Pages

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-8

         తరువాత  తామసమైన ఆరాధన కూడా వచ్చింది .అదే లింగ ఆరాధన అస్సలు ఈ జగతికి ,ఈ సృష్టి కి కారణమైన వారి సృష్టి అంగాలను పూజించటం అదేశివపార్వతులు కలసివున్న  శివలింగం ,శివపార్వతులు ని శివలింగం రూపములో ఆరాధించటం ఇతర మతాలలో కూడా ఆడం అవుర్ హవ్వ సృష్టికి మూల పురుషులుగా కొలుస్తారు.

       విదేశీయులు వివేకానందుడిని ఇలా అడిగారు మీ మతములో లింగపూజ అస్లీలమైనదే కదా అని అడిగారు .అప్పుడు ఆయన సమాధానం చెబుతూ ,ఆ లింగ,పానవట్టం లద్వారా జరిగే ప్రక్రియ మాకు చాలా పవిత్రమైనది .ఆ ప్రక్రియ వల్లే కనబడుతున్న జగతి అంతా వచ్చింది .ఇన్ని సంభంధాలు ,ఇన్నిప్రేమలు ఇన్నిబందాలు ఇంతపెద్ద ప్రపంచం ఇన్నికుటుంబాలు సంతోషాలు ఇదంతా ఆ మూల పురుషుల రహస్య అంగాలు జరిపిన తంతు , సృష్టి వల్లనే కదా అని ఆ లింగం ,పానవట్టం లను పూజించటం అదే ,శివలింగం ఒక్క శివ  లింగాన్నే ఆరాధించేవారువున్నారు .వారుశివుడు ఒక్కడే దేవుడు ,పార్వతి ని కూడా ఒప్పుకోరు . శివుడ్ని మాత్రమే ఒప్పుకొని ఆరాధించే వారిని శైవులు ,వీర శైవులు అనికూడా అంటారు .

