Pages

The benefits of chanting Govinda Nama

Good Morning Respected Friends.


Remember that  it is GOVINDA  , who always  remain deep inside  every Person's  body and caresses the animal nature of  him / her  .

All those who prepare themselves to remain every minute in Integral Yoga will quickly get that help from Govinda .

The Spiritual seekers repeatedly utter loudly GOVINDA... Govinda..
and ask all of us to do so .

Medical Scientists  observed that  the doors of SUSHMNA NADI opened whenever one utters  GOVINDA....

 
 
 

menustrual problems - some remedies

నెలసరి సమస్యలు:

నెలసరి మొదలైందంటే ఆడవారికి సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా అప్పుడే రజస్వల అయిన ఆడపిల్లలకు మరీ సమస్యగా ఉంటుంది. వారి ఆరోగ్యం పాడవుతుందనే టెన్షన్ ప్రతి తల్లికీ ఉంటుంది. అయితే  ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలో అంటూ అమ్మకు టెన్షన్. ఇకపై నెలనెలా రుతుస్రావం అవుతుంటుంది. అమ్మాయి రక్తం కోల్పోతూ ఉంటుంది. నెత్తురు రక్తాన్ని మళ్ళీ భర్తీ చేయలి కాబట్టి నెత్తురు రక్తాన్ని మళ్ళీ భర్తీ చేయలి కాబట్టి ఎప్పుడూ తినేదానికంటే ఎక్కువే తినిపించమంటారు వాళ్ళూ వీళ్ళూ. ఆ మాట ఎంతవరకూ నిజం? మరి అమ్మాయి సరిగా తినడం లేదే? ఏం చేయాలి. ఎటూ పాలుపోని ఈ పరిస్థితి నెలకొని సతమతమవుతుంటే ఈ కథనం చదవండి.
1. కొత్తగా రుతుస్రావం మొదలైన వారికి కొబ్బరి, బెల్లం పెట్టాలంటారు. సంప్రదాయకంగా పెద్దలు చెప్పే ఆ ఆహారం పెట్టినా పరవాలేదు. అయితే కొబ్బరిలోనూ, నువ్వుల్లోనూ కొవ్వు పాళ్లు ఎక్కువ కాబట్టి కాస్తంత పరిమితి పాటిస్తే మంచిది.
2. నెయ్యికి బదులు వెన్న వాడాలి. ఎందుకంటే వెన్న కాచి నెయ్యి చేశాక అందులో కొన్ని పోషకాలు తగ్గుతాయి. అందుకే ఒక స్టెప్ ముందుగానే వాటిని తీసుకుంటే కొవ్వులో జీర్ణమయ్యే విటమిన్లను ఒంటబట్టించుకునేందుకు వెన్న దోహదం చేస్తుంది.

ఎక్కువగా తీసుకోవాల్సిన పదార్థాలు

1. మీరు శాకాహారులైతే… మీ రోజువారీ ఆహారం తోపాటు తాజాగా ఉండే ఆకుపచ్చటి ఆకుకూరలు (గ్రీన్‌లీఫీ వెజిటబుల్స్), ఎండుఖర్జూరం, నువ్వులు, బెల్లం (బెల్లం, నువ్వులు ఉండే నువ్వుల జీళ్లు, బెల్లం, వేయించిన వేరుశనగలు ఉండే పల్లీపట్టీ కూడా మంచివే), గసగసాలు, అటుకులు ఎక్కువగా ఉండేలా చూడండి.
2. మీరు మాంసాహారులైతే… మీ రోజువారీ ఆహారాన్నే తీసుకోండి. దాంతోపాటు మీ ఆహారంలో వేటమాంసం, చేపలు, చికెన్‌తో పాటు… మాంసాహారంలో లివర్‌ను ప్రత్యేకంగా ఇవ్వండి.
3. అదే మాంసాహారులైనా, శాకాహారులైనా… కోడిగుడ్డు, పాలు తప్పనిసరిగా రోజూ ఇవ్వండి. కోడిగుడ్డులో పచ్చసొన వద్దనే అపోహను తొలగించుకుని, దాన్ని అమ్మాయికి తప్పక ఇవ్వండి. ఎందుకంటే ఈ వయసులో వారు అది తీసుకోవడం వల్ల పచ్చసొన కారణంగా వచ్చే హానికరమైన కొలెస్ట్రాల్ కంటే, ఒకవేళ వారు గుడ్డు తీసుకోకపోతే కోల్పోయే పోషకాలే ఎక్కువ.
4. మాంసాహారం, శాకాహారం ఈ రెండింటిలోనూ ఐరన్ ఉన్నప్పటికీ మాంసాహారంలో హీమ్ ఐరన్ ఉంటుంది. అంటే… అది తిన్నవెంటనే ఒంటికి పడుతుంది. అదే శాకాహార పదార్థాల్లోని నాన్ హీమ్ ఐరన్ మన ఒంటికి పట్టాలంటే, అదనంగా విటమిన్-సి కావాలి. కాబట్టి ఐరన్ ఉండే శాకాహార పదార్థాలతో పాటు విటమిన్-సి ఉండే తాజా పండ్లు… జామ, నిమ్మ, నారింజ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
5. రుతుస్రావం అవుతున్న సమయంలో ద్రవాహారం పుష్కలంగా లభించేలా ఎక్కువ నీళ్లు తాగుతూ, కొబ్బరినీళ్లు తీసుకోవడం కూడా మంచిదే.

