Pages

a small story from Maha Bharata


A very intelligent act by a Monkey



Friends, we all know how God created this Universe.  God gave all the qualities to survive in this world to all the species.  U will be amazed after watching this video, how a monkey used its brain to save another monkey when that one got an electric shock.  Just watch this video. 

Women in Vedas

వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేఛ్ఛనివ్వలేదని చాలా ఆరోపణలు చేస్తుంటారు. విద్యార్ధుల పాఠశాల చదువుల్లో, ఐఏఎస్ అభ్యర్ధులకు, ఇతర ఉద్యోగార్ధులకు నిర్వహించే పరీక్షల్లో ఉండే చరిత్రలో కూడా ఇదే వాదన కనిపిస్తుంది. ఇక తమను తాము సంఘ సంస్కర్తలమనీ, అభ్యుదయవాదులమని చెప్పుకునే కొందరు కుహనా మేధావులు ఈ విషయంలో వైదిక సంస్కృతిపై దుమ్మెత్తిపోస్తుంటారు. అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం.


*స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి - యజుర్వేదం 10.03*
*స్త్రీలు మంచి కీర్తి గడించాలి - అధర్వణవేదం 14.1.20*
*స్త్రీలు పండితులవ్వాలి - అధర్వణవేదం 11.5.18 (స్త్రీలు కూడా విద్యాబోధన చేయాలని చెప్తోంది)*
*స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి - అధర్వణవేదం 14.2.74*
*స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి - అధర్వణవేదం 7.47.2*
*స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి - అధర్వణవేదం 7.47.1*


*పరిపాలన విషయంలో స్త్రీలు*

పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గినాలి - *అధర్వణవేదం 7.38.4*
దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి-  *ఋగ్వేదం 10.85.46*
ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు. కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది.
ఆస్తిహక్కు
 పిత్రార్జితం (తండ్రి కూడబెట్టిన ఆస్తి) లో కుమారుడితో కుమార్తెకు కూడా సమానమైన హక్కు ఉంది-
*ఋగ్వేదం 3.31.1*

కుటుంబం
 సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి- *అధర్వణవేదం
14.1.20*

స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదై ఉండాలి- *అధర్వణవేదం 11.1.17*
 (స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే ఆమె కుటుంబానికి సంపదను చేకూర్చగలుగుతుంది)
నీ భర్తకు సంపాదించే మార్గాలు నేర్పించు- *అధర్వణవేదం 7.46.3*


ఉద్యోగాల్లో

*స్త్రీలు కూడా రధాలను నడపాలి- అధర్వణవేదం 9.9.2*
*స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి-యజుర్వేదం 16.44*(ఈ విషయంలో దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం.
స్త్రీలు బయటకు రాకూడదని వైదిక ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ వేదం స్త్రీలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందిగా చెప్పింది. కైకేయి దీనికి ఉదాహరణ కదా!
 (శ్రీ రామాయణంలో కైకేయి అడిగిన వరం వల్లనే రాముడు వనవాసానికి వెళతాడు. దశరధుడితో కలిసి శత్రువులపై యుద్ధం చేసిన సమయంలో, ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం కోరుకోమనగా, సమయం వచ్చినపుడు అడుగుతానంటుంది. ఇతిహాసంలో అదే పెద్ద ఉదాహరణ).

కమాండర్ తరహాలో స్త్రీ సభలను ఉద్ద్యేశించి ప్రసంగించాలి-
*ఋగ్వేదం 10.85.26*



విద్యా విషయాల్లో

 ఓ స్త్రీలారా! పురుషులతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. మీ భావాల్లో సామరస్యం ఉండుగాక!  మీరు ఎటువంటి వివక్ష చూపక, అందరికి జ్ఞానాన్ని పంచుదురుగాక! మీ మనసు, చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. నేను (ఋషి) పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక, వీటిని అర్థం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను-
*ఋగ్వేదం 10-191-3*
వేదాల్లోనే మైత్రేయి, గార్గి, లోపాముద్ర వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి చెప్ప బడింది.


