ధైర్యంగా ఉండండి!!`` అంటూ.. ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ రూమ్ వైపు వ‌డివ‌డిగా అడుగు లు వేశారు. ఆయ‌నే.. పీవీ దృష్టిలో మిత్రుడు.. నిజాయితీప‌రుడు.. ప్ర‌జా సేవ‌కుడు.. ఐఏఎస్ అధికారి పీవీ ఆర్ కే ప్ర‌సాద్. కొన్ని గంట‌లు గ‌డిచాయి.. ``సార్‌ని చూడొచ్చు!!`` వైద్యులు.. పీవీఆర్ కే ప్ర‌సాద్‌, పీవీ కు మారుడు రంగారావు ఉన్న రూమ్‌కు వ‌చ్చి చెప్పారు. దీంతో వారిద్ద‌రూ ఉన్న‌ప‌ళాన‌.. పీవీగారున్న రూమ్ వైపు అడుగులు వేశారు. ఐసీయూలోకి తీసుకు వెళ్తున్న స‌మ‌యంలో పీవీగారి ముఖానికి పెట్టి ఉన్న ఆక్సి జ‌న్ ఇప్పుడు లేదు. అంటే.. ఆయ‌న స్వ‌యంగా శ్వాస తీసుకోగ‌లుగుతున్నారు. `ద‌గ్గ‌ర‌గా వెళ్లి మాట్లాడొచ్చు!`-అనుకున్నారు రంగారావు.. ప్ర‌సాద్ గార్లు!


ఇంత‌లో సూప‌రింటెండెంట్ వీరిదగ్గ‌ర‌కు ప‌రుగు ప‌రుగున వ‌చ్చారు. ``సార్‌.. ప్లీజ్ ఇప్పుడే వ‌ద్దు! మీరు వెయిట్ చేయండి. చూశారుగా.. ఇక‌, కూర్చోండి`` అని అభ్య‌ర్థ‌నా పూర్వ‌క ఆదేశం ఇచ్చారు. దీంతో ఇద్ద‌రూ వెనుదిరిగారు.. కొన్ని నిముషాలు గ‌డిచాయి.. మ‌ళ్లీ అదే సూప‌రింటెండెంట్‌.. అదే రూం వ‌ద్ద‌కు వ‌చ్చి.. ``సార్‌.. ప్ర‌సాద్ గారూ.. సార్ మీతో ఏదో మాట్లాడ‌ట‌.. ర‌మ్మ న్నారు. ఆయ‌న‌ను ఖంగారు పెట్టే మాట‌లు మాట్లాడొద్దు.. ఎక్కువ సేపు ఆయ‌న‌తో మాట్లాడించొద్దు.. గాబ‌రా పెట్టొద్దు..`` అంటూ.. పీవీఆర్‌కే ప్ర‌సాద్‌కు జాగ్ర‌త్త‌లు చెప్పారు. దీంతో త‌న దేవుణ్ని(పీవీని ప్ర‌సాద్‌గారు ఇలానే అనేవారు సార్ స్థానంలో స్వామి అని పిలిచేవారు) mచూసుకునే అవ‌కాశం వ‌చ్చింద‌ని ప‌రుగు ప‌రుగున మ‌ళ్లీ పీవీగారిని ఉంచిన రూమ్‌లోకి వెళ్లారు.


హ‌ఠాత్తుగా వ‌చ్చిన గుండెపోటుతో ఆసుప‌త్రిలో చేరిన పీవీలో ఎక్క‌డా ఖంగారు లేదు.. చ‌నిపోతానేమోన ‌న్న భ‌య‌మూ లేదు. ఆయ‌న క‌ర్మ యోగి(పెద్ద కుమారుడు రంగారావు ఇలా పిలిచారు. చాలా మంది మ‌న్మోహ‌న్ సింగ్‌ అన్నార‌నే ప్ర‌చారం చేస్తున్నారు. చేసిన ప‌నిని న‌మ్ముకున్నారే త‌ప్ప.. ఫ‌లితంపై పీవీ ఎప్పుడూ ఆశ‌లు పెట్టుకోలేదు(భ‌గ‌వ‌ద్గీత‌లో శ్రీకృష్ణుడు ఇదే క‌దా చెప్పాడు). త‌న రూంలోకి వ‌చ్చి.. త‌నున్న బెడ్‌కు కొంచెం దూరంగా నిల‌బ‌డ్డ పీవీఆర్‌కే ప్ర‌సాద్ క‌ళ్ల‌లోకి క‌ళ్ల పెట్టి చూస్తూ.. ద‌గ్గ‌రగా ర‌మ్మ‌ని పీవీ సైగ చేశారు. దీంతో ఆయ‌న రెండ‌డుగులు ముందుకు వేసి.. పీవీకి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు.