      అలానే శ్రీ మహావిష్ణువు మాత్రమే ఆరాధించే వారు వున్నారు .వారు లక్ష్మీదేవి ని కూడా పట్టించుకోరు అంటే ఆమె పవర్ కూడా ఈ మహా విష్ణువు ఇచ్చినదే ,అంటే సుప్రీమ్ శ్రీమన్నారాయణుడే .అని నమ్మి ఆయననే ఆరాధించే వారిని వీర వైష్ణవులు  అంటారు .అలానే అమ్మ , కన్న బిడ్డలను దగ్గరకు తీసు కున్నట్టు మన అందరిని దగ్గరకు తీసుకొని మనసమస్యలను, తండ్రి లాంటి వాడు శ్రీ మహావిష్ణువు కి చెప్పి మనపై ప్రేమ కురి పించేలా చేయగల తల్లి శ్రీ మహా లక్ష్మి అనే భావన పెట్టుకొని ,మోక్షము విషయము లో జీవుడి ని లాలించి ,ఆ దేవదేవుడు అయున శ్రీమహావిష్ణువు తో ఒప్పించే భారం ఆమె తీసుకొనే తల్లి అని ఆ లక్ష్మి దేవిని ముందు పెట్టి శ్రీ మహా విష్ణువునే ఆరాధించే వారిని శ్రీ వైష్ణవులు అంటారు .ఇక్కడ శ్రీ అంటే లక్ష్మి అమ్మవారు అని అర్థం .
      ఇంకా అలానే మధ్వవైష్ణవులు అని అంటారు ఎక్కువ కన్నడ రాష్ట్రములోను తెలుగు రాష్ట్రాల సరిహద్దులలోను ఎక్కువగా వుంటారు .వీరు మధ్వాచార్యుల వారి సాంప్రదాయం లో నడుస్తూ వుంటారు .వారిది ద్వైత సిద్దాంతం  వీరు కూడా శ్రీమహావిష్ణువుని ఒక్కరినే ఆరాధిస్తారు .లక్ష్మి అమ్మవారు కూడా ఆయనలోపలే ,ఆయనకు లోబడి వుంటుంది .కాబట్టి స్వామివారే గొప్ప అని ,అంతా స్వామివారి మహాత్మ్యమే అని వారి నమ్మకం .అందుకే వారి పేర్లు కూడా కృష్ణా చార్య అని వుంటుందికానీ కృష్ణమాచార్య  అని వుండదు  అంటే మ కారం వుండదు .అదే పైన చెప్పుకొన్న శ్రీ వైష్ణవ సాంప్రదాయములో అయుతే కృష్ణమాచార్యులు అని వాళ్ళు వ్రాసుకొంటారు .వాళ్ళకులక్ష్మి  అమ్మవారే ముఖ్యం.
         ఇక బెంగాల్ లో గౌడీ య  వైష్ణవమ్ అనే సాంప్రదాయం ఒకటి అక్కడ వున్నది .దానిలో చైతన్య మహా ప్రభు ,శ్రీ కృష్ణ సాంప్రదాయం ప్రముఖమైనాయి .బెంగాల్ రాష్ట్రములో బ్రాహ్మణ హోటల్స్ ఉంటాయి కాని అందులో చేప వంటకాలుఉంటాయి .వారికి చేప లు తోనే  సంప్రదాయం అంతా నిండి వుంటుంది .వారికి అది శాఖాహారం క్రింద లెక్క .అదికూడా తినని శుద్ధ శాఖాహారులకి శ్రీ వైష్ట్నవ హోటల్ అని అడగాలి ,అక్కడ అయి తే చేప కూడా లేని శుద్ద శాఖాహారం లభిస్తుంది
       .ఈ విధముగా భక్తీ ఉద్యమం రక రకాలుగా శ్యాఖోపశ్యాఖలు గా ప్రపంచం అంతా విస్తరించి వుంది .మళ్ళిఇదిరెండు రకాలుగా వుంది .ఒకటి భక్తీ శాఖ మరొకటి జ్ఞాన శాఖ .వీటిగురించి అందరికి తెలిసే వుంటుంది  . జ్ఞానము గురించి ఎక్కువగా ఉపనిషత్తుల్లో వుంది  .క్రీస్తు పూర్వములో పూజలు ఆడంబరత్త్వం లాంటి కొన్ని విషయాలలో బేదాభిప్రాయములు వచ్చికొందరు పురోహితులు  అడవి లోకి వెళ్లి పోయారు .వాళ్ళు అక్కడ అడవిలో కూర్చుని కొన్ని సిద్దాంతాలు తయారు చేశారు  వాటిలో అరణ్యా కాలు .,ఉపనిషత్తులు పుట్టుకొచ్చాయి
      .మళ్ళీ సిద్దంతకారులు కూడా వున్నారు అందులో బోధాయనుడు,గౌతముడు ఇద్దరి ప్రభావం సంస్కృతి, సమాజం పై వున్నాయి .బోధాయనుడి సూత్రాలను ఆధారముగా తీసుకున్న వారు జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ,అలా చాలా వందల సంవత్సరాల  గడిచిన తరువాత , ఆధునిక యుగములో అంబేత్కర్ వచ్చి  గౌతమఋషి సిద్దాంతాలను ,సూత్రాలను ఆధారముగా తీసుకున్నారు .భారతీయసంస్కృతిలో జ్ఞాన ము ఆధారముగా నడిచినవారిలో శంకరాచార్యులు వారు ,కబీర్ ముందుగా చెప్పుకోవాలి .ఆ తరువాత చాలామంది వున్నారు.
 
 
 
 
 
 
 

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-7

      సృష్టి ప్రారంభములో పరమాత్మ ఒకడే ఉండెను .సృష్టి కార్యమునకు ఇద్దరు అవసరం అని ఆలోచన చేసెను .అందుకోసం తన శ రీరమును రెండుభాగములుగా విడగోట్టుకొనేను.ఒకరు పురుష రూపం రెండు స్త్ర్రీ రూపముగా విడగొట్టు కొనెను .దానినే అర్థనారీశ్వరస్వరూపంఅని కొందరు చెబుతారు .