*వివాహం -విద్యాభ్యాసం*


ఓ వధువా! (వధువు అంటే పెళ్ళికూతురు) వైదికజ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తరువాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తి గడించి, నీకు భర్తకు శుభాలను కలుగచేసేదానివిగా ఉండు. నీ అత్తవారింట్లో గౌరవప్రదమైన జీవితం గడుపు, నీ జ్ఞానంతో వారి ఇంటిని వృద్ధిపరుచు - *అధర్వణవేదం 14-1-64* (ముందు విద్యను పొందండి, ఆ తర్వాతే వివాహం చేసుకోండని స్త్రీలకు ఈ మంత్రంలో భగవంతుడు నిర్దేశించాడు).

Astronamical secrets in Sri Vishnu Puraana

విష్ణుపురాణ అంతర్గత ఖగోళ రహస్యాలు
 
 
విష్ణుపురాణం సూర్య మండలం గురించి కొంత వివరంగా చెబుతుంది. చాలా క్రిప్టిక్ (నిగూఢo) గా ఆ వివరణ వుంటుంది.
సూర్యుడు ఒక ఏడు గుర్రాలు పూన్చిన రధం ఎక్కి మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని, ఆ రధానికి రెండు ఇరుసులు ఉంటాయని, ఒక ఇరుసు 157 కోట్ల యోజనాల దూరం ఉంటుందని ఆ ఇరుసుకు మనకు సంబంధించిన కాల చక్రం బిగించబడి ఉంటుందని, ఆ చక్రానికి మూడు నాభులు ఉన్నాయని 12 అంచులు ఉన్నాయని, ఆ చక్రానికి 6 కడకమ్మలు ఉన్నాయని చెబుతుంది. సూర్యుడు ఎప్పుడూ మేరు పర్వతానికి దక్షిణం వైపుగానే ఉంటాడని చెబుతుంది.
 
 
ఒకసారి  దీనిమీద మరింత లోతుగా చర్చిద్దాము.
 
అసలు సూర్యుడు ఏమిటి రధం ఎక్కడం ఏమిటి? నేటి సాంకేతికత పరంగా పురాణం చెబుతోందా? దీని మీద ఋషులు ఎన్నడో వివరణ ఇచ్చారు. మిగిలిన మతాలు, శాస్త్రజ్ఞులు కనుగొనక మునుపు నుండే మనం మనం నివసిస్తున్న ధరను భూగోళం అని వ్యవహరిస్తున్నాం. భూమి గోళాకారంలో ఉందని వేదం చెబుతోంది. దానికి ఉదాహరణకు ఒక్కసారి వరాహ అవతార విగ్రహాలను పరికించండి. కొన్ని వేల ఏళ్ళ క్రితం నుండి శిల్పశాస్త్రంలో ఈ విషయమై చూపుతారు. వరాహ స్వామీ కోర మీద భూమి ఒక గోళంగా చిత్రిస్తారు. ఇది ఎవడో ఒక్కసారి మేలుకుని నెత్తిమీద ఒక పండుదెబ్బతో తెలిసినది కాదు. మనకు ఎన్నటినుండో తెలిసి ఉన్న పరమ సత్యం. అంతేకాక సప్తద్వీపా వసుంధరా అని సంబోదిస్తాము. సప్త ద్వీపములు ఉన్నాయని సప్త మహా సముద్రాలు  ఉన్నాయని మనకు ఉగ్గుతో నేర్పిన సత్యము.
 