``(తెలుగులోనే)చూడు ప్ర‌సాదూ.. నేనెవ‌రికీ బాకీ అయితే లేను. కానీ, కొంత మందికి రుణ ప‌డిపోయాను. నా త‌ర‌ఫున ప‌ది ప‌దిహేను మంది లాయ‌ర్లు.. కోర్టుల్లో కేసుల‌పై వాదించారు. వారికి నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేదు ప్ర‌సాదూ.. ఇప్పుడు ఇద్దామంటే.. నాద‌గ్గ‌ర పైసా కూడా లేదు. రంగారావు కూడా ఇబ్బందుల్లో ఉన్నాడు. వాడికి చెబితే బాధ‌ప‌డ‌తాడు. కానీ, రుణ ప‌డిపోయి.. `పోవ‌డం` నాకిష్టం లేదు ప్ర‌సాదూ.. నువ్వు నాకోసం ఒక‌‌ప‌ని చేసి పెట్టు``- ఆగుతూ.. ఆగుతూ.. వ‌స్తున్న స్వ‌రం.. కొన్ని నిముషాలు మూగ‌బోయింది. పీవీఆర్ కే ప్ర‌సాద్ క‌ళ్లు సుడిగుండాల‌య్యాయి! `ఎలాంటి నాయ‌కుడు.. ఎలాంటి జ్ఞాని.. మ‌న దేశం కాకుండా విదేశాల్లో పుట్టి ఉంటే.. ప్ర‌పంచ‌మే పూజించేది క‌దా.. పువ్వుల‌పై న‌డిపించేది క‌దా!!`  ప్ర‌సాద్ మ‌స్కిష్కంలో ఆలోచ‌నల ప‌రంప‌ర‌.. పెను వేగంతో సాగింది.


మ‌ళ్లీ పీవీ నోరు విప్పారు.. ``ప్ర‌సాదూ.. నాకు బంజారాహిల్స్ ఓ ఇల్లు ఉంది. నువ్వు ఇప్పుడు వెళ్లి.. దాన్ని అమ్మి పెట్టు. ప‌త్రాల‌న్నీ సిద్ధం చేసి.. రాజికి(పీవీ గారి వంట మ‌నిషి) చెప్పాను.. ఎక్క‌డ ఉన్నాయో చూపి స్తాడు. ఆ డ‌బ్బులు.. నా కేసుల‌పై వాదించిన లాయ‌ర్ల‌కు ఫీజుగా ఇచ్చెయ్‌! ఇదే ప్ర‌సాదూ.. నేను నిన్ను అడిగేది!`` పీవీ గారి కంఠం మ‌ళ్లీ మూగ‌బోయింది. కొన్ని రోజులు గ‌డిచాయి. పీవీఆర్ కే ప్ర‌సాద్‌గారు.. పీవీ ఇల్లు అమ్మేశారు. ఈ విష‌యం చెప్పేందుకు.. ఆయ‌న మ‌ళ్లీ ఢిల్లీ బ‌య‌ల్దేరారు. అది డిసెంబ‌రు 23. పీవీఆర్ కే ప్ర‌సాద్ బేగంపేట‌లోని విమానాశ్ర‌యానికి చేరుకుని ఢిల్లీ వెళ్లే.. విమానం కోసం ఎదురు చూస్తున్నారు. ``స్వామీ మీరు చెప్పిన‌ట్టే.. మీ ఇల్లు అమ్మేశాను. వ‌చ్చిన డ‌బ్బును లాయ‌ర్ల‌కు ఇచ్చేశాను.. మీరు ధ‌న్యులు. రుణ విముక్త‌ల‌య్యారు. ప్ర‌శాంతంగా చిర‌కాలం జీవించండి. మాబోటి వారికి మార్గ‌ద‌ర్శులు కండి``- అని పీవీని క‌లిసి చెప్పాల‌ని మ‌న‌సులో సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంత‌లోనే ఓ వార్త‌.. పీవీఆర్‌కే మ‌న‌సు ఛిద్ర‌మైంది.. ఆయ‌న హృద‌యం నిశీధిగా మారింది.. అదే పీవీ అస్త‌మించారు..

( .............................సేకరణ..................)


Speciality of Puri Jagannadh temple

శంకు ఆకారంలో ఉండే క్షేత్రం ఒర్రిస్సా లోని పూరి జగన్నాధ్ స్వామి దేవాలయం .                                     

జగన్నాథ్ స్వామి ఎప్పుడూ  నిద్రపోరు.             
 అందుకు నిదర్శనం జగన్నాథ్ స్వామి కి కనురెప్పలు ఉండవు.                 

ఇప్పటికీ ఇంద్రాదిదేవతలు స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఒకసారి విభీషణుడు పూరీ వచ్చిన యదార్థగాథ ఉంది.               ప్రళయకాలములో ఎలాంటి సమస్య లేకుండా స్థిరంగా వుండే క్షేత్రం  " శంఖ చక్ర క్షేత్రం " పురుషోత్తమపురి. పురుషోత్తముడు, జగన్నాధుడు తన అగ్రజుడు బలరాముడు, సోదరి సుభద్రతో కొలువు తీరి భక్తులకు దర్శనం ఇచ్చి, కోరిన కోర్కెలు తీర్చే దివ్య ధామము.
ఈ క్షేత్రం శంఖు ఆకారములో ఉంటుంది..

ఒరిస్సా లోని పూరి జగన్నాధ స్వామి క్షేత్రం..




నమ్మాళ్వారు ఎవరు Nammalwar?

