Pages

Some myths about corona - answers

*👉.. మీ ప్రశ్నకు బదులిదే...*
"" "" "" "" "" "" "" "" "" "" ""
*ఇంటికి వైరస్‌ను మోసుకెళుతున్నామా?*

*చెప్పులకు అది అంటుకుంటుందా వంటి సందేహాలకు సమాధానాలు*

లాక్‌డౌన్‌లు తెరుచుకుంటూ.. జనం నెమ్మదిగా సాధారణ జీవితంలోకి అడుగుపెడుతున్న వేళ వారికి సరికొత్త అనుమానాలు, ఆందోళనలు చుట్టుముడుతున్నాయి. ‘నేను ఇంటికి వైరస్‌ను మోసుకెళున్నామే..! నేను వేసుకుంటున్న దుస్తులు సురక్షితమైనవేనా? వాటికి వైరస్‌ అంటుకుంటుందా?  బయటి నుంచి వచ్చిన ప్రతిసారీ స్నానం చేయాలా? బూట్లు, చెప్పుల పరిస్థితి ఏమిటి? వంటి ప్రశ్నలతో సతమతం అవుతున్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక అక్కడి శాస్త్రవేత్తలతో మాట్లాడి... ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది.

*నిత్యావసరాలు, ఔషధాలు తదితరాల కోసం బయటికి వెళ్లి వచ్చిన తర్వాత ఒంటిపై దుస్తులు విప్పేయాలా? తలస్నానం చేయాలా?*

‘‘కొవిడ్‌ బాధితులు, వైరస్‌ గుప్తవాహకులు తుమ్మినా, దగ్గినా... వారి నుంచి వచ్చే తుంపర్లు, శ్వాస రేణువులు గాలిలో అర గంట వరకు ఉంటాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. అవి అటు నుంచి ఇటు గాలిలో ప్రయాణించలేవు. నెమ్మదిగా నేలపైనే పడిపోతాయి’’ అని వర్జీనియా టెక్నాలజీస్‌(అమెరికా)లో శ్వాస రేణువులపై పరిశోధిస్తున్న శాస్త్రవేత్త లిన్‌సే మార్‌ తెలిపారు. అంటే రేణువులు మన దుస్తులను అంటుకునే శాతం చాలా తక్కువగా ఉంటుందన్నారు. మనలోని చాలామంది భౌతిక దూరం పాటిస్తున్నారు కాబట్టి బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారీ దుస్తులు మార్చుకోవడం, స్నానం చేయడం అవసరం లేదన్నారు. చేతులను మాత్రం సబ్బు నీళ్లతో తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని స్పష్టంచేశారు. ఒకవేళ మీకు సమీపంలోఎవరైనా తుమ్మినా, దగ్గినా దుస్తులు మార్చుకుని, స్నానం చేస్తేనే మేలు.

*సూక్ష్మ తుంపర్లు, శ్వాస రేణువులు మన దుస్తులను ఎందుకు అంటుకోవు?*

‘‘ఎరోడైనమిక్స్‌ ప్రకారం... మనిషి శరీరం చుట్టూ గాలి ప్రవాహం ఉంటుంది. దాని ఒత్తిడి కారణంగానే మనం నెమ్మదిగా కదులుతాం. అడుగేస్తున్న ప్రతిసారీ ఈ గాలిని ముందుకు నెడతాం. అప్పుడు గాలిలోని సూక్ష్మ తుంపర్లు, రేణువులు సైతం ముందుకు వెళతాయి. అందుకే అవి మన దుస్తులపై పడవు. ఎవరైనా మనకు రెండు మీటర్ల కంటే అతి దగ్గరగా ఉండి దగ్గి, తుమ్మితేనే తుంపర్లు అంటుకుంటాయి’’ అని శాస్త్రవేత్త లిన్‌సే మార్‌ వివరించారు.

*తల వెంట్రుకలు, గడ్డంలో వైరస్‌ నిలిచి ఉండే ప్రమాదముందా?*

‘‘ప్రతి ఒక్కరూ భౌతిక దూరంతోపాటు, మాస్కును ధరించినంత కాలం వెంట్రుకలతో వైరస్‌ సోకే సమస్య ఉండదు. ఒకవేళ మన వెనుక ఎవరైనా తుమ్మినా, దగ్గినా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు’’ అని వాషింగ్టన్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన పరిశోధకుడు డాక్టర్‌ ఆండ్రూ జనోవిస్కీ తెలిపారు. వైరస్‌ వాహకులు సైతం మాస్కు ధరిస్తే వ్యాధి ఇతరులకు సోకే అవకాశం చాలా తక్కువ శాతం ఉంటుందన్నారు.