 
మనం ఉదాహరణకు ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నాము అనుకోండి. ఒక ఊరికి దగ్గర పడ్డప్పుడు ఆ ఊరొచ్చింది, ఆ ఊరు వెళ్ళిపోయింది అని అంటాము. వాస్తవానికి ఆ ఊరు ఎక్కడకీ పోదు, రాదు. కేవలం మనం ప్రయాణం చేస్తున్నప్పుడు relative (సంబంధిత) గమనాన్నే చెబుతాము. మనకు తెలుసు శాస్త్రాదారంతో సూర్యుడు అక్కడే ఉంటాడు అని. నక్షత్రాలు అక్కడే ఉంటాయని, కానీ మనకు సమయం లెక్క కట్టడానికి వ్యవహార పరంగా సౌర్య మానం, చంద్ర మానం, సాయణం, నక్షత్రమానం గా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. భూమి తన పైనున్న ఆకాశంలో నక్షత్ర మండలాల పరిధులలో సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది. కానీ ఆ చేసే ప్రదక్షిణం ఒక 23.5 డిగ్రీల కోణంలో చేస్తుంది, అందువలననే మనకు దక్షిణాయానం, ఉత్తరాయణం లో వివిధ రకాలుగా దివారాత్రాలు ఉంటాయి.
 
 
 ఇక్కడ ఉన్న బొమ్మను చూడండి. ఒక cone (శృంగం) న్ని ఒక కోణంలో కత్తిరించినట్టు అయితే ఒక దీర్ఘవృత్తము (ellipse) వస్తుంది. ఆ కోణం యొక్క కోనను మనం ధ్రువపదం అని చెబుతాము. ఆ ధ్రువపదం మనకు రిఫరెన్స్ అన్నమాట. ఆ ధ్రువ పదానికి ఎప్పుడూ దక్షిణంలోనే సూర్యుడు ఉంటాడు. భూమి కూడా సూర్యునికి దీర్ఘ వృత్త మార్గంలోనే ప్రదక్షిణం చేస్తుంది. అందుకే మన భూమి ఒకసారి సూర్యునికి దగ్గరగా, ఒకసారి అత్యంత దూరంగా ప్రయాణం చేస్తుంది. పైన ఉన్న నక్షత్ర మండలం స్థిరంగా ఉంది అని మనం అనుకున్నప్పుడు భూమి ఆయా నక్షత్ర మండల పరిధులలో తిరుగుతుంది. ఆ మండలాన్ని మన ఋషులు 12 భాగాలుగా విభజించారు. ఇప్పుడు మనం భూమిని స్థిరంగా అనుకుని మిగిలినవన్నీ relative గా లెక్క కట్టినట్టు అయితే సూర్యుడు తిరుగుతాడు, పగలు ఉదయిస్తాడు, రాత్రికి అస్తమిస్తాడు. లెక్క కట్టడానికి మనకు సులువు, అందుకే మొట్ట మొదటి relativity గురించి ప్రస్తావన మన జ్యోతిష్య శాస్త్రమే చెబుతుంది.
 
 
 
ఇప్పుడు నిన్న 157 కోట్ల యోజనాలు సూర్యునికి భూమికి ఉన్న దూరం అని చెప్పుకున్నాము. అదే మనం గణించే కాల చక్రానికి ఆధారం. మూడు నాభులు పగలు, సాయం, నిశ(రాత్రి) కి సంకేతాలు, 6 కడకమ్మలు ఆరు ఋతువులకు నిగూఢనిరూపణ అయితే 12 అంచులు పన్నెండు నెలలకు సంకేతార్ధాలు. ఇదే కాక సూర్యుని రధం 36 లక్షల యోజనాల పొడవు అని చెబుతుంది.  అలాగే సూర్యుని ఒక ఇరుసుకు నాలుగు గుర్రాలు, మరొక దానికి 3 గుర్రాలు కట్టబద్దాయని, రెండవ ఇరుసు 145 కోట్ల యోజనాలు అని చెబుతుంది. ఒక ellipse కు రెండు focal పాయింట్స్ ఉంటాయి. అవి రెండు ఒకే విలువ వుంటే అది ఒక సర్కిల్ అవుతుంది. ఇక్కడ సూర్యునికి అతి దగ్గరగా వెళ్ళినప్పుడు 147 మిలియన్ కిలోమీటర్లు దూరం ఉంటుంది, దూరంగా వెళ్ళినప్పుడు 152 మిలియన్ కిలోమీటర్లు   దూరం. దానికి focal పాయింట్ గణిస్తే sqrt(a**2 – b**2) ఫార్ములా ప్రకారం అది సరిగ్గా 36 మిలియన్ కిలోమీటర్లు, సరిగ్గా వేదం చెప్పిన సూర్యుని రధం పొడవుకు సమానంగా.  సూర్యునికి, భూమికి ఉన్న దూరం 149.6million kms. ఈ దూరాన్ని  సూర్యుని చుట్టుకొలత 1391000kms  తో భాగిస్తే వచ్చే సంఖ్యా రమారమి 108 అలాగే చంద్రునికి, భూమికి ఉన్న దూరం 38లక్షల కిలోమీటర్లను చంద్రుని చుట్టుకొలత అయిన 3474 kms తో భాగిస్తే వచ్చే సంఖ్య 108. చంద్రుని చుట్టుకొలత తెలియకుండా ఈ calculations చేసారు అని బుర్రలో గుజ్జున్నవాడెవ్వడూ వాదించడు.
 
