Pages

పుష్పాలు పత్రాలు -- భగవంతుని పూజ

మనదేశసం స్కృతిలో చాలా కాలం నుంచి పువ్వుల ను భగవంతుని పూజ లో వాడటం అనేది ఉంది అయితే రకరకాల రంగు రంగుల తో ఆకర్షించే పుష్పాలు, సువాసన గలా పుష్పాలు, సువససన మరియు అందమైన పుష్పాలు ఇలా పూజల్లో ప్రముఖ మైన పాత్ర పోషిస్తున్నాయి. అలానే కొన్ని పత్రాలు అంటే ఆకులు, అలాగే అన్నిరకాల ఫలాలు ఆయా ప్రదేశాల్లో దొరికే స్థితిని బట్టి దేవుని. పూజ లో వాడుతూవుంటాము.అక్షింతలు కొన్ని ఎరుపు రంగులో కుంకుమ తో చేస్తారు భద్రాచలం సీతారాముల వారి కళ్యాణం లో ఎరుపు రంగు అక్షతలు కనిపిస్తాయి పైగా అవి కొన్నిగ్రామాలవారు వడ్లగింజలు చేతితో వలిచి ఆ బియ్యం ని అలా మారుస్తారుఎక్కువశాతం పసుపురంగు లోని అక్షతలు కనపడుతూవుంటాయి పెద్దలు చెబుతారు ఎరుపు రంగు అక్షతలు పురుషదేవతాలకు  అలానే పసుపు రంగు వి స్ర్తీ దేవతలకుఉపయోగిస్తారనిచెబుతారు ఇంకా కొన్ని ప్రదేశాలలో తెల్లబియ్యం కూడా వాడతారు.  ఆంధ్రా, ఒరిస్సా బోర్డుర్లు  లో మనుషులు చేసుకునే పెళ్ళి ల్లో పెళ్ళితలంబ్రాలలో కూడా తెల్లబియ్యం వాడతారు అయితే అవే తెల్లబియ్యం చాలాచోట్ల వేరే కర్మలకు వాడతారు శుభకార్యాలకు వాడరు అంటే ఒకోక్క ప్రాంతంలో ఆచారాలు వివిధ రకాలుగా వుంటాయి దాని విషయములో ఎవరిని తప్పు పట్టలేము ఇప్పుడు మనకు ఒకటి అర్థం కావాలి మనస్సు చూసే కోణం బట్టే అన్నీ ఉంటాయి అని అర్థం చేసుకోవచ్చు పూవులకు బదులు అక్షింతలు లేక అక్షితలు అంటారు వాటిని వాడటం, ఇంకా పసుపు,కుంకుమ మంచి గంధము మొదలైన వాటితో పూజలు చేస్తూవుంటారు.

 కొన్ని రకాల పువ్వులు కొంతమంది దేవతలకు వాడరు శివునికి మొగలి పువ్వులు వాడరు .కొన్ని పువ్వులు,ఆకులు కొంతమంది దేవుళ్ళు పూజల్లో ముఖ్యంగా వాడతారు .భగవంతుడు ఒక్కడే కానీ వివిధ రూపాలలో ఎవరి కావాల్సిన  కోరుకున్న రూపంలో మనకు దర్శనం ఇస్తూవుంటాడు .శివుడికి  మారేడు పత్రాలు ,కాసిని నీళ్లు  ఆయన పూజ లో ముఖ్యం శ్రీమహావిష్ణువు కి ఆ స్వామి కి సంబంధించిన అన్ని అవతారములకు తులసి మాలలు, తులసి పత్రములు సమర్పించి  పూజించవచ్చు . శ్రీకృష్ణ భగవానుడు భగవత్ గీత మొత్తం  చెప్పి ఇక చివరలో చెప్పింది ఏమిటి అంటే  నీవు భయంతో వున్నప్పుడు నా రక్షణ కావాలని నువ్వు  , మనస్సు పూర్తిగా కోరుకుంటే  నీ ప్రయత్నాలు అన్నీ అయిపోయి దిక్కుతోచని స్థితి లో వున్నా ,రెండు తులసి దళాలు భక్తి పూర్వకంగా నా పాదాలపై వుంచి  శరణు జొచ్చితే చాలు నిన్ను వెంట ఉండి కాపాడగలను అని  అభయం యిచ్చారు స్వామి.ముఖ్యంగా పారిజాతపుష్పాలుకి కూడా చాలా పవిత్రత, ఉంది ఏ  పువ్వులు అయినా నేల పైన పడితే అవి పూజకు వాడరు .కానీ పారిజాత పుష్పాలు మాత్రం భూమి పై సహజముగా రాలిన వి మాత్రమే పూజలో వాడాలి  అంతేకాని  కోయడమో, చెట్టుఊపి బలంగా పువ్వులు రాల్చి తీ సుకోకూడదు .అది దేవతా వృక్షం ఇంకా పురాణాలు, పెద్దలు చెబుతుంటారు ఆ చెట్టు మొదలులో  ఆంజనేయస్వామి   నివాసిస్తూవుంటాడాని  అంటారు. శ్రీ లక్ష్మీనారాయణులు  మాత్రమే ఉన్న ఒక ఫోటో తీసుకొని  గరుడుడు ఉన్న పరవాలేదు ఇంకా ఆ ఫోటో లో ఆ ముగ్గురు మాత్రమే ఉండాలి. ఉదయం వేళల్లో ఆ ఫోటో కి ప్రతీరోజూ కొన్ని పారిజాతపుష్పాలు తీసుకొని  ఆలంకారం చేస్తూ  ఏదో ఒక పండు ,లేక తీపి  స్వామికి లక్ష్మీ అమ్మవారలకు ఆరగింపు చేస్తూ వుంటే ధనం బాగా  కలిసి వస్తుంది, వృధ్ధిఅవుతుంది. ఎక్కువ పారిజాత పుష్పాలు దొరక్కపోయినా కొన్ని పెట్టినా చాలు .

