Pages

🙏🌹🌹🌹 నృసింహ జయంతి శుభాకాంక్షలు .. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావం జరిగిన రోజు .🙏🌹🌹🌹..

 నృసింహ జయంతి అంటే ఏమిటి..? ఎందుకు ఈ వేడుకను జరుపుకుంటారు..?

ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్


నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యుర్నమామ్యహమ్


విష్ణుమూర్తి యొక్క దశావతారాలలోని 4వ అవతారమే నరసింహస్వామి. నృసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్ధతి నాడు జరుపుకొంటారు. నరసింహస్వామి రూపంలో దేహం మానవ రూపం, తల సింహం రూపంలో అవతరించిన దేవుడు.నృసింహస్వామి మాహా శక్తి వంతమైన దేవుడు. ఈ రోజున విష్ణుమూర్తి హిరణ్యకశిపుడిని సంహరించి, ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి నృసింహ జయంతిని వేడుకగా జరుపుకొంటారు.


నరసింహ జయంతి వృత్తాంతం:- హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణ కొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతి ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.



What is Narasimha Jayanti, what is the history behind this?

కశ్యప ప్రజాపతి భార్యయైన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేశాడు. పాతాళాంతర్గతయైన భూదేవిని శ్రీ వరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీ మహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు. అప్పుడు జరిగిన భీకరమైన యద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు. సోదరుని మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చాడు.


అనంతరం రాజ్యపాలనాభారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందర గిరికి పోయి ఘోరమైన తపసు ఆచరించాడు. అతని తపస్సు ఉగ్రతకు లోకాలు కంపించాయి. అతని శరీరం కేవలం ఎముకల గూడయ్యింది. బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవయౌవనంగా, వజ్ర సదృశంగా చేశాడు. వరం కోరుకొమ్మన్నాడు. హిరణ్యకశిపుడు విధాతకు మ్రొక్కి తనకు గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి గాని, పగలు గాని,దేవ,దానవ,మనుష్యులచేగాని, జంతువులచేగాని, ఆయుధములచేగాని, ఇంటగాని, బయటగాని మరణముండరాదని కోరాడు.


అలాగే బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు. ఇంక వర గర్వంతో హిరణ్యకశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు. పంచ భూతాలను నిర్బంధించాడు. తపములను భంగ పరచాడు. సాధులను హింసింప సాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా విష్ణువు "కన్నకొడుకునకు ఆపన్నత తలపెట్టినవాడు హిరణ్యకశిపుని పట్టి వధింతును. మీకు భద్రమగును" - అని వారికి అభయమిచ్చాడు. హిరణ్యకశిపుడు తపసు చేసుకొనే కాలంలో దేవతలు అదనుచూసుకొని అతనిరాజ్యంపై దండెత్తి కౄరంగా కొల్లగొట్టారు. గర్భవతియైన రాక్షస రాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి, ఆమెను రక్షించి తన ఆశ్రమానికి కొనిపోయాడు. ఆశ్రమంలో నారదుడొనర్చిన భాగవత తత్వబోధను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగివచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్ని అప్పగించాడు.


ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. లలిత మర్యాదుడు. నిర్వైరుడు. అచ్యుతపద శరణాగతుడు. అడుగడుగున మాధవానుచింతనా సుధా మాధుర్యమున మేను మరచువాడు. సర్వ భూతములందు సమ భావము గలవాడు. సుగుణములరాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని, తమ రాజ ప్రవృత్తికి అనుగుణంగా మలచమనీ రాక్షసరాజు తమ కుల గురువులైన చండామార్కుల కప్పగించాడు. ఒకమారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చేరబిలచి - నీవు ఏమి నేర్చుకున్నావు? నీకు ఏది భద్రము?- అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు "సర్వము అతని దివ్య కళామయము అని తలచి విష్ణువు నందు హృదయము లగ్నము చేయట మేలు" అని ఉత్తరమిచ్చాడు. రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది? హరీ, గిరీ అని ఎందుకు ప్రేలుతున్నావు? అని తండ్రి గద్దించాడుహిరణ్య కశిపుడు మండి పడ్డాడు.


తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపైనుండి త్రోయించినా ప్రహ్లాదునకు బాద కలుగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అదిచూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షస గురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసికొనివెళ్ళారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు.


క్రోధంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి - నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? బలమెవరు? అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు. అయితే "ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్?" అని రాజు ప్రశ్నించాడు.


"బ్రహ్మ నుండి గడ్డిపోచ వరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్" అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు. "సరే. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?" అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు.


శ్రీ నరసింహావిర్భావం :- బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి.


ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును, .......... కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు" స్తంభమునుండి ఆవిర్భవించాడు.


ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో ( గోళ్లతో )చీల్చి చెండాడాడు. ఇలా శ్రీహరి ( మనిషీ , జంతువూ కాక) నారసింహుని రూపంలో ( పగలు, రాత్రి కాని ) సంధ్యాకాలంలో ( ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని ) గోళ్ళతో ( ఇంటా బయటా కాక ) గుమ్మంలో ( భూమిపైనా, ఆకాశంలో కాక ) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.


నృసింహస్తుతి :-


లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం


పక్షీంద్రశైలభవనం భవనాశమీశం


గోక్షీరసార ఘనసార పటీరవర్ణం


వందే కృపానిధిం అహోబలనారసింహం


ఆద్యంతశూన్యమజమవ్యయ మప్రమేయం

ఆదిత్యచంద్రశిఖిలోచన మాదిదేవం


అబ్జాముఖాబ్జ మదలోలుప మత్తభ్రుంగం


వందే కృపానిధిం అహోబలనారసింహం


కోటీరకోటి ఘటికోజ్జ్వల కాంతికాంతం


కేయూరహారమణికుండల మండితాంగం


చూడాగ్రరంజిత సుధాకరపూర్ణబింబం


వందేకృపానిధిం అహోబలనారసింహం


వరాహవామననృసింహసుభాగ్యమీశం


క్రీడావిలోలహృదయం విభుదేంద్రవంద్యం


హంసాత్మకం పరమహంసమనోవిహారం


వందేకృపానిధిం అహోబలనారసింహం


మందాకినీ జననహేతుపదారవిందం


వృందారకాలయ వినోదనముజ్జ్వలాంగం


మందారపుష్పతులసీరచితాన్ఘ్రిపద్మం


వందే కృపానిధిం అహోబలనారసింహం


తారుణ్యకృష్ణతులసీదళదామరాభ్యాం


దాత్రీరమాభిరమణం మహనీయరూపం


మంత్రాదిరాజ మతదానవమానభంగం


వందేకృపానిధిం అహోబలనారసింహం

ఈ శుభదినాన్ని మనమందరం నృసింహజయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ రోజున స్వామివారి శాంతి కొరకు పానకం నివేదించడం ఆనవాయితీగా వస్తోంది. మనం భగవంతుడికి పండ్లు, పూలు, దక్షిణ తాంబూలాలను భక్తితో సమర్పించుకోవాలి. మనం ఎంత సమర్పించాము, ఏమి సమర్పించాము అనే లౌకికమైన భావనలకంటే ముఖ్యమైనది మన హృదయాంజలి. మనసా, వాచా, కర్మణా స్వామికి ఏకాగ్ర చిత్తంతో ఆత్మ నివేదనను మించిన పూజ లేదు. ఓం నమో నృసింహ దేవాయ నమ్:.🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷

                                           (సేకరించిన సమాచారం ...వారి పేరు వ్రాయ లేదు ..వారికి  స్వామివారిశుభాశీస్సులు )









సద్గురు షిర్డీసాయి నాధ్ మహరాజ్ కి జై ఇది నా అనుభవం ...భగవంతుని దయ ఉంటే తప్పక రక్షిస్తాదు ఓం నమో వేంకటేశాయ

 20 రోజులు ...మందులువాడి భగవంతుని దయ వల్ల..మీ లాంటి వారి పెద్దల ఆస్సిస్సుల తో  నెగటివ్ అని తేల్చుకొని ఇల్లు చేరాము ..4 రోజులు అయ్యుంది ..

అస్సలు ఏమైంది అంటే.........

