Pages

ఓం కారం జపిస్తే మానసిక శా రీరక ఆరోగ్యం.. chanting omekara gives health

*'ఓం'తో అలసట మాయం..శాస్త్రీయంగా నిరూపించిన బాలిక*

ఓం శబ్దంతో శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలుగేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్తలను అకట్టుకుంది. కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది.

ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు.

అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి...ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియజేసింది. అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది.

గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు. కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు.

ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు. ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించినపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది.

అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది. దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది. దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది. ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది.

17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది. ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష తెలిపింది.
అయితే చక్కగా పద్మాసనం వేసుకొని గుడిలోనో ,తోటలో కానీ ,..ప్రశాంతంగా కూర్చొని సాధన చేయాలి ఎదురుగా కావాలంటే మీ ఇష్ట దైవం పెట్టుకొని ప్రాక్టీసు చేయండి ..కళ్ళు మూసుకొని ఓం అని రోజుకు కొంచెం సేపు ఓం కారం ప్రాక్టీస్ చేయండి ...లంగ్స్, కి గుండె కూడా మంచిది ..మనకు ఉన్న శక్తి ని పట్టి చేసుకోవాలి ...అతి సర్వత్రా వర్జయేత్ అని కదా ...అతి చేయకూడదు ..ఒకవేళ ఎక్కువ సేపు పట్టలేక పోతే ...ఒక నామం కల్పి ప్రశాంతంగా కూర్చొని 108 సార్లు జపం లాగా చేసుకొండి ఉదాహరణకు ఓం నమో వేంకటేశా యా ...ఓం....... నమోవేంకటేశాయ..అలా కూడా మీ ఇష్ట దైవం నామ్0 ప్రాక్టీస్ చేస్తూ మనస్సులో ఆ దైవం కొద్దిసేపు అయినా నిలిచేట్లు గా సాధన చేయండి ...లేదా ముక్కు లో నుంచి శ్వాస తీస్తూ పైకి అంటే ఉచ్వాస లో ముక్కు పైన నుదుటి దగ్గర మీ ఇష్ట దైవం యొక్క చిత్రాన్ని నిలుపుకొని దానిపైనే ధ్యాస పెడుతూ గాలి మెల్లగా తీసుకోవడం ...మళ్ళా అలానే మెల్లగా వదలడం చేస్తూ మీకు మీరు ప్రాక్టీసు చేసుకొండి ...కొంతకాలానికి అదే మెడిటేషన్ ..గోవింద నామ0 తీసుకున్నా చాలు ...ఆ ఏకాగ్రత చిత్తం వల్ల మీ ఆలోచనలు భగవంతుని తో లింక్ ఆయు రోజూ అలవాటు ఆయు అదే మీకు మానసిక .శారీరక ఆరోగ్యాన్ని తెచ్చి పెడుతుంది ...అలానే కొద్దీ కొద్ది గా సాధన చేయండి ....మీకు మీరే ఎంజాయ్ చేసేసుకుంటారు ..ప్రయత్నం చేయడం ఇక ప్రారంభి 0చండి
మీ సందేహాలు ఇక్కడ వ్రాయండి .....సమాధానం చెబుతాను .....శుభం...

మా నాన్నగారి వర్ద0తి


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
18th జులై మా నాన్నగారు వర్ద0తి ..వారి సమాజానికి చేసిన సేవలను ఒకసారి తలుచుకొని వారికి నివాళులు అర్పించిన వారి చాలామంది ప్రియశిష్యు ల తో కల్సి వారి అబ్బాయి ని ......డాక్టర్ మరింగంటి మురళీ కృష్ణ 

పురుషుడు ఎలా ఉండాలి ?importantcharacter sticsof men in Bharateeya dharmasashtra

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...🚶🏿‍♀
పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది📚

కానీ ఎందుచేతో ఈ పద్యం జన
బాహుళ్యం లో లేదు

కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః,
సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు
ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)📚⚖

1.కార్యేషు యోగీ 💰:
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి🏹

2. కరణేషు దక్షః 🤺:-
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.🏌🏾

3. రూపేచ కృష్ణః🙏:-
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.👌

4. క్షమయా తు రామః🏹:-
ఓర్పులో రామునిలాగా ఉండాలి.పితృవాక్య పరి
పాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి

5. భోజ్యేషు తృప్తః🍲🥘🍛
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.

6. సుఖ దుఃఖ మిత్రం🤼‍♂:-
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.⛹🏼🎻

ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు 🏇🏼ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.      సేకరణ........       🙏🏻🙏🏻🙏🙏...!!!!!!!

About pv... పీవీ గారి గొప్పతనం

this is the brain we've to insure, preserve and try to decode. I am more than happy now because of KCR (whatever may be his agenda) the people of this country are able to know the greatest achievements of one person who does not belong to either Gandhi-Nehru or NaMo group, whose achievements supersede them and that person had achieved all on his own and Devine graces without caste, cash and groups. 🙏👏

https://muchata.com/that-is-pv-narsimharao/

ఇంట్లోనేవాకింగు ఎలా walking at home inlock down

ప్రస్తుతం బయట కి వెళ్లడం కుదరదు కనుక ఇంట్లోనే వాకింగ్ చేయండి.
8ఆకారం లో వుత్తరం వైపు  వెళ్లి తిరిగి దక్షిణం వైపు కు రావాలి.
20-నిముషాలు చెయ్యాలి.
హై బీపీ,  బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది.

Breething exercise కూడా చెయ్యచ్చు.
 ముక్కు ఎడమ రంద్రం నుండి 8-సార్లు,   కుడి రంద్రం నుండి 16-సార్లు గాలి పీల్చి వదలాలి

కరోనా నివారణకు చిన్న చిట్కా


తృటి ఘడియ కల్పం యుగాల లెక్కలు తెలుసుకుందాము

తృటి =సెకండ్ లో 1000 వంతు
100 తృటులు =1 వేద
3 వేదలు=1 లవం
3 లవాలు=1 నిమేశం.రెప్ప పాటుకాలం
3 నిమేశాలు=1 క్షణం,
5 క్షణాలు=1 కష్ట
15 కష్టాలు=1 లఘువు
15 లఘువులు=1 దండం
2దండాలు=1 ముహూర్తం
2 ముహూర్తాలు=1 నాలిక
7 నాలికలు=1 యామము,ప్రహారం
4 ప్రహరాలు=ఒక పూట
2 పూటలు=1 రోజు
15 రోజులు=ఒక పక్షం
2 పక్షాలు=ఒక నెల.
2 నెలలు=ఒక ఋతువు
6 ఋతువులు=ఒక సంవత్సరం.
10 సంవత్సరలు=ఒక దశాబ్దం
10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.
10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది
100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు

4లక్షల 32 వెల సంవత్సరాలు= కలియుగం
8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం
12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం
17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం
పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)
71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం
14 మన్వంతరాలు=ఒక కల్పం
200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు
365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సర
100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి
ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట
మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట

భాగవతాదారితం 🕉🕉


 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online