Pages

Tips for healthy eyes

    ప్రతిరోజూ ఒక ఉసిరికాయ తింటే ఆరోగ్యానికి మంచిది . అది పచ్చడి గ నైన లేక ఎలా తిన్నా సరే.  వుసిరి లో సి విటమిన్ ఎక్కువగా వుంది.  కళ్ళకు ,తలజుట్టుకు , పంటి చిగురులకు,  దెబ్బతిన్న శరీర బాగాలకు ,కణజాలమునకు ముఖ్యముగా కళ్ళకు,జుట్టుకు చాల మంచిది.
 
    విటమిన్ సి హిమోగ్లోబిన్ఉత్పత్తికి చాల అవసరం. ఇంకా విటమిన్ D క్యాలిసియిమ్ ఉత్పత్తికి కూడా  సి విటమిన్ కావాలి.  జలుబు నివారణకి ,రోగ నిరోధక శక్తి పెరగటానికి ఎంతో ఉపయోగిస్తుంది.              ముఖ్యముగా ఈ రోజులలో computer ఫై పనిచేసేవారికి కళ్ళ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. రెప్ప ఆర్పకుండా ఎప్పుడు తదేకముగా కంప్యూటర్ తెరను చూసేవారికి కన్నుపోడిబారే సమస్య రావచ్చు.అయుతే ఎక్కువగా A.Cలో వుండే వారికీ ,వయస్సు ఫైబడిన వారికీ,ఎక్కువ computer వాడేవారికి ,ఏది అయినా దెబ్బ తగిలిన వారికై నా,  కళ్ళు పొడి బరుతుంటాయి.  అందుకే కొన్ని చిట్కాలు పాటించాలి .
 
    టీవీ చూసేటప్పుడు గదిలో వెలుతురు మంచిగా ఉండేలా చూసుకోండి .చీకట్లో టీవీ ఎప్పుడు చూడకూడదు.  ఎప్పుడు స్క్రీన్ నే చూడకుండా మద్యమద్య చూపుని మరల్చుకోవాలి . computer చూస్తున్నప్పుడు కనురెప్పలను మద్య మద్య ఆర్పుతువుండాలి.  చదువుతూన్నప్పుడుమద్య మద్య కాసేపు కంటికి విశ్రాంతినిఇవ్వండి.  చిన్న చిన్న అక్షరములను ఎక్కువ సేపు చదవవద్దు.   ఒకవేళ చదవాలిసివస్తే మద్య మద్య కాస్త దూరముగా దృష్టి ని మరలుస్తువుండాలి .చదవాలిసిన వస్తువు ని కంటి కంటే క్రిందనే వుండాలి.   ఫైవైపు చూస్తూ చదవల్సివస్తే కొద్ది సేపు మాత్రమే చదవండి .ఎక్కువసేపు ACలోనే ఉండకండి.  మద్య మద్య ఆరు బైట కు వచ్చి పోతువుండాలి.  Ac ఇంటేన్సిటిని మరి ఎక్కువగా పెంచుకోకండి.  ఇది కూడా కంటిలో పోడి తనము ని పెంచుతుంది.  అందుకే AC రూమ్ లో హుమిడిఫయర్స్ ఉంచుకోండి.  శరీరములో ద్రవపదార్డములు తగ్గకుండా చూసుకోండి.   అందుకోసం ద్రవాహారములు తీసుకుంటూ వుండాలి.
 
     పొగత్రాగటం,మద్యము పూర్తిగా బందు చేయండి . శుబ్రమయున మంచి నీటి తో కళ్ళు కడుక్కోండి .మురికిచేతులుతో కళ్ళు ముట్టుకోకండి .యోగా రోజు చేయటము మంచిది .ఇవి అన్ని పాటిస్తూ కళ్ళు కొద్దిసేపు మూసుకొని రిలాక్స్  గా వుండి కళ్లపై ఐస్ ముక్క చుట్టి చల్ల చల్ల గ పెట్టుకోవాలి .లేక చల్లటి నీటిలో తడిపిన గుడ్డను కళ్ళఫై పెట్టుకోవచ్చు లేదా కలబంధమట్టని మద్యగా చీల్చవేసి ఆ జిగురుగా ఉన్న బద్ద కళ్ళఫై పెట్టుకోవాలి . కళ్ళలోకి అది పోతుందిఅనే భయం అక్కర్లేదు .పోయునా ఏమికాదు .కళ్ళ క్రింద నల్లటి వలయాలుకు కూడా ఆ బద్దజిగురు బాగా పని చేస్తుంది .నల్లటి వలయాల ఫై అది రాస్తూ వుంటే కొద్దిరోజులు రాస్తే స్కిన్ మెరుస్తుంది నల్లమచ్చలు పొతాయి.జుట్టుకి తాకినా కూడా మంచిదే.
 
     ఇంకా కళ్ళు అలసిపోతే మల్లెపూవులు నీటిలో తడిపి కళ్ళ  ఫై పెట్టుకొని రిలాక్స్ అవ్వాలి   .మంచిఉసిరి ముక్కలు సుబ్రముగా కడిగి మళ్ళి మంచి నీటిలోవేసి కొంచం కల్పి అ నీటితో కళ్ళు కడుకున్న కూడా కళ్ళ ఎరుపు పోతుంది .దురదలు తగ్గుతాయి ,కొంతమందికి కళ్ళలో BP ఎక్కువగా వుంటుంది.దానిని గ్లూకోమా అంటారు .వాళ్ళు గరుడవర్ధనమ్ పువ్వులు ఇవి ప్రతి ఇంట్లో వుంటాయి.తె ల్లగా ఉంటాయి.  పూజకు వాడుతువుంటారు.  అవి తీసుకుని నీటిలో సుబ్రముగా కడిగి ఆ పూవులను కళ్ళ ఫై పెట్టుకొని రోజు కొద్దిసేపు వుంచుకోవాలి.  రోజు అలా చేస్తే కళ్ళలో BPతగ్గిపోతుంది . ఇక కళ్ళ సమస్యలు ఉన్నవారు రోజు క్యారెట్,పొన్నగంటి కూర, బొప్పాయి,మునగాకు, మునగ కాడలు, కొత్తిమీర, పుదీనా, తోటకూరలు  ఎక్కువగా తింటూ వుండాలి.


     అలానే రోజు ఉదయమే సూర్యుడికి దండము పెట్టుకోవాలి.  ఆరోగ్యం భాస్కరాదిచయేత్ .అని వేదం చెబుతుంది.  సూర్యనారాయనుడే కనపడుతున్న ప్రత్యక్ష భగవానుడు.  స్నానము తరువాత లేదా కనీసము ముఖము కడిగిన తరువాత ఐనా సూర్యుడికి నమస్కారము చేసుకోండి.  సూర్యుని మీద ఏదైనా స్తోత్రములు వస్తే చదవండి.  రాకపోతే ఓం సూర్యనారాయణయనమః  ఓం ఆదిత్యాయ నమః  .ఓం భాస్కరాయ నమః  ఓం నమో నారాయణాయనమః అని రాగి పాత్ర లోని నీళ్ళు సూర్యుడి వైపు వదిలిపెట్టండి .ఇది కుదరక పోయున నమస్కారం చేస్తే చాలు .సూర్యదేవుడు కరునిస్తాడు ‘’  సర్వేజనా; సుఖినోభవంతు

Info about fats n triglycerides

    ప్రతీ మనీషి 6.నెలలకు ఒక సారి లిపిడ్ ప్రొపైల్  అంటే కొవ్వు పరీక్ష చేయుంచుకోవటం చాలా మంచిది. థానీలో అన్నిరకాల కొవ్వు గురించి తెలుస్తు ఉంది.   కొలెస్ట్రాల్ ఒక్క గుండె కె కాదు,శరీరములోఅన్ని పార్ట్శ్ పైన పడుతుంది.  ముఖ్యముగా గుర్తువుంచుకోవాలిసింది కొలిస్త్రోల్ అనేది కొవ్వు పదార్ధాలు  తిన్నంత్సమాత్రమునే వచ్చేదికాదు.  వంశపారంపరియం అంటే hereditary వలన కూడా వస్తుంది.  కొలెస్ట్రాల్ తలకు అంటే మెదడుకి వెళ్లే రక్తనాళ్ళల్లో అడ్డు పడితే పెరాలిసిస్ అంటే పక్షవాతము కూడా రావచ్చు.  అందుకే కొలెస్ట్రాల్ టెస్ట్ చాలా ముఖ్యమైనిది.  వుల్లి మరియు వెల్లులి ఈ రెండు భోజనములో ఉండేలా చూసుకోండి.