   ఇక ఇప్పుడు లాక్ డౌన్ కంటే ముందుఏప్రిల్ లో 

నేను మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాను ..ఇంటికి వచ్చాను రెండు రోజులు గడిచింది ..కొంచెము జ్వరం ..ఒళ్ళు నెప్పులు ..ఇది వ్యాక్సిన్ ప్రభావం అనుకున్నాను ...నాలుగురోజులు గడిచినా తగ్గడం లేదు ..పై నుంచి వ్యాక్సిన్ తీసుకున్నవారికి కొద్దిరోజుల వరకు test లు చేస్తే  పాజిటీవ్ అనే వస్తుంది ..అనే ఒక ప్రచారం వల్ల నేను test కి వెళ్ళలేదు ..వ్యాక్సిన్ వాళ్ళు సూచించిన విధంగా .పేరాసెట్మా ల్ dolo650 వేసుకుంటువున్నాను .   నాకు స్పాండిలోలైటి స్ బాగా ఉంది ..దానికి ఆయుర్వేదం వాడుతూవుంటాను ..వ్యాక్సిన్ వల్ల అన్నిమందులు  ఆపేశాం కదా దానివల్ల అనుకున్నాను ...కానీ మిత్రుడు నా కు ఫోన్ చేసి నప్పుడు ...నా వ్యాక్సిన్ బాధలు చెప్పుకున్నాను నాకు   నోరు..లో  అరుచి ..గొంతునొప్పి లేవు ..కొద్దిగా పొడి దగ్గు అప్పుడు start అయి0ది .అతగాడు ..ఈ కోవిడ్ లక్షణాలు ను పసిగట్టగలడు ..కారణం వాళ్ళయింట్లో చాలా మందికి కోవిడ్ వచ్చి అతగాడికి ఎంతో అనుభవాన్ని తెచ్చిపెట్టింది ... .ఆయిల్ కార్పొరేషన్ లో మంచి హోదా పోస్ట్ లో వున్నారు ....ఆయన నా మాటలు ఫోన్ లో వింటూ కొద్దీ ఆయాసం కూడా విన్నాడు ..నడుస్తూ మాట్లాడుతున్నారా ..లేక మెట్లు ఎక్కుతూ మాట్లాడుతూవున్నారా ..అని అడిగాడు ..లేదు కూర్చొని మాట్లాడుతూవున్నాను ....వెంటనే మీ మేడమ్ కి ఫోన్ ఇమ్మన్నారు ..మీ సార్ ను తీసుకొని వెంటనే లంగ్స్ స్కాన్ చేయుంచమన్నారు ....ఇది వ్యాక్సిన్ ప్రభావం కాదు ..కోవిడ్ లక్షణాలు అన్నాడు ...స్కాన్ సెంటర్ వెతికి ..లంగ్స్ తీసి ఒక తెల్సిన డాక్టర్ గారికి పంపాము ..వెంటనే కోవిడ్ సోకింది  అని మెసేజ్ పెట్టాడు ...ఇక నేను ..మా ఆవిడ తలపట్టుకొని కూర్చున్నాము ..భగవంతుడా ..మా ఇంట్లో చేతకాని అమ్మాయి ఉంది ..ఆమెకు సేవలు ఎలా ...మేము ఎక్కడికి వెళ్ళాలి ఎలా జాయిన్ కావాలి .. మొర పెట్టుకు0టున్నాము  గా స్వామి. ప్రతీ రోజు మేము అన్ని మానుకొని ఇంట్లో కూర్చుంటువున్నాం ..ఇప్పుడు మమ్మల్ని పరీక్షలు పెట్టకు స్వామి అని.... ఇప్పడు ఎలా .?మంది ...మహార్బలం.. డబ్బు ..దశకం కావాలి ..ఎవరు వస్తారు ..ఇక నాకు ధైర్యం సన్నగిల్లి .నొప్పులు ..ఎక్కువై మూలుగు ప్రారంభం అయుంది ..కొద్దిమంది ..దగ్గర్లో మనవాళ్ళు పరిచయిస్టులకు .తెలిసింది ..వాళ్ళు ఫోన్ లు తీయడం లేదు ...వాళ్ళని ఏమి అనలేము.  భయం కదా ..ఇంతలో నా మేనల్లుడికి తెలిపి0దినా సతీమణి .....సాయంత్రం వేళ ..మా పెద్దమేనల్లుడు  ..భార్య తో బయలుదేరి మా ఇంటికి వచ్చి జాగ్రత్తలు తీసుకొని కొద్దీ దూరంలో కూర్చున్నారు ..వాళ్ళు భద్రాచలం వాస్తవ్యులు శ్రీరామ భక్తులు ...ఇక నాలుగు బట్టలు పెట్టుకొని బయలు దేరండి ..అని వత్తిడి తెచ్చారు ..వద్దు ..మేము చూసుకుంటాం ..అన్నా వినలేదు నేను ..మా సతీమణి ..మా అక్కయ్య .mentally challenged ..ముగ్గురం కారు వెనక సీట్లో కూర్చున్నాం ..ముందు డ్రైవింగ్ లైన్ లో వాళ్ళు ఎలా అయితే ఒక గంట లో వాళ్ళ ఇంటికి వెళ్లడం అక్కడ వాళ్ళకు తెల్సిన పెద్ద డాక్టర్ గారు రాపిడ్ మా ఇద్దరకి చేయడం పాజిటివ్ రావడం .....మా అక్క మాత్రం ముక్కు లో పెట్టించుకో దు ..అయునా ఆమెకు  కూడా  మందులు start చేసేశారు ....ఎక్కడా బెడ్ లు ఖాళీ లేవు అని డాక్టర్ గారు మమ్మల్ని మేనల్లుడి  పెంట్ హౌస్ లో పైన పెట్టి నాకు మాత్రం ఆక్సిజన్ అవసరం అని తెప్పించి పెట్టారు .ఇక సమ స్య మా అక్క కు ఎవరైనా సేవ లు చేయడానికి కావాలి ఆ అమ్మాయి కి ఏ పని రాదు మాస్క్ పెట్టుకోదు ..పీకి పారేస్తుంది ......ఇంకో మేనల్లుడు ..అక్కడ ట్రైన్ ఎక్కి మా దగ్గరకు చేరాడు ..pp కిట్ కొనుక్కొని వేసుకొని ..ఆ అమ్మయు కి సేవలు మొదలుపెట్టాడు ..  డ్రైవింగ్ చేస్తూ వచ్చి న 

