Pages

Kanuma festival speciality

*కనుమ పండుగ* శుభాకాంక్షలు

కనుమ ను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్ష్యాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇది. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.


ఈ రోజున ఇంటి కొకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వన మూలికలు, ఔషధ మొక్కలు, సేకరిస్తారు .కొన్ని చెట్ల ఆకులు, కొన్ని చెట్ల బెరుడులు, కొన్ని, చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు, ఇలా చాల సేకారిస్తారు. కొన్ని నిర్ధుస్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి, అనగా, మద్ది మాను, నేరేడి మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు కాయ, ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా కత్తిరించి, ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచు తారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని ఉప్పు చెక్క అంటారు ఇది అత్యంత ఘాటైన మధుర మైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆపశువు దాన్ని మీంగు తుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ల ఉప్పు చెక్కను తిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతటే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిస్తారు. ఏడాది కొకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. అది నిజమే కావచ్చు, ఎంచేతంటే అందులో వున్నవన్ని, ఔషధాలు, వన మూలికలే గదా.

ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుక పోయి, స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి, ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను, పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి. మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు.

సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునప్రతిస్టించి వూరులో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగిలి పెడ్తారు. పొంగిలి అంటే కొత్త కుండలో, కొత్తా బియ్యం, కొత్త బెల్లం వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చి పోయే ఊరి వారు రోజుకొక కంపో, కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. ఈ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. దాన్ని "చిట్లా కుప్ప" అంటారు. చీకటి పడే సమయానికి పొంగిళ్లు తయారయి వూంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అనగా ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు. అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది. అప్పటికి పశు కాపరు లందరూ ఊరి పశువు లన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు. పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్దగా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి, తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి.. చెదర గొట్టతాడు. అవి బెదిరి చేలెంబడి పరుగులు తీస్తాయి, ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలో వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు .ఆ తర్వాత అందరు అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ  పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ల కెళతారు. ఈ సందార్బంగా పెద్ద మొక్కున్న వారు పొట్టేళ్లను కూడా బలి ఇస్తారు. దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని" పొలి" అంటారు. ఆ "పొలి"ని తోటోడు గాని, నీరు గట్టోడు గాని తీసుకొని పోయి అందరి పొలాల్లో,చెరువుల్లో, బావుల్లో "పొలో.... పొలి" అని అరువ్తు చల్లుతాడు. అప్పడే కొత్త మొక్కులు కూడా మొక్కు కుంటారు. అంటే, తమ పశు మందలు అభివృద్ధి చెందితే రాబోయే పండక్కి పొట్టేలును, కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు .అప్పటికప్పుడే ఒక పొట్టేలి పిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది.

సంపదలకు ... సంతోషాలకు కారణమైన పశువులను కృతజ్ఞతా పూర్వకంగా పూజించడమే కనుమ పండుగలోని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. వ్యవసాయంలో బసవన్నలు రైతులకు ఎంతగానో తమ సహకారాన్ని అందిస్తుంటాయి. అలాగే పాడి ద్వారా రైతన్నలను గోమాతలు ఆర్ధికంగా ఆదుకుంటూ వుంటాయి.

తమ యజమానిపట్ల ప్రేమతో తప్ప వాటి కష్టంలో ఎలాంటి స్వార్థం కనిపించదు. యజమాని ప్రేమతో నిమిరితే పొంగిపోవడం మాత్రమే వాటికి తెలుసు. ఆ కుటుంబం కోసం ఎంతటి కష్టాన్నయినా సంతోషంగా భరించడమే వాటికి తెలుసు. ధర్మస్వరూపమైన బసవన్నలు ... భూదేవి స్వరూపంగా చెప్పబడుతోన్న గోమాతలు ఇలా రైతన్నల అభివృద్ధికి తమవంతు కృషిచేస్తుంటాయి. అందువలన ఈ రోజున పశువులశాలను శుభ్రపరచి ... గోమాతలను ... బసవన్నలను ప్రేమతో ముస్తాబు చేస్తారు.