     కొలెస్ట్రాల్ లో రెండు రకాలు ఉంటాయి మంచి కోలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్  ఉంటాయి.  L.D.L ని చెడుకొలెస్ట్రాల్ అంటారు కదా.  ఇది రబ్బర్ట్యూబులా ఎటు పడితే అటు వంగేలా వుండే రక్తనాళము లోపల గారలా పట్టేస్తుంది.  ఇక దానితో ఎటుపడితే అటు వంగలేక రక్తనాళం బిరుసు ఎక్కుతుంది  మరియు సన్నబడుతుంది.  దీనివల్ల రక్తం స్పీదుగా వెళ్ళలేదు.  ఐతే H.D.L. అనే మంచి కొలెస్ట్రాల్ రక్తనాళములోపల ఉన్నగారను అదే చెడుకొలెస్ట్రాల్ ఒలుచుకొంటూ తొలుచుకొంటూ శుభ్రం చేస్తూ పోతూ ఉంటుంది.  అంటే రక్తనాళాలోని పూడికను తొలగించే పని చేస్తుంది అన్నమాట .అందుకే H.D.L. అంటే మంచికోలెస్ట్రాల్ పాళ్ళు పెరుగుతున్నకొద్దీ గార లా పేరుకునే చెడుకొలెస్ట్రాల్ ను చెక్కినట్లుగా తీసేస్తుంది. 

      కొవ్వులొ ఇంకో రకం ట్రీగ్లిసెరైడ్స్ ఇదివరలో ఒకసారి చేర్చించాము.  ఇది  ఒకరకమైన కొవ్వు .  ఇది  ఆహారాన్ని ఎక్కువశక్తిగా నిల్వ చేసుకునే ప్రయత్నములో ఈ రకమైన కొవ్వు పుడుతుంది. మల్లి ఈ  కొవ్వు రక్తనాళాల్ని సన్నబరుస్తాయి. ఇదికూడా ప్రమాదమే.  అందుకే శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి.  సిగరెట్లు, మద్యం పూర్తిగా బందు చేయాలి .  పీచువుండే పదార్దాలు ఎక్కువగా తినాలి. రోజు 40. నిముషాలు స్పీడ్ గా నడవాలి. దీనివల్ల మంచి కొలిస్త్రోల్ పెరుగుతుంది.  మరోవైపు చెడుకొలెస్ట్రాల్ కరిగిపోతుతుంది .అందుకే ప్రతివారు శరీరకశ్రమ  వ్యాయామము చేస్తే చాల మంచిది అలానే మానసిక వత్తిడి తగ్గించుకోవాలి. యోగ మెడిటేషన్ మంచి సంగీతము వినాలి.  హాయిగా నవ్వాలి.  వెన్నెల,ప్రకృతి  అందాలని చూస్తూ ఎంజాయి చెయాలి.  రిలాక్స్ అవుతూ వత్తిడిని తీసేయాలి. అప్పుడు మంచి కొలెస్ట్రాల్ పెరిగి సమస్యలు పోతాయి.

some health tips reg. heart n cholestrol - 2

    హైపర్  టెన్షన్ అంటే అదిక రక్తపోటు ఉన్నవాళ్ళు రోజు ఒక అరటిపండు తింటే ఆ బిపి కంట్రోల్ అవుతుంది.   దానిలో పోటాషియం ఎక్కువగా వుంది.  ఇంకా స్మోకింగ్ , ఆల్కహాల్ పూర్తిగా మానివయ్యాలి .  వోట్స్ తింటే మంచిది.  ఓట్స్ లోఉండే ఫైబర్ స్పాన్జిలా పనిచేసి కొలెస్ట్రాల్  నానిపోయేలా  చేయును.  రక్తంలో ఇంకిపోకుండా ఒంట్లో నుంచి తొలగించును.   హోలేవీట్ బ్రెడ్  లాంటివి కూడా తిన్నాకూడా మంచిదే . అయితే  ఎక్కువ బరువు వున్నవాళ్ళు అరిటిపండ్లు ఎక్కువ తినకూడదు .                     
     స్ట్రాబెర్రీ లు ,బ్లుబెర్రి లాంటివి తింటే అవి రక్తనాళ్ళాలిని వెడల్పుచేసి రక్తపోటు ని తగ్గించి గుండెపోటు రాకుండా చేస్తాయి.   డార్క్ చాక్లేట్  అంటే కనీసము 60నుంచి 70%కోకో తో తయారైనా చాక్లెట్ లు  తింటే అధికరక్తపోటు ఇంకా ఊరికే రక్తం గడ్డకట్టటం లాంటివి తగ్గ్హుతాయి. సాధారణ మిల్క్ చాక్లెట్లు  కాండిబార్ల వల్లా ఉపయోగం ఏమి ఉండదు.   డార్క్  చాక్లెట్.లను  కూడా చాలాపరిమితముగా తినాలి.  విటమిన్ సి ఎక్కువుగా ఉండే బత్తాయిలు, కమలాపండ్లు నిమ్మజాతిపండ్లు  తినాలి . ఒకవేళ పండ్లరసాలు త్రాగితే పంచదార కల్పుకోకుండా త్రాగాలి .పండుని పండుగాఏమి కల్పుకోకుండా తినటం మంచిది.
     పీచు పదార్ధము ఒంటికి బాగా అందుతుంది.   విదేశాలలో ఉదయము బ్రేక్ఫాస్ట్  తరువాత  సి విటమెన్ గల డ్రింక్ త్రాగుతువుంటారు.   సి విటమిన్ వల్ల దేబ్బతిన్న కణజాలము ,రక్తనాళాలు రిపేరు అవుతుంటాయి.  సోయా పాలు ,సోయాజున్ను తింటే ఒంటికి కావాలిసిన ప్రోటీన్స్ అందుతాయి . అనారోగ్యకరమైనా కొవ్వు ,కొలెస్ట్రాల్ ఒంట్లో చేరవు.  సోయా ప్రోటీన్స్ ఒంట్లోచెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి .  బంగాలదుంపలు అనగానే అతిగా పిండిపదార్డమనీ చాలామంది పక్కనపెడుతువుంటారు.  కూర చేసుకొని తిన్నంత మాత్రాన ఏమి కాదు . దానిలో పొటాసియం ఎక్కువగా ఉంటుంది.  అది బిపి ని కంట్రోల్  చేస్తుంది .బంగాలదుంప లో ఫైబర్ ఎక్కువగా వుంటుంది.  అలానే టోమాటోలో కూడా గుండెకు పనికి వచ్చే పొటాసియంవుంది. ఇంకా లైకోపీన్ ఉంది  అది కొవ్వును కరిగిస్తుంది  .అందుకే  రోజు టమాటో ముక్కలను తీసుకొని వాటిని కొద్దిగా నువ్వుల నూనె లో ఉడికించి   వాటిపై మిరియాల పొడి  ఓ చిటికెడు చల్లుకొని ఉదయమే రోజు తింటూ వుంటే ఊబకాయం తగ్గిపోతుంది .కొలిస్త్రాల్ tryglirisiesకూడా తగ్గిపోతాయు.


     రోజు నడకతో పాటు  ,రోజు నాల్గు కప్పులు గ్రీన్ టీ త్రాగుతువుంటే గుండె జబ్బులు రావు .  బాదంపప్పు , వాల్నట్స్ ,వేరుసేనగ పప్పులు తక్కువమోతాడులో తినాలి వాటిలో చేడుకోలేస్త్రోల్ ని  తగ్గించే విటమిన్  e వుంటుంది.  అలానే దానిమ్మపండురసం రోజు త్రాగితే గుండె కు చాల మంచిది ఇది కూడా రక్తనాళ్లాలోని క్లాట్స్ ని ,చెడు కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది .  అలానే ఆపిల్ పండు కూడా గుండె కి మంచిది .అలానే ఆకుకూరలు కూడా గుండెకి చాల మంచిది వాటిలో ఐరన్ వుంది . అది రక్తాన్ని పలుచగా చేస్తుంది .రక్తనాళ్ళాలిని దెబ్బతినకుండా ఘట్టిగా ఉంచుతుంది .

ఈ క్రింది టానిక్ ని కూడా వాడవచ్చు.  షుగర్ పేషెంట్స్ మాత్రం వైద్యుల సలహా తోనే వాడటం మంచిది .  ఈ జాగ్రత్తలు పాటిస్తే మనకి గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
 

 

some health tips reg. heart n cholestrol

                                                                                                                                                                                                               
 
     సాల్మంఫిష్  గుండెకు చాల మంచిది,  అలానే కొద్దిమందిలో పల్స్ లో తేడాలు అంటే గుండె కొట్టుకోవటంలో తేడాలు అంటే నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలిసినది 90 లేక 60 ఆలా తేడాలు వస్తూవుంటాయి. అప్పుడు డాక్టర్స్ బి కాంప్లెక్స్  లేక న్యూరో కైండ్ లేక బలానికి టానికి  వ్రాస్తూవుంటారు .అలానే ఉప్పు పూర్తిగా తగ్గించిన కూడా పల్సులో తేడాలు వస్తూవుంటాయి.  పల్స్ ఎక్కువుగా ఉంటె  దడ  అంటారు.  మన చేయి ఎక్కడ  టచ్  ఐన  అక్కడ  నాడి తగుల్తువుంటుంది.  ఇక తక్కవగా పల్స్ ఉంటే నీరసముగా ఉండి ఏ పని చేయలేము.  ఈసమస్యలు అన్నింటికి సాలమున్ ఫిష్ చాలా మంచిది.  ఆ ఫిష్ లో ఓమెగ-౩ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.  అవి కొవ్వులొ ఒక రకమైన ట్రిగ్లీసెరైడ్స్ ని  తగ్గిస్తాయి.  వారానికి  రెండు సార్లు తింటే  మంచిది.