ఆ దంపతులు కి మాత్రం కరోనా లేదు అని తేలిపోయుంది ....ఇక వాళ్ళుఅన్నము  వండి పైకి పంపిస్తూవున్నారు ..డాక్టర్లు ..నర్సు ..పరీక్షలు మందులు ఇంట్లో అందరికీ .టెన్షన్ .క్యాష్ ..చెల్లింపులు ..ఇక ఇవన్నీ చాలాఉంది చెబితే ఇక మా అక్క కు యా0టిబాడీస్ టెస్ట్ చేయంచాను ..ఆమె కు కూడా వచ్చి పోయుంది అని తెలిసింది ..pp కిట్టు వానికి చేయు0చాం  వాడు అన్ని రోజులు సేవ చేసినా వాడికి నెగటివ్ వచ్చింది ..మా మేనల్లుళ్ళు అందరూ మా ఇంట్లో మా తల్లి తండ్రులు దగ్గర ఉండి .చదువుకున్నవాళ్ళే . ..రెండు చేతులతో ఎంత పారిశుద్ధ్య పనిఅయినా. అసహ్య0

చుకోకుండా చేసి పడేస్తారు అది ..నిజంగా దైవత్త్వ0 ..నేను చేస్తాను ..కదా అ0టే.వాళ్ళు చేయాలని రూల్ ఏముంది  మన పెద్దవాళ్ళు అన్ని పనులు నేర్పించి చేయుంచేవారు ..అలా వాళ్ళకి అనుభవం. ఇక   ముఖ్యంగా ఈ కోవిడ్ అప్పుడు  వుండవల్సిందిభగవంతునిదయ ...విపరీతమైనధైర్యం 

బలమైన ఆహారం ఇక ....ఆ సీతారాము లవారు హనుమ మనుష్య రూపములో వచ్చి కాపాడారు ..మొదట్లో ఫోన్ లో ఆ మిత్రుడు  చెప్పకపోతే ఇంకా ఆలశ్యం అయ్యేది 

ఇది చదివిన వారందరికీ నా విన్నపం మామూలు గుడ్డ మాసుకు లు వైరస్ ను అపలేవుమాస్క్ N95 ధరించండి .ఇంటికి వచ్చేవరకు తీయకూడదు ..తీసామా మొత్తం లోపలికి పోతాయి ...మొత్తం కళ్ళని మూసే కళ్ళద్దాలు ధరిస్తే ఇంకా మంచిది ..నేను తక్కువ రక0 గుడ్డ మాస్క్ ధరించాను ..ఎక్కడికి వెళ్ళలేదు ..మందుల షాపు ..గుడి .కి ఎబ్న్నో జాగ్రత్తలు తీసుకుని వెళ్ళే వాడ్ని...కొద్ధిగా తగ్గించాను  జాగ్రత్తలు ..అంతే నేను ...ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే వుండే మా ఆవిడ కు కూడా అంటించాను కాబట్టి ..కాంప్రమైజ్ కాకండి  పక్క బజారు కెళ్ళి మందులు తెచ్చుకున్నా సరే పై బట్టలు తీసి లోపలికి రండి ..వచ్చేముందు మీ ఇంట్లో వారి సాయంతో చేతులు వీపు కాళ్ళు పై శానిటైజర్ తో బాగా స్ప్రే చేయుంచుకోండి ...తప్పదు    శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ ..         శ్రీరామ జయ రామ.. జయ జయ  రామ................జయశ్రీ రామ్ .(M K








🌹🌹🌹మన0 నిత్యం ఎదుర్కొనే సమస్యల కు శ్రీ మద్ భగ వద్గీత ...ఎలా పరిష్కారం చూపుతుందో ఒకసారి పరిశీలించ0డి🌹🌹🌹



🌹🌹ఓం నమో భగవతే వాసుదేేేవాయ🌹🌹

🌹🌹జయ జయ శ్రీ కృష్ణా ...ఓం నమో వేంకటేశాయ🌹🌹

Part. ..9 ..నిరీక్షణ...... Nirikshnashort story part.....9

 సరే ..లే ఇక పదండి బాబు ..బయలుదేరదాం ...డాక్టర్ రమణ ..కిరణ్  లు క్రిందికి వచ్చి కారులో బయలు దేరారు ..చూడండి కిరణ్ నాకు రెండు ..మూడు రోజులు మా ఇంటి దగ్గర  .వుంటూ నాకు హెల్ప్ చేయాలి ..చేస్తారా ? .కారు డ్రైవింగ్ చేస్తూ అడిగాడు .డాక్టరు రమణ  నేనా సార్ . .అవును ..బాబు ..మీరే ...ఆయునా .కారులో ఉంది మన ఇద్దరమే కానీ ..ఇంకెవరూ లేరే..?....చిరునవ్వు తో అడిగాడు డాక్టర్ రమణ ...కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం ..సరే..లే.కిరణ్ బాబూ ..మీరు అంతగా ఓకే చెప్పటానికి ..సందేహిస్తుంటే ..వద్దులెండి..నేనే ఇంకా ఎవరినైనా చూసుకుంటాను .కొంచం కోపం నటిస్తూ చెప్పాడు డాక్టర్ రమణ .. బలే వారండి ..నేను మీకు ఆ మాత్రం సహాయం చేయలేనా సార్ ....పనులు అన్ని లిస్ట్ వ్రాసుకుంటా చెప్పండి ..సార్ ...కొంచం నవ్వు తెప్పించుకుంటూ అడిగాడు కిరణ్ ..