#నమ్మాళ్వార్

శఠగోపయతి... నమ్మాళ్వార్

#శఠారి :- శఠము అనగా 'మాయ' ... అది పుట్టగానే మానవుని పట్టుకుంటుంది. దానివలన " భగవంతుడు మనకు రక్షకుడై ఉన్నాడు" అనే జ్ఞానం నశించి... ఏమీతెలియని అజ్ఞానంతో ఏడుస్తాం . కానీ విశ్వసైన్యాధిపతి ఐన విశ్వక్సేనులవారి అంశతో జన్మించిన వీరు - మాయ(శఠము) తనదగ్గరకు రాకుండా హుంకరించారు .... మాయను  పారిపోయేటట్లుభయపెట్టారు కనుక "శఠారి" అని పిలువబడినారు... భగవంతుడు శ్రీమన్నారాయణుడు వరమిస్తానని వస్తే "నిత్యం నీపాదుకులను నాతలపైధరించి సంసారులైనవారికి నీపాదాలను అందించే అవకాశం ఇవ్వుము" అన్నారు. లోకముపై వారికి ఎంతప్రేమ. తనకోసం ఏమీకోరలేదు. అందుకే విష్ణుదేవాలయములయందలి భగవంతుని పాదుకలను "శఠారి" లేదా "శఠగోపం" అంటారు.

అటువంటి శఠగోపయతి (శఠారి) గురించి తెలుసుకుందాం...

వృషభేతు విశాఖాయాం....
కురుకాపురి కారిజమ్ |
పాండ్యదేశే కలే రాదౌ....
శఠారిం సైన్యపం భజే ||

  కలియుగ ప్రారంభం లో వృషభమాసం (సౌరమానమును అనుసరించి రవి వృషభరాశిలో సంచరించు కాలం వృషభమాసం)లో విశాఖ నక్షత్రంలో .... విశ్వమునకు సైన్యాధిపతియైన శ్రీవిశ్ష్వక్సేనులవారి అంశతో.... పాండ్యదేశములోని కురికాపురి అను పురమునకు రాజైన కారి అనుపేరుగల రాజునకు పుత్రుడై అవతరించారు - శఠారులైన నమ్ ఆళ్వార్....

శఠారి యైన నమ్మాళ్వారు పాదములే మనకు రక్ష 

మాతాపితా యువతయః తనయావిభూతిః,
సర్వం యదేవ నియమేన మదన్వయానామ్౹
ఆద్యస్య నః కులపతేర్వకుళాభిరామమ్,
శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా ||

ఇక కలియుగం ఆరంభమైన 42 వ రోజున ఒక మహానుభావుడు అవతరించాడు. అంటే సుమారు 5100 సంవత్సరాల క్రితం అన్న మాట. కారిమారులనే దంపతులకు భగవత్ ప్రార్థన చేస్తే ఒక చిన్న శిశువు పుట్టింది. ఆ శిశువు పుట్టగానే మాట లేదు, కదలిక లేదు, ఎట్లాంటి స్పందన లేదు. ఆ పిల్లవాడు పాపం ఆహారం ముట్టడం లేదు, ఆ పిల్లవాడి ప్రవృత్తి ఏం పనికి వచ్చేలా లేదు.

కారణం...శిశువు గర్భంలో ఉన్నప్పుడు పుట్టే ముందు ఆ శిశువుకి తన పూర్వ దశ అన్నీ తెలుస్తాయి. తల్లి గర్భం నుండి ప్రకృతిలోకి వచ్చేప్పుడు "శఠ" అనే వాయువు జ్ఞానద్వారాన్ని కప్పివేస్తుంది. అందుకే మందమతులం లేక శఠులం అవుతాం పుట్టగానే. మనం చేసిన పనులే మనకు జ్ఞాపకం ఉండవు సరిగ్గా. కానీ ఈ శిశువు శఠ అనే వాయువును కోప్పడి ఆ శఠ అనే వాయువుకి శత్రువు అయ్యాడట. 'అరి' శత్రువు, అందుకే శఠారి లేక "శఠకోపులు" అయ్యారు. మనకు శఠ అనే వాయువు వల్ల దాహం, ఆకలి వేస్తుంది. కాని ఆశిశువుకు ఆకలి లేదు, దప్పికలేదు, ఒక శిశువు గర్భంలో ఎట్లా ఉంటుందో అట్లానే ఉన్నాడు. లోన భగవత్ తత్వాన్నే అనుభవిస్తున్నాడు.

 తల్లి తండ్రులకు ఏంతోచక ఆళ్వారు తిరునగరి అనే ఊరి దేవాలయం వద్ద వదిలి వెళ్ళారు. ఆశ్చర్యం ఆ శిశువు క్రమేపి జరగడం ప్రారంబించింది, ఆ గుడిలో ఉన్న చింతచెట్టు క్రిందకు చేరింది. మాట లేదు, చూపు లేదు, ఎట్లాంటి ప్రవృత్తి లేదు. కేవలం కూర్చొని ఉంది. అట్లా 16 సంవత్సరాలు గడిచాయి, శరీరం మాత్రం పెరుగుతూ వచ్చింది. అందరికి ఆశ్చర్యంగా అనిపించేది, క్రమంగా అందరూ మరచి పోయారు.

#మధురకవి ఆళ్వారులు నమ్మాళ్వారులను సేవించడం .....