     ఇక ట్రీగ్లిసెరైడ్స్ అంటే అవి రక్త నాళాలలో ముద్ద కట్టే స్వభావము కలిగి ఉంటాయి .లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయుంచుకున్నప్పడు ఈ ట్రీగ్లిసెరైడ్స్  150 వరకు ఉండచ్చుఅంటారు.   కొంతమందికి ఎక్కువగా వుంటూవుంటాయి.   అలాంటివారు బోజనానికి ముందు పచ్చి కూరగాయ ముక్కలు తినాలి.  అంటే క్యారెట్, ఉల్లిపాయ, క్యాప్సికం, బీట్రూట్,టమాటో,కీర దోసకాయ లాంటి పచ్చికూరగాయ  ముక్కలు  ముందు కొద్దిగా తినాలి.  తిని భోజనం ప్రారంభించాలి.   ఇక  తరువాత పచ్చి సలాడ్స్, పండ్లు తింటూవుండాలి.  స్వీట్స్ బాగా తగ్గించాలి.  వేగముగా రోజూ వాకింగ్ చెయాలి. ఇక పల్స్ లో తేడాలు ఉన్నవారు ఆయుర్వేదంలో  అశ్వగంధారిష్ట సిరప్ వాడటం చాల మంచిది. కొనుకొని వాడచ్చు.  ఇక ట్రీగ్లిసెరైడ్స్ ఎక్కువగా వున్నవాళ్లు ట్రైగ్లైజ్  అనే టాబ్లెట్స్ ఆయుర్వేదంలో ఉంటాయి. అవి రోజు ఒక మాత్ర వాడవచ్చు. అవి కూడా సేఫ్ డ్రగ్. ఈ సమస్య ఎక్కువగా ఉంటె మార్నింగ్   ఒకటి ఈవెనింగ్ ఒకటి వాడవచ్చు తక్కువగా ఉంటే రోజు ఒకటి చాలు.  మార్నింగ్ టిఫిన్ తరువాత లేక భోజనము తరువాత కానీ వాడవచ్చు. 

    ఇంకా వీళ్ళు హృదయారిస్తా టానిక్ కూడా వాడితే మంచిది.  ఈ హృదయారిస్తా ఎవ్వరైనా తీసుకోవచ్చు.  భవిష్యత్తులో క్లాట్స్  రాకుండా ఉంటాయి .ఆయుర్వేదంలో అర్జున అనే మూలికా చాల గొప్పదనం కలిగీవుంది.  అర్జున  అనే మూలిక గుండె లో కాని, రక్తనాళాల్లో కానీ ఏ అడ్డంకులు కానీ, బ్లాక్స్ కానీ కరిగిస్తుంది.  అశ్వగన్ధ అనే మూలిక బలాన్ని ఇస్తుంది. ఇవి షుగర్ వాళ్ళకి చాలా మంచిది లేదా మెంతులు రోజు  నీటిలో ఒక స్పూన్ రాత్రివేళ నానబెట్టి ఉదయమే ఆ నానిన మెంతులు తిని ఆ నీళ్లు కూడా త్రాగితే  ట్రైగ్లిసెరైడ్స్ తగ్గిపోతాయి.  షుగర్ కూడా కంట్రోల్కి వస్తుంది.  అలానే దాల్చినచెక్క  (cinnamon.) ఒక స్పూన్ పొడి ఓ కప్పు గోరు వెచ్చని నీటిలో రోజు పరగడుపున త్రాగితే షుగర్, కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్ అవుతాయి .

some health tips reg. salt n oils

మీరు తీసుకునే ఆహారములో పీచు కార్బోహైడ్రేట్స్ వంటి పదార్ధాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి ఇందుకోసం అప్పుడప్పుడు జొన్నపిండి  గోధుమపిండి  రాగులపిండి  రోజు  ఐదో  ఒకటి  మినప్పిండిలో కలుపుకొని ఆట్లుగా  పోసుకొని తింటూ ఉండటం మంచిది , మొలకెత్తిన గింజలు, పళ్ళు, కూరగాయలు ఎక్కువుగా తీసుకోవాలి.

   కొవ్వుపదార్దాలు, నేయి, వెన్న, జున్ను, మీగడ వంటివి, జుంక్ ఫుడ్స్ లాంటివి తగ్గించాలి.  ఆవునెయ్యి వాడితే కీళ్ల నెప్పులు రావు. ఆవునెయిలో కోలస్త్రాలు ఉండదు. ఏధి అయినా అతిగా తినకూడదు.  కీళ్ల మధ్యన ఈ నేయి కందెన లా  పనిచేసి కీలు అరిగీపోతె  కాపాడుతుంది.

  పూర్వకాలములోలాగా మనం ఆయిల్ వాడటం ఇప్పుడు  తగ్గించేశాము.  శరీరక శ్రమ లేకపోవటంవల్ల అది కొవ్వు గా మారిపోయి గుండే  జబ్బులు వస్త్తున్నాయి అని ఈ నూనె వాడకం తగ్గించాము.  అయితే  దానివల్ల ఎముకల మధ్య ద్రవపదార్థం లేక అవి రాపిడికి గురి అయి చిన్నవయసులో అరిగీపోతున్నాయి.  అందుకే  ఆవునేయి కొద్దికొద్దిగా వాడుతూవుండాలి. రోజూ కొంచెం శారీరక  శ్రమ చెయ్యటం అవసరం. కనీసము నడక ఐనా మంచిదే .


తక్కువుగా కొవ్వులు వుండే లోఫ్యాట్ పాలు, పెరుగు వాడటం మంచిది. అవి కాలిష్యం  ఇస్తాయి.  అప్పుడు  సహజసిద్ధముగా బోన్స్ బలముగా తయారవుతాయి.


మాంసాహారం  తినే వారు  స్కిన్ లెస్ చికెన్ తినాలి. కూరగాయలు ఉడికించినఒమేగా -౩ ఫ్యాటీయాసిడ్స్ కోసం సాలమన్, హాయిర్రింగ్ వంటి చేపలను వారంలో కనీసము రెండు సార్లు తినాలి.



ఉప్పు కొంచం తగ్గించి తినాలి. పికెల్స్ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది, అందుకే కొద్ది కొద్దిగా మాత్రమే తినాలి.  ఎప్పుడైనా సరే ఉప్పు పూర్తిగా మానకూడదు. బాడీలో ఉప్పు అంటే సోడియం పూర్తిగా మానేస్తే మనం ఏ చిన్నపని ఛైసుకోలేము.  గుండె, లంగ్స్, కిడ్నీస్ లాంటి ముఖ్యమైన అంగాలు పనిచేయటానికి,   మెదడు పని చేయటానికి ఉప్పు చాలా అవసరం.  ఒకవేళ  ఉప్పు పూర్తిగా మానివేస్తే, లక్ష రూపాయలఖర్చు తో డాక్టర్స్ సోడియం అంటే ఉప్పు శరీరం లోకి ఎక్కిస్తారు.  కనుక మనం కొద్దిగా జాగ్రత్త గా ఇది వాడాలి.   వి మాత్రమే తినాలి.  ఫ్రైలు  వేపుళ్ళు తినకూడదు.          

మధుర క్షణాలు

వయ్యారం గా ఆమె చేతులు పైకి ఎత్తింది .
ఆమె బాహుమూలాలు మెరుస్తున్నాయి కొత్త కొత్త గా
ఓర కన్నులతో నా వైపే చూస్తూ సిగ్గు పడుతోంది
ఆమె నవ్వుల మల్లెలు నా పై పడుతున్నాయి
ఆమె పలువరసల పై మెరిసే కాంతి కిరణం
ఆమె ఎర్రని పెదవులపై ఆ అందమైన ప్రతి బింబాలు
ఆమె పొడవాటి జడ చుట్టూ ముసిరినా ఆశలు
ఆమె వక్షం పై నన్ను ఊహించుకుంటోంది
మనో ఆకాశం లో నీలి నీలి మేఘాలు
తుంపర తుంపర ల్లా చల్లని హాయి లో
మెరుపు  తీగలా ఆమె సోయగం మెరిసిపోతోంది
నా రూపం ముత్యం లా ఆల్చిప్పల్లాంటి
ఆమె కళ్ళలో దాచుకుని మురిసిపోతోంది
నా కంఠం లో ఆమె ప్రేమ గీతాల స్వరార్చన
నా మానస వీణ పై ఆమె అందాల కృతిని పాడే ఆలాపన
పరువాల పదనిసలు గుండెల్లో లయలు
వయసులో సొగసులు వెతికి పెట్టె కొత్త అనుభవం
ప్రేమ మరువలేని ముగింపు లేని మధుర క్షణాల ఘట్టం .