*దుస్తులు ఉతికేప్పుడు వైరస్‌ బారిన పడే ప్రమాదముందా?*

‘‘మనం ఎవరి దుస్తులు ఉతుకుతున్నామనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. కరోనా వైరస్‌లు సబ్బులకు లొంగుతాయి. సాధారణ దుస్తులను సర్ఫ్‌, సబ్బులతో ఉతికేప్పుడు ఎలాంటి సమస్యా ఉండదు. ఉతికిన తర్వాత బాగా ఎండనిస్తే సరిపోతుంది. ఒకవేళ జబ్బు పడిన వారిని కలిసినా, వారికి సపర్యలు చేసినా, వారి దుస్తులను ఉతుకుతున్నా... జాగ్రత్తలు తీసుకోవాలి. మిషిన్‌లో ఉతికితే నీటిని సాధ్యమైనంత ఎక్కువ వేడి చేసేలా దాన్ని సెట్‌ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దుస్తులను విదిలించరాదు. వాటిని పూర్తిగా ఆరనివ్వాలి’’ అని శాస్త్రవేత్త లిన్‌సేమార్‌ సూచించారు.


*దుస్తులు, ఇతర ఉపరితలాలపై వైరస్‌ ఎంతకాలం బతికి ఉంటుంది?*

‘ది న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌లో మార్చిలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం... కరోనా వైరస్‌ సాధారణ పరిస్థితుల్లో లోహాలు, ప్లాస్టిక్‌పై మూడు రోజులు, కార్డ్‌బోర్డ్‌పై 24 గంటలపాటు బతికి ఉంటుంది. ఈ అధ్యయనం దుస్తుల గురించి పరిశోధించలేదు. అయితే కార్డ్‌బోర్డ్‌లో ఉండే పోగులు... సాధారణ ఉపరితలాలపై కంటే ముందుగానే వైరస్‌ ఎండిపోయేలా చేశాయి’ అని నిపుణులు భావిస్తున్నారు. కరోనా కుటుంబానికే చెందిన సార్స్‌ ప్రబలినప్పుడు 2005లో కాటన్‌ గౌన్‌పై ఒక అధ్యయనం చేశారు. అత్యధిక స్థాయిలో వైరస్‌ను వేసినప్పుడు కూడా దాని ప్రభావం 5 నిమిషాల నుంచి 24 గంటల్లోనే తొలిగిపోయినట్లు గుర్తించారు’ అని డాక్టర్‌ ఆండ్రూ జనోవిస్కీ తెలిపారు.



*వ్యాయామానికి, వ్యాహ్యాళికి, కుక్కలను బయట తిప్పడానికి వెళితే వైరస్‌ సోకే ముప్పు పెరుగుతుందా?*

‘‘ఇతరులకు దూరంగా ఉండటంతోపాటు చేతులను శుభ్రం చేసుకున్నంత వరకు ఆరుబయట వ్యాయామాలతో ఎలాంటి ముప్పూ ఉండదు. అదే సమయంలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా బయట ప్రాంతాలను అధికారులు డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయాల్సిందే’’ అని ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఉన్న వాతావరణ  నాణ్యత, ఆరోగ్యంపై అంతర్జాతీయ ప్రయోగశాల డైరెక్టర్‌ లిడియా మొరవస్క వివరించారు. ఆరుబయట వైరస్‌ తుంపర్లు గాలి ప్రవాహం కారణంగా వెంటనే డైల్యూట్‌ అవుతాయి. ప్రజలు కిక్కిరిసి ఉండే ప్రాంతాలకు వెళ్లనంత వరకు ఆరుబయలు సురక్షితమేనన్నారు.


మీ ప్రశ్నకు బదులిదే..!

*బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారీ బూట్లు, చెప్పులను శానిటైజర్‌తో డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయాలా?*

‘‘బూట్లు, చెప్పులకు వైరస్‌, బ్యాక్టీరియాలు అధికంగానే అంటుకుంటాయి. అయితే అవి ఇన్‌ఫెక్షన్లకు అతి తక్కువ కారణం అవుతాయి. అమెరికాలోని రాక్‌ఫోల్డ్‌ షూ కంపెనీ వారు 2008లో చేసిన, ఇటీవల చైనాలో చేసిన అధ్యయనాల ప్రకారం... బూట్లకు గడ్డి పరకలు, దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, వైరస్‌లు అంటుకున్నట్లు తేలింది. అందుకే వాటిని ఇంటి బయటే వదిలేయాలి. అవకాశముంటే శుభ్రంగా కడిగేయాలి. ఇంట్లో బూట్లు, చెప్పులు ధరించడం మానేయాలి. శౌచాలయానికి వెళ్లిన ప్రతిసారీ చేతులతోపాటు పాదాలను సైతం శుభ్రం చేసుకోవాలి’’ అని డాక్టర్‌ ఆండ్రూ జనోవిస్కీ వివరించారు.
__________________
 🙏

Sunderkandaparayana is solution for all problems in real life

సుందరకాండ పారాయణంతో సకల దోషాల...
విముక్తి..!!
శ్రీరామ జయరామ జయ జయరామ..!!🙏

సుందరకాండ పారాయణ వల్ల సకల దోషాలు
తొలగి పోతాయి.
శని,రాహు,కుజ, కేతు దోషాల వల్ల మనుషులు
ఎన్నో కష్ట నష్టాలకు గురి అవుతూ ఉన్నారు.
అటువంటి బాధల నుంచి విముక్తిపొందేందుకు సుందరకాండ పారాయణను చేయడం అత్యంత శ్రేష్ఠమని సాక్షాత్తు పరమశివుడు పార్వతి దేవితో
ఓ సందర్భంలో అంటాడు.
'ఓ పార్వతీ! సకల దేవతల్లో శ్రీరాముడు ఎంతగొప్పవాడో, ఉన్నతుడో,
వృక్షజాతుల్లో కల్ప వృక్షం ఎంత మంగళకరమైనదో, అంతటి గొప్పది అయిన ఆది కావ్యమైన శ్రీమద్రామాయణంలో అత్యంత కీలకమైనది సుందరకాండ.