అదే ఊరికి ప్రక్కనే తిరుక్కోరూర్ అనే ఊరు ఉంది. ఆ ఊరికి చెందిన ఒక మహానుభావుడు అందమైన కంఠస్వరం కల్గినవాడు, అందంగా పాడగలడు. అందుకే మధురకవి అని పేరు. చాలా కాలం ఉత్తర దేశ యాత్ర చేస్తూ అక్కడే ఉండి పోయాడు. అలా తన యాత్ర సాగిస్తూ అయోధ్యాపురంలో ఉన్నప్పుడు, ఒక నాడు రాత్రి ఆకాశంలో అధ్భుతమైన తారక కనిపించింది. కొత్తగా ఆ నక్షత్రం ఉంది, పైగా అది దక్షిణం వైపు నడుస్తున్నట్లు కనిపించింది. అది కదులు తున్నట్లుగా రాత్రి అంతా ప్రయాణం సాగించాడు. తెల్లవారే సరికి నక్షత్రాలు కనిపించవు. రోజంతా అలసట తీర్చుకొని, మళ్ళీ రాత్రి ఆ నక్షత్రం నడిచిన వైపు ప్రయాణం సాగించాడు. అయితే కొన్నాల్లకు ఈ శిశువు ఉన్న ఊరికి చేరాక ఆ నక్షత్రం కనిపించడం మానేసింది.

ఆశ్చర్యం అనిపించింది. ఈ ఊర్లో ఏమైనా వింత జరుగుతుందా అని ఆ ఊరి పెద్దలని అడిగాడు. పెద్దగా ఎవ్వరికీ జ్ఞాపకం లేదు ఆ శిశువు గురించి. ఆ ఊరి దేవాలయంకి వెళ్ళి చూసాడు. అక్కడ చింతచెట్టు తొఱ్ఱలో నీలిరంగు శరీరం కల ఒక 16 ఏండ్ల బాలుడు కనిపించాడు. ఆకాశంలో కనపడ్డ నక్షత్రం యొక్క కాంతి ఈ బాలుడు దేహంలో కనపడింది. మాట లేదు పలుకు లేదు, బొమ్మలా ఉన్నాడు . ఏమైన మాట్లాడగలదడా అని తెలుసుకుందామని ఆ ప్రక్కనే చెట్టు ఎక్కి ఒక పెద్ద శబ్దం వచ్చేలా ఒక రాయిని కిందికి విసిరాడు. ఆ శబ్దానికి బాలుడు ఒక్క సారి కనులు తెరిచి చూసాడు. మరి మాటేమైనా వచ్చునా అని ఒక  ప్రశ్న వేసాడు. ప్రకృతిలో చచ్చిన దానినుండి సూక్ష్మం పుట్టి ఎక్కడ తినును ...ఎక్కడ పరుండును ...అని ప్రశ్నించాడు ...అప్పుడు అక్కడే తినును ...అక్కడే పరుండును అని బదులు చెప్పాడు

.అబ్బో  వేదాంతం కూడా తెలుసును అని అనుకున్నాడు. ఇలా ఆ శిశువు మాటలకి మెచ్చి, ఆ శిశువునే ఆశ్రయించుకొని ఉన్నాడు. ఆ 16 సంవత్సరాలు లోన ఏదో దివ్యమైన దర్శనాన్ని పొంది, ఆ దర్శనం వల్ల పొందిన ఆనంద అనుభూతిని గానంచేశారు .. అదే తిరువాయ్ మొజి.

 శఠకోపులవారి పాటలను విని శ్రీరంగనాథుడే స్వయంగా 'నా' ఆళ్వార్ అనిపిలిపించుకున్నాడు,  అందుకే నమ్మాళ్వార్ అని పేరు వచ్చింది.

 పరమ ప్రయోజనం భగవంతుడే అనే విశ్వాసంతో  ఎవరు పూజిస్తారో వారికి లభిస్తాడు భగవంతుడు. నాకు సమస్తం అతడే 'వాసుదేవః సర్వం' అని కోరిన నమ్మాళ్వార్ లాంటివారు దొరకడం ఎంత కష్టం అనుకున్నాడు పరమాత్మ. 'ఉన్నుం శోరు పరుగు నీరు తిండిం వెత్తిలయుం ఎల్లాం కన్నన్' నాకు తినే తిండి త్రాగే నీరు విళాసమైన వస్తువులు అన్నీ కృష్ణుడే అనుకున్నారు నమ్మాళ్వారు.  అట్లా అనుకున్నందుకు నమ్మాళ్వార్ తన స్థానం కూడా వదిలిపెట్టి వీరి హృదయాన్నే తన స్థానంగా చేసుకున్నాడు. వీరికి భగవంతుడిపై వ్యామోహం కాదు భగవంతుడికే నమ్మాళ్వార్ అంటే వ్యామోహం. నమ్మాళ్వారిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను అనే పిచ్చి భగవంతుడికి కల్గేట్టు చేసారు. అందుకే నమ్మాళ్వార్ కి 'కృష్ణ తృష్ణా తత్వం' అని పేరు పెట్టారు పూర్వ ఆచార్యులు. అందుకే నమ్మాళ్వార్ ని పట్టుకుంటే కృష్ణుడు దొరక పోవడం అనేది ఉండదు. భగవంతుడి ప్రేమకి లక్ష్య భూతమైన వారు నమ్మాళ్వార్.