ఇది నా అనుభవం

     పోటీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు అందరికీ నమస్కారం .  నేను O.U. క్యాంపస్ లో చదువుతున్నప్పుడు చాలా పోటీ పరీక్షలు రాసాను .  నేను O.C.ని  నాకు జరిగిన అనుభవం ఇక్కడ నేను చెప్తాను .  నేను M.D.O. పోస్ట్ కోసం జరిగిన పరీక్ష  వ్రాశాను .  అందులో క్వాలిఫై అయ్యాను.  ఇంటర్వ్యూ కూడా పూర్తి అయ్యింది .  నా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తి అయ్యింది రాజ ముద్ర కూడా వేశారు .  కానీ నాకు పోస్టింగ్ ఇవ్వలేదు .  ఆ సమయం లో మా దగ్గర చాలా మంది కి ఈ పోస్ట్స్ వచ్చాయి . ఒక్కో ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకి కూడా వచ్చాయి. 

      నేను, ఇంకా నాలా పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న ఇంకొంత మంది కలిసి A.P.P.S.C. ఆఫీస్ కి వెళ్లి వాళ్ళని కలిసాము.  అప్పుడు వాళ్ళని వివరాలు అడిగితే వారు అన్నారు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కూడా వచ్చింది కదా అందుకే మేము అన్ని కోటాలు పూర్తి అయినా తర్వాత అప్పుడు మీ సంగతి చూడాలి, ఇంకా కొంత కాలం వెయిట్ చెయ్యమని చెప్పారు.
 
     మరి కొంత కాలం తర్వాత వెళ్తే వారు చెప్పింది విన్నాక మాకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు.  ఇక్కడ విషయం ఏమిటంటే " అన్ని రిజర్వేషన్స్ వాళ్ళు కూడా వాళ్ళ కోటాలో పోస్ట్స్ పొందటమే కాకుండవాళ్లకి  మార్కులు ఉన్నాయి కనుక ఓపెన్ లో  కూడా పోస్ట్స్ ఇవ్వాలి అని రెండు రకాలుగా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం మేము వాళ్ళకి  రెండు కోటాలో ముందు ప్రాముఖ్యం ఇవ్వాలి కనుక ఇచ్చాము .  అందువల్లనే మీకు పోస్టింగ్ రాలేదు" అని చెప్పారు .ఇంకా మాకు ఎవరికీ పోస్టింగ్స్ రాలేదు .


     ఇక్కడ విషయం ఏంటంటే ఈ రిజర్వేషన్స్ ఉన్నవారు ఆ కోటా తో పాటుగా ఓపెన్ కోటా ల్లో కూడా పోస్టింగు పొందుతూ పోతుంటే ఇంకా మరి O.C. వాళ్ళ పరిస్థితి ఏమిటి ?  ఓపెన్ కోటాలో పోస్ట్లు వారికి ఇస్తారు కానీ రిజర్వేషన్ కోటాలో అభ్యర్థులు లేకపోయినా ఆ పోస్టులు అలానే ఉంచుతారు తప్ప వాటిని O.C. వారికి ఇవ్వరు .  ఇదెక్కడి న్యాయమో ?  ఈ పరిస్థితి ఇలానే కొనసాగినంత కాలం O.C. వారికి న్యాయం జరగదు .  కనుక నా విన్నపం ఏమిటంటే O.C. వారికి ప్రభుత్వ ఉద్యోగం రావాలి అంటే ఈ అంశం మీద పోరాటం చెయ్యాలి లేదంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించడం అనవసరం .

History - Surnames - Castes 2



History - Surnames-Castes


sleep disorders reasons and remedies

ఈ రోజుల్లో ప్రతివాళ్ళలో ఒత్తిడి  ఎక్కువైపోతున్నయి అంటే ఒత్తిడి ఆలోచనలతో సతమతమౌతూ అవ్వడము నిద్ర లేక నిద్రరాక తలనొప్పి కళ్ళు మంటలతో ఇబ్బందిపడటము జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న ధ్వనులకు చిరాకు వస్తు ఉంటుంది. ఈ రోజుల్లో ఊరి ప్రదేశాలు :టార్గెట్ : రాత్రిమ్బ వళ్ళు పని తెరలు, సమయము పాటించని భోజనాలు వీటి అన్నింటివల్ల జీవన క్రమము దెబ్బ తింటూ ఉంటుంది.

1.అందుకే స్ట్రెస్ తగ్గటానికి పచ్చని చెట్లు  హరిత వనం లో కొద్ది సేపు ప్రశాంతంగా గడవాలి.

2. మంచి సంగీతము వింటూ అది కూడా చల్లని సంగీతము: వాయుధ్యాలు హోరు లేని చల్లని సంగీతము వినటము
3. చల్లని నీటి తో స్నానము చేసి చూడండి.
4. జోక్స్ నవ్వించే సనివేషాలు చూడండి ఆ సన్నివేశాలన్నీ స్నేహిత్లతో షేర్ చేసుకోండి.
5. మంచి హాస్యం మనసుని తేలిక పరుస్తుంది  కనుక అటువంటి పుస్తకాలు చదవండి .
6. ధ్యానము కొద్దిసేపు చెయ్యండి .  లేదా కళ్ళు మూసుకుని మీ ఇష్ట దైవాన్ని తలుస్తూ కూర్చోండి . 
7. చక్కగా మాట్లాడే వారు ఎవరైనా ఉంటె వారితో మాట్లాడండి .
8. మీకు మనసుకు దగ్గరైన వారితో మీ సాధక బాధకాలు పంచుకోండి .  దాని  మనసు తేలికపడి ఒత్తిడి     తగ్గుతుంది .
9. మనసుకు కష్టం కలిగించే జ్ఞాపకాలు , విషయాలను పదేపదే గుర్తు చేసుకోకండి .
10. మీకు ఇష్టమైన హాబీ ఏఏదైనా ఉంటె దానిని మళ్ళీ తిరిగి ఆరంభించండి .

  
  ఈ పనుల వలన మనకు కొంత మానసిక మైన స్ట్రెస్ తగ్గుతుంది .  అప్పుడు నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది .

అలానే రాత్రి పగలు అలా మార్చి మార్చి ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు షిఫ్ట్ వర్క్ దిజార్టర్ అనే  సమస్య వస్తుంది .  అంటే వివరంగా చెప్పాలంటే ప్రతి జీవి లో ఒక జీవ గడియారం ఉంటుంది .  అది మనకు ఏ ఏ సమయాలలో ఏ ఏ పనులు చెయ్యాలో మెదడుకు సంకేతాలు ఇస్తూ ఉంటుంది .  దాని ప్రకారం సహజం గా మనం పగలు పనిచేసి , రాత్రివేళ లో నిద్ర పోవాలి .  కానీ రాత్రి షిఫ్ట్స్ లో పని చేసే వారికి ఈ సమతుల్యత దెబ్బతినటం వలన వారికి ఈ సమస్య వస్తుంది.పని చేసే సామర్ధ్యం దెబ్బ తింటుంది  తీవ్రమయిన అలసట, త్వరగా ఉద్యోగాలకు లోనుకావడం పగటి వేళ మత్తులో జోగడము, నిద్ర పట్టని ఇబ్బంది నిసట్టువ చేస్తున్న పనుల్లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.


 రక్తము లో కోలేస్త్రోల్ కూడా పెరుగుతూ ఉంటుంది స్థూలకాయం బరువు బి పి లు కూడా పెరుగుతూ ఉంటాయి. అలoటప్పుడు కాఫీ టీ లు తక్కువుగా తీసుకోవటం. నిద్ర పోయే సమయములో ప్రశాంతమైన వాతావరణము ఉంచుకోవటము. బెడ్ రూమ్ లో వెలుతురు తక్కువ వచ్చే విధానము గ ఉంచుకోవాలి.


ఉద్యోగములో యాజమాన్యము వారు రోజుకు ఒక తీరుగ మార్చకుండా రాత్రి వేళ లేదా పగటి వేళ ఎదూకటి తరుచుగా కాకుండా వారితో మాట్లాడుకుని అలా ఏమి చేసుకుంటే దాని వల్ల ఒక జీవన గడియారం ఎదోకడానికి అలవాటు పడుతుంది. రాత్రి కూడా చేసి పగలు పడుకోవచ్చు పగలు పడుకుని రాత్రి డ్యూటీ చేయవచ్చు అలా ఒక సిస్టం తో ప్రయత్నం  చేయాలి.