సుందరకాండ పారాయణ తులసివనంలో చేస్తే
ఎంతో మేలు జరుగుతుంది.
బిల్వవృక్షం వద్ద చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది.
నదీ తీరాల్లో సుందరకాండ పారాయణ
ఎంతో శుభప్రదం.
ఇంట్లో పారాయణ చేసేవారు శుచి, శుభ్రత లను పాటించాలి.
సుందరకాండ పారాయణం వల్ల మనిషిలో
ఉదాత్త గుణాలు కలుగుతాయి.
ఎవరితోనూ తగవులు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించేందుకు అవసరమైన బుద్ధిని ఆంజనేయుడు ప్రసాదిస్తాడు.
సుగ్రీవుని మంత్రిగా ఆంజనేయుడు రామలక్ష్మణులను చూసిన నాటి నుంచి
శ్రీరామ పట్టాభిషేకం వరకూ వహించిన పాత్ర ఆయనలోని బుద్ధి బలాన్నీ, యశోధైర్యాన్ని సుబోధకం చేస్తుంది.

ఆంజనేయుణ్ణి కేవలం వానరంగా కాకుండా, ఈశ్వరాంశ సంభూతునిగా,
శ్రీరామచంద్రునికి నమ్మిన బంటుగా ఆరాధిస్తే
ఎంతో మేలు జరుగుతుంది.
నవగ్రహ పీడలు తొలగి పోతాయి.
మనిషిలో నిదానం వృద్ధి చెందుతుంది.
ఏ కార్యాన్ని చేపట్టినా ఆలోచనకు
పదును పెట్టగలుగుతారు.
ఆలోచన లేకుండా ఏ పని చేపట్టినా
అది సక్రమమైన రీతిలో పూర్తి కాదు.

అంతేకాక,అహంకార, మమకారాలకు
ప్రభావితం కాకుండా మనిషి సంయమనాన్ని అలవర్చుకోగలుగుతాడు.
ప్రలోభాలకు, బెదిరింపులకు చలించకుండా
తన పనిని సక్రమంగా నిర్వహించుకోగలుగుతాడు. బృహద్ధర్మపురాణంలో సుందరకాండ పారాయణ పాశస్త్యాన్ని గురించి వివరించబడింది.

మనిషికి ఐశ్వర్యం ఎంత ముఖ్యమో,
ఆరోగ్యం అంతకంటే ఎక్కువ.
ఆరోగ్యమే మహాభాగ్యమనే సామెత
అందుకే పుట్టింది.
మనిషిలో నైరాశ్యాన్ని పోగొట్టి,
ధైర్యాన్నీ,ఉత్సాహాన్ని కలిగించేది సుందర కాండ.

కుటుంబ పరమైన క్లేశాల్లో ఉన్నవారు
సుందరకాండ పారాయణ చేస్తే వీలైనంత
త్వరలోనే వాటి నుంచి విముక్తి పొందుతారు. మనిషిలోఏకాగ్రతను పెంచుతుంది.
చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది.

సుందరకాండ పారాయణకు మన పెద్దలు
అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
ఆంజనేయుడు సీతామాత కోసం లంకా నగరంలో అన్వేషించిన సమయంలో అడుగడుగునా ఎదురైన అడ్డంకిలను ఏ విధంగాతొలగించుకుంటూ ముందుకు సాగుతాడో మనిషి కూడా తాను చేపట్టిన పనికి ఎదురైన అవరోధాలను తొలగించుకోవడానికి సుందరకాండ పారాయణ ఎంతో ఉపయోగపడుతుంది.

రాముణ్ణి సేవించి ఆంజనేయుడు తాను తరించి తనను నమ్ముకున్నవారిని తరింపజేస్తున్నాడు.

శ్రీరామదూతం శిరసానమామి అని ఎవరైతే నిరంతరం జపిస్తూ ఉంటారో వారి జోలికి
భూత,ప్రేత పిశాచాలు రావు.
శత్రువులు వారిని ఏమీ చేయలేరు. వాల్మీకి,తులసీదాసు ప్రభృతులు చెప్పిన
పరమ రహస్యం ఇదే..!!