 
కాబట్టి relative స్పీడ్ ఆధారంగా మనకు సూర్యుడు సప్తాశ్వరాధ -ఏడు గుర్రాల (VIBGYOR – ఏడు రంగుల )  రధం మీద మేరువుకు ప్రదక్షిణగా తిరుగుతాడు అని చెబుతారు. చూసే దృష్టి మార్చి చూస్తె మనకు వారు చెప్పిన పరమ సత్యాలు బోధపడతాయి. నేడు మనం కాంతి సంవత్సరం పరంగా గణిస్తున్నాము , మనం మాట్లాడే అంకెలు మారతాయి కానీ ఆ అంకెల ఆవల ఉన్న సత్యం, లోకం మారదుగా.

 !! సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు !!

A rare video of Sri Venkateswara Swami



కలియుగ దైవం ప్రత్యక్ష రూపం మీ కోసం.
బ్రటీష్ వారు తీసిన మొట్ట మొదటి వీడియో ఇది
ఈ వీడియో తర్వాత మళ్ళీ ఎవరూ తియ్యలేదు
చాలా అరుదైన వీడియో ఇది
తప్పక మీరు చూసి
మీ మిత్రులకు ఆ దైవ దర్శణ బాగ్యం కల్పించండి

Sri Datta Avataaram

[02/12, 19:38] Dr.Mmk: *మార్గశిర పౌర్ణమి దత్త జయంతి*


పరమాత్మ ఒక్కో సమయంలో ఒక్కో అవతారంలో వచ్చి ప్రజల్ని ఉద్ధరిస్తాడు. ధర్మావతారాల్లో…రాముడిగా, కృష్ణుడిగా రాక్షస సంహారం ద్వారా ధర్మసంస్థాపన జరిపిన నారాయణుడే…దత్తాత్రేయుడి అవతారంలో సమర్థ గురువుగా జ్ఞానప్రబోధ చేశాడు .
**దత్తాత్రేయుడు శ్రీమన్నారాయణుడి ఆరో అవతారమని భాగవతమూ, విష్ణుపురాణమూ ఘోషిస్తున్నాయి. అత్రి మహర్షి, అనసూయ దంపతుల తనయుడిగా జన్మించాడు బాలదత్తుడు. ఆ దంపతులు ఓంకారాన్ని ధ్యానిస్తూ మహాతపస్సు చేశారు. ఆ సాధనకు మెచ్చి ఓ దివ్య తేజస్సు ప్రత్యక్షమైంది. ఆ కాంతిపుంజంలో త్రిమూర్తులు దర్శనమిచ్చారు. ఆ ముగ్గురు మూర్తుల అంశగా దత్తుడు వారికి జన్మించాడు. అత్రి…అంటే త్రిగుణాతీత స్థితికి చేరుకున్నవాడని అర్థం. అతడి అర్ధాంగి అనసూయ…అసూయలేనిది. నిజానికి ఇవి పేర్లు కాదు…ఆ ఆలూమగల సుగుణాలు. ఆ సద్గుణ సంపన్నుల బిడ్డగా జన్మించాడు దత్తుడు. దత్తం..అంటే సమర్పించుకోవడం. దత్తుడు జ్ఞానబోధ కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు. అత్రిపుత్రుడు కాబట్టి ఆత్రేయుడన్న పేరూ వచ్చింది.