ఇక ఆయుర్వేదం లో అయితే అరటిపండు గుజ్జులో 2 చెంచాలు దానిలో ½ చెంచా జీలకర్ర పొడి + 1 చెంచా తేనె కలిపి పడుకున అరగంట ముందు తింటే  మంచి నిద్ర పడుతుంది.  అలానే అన్నం తినగానే స్వీట్ ముక్క గోరువెచ్చని పాలు తీపి కలిపినా పాలు త్హగిన కూడా మచి నిద్ర పడుతుంది.


ఇక ఆయుర్వేదములో  Tagara  అను హిమాలయ వారి capsules రోజుకి ఒకటి చొప్పున వేసుకున్న స్ట్రెస్ తగ్గించి  నిద్ర పడుతుంది పగలు అయిన కూడా వేసుకోవచ్చు కాకపోతేయ్ కొద్దిగా నిద్ర పడుతుంది. లేదా స్లీప్వెల్  అని ఆయుర్వేదం షాప్ లో దొరుకుతుంది. లేదా zanocam జండు కంపన్ వారివి వాడిన కూడా మంచిది. దీని వల్ల ఎటువంటిసిదే ఎఫ్ఫీక్ట్స్ ఉండవు. 

గణేశ ఆరాధన అంతరార్ధం

      వినాయకుడు బృహస్పతి అవతారం అని చెబుతారు .  ఇంకో విషయం ఏంటంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు తన చెల్లెలు అయిన పార్వతి తనకి కొడుకు గా పుట్టమని కోరుకుంటే అలా వినాయకుడి గా అవతరించాడు అని కూడా చెబుతారు .  అందుకే  " శుక్లాంబర ధరమ్ విష్ణుం  శశి వర్ణం ....." అనే శ్లోకం లో తెల్లని వస్త్రాలు ధరించిన విష్ణువు అని అర్ధం కూడా వస్తుంది .

    ఆది శంకరులవారు జగత్తు అంతా తిరిగి 76 మతాలను ఆ మతాల స్థాపకులను ఎదిరించి కేవలం కేవలం 5, మతాలను మాత్రమే అంగీకరించారు.  అందులో సూర్యుడు , శివుడు , విష్ణువు , శక్తీ , గణేశుడు ఆరాధన చేస్తూ ఈ ఐదుగురిలో మనకు ఇష్టమైన దైవాన్ని మధ్యలో ఉంచి ఎక్కువ గా ఆరాధించడం అనే పద్ధతిని స్థాపించారు.  అందుకే ఆయనను షణ్మత స్థాపనాచార్య అని అంటారు.  ఈ ఆరు మతాలలో గణేశుడు ఉన్నాడు .  గాణాపత్యులు అని గణపతి ఆరాధకులు ఉన్నారు .పూర్వం శాస్త్ర పండితుల ఇళ్లల్లో ఈ 5 దేవతల విగ్రహాలు పెట్టుకొని పూజించే ఆచారం ఉండేది.  అలా వైదిక సాంప్రదాయం లో గణపతి అర్చన ఉంది. 

వర్షాకాలం కొత్త నీరు వచ్చి చేరుతుంది నదులు , చెరువులు మొదలైన వాటిలో.  ఆ నీటిని కాపాడుకోటానికి ఆ నీటి వనరుల్లో పాత మట్టిని తీసి ఆ మట్టి తో గణపతిని చేసి ఔషధ గుణాలు ఉన్న మూలికలు, పత్రాలతో ఆయనను పూజించి, పసుపు , కుంకుమ , గంధం , అక్షతలు అన్నీ కలిసిన ఈ పూజాపత్రిని, గణేశ ప్రతిమ తో సహా నీటిలో కలుపుతారు.  ఈ మూలికల వల్ల వాటిలోని ఔషధ గుణాలు నీటిలో చేరి కొత్త  నీరు శుద్ధి అవుతుంది.  ఇది విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విషయం .


   ఇక వేదాంత పరం గా చూస్తే సృష్టి లో ప్రతి జీవి మట్టిలో పుట్టి మట్టి లో కలిసిపోతుంది.  అనే విషయం మనకు ఈ పూజ తెలియజేస్తుంది.  మట్టి లో పంటలు పండించే ప్రజలు ఆ మట్టి తో విగ్రహాన్ని చేసి పూజించటం అంటే ఆ మట్టి కి చేసే వందనం.

     వినాయకుని రూపం చూస్తే ఆయన కు ఉన్న పెద్ద చెవులు మనకు ఎక్కువ వినాలి , తక్కువ మాట్లాడాలి అనే విషయాన్ని తెలియ జేస్తాయి .  ఏనుగు ముఖం అంటే సంపదలకు చిహ్నం.  అంటే లక్ష్మీదేవి యొక్క గుర్తు .  గజ వదనుడిని ఆరాధించటం వలన మనకు బల, జ్ఞాన, లౌకిక సంపదలు వస్తాయి అని చెప్పవచ్చు . 
  
    సృష్టి లోని విద్యలు భూమి నుండే ఆవిర్భవించాయి.  ఆ భూమి నే వినాయకుని గా భావించడం.  ఈ గణేషుడిని విద్యలకు అధిపతి గా భావిస్తాము .  అందుకే విద్యార్థులు వినాయక చవితి రోజున తమ తమ పుస్తకాలు ఆయన పూజలో పెట్టి, పసుపు తో ఓంకారం మొదటి పేజీ లో రాయటం జరుగుతుంది.  ఆయన చిహ్నమైన స్వస్తిక్ ను కూడా రాస్తారు.  అలా పూజించటం వల్ల సకల విద్యలు ప్రాప్తిస్తాయి అని ప్రజలు నమ్ముతారు .

         వినాయకుడి అసలు రూపం ఒకటే .  కానీ ఆరాధనా పద్ధతులు బట్టి ఆధునిక కాలం లో రక రకాల భంగిమలు, ప్రతిమలు , చిహ్నాలు వస్తున్నాయి .


   గణపతి ఆరాధన బౌద్ధ , జైన మతాలలో కూడా ఉంది .  జైన మతం కుబేరుడి అవతారం వినాయకుడు అని కూడా చెబుతుంది .  అందుకే వ్యాపారస్థులు వినాయకుడిని , లక్ష్మి దేవిని కలిపి పూజిస్తారు.  (ఇక్కడ వినాయకుడు సాక్షాత్ విష్ణువు అనే జ్ఞానం ఉండటం వలన కూడా కావచ్చు) 

   తాంత్రిక బౌద్ధం లో షడ్ భుజాలు గల మహాకాలుడి రూపం లో బౌద్ధ తాంత్రికులు మహా రక్త గణపతిని ఆరాధిస్తారు . 

 థాయిలాండ్ , కంబోడియా వంటి చాలా దేశాలలో ఇంకా చాలా విధాలుగా గణపతి ఆరాధన ఉంది .  అలానే అగ్ని , సూర్య ఆరాధన కూడా ఉంది .  ముఖ్యం గా ఆ దేశాలలో విజయానికీ , అదృష్టానికి బుద్ధి బలానికి మూల దేవునిగా వినాయకుడిని నమ్ముతారు , ఆరాధిస్తారు .

   పరబ్రహ్మ, పరమాత్మ ఒక్కడే ... మనమే వివిధ రూపాలలో చూస్తున్నాము.  శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపం లో చూడండి మనకు ఈ విషయం స్పష్టం అవుతుంది ఆ రూపం లో అందరు దేవతల  ముఖాలు ఉంటాయి వినాయకుని ముఖం కూడా ఉంటుంది .  భగవంతుడు ఈ విశ్వం లో చేసే పనిని బట్టి తన రూపం మార్చి ఆ యా వేషాలు వేసుకుంటాడు అని తెలుసుకోవాలి.  

   ఇంకొక విషయం ఏంటంటే గణేశ పూజ లో విగ్రహాన్ని మట్టితో తయారు చేస్తాము కొన్ని రోజులు పూజించితరువాత నీటిలో నిమజ్జనం చేస్తాము.  ఇక్కడ విగ్రహం తయారీ సృష్టి , పూజించటం స్థితి , ఇంకా నిమజ్జనం  లయం . ఇక్కడ ఈ ప్రక్రియలో సృష్టి , స్థితి , లయములు 3, ఉన్నాయి .  ఈ ప్రక్రియ అంతా ప్రతి మనిషి జీవితం లో ఉంటుంది . ప్రతి జీవి జీవన క్రమం లో ఉంటుంది.  ఈ విషయాన్ని అందరు తెలుసుకొని అంతా ఇక్కడ వదిలి వేసేదే, ఒక్క మంచి చెడులు, పాప పుణ్యాలు మాత్రమే వెన్నంటి వస్తాయి అని తెలుసుకొని ఒకరిని ఒకరు బాధ పెట్టకుండా బ్రతకాలి అనే జ్ఞానం అలవరచు కోవాలి మనం అందరం .