పరిమితంగా మాత్రమే తీసుకోవలసిన పదార్థాలు:

1. ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు వంటివాటినీ, కొవ్వులు ఉండే ఆహారాలను పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
2. కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ చాలా పరిమితంగా తీసుకోవాలి.

అస్సలు తీసుకోకూడనివి పదార్థాలు:

బేకరీ ఐటమ్స్ అయిన చిప్స్, ఫ్రెంచ్‌ఫ్రైస్, బర్గర్లు, పిజ్జాల వంటి జంక్‌ఫుడ్‌తో పాటు కెఫిన్ పాళ్లు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు.
ప్రతినెలా రక్తం కోల్పోతుండటం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ తగ్గుతుంది. అందుకే రక్తహీనత రాకుండా ఐరన్‌ను భర్తీ చేయాల్సిన అవసరం ఉండటం వల్ల పై ఆహారాన్ని  తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తారు
  

A shloka similar to Kaaryeshu daasi but for Husbands

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...
పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం
చెప్పింది..కానీ ఎందుచేతో ఈ పద్యం జన
బాహుళ్యం లో లేదు
 
           కార్యేషు యోగీ, కరణేషు దక్షః
         రూపేచ కృష్ణః క్షమయా తు రామః
         భోజ్యేషు తృప్తః  సుఖదుఃఖ మిత్రం
         షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)
 
--> కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
--> కరణేషు దక్షః
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో  నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
--> రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే (ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు) ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.
--> క్షమయా తు రామః
ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
--> భోజ్యేషు తృప్తః
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
--> సుఖదుఃఖ మిత్రం
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే  పురుషుడు ఉత్తమ  పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు

మంగళ సూత్రం - విశిష్టత

తాళిబొట్టు / మాంగల్యం మన భారతీయ సంస్కృతి లో, వివాహ వ్యవస్థ లో మంగళ సూత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది .  అన్ని రాష్ట్రాల వారు ఒకే సంప్రదాయాన్ని పాటించక పోయినా మన హిందూ వివాహ వ్యవస్థ లో మాంగళ్య ధారణ అనేది అందరు పాటించే ఆచారం.

 కానీ ప్రస్తుతం మన దౌర్భాగ్య పరిస్తితి ఏమిటంటే మన హిందూ సోదరీమణులు నవీనత పరాకాష్ట కి వెళ్లి మంగళసూత్రాన్ని త్యజించడం. సినిమాలు టీవీ ల పుణ్యమా అని అది ఒక ఆట వస్తువుగా మారిపోయింది. ఎక్కువ శాతం కనిపిస్తున్న లేదా మన ఖర్మ కొద్దీ మన బంధు మిత్ర గణాల నుండి వచ్చే వాట్శాప్ లు ఫేస్బుక్ లలో వచ్చే ఫోటో లు అన్ని ఎక్కువ శాతం మంగళసూత్రాలు, బొట్టు, గాజులు లేకుండా ఉన్నవే. ఇది చాల అరిష్టం.

మంగళ సూత్రం - విశిష్టత

“మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మ్రింగుమనే సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో!”
పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవి గా ఉన్నడంటే అది ఆయన గొప్ప కాదట, అమ్మ పార్వతీ దేవి కంఠాన్న ఉన్న మాంగల్యాభరణం గొప్పదనమట.

“మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం”
ఓ! సుభగా నా జీవనానికి ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు అంటే పుణ్యస్త్రీగా ముత్తయిదువు గా జీవించు అని స్పష్టము గా తెలుస్తున్నది.

పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి. భారతావనిలో పిండారీలు, ధగ్గులు వంటి కిరాత జాతులవారు వలసవచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొనిపోయేవారు. మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడిందీ మంగళసూత్రం. అందుకే అప్పటినుండీ ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి మాంగల్యం వేసేవారు.

ఆదిశంకరాచార్యుల వారు తను వ్రాసిన సౌందర్యలహరి పుస్తకములో కూడా మంగళ సూత్రానికి విశేష విశిష్టత కల్పించారు.
మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకు అంటే ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్యదాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భదారణ, ప్రసవములకు కారకుడు.