దత్తుడిది జ్ఞానావతారం! పిచ్చివాడిలానో, వ్యసనపరుడిలానో కనిపించి…పైపై మెరుగులకు భ్రమపడిపోయే అజ్ఞానులకు బుద్ధిచెప్పిన ఉదంతాలు అనేకం. దేవతలకు కూడా చేతిలో కల్లుముంతతో, ఒడిలో ప్రియురాలితో దర్శనమిచ్చాడోసారి. అది సుర కాదు, బ్రహ్మజ్ఞానం. ఆమె శ్రీలక్ష్మి. దత్తుడు ఓపట్టాన అర్థం కాడు. దత్తతత్వాన్ని తెలుసుకోవాలంటే అహాన్ని వదిలిపెట్టాలి. శరణాగతి సూత్రాన్ని పాటించాలి.



**అసుర సంహారం…

పూర్వం జంభాసురుడనే రాక్షసుడు ప్రజల్ని హింసించేవాడు. దీంతో దేవతలంతా…విష్ణు స్వరూపుడైన దత్తాత్రేయుడిని ప్రార్థించారు. ‘ఆ రాక్షసుడిని నా దగ్గరికి తీసుకురండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను’ అని మాటిచ్చాడు. దీంతో దేవతలు జంభాసురుడి మీద కయ్యానికి కాలుదువ్వుతున్నట్టు నటించారు. ఆ అసురుడికి కోపం తన్నుకొచ్చింది. ‘ఇంతకుముందే చావుదెబ్బ తీశాను. అంతలోనే ఇంత ధైర్యం ఏమిటి?’ అంటూ కోపంగా మళ్లీ రంగంలో దూకాడు. దేవతలు ఉద్దేశపూర్వకంగా వెన్నుచూపారు. జంభాసురుడు వాళ్లను తరుముతూ వెళ్లాడు. దత్తుడి సమక్షంలోకి వెళ్లగానే ఠక్కున మాయమైపోయింది దేవగణమంతా. ఎదురుగా…ఒడిలో అందాల రాశితో, మహాభోగిలా దర్శనమిచ్చాడు దత్తాత్రేయుడు. జంభాసురుడి కళ్లు ఆ సౌందర్యరాశి మీదికి మళ్లాయి. ఆమె శ్రీమహాలక్ష్మి అన్న ఇంగితం కూడా లేకుండా… బలవంతంగా తీసుకెళ్లి నెత్తిమీద పెట్టుకున్నాడు. సంపద నెత్తికెక్కిందంటే, పతనం మొదలైనట్టే. జంభాసురుడి బలం క్షీణించసాగింది. దేవతల పని సులువైపోయింది. అసుర సంహారం జరిగిపోయింది.