ఇక  భూలోకములో అటు తులసి పవిత్రత,ఇటు మారేడు  పవిత్రత కలబోసిన  చెట్టు ఉసిరిక చెట్టు అందుకే  ఈ చెట్టు కార్తీక మాసములో గొప్ప పవిత్రత ,వైభవము కలిగి ఎక్కువ పూజలు అందుకొంటుంది. ఇక లక్ష్మీ అమ్మవారికి కమలం పువ్వులు తో పూజ ఆ అమ్మవారికి  చాలా ఇష్టం ,అది ఏ రంగు కమలాలు ఆయన పరవాలేదు ,అలానే కలువలు కూడా ఆమెకు మహా ఇష్టం .శ్రీ వేంకటేశ్వరస్వామి వారు  శ్రీ మహా లక్ష్మి అమ్మవారిని  వెతుక్కుంటూ వచ్చి భూలోకములో తిరుచానూరు దగ్గర చాలా సంవత్సరములు తపస్సు ఆచరించారు .అప్పుడు అక్కడ ఒక కొలను ఏర్పరిచి , ఆ కొలనులో అమ్మవారికి  ఇష్టమైన కమలంపువ్వులు సిద్దచేసి మళ్ళి అవి వికసించడానికి సూర్యభగవానుడిని  ప్రతిష్ట చేసి అక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తపస్సు చేస్తే  అమ్మవారికి కోపం పోయి అక్కడ పద్మము లో దర్శనము యిచ్చింది. పద్మము లో వచ్చింది కాబట్టి పద్మావతి అమ్మవారు అని ,అలివేలుమంగమ్మతల్లి  అని పిలుస్తున్నారు. ఈ కోపతాపాలు. ఇలాంటి  ఘట్టాలు మనుష్య జాతిని,జీవులందరిని ఉద్ధరించటానికి ,వారు మానవలోకానికి  రావడానికి  ఒక కారణం అంతే కానీ మనుషుల్లో లాగా కొట్టుకోవడం కాదు అని జ్ఞానం తెలుసుకొని భక్తినీ పెంచుకోవాలి.అలానే షిర్డీసాయి నాధుడికి గులాబీలు అంటే  ఇష్టం అలానే ఆంజనేయస్వామి వారికి తమలపాకులు, అరటిపండ్లు అంటే చాలా యిష్టం అలానే నవగ్రహాల అధిష్ఠాన దేవతలకు ఒకొక్కరికి ఒక్కొక్క రంగు పువ్వులు యిష్టం . అలానే దుర్గాదేవి అమ్మవారిని ఎర్రని పూవులు,లలితాదేవి అమ్మావారికి ఎర్రమందారాలు అంటే యిష్టం సరస్వతి అమ్మవారికి తెల్లని రంగు కలపువ్వులు   యిష్టం.  