ఈ రోజున వాటిని ఎలాంటి పనికి ఉపయోగించకుండా పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. కొత్త ధాన్యంతో పొంగలిని తయారుచేసి వాటికి తినిపిస్తారు. మరికొంత పొంగలిని తమ పొలాల్లో చల్లుతారు. సహాయం చేసినవారికి కృతజ్ఞతలు తెలియజేసినవారు భగవంతుడి ప్రీతికి పాత్రులవుతారు. దాంతో ఆయన వాళ్లని కనిపెట్టుకుని వుంటాడు. అందువలన కనుమ రోజున పశువులను పూజించడం వలన పాడిపంటలు మరింత వృద్ధి చెందుతాయని చెప్పబడుతోంది.
 

Sankranthi Rituals - Significance

సంక్రాంతి సంప్రదాయాలు.

హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండివంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు. మన పెద్దలు అనుసరించే సంప్రదాయాల వెనకున్న మర్మం ఏమిటి? వాటి నుంచి మనమేం నేర్చుకోవాలి? ఛాందసత్వానికి పోకుండా శాస్త్రీయంగా ఎలా అర్థం చేసుకోవాలి.

ముగ్గులు.....
ఓర్పును నేర్పే కళ…
ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్లు ముగ్గో వేస్తే చాలు. గంటసేపు ట్రెడ్‌మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. అందులోను జారిపోయే కొంగును సరిచేసుకుంటూ.. ముందుకు పడే జెడను వెనక్కి వేసుకుంటూ.. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్‌సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి.

భోగిమంటలు.

వ్యామోహానికి నిప్పు
మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరు వినరు. భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. మన లోపల పాతుకుపోయిన పాతను వదిలించుకోవడానికి భోగిమంట ఉపకరిస్తుంది. ఒక పూలతోట మీదుగా గాలి వెళితే అది సుగంధభరితం అవుతుంది. అదే గాలి ఒక మురికికాలువ మీదుగా వెళితే దుర్గంధంగా మారిపోతుంది. మనిషి ప్రాణం కూడా అంతే! మనిషి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఆయువు గాల్లోకి కలిసిపోతుంది. ఆ స్థితిని బట్టే పునర్జన్మ దక్కుతుంది. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండమంటుంది భోగిమంట. ఇంట్లోని కుర్చీకి ఒక కాలు విరిగిపోయి కుంటుతున్నా సరే దాన్ని వదలం. “అది మా తాతగారిది. అదంటే నాకు సెంటిమెంటు” అని పట్టుకు వేళ్లాడతాం. పాడైపోయిన పాతవస్తువునే అంత సులువుగా వదులుకోకపోతే.. రేప్పొద్దున తుచ్ఛమైన ప్రాణాన్ని స్వేచ్ఛగా ఎలా వదలగలుగుతావు? అంతవరకు ప్రాణభయంతో నిశ్చింతగా ఉండగలవా? ఉండలేవు. అందుకే నీలోని పాతను భోగిమంటతోపాటు వదిలేయి.

గంగిరెద్దులు, హరిదాసులు....
భిక్షానికీ ఓ ధర్మం..
ఏ పనీ చేయకుండా బిచ్చమెత్తుకోవడం ధర్మం కాదు. గంగిరెద్దుల వాడైనా, హరిదాసైనా ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పే బిచ్చమెత్తుకుంటారు. గంగిరెద్దుల వాడైతే ఇల్లు కలవాళ్లు ఏదిచ్చినా గంగిరెద్దు మీదే వేస్తాడు తప్ప చేతికి తీసుకోడు. పాత చీరలిస్తే వాటినే తీసుకుంటారు. హరిదాసు కూడా ఏడాదికి ఒకసారే వచ్చి హరినామకీర్తనలు పాడి.. గిన్నెడు బియ్యం తీసుకుని సంతృప్తిగా ఇంటికెళ్లిపోతాడు. పండగ పోయాక మళ్లీ ఏ వీధిలోనూ కనిపించడు. హరిదాసు ఇంటి ముందుకొచ్చి గొబ్బెమ్మల్ని తొక్కి వెళితే మంచిది.

గుమ్మడికాయ....

తీగల్లా అల్లుకుపోవాలి..
ఎప్పుడూ గుర్తుకురాని గుమ్మడి సంక్రాంతి రోజున గుర్తుకొస్తుంది. గుమ్మడి పోషకాల గని. ధాతుపుష్టికి, సంతానవృద్ధికి పనికొస్తుంది. ఏడాదికి ఒకసారైనా గుమ్మడికాయ వంటల్ని తినాలన్నది పెద్దల మాట. గుమ్మడి ఆకారం విశ్వస్వరూపానికి ప్రతీక. గుమ్మడి పాదు కూడా విస్తృతంగా అల్లుకుపోతుంది. మనిషి జీవితాన్ని కూడా ఎంత విస్తృతి చేసుకుంటే అంత ఉత్తమం. ఇరుకైన మనస్తత్వం కలిగుంటే ఇరకాటంలోనే ఉండిపోవాల్సి వస్తుందని గుమ్మడి చెబుతుంది.

