క్రింద వ్రాసిన వ్యాసం "కొంచం ఆరోగ్యం - కొంచం భక్తి రసం" లో విష్ణు నామాల్లో పూతాత్మనే నమః అనే నామానికి బదులుగా పూతవర్జితాయా నమః అని వచ్చింది . మీరు దానిని "పూతాత్మనే నమః " అని చదువుకొనగలరు .
skip to main |
skip to sidebar
కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
కొంచెం ఆరోగ్యం, కొంచం భక్తి రసం
ప్రతీ రోజు. ఒక జామకాయ తినండి ,ఉప్పు,కారం, అలా ఏదీ రాసుకోకుండా తినండి .డయా బెటీస్ వాళ్లకు చాలా మంచిది షుగర్ కంట్రోల్ కి వస్తుంది .ఇక రోజూ తింటూ ఉన్నవారికి గుండె జబ్బులు రావు ,అలానే జామ ఆకు లు ఒక నాలుగు లేక ఆయుదు తీసు కొని. వాటిని మిక్సీలో కొద్దీ నీళ్ళు కలిపి నూరి. రోజూ ఉదయం పరగడుపున లేక కాఫీ /టీ కానీ త్రాగిన తరువాత అయినా త్రాగవచ్చు. ,అలా త్రాగిన వారికి ఖచ్చితంగా బి.పి కంట్రోల్ కి వస్తుంది.
అలానే కామాక్షి లేక కామంచి మొక్క అంటారు .అది పడుబడిన గోడలపై, తోటల్లో ను ఒకమదిరి మొక్కలు ,వాటికి నల్ల వి చిన్న పూసలు వంటి కాయలు ఉంటాయి.ఆ చెట్టు. ఆకులను కూరగాకానీ, పప్పులో కానీ ఎలాగో అలా తినేయండి మీకు కంటి చూపు బాగా పెరుగుతుంది ,కళ్ళ సమస్యలు చాలా తీరిపోతాయి .అలానే అది కొద్దిరోజులపాటు ఎక్కువ మొత్తం లో తింటే లివర్ సమస్యలు మటు మాయం అవుతాయి. అంతే కాదు చివరి దశలో ఉన్న లివర్ కూడా ఆ ఆకులు ను ఎక్కువ మొత్తం లో లోపలికి తీసుకు 0టే లివర్ పూర్తి స్తాయి ఆరోగ్యానికి వచ్చేస్తుంది .కాబట్టి కనీసం అప్పుడప్పుడు ఆ కామంచి ఆకు కూర తినడం అలవాటు చేసుకోగలరు .ఆరోగ్యం కోసం వాడే మ0దులు ఎప్పుడైనా ఓం ధన్వంతరి నారాయణాయనమహా"అనీచదివి తూర్పు వైపు తిరిగి మందులు సేవిస్తే చాలా ఫలితం ఉంటుంది.
డయాబెటిక్ వాళ్ళు వరి అన్నం తగ్గించి కూర ఎక్కువ వండుకొని తింటే షుగర్ కంట్రోల్ కి వస్తుంది. ఒక్కొక్కసారి మొత్తం కూరని మాత్రమే ఎక్కువగా వండుకొని తినే వాళ్ళు వున్నారు.విదేశీ యులు కూడా అచ్చం గా వంకాయ ,దొండకాయ, టమాటాఆలు ,కలిపి! ఇలా రుచికరంగా వండుకొని తింటూ ఉంటారు. మనం ఓ గుప్పెడు అన్నం లేక రెండు గుప్పెడులు అయినా అన్నము వేసుకొని తినేయచ్చు .అప్పుడు కూడా షుగర్ కంట్రోల్ కి వస్తుంది. ఇక పొట్టు గోధుమలతో చేసిన పిండి ని మాత్రమే వాడండి ,దానివల్ల గ్లై స్మిక్ ఇండి క్స్ బాగుంటుంది .(అంటే మెల్ల మెల్ల గా బ్లడ్ లోకి షుగర్ వెళ్లే ప్రక్రియ)
అలానే ఓల్ వీట్ ,దానినే బ్రౌన్ వీట్ బ్రెడ్ అంటారు అది వాడితే షుగర్,వాళ్లకు కొలెస్ట్రాల్ వాళ్లకు చాలా మంచిది.అలానే మైదాపిండి అస్సలు వాడకుండా ఉంటే జీవితానికి చాలా లాభము .ఇక గోధుమ రొట్టెలు ...వరి అన్నం కు బదులు గా తినమ0టా రు .కానీ రెండిటి లోను కార్బోహైడ్రేట్లు సమానమే ,కాకపోతే రొట్టెలు,చపాతీలు అయితే లెక్క ప్రకారం తినవచ్చు అని చెబుతారు అంతే. అయితే పొట్టుగోధుమల పిండి తో అయితే మాత్రం కొంచెం షుగర్ వాళ్లకు ,కొలెస్ట్రాల్ వాళ్లకు చాలా మంచిది ,ఇక ఆకుకూరలు ,వెజితెరియన్ ఫుడ్ మాత్రం. షుగరు వాళ్లకు ,కోలేస్ట్రాల్ వాళ్లకు మంచిది అని మరిచిపోకండి. ఇక ఏదైనా నూనెలో వేయు0చి తింటే క్యాలారీస్ పెరుగుతాయి అందుకే మామూలుగా ఉడికించి తినండి ఫ్రై లు పూర్తిగా మరిచిపోవడం మేలు .అలానే షుగర్ వాళ్ళు జీలకర్ర. ,పసుపు దాల్చినచెక్క, ఉసిరికాయ, సొంపు మెంతులు,కరివేపాకు ఇవి రోజూ ఏదో ఒక రకంగా కడుపులోకి పంపిస్తూఉంటే షుగర్ వాళ్లకు, కొలెస్ట్రాల్ వాళ్లకు చాలమంచిది.