 .అలానే ఆంజనేయస్వామి వారికి  వడమాల అంటే కూడా ఇష్టం ముఖ్యంగా మంగళవారం కొంతమంది  భక్తులు ఆ వడమాల మొక్కుకుంటారు. మినుములు తో   చేసేవి మినుము లకు సంభందించిన  గ్రహం     గ్రహము యొక్క దయ కలగడానికి  ,ఆ సంభందించిన మినుములను ఆంజనేయస్వామి కి  వడలు గా  తయారుచేసి సమర్పించడమే ఇక్కడ  ముఖ్య విషయం.       ఇక శనివారం, మంగళవారం ఎక్కువగా  ఆంజనేయస్వామి వారికి విశేషమైన  పూజలు జరుగుతూవుంటాయి.నవగ్రహాలలో కూడా  ఒక్కొక్క గ్రహదేవతకి ఒక్కోక రంగు పుష్పాలు ఆయా పూజల్లో వాడతారు.అలానే ఒకోక్క రోజు కి ఒకోక్క గ్రహం అధిపతి ,మళ్ళి ఆ రోజుకి  ఒకోక్క దైవం అధిపతి , ఆదివారం ,సూర్యనారాయణుడు, అందుకే భానువారం అంటారు.నవగ్రహాలలో సూర్యదేవుడు మొదలు ,అందుకే ఆది. ఇతర దేశాలలో కూడాసన్ డే అని పిలుచుకుంటారుకడం .ఆయన కు మనం చేసే నమస్కారాలు అంటే ఇష్టం.నమస్కార ప్రియుడు. ఉదయమే కొంతమంది  నీరు దోసిలి తో ఆర్గ్యమిస్తారు నమస్కారములు చేస్తారు .ఆయన జీవులన్నింటికి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడి గాను.ప్రత్యక్షంగా కనిపిస్తున్నదైవం అని కూడా బాగా నమ్మకము ఉదయం వేళా  .ఆంధ్రా ప్రాంతం నుంచీ కోణార్క్ ప్రయాణము చేస్తుంటే ఎందరో సూర్యునికి నీరు ఆర్గ్యం ఇస్తూ కనపడతారు.


• ఇక దేవాలయంలో జరిగే  నిత్య పూజలకు ఎన్నో రకాలు పూలదండలు, తులసిమాలలు వాడుతూ వుంటారు. సాయంత్రం కాగానే  దేవాలయ పూజారులు  అవి అన్నీ తీసి బైట పెట్టేస్తూవుంటారు ,కొంతమంది మరుసటిరోజు శుభ్రం చేస్తూ ఆ పూలదండలు అవి బైట పెడుతూవుంటారు. కొంతమంది భక్తులు ఆ మాలలు ను ఇంటికి తెచ్చుకుంటారు . ఇలా ఇంటికి తెచ్చకున్న  ఆ పూవులు, లేక  మాలలను ఏమి చెయ్యాలి అనే దానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి   కొంతమంది పండితులు ఆ మాలలను తలుపులకు. ఇంటిగేట్లకు, ఇంటిదరవాజాలకు కట్టుకోవచ్చు అని చెబుతారు. . ఇంకా కొందరు అలా చేయకూడదు అని చెబుతున్నారు.ఇక  ఆ విషయం  లో అభిప్రాయబేధాలు ఉన్నప్పుడు.    మనకు దేవుడి విగ్రహాలకు అలంకరించిన వి కదా మనకు తీసుకోవాలని  ఉవ్విళ్లూరుతుంటాము  కదా మరి  అటువంటప్పుడు మనం కళ్లకు అద్దుకొని ఇంటికి తెచ్చుకొని మీ మం దిరములో ఒక పీట పై పెట్టి నమస్కారం చేసి ,మరుసటిరోజు మంగళవారం, శుక్రవారం కాకుండా మిగతా రోజుల్లో మనం తొక్కని ప్రదేశములో ,చెట్లలో  పడేయ వచ్చు ఒకవేళ మంగళ, శుక్రవారం లు వస్తే ఆ మరుసటి రోజు అవతల పడేయవచ్చు. ఏ మాలలు అయినా దేవుని గుడిలో తీసుకున్నవి తలమీద పెట్టుకొని మనం భక్తి లో తన్మయత్త్వం చెందవచ్చు  కానీ తులసి మాలలు మాత్రం ఎప్పుడూ కూడా మనం తలపై పెట్టుకోరాదు అని  ఒక్క శ్రీమహావిష్ణువు కి మాత్రమే ఆ సంప్రదాయం ఉంది అని తెలుసుకోవాలి .కావాలంటే మెడలో వేసుకోవచ్చు,కళ్ళకు అడ్డుకోవచ్చు .ఒకవేళ తెలవక చేస్తే కొంపలు ఏమి మునగవు చెంపలు వేసుకొని ,కళ్ళకు అద్దుకొని అక్కడ పెట్టేయవచ్చు.