గొబ్బెమ్మలు....

అసహ్యం నుంచి అద్భుతం
కృష్ణ భక్తురాలైన గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ. ఈ భూమ్మీదున్న దేన్నీ అసహ్యించుకోకూడదు. ప్రతిదీ ప్రకృతి ప్రసాదితం. అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మలిస్తే అది గొబ్బెమ్మ అవుతుంది. జీవి కడుపులో ఉన్నంత కాలం పవిత్రమైనది. తల్లి కడుపు దాటి నేల మీద పడగానే అపవిత్రమైపోతుంది. అందుకే, నేల మీద పడని ఆవుపేడతోనే గొబ్బెమ్మలను చేస్తారు .

భోగిపండ్లు
యోగిత్వం.. బదరీఫలం
సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం తగ్గింది కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగిపండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాధి నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు (పైబర్) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదన్నది దాని అర్థం. రేగుపండ్లు జఠరాగ్నిని ఉరకలెత్తిస్తాయి. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.
బదరీవనం (రేగుపండ్ల తోట)లో వేదవ్యాసుడు తపస్సు చేసేవాడన్న మరో ఐతిహ్యం కూడా ఉంది. కాబట్టే ఆయనకు బాదరాయణుడు అన్న పేరొచ్చింది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే – రేగుపండ్లు యోగిత్వానికి ప్రతీక. మరో విశేషమేమంటే రేగుపండ్లను జంతువులు తినవు. మనుషులే తింటారు. హిందూ సంస్కృతిలో రేగుపండ్లకున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి’ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ అవుతారన్నది ఒక విశ్వాసం.

గాలిపటం.

దారంలాంటిది జీవితం
ప్రతి మనిషికీ ఆత్మనిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు.. మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం. ఒడుపుగా లాగితే తెగిపోతుంది. వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైనా, జీవితమైన ముందుకు వెళుతుంది. అయితే చేతిలో దారం ఉంది కదాని ఎంతదూరమైనా గాలిపటాన్ని వదల్లేము. ఏదో ఒక సమయంలో మళ్లీ చుట్టచుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే. ఆ గుప్పెడు అనేది భగవంతుడులాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతిని మరిచిపోకూడదు. గాలిపటానికి ఎన్ని రంగులున్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికీ వర్తిస్తుంది.

కోడిపందేలు.

యుద్ధనీతిని గెలిపించే పందెం
పండగ పరమార్థాన్ని మరిచిపోయి దాన్ని పరహింసగా మార్చాం. నేడు జరుగుతున్న కోడిపందేలే అందుకు నిదర్శనం. కోడిపందేలకు తరాల చరిత్ర ఉంది. కాని ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి ఆనందించేవారు కాదు. ఇప్పుడు కత్తులు కట్టి, డబ్బు కట్టలు పెట్టి జూదంగా మార్చేశారు. పాతరోజుల్లో ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారు  మధ్యవర్తులు. పల్నాటి కాలంలో మాచర్ల, గురజాల మధ్య గొడవ యుద్ధానికి దారితీసింది. అలాంటి సమస్యను కోడిపందెమే పరిష్కరించింది. యుద్ధనీతిని తెలియజేసింది.

పశు పూజలు
శ్రమకు కృతజ్ఞత

సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చిందంటే.. అది పశువుల పుణ్యం. ఏడాది పొడవునా పశువులతో చాకిరీ చేయించడమే కాదు. పండగరోజైనా వాటిని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాలంటుంది పశువుల పూజ. ఆ రోజు రైతులు నాగలి కట్టరు. ఎద్దుల మీద కాడి మోపరు. బండ్లు తోలరు. అందుకే ‘కనుమ రోజు కాకైనా కదలదు’ అంటారు.

*తిల తర్పణం*

సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కాని సంక్రాంతి పర్వధినాన మాత్రం నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు. ఈ రోజు బూడిద గుమ్మడి కాయ దానము ఇస్తారు.