సరే ఇంతకూ మీ రీసెర్చి పద్ధతి ..విషయ సేకరణ ..అంతా మీ గైడ్ ..అదే ప్రొపెసర్ గారికి నచ్చుతుందా ....బలేవారు ..సార్ ..సాక్షాత్తూ ..ఆ సబ్జెక్ట్ కి డాక్టర్ గారు ..మళ్ళీ దానిలో వృత్తి గా డాక్టర్ గారు ..ఇక మీ నేతృతత్వం లో ఇంకా తిరుగు  ఉంటుందా ..అందుకే ..మా ప్రాపెసర్ గారు కూడా మీరు చెప్పి వ్రాయు0చేయు వన్ని ..ఆయన క్షుణ్ణంగా చదువుతూ వున్నారు...అలా వారిద్దరి సంభాషణ లో ..ఇల్లు రానే వచ్చి0ది
*                         *                             *                         *                          *

రాత్రంతా భయంతో వణికిపోతూ ..చీకటిలో వేగంగా నడిచిపోతుంది అరుణ ..తెల్లవారే లోపు ..దూరంగా వెళ్ళాలి ..ఈ చుట్టుప్రక్కల ఎక్కడ ఉండకూడదు ..ఏమో శివ నారాయణ ఇంటి కి వెళ్ళి ఈ రాత్రి కి తల దాచు కుంటే ఎలా ఉండేదో ..ఏమో లే నా గురించి ..ఆ కుటుంబా న్ని ..ఇబ్బ0దుల పాలు చేయడం దేనికి ..అస్సలే మా వాళ్ళు వెధవలు ..ఒక పక్క ఆలోచిస్తూనే ఇంకో పక్క తన పమిటి చెం గు తో ముఖాన్ని తుడుచుకుంటూ తుప్పలు ..గుట్టలు దాటుకుంటూ ..భయ భయ 0గా దగ్గర లోని ..పెద్దిపాడు రైల్వే స్టేషన్ కి చేరుకుంది ...అనేక కష్టాలు ..నష్టాలు కి తట్టుకొని ..ధైర్యం కూడ గట్టుకొని ఆగి ఉన్న రైలు లో ఎక్కి కూర్చుంది ...ప్రయాణం లో పడి ..దూరంగా జరిగిపోతుంది.
ఒక పక్క అరుణ కుమారి ఇంట్లో ..వాళ్ళ .రౌడీచుట్ట0   ..కాపు కాసి చూస్తున్నాడు అరుణ ఇంటికి తిరిగి రాగానే ..బంధించి ..వాళ్ల అబ్బాయి తో పెళ్లికి ఒప్పించి ..పొలం తానే కొట్టేయాలని  ..పధకం వేసుకున్నాడు ....ఒకాయన వాళ్ళ అమ్మతో గొడవ పెట్టుకున్నాడు ... చూడమ్మా.. మీ అమ్మాయి ని ఎక్కడికి  పంపించావో చెప్పు ..లేదంటే చెప్పించాల్సి ఉంటుంది ....హెచ్చరిక గా చెప్పాడు గురు నాధ0 ..  ఏమయ్యా...నీకే తెలియాలి ..నువ్వు ని గ్రూప్ వాళ్ళు మా కుటుంబ0 మీద పడ్డారు ...మీకేం మాయరోగం ..మా అమ్మాయి ని ఏం చేశారో నువ్వే చెప్పు ...కొద్ది గా గర్జించి నట్లు గా .అడిగింది ఆరుణ వాళ్ళ అమ్మ ...నేను ఏం చేశాను ...నేను  చేస్తున్నపని మంచి పని ..మీ అమ్మాయి ని మా ఇంటి కోడలు గా చేసుకొని ..మీ కుటుంబాన్నీ ఉద్దరించా లని కంకణం కట్టుకున్నాం ..అక్కయ్య ..దీర్ఘ0 తీ శాడు ....కొద్దిసేపు వాదోపవాదాలు ..చూడమ్మా ..అతిగా ఆవేశపడకు ..మీ అమ్మాయి .నీ దగ్గరకు వస్తుంది ..వచ్చినప్పుడు ..కాస్తంత నచ్చచెప్పు ....పిచ్చి పిచ్చి వేషాలు వద్దు మేము ..కాపలా కాస్తూనే ఉంటాం .. జాగ్రత్త   ..ఇక రండిరా పోదాం ..ఆవేశంగా ఊగిపోతూ వార్నింగ్ ఇచ్చి ..అంతా బైటకు ..వెళ్లిపోయారు ......
**                            **                            **                           **                  **