మజ్జిగ ...పలుచగా చేసి త్రాగండి అది షుగర్ ...వాళ్లకు, కొలెస్ట్రాల్ వాళ్ళకు. ..క్యాల్షియం వాళ్లకు చాలా మంచిది.. రాత్రి వేళల్లో పెరుగు బదులు మజ్జిగ వాడండి ఆయువృద్ది అని ఆయుర్వేదం చెబుతు0దీ
ఇక అది కుదరకపోతే . ".అభయాదిమోద క్ " అనే ఆయుర్వేద టాబ్లెట్ దొరుకుతాయి అది తెచ్చుకొని రాత్రి భోజనం తరువాత ఒక్క టాబి లెట్ వేసుకున్నా చాలు .అతిగా వేసుకోకూడదు పవర్ చాలకపోతే రెండోరోజు ఇంకో అర ముక్క ఎగస్త్రా వేసుకొండి ,అంతే కాని అతిగా వేసుకుంటే ఎక్కువసార్లు మోషన్ అయితే నీరసం వస్తుంది .రెండు.మూడు సార్లు వెళ్లినా కంగారు పడ కుండా ..మీకు వీలు పట్టి డోస్ తగ్గించుకొండి.
అలానే మానసిక ఆరోగ్యానికి, డిప్రెషన్ పోవడానికి పైన లాగానే "ఓం పూతాత్మనే నమః" అనే శ్రీ విష్ణు సహస్రనామ0 28 సార్లు లేక మీకు ఎంత వీలు అయితే అంత ఎక్కువ సార్లు చేయండి.
లేదా కలి యుగములో అనేక భ్రమ లు ,అనేక మాయలు,భయాలు పట్టి బాధపడుతుంటాము .కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుని కూడా ప్రార్ధిం చి కూడా బైట పడవచ్చు ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి వచ్చి ఏడుకొండల పై అవతరించగానే స్వామీ భక్తులు అందరం మిమ్ములను ఏ పేరుతో కొలవాలి.అని అడిగినప్పుడు "శ్రీవేంకటేశ్వర శ్రీనివాసపరబ్రహ్మణేనమః "అని నామస్మరణ చేస్తుంటే వాళ్లను నేను కాపాడుతూ ఉంటాను అని స్వామివారు చెప్పారు .అయితే దానికి మన పెద్దలు ,పురాణ పండితులు ఇలా చెప్పారు "శ్రీవేంకటేస్వర శ్రీనివాసగోవింద పరబ్రహ్మణే నమః " అనే నామ0 చాలా గొప్పదైనది,త్వరగా ,ఫలితం ఇస్తోంది. అని .అలానే మానసిక సమస్యలతో సతమతం అవుతూన్న వారు సాయంకాలం వచ్చే షిరిడీ సాయిబాబా వారి హారతి వినడం,కలిసి పాడటం, సాయి గుడి దగ్గర్లో ఉంటే వెళ్లి పాలుగోవడం కకనీసం టి.వి లో అయినా వింటూ భజన చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది .
అలానే కామాక్షి లేక కామంచి మొక్క అంటారు .అది పడుబడిన గోడలపై, తోటల్లో ను ఒకమదిరి మొక్కలు ,వాటికి నల్ల వి చిన్న పూసలు వంటి కాయలు ఉంటాయి.ఆ చెట్టు. ఆకులను కూరగాకానీ, పప్పులో కానీ ఎలాగో అలా తినేయండి మీకు కంటి చూపు బాగా పెరుగుతుంది ,కళ్ళ సమస్యలు చాలా తీరిపోతాయి .అలానే అది కొద్దిరోజులపాటు ఎక్కువ మొత్తం లో తింటే లివర్ సమస్యలు మటు మాయం అవుతాయి. అంతే కాదు చివరి దశలో ఉన్న లివర్ కూడా ఆ ఆకులు ను ఎక్కువ మొత్తం లో లోపలికి తీసుకు 0టే లివర్ పూర్తి స్తాయి ఆరోగ్యానికి వచ్చేస్తుంది .కాబట్టి కనీసం అప్పుడప్పుడు ఆ కామంచి ఆకు కూర తినడం అలవాటు చేసుకోగలరు .ఆరోగ్యం కోసం వాడే మ0దులు ఎప్పుడైనా ఓం ధన్వంతరి నారాయణాయనమహా"అనీచదివి తూర్పు వైపు తిరిగి మందులు సేవిస్తే చాలా ఫలితం ఉంటుంది.
డయాబెటిక్ వాళ్ళు వరి అన్నం తగ్గించి కూర ఎక్కువ వండుకొని తింటే షుగర్ కంట్రోల్ కి వస్తుంది. ఒక్కొక్కసారి మొత్తం కూరని మాత్రమే ఎక్కువగా వండుకొని తినే వాళ్ళు వున్నారు.విదేశీ యులు కూడా అచ్చం గా వంకాయ ,దొండకాయ, టమాటాఆలు ,కలిపి! ఇలా రుచికరంగా వండుకొని తింటూ ఉంటారు. మనం ఓ గుప్పెడు అన్నం లేక రెండు గుప్పెడులు అయినా అన్నము వేసుకొని తినేయచ్చు .అప్పుడు కూడా షుగర్ కంట్రోల్ కి వస్తుంది. ఇక పొట్టు గోధుమలతో చేసిన పిండి ని మాత్రమే వాడండి ,దానివల్ల గ్లై స్మిక్ ఇండి క్స్ బాగుంటుంది .(అంటే మెల్ల మెల్ల గా బ్లడ్ లోకి షుగర్ వెళ్లే ప్రక్రియ)
అలానే ఓల్ వీట్ ,దానినే బ్రౌన్ వీట్ బ్రెడ్ అంటారు అది వాడితే షుగర్,వాళ్లకు కొలెస్ట్రాల్ వాళ్లకు చాలా మంచిది.అలానే మైదాపిండి అస్సలు వాడకుండా ఉంటే జీవితానికి చాలా లాభము .ఇక గోధుమ రొట్టెలు ...వరి అన్నం కు బదులు గా తినమ0టా రు .కానీ రెండిటి లోను కార్బోహైడ్రేట్లు సమానమే ,కాకపోతే రొట్టెలు,చపాతీలు అయితే లెక్క ప్రకారం తినవచ్చు అని చెబుతారు అంతే. అయితే పొట్టుగోధుమల పిండి తో అయితే మాత్రం కొంచెం షుగర్ వాళ్లకు ,కొలెస్ట్రాల్ వాళ్లకు చాలా మంచిది ,ఇక ఆకుకూరలు ,వెజితెరియన్ ఫుడ్ మాత్రం. షుగరు వాళ్లకు ,కోలేస్ట్రాల్ వాళ్లకు మంచిది అని మరిచిపోకండి. ఇక ఏదైనా నూనెలో వేయు0చి తింటే క్యాలారీస్ పెరుగుతాయి అందుకే మామూలుగా ఉడికించి తినండి ఫ్రై లు పూర్తిగా మరిచిపోవడం మేలు .అలానే షుగర్ వాళ్ళు జీలకర్ర. ,పసుపు దాల్చినచెక్క, ఉసిరికాయ, సొంపు మెంతులు,కరివేపాకు ఇవి రోజూ ఏదో ఒక రకంగా కడుపులోకి పంపిస్తూఉంటే షుగర్ వాళ్లకు, కొలెస్ట్రాల్ వాళ్లకు చాలమంచిది.
మజ్జిగ ...పలుచగా చేసి త్రాగండి అది షుగర్ ...వాళ్లకు, కొలెస్ట్రాల్ వాళ్ళకు. ..క్యాల్షియం వాళ్లకు చాలా మంచిది.. రాత్రి వేళల్లో పెరుగు బదులు మజ్జిగ వాడండి ఆయువృద్ది అని ఆయుర్వేదం చెబుతు0దీ
అరటి చెట్టు ఊచ, లేక దవ్వ.. చెట్టు కాండం లోని తెల్లని మట్ట భాగం తింటే కిడ్నీ రాళ్లు కరిగి పోతాయి.. కొద్దీ రోజులు దంచిరసం త్రాగిన కూడా రాళ్లు కరిగిపోతాయు. అలానే ముల్ల0గి రసం త్రాగినా కరిగిపోతాయి .కూర అప్పు డప్పుడు తింటూ ఉంటే కూడా. రాళ్ళు రాకుండా వుంటాయి.