Foods to increase platelets count in our blood naturally

ఈ రోజుల్లో మనకు రక రకాలైన వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి.  అందులో కొన్ని మన రక్తం లోని ప్లేట్ లెట్స్ సంఖ్య ను బాగా తగ్గించి వేస్తున్నాయి అందువల్ల మనకు చాలా సమస్యలు ఎదురు అవుతున్నాయి .

రక్తం లో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే కొన్ని ఉత్తమ ఆహారాలు :

1. బీట్రూట్ :  ఇది ప్లేట్ లెట్స్ ను పెంచటం లో బాగా సహాయ పడుతుంది .  అనీమియా తో బాధ పడేవారికి ఇది ఉత్తమ మైన ఆహారం .

2.  క్యారెట్  వంటి దుంపలు వారానికి 2.సార్లు అయినా తినవలసి ఉంటుంది

3.బొప్పాయి ఒంట్లో బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఈ పండు తింటే చాలా మంచిది
.
4.ఆకు కూరలు మన శరీరం లో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు విటమిన్ k. ఎక్కువగా ఉన్న ఆకు కూరలు తీసుకోవటం మంచిది. 
 
5.వెల్లుల్లి మన శరీరం లో సహజం గా నే ప్లేటిలెట్స్ పెంచుకోవాలంటే ఇది తప్పక తినాలి .  దీనిని మనం వంటలో అన్నింట్లో ఉపయోగించు కోవచ్చు .

6.దానిమ్మ : ఎర్రగా ఉండే అన్ని పండ్లలో ఐరన్ అధికం గా ఉంటుంది .  ఇది రక్తం లో ప్లేట్ లెట్స్ ను పెంచుతుంది.  కనుక దానిమ్మ పండ్లు మనం తినటం మంచిది.

7.ఆప్రికోట్ :  ఐరన్ ఎక్కువగా ఉండే పండ్లలో ఇది కూడా ఒకటి .  రోజు రెండు సార్లు ఆప్రికాట్ తినటం వల్ల ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది
 .
8.ఎండు ద్రాక్ష : రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30% ఐరన్  ఉంటుంది ఒక గుప్పెడు ద్రాక్ష తినటం వలన సహజం గానే ప్లేట్ లెట్స్ పెరుగుతాయి.

9.ఖర్జూరం ఎండు ఖర్జూరం లో ఐరన్ మరియు ఇతర పోషకాలు అధికం గా ఉన్నాయికనుక మనం వీటిని తినడం ఎంతో అవసరం .

10. అల్లం రసం ఒక చెంచా తేనే ఒక చెంచా కలిపి ఒకరోజు , పసుపు ఒక చెంచా తేనే ఒక చెంచా మరొక రోజు మార్చి మార్చి తీసుకుంటూ ఉంటె ఈ ప్లేట్ లెట్స్ పెరుగుతాయి .
 

కాల్షియమ్ part 2

మహిళల్లో కాని పురుషులలో కాని 45 సo,, దాటినా తరువాత శరీరములో కాల్షియమ్ ఉత్పత్తి నిలిచి పోతుంది . అందుకనే ఎముకలు బలహీన పడుతూ ఉంటాయి . రెండు విధాలుగా మనం ఆ సమస్య నుంచి బయట పడవచ్చు

 1 ) శారీరక శ్రమ శరీరము లో అన్ని భాగాలు కదిలే వ్యాయామము. దీనిలో కాళ్ళను  చేతులును ఎక్కువగా కదిపే వ్యాయామం చెయ్యాలి.   ఎక్కువుగా శ్రమ పడే శరీర భాగాలకు మెదడు ప్రత్యేకముగా శరేరము నున్చి కాల్షియమ్ తెప్పించి యిస్తుoది. అందుకే వ్యాయామము చేయాలి.

2 ) ఇక బయట నుంచి కాల్షియమ్ తీసుకోవచ్చు అదీకూడా ఇంగ్లీష్ మందుల కంటే సహజ సిద్ధమైన పెరుగు, మజ్జిగ, సిట్రస్ పండ్లు, నిమ్మ, బత్తాయి, నారింజ etc.... ఇంకా పెసలు, శనగలు మొలకలు, రాగుల పిండి, సీతాఫలము లాంటి పండ్లలో బాగా కాల్షియమ్ ఉంటుంది.

 ఆయుర్వేదం లో అయితే ధూప్ పాపెశ్వర్ కంపని వారి అస్థిపోషక్ దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాని కాకరకాయ నేరేడు కాయ వంటివి దీనికి పత్యము. మోకాలు నెప్పులు ఉన్నవారు కూడా పైన చెప్పిన అష్టి పోషక్ వాడితే లాభము కనపడుతుంది.  మోకాలి  చిప్ప పై చింత గింజల పొడి నువ్వుల నూనెలో బాగా కలిపి ముద్దలా కలిపి  రాత్రి వేళ పట్టు లా  వేసుకోవాలి తెల్లవారి తీసేయచ్చు అలా కొన్ని రోజులు చేయటo ద్వారా మోకాలి నెప్పులు తగ్గు ముఖము పడతాయి.

 ఇంకా ఒక చెంచాడు మెంతుల పిండి కప్పు మజ్జిగలో కలిపి రోజు తీసుకోవాలి మోకాలి నెప్పులు నయము అవుతాయి అయితే థైరాయిడ్ వారికి మెంతులు పడవు అని  గ్రహించాలి.  

త్రిఫల చూర్ణం /మాత్రలు -- ఉపయోగాలు, కాల్షియమ్ part 1

ప్రశ్న. త్రిఫలను ఉదయమైన రాత్రి అయిన భోజనానికి ముందు తీసుకోవాలా  లేదా భోజనానoతరము తీసుకోవాలా  ?

జ : మూల రోగము, భగందర రోగము కడుపుకు సంబంధించిన రోగములు నయము చేసుకోవాలంటే రాత్రిపూట భోజనము చేసిన తర్వాత ఒక చిన్న చెంచాడు పాలతోగాని వేడి నీళ్ళతో గాని తీసుకోవాలి.

ఇక ఉదయము తీసుకునేవారు అల్పాహారానికి ముందు ౪౫ నిమిషాలు ముందే త్రిఫల చూర్ణం తీసుకోవాలి. ఇప్పుడు మరొక విషయము తెలుసుకుoదాము. వాగ్భాతుడు చెప్పిన అత్యుత్తమైన పదార్థము త్రిఫల చూర్ణము దీనితోబాటుగా కొన్ని చెప్పుకున్నాము శొంఠీ. ఇంగువ జీలకర్ర వీటిలో మరొక గొప్ప ఔషధము మెంతులు. ఇవి వాత+కఫరోగాల్ని తగ్గిస్తాయ. కానీ పిత్తాన్ని పెంచుతాయి. పిత్త సంభంద రోగాలు,అసిడిటి, అల్సర్స్ పెప్టిక్ అల్సర్స్, నోటిలోకి నీరు రావడము భోజనము చేసిన రెండు గంటల తర్వాత కూడా నోటిలో రుచి ఉండటము. త్రెంపులు వెక్కిళ్ళు రావటం ఇవన్ని పైత్యరోగాలు. ఈ పిత్త సంభంద రోగాలు ఉన్నవారు తప్ప , వాత+కఫ రోగాలు ఉన్నవారు మాత్రము మెంతులు బాగా తీసుకోవచ్చు.

వాత రోగాలు అంటే, కీళ్ళ నొప్పులు, భుజాల నోప్పులు,మోకాళ్ళ,నడుము నొప్పులు లాంటివి ఉన్నవారు. మెంతులు ఉపయోగించే విధానము. రాత్రిపూట ఒక గ్లాసు గోరువేచ్చని లేదా వేడి నీటిలో గాని చెంచ మెంతులు నానబెట్టి ఉదయాన్నే బాగా నమలి నమిలి తినాలి. ఒకేసారి మింగి తినడము వల్ల అంత ప్రయోజనము ఉండదు. బాగా నమిలి తినడము వలన అది మీ లాలాజలము కలిసి లోనకి వెళ్లి మీకు ఎక్కువ మేలు చేస్తుoది. ఎక్కువుగా మనవాళ్ళు మెంతులు పచ్చళ్ళలో ఉపయోగిస్తారు. ఇలా మెంతులు వేసి ఉన్న ఏ పచ్చడి అయిన మీరు సంతోషముగా తినవచ్చు . కొన్ని పచ్చళ్ళలో వాము కూడా వేస్తారు. ఈ మెంతులు వాము వేసిన పచ్చ్ల్లలో ఔషధ గుణములు ఎక్కువుగా ఉంటాయి. నీటిలో నానిన మెంతులు కంటే నూనెలో నానిన మెంతుల ఔషధ గుణాల విలువలు చాల ఎక్కువ. కనుక మీరు ఇంగువ , వాము, మెంతులు ఉన్న పచ్చళ్ళు తీసుకోవటము మంచిది. ఔషధులు లేని పచ్చడి తీసుకోకూడదు.