కిరణ్ ..రీసర్చివర్క్ సజావుగా సాగిపోతుంది  ఒక పది పర్సెంట్ మాత్రమే మిగిలి ఉంది ....తొంభై శా తం పని పూర్తి అయిపోవడం ..ప్రొఫెసర్ గారు అభినందించడం అలా ఉత్సాహం తో ఉన్న కిరణ్...డాక్టర్ రమణ  ఇంట్లో ..చిన్న లగేజ్ తో దిగాడు .చిన్న చిన్న పనులు ..చేయుంచుకుంటూ తన కుటుంబం లో ఒక మనిషి లా ..మార్చేశాడు డాక్టర్ రమణ ..వాళ్ళ  జమీందారీ కుటుంబం ..వాళ్ళను నమ్ముకున్న  ఊరు ప్రజలు ....ఇప్పడు రాజకీయ పార్టీలు వచ్చిన తరువాత ఎలా మారిపోయారు ..డాక్టర్ రమణకుటుంబం .కిరణ్ లు కల్సి మాట్లాడుకుంటూ ..ఎంతో సంతోషంగా కాలం గడుపుతూవున్నారు ..కావాలనే డాక్టర్ ...కూతురు గీత .. కిరణ్ కు ...కల్పి పనులు కేటాయిస్తూ వున్నాడు ..అంతర్జాతీయ పత్రిక కు  కొన్ని వ్యాసాలు ..టైప్ చేయడం ..కొన్ని ట్రాన్సలేషన్ చేసి పెట్టడం ..కొన్ని బుక్స్ లోనుంచి ..కొన్ని విషయాలు వెతికి పెట్టడం
బీరువాలలో పడి పాడైపోయిన చాలా విలువైన పుస్తకాలను కుట్టడం ..వాటిని ఒక లైనుకు తెచ్చి మళ్ళీ జాగ్రత్తగా భద్రపర్చడం ..లాంటి పనులు చేస్తూ ..చాలా బిజీ అయిపోయారు గీత ..కిరణ్ లు ..మరోపక్క తన రీసెర్చి వర్క్ కూడా చూసుకోవడం ..ఆతగాడి  వర్క్ టైపింగ్  లో కూడా గీత సహకరించడం ..అలా అలా జరిగిపోతున్నాయి ..మన ఇంటి పని వాళ్ళు దీపావళి పండుగ కు వెళ్ళారు కదా ..కాస్తంత మీ ఇద్దరు కారులో వెళ్ళి పండుగ సామాన్లు ..ఆ సరుకులు అన్నీ మీరు చూసుకొని తీసుకురావాలి ....ఆ పని కిరణ్ ..వాళ్ళ అమ్మాయి గీత కు పురమా యుంచాడు ...మరుసటిరోజు ఇద్దరూ వెళ్ళా రు . గీత కారు డ్రైవ్ చేస్తుంది ..పక్క సీట్లో కిరణ్ భయ భక్తులతో వినయంగా కూర్చొని వున్నాడు ...మీరు కూడా కార్ డ్రైవ్ చేస్తారా అడిగింది గీత ...ఏదో మీ అంతగా  ప్రాక్టీస్ లేదు ..మేము పల్లె నుంచీ వచ్చిన వాళ్ళం కదా ..దీర్గ0 తీసి మాట్లాడాడు కిరణ్ . ఎమోలేండి   మీరు జమిందారు లు కదా ..కొంచ0 కావాలనే ఆట పట్టిస్తోంది ..గీత   అదే మాకు చిన్న తనం. లో బాగా సమస్యలను తెచ్చి పెట్టింది ..మాకు ప్రతిపనికి పనివాళ్ళు వుండే వాళ్ళు ..మా ఇంట్లో ఆరోజుల్లో పాత మోడల్ పీయట్ కారు ఉండేది  ..అప్పటికే మూల బడింది ....అయినా నాకు డ్రైవింగ్ వచ్చు ..కొద్దిగా నవ్వుతూ చెప్పాడు  కిరణ్ ..ఎమోలేండి ..మీరు బుద్దిమంతులు అట ..మంచి అందగా డట . కొంటెగా అడిగింది గీత ..అది మీ అభిప్రాయమా ? ఎదురు ప్రశ్నించాడు కిరణ్ ..మా నాన్నగారు తెగ చెబుతూ వుంటారు .మీ గురించి .పెదవి విరిచింది గీత ..మీరు అందగత్తె కాదా మేడమ్ ..సినిమా నటి గీత లాగానే వుంటారు ..మీరు కూడా డాక్టర్ చదువుకున్నారు ..మీ అందం ముందు మేము ఎంత  ..అస్సలు మీ కళ్ళ లోకి సూటిగా చూసి మాట్లాడ లేకపోయేవాడ్ని ..మీ అందం జిగేల్ మనిపించేది .మీకు వచ్చేవాడు ఎవరో కానీ అదృష్ట వంతుడు .మీ మంచి కుటుంబానికి మంచి వాళ్ళు రావాలి అని నా కోరిక ..అని కిరణ్ చెబుతూ మార్కెట్ దాటి పోతున్నాం ఇక్కడ కొనేవి ఏమీ లేవా  కొంచెము ఆత్రుత గా అడిగాడు కిరణ్ ..లేదండి దేవాలయం దగ్గర ఒక పెద్ద పూజా సామగ్రిషాపు  ఉంటుంది .మా నాన్నగారు చెప్పిన పూజవి అక్కడే తేవాలి బాబు ..అయి నా మళ్ళీ ఇటు వస్తాము కదా ..డ్రైవింగ్ చేస్తూ చెప్పేసింది  గీత ..ఇంతలో ఒక దేవాలయం దగ్గర ఆపేసింది కారు .రండి ఇది చాలా పెద్ద శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవాలయం ..దండం పెట్టుకొని వెళదాం ..అంటూ ఇద్దరు దేవాలయం లోకి  వెళ్ళారు ..