అలానే ఇదివరలో చెప్పుకున్నాం . .త్రిఫల చూర్ణం లాభాలు అనేకం వాత, పిత్త కఫం అనే మూడు లక్షణాలు సరి సమానం గా లేకపోవడమే మనిషి లో అనేక సమస్యలు, రోగాలకు కారణం ..అయితే త్రిఫల చూర్ణం లేదా ఆ టాబ్లెట్ ఏదైనా సరే మనిషి లోని ఆ మూడు గుణాలను సమానం చేసి సమస్యలను పోగుడుతుంది.. ముఖ్య0గా. నేత్రసమస్య లు ,అజీర్ణం. గ్యాస్ . మల బద్దకం లాంటివి, మాత్రం త్వరగా తగ్గుతాయి .దీనిలో ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ లు సమభాగా లుగా కలిపి తయారు చేస్తారు.
ఇక మోషన్ కాకుండా ఇబ్బంది పడుతున్నవారు ఆయుర్వేదం షాపుల్లో.కొన్నిచోట్ల ఇంగ్లీషు మందులషాపుల్లో " కాయ0చూర్ణ0 " అనే పొడికల డబ్బా దొరుకుతుంది దానిలో సునాముఖి ఆకు ,వాము ,లా0టి వి కలుస్తాయి .రాత్రి భోజనము కాగానే ఒక స్పూన్ పొడి ఒక గ్లాస్ నీటిలో కలిపి త్రాగి పడుకుంటే ఉదయం సుఖవిరోచనం ఫ్రీమోషన్ అవుతుంది .సమస్య ను బట్టి ఇంకొంచం పొ డి వేసుకోవచ్చు .
ఇక శారీరక ఆరోగ్య0 కోసం శ్రీ విష్ణు సహస్రనామ మములలో గల ఒక నామం"ఓం భూతభావనాయనమః" అనే నామం 28సార్లు ప్రతిరోజూ ప్రశాంతముగా కూర్చొని మీ మనసులో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని లేక శ్రీమన్నారాయణుని కానీ నిలుపుకొని,లేక ఫోటో ముందు కూర్చొని ధ్యానం చేయండి లేక మీకు ఎంత సంఖ్య కుదిరితే అన్ని సార్లు చేయండి.
ఇక కంటి చూపు,కంటిసమస్యలు ,ఇక మొత్తం ఆరోగ్యం కోసం అరుణకాంతుల సూర్యునికి ఎదురుగా నిలబడి రావి చెంబులో ఎర్ర పూవ్వు ఒకటి వేసి లేక,2,3 ఆయునా వేసుకొని సూర్య నారాయణునికి ఆర్గ్యం ఇవ్వండి .అంటే కుడిచేతులోపోసుకుంటూ సూర్యుని ని వైపు వదిలివేయడం చేస్తూ ఓం నమో నారాయణాయ,అని పలుకుతూ ,ఓం సూర్యాయ నమః, ఆదిత్యా యనమః,ఓం భాస్కరాయనమః,అంటూ చదువుకొంటూఆర్గ్యం ఇవ్వండి ఎందుకంటే. ఆరోగ్యం భాస్కరాధి చేత్ .అని వేద ధర్మ0 చెబుతుంది
ఇక సర్వాకాల,సర్వావస్థలందు, ఎవరైనా శ్రీవిష్ణుసహస్ర నమాలుచదుకోవచ్చు,లేక శ్రీ షిర్డీ సాయినాథుని సచ్ఛరితం రోజూ ఒక పేజీ చదుకోవచ్చు సమయం లేకపోతే సాయినాథుని 11 నామాలు చదువుకుంటే కూడా చాలా మంచిది ప్రధమ0సాయినాదాయా,ద్వితీయం ద్వారక మాయునే, తృతీయం తీర్ధరాజాయ చతుర్దం భక్తవత్సలే ,పంచమ0 పరమాత్మాయా ,ష స్ట్ మం షిర్డీవాసనే, సప్తమ0 సద్గురు నాథాయ అష్టమం అనాధనాధయే, నవమం నిరాడంబరాయ, దశమం దత్తాత్రేయా నమః ఏ దశ నామని త్రికాలే పాటునిత్యం సర్వ దు:ఖ నాశనం .సర్వకష్ట నివారణం ఇలా కూడా సాయినాథుని స్మరించి చదువు కుంటే అంతా మంచి జరుగుతుంది .