సర్వే జనా సుఖినోభవంతు..
అయితే పారాయణం చేసేటప్పుడు కొన్ని  శుచి శుభ్రత లు ఒంటిపూట భోజనం ..నేలపై పడుకోవడం ..బ్రహ్మచర్యం పాటించడం ....తరువాత బ్రాహ్మణులు కు భోజనాలు పెట్టడం ..లాంటివి ఉంటాయి అందుకే దాని విధి విధానాలను పండితులను ఒకసారి సంప్రదించి చేసుకోవాల్సి ఉంటుంది .
అందుకే అవి కుదరని వాళ్ళు ఆంజనేయ స్వామి 16 నామాలు ..శ్రీరామతారక మంత్రం ..చదువుకున్నా చాలు ..శ్రీరామ దూతం శిరసానమామి అనుకున్నా చాలు శ్రీరామదూత హనుమ అంటే ఆ నామం ఆయనకు చాలా ఇష్టం ...కనీసం శ్రీహనుమ ..జయ హనుమ జయహనుమ జయ జయ హనుమ ....అని చదువుకున్నా కూడా చాలా మంచిదే. శనివారంనాడు, ఉదయమే స్వామి గుడికి వెళ్ళి జయజయ చదువుకొని సింధూరం పెట్టుకొని వచ్చినా కూడా చాలా సమస్యలు దారికి వస్తాయి... ఈ చిన్న దానికి పెద్ద నియమాలు అవసరం లేదు ....కాస్తంత మంచి పనులు చేస్తే చాలు....జై హనుమ జైశ్రీరామీ

Gas Trouble - Some remedies part - 1

ఈ రోజుల్లో ఎక్కడ చూసినా వయస్సు తో సంభందం లేకుండా స్త్రీ.... పురుష బేధం లేకుండా ప్రతివారినీ భాధిస్తూ ఉన్న సమస్య ..గ్యాస్.. అజీర్ణం ..సమస్యలు .దానికి చాలా కారణాలు ఉన్నాయి .పెద్దవయస్సులో రావడం కారణం వయస్సు రీత్యా జీర్ణ క్రియ తగ్గడం ,ప్రేవులలో బలహీనం ,జీర్ణ శక్తి తగ్గడం ..అందుకే వారు మెత్తని ఆహారం తినడం ..సంకటి అంటే కొంచెం చిక్కగా ఉండే ద్రవాలు జొన్న, ,రాగులు ఇంకా ఇతరత్రా రవ్వల ను ఉడికించి రుచి కోసం ఏదైనా ఆకుకూరలో ,మజ్జిగో అలా లిక్విడ్ త్రాగడం ,పండ్లరసం ,సలాడ్ లు ఇటువంటివి పెద్దలకు కాస్తంత త్వరగా అరుగుతాయు ఇక అది పెద్దలు కుఅంటే సహజంగా పెద్ద వయస్సు లో ఉన్నవారు అని ..సరే వారికి జీర్ణక్రియ సమస్యలకు కూడా మందులు ఉంటాయి ..అయితే ఇక మధ్య వయస్కులకు ,యువతీయువకులు కు ఎందుకు ఇంతగా అజీర్ణ సమస్యలు తో నరకయాతన పడుతూ ఉన్నారో చర్చించుదాం !

ముందుగా బియ్యం ఏ రకం తింటువున్నాము ఆ బియ్యం ఏమైనా అజీర్తి చేసి గ్యాస్ వస్తోందా? పరీక్ష చేసుకొండి observe చేయండి ..ఎందుకంటే నా అనుభవంలో ఒక రెండు మూటలు బియ్యం
వాడుతూ గ్యాస్...పొట్టవుబ్బరం బాధలు కు మాత్రలు వేసుకుంటూ నానా అవస్థలు ,సాయంత్రం కాగానే గ్యాస్ మొత్తం పొట్ట నిండి పోయి వాకింగ్ ఎంత చేసినా తగ్గేది కాదు .పైగా రెండు అడుగులు వేయాలంటే రొప్పు. ఆయాసం ....గుత్తాయసం అంటారే. అలా ..దానితో బాధపడేవాడిని ..కడుపులో మంట కూడా ..అస్సలు చాలా తక్కువ ఉప్పు ,కారం పులుపు నేను తినడం ..మా గృహిణి కి కూడ న్యూట్రిషన్ ల్ సైన్సు. ఎక్సపర్డ్ అందుకే చాలా జాగ్రత్తగా నాకు వంట తయారు చేసిపెడుతుంది...ఆయునా ఇద్దరికి విపరీతమైన పొట్ట బాధలు.. ఒకరోజు మాకొట్టువ్యాపారి ఒకమూట బియ్యం మార్చితెచ్చారు...అప్పటినుంచీ ..చాలావరకు గ్యాస్ సమస్యలు తగ్గిపోయాయి... కాబట్టి మనల్ని మనమే పరిశీలించుకొని కారణం తెలుసుకొని నివారించుకోవాలి ..అస్సలు కారణం తెలిస్తే మందులు వాడటం తేలిక ...ఇక తరువాత పాలు ..పెరుగు ల వాడకం గమనించాలి .కొంతమందికి ప్యాకెట్ పాలు పడవు ,..కొంతమందికి రకరకాల కంపెనీలు పాలు పడవు ...అన్ని పాలు ఒకటే కదా ?మరి ఎందుకు అనుకుంటారు ?.. ...అందుకే మీరు మీ దగ్గర దొరికే వి తరచుగా మార్చి... మార్చి పరిశీలించండి ...మీకు ఏవి సరిపోతున్నాయో ..ఏది వాడినప్పుడు ఎలా ఉందో పరిశీలించండి .