The benefits of chanting Ashtakshari Manthra

అష్టాక్షరీ మంత్ర మహిమ.....*

” ఓం నమో నారాయణాయ ” అను ఎనిమిది అక్షరముల యొక్క మంత్ర స్మరణము అనంత పుణ్యప్రదం, అనంత పాప రాశి ని ద్వంసం చేయగల శక్తి కలిగినది.ఇట్టి అష్టాక్షరి మంత్ర అధిష్టాన పురుషోత్తముడే శ్రీ మన్నారాయణుడు స్థితి కారకుడై అష్ట ఐశ్వర్యములను ప్రసాదించునప్పుడు లక్ష్మీనారాయణునిగా, విధ్యజ్ఞానము ప్రసాదించునపుడు లక్ష్మీ హయగ్రీవునిగా, ఆరోగ్య ప్రధాతగా నిలిచిన సమయాన ధన్వంతరిగా, సంకల్ప దీక్ష నొసగు లక్ష్మీ నారసింహునిగా, సమస్త మానసిక రుగ్మతలు తొలగించు లక్ష్మీ సుదర్శనునిగా, భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రసాదించు అనఘ దత్తత్రేయునిగా, సర్వ మంగళకరుడగు శ్రీ వేంకటనాయకుడైన వేంకటేశ్వరునిగా భక్తులకు సుఖ శాంతులను ప్రసాదించుచున్నాడు

మానవాళిని తరింపచేసే ఓ పవిత్ర మంత్రం గురించి ప్రత్యేకంగా వివరిస్తోంది నరసింహ పురాణం పదిహేడో అధ్యాయం. 

వ్యాసభగవానుడు తన కుమారుడైన శుక మహర్షికి ఆ మంత్రాన్ని గురించి వివరించాడు. సంసారబంధాల నుంచి విముక్తులు కావటానికి, మానవాళి జపించాల్సిన మంత్రం ఓంనమో నారాయణాయ అనేది. ఇది అష్టాక్షరి. అంటే ఎనిమిది అక్షరాలతో కూడుకొని ఉంటుంది. మంత్రాలన్నింటిలోకి ఎంతో ఉత్తమమైంది ఈ మంత్రం. నిత్యం దీన్ని జపిస్తే ముక్తి లభిస్తుంది. ఈ అష్టాక్షరిని జపించేటప్పుడు శ్రీమహావిష్ణువును మనసులో ధ్యానిస్తుండాలి. అలాగే పవిత్ర నదీప్రాంతాలలో, ఏకాంత ప్రదేశాలలో, జలాశయాల దగ్గర శ్రీమహావిష్ణు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని అష్టాక్షరిని జపించటం మేలు.

అష్టాక్షరిలో ఉండే ఒక్కొక్క అక్షరానికి ఒక్కో ప్రత్యేక వర్ణం ఉంది. వరుసగా

"ఓం" కారం శుక్ల (తెలుపు) వర్ణం,
"న" కారం రక్త (ఎరుపు) వర్ణం,
"మో" అనే అక్షరం కృష్ణ (నలుపు),
"నా" అనే అక్షరం ఎర్రగానూ,
"రా" అనే అక్షరం కుంకుమరంగులోనూ,
య" అనే అక్షరం పసుపుపచ్చని రంగులోనూ,
"ణా" అనే అక్షరం కాటుకరంగులోనూ ఉంటుంది.

ఓంనమోనారాయణాయ అనే ఈ మంత్రం ఇన్ని వర్ణాలతో విడివిడిగా ఉంటూ అన్ని వర్ణాల సమ్మిళితమైన తెల్లని రంగులో చివరకు కనిపించటం సత్వగుణ ప్రాధాన్యతను తెలుపుతుంది. ఈ మంత్ర ప్రభావం వల్ల స్వర్గ, మోక్ష ఫలాలతోపాటు కోరిన కోర్కెలు కూడా సిద్ధిస్తుంటాయి. దీనిలో సకల వేదార్థాలు నిండి ఉన్నాయని పండితులు విశ్లేషించి చెబుతుంటారు. ఈ మంత్రాన్ని స్నానం చేసి శుచి అయిన తర్వాత పవిత్ర ప్రదేశంలో కూర్చొని జపించాలి.