నమ్మాళ్వారు భగవంతుని అందరికీ నీ అనుగ్రహం లభించాలి అని కోరారు...

నీద్వారా వచ్చిన వారినే అనుగ్రహిస్తాను అన్నాడు పరమాత్మ...

ఐతే నీపాదుకలను నాతలపై ఉంచుకుని వారిని నీదయకు పాత్రులుగా చేస్తా అన్నారు నమ్మాళ్వారు.

 అందుకే మన ఆలయాల్లో తల శఠగోపం తలపై  తాకిస్తారు. శఠగోపం అంటే నమ్మాళ్వారే. అట్లా తాకించుకుంటే ఆయన కృప మనకు లభించినట్టే.   అందుకే భగవత్ కృప మూర్తీభవించిన ఆ ఆళ్వార్ని పట్టవే మనసా ఇక చేయాల్సిన కృత్యాలు ఏమి ఉండవు అని అనుకుంటారు భక్తులు . అట్లా భావించే వారే నాకు సర్వస్వం అని భగవంతుడు అనుకుంటాడు.

భగవంతుడు ఎవరినైతే ప్రేమించాడో వారిని ఆళ్వారులు అని అంటాం.

భగవద్గీత 7 వ అధ్యాయంలో పరమాత్మ తనని కోరే వారు నాలుగు రకాలుగా ఉంటారని చెబుతూ ఒకనాడు అనుభవించి కోల్పోయిన సంపదలను కాంక్షించేవారు కొందరైతే ఇది వరకు లేని సంపదలను కాంక్షించేవారు మరి కొందరు, ఇలా వీరిని ఆర్థులు, అర్దార్థులు అని చెప్పి, మరి కొందరు ఆత్మ సాక్షాత్కారం కోరే వారు, వారిని జిజ్ఞాసువులు అని, నాలుగవ రకానికి చెందినవారిని జ్ఞాని అని చెప్పాడు స్వామి. . ఈ నాలుగు రకాలవారు సుకృతులు, ఏం కావాల్సినా నన్నే కోరుకుంటారు. ఈ నలుగురిలో ముగ్గురిని ఒక విభాగం చేసాడు. ఒకరిని ఒక విభాగం చేసాడు. అయితే ఈ ముగ్గురూ నన్నూ కోరుకుంటారు, నేను ఇచ్చేవి కోరుకుంటారు. నేను ఇస్తాను కనక నన్ను కోరుకుంటారు. అందుకే వారు ఏక భక్తులు కారు, ద్వి భక్తులు. "తేషాం జ్ఞాని నిత్య యుక్తః ఏక భక్తిః విశిష్యతే"

కానీ జ్ఞాని అనేవాడు ఏక భక్తి కలిగి ఉంటాడు, కేవలం నన్నే కోరుకుంటాడు, నేను ఇచ్చేవాటియందు ప్రేమ ఉండనే ఉండదు. ఎప్పటికి నన్నే కూడి ఉంటాడు.  మరి జ్ఞానికి నీకు ఉండే అనుబంధం ఎట్లాంటిది అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా "ప్రియోహి జ్ఞానినోహి అహం అత్యర్థం సచ మమ ప్రియః" వాడికి నా జ్ఞానం కంటే గొప్ప ఇష్టం నేనంటే, నాకూ జ్ఞాని అంటే అంత ఇష్టం.అన్నాడు భగవానుడే స్వయంగా.... వారే ఆళ్వారులు... వారిలో నమ్ళ్వారులు ప్రధానమైనవారు.

నువ్వుల నూనెతో ఎన్నోలాభాలుsesameoilbenefits

*నువ్వుల నూనె*

     ఈ భూమిపై లభించే ఉత్తమమైన ఆహారాల గురించి మాట్లాడుకుంటే, అప్పుడు *నువ్వుల నూనె* పేరు ఖచ్చితంగా వస్తుంది.

 మరియు ఈ ఉత్తమ పదార్థం మార్కెట్లో అందుబాటులో లేదు.  రాబోయే తరాలకు దాని గుణాలు కూడా తెలియదు.

     ఎందుకంటే  ఈ కొత్త తరం జనం, టీవీ వాణిజ్య ప్రకటనలను చూసిన తర్వాత మాత్రమే అన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.

    మరియు కంపెనీలు నువ్వుల నూనెను ప్రోత్సహించవు.

ఎందుకంటే దాని లక్షణాలను తెలుసుకున్న తరువాత, మీరు ఆ కంపెనీల నూనె అని పిలువబడే ద్రవ కందెన(కొవ్వు)ను తీసుకోవడం మానేస్తారు.

    _*నువ్వుల నూనెను నూనెలకు నూనె అంటారు.*_

    నువ్వుల నూనెకు చాలా బలం ఉంది, అది రాయిని కూడా చీల్చుతుంది. 

మీరు ప్రయత్నించండి.

      ఒక కొండ రాయిని తీసుకొని ఒక గిన్నెలాగ  తయారు చేసి, ప్రపంచంలో నీరు, పాలు, ఆమ్లం లేదా ఆమ్లం ఉంచండి, ప్రపంచంలో ఏదైనా రసాయన, ఆమ్లం, అదే రాయిలో అలాగే ఉంటుంది.