 **ప్రహ్లాద వరదుడు…


అనేక సంవత్సరాల రాజ్యపాలన తర్వాత…జ్ఞానాన్వేషణలో ప్రహ్లాదుడు అరణ్యమార్గం పట్టాడు. అక్కడ, అజగరవృత్తిలో ఓ వ్యక్తి కనిపించాడు. అజగరం అంటే…కొండచిలువ! ఆ విషప్రాణికో ప్రత్యేకత ఉంది. కొండచిలువ ఆహారం కోసం వేటకు వెళ్లదు. తాను ఉన్నచోటికి ఆహారం వస్తే మాత్రం…గుటుక్కున మింగి కడుపు నింపుకుంటుంది. లేకపోతే ఉపవాసమే. సాధకులు కూడా…ఆహారపానీయాల విషయంలో ఇలాంటి నిర్మోహత్వాన్నే అనుసరిస్తారు. పిచ్చివాడిలా కనిపిస్తున్న ఆ మనిషే దత్తుడని ప్రహ్లాదుడు గ్రహించాడు. ‘జై గురుదత్తా…’ అంటూ పాదాల మీద పడ్డాడు. ఆ మహాగురువు కరుణించి జ్ఞానమార్గాన్ని బోధించాడు. వివిధ సందర్భాల్లో… కార్తవీర్యార్జునుడికీ, పరశురాముడికీ, యదువంశ మూలపురుషుడు యదువుకూ…ఇలా ఎంతోమందికి జ్ఞానాన్ని బోధించాడు దత్తగురుడు. యోగిరాజ వల్లభుడు, జ్ఞానసాగరుడు, సంస్కారహీన శివురూపుడు…ఇలా భిన్నరూపాలలో కనిపించి భక్తులకు దివ్యప్రబోధ చేశాడు. మహారాష్ట్రలోని మహుర్‌ సుప్రసిద్ధ దత్తక్షేత్రం. దత్తుడు కాశీలో స్నానంచేసి, కొల్హాపూర్‌లో భిక్ష స్వీకరించి, మహుర్‌లో నిద్రించేవాడని అంటారు. శ్రీపాద శ్రీవల్లభుడు (పిఠాపురం), నరసింహ సరస్వతి (మహారాష్ట్ర), అక్కల్‌కోట మహరాజ్‌ (అక్కల్‌), షిర్డీసాయి (షిర్డీ) దత్తుని అవతారాలని చెబుతారు. దత్తుడు స్మృతిగామి…తలచిన వెంటనే భక్తుల హృదయాల్లో ప్రత్యక్షమైపోతాడని సాధకుల విశ్వాసం.



మార్గశిర పౌర్ణమినాడు దత్తుడు ఉదయించాడు. అదే దత్తజయంతి. దత్తుడి రూపం అపురూపం. ఆరు చేతులూ, మూడు తలలూ, చేతిలో డమరుకమూ, త్రిశూలమూ…తదితర ఆయుధాలుంటాయి. చుట్టూ కుక్కలు ఉంటాయి. ఆ శునకాలు వేదానికి ప్రతీకలు. ఆయన వెనకాల కనిపించే గోవు…ఉపనిషత్తుల సారం. దత్తజయంతినాడు ఆస్తికులు…జపతపాలతో, పూజలతో గడుపుతారు. పగలంతా ఉపవాసం చేసి, సాయంత్రం భజనలూ సత్సంగాలూ నిర్వహించుకుంటారు. దత్తచరిత్ర, అవధూత గీత తదితర గ్రంథాల్ని పారాయణ చేస్తారు. ఒకానొక సమయంలో దత్త సంప్రదాయం తెలుగు గడ్డ మీద వెలుగులీనింది. దత్తుడి అవతారమని భావించే శ్రీపాద శ్రీవల్లభుడు ఆంధ్రదేశంలోని పిఠాపురంలో జన్మించాడు. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని కురుపురంలో ఆశ్రమజీవితం గడిపాడు. అక్కడి కృష్ణాతీరంలో ఓ ఆలయాన్ని నిర్మించారు భక్తులు. నేపాల్‌ తదితర ప్రాంతాల్లోనూ దత్తక్షేత్రాలున్నాయి.
 

Sri Datta Jayanthi

రేపు అనగా ఆదివారం, 03.12.17 రోజున దత్త జయంతి...!!


   త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడిగా దత్తాత్రేయ స్వామి ని గుర్తిస్తున్నారు. దత్తా అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయింది. ఉత్తరాది సాంప్రదాయంలో, దత్తాత్రేయను ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా, మరియు నాథ యొక్క అధినాథ్ సంప్రదాయానికి సంబంధించిన ఆది-గురువుగా గుర్తిస్తున్నారు.