History of Antarvedi Lakshmi Narasimha Swami Temple
వశిష్ఠుని కోసం శ్రీమహావిష్ణువు వెలసిన... విశిష్ఠ క్షేత్రం!
తెలుగు నేలపై వెలసిన అతి పురాతన నారసింహ క్షేత్రాల్లో మహా విశిష్టమైనది అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ధామం. తూర్పుగోదావరి జిల్లాలోని వశిష్ఠ గోదావరి తీరాన కొలువయ్యారు స్వామి వారు.
సముద్రంలో గోదావరి అంతర్వేదికగా ఉండటం మూలాన ఈ క్షేత్రం 'అంతర్వేది' అయింది. ఇక ఈ నారసింహ క్షేత్రం 'సఖినేటిపల్లి' మండలం పరిధిలోకి వస్తుంది. సఖినేటిపల్లి అనే పేరు వెనుక ఆసక్తికరమైన పురాణ కథనం ఉంది.
త్రేతాయుగంలో రామచంద్రమూర్తి సీతమ్మతో కలసి లక్ష్మణ సమేతుడై ఇక్కడి స్వామివారి దర్శనానికి వచ్చాడు. ప్రస్తుత సఖినేటి పల్లి లో విరామం తీసుకున్నాడు. అప్పటికే బాగా పోద్దుపోవడంతో, ''సఖీ! నేటికి ఈ పల్లెనే మన విడిది'' అని పలికాడు. ఆ కారణం చేతనే ఈ ప్రాంతానికి సఖినేటిపల్లి అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతుంటారు.
అంతర్వేది క్షేత్ర స్థలపురాణం ప్రకారం కృతయుగంలో తనని బ్రహ్మర్షిగా గుర్తించని వశిష్ట మహర్షి పై విశ్వామిత్రుడు కోపాన్ని పెంచుకున్నాడట. హిరణ్యాక్షుడి కుమారుడైన రక్త లోచనుడితో వశిష్ట మహర్షి 100 మంది కొడుకులను కౌశికుడు చంపించాడు. పుత్ర శోకాన్ని భరించలేక పోయిన కుంభ సంభవుడు నారసింహ స్వామిని వేడుకున్నాడు. దుష్ట శిక్షణ చేయడానికి నృసింహ మూర్తి ప్రత్యక్షమయ్యాడు.
రక్త లోచనుడికి తన రక్తం నుంచి మరి కొందరు రాక్షసులు పుట్టుకొచ్చే వరం ఉండేది. దానికి విరుగుడుగా నరసింహ స్వామి తన సోదరి అయిన 'అశ్వ రూఢాంబ'ను రంగంలోకి దింపాడు. ఆమె రక్త లోచనుడి రక్తం ఒక్క బొట్టు కూడా కింద పడకుండా యుద్ధరంగమంతా తన నాలుకను విస్తరించింది. అప్పుడా రక్త లోచనుని ఉగ్ర నారసింహుడు సంహరించాడు. వశిష్ట మహర్షి కోరిక మేరకు లక్ష్మీ సమేతుడై అక్కడే వెలిశాడు కూడా. అయితే, పురాణంలో పేర్కొన్న అశ్వ రూఢాంబయే ప్రస్తుతం 'గుర్రాలక్కమ్మ' పేరుతో ఇప్పటికీ పూజలందుకుంటోంది.
అంతర్వేదీశ్వరునికి కేశవదాసు అనే పశువుల కాపరి మొట్ట మొదటగా చిన్నపాటి ఆలయాన్ని నిర్మించాడని స్థానికులు చెబుతారు. కాలక్రమంలో అదే ప్రసిద్ధి చెందుతూ వచ్చి మొగల్తూరు రాజైన శ్రీ రాజా బహద్దూర్ వారి ఆధ్వర్యంలో, దాతల సాయంతో మహాభివృద్ధి పొందింది.
అంతర్వేదిలో ఏటా మాఘ మాసాన పది రోజులు స్వామివారికి కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. 'భీష్మ ఏకాదశి' నాడు లక్షలాదిగా నృసింహ భక్తులు ఇక్కడికి చేరుకుని స్వామిని సేవించి తరిస్తుంటారు. మాఘంలోనే కొన్ని రోజులపాటు సూర్యాస్తమయ వేళ భానుని అరుణ కిరణాలు నరసింహ స్వామి పాదాలను స్పృశిస్తాయి.
అంతర్వేది క్షేత్రంలో మనం శ్రీ వెంకటేశ్వర స్వామి, భూదేవి, రాజ్యలక్ష్మీ తాయారు, సంతాన వేణుగోపాల స్వామి వార్లను కూడా దర్శించుకోవచ్చు.