మరొక విషయము, భోజనము చేసిన తరువాత సున్నము తో తమలపాకు వేసుకునే వారు జీవితములో వాతరోగల బారినపడరు. ఎప్పటికి మెంతులు కంటే సున్నము ఎక్కువ వాతనాశిని, ఆధునిక వైద్య శాస్త్రము ప్రకారము కూడా శరీరములో కాల్శియుం తగ్గితే 50 కిపైగా జబ్బులు వచ్చే అవకాశము యున్నది.. ఇవన్ని నొప్పుల రూపములోనే ఉంటాయి. ఎక్కువుగా ఎముకలకి సంభందించిన నెప్పులు ఇంకా రక్తానికి కఫానికి సంభందించిన రోగాలు కూడా వస్తాయి. కాబట్టి ఎపుడు శరీరము లో కాల్షియమ్ తగ్గకుండా చూసుకోవాలి. శరీరములో కాల్షియమ్ అనీ పోష్టకాహారము యుండటము వలెనే మిగతా పోషకాలన్నీ ఉపయోగ పడతాయీ. ఇది ఎన్నో సంవత్సరాల ప్రయోగ ఫలితముగా చెప్పబడినది.


దీని అర్ధము చూడoడి మీ శరీరములో ఏ విటమిన్ అయిన తెలియబడా లంటే? ముఖ్యంగా కాల్షియమ్ ఉండాలి. ఇది కూడా శరీరము 40 నుంచి 45 సంవత్సరాల వరుకు మనము స్వీకరిoచే ఆహారము లో నుంచి కాల్షియమ్ తయారు అవుతుంది. కాల్షియమ్ ఎక్కువుగా ఉండీ పదార్థాలు పాలు, పెరుగు ,మజ్జిగ,వెన్న, నెయ్యి వీటిలో కాల్షియమ్ పుష్కలంగా ఉంటుంది. మిగతావాటిలో అనగా నారింజ, కమల, బత్తాయి ద్రాక్ష వంటి పుల్లటి ఫలాలో కూడా కాల్షియమ్ పుష్కలంగా ఉంటుంది, అలాగే మామిదిపండులో కూడా ఉంటుంది. పండ్ల అన్నిటిలో కాల్షియమ్ పుష్కలంగా ఉండే పండు అరటి పండు. అరటిపండు కాల్షియమ్ యొక్క బాoడాగారము. ఇది తేలిక గ కూడా అరుగుదల అవుతుంది . కనుక అరటిపండు తప్పకుండగా ప్రతిరోజు తీసుకోవాలి. ఈ పండ్లలోని కాల్షియమ్ మనకు 40 నుంచి 45 సంవత్సారాల వరకే తయారు అవుతుoది.


45 సంవత్సారాలు పూర్త్హి కాగానే స్త్రీలకూ నేలసరులు ఆగిపోయిన తరువాత, శరీరము కాల్షియమ్ తీసుకునే తయారుచేసుకొనే సామర్ధ్యము తగ్గిపోతుంది. ఎంతగా మీరు కాల్షియమ్ తీసుకున్నపటికి కాల్షియమ్ జీర్ణము చేసే గ్రంథులు, ఉత్పత్తి ఆగిపోతుoది. అప్పుడు కాల్షియమ్ జీర్ణము కావడము చాల కష్టమౌతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు కాల్షియమ్ భయట నుండి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే స్త్రీలందరు గుర్తు ఉంచుకోండి. 45 సంవత్సారాల తరువాత సున్నం తీసుకోవటము తప్పనిసరి పురుషులు కూడా తప్పకుండ 45 సంవత్సారాల తరువాత సున్నము తీసుకొనవలెను. అందుకే మన దేశము లో తాంబూలము తీసుకొనుట అలవాటు ఉన్నది, తమలపాకు ఎప్పుడు సున్నం తోనే వేసుకోవాలి, కాచు వాడకూడదు.            

few health tips

మత్తు పానీయాలు గుట్క మానాలoటే గో మూత్రము రోజు కొంచెంగా ౩ నెలలు తీసుకోవాలి లేదా కొంచెం అల్లం రసము కాని శొంటి రసము కాని బెల్లము కలిపి తాగించండి. ఇది కూడా మూడు నెలలు తీసుకోవాలి. గో మూత్రము కొంచెంగా తాగుతూ ఉంటె సిగరెట్ బందు చేస్తారు.

2. పెద్ద వయస్సు వారు మోకాలి నోప్పులతో బాధ పడుతూ ఉంటె సున్నము లోపలకి తీసుకోవాలి  ఇంకా భుజాల నెప్పులు మోచేతులు నెప్పులు ఉంటె నీటిని తీసుకునేటప్పుడు కుర్చుని చిన్నగా గుటక గుటక గ తాగటం అలవాటు చేసుకుని చుడండి.

౩. నిద్ర పట్టని వారు పడుకునేటప్పుడు ఆవు నెయ్యి చుక్కలు ముక్కులోవేసుకుంటే బాగా నిద్రపడుతుంది

4. స్త్రీలకూ ఎక్కువుగా వైట్ బ్లీడింగ్ అవుతుంటే ఆయుర్వేదము షాప్ లో దొరికే శతావరి చూర్ణము పాలల్లో వేసి మరిగించి తాగవలెను

5.నెలసరి సమస్య ఉన్నవారు వేడి వేడి నీళ్ళల్లో కొంచెం నెయ్యి కలిపి తీసుకుంటే మంచిది ఏ  నెయ్యి ఐన పర్వాలేదు.నెలసరి జరుగుతున్న రోజుల్లో రోజుకు రెండు మూడు సార్లు తాగవచ్చు స్త్రీలకు ఆసమయము లో వచ్చే సమస్యలు అన్ని తగ్గిపోతాయ్.

6. డ్రై ఫ్రూట్స్ ఏవైన మితo గా  తీసుకుంటూ ఉంటె వంటికి బలాన్ని ఇస్తుంది శరీర సౌష్టవము కలుగుతుంది. జీడిపప్పు తప్ప ఏ డ్రై ఫ్రూటు బరువుని పెంచవు.

7.సున్నము తింటే నాలుక పగులుతు ఉంటె నీళ్ళలో కలిపి లేదా పెరుగుతో కలిపి తీసుకోండి . తమలపాకు తో కూడా సున్నం కలిపి తీసుకోవచ్చు.. 

తలపుల తలుపులు

గుండెల్లో ఇల్లు కట్టావు,
ఆ ఇల్లు వదిలి వెళ్ళలేవు
 ఆ ధ్యాస నిన్ను వెళ్ళనివ్వదు
 శ్వాస శ్వాసకు మధ్య నీ  ధ్యాస
 నా వేడి ఊపిరిలు నీ చెవి లో గుసగుసలు
 కాలాన్ని పరుపులా వేసేస్తాను.
చూపుల గాలం లో నీ పరువాలని పట్టేసింది
. కౌగిలింతలో అందాలకు ఆర్థ్రత వస్తుంది.
 ప్రేమ ఊహలు అన్ని ఇక  ఊగే ఊయలలు.
 నీ పొడగాటి జడ నా భుజాలలో ఇరుక్కుని పోతుంది.
మల్లెల్లు అన్ని ఆశల దారం లో దోబూచులాదతాయి
 ఆ రాత్రివేళ  వెన్నెల కురుస్తు ఉంటుంది.
 చల్లని గాలులు నీ ప్రేమను నా పై అభిషేకిస్తాయి,
 నీ ఆధారాలు నా పై రంగులు అద్దుతాయి ,
 నీ ముంగురులు పాపిటి కుంకుమ
 నా పై జల్లిన  రహస్యాలు చూడాలని భానుడు ఉరికి వస్తాడు,
 తెల్లవారి నా మెడ నిండా నీ కుంకుమ  గుర్తులే
 గుండెల్లో ఇల్లు కాస్త పొదరిల్లు అవుతుంది
 ఆ పొదరిల్లు కి మనమిద్దరం రెండు తలుపులం
 ఎన్నో  తలపులకి ఇద్దరము బందీలము .