దత్తాత్రేయ మొట్టమొదటిలో యోగదేవుడుగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ, తర్వాత అతడు మరింత భక్తి కి సంబంధించిన వైష్ణవ పూజావిధానాలను పుణికి పుచ్చుకుని, సంలీనమయ్యాడు; ఇతడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే, భారతీయ చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువగా కృపాస్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు. దత్తాత్రేయుడు త్రిపుర రహస్య గ్రంథకర్తగా పేరు పొందాడు, అద్వైత వేదాంతాన్ని విశదీకరించిన ఈ గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేశాడు. మసక చీకటిలో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాము. కాని తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి, భయము తోలుగుతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మా ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖము కల్గుతాయి. ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవమవుతుంది. అపుడు భయానికి, దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది. అంటే ఈ జగత్తు మిధ్యయని తేలిపోతుంది.


సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్త్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయ పూర్వక నమస్కారము. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్త్వాన్ని బోధించడానికి అత్రైమహాముని పుత్రుడై జన్మించి, శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు, యదువు మొ||న వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్దరించాడు. ఆయననే మరల శ్రీ పాదవల్లభుడుగాను, తరువాత శ్రీ నృసింహసరస్వతియనే పేరుతోనూ అవతరించి, తన శిష్యులైన సిద్దాదులనుద్దరించాడు.


పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనేరాజు నిరంతరము హరి చింతన, అతిథి సేవలతోపాటు నిష్టతో ఏకాదశి వ్రతము ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశీ తిథి ఒక్క ఘడియ మాత్రమె ఉండగా. దుర్వాస మహర్షి, శిష్యప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు. అంబరీషుడు ఆయనను పూజించి, త్వరగా అనుష్టానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్ధించాడు.


అపుడా మహర్షి, స్నానానికి నదికి వెళ్లి పారణ సమయం మీరిపోతున్నాగాని రాకుండా ఆలస్యం చేయసాగారు. తిథిమించి పొతే అంబరీషునికి వ్రతభంగమవుతుంది. అలాగని అతడు భోజనం చేస్తే, అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది. అందుకని అతడు ఆ రెండింటిని పరిరక్షించుకోదలచి ,కొద్దిగ తీర్థం మాత్రం త్రాగాడు. ఇంతలో దుర్వాసుడోచ్చి కోపించి, ‘రాజా, నీవు నానాయోనులలో జన్మింతువు గాక!’ అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణువేడాడు.


అపుడాయన సాక్షాత్కరించి దుర్వాసునితో,’మహర్షీ, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతనిని రక్షించడం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్దం కాకూడదు కనుక, ఆ శాపాన్ని నాకు వర్తిమ్పాజేయి’ అన్నారు. అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దుర్వాషుడుసరే అన్నాడు. స్వామీ అంతా మీ అభీష్టం ప్రకారమే కానీ అన్నాడు. ఆ విధంగా శ్రీహరి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు.


దత్తాత్రేయుని జననం

దేవహుతి మరియు కర్ధముని కుమార్తె అనసూయ . అనసూయాదేవి అత్రిమహర్షికి భార్యయై, మహా పతివ్రతగా ప్రసిద్దికెక్కింది.
ఒకసారి త్రిలోక సంచారియైన నారదమహర్షి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసాలకు వెళ్లి, అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి యెంతగానో ప్రశంశించాడు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు అసూయచెంది, ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్భందించారు. అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయదేవి వారికి యెదురేగి స్వాగతం చెప్పి, ఆర్ఘ్య – పాదాదులు సమర్పించి, మీకు నేనేమి చేయాలో సెలవియ్యండి, స్వామి , నాభర్త అత్రి మహర్షి తపస్సుకోసం అరణ్యంలోకి వెళ్లారు.