Vijaya Dasami - Sami puja Shlokam
శమీ శమయతేపాపం శమీ శతృ వినాశినీ
అర్జునస్య ధనుర్థారి రామస్య ప్రియదర్శిని
శ్రీ దుర్గా మాత ఆశీస్సులతో సకల శుభాలు మీకు మీ కుటుంబీకులకు కలగాలని ఆశిస్తూ..
విజయదశమి శుభాకాంక్షలు
అమ్మవారికి ఏ తిథి రోజున ఏ అబిషేకం , ఏ నైవేద్యం పెట్టాలి?
అమ్మవారికి ఏ తిథి రోజున ఏ అబిషేకం , ఏ నైవేద్యం పెట్టాలి? తిదులలో ఏ అభిషేకం , నైవేద్యం ?
పాడ్యమి రోజు - ఆవు నేయి తో అభిషేకం చేస్తే సకల రోగలు నివారణ అవుతాయి.
విదియ రోజు - చక్కర తో అభిషేకమ చేస్తే దీర్గాయువు కలుగుతుంది.
తదియ రోజు - ఆవు పాలు తో అభిషేకం చేస్తే ఎలాంటి అకాల మృత్యు దోషాలు తొలిగిపోతాయి ,
చవితి రోజున - పిండివంటలు నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు లబిస్తాయి.
పంచమి రోజు - అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం వలన మేధస్సు , బుద్ది శక్తి పెరుగుతుంది.
షష్టి రోజున - తేనే తో అమ్మవారిని అభిషేకించి , బ్రాహ్మణునికి దానం ఇవటం వలన కాంతి పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది.
సప్తమి వెండి గిన్నెలో ఆవు పాలు మరియు చెరుకు ముక్కలు నివేదన చేయడం వలన దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది.
అష్టమి రోజున - బెల్లం నీటి తో అభిషేకించి, మంచి బెల్లం ఎవరికయినా దానం ఇవటం వలన అష్ట కష్టాలు అంటారు కదా అలాంటివి అనీ తీరిపొతయి అంటారు.
నవమి రోజున - పేలాలు నైవేద్యం పెట్టడం వలన సకల సుభాగ్యలు కలుగుతాయి.
దశమి రోజున - నల్ల నువ్వులు తో చేసిన పదార్ధాలు నైవేద్యం పెట్టడం వలన సకల రోగలు పోతాయి అని , దీర్ఘాయుసు పెరుగుతుంది.
అమ్మవారికి ఇష్టమయిన అన్నం
పులగం - అన్నం + పెసరపప్పు
పాయసన్నం
పెరుగు అన్నం
బెల్లం అన్నం
Dussera - Nava Durga Puja
అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో ఎందుకు కొలుస్తారు. నవరాత్రుల వెనుక అసలు చరిత్ర ఏంటి ?
శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.
*ప్రధమంశైలపుత్రిణి*
*ద్వితీయం బ్రహ్మచారిణి*
*తృతీయం చంద్రఘంటేతి*
*కూష్మాంతేతి చతుర్ధామ్ ౹*
*పంచమం స్కంధమాతేతి*
*షష్ఠమం కాత్యాయనీ తిచ*
*సప్తమం కాళరాత్రంచ*
*మహాగౌరేతి చాష్టమం*
*నవమం సిద్ధితి ప్రోక్త*
*నవదుర్గ ప్రకీర్తిత ౹౹*
1. శైలపుత్రి :*
దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మిం చింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి. ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.
2. బ్రహ్మచారిణి :*
దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.
౩. చంద్రఘంట :*
అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు అర్ధాకృతలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.
4. కూష్మాండ:*
నాలుగవ స్వరూప నామం కూష్మాండ. అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.
5. స్కందమాత :*
అయిదో అవతారం స్కందమాత స్కంధుడు అనగా కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మంతో శోభిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందునటానికి సంకేతమే ఇది.
6. కాత్యాయని :*
దుర్గామాత ఆరో రూపం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తనకు పార్వతీమాత కుమర్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.
7. కాళరాత్రి :*
దుర్గామాత ఏడో రూపం కాళరాత్రి. ఈమె శరీరం ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈదేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.
8. మహాగౌరి :*
ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దాని వలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.
9. సిద్ధిధాత్రి :*
దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.
History of Anantha Padmanabha Swami Temple - Kerala
శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ,కేరళ.
అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్ధం. శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం శ్రీమహావిష్ణువు ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని కేరళా రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది.