*సంకురుమయ / సంక్రాంతి పురుషుడు*

మట్టి తో ఒక బొమ్మను (సంక్రాంతి పురుషుడు), తన వాహనాన్ని (ప్రతి సంవత్సరం వేరు వేరు వాహనాల పై పురుషుడు వస్తాడు. ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టము అని ఒక నమ్మకం) , మేళ తారళాలను చేసి, సంక్రాంతి మూడు రోజుల్లొ పూజలు చేస్తారు. నాల్గవ నాడు ఈ బొమ్మలను వాల్లాడిస్తారు.

హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది. గ్రెగోరియను కాలెండరు కూడా సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతీ సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. కాబట్టి గ్రెగోరియను కాలెండరు ప్రకారం ఏటికేడాది వేరువేరు రోజుల్లో వస్తాయి.
 
పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.అంచేతే భారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మాచార్యుడు సంక్రాంతి పర్వదినం వరకూ ఆగి, ఉత్తరాయణం లో రథసప్తమి (మాఘ శుద్ధ సప్తమి) నాడు ప్రారంభించి, రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ, చివరకు భీష్మఏకాదశి మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి, తనువు చాలించాడు.
ఆది శంకరాచార్యులు ఈరోజునే సన్యాసం పుచ్చుకున్నారు

Sankranthi - some interesting facts

సంక్రాంతి అనగా సూర్యుడు రాశిలో ప్రవేశించడం. సూర్యుడు రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. దీనిని భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒడిషా, పంజాబ్, గుజరాత్ మొదలగు రాష్ట్రాలలో పాటిస్తారు. మరొకవైపు బెంగాలీ కాలెండరు మరియు అస్సామీ కాలెండరులలో ప్రతి నెల చివరి రోజున సంక్రాంతిగా పరిగణిస్తారు. 

*ఉత్తరాయణం, దక్షిణాయనం*

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష,వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము.కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరినుండి మొదలై, ఆ తరువాతసింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమైన అర్చనకు,ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు,బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. కనుకనే ఉత్తరాయనము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు.

 "సంక్రమణం" అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో "సంక్రాంతి"ని ఇలా నిర్వచించారు - *తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః* - మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని "సంక్రాంతి పండుగ"గా వ్యవహరిస్తారు.మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది.
సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది.అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు.ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు.దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం కలిపి మనకు ఒక సంవత్సరం కాలము.

*మకర సంక్రాంతి* -సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అంటారు. ఇది ఆరు నెలన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ దినం. సాంప్రదాయకంగా భారతదేశ కాలెండరు ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు జనవరి 14 లేదా జనవరి 15 వ తేదీలలో వస్తుంది.
మహా వైషువ సంక్రాంతి -ఇవి రెండు ఋతువుల మధ్య వచ్చే సంధి కాలం. మొదటిది శీతాకాలం, వేసవి కాలం మధ్య వచ్చే సంధి కాల ప్రారంభం - మేష సంక్రాంతి (వసంతఋతువులో వచ్చేది)
మరియు వేసవి కాలం, వర్షాకాలముల మధ్య వచ్చే సంధి కాలం - తుల సంక్రాంతి (శరత్ ఋతువులో వచ్చేది). సంవత్సరం మొత్తంలో ఈ రెండు రోజులు కచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి. అంటే సూర్యోదయం, సూర్యాస్తమయాలు దాదాపు ఒకే సమయమున సంభవిస్తాయన్నమాట. ఈ సంక్రాంతి ఒరియా నూతన సంవత్సరం గానూ మరియు బెంగాలీ కాలెండరులో ఆఖరి దినంగానూ నిర్వహిస్తారు. భారతదేశం లోని అనేక ప్రాంతాలలో ఈ రోజును వైశాఖిగా వ్యవహరిస్తారు.

*విష్ణు పది సంక్రాంతి* -సింహ సంక్రాంతి, కుంభ సంక్రాంతి, వృషభ సంక్రాంతి మరియు వృశ్చిక సంక్రాంతి.
*ధను సంక్రాంతి*- చంద్రమాన కాలెండరులో పుష్యమాస మొదటి రోజు దక్షిణాన భూటాన్ మరియు నేపాల్ లలో దీనిని వైల్డ్ దుంపలు (తరుల్) తినే పండగగా జరుపుతారు.
*కర్కాటక సంక్రాంతి* :  సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించే దినాన్ని కర్కాటక సంక్రాతిగా వ్యవహరిస్తారు. ఈ దినం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆఖరి దినంగా హిందూ కాలెండరులో వ్యవహరిస్తారు. ఈ రోజు దక్షిణాయణ పుణ్యకాలానికి మొదటి రోజు.