అపుడు అతిథులు ‘అమ్మా! మాకెంతో ఆకలిగా ఉంది, నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము గదా? మాకు వెంటనే భోజనం పెట్టు’ అన్నారు. ఆమె లోపలకు వెళ్లి విస్తర్లు వేసి, అయ్యలారా! భోజనానికి దయజేయండి. అని ప్రార్ధించింది. అపుడు వారు ‘సాధ్వీ, మాదొక షరతు ఉన్నది. నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము. లేకుంటే యిలా ఆకలితోనే వెళ్లిపోతాము’ అన్నారు. వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది. అంతేగాక, ఆకలితో తిరిగిపోయిన అతిథి, గృహస్థుల పుణ్యాన్ని, తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం. కాని పరపురుషుల యెదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది! పరస్పర విరుద్దమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది.


వారి విచిత్రమిన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది. అయ్యలారా అలానే చేస్తాను, భోజనానికి రాండి! అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్లి, అత్రిమహర్షి పాదుకలతో, స్వామి, ‘నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను.’ అని చెప్పుకొన్నది. ఆమెయొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి వెళ్లేసరికి  ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు. ఆమె భావాన్ననుసరించి ఆమెకు బాలింతరాలకు వలె స్తన్యమొచ్చింది.ఆమె ఆ వెంటనే వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు పాలిచ్చింది. ఆ మహా పతివ్రత తన దివ్యద్రుష్టివలన వారు త్రిమూర్తులు అని తెలుసుకొని ఊయాలలో పెట్టి, ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది.


ఇంతలో అత్రి మహర్షి వచ్చి,ఆమె నుండి సర్వము తెలిసికొని ఊయలలొని త్రిమూర్తులను దర్శించి, ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను యిలా స్తుతించాడు. ‘ఓ మహావిష్ణు! నీవు సృష్టి-స్థితి-లయ కారణుడవు. జగత్సాక్షివి, విశ్వమయుడవు. విశ్వాధరుడవు. ఓ పరమేశ్వర! నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు. వాస్తవానికి ఈ జగత్తు నీ కంటే వేరుగాకపోయిన, మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు , ‘నేను-నాది’ అనే మాయతో గూడిన భావన వలన నీకంటె వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది.
ఊయలలొని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తిచెంది, తమ నిజరూపాలతో ప్రత్యక్షమై. వరం కోరుకోమన్నారు. అప్పుడు అత్రి మహర్షి భార్యవైపు చూస్తూ ‘సాధ్వీ, వీరు మనస్సు చేతగూడ పొందడానికి వీలుగానివారు. అయినా నీ భక్తీ వలన ఇలా వచ్చారు. నీ అభీస్టమేమిటో నివేదించుకో అన్నాడు.’


అప్పుడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడడ్డారు. కనుక ఈ మూడు మూర్తులగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది, మీ అవతారకార్యం నేరవేర్చుకోవడమే నా అభీష్టము అన్నది. అత్రిమహర్షి సంతోషించి , మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముద్దరించండి.అని కోరాడు. అపుడు వారు మహర్షీ మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము. ఆ తర్వాత అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు జన్మిస్తాడు. ఈయన సాక్షాత్త పరమేశ్వరుడే; శ్రుతులకు గూడ అందని సచ్చిదానంద స్వరూపుడు; మానవుల అభీష్టాలు నెరవేర్చి యోగము, జ్ఞానము ప్రసాదించేవాడు.స్మరించిన తక్షనంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూఉంటాడు. అలనాటి! దుర్వాశ శాపం వల్లనే పరమాత్మాయైన శ్రీదత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు.అసలు ఆయన అవతరించిందే అందుకు. సర్వజనోద్దరణమనే దత్తావతార కార్యం సృష్టిఉన్నంత వరకు కొనసాగాల్సిందే. కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తుంటాడు.


శ్రీ దత్తాత్రేయుడే ఆది గురువు....✍ లోకాస్సమస్తాస్సుఖినోభవంతు
 
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online