అప్పుడుకూడా తెలీకపోతే ...బైట గేదె పాలు పిండితెచ్చుకొని ..చూడండి ..యూ.ఎస్ లోను ,కెనడా లోను ఉన్న మా బం ధువులు ఇప్పుడు బైటకు వెళ్ళి ఆవుపాలు,కొంతమంది మళ్ళీ అవి వేడి చేస్తున్నాయమో అని గేదె పాలు తెచ్చుకొని ఇప్పటికి ఒక రకం పాలు వాడుతూ గ్యాస్ ..అజీర్తి సమస్య తగ్గించుకున్నారు .ఇక తరువాత త్రాగే నీరు .కూడా మన జీర్ణ శక్తి పై ప్రభావం చూపుతుంది ...కొంతమందికి బోరునీళ్ళు పడవు ,కొంతమందికి బైట మినరల్ బాటిల్స్ లేక మినరల్
క్యాన్ లు పడవు ....ఈ మినారాలవాటర్ కొంతకాలం వరకు ఓకే ..కాని ఎక్కువ రోజులు త్రాగుతూఉంటే కడుపు లోఆమ్లం ఎక్కువై పైత్యం పెరుగుతుంది ..దానివల్ల కూడా అన్నము అరగక కూడా పైకి యాసిడ్ లా పొంగుతూ ఉంటుంది. ఇక అతిచల్లని నీరు ,ఎక్కువ సార్లు అతిచల్లని పానీయాలు త్రాగడం వల్ల కూడా జీర్ణం మందగిస్తుంది .ఇక అన్నింటికంటే నడులలోని..నీరు మంచిది ..అది మున్సిపల్ వారు ఇంటికి కనెక్షన్ ఇస్తూఉంటారు ..కావాలంటే దానిని ఇంట్లో ఆర్.ఓ.లాంటి ఫ్యూరిఫైయ్యర్...పెట్టుకొని ఆ నీటినిత్రాగినా చాలు ..ఎలాగూ వండేటప్పుడు ఫూరిఫై వాటర్ అవసరం లేదు ప్రభుత్త్వం ఇచ్చిన నీరు ఎలాగూ చేసిశుద్ధి చేసి ఇస్తారు ..దానిని వంట లో భాగంగా మరిగిపోతాయు కదా . ....... అలా త్రాగే నీరు కూడా మీ జీర్ణ శక్తి కి ఉపకరిస్తుందా? లేదా ? చూసుకో0డీ ...దానిని బట్టి మార్పులు చేసుకోవచ్చు.

ఇక ఆహారం తినే వేళలు ...పరిమాణం అంటే క్వా0టీటీ ...ఉదయం కనీసం 8 గంటలు లోపు అల్పాహారం పూర్తికావాలి ..కాఫీ చెంబుల పరిమాణంలో పట్టించకూడదు ..మీకు తెలుస్సా?..కాఫీ ఎక్కువ పట్టిస్తే అది గ్యాస్ కు ,లోపలనించి పొంగుతూఉంటుంది ..త్రాగండి కానీ కొంచెం చెంబు సైజ్ కాకుండా ఒక గ్లాసు కు వచ్చేయండి...కొంచెం చిక్కదనం కూడా తగ్గించుకోవాలి ....మన అందరం చేసే పొరపాటు ఇష్టం వచ్చినట్లుగా వేళలు తప్పించి భోజనం చేయడం
ఒక నిర్దిష్ట సమయంలో కాకుండా తినడం ...దానివల్ల ..జీవగడియారం మనకు చిన్నప్పటినుంచే మనలో ఫిక్సయు ఉంటుంది ..దానివల్ల లంచ్,డిన్నర్ సమయాలలో ..పొట్టలో ఎంజైము లు ,కొంత ఆమ్లం కూడా ఊరతాయు ..ఆమ్లంవల్ల ఉపయోగం!, ఆహారం లో ని సూక్ష్మ జీవులను పట్టి చంపేస్తుంది ..మిగతావి ఎంజైము లు చిన్నప్రేవులు ,కాలేయం,.... పామ్క్రియాస్...ఇవన్నీ కూడా ఎంజైమ్స్ సమయం ప్రకారం ఇస్తాయి ..చిన్నప్పటినుంచే అలవాటు గా బాడీ ,మైండ్ ఫిక్స్ చేసుకుంటాయి ..దానినే శాస్త్రవేత్తలు జీవగడియారం అని పేరుపెట్టారు .....దేశ...విదేశాలు తిరుగుతున్నవాళ్ల లో ఇది మారిపోయి జేట్లాగ్..అవుతుంది ..మనం వేళలు పాటించక పోతే ఆ ఎంజైమ్స్ ఊరి ఊరి కడుపులో పుండ్లు పడతాయి ..వేళ దాటితింటే ...జీర్ణక్రియ కు కావాల్సిన ఎంజైములు చాలినంత రావు అప్పుడు .తీసుకున్న ఆహారం అరగక ..నిల్వ ఉండి పులిసి ..యాసిడ్అ యు .గ్యాస్ తయారు అయి పైకి త్రేల్పులు గా వచ్చి ఆయాసం.. పొట్ట బరువు ..వచ్చేస్తూఉంటాయు .