పగడం కుజగ్రహనికి ప్రతీక. కుజ గ్రహ దోషాల వలన అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషములు మొదలగునవి.

ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27, ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజున
 కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం, అర్ధం ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనమవాలి.


భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది, అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాతతరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం, కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగటం సర్వసాధారణమైపోయింది. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంటగ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనటం ఎటువంటి సందేహం వలదు.

కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం రెండూకూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంతశుభఫలితాలు సమకూర్చగలవు.
పాశ్చాత్య, అనుకరణ వెర్రి లో ఊగుతున్న మన ఆడ కూతర్లను మందలించైనా తిరిగి మన ధర్మం వైపు తీసుకుని వద్దాం. దీని విశిష్టతని అర్ధం అయ్యే వరకు తెలియపరుద్దాం.

వ్యక్తపరిచిన విషయాలు పాటెల్ నారాయణ రెడ్డి గారు రాసిన ఆచారాలు సంప్రదాయాలు, కంచి పరమాచార్య పధం పుస్తకాల నుండి కొంత  గ్రహించి రాసినవి.


 

some very interesting things about India

Dear Friends, one of my friends shared this in our whatsapp group.  They r interesting.  Read them n know some things about our country.


Indian అనే ప్రతి ఒక్కరు చదవాల్సిందే

900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి


మరీ భారత దేశం వయసు ఎంత?

ప్రపంచంలో  ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు  అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం

ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే

 వైదిక  సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి"  కూడా నేడు లేదు. కేవలం " పైన పిరమిడ్-కింద మమ్మీలు  " మిగిలాయి
విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు
ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు

 ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు

ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
 "నా దేశం-భారత దేశం"

ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.
మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
 "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"


ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది
రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది

మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు
ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...


 "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం

 మరీ దేశభక్తుల విషయం...
1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !


మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
 ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
 ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి


ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని  విమర్శిస్తారు.
జై భారత్.




 

The meaning of Hare Rama Hare Krishna Mantra

*హరే కృష్ణ మంత్రమునకు భాష్యము


ఈ దివ్య శబ్దము యొక్క ఉచ్ఛారణ *హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే.


మన కృష్ణ చైతన్యమును పునరుద్ధరించు కొనుటకు గల అద్భుతమైన పద్ధతి, సులభ మార్గము. జీవాత్మల మగుట చేత నిజానికి మన మందరమూ కృష్ణ చైతన్యము కలవారమే, కానీ అనాది కాలంగా ఈ భౌతిక పదార్థంతో గల సాంగత్యం వలన, మన చైతన్యం ఇప్పుడు భౌతిక వాతావరణం చేత కలుషిత మైనది. ఇటువంటి కలుషితమైన జీవన విధానంలో మనమందరమూ భౌతిక పకృతి యొక్క సంపదను స్వార్థ ప్రయోజనాల కొరకు ఉపయోగించుకొనుటకు ప్రయత్నిస్తున్నాము, కానీ నిజానికి మనం మరింతగా భౌతిక ప్రకృతి యొక్క ఉచ్చులో చిక్కుకుపోతున్నాము. ఈ భ్రమను మాయ అని పిలుస్తారు లేదా ఉనికి కోసము చాల కష్ట పడటము, భౌతిక ప్రకృతి యొక్క కఠిన నియమాల కోరల్లో చిక్కుకుని ఉన్నప్పటికినీ మనమందరం ఈ భౌతిక పకృతిపై ఆధిపత్యం చెలాయించాలని అనుకొనుట. భౌతిక ప్రకృతిపై మనం చేస్తున్న ఈ మిథ్యా ప్రయత్నము ఒక్కసారిగా ఆగిపోవును మన కృష్ణ చైతన్యమును పునరుద్ధరించుకోవడం ద్వారా.కృష్ణచైతన్యము మనస్సుపై విధించబడే కృత్రిమ మార్గము కాదు.


 ఈ చైతన్యం అనేది జీవాత్మ యొక్క సహజ శక్తి. మనము ఈ దివ్య శబ్దమును శ్రద్ధగా వినినప్పుడే ఈ చైతన్యము పునరుద్ధరించబడుతుంది. ఈ యుగమునకు ఈ పద్ధతి ప్రామాణికులచే సూచించబడినది. ఆచరణాత్మక అనుభవం ద్వారా, మనము ఈ మహా మంత్రాన్ని ఉచ్చరించుట ద్వారా మనము తెలుసుకొనవచ్చు, లేదా ఈ మహా విముక్తి మంత్రమును ఉచ్చరించి తద్వారా స్వయముగా ఆధ్యాత్మిక జగత్తు నుండి వచ్చు దివ్యానంద పారవశ్యమును పొందవచ్చును. ఒక వ్యక్తి వాస్తవానికి ఆధ్యాత్మిక అవగాహన స్థితిలో ఉన్నప్పుడు. ఇది దిగువ స్థాయి ఇంద్రియ, మానసిక ,బుద్ధి మరియు అహంకార స్థితులను అధిగమించి, వారు ఆధ్యాత్మిక సహజానంద స్థితిలో నిలిచిపోతారు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఈ దివ్య ఉచ్ఛారణ, నేరుగా ఆధ్యాత్మిక స్థితి నుండే జరుపబడును. అది ఇంద్రియాలకు, మానసిక మరియు బుద్ధికి సంబంధించిన అన్ని తక్కువ స్థితి చైతన్యాలను అధిగమించును. మంత్రం యొక్క అర్థమును తెలుసుకోవలసిన అవసరం లేదు, మానసిక కల్పనలను చేయనవసరం లేదు.