  కానీ… మీరు ఆ గిన్నెలో నువ్వుల నూనెను, ఆ గొయ్యిలో నింపండి .. 2 రోజుల తరువాత మీరు చూస్తే, నువ్వుల నూనె… రాయిలోకి ప్రవేశించి రాయి కిందకు వస్తుంది. 
 
 ఇది నువ్వుల నూనె యొక్క బలం. ఈ నూనెతో మసాజ్ చేయడం వలన, అది ఎముకలను దాటి,  ఆ ఎముకలను బలపరుస్తుంది.

       నువ్వుల నూనెలో భాస్వరం ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

     నువ్వుల నూనెను ఏదైనా గానుగ నుండి కొనండి.

    తైలం అనే పదం "తిల్" అనే పదం నుండి వచ్చింది.

    అంటే, నూనె యొక్క నిజమైన అర్ధం "నువ్వుల నూనె" అని అర్థం.

     నువ్వుల నూనె యొక్క గొప్ప గుణం ఏమిటంటే, ఇది శరీరానికి ఎంతో శుభప్రదంగా పనిచేస్తుంది ..

మీకు ఏ వ్యాధి ఉన్నా, దానికి వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభిస్తుంది. 

    ఈ గుణము ఈ భూమి మీద ఇతర ఆహార  పదార్థాలలోను కనుగొనబడలేదు.

    100 గ్రాముల తెల్ల నువ్వులలో, 1000 మి.గ్రా కాల్షియం లభిస్తుంది.  నువ్వులు, బాదం కన్నా 6 రెట్లు ఎక్కువ కాల్షియం కలిగి ఉంటాయి.

    నలుపు మరియు ఎరుపు నువ్వులు, ఇనుముతో సమృద్ధిగా ఉంటాయి, ఇది రక్త లోపానికి చికిత్స చేయడంలో ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేస్తుంది.

    నువ్వుల నూనెలో ఉన్న లెసిథిన్ అనే రసాయనం, రక్త నాళాలలో కొలెస్ట్రాల్ ప్రవాహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.

    నువ్వుల నూనెలో సహజంగా , సీస్మోల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా చాలా త్వరగా క్షీణించటానికి అనుమతించదు.

    *ఆయుర్వేద చరక సంహిత లో, వంట చేయడానికి ఇది ఉత్తమమైన నూనెగా పరిగణించబడనది.*

    నువ్వుల నూనెలో, విటమిన్-C మినహా అన్ని అవసరమైన పోషక పదార్థాలు ఉన్నాయి, ఇవి మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
    నువ్వులు విటమిన్ -బి మరియు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి.
    ఇది మీథోనిన్ మరియు ట్రిప్టోఫాన్ అని పిలువబడే రెండు ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంది, ఇవి పప్పు దినుసులు, వేరుశెనగ, బీన్స్, చోలాస్ మరియు సోయాబీన్స్ వంటి చాలా శాఖాహార ఆహారాలలో కనిపించవు.

    ట్రిప్టోఫాన్‌ను ప్రశాంతమైన పదార్థం అని కూడా పిలుస్తారు, ఇది గాఢ నిద్రను కలిగించే సామర్ధ్యం కలిగి ఉంటుంది. 

    ఇది చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

    మెథోనిన్ కాలేయాన్ని సరిచేస్తుంది మరియు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది.

     టిల్బీస్ జీవక్రియను పెంచే ఆరోగ్యకరమైన కొవ్వుల యొక్క పెద్ద మూలం.

    ఇది మలబద్దకాన్ని కూడా అనుమతించదు.

     నువ్వు గింజల్లో ఉండే పోషక అంశాలు కాల్షియం, ఐరన్ వంటివి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి.

    నువ్వుల నూనెలో తక్కువ సంతృప్త కొవ్వు ఉంటుంది, కాబట్టి దీని నుండి తయారైన ఆహారాలు అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

    సాధారణ అర్ధం ఏమిటంటే, మీరు సేకరించిన స్వచ్ఛమైన నువ్వుల నూనెను క్రమం తప్పకుండా తీసుకుంటే, అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా తక్కువ.

     అనారోగ్యంతో లేనప్పుడు, చికిత్స అవసరం ఉండదు.  ఇది ఆయుర్వేదం చెబుతోంది.

     ఆయుర్వేదం యొక్క ప్రాథమిక సూత్రం ఏమిటంటే, సరైన ఆహారమే మాత్రమే శరీరాన్ని ఆరోగ్యంగా  ఉంచుతుంది. అపుడు శరీరానికి చికిత్స అవసరం ఉండదు.

     కొంతమంది ప్రజలు మార్కెట్లో నువ్వుల నూనె పేరిట మరికొన్ని నూనెలను విక్రయిస్తున్నారని గుర్తుంచుకోవాలి ..

    ఇది గుర్తించడం కష్టమవుతుంది.  అటువంటి పరిస్థితిలో, మీ ముందు తీసిన నూనెను మాత్రమే నమ్మండి.  ఈ పని కొంచెం కష్టం, కానీ మొదటిసారి చేసిన ప్రయత్నంగా, ఈ స్వచ్ఛమైన నూనె మీకు అందుబాటులో ఉంటుంది.