సర్వకాల సర్వావస్థలలోనూ తాను పవిత్రంగా ఉన్నాననుకొన్నప్పుడు భక్తుడు ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడు, పని అయిన తర్వాత దీన్ని జపించటం మేలు. ప్రతి నెలలోనూ ద్వాదశినాడు శుచి అయి, ఓంనమోనారాయణాయ అనే ఈ మంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో వందసార్లు జపించాలి. అలా జపించిన వారికి మోక్ష స్థితులలోని సామీప్యస్థితి లభిస్తుంది. స్వామిని గంధపుష్పాలతో పూజించి ఈ మంత్రాన్ని జపిస్తే పాపాలు హరించుకుపోతాయి. అష్టాక్షరీ మంత్రజపంలో మొదటి లక్ష పూర్తి కాగానే ఆత్మశుద్ధి కలుగుతుంది. రెండో లక్ష పూర్తి అయ్యేసరికి మనశ్శుద్ధి, మూడో లక్ష పూర్తి అయినప్పుడు స్వర్గలోక అర్హత, నాలుగో లక్ష పూర్తికాగానే శ్రీహరి సామీప్యస్థితికి అర్హతలు లభిస్తాయి. అయిదు లక్షలసార్లు ఈ మంత్రజపం చేసిన వారికి నిర్మలజ్ఞానం కలుగుతుంది. ఆరో లక్షతో విష్ణులోకంలో స్థిర నివాస అర్హత, ఏడో లక్షతో స్వస్వరూప జ్ఞానం. ఎనిమిదో లక్షతో ముక్తి లభిస్తాయి. నిత్యజీవితంలో చేసుకొనే పనులు చేసుకుంటూనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించవచ్చు.
నిత్యం ఈ మంత్రజపం చేసేవారికి దుస్వప్నాలు, పిశాచాలు, సర్పాలు, బ్రహ్మరాక్షసులు, దొంగలు, మోసగాళ్లు, మనోవ్యాధులు, వ్యాధులవల్ల బాధలుండవు.

ఓంకారంతో మొదలయ్యే ఈ అష్టాక్షరీ మంత్రం ఎంతో విశేషమైందని వేదాలు కూడా వివరిస్తున్నాయి. జ్ఞానులు, మునులు, పితృదేవతలు, దేవతలు, సిద్ధులు, రాక్షసులు ఈ మంత్రాన్ని జపించి పరమసిద్ధిని పొందిన సందర్భాలున్నాయి. ప్రాణాన్ని విడిచే సమయంలో ఒక్కసారి ఈ మంత్రాన్ని అనుకున్నా వైకుంఠం లభిస్తుంది. వేదాన్ని మించిన శాస్త్రం, నారాయణుడిని మించిన దైవం లేదన్నట్లు ఈ మంత్రాన్ని మించిన మంత్రం మరొకటి లేదు. ఒక్కోసారి శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల జయంతులు. పూజలు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఆయా అవతారాలకు సంబంధించిన మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ తెలియనప్పుడు "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరీ మంత్రాన్ని నూటఎనిమిది సార్లు జపించినా ఆయా అవతారాల పూజాఫలితం దక్కుతుంది. అని ఇలా నరసింహ పురాణంలో సాక్షాత్తు వ్యాసభగవానుడే ఈ విషయాన్ని తన కుమారుడైన శుకయోగికి వివరించి
చెప్పడంతో అష్టాక్షరీ మంత్ర ప్రభావం ఎంతటిదో  తెలుస్తోంది.



Pedda Jiyyaru Swami



ఈరోజు అతి సామాన్యుల‌మైన‌ మ‌న‌మ౦ద‌రమూ కూడా రామానుజ‌ సిద్దా౦తాన్ని ఆచారిస్తున్నామ౦టే దానికి కార‌ణ‌ము మ‌న‌ పెద్ద‌జీయ‌ర్ స్వామి వారే  ఇ౦దులో ఏమాత్ర‌ము స౦దేహ‌ములేదు. 