 ఈ మహా మంత్రాన్ని కీర్తన జపము చేయడం కోసం బుద్ధి సంబంధమైన ఇతర సర్దుబాట్లను చేసుకోవలసిన అవసరం లేదు. ఇది సహజముగా ఆధ్యాత్మిక స్థితి నుండి ఉద్భవించింది మరియు ఎవరైనా ఆధ్యాత్మిక శబ్ద కీర్తనలో పాల్గొనవచ్చును ఏ మునుపటి అర్హత లేకుండా,ఈ కీర్తనలో పారవశ్యంతో నృత్యం చేయ వచ్చును
మనము ఆచరణాత్మకంగా చూశాము. ఒక పిల్లవాడు కూడా ఈ కీర్తనలో పాల్గొనవచ్చును ఇలా ఒక కుక్క కూడా పాల్గొన వచ్చును ఈ మహా మంత్రము భగవత్ ప్రేమ కలిగిన శుద్ధ భక్తుడు ఉచ్ఛరించినప్పుడు అప్పుడు వెంటనే ప్రభావం పొందవచ్చును అలాగే వీలైనంత వరకూ అభక్తుని నోటి నుండి ఈ మహా మంత్రమును వినరాదు అది సర్పం యొక్క పెదవులతో తాకబడిన పాలవలే విష ప్రభావమును కలిగి ఉండును.
హరా అను పదము భగవంతుని అంతరంగ శక్తికి సంబోధిస్తుంది. కృష్ణ మరియు రామ పదములు భగవంతుని నేరుగా సంబోధిస్తుస్తున్నాయి కృష్ణ లేదా రామ అనగా పరమానందము శాశ్వతమైన, హరా అనగా భగవంతుని యొక్క మహోన్నతమైన ఆనంద శక్తి. ఈ శక్తిని, హరే అని సంభోధించినప్పుడు మనకు భగవంతుని చేరుకొనుటకు సహాయపడును


మాయ అనబడు భౌతిక శక్తి కూడా భగవంతుని విభిన్న శక్తులలో ఒకటి మనము కూడా భగవంతుని యొక్క తటస్థ శక్తికి చెందిన వారము. జీవాత్మలు భౌతిక శక్తి కంటే ఉన్నతమైనవిగా వర్ణించబడినవి ఎప్పుడైతే ఉన్నత శక్తి అధమ శక్తి సాంగత్యం లోకి వస్తుందో అప్పుడు అసంగత పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఉన్నతమైన తటస్థ శక్తి, ఆధ్యాత్మిక ఉన్నత శక్తి హరా తో సంబంధమును ఏర్పరచుకున్నచో జీవాత్మ సహజ ఆనందమయ స్థితిలో నెలకొనును


హరా, కృష్ణ మరియు రామ మూడు పదములు ఆధ్యాత్మిక బీజములు మంత్రోచ్ఛారణ అనేది ఆధ్యాత్మిక పిలుపు వంటిది భగవంతుని మరియు అతని అంతరంగిక శక్తి, హరా కోసం బద్ధజీవాత్మకు రక్షణ కల్పించటం కోసcc ం ఈ జపము తల్లి కొరకు బిడ్డ చేయు సహజ రోదన వంటిది తల్లి హరా తండ్రి హరి లేదా శ్రీకృష్ణుని కృపను పొందుటకు భక్తునికి సహాయం చేయను నిజమైన భక్తునికి భగవంతుడే స్వయంగా ప్రకటిత మగును.
ఆత్మ సాక్షాత్కారానికి ఈ యుగంలో దీనికి మించిన మరొక మార్గం ప్రభావవంతముగా లేదు మహా మంత్ర ఉచ్ఛారణ వలె


*హరే కృష్ణ హరే కృష్ణకృష్ణ కృష్ణ హరే హరేహరే రామ హరే రామరామ రామ హరే హరే



 


 






















 

New Year Wishes

WISH U ALL A HAPPY N PROSPEROUS NEW YEAR

MAY THE NEW YEAR BRING ALONG

HAPPINESS N GLAD TIDINGS

THAT U CHERISH LIFELONG.
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online