         శ్రీ వైష్ణవములో లక్ష్మీనారాయణస్వరూపముగా చెబుతారు .అలా వచ్చిన తరువాత శ్రీమన్నారాయణుడు లక్ష్మి అమ్మవారిని పిలిచి కావలసినంత చెట్లు చేమలు తీగెలు పచ్చని ప్రకృతి ని ,జీవనానికి ,పోషణకి ,అందము ,ఆహ్లాదం ఆనందం ఇస్తూ భవిష్యత్తులో అన్ని రకాలు అవసరాలు తీర్చే విధముగా  తీర్చిదిద్ద మని ఆదేశిస్తాడు అని ఉపనిషత్తుల్లోచెప్పబడినది


         అమ్మవారు స్వామివారిలో భాగము కాబట్టి ఆమె ప్రతి రూపాన్ని ప్రకృతిగా మలిచినది . ఆ రూపమే వనదుర్గ అంటే అందుకే అమ్మే ఆది పరాశక్తి అని చెప్పిఆ మతాన్ని ఆరాధించే వారు శాక్తేయులు గా పిలువబాడతారు ఆ శాక్తేయ మతం ప్రకారం  ఆ  అమ్మే త్రిమూర్తుల ను సృష్టించినది అని చెబుతారు  .అందుకే చరిత్ర లో   ఆది మానవ    సెకములో గుహలలో ముందుగా అమ్మవారి రూపమే యుండేనని కాబట్టి మా అమ్మవారి రూపమే ముందు అని గట్టిగా వాదించే వారు శాక్తేయులు .సత్త్వ  తమో  రజో గుణములు ఆధారముగా భగవంతుడి అవతారములు వచ్చినవి అని కూడా పురాణములు ద్వారా తెలుస్తోంది.  

        ఓం దేవీం వాచమజనయంతామ్ అనే అమ్మవారి స్తోత్రములో ఆది మానవుడు నుంచీ తొట్టతొలి గా అమ్మవారిని ఆరాధి౦చే వారు అని శాక్తేయులు చెబుతున్నారు . ఆదిమానవులు గుహలలో సంచరిస్తూన్న రోజుల్లో జంతువులను చంపి పచ్చి మాంసం తింటూన్నరోజులలో ఆ మనస్తత్వం ఆధారముగా వచ్చిన తత్వమే రజో గుణం .ఆ గుణం ప్రకారం పచ్చిరక్తం , పచ్చి మాంసం కొండల్లో ,గుహలలో వున్న ఆదిపరాశక్తి అమ్మవారు అనేక భుజాలు కలిగిఎర్రని నాలుక పెద్దగా బైటకు చాచుకొనివున్న ఉగ్ర రూపం  .ఆ రూపాన్ని ఆరాధించేవారు   ,అంతా హింస ఎక్కువగా వున్నట్లు అనిపిస్తుంది  ఎంతసేపూ మాంసం రక్తం సమర్పిస్తూ లేక ఆరగింపు చేస్తూ నడిచేది రజోగుణం కి సంబంధించినది.అలా కొన్ని వందల ,వేల సoవ త్స రాలుగా జరుగుతూ ఉంది.

        ఆది మానవుడు అభివృద్ధి చందటము మొదలుపెట్టాడు ,అమ్మప్రక్కన  ఒకనాన్న వున్నాడని ఆమెకు ఒకకుటుంబము వుండాలి అనే నిర్ణయానికి మానవుడు అభివృద్ధి చెందాడు .కుటంబం లో అమ్మ కి కనిపిస్తున్న ప్రాముఖ్యం,పిల్లలని కని వాళ్లకు పాలిచ్చి పెంచడం ,పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ భుజం పై ,తలపై మోసుకొంటూ తిరగటం  తండ్రి ఎక్కడో తిరగటం ఇన్ని కారణాలువల్ల  ఆ రోజుల్లో తల్లి దైవం ,తల్లి తో వున్న అనుబంధము ,ప్రాముఖ్యం లే అమ్మ దేవత గా రూపు దాల్చింది .  .ఇప్పటికి తల్లి తండ్రి ఇద్దరు ఉన్నప్పటికీ ,కుటుంబం లో ఇప్పటకీ తల్లి మాటకే ఎక్కువ గౌరవం ఇస్తూవుంటాము .నాగరికత పెరిగిన తరువాత తల్లి తండ్రి ఇద్దరూ సమానమే అని ఇద్దరినీ పూజిస్తూ ఉన్నాము .పార్వతీ పరమేస్వర్లు లక్ష్మీనారాయణులు,సరస్వతీ బ్రహ్మ లు ,ఇలా సృష్టి కి ఆధార భూతమైన ఇద్దరినీ ఆరాదిస్తూనే వున్నాము .