     ఈ నువ్వుల నూనెలో మోనో-అసంతృప్త కొవ్వు ఆమ్లం ఉంటుంది, ఇది మంచి కొలెస్ట్రాల్‌ను (HDL) అందించటం ద్వారా శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

    ఇది గుండె జబ్బులు, గుండెపోటు మరియు అథెరోస్క్లెరోసిస్ అవకాశాలను తగ్గిస్తుంది.

  క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది :

      నువ్వులు సెసామిన్ అనే యాంటీఆక్సిడెంట్ కలిగివుంటాయి, ఇది క్యాన్సర్ కణాలు పెరగకుండా ఆపుతుంది మరియు దాని మనుగడ రసాయన ఉత్పత్తిని ఆపడానికి సహాయపడుతుంది.

     ఊపిరితిత్తుల క్యాన్సర్, (Lung cancer), కడుపు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రభావాలను తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుంది.

  ఒత్తిడిని తగ్గిస్తుంది.

    ఇందులో నియాసిన్ అనే విటమిన్ ఉంటుంది, ఇది ఒత్తిడి మరియు నిరాశను తగ్గించడంలో సహాయ పడుతుంది.

  గుండె కండరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది.

    ఈ నూనెలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ మరియు సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి, ఇది గుండె కండరాలు సజావుగా పనిచేయడానికి సహాయ పడుతుంది మరియు క్రమమైన వ్యవధిలో గుండె కొట్టుకోవడానికి సహాయపడుతుంది.

   శిశువుల ఎముకలను బలపరుస్తుంది.

    నువ్వులు  ప్రోటీన్ మరియు అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి, ఇది పిల్లల ఎముకల పెరుగుదలను బలోపేతం చేయడానికి సహాయ పడుతుంది.

     ఉదాహరణకు, 100 గ్రాముల నువ్వులు 18 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటాయి, ఇది పిల్లల అభివృద్ధికి చాలా ముఖ్యమైనది.

  గర్భిణీ స్త్రీ మరియు పిండం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

   నువ్వుల లో ఫోలిక్ ఆమ్లం ఉంటుంది, ఇది గర్భిణీ స్త్రీ మరియు పిండం యొక్క అభివృద్ధి మరియు ఆరోగ్యకరమైన అభివృద్ధికి సహాయపడుతుంది.

  నువ్వుల నూనె శిశువులకు మసాజ్‌ చేయడానికి పని చేస్తుంది.

    అధ్యయనం ప్రకారం, నువ్వుల నూనెతో శిశువులకు మసాజ్ చేయడం వల్ల వారి కండరాల బలానికి, వాటి అభివృద్ధికి ఉపయోగపడుతుంది.
    ఆయుర్వేదం ప్రకారం, ఈ నూనెతో మసాజ్ చేయడం ద్వారా, పిల్లలు హాయిగా నిద్రపోతారు.

  బోలు ఎముకల వ్యాధితో పోరాడటానికి సహాయపడుతుంది.

    నువ్వుల నూనెలో జింక్ మరియు కాల్షియం ఉన్నాయి, ఇది బోలు ఎముకల వ్యాధి అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

  డయాబెటిస్ మందులను సమర్థవంతంగా  పని చేయిస్తుంది.

     తమిళనాడులోని వినాయకా మిషన్ విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ అధ్యయనం ప్రకారం, ఇది అధిక రక్తపోటును తగ్గించడంతో పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని 36% తగ్గిస్తుంది.  యాంటీ-డయాబెటిక్  ఔషధం, గ్లిబెన్క్లామైడ్తో కలిపినప్పుడు సహాయపడుతుంది. 
    అందువల్ల, టైప్ 2 డయాబెటిక్ రోగికి ఇది సహాయపడుతుంది.

    నువ్వులు, పాలతో పోలిస్తే మూడు రెట్లు కాల్షియం కలిగి ఉంటాయి.  ఇందులో కాల్షియం, విటమిన్ బి మరియు ఇ, ఐరన్ మరియు జింక్, ప్రోటీన్ మరియు కొలెస్ట్రాల్ పుష్కలంగా  ఉంటాయి.

  ఇవి పాలల్లో లేవు.

    నువ్వుల నూనె, చాలా సంవత్సరాలు పాడవదు, వేసవి రోజులలో కూడా అదే విధంగా ఉంటుంది.

  నువ్వుల నూనె సాధారణ నూనె కాదు.

    ఈ నూనెతో  మసాజ్ చేస్తే, శరీరం గొప్ప ఉపశమనం పొందుతుంది.  పక్షవాతం వంటి వ్యాధులను కూడా నయం చేసే సామర్థ్యం దీనికి ఉంది.
 
  దీనితో, మహిళలు తమ రొమ్ముల కింది నుండి పైకి మసాజ్ చేస్తే, అప్పుడు రొమ్ములు బలపడతాయి. 

    శీతాకాలంలో మీరు ఈ నూనెతో శరీరానికి మసాజ్ చేస్తే, జలుబు అనిపించదు.

  నువ్వుల నూనెతో   ముఖానికి మసాజ్ చేస్తే,  ముఖం యొక్క అందం మరియు మృదుత్వాన్ని కాపాడుతుంది. 
    పొడిగా ఉన్న చర్మానికి ఇది ఉపయోగపడుతుంది.