Guru paaduka sthotram

*శ్రీ గురు పాదుకా స్తొత్రము

*అనంతసంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ |*
*వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురు పాదుకాభ్యామ్ || 1 ||*


*కవిత్వవారాశి*
*నిశాకరాభ్యాం* *దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యామ్ |*
*దూరికృతానమ్ర  విపత్తతిభ్యాం నమో నమః శ్రీగురు పాదుకాభ్యామ్ || 2 ||*


*నతా యయోః శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః |*
*మూకాశ్ర్చ వాచస్పతితాం హి తాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 3 ||*


 *నాలీకనీకాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యామ్ |*
*నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 4 ||*


*నృపాలి మౌలివ్రజరత్నకాంతి సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యామ్ |*
*నృపత్వదాభ్యాం నతలోకపంకతే: నమో నమః శ్రీగురు పాదుకాభ్యామ్ || 5 ||*


*పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్ర్వరాభ్యామ్ |*
*జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యాం నమో నమః శ్రీగురు పాదుకాభ్యామ్ || 6 ||*

*శమాదిషట్క ప్రదవైభవాభ్యాం సమాధిదాన వ్రతదీక్షితాభ్యామ్ |*
*రమాధవాంధ్రిస్థిరభక్తిదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 7 ||*


*స్వార్చాపరాణామ్ అఖిలేష్టదాభ్యాం స్వాహాసహాయాక్షధురంధరాభ్యామ్ |*
*స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం నమో నమః శ్రీగురు పాదుకాభ్యామ్ || 8 ||*


*కామాదిసర్పవ్రజ గారుడాభ్యాం వివేకవైరాగ్య నిధిప్రదాభ్యామ్ |*
*బోధప్రదాభ్యాం దృతమోక్షదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 9 ||*
 
గురు అనుగ్రహం ఎలాంటిదో, ఆ అనుగ్రహానికి పాత్రులు కావడం ఎంతో ముఖ్యము. *గురు పాదుకా స్తోత్రం* ఎంతో శక్తివంతమైన మంత్రోచ్చారణ, ఇది గురుపాదుకల్ని అనంతమైన సంసారాన్ని దాటించే నావగా కొనియాడు తుంది. ఈ  మంత్రోచ్చారణ వల్ల మనం గురు అనుగ్రహానికి పాత్రులం కాగలుగుతాము
అనుగ్రహం మీ పైన లేకపోయినా లేక మీరు అనుగ్రహానికి పాత్రులు కాలేకపోయినా, మీ దగ్గర ఎంత డబ్బు, ధనం, ఇంకా వేరే ఎన్ని ఉన్నాసరే, మీరు ఓ అందమైన జీవితాన్ని జీవించలేరు. గురు అనుగ్రహం అనేది మీరు ఉహించుకునే అభూత కల్పన కాదు. గురు సాన్నిద్ధ్యం ఎంతో భౌతికమైంది.


 మీరు ఈ వీస్తున్న గాలిని ఎలా అనుభవించగలరో, ఈ సూర్య కిరణాలను ఎలా అనుభవించ గలరో, ఇది కూడా అంత భౌతికమైన అనుభవమే. గురువు అనేది ఓ నిర్దిష్టమైన శక్తి, నిర్దిష్టమైన అవకాశం. 


ఇది ఓ వ్యక్తి మాత్రమే కాదు – ఓ వ్యక్తి అలాంటి శక్తికి, స్థానానికి ఓ దూతగా మారడం. మీరు ఏదైనా చూడాలనుకోండి, మీకు కావలసింది వెలుగు అంతే గాని బల్బ్ కాదు కదా. కాని ఇప్పుడు బల్బ్ ద్వారానే ఈ వెలుగు వస్తోంది. నెనీ బల్బ్ లేకుండా ఉండలేనని మీరు ఆలోచించడం మొదలుపెడుతున్నారు. ఓ స్థాయిలో ఇది కూడా నిజమే . కాని గురు తత్త్వమనేది కాలానికి, స్థానానికి పరిమితమైంది కాదు. ఇప్పుడు నేను ఈ లైట్ బల్బ్ పక్కన కూర్చుంటే నాకు చాలా ఎక్కువ కాంతి వస్తుంది అని మీరు ఆలోచిస్తూ ఉండచ్చు . 