చరిత్ర:
ట్రావంకోర్ రాజకుటుంబం చేరవాంశానికి చెందిన వారు అలాగే కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీమహావిష్ణు యొక్క 108 దివ్యదేశములలో ఒకటి. 108 దివ్యాదేశములు అంటే శ్రీమహావిష్ణువు యొక్క ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్ధం. శ్రీమత్భాగవతంలో బలరామదేవుడు తన తీర్ధయాత్రలో భాగంగా ఫాల్గుణం (ప్రస్తుత శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ) అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్లు, ఇక్కడ ఉన్న పంచప్సరసులో (పద్మతీర్థంలో) స్నానం చేసినట్లు అలాగే పది వేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడింది (6వ శతాబ్దం-9వ శతాబ్దం).
క్రీ.శ 16వ శతాబ్దం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అపుడు ఈ ఆలయ సుందరగోపుర నిర్మాణం జరిగింది. ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవపెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ఈ ఆలయం కారణంగా కేరళా రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. 'తిరు అనంత పురం ' అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని యొక్క పవిత్ర ఆలయం అని అర్ధం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే మరి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభస్వరూపమే. హిందుధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెప్తుంది. (సంపూర్ణ సత్యం, సంపూర్ణ జాగృతి మరియు సంపూర్ణ ఆనందం).
ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంతశయనం భంగిమలో (అనంతశేషుడి తల్పం మీద యోగనిద్ర)ఉంటాడు. ట్రివాంకోర్ మహారాజా తనకు తానే పద్మనాభదాసుడని నామకరణం చేసుకున్నాడు. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేక మైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది.
అనంత సంపద:
ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుపతి తిరుమల వడ్డి కాసుల వాడు... ఈ మధ్య కాలంలో కేరళ తిరువనంత పురంలోని అనంత పద్మ నాభ స్వామి వారి దేవాలయంలో బయల్పడిన అనంత సంపదతో వజ్రాలు, వైడుర్యాలు, టన్నుల కొద్ది బంగారు ఆబరణాలు మొదలగు వాటితొ లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో నిలబడగా రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఇంకా బయట పడవలసిన సంపద వున్నందున పూర్తి స్థాయిలో సంపద నంతటిని లెక్కకట్టాల్సి ఉంది. ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేల మాళిగలలో దాచి వున్నది తెలుసు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరిచి చూసిన పాపాన పోలేదు. 1860 లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950 లో సీల్ వేశారు. స్వాతంత్ర్యానంతరం స్థానిక ఆలయాలన్నిటిని ట్రావెంకూర్ దేవస్తానం బోర్డులో విలీనం చేసినా ఈ ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులే తమ పర్వవేక్షణ క్రిందనే వుంచు కున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాళ్ బలారామ వర్మను అప్పటి ప్రభుత్వం రాజ ప్రముఖ్ గా ప్రకటించింది. ఆ రాజ కుటుంబీకులే ఈ ఆలయ ని
ర్వహణ ట్రస్టీలుగా కొనసాగారు. ప్రస్తుతం ఎనభై తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఉత్తరదామ్ తిరుణాల్ మార్తాండ ట్రస్టీగా కొనసాగుతున్నారు. ఈ ఆలయ సంపద నిర్వహణలో అస్తవ్యస్తంగా వున్నదని దాన్ని గాడిలో పెట్టాలని టి.పి. సుందర రాజన్ అనే న్యాయ వాది సుప్రీం కోర్టులో దావా వేయగా, సుప్రిం కోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది. ఆ విధంగా ఆ నేల మాళిగలలోని అనంత సంపదస్ వెలుగు చూసింది.
ఇప్పటివరకు ఐదు నేలమాళిగలలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోనె అనంతమై సంపద బయట పడింది. ఇంకా ఆరో గది తెరవ వలసి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది చాల పెద్దది, అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి వుంచ బడి వున్నదని తెలుస్తున్నది. ఇప్పటివరకే బయట పడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు బయల్పడిన సంపదలో బంగారం, వజ్రాబరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు పొదిగిన నగలు. బస్తాలకొద్ది బంగారు వెండి నాణేలు, దాదాపు రెండు వేల రకాల కంఠాభరణాలు గొలుసులు బయల్పడ్డాయి. పదహారవ శతాబ్దం నాటి శ్రీ కృష్ణ దేవరాయల కాలంనాటి నాణేలు, ఈస్టిండియా కాలం నాటి నాణెలు, నెపోలియన్ బోనపార్టే కాలం నాటివి బస్తాల్లో లబ్య మయాయి. అంతే గాక చిత్ర విచిత్రమైన వస్తువులెన్నొ ఉన్నాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూసాయి. ఇంత సంపద బయల్పడినా ఇంకా అతి పెద్దది, అతి ముఖ్యమైనది అయిన ఆరో గది తెరవాల్సి ఉంది.