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-6

      ఇంకో ఉదాహరణ చెప్పుకొందాం వేసవి కాలములో కొత్తకుండ లో ని నీటిని త్రాగితే ఎలా వుంటుంది. మన శేరీరానికి అలవాటు పడేంత వరకు జలుబు చేస్తూవుంటుంది .అలానే కొత్తగా ఏ.సి లో కి వెళ్లి పడుకొంటే ఏమవతుంది .జలుబు ,ముక్కు కారటం ,తల నొప్పి లాంటివి వస్తాయి . ఇవన్ని ఇలా ఎందుకు జరుగుతున్నాయి .అదే మనలోని ప్రకృతి తత్త్త్వం .బైట ప్రకృతి కి మనలోని ప్రకృతి కి వున్న బంధాన్ని కొంత మార్చి చల్లదనం కోసం ప్రయత్ని౦ చాం .తాత్కాలికముగా మారటానికి కొంత టైం పడుతుంది .ఇంకా ప్రకృతి చాలా చాలా రకాలుగా వుంటుంది .కొంతమంది మెల్లగా మాట్లాడతారు.కొంతమంది దురుసుగా మాట్లాడతారు .దీనిని మనవాళ్ళు . వాడి ప్రకృతే అంత అంటూ వుంటారు .ప్రకృతి అంటే ఇక్కడ సూక్ష్మరూపములో మనలో వుండే కొన్ని లక్షణాలు .అలానే బైట ప్రకృతి లో మనం చూస్తూవుంటాం వున్నట్టు వుండివర్షం. అకాలవర్షం ,ఎండలు తుఫాను లు ,గాలులు ఎలా ఉంటాయో మన మదిలో ,మన నడవడికలో కోపతాపాలు ,సంతోషాలు బాధలు దుఖాలు ఇది కూడా ఆ ప్రకృతి లక్షణములు .ప్రకృతి లో నష్టాలు ,మనిషి,లేక జీవి జీవితములో ఆటుపోట్లు ,బైట ప్రకృతిలో విలయాలు , మనిషి జీవితములో కోలుకోలేని దెబ్బలు ఇవన్నిచూస్తూవుంటే బైట ప్రకృతికి మన శేరీరములో పెద్ద పాత్ర ,మనజీవితములో పెద్ద భాగస్వామం వుంది అని అర్థం అవుతుంది కదా .ఇది అంతా కనపడకుండా జరిగేది .ఇక కనిపించేలా జరిగేది మనకు సుపరిచితమే .