అలా అలా మొదలుపెట్టి కారులో చెక్కర్లు కొడుతూవున్నారు గీత ..కిరణ్  ..ఇంటి ముఖం పట్టారు ..మధ్య లో ఒక రెస్టారెంట్ లోకి దూసుకు వెళ్ళారు ..ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ లా గించేశారు .మీరు ఎలా ఇస్తారు సార్ ..మీరు మా ఇంట్లో మా పనులకు సహాయం చేయడం కాకుండా డబ్బులు కూడా ఇస్తారా ...ఎంత మంచి వారు సార్ ..మీరు ..చిలిపిగా అన్నది గీత ....అంటూ తనే మొత్తం పే చేసి కారులో ఇంటివైపు దూసుకువెళ్తున్నారు.......వీళ్ళు ఎలా వుంటున్నారు ..వీళ్ళ ఇద్దరి మధ్య స్నేహం ఎలా ఉంది ....జాగ్రత్తగా గమనిస్తూవున్నాడు  డా.రమణ ..
రాత్రి పూట ..భోజనాలు పూర్తి అయిపోయాయి .అందరూ కలసి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొంటూ తెగ నవ్వుకుంటున్నారు ...కిరణ్ గారు మీరు  కబుర్లు చెబుతూ ఉంటే ..తెగ నవ్వు వస్తుంది బాబు ...హాస్టల్ లో ఎందుకు ..ఎంచక్కా మీరు వచ్చేసి ఇక్కడ ఉండొచ్చు గా ..ఎలాగూ మీ గురువుగారు ...డాక్టర్ గారితో మీకు ఏదో ఒక టీ మాట్లాడుతూ వ్రాస్తూనే వుంటారు కదా ..కొంచం వినయంగా అడిగింది ..డాక్టర్ గారి భార్య ..అందరూ ఆవులించుతూ లేచారు ..ఇంతలో గీత గారు ..మనం రేపు కొన్ని పనులు సంపూర్తి చేయవచ్చు ....ఏదో చూపిస్తూ వివారిస్తూవున్నాడు కిరణ్ ...చూడు బాబు ..గీత అంటే చాలు ..గారు అవి అన్నీ వద్దు బాబు ..గట్టిగా చెప్పింది డాక్టర్ భార్య ..తల ఊపాడు కిరణ్ .ఎవరి గది లోకి వాళ్ళు వెళ్లిపోయారు ..హాలులో కిరిటి పక్కన  దివాన్ పై పడుకొని ఆరు బయటకి దృష్టి సారించాడు  అప్పుడప్పుడే వెన్నెల కనిపిస్తోంది...ఇంటిముందు చెట్ల   క్రిందఎడ్ల బం డి క్రిందకు దించేసి దానికి  రెండు ఎద్దులు కట్టేసి ఉన్నాయి ...ఒక ఎద్దు ఇంకో ఎద్దు ని నాకుతూ ఉంది ..అక్కడ పనిచేసే దంపతులు చాప పై కూర్చొని  భోజనం చేస్తున్నారు ..భార్య బట్టలు బాగా కట్టుకుంది ..కొప్పు లో మల్లె దండలు చుట్టుకొంది ..కాగడా దీపం  కాంతి లో మెరిసిపోతోంది .దొ0గ సచ్చినో డా
నాకు. గింత వేసి కూరమొత్తం ఏసేసుకున్నవా ..తింటే తిన్నావు బావా మొత్తం తిని ఏం బాగోలేదు అంటవు.. సూడు ..అప్పుడు చిర్రున కాలుద్దీ నాకు ..గొణుగు తోంది......అబ్బా ఇక ఆపవే ..కావాలంటే ఇదిగో తీసుకో ..అంతే కాని మంచిగ ఇద్దరం పక్క ఎక్కే టైం లో గొడవలు మాత్రం బెట్టకు దుర్గి ..బ్రతిమి లాడుతునట్లు గా చెప్పాడు ...ఉతికిన బట్టలు ఇచ్చానా ...మళ్ళీ మురికి బట్టలు తగిలించుకుని అన్నా నికి  వచ్చినావు ..నువ్వు నాపక్కన పండొద్దు ..అంతే ..కొంచెము కోపంగా అరిచేస్తుంది దుర్గి ....అదృశ్యాలు చూస్తూ ఆలోచనల్లో పడ్డాడు కిరణ్ ..గీత చాలా మంచి అమ్మాయి ..అందగత్తె బాగా చదువుకున్నది కూడా కొంచెము పైకి కఠినంగా అనిపించినా మనస్సు మాత్రం వెన్న ......ఒకవేళ అదృష్టం కలిసివచ్చి నన్ను ...గీత ని చేసుకోమంటే ..అమ్మో ..ఇంత అందమైన అమ్మాయి నా కౌగిలిలో ఉండిపోతుందా ..ఊహించుకోలేను ....ఏమోలే... వాళ్ళు అన్నీ ఉన్న మహారాజులు ..వాళ్ళు తలచుకుంటే ..పెద్దపెద్ద  డాక్టర్లు పెళ్ళికొడుకుగా వచ్చి నిలబడతారు ..అవును ..ఏదేదో ఊహించుకొ0టే .. ఇదివరలో ఒక అమ్మాయి నన్ను దెబ్బకొట్టింది ...ఇక చాలు అనుభవం ....ఇక చాలు.. కంట్రోల్ అనుకొంటూ నిద్ర లోకి జారుకున్నాడు  కిరణ్
**                               **                                  **                             **                         **                        **  