నేపాల్ బ‌ద‌రీనాధ్ నుండి రామేశ్వ‌ర‌ము వ‌ర‌కు 9 స౦వ‌త్స‌రాల‌ పాటు వారు నిర్వ‌హి౦చిన‌ శ్రీరామ‌ క్ర‌తువులు త‌రుప‌రి నిర్వ‌హి౦చిన‌ వేద‌స్థూప‌ముల‌ ప్ర‌తిష్ఠ‌లు వారి స౦క‌ల్ప‌బ‌ల‌ము  ఏమిటో మ‌న‌కి తెలియ‌జేస్తాయి. కారాగార‌ముల‌లో ఉన్న‌ ఖైదీల‌కు కూడా ఆధ్యాత్మిక‌ శిక్ష‌ణ‌ని ఇచ్చి వారిలో ప‌రివ‌ర్త‌న‌ తెచ్చిన‌ మ‌హాపురుషులు మ‌న‌ స్వామివారు

అటు ఆధ్యాత్మిక‌ సేవ‌ మ‌రొక‌వైపు సామాజిక‌ సేవా ఏక‌కాల‌ములో రె౦డూ నిర్వ‌హి౦చిమ‌ అప‌ర‌ రామానుజులు పెద్ద‌జీయ‌ర్ స్వామివారు

వారి శ్రీచ‌ర‌ణాల‌కు దాశోహ‌ములు తెలుపుతూ
అడియేన్ రామానుజ‌ దాస‌న్ జ‌య‌ శ్రీమ‌న్నారాయ‌ణ‌*
*జ‌య‌ రామానుజ‌*

Why do we need to visit Varaha Swami temple before Balaji Temple in Tirumala???

వేంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి తెలుసుకోండి 

కలియుగ వైకుంఠమైన తిరుమలకు వేంకటాచలం అనే పేరు కూడా ఉన్నదని చాలా మందికి తెలుసు కానీ తిరుమలను ఆది వరాహ క్షేత్రం అంటారని తెలిసిన వారు తక్కువే.  
అంతే కాదు  శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామి వారి పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకుంటుంటారు , కానీ ఎందుకలా చేసుకోవాలి అనే వివరాలు తెలుసుకోవడం మన కనీస ధర్మం. పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడడానికి మునుపే శ్రీనివాసుడు తిరుమల చేరుకుని వకుళా మాత ఆశ్రమంలో ఉండేవారు. అప్పటికే అక్కడ తపస్సు చేసుకునే వరాహ స్వామి వారిని కలిశారు శ్రీవారు. అమ్మవారిని కల్యాణం చేసుకున్నాక తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోదలచి వరాహ స్వామి వారి దగ్గర కాస్త స్థలం అరువుగా తీసుకున్నారు.

 తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలవ్వగా, అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతంమై ఉండేది.

అప్పటిలో వరాహ స్వామి వద్ద శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వరస్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి. 

అదేమిటంటే… తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.
 
తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహ స్వామి ఆలయం వుంది. వెంకటేశ్వరస్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం (రాగిరేకు) పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్ర పత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీ
ద ఉన్నాయి. 

ఈ రాగిరేకును ఇది వరకు హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవారు.ఇప్పుడు రద్దీ పెరగడం వలన వరాహ స్వామి విశిష్టతను , ఆ రాగి రేకును చూపించే సమయం లేదు. భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరమల నుండి వస్తే, ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహ స్వామి దర్శనం సంపూర్ణసిద్ధిని కలిగిస్తుంది

Hayagreeva jayanthi



శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతి 

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫిటికాకృతిం  |
ఆధార0 సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||

 శ్రీ మహావిష్ణువు అవతారములలో 24 అవతారములు ముఖ్యమైనవి. ఈ అవతారములలోకెల్లా ముఖ్యాతిముఖ్యమైన, ఆద్యావతరమైన అవతారమే "హయగ్రీవావతారము''. ఈ అవతారము విశ్వవిరాట్ స్వరూపుని (శ్రీమన్నారాయణుని) ఉచ్వాసావతారమే అని, ఇది సృష్టి ఆరంభమునకు పూర్వమే జరిగినదని పెద్దలు చెబుతారు. శ్రీమన్నారాయణుని నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. విష్ణుమూర్తి కర్ణములు (చెవులు) నుండి మధుకైరభులు అనే రాక్షసులు అవతరిం చి, తమ జన్మ కారకులెవరో తెలియక మూల ప్రకృతియైన  ఆది పరాశక్తిని గూర్చి తపస్సు చేసి, జగన్మాత వలన తమ జన్మ రహస్యం తెలుసుకొని, ఎవరిచే కూడా మరణం జరగనట్లుగా వరం ప్రసాదించమని కోరారు. జగన్మాత అలా జరగదని చెప్పి, విచిత్ర దివ్య వైష్ణవ తేజో విశేషంతో తప్ప, ఇతరుల వలన మృత్యుభయం లేదని దేవి ద్వారా వరం పొందారు.