         ఆకులు పండ్లు దుంపలు నీళ్ళు పాడి పంటలు చెట్లు చేమలు .గుహలు ,కొండలు రాళ్ళు రప్పలు ,లోహాలు ,లోహసత్త్వాలు మందులు ఇవన్ని మనకు ప్రత్యక్షంగా ఉపయోగించు కుంటూనేవున్నాంకదా ,ఇక్కడ మీకో విషయం చెప్పాలి మనిషిలో కాని .జంతువుల్లో కాని అంటే జీవి ఏదైనా రోగము వచ్చినప్పుడు ప్రకృతి లోని మూలికలు వాడుతూ ఉంటాము అంటే దాని అర్థం మనలోని ప్రకృతి కి సమస్య వచ్చిన ప్పుడు బైట ప్రకృతి లోని మూలము తో సరిదిద్దుకుంటున్నాముకదా ,మనలో భూమిలో వుండే మూలకాలు మన శ రీరములో కూడా సూక్ష్మ రూపములో ఉంటున్నాయి అందుకే సోడియం ,పొటాషియం ,జింక్ బంగారం లాంటివి స్వర్ణ భస్మం .లోహభాస్మం ఇలా ఎన్నో భస్మాలుగా ఆయుర్వేదం లో వాడుతూవుంటారు .ఇంగ్లీష్ వైద్యం లో కూడా విటమిన్స్ ,మినరల్స్ జింక్ క్యాప్సుల్స్ గా వాడుతూవుంటాం .కాబట్టి ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి .ప్రకృతి ఒడిలో ,ప్రకృతి లోపల ,మనలో ప్రకృతి ,అంత ఎందుకు ఉచ్వాస,నిచ్వాశ ల శ్వాస ,ప్రకృతి ప్రాణం కి ఆధారం ప్రకృతి .

       పూర్వకాలములో ప్రకృతి పచ్చగా .చెట్లు,చేమలు తో కళకళ లాడుతూ వుండేది .దాని స్వంత బిడ్డల్లాంటి పక్షులు తో అందాన్ని ,ఆనందాన్నిపొందుతూ ,మనకు గూడా ఇస్తూ ఆరోగ్యముగా రక్షక వలయములా కాపాడుతూ వుండేది . అటువంటి ప్రకృతిని నాశనం చేశాము భగవంతుడు ఇచ్చే పవిత్ర .పంచభూతాలను యధా తధముగా మన జీవ కొటికి అందించే తల్లి ప్రకృతి మాత. ముందు చెట్లు ధ్వంసం చేసాం ,ఆ తరువాత పక్షులను కూలగొట్టి తినేశాము.మనకు మేలు చేసే పశువులను అన్నిటిని మిషన్స్ లో వేసి రక్త మంసాలను పిండుతూవున్నాము .బ్రహ్మజ్ఞానం చెప్పే పండితులను తూలనాడి ,ప్రతిభకు మంటపెట్టి వాళ్ళను దూరం పెట్టాం ,విదేశాలకు పొట్ట బట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు .మత్తుఅలవాటుచేసుకొని విచక్షణ కోల్పోయి ప్రకృతి ప్రతిరూపాలు అయున స్త్రీలని హింసలు పెడుతున్నాము .ఒక్కపూట లో కోటీశ్వరుడు అవటానికి ధర్మాన్ని ఖూనీ చేస్తున్నాము .ఇది అంతా ఎందుకు చెప్పుతున్నాను అంటే శంకర,రామానుజ ,మధ్వాచార్యులు వారంతా త్రాగుడు ,మత్తు ,జూదము లకి దూరముగా ఉండమన్నారు .అప్పుడు కాని బుర్ర పని చేయదు ,అప్పుడు తప్పులని సరిచేసుకుంటాము.అప్పుడు వ్యవస్థ బాగుంటుంది .


బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-5

      అస్సలు భగవంతుడు మానవుడి లా అంత తేలిగ్గా  మీసాలు పెంచో .నున్నగా షేవ్ చేసుకునో .ఆయుధాలు పట్టుకోనో .పక్కన పిల్లలను పట్టుకొనో కనిపిస్తారా అని కొంతమందికి సంశయం  .పండితులు అరిషడ్వర్గము లు[ అంటే కామ ,క్రోధ ,లోభ ,మోహ ,మద ,మాత్సర్యములు] మనలోని రాక్షసులు అంటూ .క్షీరసాగర మధనం అంటే మన మనస్సు ని తర్కించుకోవటంఅని ఒక్కోదానికి పోల్చి చూపిస్తూ వుంటారు .అయి తే ఈ బ్రమ్మాండం లో ఎన్నో జీవులు వున్నాయి .ప్రతి జీవిలో మళ్ళీ అదే బ్రహ్మ౦ డము కొద్దిరూపములో నిండి వుంటుంది.  బ్రమ్మాండ ౦ లో ఉన్నదే కొద్ది కొద్ది గా ప్రతీ జీవిలో సూక్ష్మ రూపములో చిన్న  చిన్న బిందువు ల్లగా వుంటుంది .ఉదాహరణకు బైట పురాణాల్లో రాక్షసులు ,వాళ్ళు చేసే అరాచకాలు వింటూ ఉంటాము .అది బైట ప్రపంచములో జరిగినది నిజమే .మనలో వున్న రాక్షసులూ నిజమే అదే ఇలా చెప్పారు అని పోల్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదు . ఉదాహరణకు దశావతారములు తీసుకున్నాము .బ్రహ్మ్మ౦ డము లో భగవంతుడు అలా అవతారములుగా వచ్చి ఉండవచ్చు అది బైట జరిగింది