వైష్ణవ దివ్యదేశం:
శ్లో. తిరువనంత పురే భుజగేశయో రుచిరమత్స్య సరోవర సుందరే|
శశి విభూషణ వజ్రధరేక్షిత శ్శఠరిపూత్తమ సూరి పరిష్కృత:||
అనంత పద్మనాభ శ్శ్రీహరి:లక్ష్మీ సమన్విత:|
ద్వారత్రయేణ సంసేవ్య: హేమ కూట విమానగ:||
విశేషం:
ఇది కేరళ రాష్ట్ర ముఖ్య పట్టణము. సన్నిధి కోట మధ్య భాగమున ఉంది. ఇక్కడ స్వామిని మూడు ద్వారములలో దర్శించాలి. ఈ స్వామి విషయమై నమ్మాళ్వార్లు తమ తిరువాయిమొళి ప్రబంధములో (10-2)"అరవిల్ పళ్లి పైన్ఱవన్ పాతజ్గాణ నడుమినో సమర్ కళుళ్లీర్" భాగవతులారా! అనంతునిపై పవళించియున్న పద్మనాభ స్వామి శ్రీపాదములను సేవింప బయలుదేరుడు" అని యుపదేశించియున్నారు.
శ్రీరంగమున అధ్యయనోత్సవమున అరయరులు ఈ పాశురమును గానము చేయగా విని ఆళవందార్లు ఆనందపరవశులై ఆళ్వార్లు కీర్తించిన ఈ క్షేత్రమునకు పోయిరావలయునని వెంటనే తిరువనంతపురమునకు వెళ్ళాడు.
"కురుగైక్కావలప్పన్" అనువారు ఆళ్వందార్లకు యోగరహస్యములను ఉపదేశింప దలచి ఒక సుముహూర్తమును నిర్ణయించాడు. కాని ఆళవందార్లు ఆదినమున తిరువనంతపురములో ఉండేవాడు. ఆకారణమున యోగరహస్యము వారికి లభించ లేదు. "అయ్యో! పుష్పక విమానమైనను లేదే. ఉన్నచో కురుగైక్కావలప్పన్ సన్నిధికి చేరి యోగరహస్యములను పొంది యుండు వారమే" యని ఆళవందార్లు భావించారట.
Blog Archive
-
▼
2026
(234)
-
▼
September
(24)
- ఒకసారి చూడండి వినండి
- ఓం నమో వేంకటేశాయ
- జంతువులు మనకు గురువులు
- మూగ జంతువుల దాహం తీర్చిన హీరో ..మొనగాడు మీరు.కూడాస...
- హనుమంత వాహనం పై కలియుగ దైవం చూడండి తరించండి
- మోహిని అవతారం లో కలియుగ దైవం చూడండి తరించండి
- మనసులో గట్టి నమ్మకం ఉండాలి కానీ వయస్సు ఒక లెక్క కా...
- మనసు లో కసిగా పెట్టుకొని సాధించి ఆశయం ముందు వైకల్...
- షుగర్ రీడింగ్స్ కంట్రోల్ కావాలంటే controle sugar r...
- కొద్దిసేపు రిలాక్స్ ....స్ట్రెస్ రిలాక్స్
- వినాయక వ్రత పూజా విధానం వింటూ పూజ చేసుకోవచ్చు
- కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవలకు అంబ...
- పురాతన మైన శివాలయం
- జై హనుమాన్ జై జై హనుమాన్ జయ శ్రీరామ్
- ఎండి పోయిన నదుల్ని తిరిగి తెచ్చిన ఒక ఆయుర్వేద వైద్...
- విదేశ0 లో హిందువులు దీవి
- పర్యావరణ హితం ..ఒక పరిశ్రమ
- ఓ రహస్య గురువు చాలా గొప్ప శిష్యులు
- కొన్ని కేసులు ఇలానే..రాజకీయాలు వల్ల వ్యవస్థలు బ్...
- ఓ గొప్ప జంతువు విశ్వాసం అంటేనే కుక్క ఆ కధని వింట...
- భారతదేశం లో మొత్తం జనాలు ఎల్లవేళలా గుర్తుంచు కోవాల...
- ఒక మంచి ప్రతిభ కలవాని గురించి
- https://telugu.greatandhra.com/mbs/reservation-and...
- Golkonda నవాబు దగ్గర ఉన్న బంగారం చూద్దామా
-
▼
September
(24)
Followers
About Me
- Dr.M muralikrishna
Powered by Blogger.