వరగర్వితులై అజేయులుగా ఉన్న మధుకైరభులు బ్రహ్మ వద్దనుండి వేదములను అపహరించి, బ్రహ్మాండమంతా జలమయం గావించి, పాతాళమున దాక్కున్నారు. మధ్య మధ్య బ్రహ్మను యుద్ధానికి కవ్విస్తూ బాధించేవారు. బ్రహ్మ వారితో యుద్ధము చేయలేక, వారు పెట్టే బాధలు సహించలేక, పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. నారాయణుడు బ్రహ్మ ప్రార్థన విని, తన దివ్యదృష్టితో సర్వం తెలుసుకొని, “ఐదు రోజులలో ఆ దైత్యులను సంహరించి, వేదాలను తెచ్చి నీకు అప్పగిస్తాను. వేదములు అందిన తరువాత సృష్టిని ప్రారంభించు, అంతవరకూ నన్ను ఆరాధించు'' అని విష్ణువు, బ్రహ్మను ఓదార్చి పంపించాడు.

వ్యాఖ్యా ముద్రం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే 
బిభద్బిన్నస్ఫటికరుచిరే పుండరీకే నిషణ్ణః |
అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్ మం 
ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగదీశః ||

వెంటనే శ్రీమన్నారాయణుని ఉచ్చ్వాస విశ్వాసముల నుండి శుద్ధస్ఫటిక సంకాశమైన శంఖ, చక్ర, గదా, అక్షరమాల పుస్తక శ్రీ ముద్రాది సంశోభితుడైన ఆశ్వముఖదారి అయినటువంటి "హయగ్రీవ స్వామి'' 
అవతారం చంద్రమండలం మధ్య నుండి అవతరించి, అసురులను హతమార్చి, వేదాలను, వేదవిద్యలను ఉద్ధరించి బ్రహ్మకు అప్పగించాడు. వేదాధిపత్యమును హ్రహ్మకు, సకలవిద్యాధిపత్యమును సరస్వతీదేవికి అప్పగించాడు. అప్పటినుండి బ్రహ్మ వేద ప్రతిపాదకంబైన సృష్టికి కర్తయై, వేదములకు అధినాయకుడయ్యాడు. సరస్వతి సకల విద్యాధిపత్యంబు వహించి, విద్యాప్రదాయినిగా ప్రసిద్ధిగాంచిందని మన పురాణాలు తెలుపుతున్నాయి.



కవిత కాదు ఓ భావన

            కవిత కాదు   ఓ  భావన
–––--------------////////-------------------

కొత్తఉద్యోగం  ......కొత్త వూరు
కొత్తఊరు .....కొత్తయిల్లు
కొత్త పంట ...కొత్త బెల్లం
కొత్తకుటుంబం  కొత్తపరిచయం కానీ పాత చుట్టాలం
ఇంటివారు ....నా ప్రార్ధన మన్నించారు
పాలు పొంగించటానికి పాలు పంపించారు
మెడ మెరిపిస్తూ మేను మురిపిస్తూ
పొడుగాటి జాడ శృ0గారాన్ని కురిపిస్తూ....
ఒయ్యారంగా ఆమె నా గదిలో పాలు పెట్టి వెళ్తోంది
కొత్త వంట  గా ప్రారంభం  చేశాను .
పాయసం ఎంతో రుచిగా వండాను .
ఆమెను కూడా కోటి  ఆశ ల జల్లు తో ఆహ్వానించాను .
మీరు  చాలా అందం గా వున్నారు మెల్లగా చెప్పాను .
ఆమె పెదవులు    రెండు    గులాబీ రేకుల్లా   విచ్చుకొన్నాయి .
అప్పుడు  ఆమె నాపై తెల్లని మల్లెల నవ్వును విసిరింది.
ఆమె పెదవులు మెరుస్తున్నాయితీయని తేనె పులిమినట్లు,
ఆమె నా కళ్ళలోకి కసి కసి గా చూస్తూ నవ్వింది.
ఆమె బుగ్గలపై చిలిపితనం పొంగిపొర్లింది.
ఇంత పెద్ద వర్షం ఇప్పుడే  విరుచుకు పడాలా !
కిరిటీలోనించి ఆమె కోసం వెతుకుతున్నాను.
కిరీటి అంతా వర్షపు బిందువులతోరణాలే,
మనస్సు అంతా తెలియని హర్షపు చిందులే ,
అన్ని బిందువులలో ఆమె అందమైన చిత్రమే ,విచిత్రమే
వండిన పాయసం దేవుని ఎదుట పెట్టాను .
ఆమెరాక కోసం ఆరాటపడుతూ బైట నిలుచున్నాను.
ఇంతలో పిల్లి వచ్చి మొత్తం తినేసి లొట్టలు వేస్తూ వెళ్ళిపోయింది.
ఓ కొత్త చుట్టం గారు ,బావా లేవండి  నిద్ర ఆపి పాలు పొంగిచండి.
ఏమిటి!   చ్చా! ఇదంతా  కలా .అబ్బా ఎంత మధురమో