                                                                                                        (ఇంకా ఉంది   to be continued............                     


       

ఆక్సిజన్ తక్కువై బాధ పడుతున్న వాళ్ళు ఈ డాక్టర్ గారు చూపించే చిట్కాలు చూడండి

 


అయితే ఇచ్చే మందు  నేను ఇదివరలో ఒక ఆయుర్వేదపుస్తకం లో చదివాను ..అది డాక్టర్ గారు 
వివరించి చూపడం ఎంతో ఆనందం .అయితే అంత డోస్ లో తీసుకుంటే బాగా వేడి చేస్తుంది ..పొడిదగ్గు వస్తుంది అందుకే డోస్ తగ్గించి తీసుకుంటే మంచిది ..కొద్దిగా ముద్ద కర్పూరం ..కొద్దిగా ఒక రెండు చెంచాల వాము 2 లవ్0గాలు నలగగొట్టి  ఇంకా మీకు అందుబాటులో ఉంటే జామాయల్ కానీ జిందాటిలిస్మాత్.ఏదైనా ఒకటి తీసుకొని రెండు చుక్కలు లేదా 3 చుక్కలు వేసి మూట కట్టి  ఈ ముక్కు తో 10 సార్లు ఇంకో ముక్కు అటు 10 సార్లు పీల్చుకోని మళ్ళీ కాస్త గ్యాప్ ఇచ్చి పీలుస్తూ ఉండాలి ..వేడిచేస్తున్నట్లు అనిపిస్తే 5 సార్లు చొప్పున పీల్చుకోవచ్చు 

ఆక్సిజన్ కొరత ఉన్నవారికి ఈ ఆహారం మంచిది ...ఒకసారి చూడండి

 https://telugu.boldsky.com/health/wellness/foods-to-improve-your-oxygen-levels-naturally-in-telugu-026324.html?utm_medium=Mobile&utm_source=BS-TE&utm_campaign=Popup-Share

కరోనా పేష్0ట్స్ కనుక వారికి తగినంత ఆక్సిజన్ రాకపోతుంటే ..

 మీరు ఒక పనిచేయండి ..కాస్త0త ముద్ద కర్పూరం , కొంచెము వాము ...లేక ajwin .2 లవంగాలు మొత్తం ఒకసారి దంచి మూట కట్టుకొని వాసన చూస్తూ లోపలికి  పీలచ0డి ..ఈ ముక్కుతో 10 సార్లు ఆముక్కుతో10సార్లు పీలచ0డి వెంటనే ..ఆక్సిజన్ రీడింగ్ అందుకుంటుంది ....చేసి చూడండి ఎవరైనా చేసుకోవచ్చు . ఎక్కువ సార్లు పీలిస్తే కొంచం వేడిచేస్తుంది ...దానివల్ల పొడిదగ్గు వస్తుంది ..మళ్ళీ అదేమిటో అని భయపడతాము కదా అందుకే ..పీల్చుకోనే టైం కొద్ది gap ఇస్తూ పీల్చవచ్చు ..      ..ఓం నమో వేంకటేశాయ

                (ఇది నా అనుభవం .....ఎలానో భగవంతుని దయవల్ల ..మేము బయట పడ్డాము..)

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online