     అలానే మానవుడి లేక జీవపరిణామం చేపలు,తాబేళ్లు పంది సగం మనిషి సగం జంతువు కోతులు పోట్టిమానవుడు తెల్విగల మానవుడు ,ఆ తరువాత  అలా జీవ పరిణామం జరుగుతూవచ్చింది .దీనినే విదేశీయులు డార్విన్ ,జీన్ బ్లాస్తిస్ లమార్క్ లాంటివాళ్ళు ఈ ఆధునిక కాలములో నిరూపించారు .కాబట్టి ఇక్కడభగవంతుడిలో మనం వున్నాము .మనలో భగవంతుడు వున్నాడు .కాబట్టి భగవంతుడికి మనకు బేధము లేదు అదే అద్వైతము .అంటే రెండు కాదు ఒక్కటే   భగవంతుడు ,,నేను అంటే జీవుడు ఇద్దరం ఒక్కటే అనే వాదం ఈ వాదాన్ని అద్వైతముఅంటారు దీనిని జగద్గురు శంకరాచార్యులవారు ఆవిష్కరించారు .

        ఇక జీవుడు ,భగవంతుడు ఒకటే ఎలా అవుతారు కాదు ఎప్పటికి అలా కాదు భగవంతుడు సర్వ శక్తిమంతుడు ఆయనచే సృష్టింప బడినవాడు జీవుడు ,అందుకే జీవుడు ఒకడు ,భగవంతుడు ఒకడు ఇద్దరు వేరు వేరు అని మద్వా చార్యులు వారు చెప్పారు ఆ సిద్దాంతాన్ని ద్వైతము అంటారు అయుతే మరి ప్రకృతివిషయం ఒక్కటి వుంది తెలుస్సా దానిని ఏమి చేద్దాము అన్నారుభగవద్  రామానుజాచార్యులువారు అప్పుడు వారు ఒకటి కాదు , రెండు కాదు మూడు అని చెప్పారు దానినే తత్త్వ త్రయం అంటారు అంటే మూడు తత్త్వాలు  ఈ సిద్దాంతాన్ని విశిష్టఅద్వైతము అంటారు ఇది చక్కగా అర్థం కావాలంటే ఓభార్యాభర్తలుకలసినడుచుకుంటూ వస్తూన్నారు ఆ ఇద్దరు చుస్తే వేరువేరు అంటే ద్వైతము . అలానే కొంతకాలానికి భార్యకు కడుపు వచ్చింది ఇప్పుడు ఆమె అద్వైతం రూపానికి ఉదాహరణ. ఇప్పుడు ఆమె లో రెండు తత్వాలు కాని పైకి కనబడేది ఒక్కటే ఇక కొంతకాలానికి ఆమెకు కొడుకు పుట్టాడు లేక సంతానం కలిగింది ఆ ముగ్గురు అంటే తల్లి తండ్రి  కొడుకు నడుచుకొంటూ వస్తూన్నారు  ఈ కనపడే రూపం  విశిస్టా ద్వైతం  ..ఈ 3 భగవంతుడు – జీవుడు – ప్రకృతి  ఆధునిక సైన్స్ లో మనం చెప్పుకొనే ఎలక్ట్రాన్ –ప్రోటాన్ –న్యూ ట్రా న్  .రామానుజలువారు ఏమి చెప్పారంటే ఈ మూడు కలసినట్టే, కలసి ఉన్నట్టే  చూస్తే మూడు వేరు వేరు     .అలానే   ఉదాహరణకు  మనం ,మన ప్రక్కన వున్న క్లోజ్ ఫ్రెండ్ లేక బంధువు ఇంటి తో సత్సం సంభందం పెట్టుకున్నాము అనుకోండి.పై పై ఆలోచనలు కలిసే ఉంటాయి .  పండుగలు పబ్బాలు కల్సి చేసుకుంటాము ,మాటలాడుకుంటామ్  కాని ఒకే కుటంబం కాదు ,ఇవి రెండు వేరు వేరు కుటుంబాలు అలాంటి సంభంధమే ఈ భగవంతుడు –జీవుడు –ప్రకృతి 