అంతే కాదు వేళకు తినక పోవడం వల్ల మనిషి లోని ప్రాణం కాపాడటానికి మైండ్ కొంత గ్లూకోజ్ ని రక్తం లోకి విడుదల చేస్తుంది ...మళ్ళీ మనం వేళతప్పించి లాగించేసరికి ...తిన్న ఆహారం ద్వారా షుగర్ తయారై ..ఇంతకుముందు ...విడుదల చేసింది . ప్లస్ ..ఇప్పుడు తిన్నది ..బ్లడ్ లో షుగర్ లు తేడాలు వస్తూఉంటాయు ...ముదిరితే డ యాబెటిక్ ...అయిపోతారు ..ఇది ఒక్క రెండు ..మూడు రోజుల్లోనే అయిపో దు ....కొన్ని నెలలు పద్దతి లేకుండా చేస్తే అలా అవుతుంది ..కాబట్టి కొద్దిరోజుల మార్పులకు భయపడక్కరలేదు కానీ నెలల తరబడి అలా చేసుకోకూడదు.ఇక ఆ తరువాత మానసిక ఆందోళనలు లేదా డిప్రెషన్ వల్ల ఎక్కువ శాతం ..గ్యాస్ ట్రబుల్ ...పడుకున్నప్పుడు ..పొట్టలో టక టక కొడుతున్నట్లుగా ఉంటుంది ...గొంతు నుంచి పొట్టలోకి పెద్ద పెద్ద బండరాళ్ళు.తేలుతూ తేలిగ్గా .వచ్చి పడుతున్న గ్యాస్ ఫీలింగ్ ..దానితో భయం కూడా గుబులుగాఆగి ఆగి వస్తూ వుంటుంది ....ఈ రకమైన గ్యాస్ మానసికంగా ఇబ్బంది... డిప్రెషన్.. టెన్షన్ పడే వాళ్ళ లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ...ముఖ్యంగా ..కడుపులో నొప్పి .అస్తమానం మోషన్ కి వెళ్ళాల్సి రావడం ..అజీర్తి ..ఆహారం అరగక వచ్చే మోషన్స్ ..వస్తూఉంటాయు ...అలా వచ్చి వచ్చి కడుపులో మంట ..అల్సర్లు వస్తాయి ..అందుకే ...ఎవరైనా సరే టెన్షన్ లు భయా లు డిప్రెషన్ లు ముందుగా తీసిపారేసుకోవాలి ..దానికోసం యోగా..లేదా డేవాలయసందర్శనం ,లేదా ఇష్టమైనా ఏదైనా ఒక కళ సంగీతం..లేక గార్డెనింగ్ మనం బాగా ఆలోచించాలి. ఏది ఇష్టమో దానివైపు వెళ్ళి రిలాక్స్ కావాలి .

ఇక ఈ గ్యాస్ లక్షణాలు ముదిరితే అది హైపర్ ఎసిడిటీ..(Hyperacidity) కి దారి తీస్తుంది .కడుపులో నొప్పి ,వికారం వేళకు ఆహారం తీసుకోకపోతే బాధ పెరిగిపోతుంది .తీసుకున్న తరువాత పుల్లగా నోటిలో నీళ్ళు ఊరడం ..జరుగుతూఉంటాయు .బాగా పుల్లటి త్రేల్పు లు ,చెమటలు పట్టడం ,కొద్దిగా మోషన్స్ నీరసం ,అధిక దాహం ,ఆయాసం
మన పొట్టలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదల లోని హెచ్చు తగ్గుల వల్ల కడుపులో మంట ,పొంగినప్పుడు ఛాతి లో మంట కొంతమందికి పైకి పొంగి గొంతుకు తగిలి పొడి దగ్గు రావడం ,..అక్కడ దురద ,మంట కూడా వస్తూ ఉంటాయి. .దీనినే వైద్యులు acidreflux డీసీజ్ ..అని ....పిలుస్తారు ముఖ్యంగా మానసిక ఒత్తిడి, ఎక్కువ గా టీలు కాఫీలు త్రాగడం
నిద్రపోకపోవడం ,స్థూలకాయం మసాలా జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం.. ఆల్కహాల్ సేవించడం .శీతల పానీయాలు ఎక్కువ తీసుకోవడం ,అధిక ఆందోళనలు, ఎక్కువ కారంమిర్చి వాడటం ,తినడం వల్ల ..ఈ డీసీజ్ ..ఎక్కువగా వస్తూఉంటుంది .అలానే కొన్నిరకాల బి.పి,షుగర్ కంట్రోల్ ఇంగ్లీషు మందులు వాడటం .వల్ల కూడా వస్తూ ఉంటుంది అందుకే ఎక్కువగా టాబ్లెట్స్ వాడుతున్నవాళ్లకు యాసిడ్ రెగ్యులేటర్ గా కొన్ని ఇస్తారు panta dec ,pantajole అనేవి . అన్ని టాబ్లెట్స్ వేసుకున్నతారువాత ఇవి వేసుకుంటే మందుల వల్ల వచ్చే gas కంట్రోల్ అవుతుంది .