కాని ఒక గురువుకి పక్కన కూర్చున్న వ్యక్తి కంటే ఎన్నో వేల మైళ్ళు దూరంలో ఉన్నపటికీ మీరు ఆయన అనుగ్రహానికి పాత్రులు కావచ్చు.విజయం అనేది అనుగ్రహం లేకుండా రాదు. ఎలాగోలా మీరు ఈ  అనుగ్రహానికి పాత్రులవ్వడం నేర్చుకోవాలి. మీరు మీ మానసిక స్థితిని ఒక నిర్దిష్టమైన విధానంలో నిల్పుకుంటే మీరు దీనికి పాత్రులు కావచ్చు. 


మీ శరీరాన్ని ఒక నిర్దిష్టమైన విధానంలో తయ్యారుచేసుకుంటే కూడా, దీనికి పాత్రులు కావచ్చు. అలాగే మీరు మీ భావాల్ని ఒక నిర్దిష్టమైన విధానంలో మలచుకుంటే కూడా మీరు దీనికి పాత్రులు కావచ్చు. లేకపోతే మీరెంతో సంక్లిష్టమైన పద్ధతుల ద్వారా, ఈ శాస్త్రం పని చేసే తీరును తెలుసుకొని మీరు దీనికి పాత్రులు కావచ్చు.


 కాని అనుగ్రహం అన్నది లేకపోతే మాత్రం విజయం అనేది ఉండదు. మీరెంతో తెలివి గల వారై ఉండచ్చు కాని మీరో ఓటమిగానే మిగిలిపోతారు. మీరెంతో సామర్ధ్యం కలిగినవారై ఉండచ్చు, కాని మీరో ఓటమిగానే ఉంటారు. ఒక్క క్షణం, అనుగ్రహం మీకు దొరికినప్పుడు , వెంటనే అంతా మారిపోతుంది, అన్నిట్లోనూ  మీరు విజయవంతంగా ఉంటారు. మీరు ప్రశాంతంగా లేదా సంతోషంగా ఉండడం అనేది అది మీరు మీ లోపల నుండి చేస్తున్న పని. మీకు మీ శరీరం మీద, మనస్సు మీద కొంత నియంత్రణ ఉంటే ఈ పనులు మీరు తేలిగ్గా చెయ్యొచ్చు.


కాని మీరు విజయం సాధించాలంటే మాత్రం, ఇది అనుగ్రహం లేకుండా జరగదు. ఎందుకంటే, అనుగ్రహం అనేది యంత్రంలో వేసే చమురు లాంటిది ఇది లేకుండా యంత్రం ఎక్కువ కాలం పని చేయలేదు. ఇది లేకపోతే, ప్రతిదీ కొండ ఎక్కుతున్నంత కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనలో చాలా మంది మనకి మనమే అనుగ్రహానికి పాత్రులు కాకుండా ఉంటున్నాం, మనకు మనమే ఇది చేసుకుంటున్నాం. మనం అనుగ్రహానికి పాత్రులయ్యేలాగా మనల్ని సంసిద్ధం చేసుకోవడంలేదు.


 అలాంటి వారి జీవితంలో ప్రతీది శ్రమే. చదువుకోడం ఒక ప్రయాస, ఉపాధి కోసం పని చేయడం ఒక ప్రయాస, సరే వివాహం అనేది ఎంతో పెద్ద ప్రయాస. కాని మీరొకసారి ఈ అనుగ్రహానికి పాత్రులయ్యారంటే ప్రతీది ఎంతో సునాయాసంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది మీ యంత్రాన్ని చమురుతో నింపేస్తుంది.
 

Sanskrit helps in Memory power


The power of Prayer - A beautiful story

ఈశ్వర్ అనే ఒక ప్రఖ్యాత డాక్టర్, 
వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప అవార్డును అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు.
రెండూ గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.
కాన్‌ఫరెన్సుకు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒకా కారు అద్దెకు తీసుకుని ప్రయాణం కొనసాగించాడు. 
మళ్ళి కొంతసేపు అయిన తరువాత, విపరీతమైన గాలివాన, వర్షం . . .
దానితో ఈ వాతావరణంలో ముందుకు సాగలేకఆగిపోయాడు. 
 