        జీవుడు  శేరీరం లో వున్నప్పుడు లోపల బైటా  తనప్రక్కన వున్నది భగవంతుడు , ,ప్రకృతి,  అందుకే ఆరు బైట కనిపించే   ప్రకృతి లో కనపడే తూఫానులు ,సుడిగుండాలు,వేడి ,శీతలం అలజడులు  ఆకాశం ,పంచభూతాలు అన్నీమనలో కూడా కనబడుతూ ఉంటాయి ప్రకృతి లో యూనివర్సల్ గా  ఒక్కటే అంతా నిండి వుంటుందిఅదే  .ప్రకృతి ధర్మం అంటాం ఉదాహరణకు ఆవు తన దూడను ప్రేమిస్తుంది .విత్తనాలను మొక్కలు నలుదిసెలా ప్రేమతో ఇష్టం తో వెదజల్లుతాయి .ఇక్కడ ఒక విషయం ఆవు తన దూడనే ప్రేమించు కుంటుంది ఇంకో దాని దూడ విషయం దానికి అనవసరం .అలానే మొక్కలు ,జంతువులు,మనుషులు ఇప్పుడు మనం ప్రకృతి గురించి చర్చిస్తున్నాము .ఒకవేళ మీ మనస్సు లో మీకు అనిపించవచ్చు .కొన్ని జంతువులు .మనుష్యులు ఇతరుల పై శ్రద్ద చూపిస్తూవుంటా యి  మరి అది ఏమిటి అని అడగవచ్చు . ఇక అది ప్రేమ ,అనుభందం  యూనివర్సల్ ప్రేమ   అది భగవతత్త్వం .ప్రకృతి విషయములో బైట ప్రకృతి ,మనలోపల ప్రకృతి గురించి చర్చిస్తున్నాము కదా

walking and its uses

నడకవల్ల జీర్ణ శక్తి బాగా పెరుగుతుంది .మలబద్దకం సమస్య పోతుంది deprression ,ని మానసిక ఆందోళన ని తగ్గిస్తుంది చురుకు దనాన్ని,చైతన్యాన్ని కలిగిస్తుంది .నీరసాన్ని తగ్గిస్తుంది.

రోగనిరోధక వ్యవస్థ ని సరి చేసి ,కండరాలకు ,ఎముకలకు బలాన్ని పెంచుతుంది.  మోనోపాజ్, మేనోపాజ్ వాళ్ళు రోజు నడుస్తూ వుంటే బ్రెయిన్ క్యాలిషియం ఉత్పత్తిని ఎముకలకు సహ్జసిద్దముగా పెంచుతుంది .

stress.టెన్షన్ లు తగ్గి మైండ్ ప్రశాంతముగా వుంటుంది .మెదడు చురుగ్గా పని చేస్తుంది .చెడు కొలిస్త్రోల్ ని తొలగిస్తుంది .ఊపిరితిత్తుల పనితీరుని మెరుగు పరుస్తుంది .శ్వాస లోపాలను సరిచేస్తుంది .gastrouble ని పోగుడుతుంది, అసిడిటిని తగ్గిస్తుంది . చక్కటి నిద్ర ని కలిగిస్తుంది ఈ నడక
.
ఇంకా ఈ నడకవల్ల చెమట పట్టి చెమట ద్వారా విషపదర్దాలు బైటకు పోతాయి .దానితో అన్ని అవయవాలు మంచిగా పని చెస్తాయి .నడకవల్ల ఉత్సాహం పెరుగు తుంది పాజిటివ్ మూడ్ కలిగిస్తుంది .శ రీరములోకి కొత్త శక్తి ని కలిగిస్తుంది