    నువ్వుల నూనెలో, విటమిన్ A మరియు విటమిన్ E సమృద్ధిగా ఉంటాయి.
    ఈ కారణంగా, ఈ నూనెకు ఇంత ప్రాముఖ్యత  ఉంది.
    ఈ నూనెను వేడి చేసి చర్మంపై మసాజ్ చేయడం వల్ల, చర్మము నిగారింపు పొందుతుంది.

   జుట్టు మీద పూస్తే, వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి.

   మీకు కీళ్ల నొప్పులు ఉంటే, నువ్వుల నూనెలో కొద్దిగా శొంఠి పొడి, చిటికెడు ఇంగువ పౌడర్ వేసి వేడి చేసి మసాజ్ చేయండి. 

    నువ్వుల నూనె ఆహారంలో సమానంగా పోషకమైనది.

    మను ధర్మం లో కూడా నువ్వులు లేకుండా ఏ కార్యము సిద్దించదు, పుట్టుక, మరణం, పరానా, యజ్ఞం, శ్లోకం, తప, పిత్ర, పూజ మొదలైనవి నువ్వులు లేకుండా ఉన్నట్లు రుజువు లేదు.
    నువ్వులు మరియు నువ్వుల నూనె లేకుండా ఇది సాధ్యం కాదు, కాబట్టి ఈ భూమి యొక్క అమృతాన్ని అవలంబించి జీవితాన్ని ఆరోగ్యంగా చేసుకోండి. 

      🙏సర్వేజనాఃసుఖినోభవంతు🙏

పురుషుడుఅంటే ఎలా ఉండాలో ధర్మశాస్త్రము..

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...🚶🏿‍♀
పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది📚

కానీ ఎందుచేతో ఈ పద్యం జన
బాహుళ్యం లో లేదు

కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః,
సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు
ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)📚⚖

1.కార్యేషు యోగీ 💰:
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి🏹

2. కరణేషు దక్షః 🤺:-
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.🏌🏾

3. రూపేచ కృష్ణః🙏:-
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.👌

4. క్షమయా తు రామః🏹:-
ఓర్పులో రామునిలాగా ఉండాలి.పితృవాక్య పరి
పాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి

5. భోజ్యేషు తృప్తః🍲🥘🍛
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.

6. సుఖ దుఃఖ మిత్రం🤼‍♂:-
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.⛹🏼🎻

ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు 🏇🏼ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.                                                   🙏🏻🙏🏻🙏🙏

కలియుగములో...? Kaliyuga surprises

కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు కృష్ణ భగవానుని సమాధానం.
ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు.
శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు.
అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు.
భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.
నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యమేసింది. వెనుదిరిగాడు.
ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు.
నలుగురూ కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు.
ఆయన చెప్పనారంభించాడు.
కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు.
కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు.
కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తలిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం
చేస్తారు.
కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనం అవుతారు. భగవన్నామమనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడ లేరు.
....ఉద్ధవ గీత
శ్రీమద్భాగవతం

Eightwonders of sree puri jaganathmandir

‌Eight Wonders of Sree Puri Jagannath Mandir:

శ్రీ పూరి జగన్నాథుని ఆలయం గురించి ఎనిమిది అద్భుత విషయాలు:

1) ఆలయంపై జెండా ఎప్పుడు గాలికి “Opposite direction” లో రెప రెపలాడుతుంటుంది.

2) ఆలయంపై ఉండే సుదర్శన చక్రాన్ని మనం పూరి పట్టణంలో ఎక్కడ నుండి చూసినా మనవైపు చూస్తునట్టే కనిపిస్తుంది.

3) మామూలుగా అయితే సముద్రం నుంచి భూమి మీదకి గాలి వస్తుంది మరియు సంధ్యా వేళలో దానికి వ్యతిరేకంగా ఉంటుంది.
కానీ పూరి పట్టణంలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది.

4) పక్షులు గానీ, విమానాలు గానీ ఆలయ గోపురం మీద నుండి వెళ్ళవు.

5) ఆలయ గోపురం నీడ ఏ సమయంలోనూ, ఏ దిశలోనూ   కనిపించదు.

6) ఆలయంలో వండిన ప్రసాదం మొత్తం సంవత్సరం అంతా అలానే ఉంటుంది. దానిని దాదాపు 20 లక్షలు మందికి పెట్టవచ్చు. అయినా అది వృధా అవ్వదు, తక్కువ అవ్వదు!

7) జగన్నాథుని ఆలయంలోని వంటశాలలో వంట చెఱకుతో వెలిగే పొయ్యిలపై 7 మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు.
అయినా అన్నిటి కంటే పైన ఉండే మట్టిపాత్ర ముందు వేడి అవుతుంది, చివరిగా క్రింద ఉండేది వేడి అవుతుంది.

8) ఆలయంలోని సింహ ద్వారంలోకి ఒక అడుగు పెట్టగానే సముద్ర శబ్దం వినపడదు, అదే ఒక అడుగు వెనక్కి వేస్తే శబ్దం వినిపిస్తుంది.

జై జగన్నాథ్,
జై జై శ్రీ పూరీ జగన్నాథ్ జీకీ జై ...    ....సేకరించబడినది.....
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online