Moringa and other leaves -- Health benefits

ములగఆకులు చాలా మంచివి కూరగా ,కానీ పప్పులో కానీ లేక రోజూ ఓ గుప్పెడు ఆకులు పోపు లోవేసుకొని ఉడకబెట్టుకొని తింటే  చాలమంచిది కొలెస్ట్రాల్ ను తీసేయడమే కాకుండా గుండె నాళాలను వెడల్పు చేసి వాటిలో అడ్డంగా ఉన్న గారను తొలగిస్తుంది. చాలరకాల వ్యాధులకు ములగాకు దివ్య ఔషధం. ఎండబెట్టి పొడి లోపలకు తీసుకున్నా చాలా మంచిది.   చాలా క్యాన్సర్లకు ఈ ములగ ఆకు మందుల్లో వాడబోతున్నారు.  అలానే ములక్కాయలు కూడా తినడం వల్ల లోపల మిగిలిపోయిన ఇంగ్లీషు మందులటాక్సిన్లు
బైటకు వెళ్ళిపోతాయి. ఇంకా చాలా రకలయున విటమిన్లు, మినరల్స్ వీటిల్లో వుంటాయి .ముఖ్యముగా బీటాకేరోటిన్ ,విటమిన్ C , మాంసకృత్తులు ,ఇనుము, క్యాలిష్యం ,పొటాషియం సమృద్ధిగా వున్నాయి.

ఇక కామంచి ఆకు  లేదా కామాక్షి మొక్క అంటారు .ఈ కామంచి చెట్టు వల్ల చాలా ఆరోగ్య లాభాలు ముఖ్యంగా కళ్లకు, లివర్ కి చాలా మంచిది.లివర్ ఏ స్థితి లో ఉన్నా కూడా కామంచి మొక్క మొత్తం ఉండుకొని తింటే లివర్ బాగుపడుతుంది.

ఇక షుగర్  ఎక్కువగా ఉండి బాధపడుతున్నవాళ్ళు  ప్రతిరోజూ ఉదయమే కరివేపాకు ఆకులు 8 ఆకులు సుమారు గా పరగడుపున తిన0డి .కొద్దిగా నీరు త్రాగండి  ఓ పది నిమషముల తరువాత  కాఫీ  టీ లు త్రాగవచ్చు. ఇక షుగరు లేనివారు అయినా కరివేపాకు తింటే. వారసత్త్వం గా వచ్చే  షుగరు రాదు ,లేదా  షుగర్ త్వరగా జీవితం లోనికి రానివ్వదు. అలానే  ఒక కప్పు గోరువెచ్చని నీటిలో హాఫ్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్, ఒక హాఫ్ స్పూన్ మెంతుల పొడి ,ఒక చిటికెడు పచ్చి పసుపు   లను  బాగుగా కలిపి  పరగడుపున త్రాగాలి  కొద్దిసేపు వరకు  ఏమి లోపలికి తీసుకోకుండా ఉండాలి (10 నిముషాలు ఆగి తరువాత కాఫీ,టీ లు తీసుకోవచ్చు.దీనివల్ల షుగర్  రీడింగ్ లు తగ్గుముఖం పడతాయి .కావాలంటే మీకు సూట్ అయితే  కొంచెము ఆ పొడి  ని  పాలా  పెంచుకోవచ్చు.

.కళ్ళకు  తోటకూర, పుదీనా,కొత్తిమీర  క్యారెట్,, ఉసిరికాయ, చాలా మంచిది .కొద్దికాలం పాటు తింటూ ఉంటే మీకే తెలుస్తుంది కళ్ళ సైట్ పవర్ కూడా తగ్గుతాయి.
పచ్చిముక్కలు ఉల్లి,క్యారెట్, బీట్రూట్, ఇంకా మీకు ఇష్టమైన పచ్చిముక్కలు భోజనం కు ముందు కొద్దీ గా తినడం మంచిది రక్తంలోని  ట్రీగ్లిజరేట్ శాతం తగ్గిపోతుంది.  


 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online