శరీరమునకు కావలసినంత ఆక్సిజన్ వచ్చి  రక్తం పరిశుబ్రం అవుతుంది ,blood circulation బాగుపడుతుంది .

Some medicinal uses of cardamom

చిట్కా గృహ వైద్యం [యాలకులతో]
 
ఒక గ్లాసువేడి నీటిలో చిటెకెడు యాలకుల పొడి ,చిటికెడుమిరియాల పొడి ,కాస్తంతయండబెట్టిన అల్లం ,ఒక చెంచాతేనె కలిపి రొజూ తీసుకోవడం వల్ల ఆస్తమా .బ్రాంకైటిస్ నుంచి ఉపసెమనంపొందవచ్చు .

బోజనానికి ముందు ఒక యాలక్కాయ ,ఒక లవంగం నోటిలో వేసుకొని నమలడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది.   అపానవాయువులు, గుండె మంట కూడా తగ్గు ముఖం పడతాయి .యాలకులు  ఒకటి ,అల్లం కొద్దిగా ,ఒక లవంగం కొంచం కొత్తిమిర రసం కలిపి తీసుకోవటం వల్ల అజీర్ణ సమస్యలు తగ్గిపోతాయి .అజీర్ణం వల్ల వచ్చే తలనొప్పి పోవాలంటే యాలకులు వేసి తయారు చేసిన టీ త్రాగితే మంచిఫలితం వుంటుంది .మానసిక వత్తిడి [స్ట్రెస్] నుంచి కూడా బైట పడవచ్చు.
 
 మంచి ఫలితం లభిస్తుంది ,కాని అతిగా యాలకుల పొడి వాడకూడదు.  గ్రీన్ టీ లో గాని ,బ్లాక్ టీ లో గాని ఒక చిటెకెడు యాలకుల పొడి వేసుకొని త్రాగటం వల్లరక్తం లో కేఫ్ఫిన్ తగ్గిపో యి మూత్రపిండాలు ,గాల్ బ్లాడర్ ని శుబ్రం చేస్తుంది
యాలకుల పొడిని అరటి ఆకు తో కలిపి నూరి ఆ మిశ్రమాన్ని ఉసిరి కాయ రసం లో కలిపి రోజుకు 3 సార్లు తీసుకోవటం వల్లగనేరియా లాంటి సుఖ వ్యాధులు తగ్గి పోతాయి.
 
దాల్చిన చెక్క ను యలకులతో కలిపి కషాయం చేసి పుక్కిలించడం ,గొంతుకి తగిలేలా గాగులు చేయటం వల్ల గొంతు నొప్పి ,జలుబు తగ్గి పోతాయి .అలా 2 లేక 3 రోజు లు చేయాలి.  కప్పు నీళ్ళల్లోరెండు యాలకులు ,5 పుదీనా ఆకులు తో చేసిన కషాయం త్రాగితే వెక్కిళ్ళు తగ్గి పొతాయి. 

 ఏదైనామంచిది మంచి ఫలితం లభిస్తుంది కదా అని దానిని అతిగా వాడరాదు.  అప్పుడు అది వికటించి చెడు ఫలితం ఇస్తుంది.  అలానే అతిగా యాలకుల పొడి వాడకూడదు ,ఎక్కువసార్లు అదేపనిగా రొజూ త్రాగరాదు నపుంసకత్వంవచ్చే  ప్రమాదం వుంది .

ugadi subhakankshalu

                                       






                                          మిత్రులు, సన్నిహితులు అందరికి హేమళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

 
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online