భరించలేని ఆకలి, అలసట, వేళకు వెళ్ళలేకపోతున్నాను అనే చికాకులతో ఉన్నాడు ఆ డాక్టరు, కొంతదూరం ముందుకు వెళ్ళాక, అతనికి ఒక చిన్న ఇల్లు కనిపించింది. 
ఆ ఇంట్లోకి వెళ్ళి వారి ఫోను ఉపయోగించుకుందాము అనుకున్న ఆ డాక్టరుకు 
ఆ ఇంటి తలుపు తీసిన ఒక ముసలామె తన ఇంట్లో కరంటు, ఫోను సౌకర్యాలు లేవు అని, బాగా వర్షంలో తడిసిపోయినందున తన ఇంట్లో కొంత సేపు విశ్రాంతి తీసుకోమని, వెచ్చగా ఉండేందుకు టీ, కొంత ఆహారం తేబుల్ మీద పెట్టి తను పూజ చేసుకోవడానికి వెళ్ళింది.
ఆమె పక్కన ఉయ్యాలలో ఒక పసివాడు ఉన్నాడు. ఆమె గురించిన వివరాలు తెలుసుకుందామనుకున్నాడు
 కాని ఆమె పుజలొ వుంది.
ఆమె పూజ ముగించి వచ్చిన తరువాత, ఆమె మంచి మనసుకు ఆమె పుజలొ
చేసిన  విన్నపాలు అన్నీ ఆ భగవంతుడు వింటాడు అని భరోసా ఇచ్చాడు.
 
ఆ ముసలామె చిరునవ్వు నవ్వి, భగవంతుడు నేను కోరిన అన్ని కోరికలూ తీర్చాడు ఒక్కటి తప్ప, ఎందుకనో ఈ కోరిక మాత్రం తీర్చడం లేదు అని చెప్పింది.
ఆమెకు అభ్యంతరం లేకపోతే, ఆమెకు కల కోరిక ఏమిటో చెప్పమని, 
తాను సాధ్యమైనంత సహాయపడతానని చెప్పాదు వైద్యుడు. 
ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది.
"ఈ ఉయ్యాలలో ఉన్నవాడు నా మనుమడు. 
అతనికి ఒక అరుదైన క్యాన్సర్ వ్యాధి సోకింది. 
ఎంతో మంది వైద్యులకు చూపించాము. 
ఎవ్వరూ నయం చేయలేకపోయారు. 
ఒక్క ఈశ్వర్ అన్న ఆయన మాత్రమే ఈ వ్యాధి తగ్గించగలడు, 
ఆయన ఇక్కడికి చాలా దూరంలో ఉన్నాడు. 
అందుకే వైద్యం మీద ఆశ వదిలేసి, 
భగవత్ ప్రార్ధనలతో జీవితం గడిపేస్తున్నాను అని చెప్పింది.
 
వింటున్న డాక్టరు కళ్ళల్లో నీళ్ళు "భగవంతుడు  మీ ప్రార్ధనలు వినడమే కాదు, ఆ డాక్టరును మీ వద్దకే తీసుకువచ్చాడు కూడా. విమానం పాడయ్యి గాలివానలో చిక్కుకుని నేను మీ ఇంటికి వచ్చాను. 
కాదు కాదు ఈ పరిస్థితి సృష్టించి ఆయనే నన్ను మీ వద్దకు పంపాడు. 
ఆ డాక్టర్ ఈశ్వర్ ను నేనే." అని బదులిచ్చాడు.
అప్పుడు ఆ క్షణం అతను అందుకోవలసిన అవార్డు అతనికి గుర్తు రాలేదు.
 
పూజించండము లోని మహత్యం అదే. మనం వెళ్ళలేని చోటుకు కూడా దాని శక్తి వెళుతుంది. కావలసినది నమ్మకం అంతే.
1. ఆరాధించడం
2. విన్నవించడము
3. నమ్మడము
...ఇవే పూజించడానికి
 కావలసిన అంశాలు.
భగవంతుని నమ్మి మనం  ఆరాధించితె
మనకు కావలసినది ఆయన తప్పక మనకు లభింపచేస్తాడు

New year wishes


 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online