ఇంకా కొన్ని టాబ్లెట్స్ పరగడుపున అంటే early in the morning emptystomach లో pantop 20mg ,ఇంకా సమస్య ఎక్కువగా ఉన్నవాళ్లకు pantop 40mg కూడా ఇస్తూ ఉంటారు వైద్యులు ఏది ఏమైనా కొద్దికాలం వాడి మనేసేట్లుగా ఉండాలి ...ఎక్కువ గా వాడటం మంచిది కాదు ...అంటున్నారు వైద్యులు ...ఇవికూడా కిడ్నీల పై ఎక్కువ ప్రభావం చూపుతాయి అంటున్నారు పరిశోధకులు .అయితే zentac150mg ...నా అనుభవంలో .safe drug ..దానిని భోజనంతరువాత రోజు 1 వేసుకుంటే చాలు ...కొన్ని సమస్యలు తీరతాయు ...ఒక్కొక్క సారి అదే tabలెట్ ను రెండుపూటలా కొద్దీ రోజులు వరకు రాస్తారు వైద్యులు ..ఒక్కపూట అయితే నెల పైగా వాడవచ్చు ఇక రెండు పూటలా వాడాలంటే ఎక్కువ రోజులు వాడకుండా చూసుకోవాలి

ఇక ఆయిర్వేదం లో అయితే ulserex (chark. Company..idi 40years .పై బడ్డ company)అనేtabs డబ్బా కొనుక్కో0డి .ఇది చాలా మంచి ఫలితం ఇస్తుంది ఈ ulsrex.. tab s సమస్య కొద్దిగా ఉంటే పరగడుపున emptystomach లో ఒక్క tab వేసుకొని మంచి నీళ్ళు త్రాగండి ....అలా ఎన్నిరోజులు వాడినా ప్రమాదం ఏమీ ఉండదు ..సమస్య ఎక్కువగా ఉంటే అదే tablet రెండు పూటలా వేసుకో0డి కొద్దిరోజులు వాడినతరువాత..ఒక్క పూటకు వచ్చే య వచ్చు . ...ఇక వంటయింట్లో kitchen లో దొరికే మందు లు
త్రికట్టు చూర్ణం(శొంఠీ +మిరియాలు +పిప్పళ్ళు ) +యాలకులు +జీలకర్ర++తాటికలకండ తో చేసిన కషాయం ...భోజనం తరువాత అర్థ గంట కు తీసుకోవాలి ఏవీ ఎక్కువ ఎక్కువ గా తీసుకోకూడదు 1యాలకులు...4లేక 5 మిరియాలు ఒక రెండు మూడు చిటికెలు శొంఠి,... పిప్పళ్ళు కూడా అంతే అలా ఒక గ్లాస్ కొలతకు ఒక అర స్పూన్ జీలకర్ర అలా తయారు చేసుకొని చివరలో తాటికలకండ ఒక పావు చెంచా కలుపుకొని చల్లారిన తరువాత త్రాగాలి ...ఇది కడుపుఉబ్బరం కి మంచి మందు ...ఇక దీనికి సరిపోయే మందు ఆయుర్వేదం షాప్ లో హింగువాస్ట్ క చూర్ణం అని ఒక డబ్బా దొరుకుతుంది
దానిని తెచ్చి భోజనం తరువాత ఒక పావు చెంచా నోట్లో వేసుకొని చప్పరించి నీళ్లు త్రాగవచ్చు ..సమస్యను బట్టి లేదా ఒక రెండు చిటికెలు నోటిలో వేసుకొని వక్కపొడి లా చప్పరించి. ..మింగినా కూడా జీర్ణక్రియ బాగుంటుంది ..

అలానే కాస్తంత జీలకర్ర దోరగా వేయుంచి.....మిక్సీపట్టి ఆ పొడి ని ..ఒక అరస్పూన్ లేక ఒక స్పూన్ పొడిని అన్నం లో వేసుకొని మొదటి ముద్దలు ...ఆవునేతితో..తినిచూడండి ...దానివల్ల జీర్ణక్రియ ..బాగుంటుంది .డయాబెటిక్ వాళ్ళకు కూడా షుగర్ లెవలస్..లో కూడా మార్పుఉంటుంది ...మిగతా భాగం part 2 లో చూద్దాము






Monkey came while duringHarikatha


StoryofTirumala Tirupathi vimanvemkateswara

A rare informative video about Shri Tirumala Balaji



Friends

I came across this video on YouTube.  I found it very interesting and informative.  That's why I'm sharing this with you. All the credit goes to Shri Nanduri Srinivas garu.

Thank you very much.

Sarva roga nivarini Surya Stotram


సర్వ రోగ నివారిణి – సూర్యభగవానుడి స్తోత్రం

పూర్వం శ్రీ కృష్ణుని కుమారుడు అయిన సాంబుడు కూడా తనకు వచ్చిన అనారోగ్యాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ సూర్యస్తోత్రమును పఠించాడు. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము.

1. ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు

భావం : ఇప్పుడే ఉదయించి ఉత్తరంవైపుగా పయనిస్తున్న ఓ సూర్యదేవా… నాలో వున్న గుండెజబ్బును, కంటిజబ్బును, ఇతర సర్వరోగాలను త్వరగా పోగొట్టాలని కోరుతూ నేను నిన్ను ప్రార్థిస్తున్నాను!

2. నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ

భావం : కేవలం అరనిముషంలోనే ఆకాశముపై రెండువేల రెండువందల రెండు యోజనాలు పయనించే పద్మబాంధవా! నీకు నమోవాకం!

3. కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ
ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ

భావం : కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలను ఐదేదు చొప్పున కల్పించే ఆ ద్వాదశ మూర్తి… మనస్సు, జీవుడు కూడా తానే అయి నాకు ఆనందాన్ని, తృప్తిని కలిగించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.

4. త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో ! పరమహంసశ్చ

భావం : ఓ సూర్యదేవా! మూడువేదాలు, వషట్కారము, ప్రపంచము, హంస, పరమహంస మొదలైనవన్నీ నీవే!

5. శివరూపాత్ జ్ఞానమహంత్వత్తో ముక్తిం జనార్దనాకారాత్
శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి

భావం : శివరూపుడవైన నీవల్ల ఆత్మజ్ఞానాన్ని, విష్ణురూపుడవైన నీవల్ల మోక్షమును, అగ్ని రూపుడవైన నీవల్ల ఐశ్వర్యమును, ఆరోగ్యమును కల్పిస్తావని మేము భక్తితో నిన్ను కోరుతున్నాను. మమ్మల్ని అనుగ్రహించు.!

6. త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః
తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహదు

భావం : మాలో వున్న చర్మదోషాలను, కంటిదోషాలను, హృదయదోషాలను, ఇంద్రియాల వంటి మొదలైన దోషాలను… సూర్యభగవానుడివైన నువ్వు ఒకే విధమైన నీ కోపరూపమైన అగ్నితో దగ్ధం చేయమని కోరుతూ ప్రార్థిస్తున్నాము!

7. తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నహః
కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్

భావం : రోగాల మూలములకు కాలకర్త అయిన ఓ సూర్యదేవా…! నువ్వు ఏ విధంగా అయితే నాలుగువైపుల అలుముకుని వున్న చీకటిని దూరం చేస్తావో… అదేవిధంగా మా కంటిరోగాలను (రేచీకటి జబ్బు), రోగపటలముల నుంచి విముక్తి కలిగిస్తావని కోరుతున్నాను.

8. యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః
భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః

భావం : వేయి కిరణాలను కలిగివున్న ఆ సూర్యుని నుంచి వెలువడే కేవలం ఒక కిరణ భాగం చంద్రుని మీద పడి.. రాత్రివేళ వున్న చీకటిని మాటుమాయం చేసి వెలుగు కలిగిస్తుంది. అలాంటి శక్తిని కలిగి వున్న సూర్యదేవా.. మమ్మల్ని ఆపదల నుంచి బాగుచేయమని కోరుతున్నాము.

9. యేనవినాంధం తమసం జగదేతత్, యత్రసతి చరాచరం విశ్వం
దృతబోధం, తం నళినీ భర్తారం హర్తారమా పదామీళే

భావం : ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటికచీకటిమయం అవుతుందో… ఏ సూర్యుని వెలుగుచే ప్రతిఒక్క ప్రాణి తెలివిగలదీ అవుతుందో… ఏ భాస్కరుడు ఆపదలను రూపుమాపుతాడో… అటువంటి ఆపద్మభాందవుణ్ణి మేము ప్రార్ధిస్తాను.

10. వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర (ప్రమేహాంశ్చ)
గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపిత్వమేవహంసి

భావం : వాతరోగం, చర్మరోగం, మహోదరం, అతిమేహం, గ్రహణి, భగంధరం వంటి మహారోగాలను పోగొట్టే దివ్యవైద్యుడివి నీవే సూర్యదేవా!

11. ధర్మార్ధ కామ మోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్
బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండ యతుచండాంశుః
భావం : ధర్మార్ధ కామమోక్షాలను సాధించే కర్మలను చెయ్యనీయకుండా మిక్కిలి తాపం కలిగించి, ఇంద్రియాలను బంధించే రోగాలను చండకరుడైన సూర్యుడు చెండాడుగాక! మామీద కరుణ చూపించాలని కోరుతున్నాము.

12. త్వం మాతాత్వం శరణత్వం దాతాత్వం ధనః త్వమాచార్యః
త్వం త్రాతా త్వం హర్తావిపదాం ; అర్క ! ప్రసీద మమ

భావం : ఓ సూర్యదేవా! నీవే నా తల్లివి, నీవే నాకు దిక్కు, నాకు కావలసింది ఇచ్చే దాతవు నీవే.! నీవే ధనం, మంచి చెడ్డలను బోధించే గురువు నీవే. రక్షకుడవు, ఆపదలను పోగొట్టే వాడవు నీవే! నన్ను అనుగ్రహించు.

ఫలశ్రుతి :
ఈ పన్నెండు ఆర్యావృత్తాలు ఆకాశం నుంచి సాంబుని ముందు పడినవి. వీటిని శ్రద్ధాభక్తులతో చదివేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది. అన్ని జబ్బులూ అంతరిస్తాయి.

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online