చిలిపి జల్లులు

వర్షం వయ్యారం గా పడుతోంది
భవనం పైనుంచి అందమైన దృశ్యం చూస్తున్నాను
రెండు గోరింకలు తడుస్తూ విహారం చేస్తున్నాయి
ఎదురు భవనం లో నుండి ఆమె నా వైపు చూస్తోంది
ఆమె విశాల నేత్రాలు నన్ను పలకరిస్తున్నాయి
నేను కొంటె నవ్వుల బాణాలు విసిరాను
ఆమె సిగ్గు పడుతూ చీర కొంగుతో ముఖం కప్పుకుంది
నేను బయటకు వచ్చాను , ఆమె నాకోసం వచ్చింది
నేను తడిసిపోతున్నాను ఆమెకు మాత్రం గొడుగు పట్టాను
ఇక వర్షం ..పెద్దగా పడుతోంది
ఇద్దరు తడిసి ముద్దయిపోతున్నాం
ఆ ఆశల చినుకుల్లో ఆ జంట గోరింకల్లాగా
వర్షం ఆగిపోయింది ......కళ్ళు తెరిచాను
ఆమె అక్కడ లేదు ......లోపలి వెళ్ళిపోయింది
వయసు మాటున మనసుకు వచ్చిన ఊహ అని నవ్వుకున్నాను

cholestrol n its good n bad effects

            కోలేస్ట్రోల్ అనీ కొవ్వులలో రెండు రకాలు ఉంటాయి మొదటిది మేలు చేసే కొవ్వులు హచ్ డి ఎల్ అంటారు ఇవి గుడ్డు తెల్లసొన లో ఉంటాయి. శరీరైనికి హానికారకమైనవి కోవులను ఎల్ డి ఎల్ అంటారు. చెడు కొలేస్ట్రోల్ వంటికోవ్వులు గుండె జబుఉలకు ఒక్కరిస్క్ ఫాక్టర్.. చెడు కొలేస్ట్రోల్ పాళ్ళు ఎక్కువుగా ఉండే ఆహారం తినీవరిలో ఫాస్ట్ ఫుడ్ తీసుకునేవారిలో ఉండే జబ్బులరిస్క్ ఎక్కువుగా ఉంటుంది. అయితే రక్తములో ఈ రెండు రకాల కొవ్వులని కలుపుకొని 2౦౦ లోపు ఉండాలి. ఎల్ డి ఎల్ 1౦౦లొపు, హెచ్ డి ఎల్ ౪౦పైన ఉండాలి అలాగే ట్రయ్గ్లిజరిడేస్ అనీ మరో రకం కొవ్వులు కూడా గుండెకు హాని చేస్తాయి. ఇవి ౧౫౦ లోపు ఉండాలి.
         కొలేస్ట్రోల్ మన శరీరములోకి రెండు రకములగా చేరుతుంది. ఒకటి ఆహారం ద్వారా మరొకటి లివర్ పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు ౭౦ మిల్లి గ్రా. కొలేస్ట్రోల్ ఉంటుంది. మెదడు నరాలు వ్యవస్థ కోసం. శిశువు ఎదగడానికి ఈ కొవ్వులు ఉపోయోగాపడతాయీ. ఆ తర్వాత వీటి అవసరము అంతగా ఉండదు. అయితే జన్యు తత్వాన్ని బట్టి ఈ కోవులు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. వేపుళ్ళు బ్యాకరి పదార్థములు, కృత్రిమ నెయ్యి వంటివి తినే వారిలో ఈ కోవ్వు పేరుకుంటూఉంటుంది . ఇదీ గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక రక్తములో కొలేస్ట్రోల్ పాళ్ళు ఎక్కువుగా ఉన్నవారిలో డాక్టర్లు వాటిని అదుపు చేసే మందులు ఇస్తూ ఉంటారు..ఈ తరహ మందులు వాడుతున్న వారు వాటిని మధ్యలోనే ఆపకూడదు. మీరు మామ్సహారము పూర్తిగా మానేయలేకపోతే కొవ్వులు తక్కువుగా ఉండే చేపలు, చికెన్ వంటి వైట్ మీట్ తీసుకోండి. వీటిలోనూ చికెన్ కంటే చేపలు మంచివి. కాబట్టి మాంసము తీసుకోవలనిపిస్తే చేపలు తీసుకోవటము మంచిది. అదీ కూడా ఉడికించినవి అయితేనే వేపుడు వద్దు.



 


          దీని నిర్దారణ కోసం లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి. నడుస్తూ ఉంటె ఆయాసంగ ఉంటె దీనికి ఒక కారణం కోలేస్ట్రోల్ అవుతుంది. ఇక ఈ కొలేస్ట్రోల్ ఎక్కువుగా ఉన్నవాళ్లు పెరుగు అన్నం ఎక్కువుగా తినకూడదు. ఉత్త పెరుగు అసలు తినకూడదు. అంటే పలుచని మజ్జిగ చేసుకుని భోజనం లో వాడితే మంచిది. పీచు పదార్థాలు ఉన్న భొజనం ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి. అంటే ఒఅట్స్ ఎక్కువుగా వాడాలి స్వీట్స్, నెయ్యి తగ్గించి తినాలి. వేపుళ్ళు బేకరి పదార్థాలు ఆలుగడ్డ చిప్స్ తినరాదు. ఉడికించిన కూరలు వంటివి మంచివి నూనెలో, నేతి లో వేయించిన పదార్థాలు మంచివి కావు. ఆవిరి కుడుములు, ఇడ్లి మరియు పొట్టు మినపప్పు తో చేసినవి అయితే మంచివి . వ్యామము తప్పనిసరి స్పీడ్ గ వాకింగ్ చేయాలి. లివర్ ఆరోగ్యంగా ఉంటె అంతా బాగుంటుంది. కొలేస్ట్రోల్, షుగర్ లివర్ అనారోగ్యానికి కారణం అవుతూ ఉంటాయి. ఇంకా యోగ,ప్రనయామములు చేస్తూ మానసిక ఆరోగ్యమము పెంచుకోవాల్సిన అవసరం చాల మంచిది. ధ్యానం చేస్తూ మనసను ప్రశాంత పరుచుకోవాలి. 

       ఇక ఆయుర్వేదం లో హిమాలయ కంపెనీ వారి లశున కాప్సులేస్ రోజు ఒకటిలేదా రెండు వాడవచ్చును. తయారి లో వెల్లులి వాడకమున్న మంచిమందు మిశ్రమము. భోజనములో కూడా ఉల్లి వెల్లులి వాడుతూ ఉండటం మంచిది. కరక్కాయ చూరణము అన్ని ఆయుర్వేద దుకాణము లో దొరుకుతుంది. కరక్కాయ చూరణము మరియు తేనె రంగరించుకుని తీసుకుంటూ ఉంటె మంచిది. చెడు కొలేస్ట్రోల్ కరిగి పోతుంది. మనము వాడే వంట నూనెల్లొ కూడా రైస్ బ్రాన్ ఆయిల్ అయితే మంచిది. కొంతమంది సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుతూ ఉంటారు. దీని వాళ్ళ శరీరములో ఉష్ణం పెరుగుతుంది అదీ కూడా మంచిదే.
       ఇక లిపిడ్ ప్రోఫైల్ టెస్ట్ లో కొలేస్ట్రోల్ తో పాటు ట్రయగ్లజారిడెస్ కూడా 100,౧౫౦ మించితే ప్రమాదం ఉంది కాబట్టి. ట్రయగ్లజారిడెస్ తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇవి రాక్తనాళ్ళ లో ముద్దగా కడుతూ ఉంటాయి. వీటిని తొలగించుకోవాలి అంటే పచ్చి కూరగాయలు కార్రోట్స్, ఉల్లి, బీట్రూట్ వంటి కూరగాయలు తీసుకుంటూ ఉంటె మంచిది. కీర సలాడ్స్ వంటివి భోజనము కి ముందు తీసుకుంటూ ఉండటం మంచిది. ఫ్రూట్ సలాడ్స్ తరుచుగా తీసుకుంటూ ఉంటె మంచిది షుగర్ వాళ్లకి కూరగాయలతో చేసిన సలాడ్స్ అయితే నే మంచిది. ఇక ట్రయగ్లజారిడెస్ కు ఆయుర్వేదం లో APEX కంపెనీ వారి TRIGLIZE అనే కాప్సులేస్ ఉంటాయి. రోజుకి ఒకటి లేదా మూడు చొప్పున తీసుకుంటూ ఉంటె మంచిది. సమస్య కొంచెం తక్కువుగా వుంటే నలభై రోజులు వాడవచ్చును. జంక్ ఫుడ్స్, కొవ్వు పదార్థాలు ఐస్ క్రీమ్ వంటి ఆహరాలకి దూరంగా ఉండాలి.

మనం మానవత్వం మరిచిపోతున్నామా ?

   పైన వఛ్చిన వార్త చాలా బాధాకరమైన విషయం.  " యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః "  ఎచట స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు  అని పురాణాలు చెబుతున్నాయి. 
పూజించటం పోయి హింసపెట్టటం , చంపటం చాలా మాములు అయిపోయింది. 
  పట్టపగలు హత్య జరుగుతూ ఉంటే నిజం గా అక్కడ మనుష్యులు ఉన్నారా ?  మానవత్వం ఏమయిపోయింది ?  ప్రతిచోటా కూడా బజారులో కొట్టుకుంటూ ఉంటే, కత్తులు తీసుకుని రౌడీలు మనిషిని తరుముతూ ఉంటే, దాడులు చేస్తూ పోతుంటే , పశువులను రోడ్డు మధ్య లో బరువులు లాగటం లేదని హింసిస్తూ ఉంటే ఏ ఒక్కరూ మాట్లాడరు!   నోరు తెరిచి చోద్యం చూస్తూ ఉంటారు . 
   ఈ అమ్మాయి స్వాతి హత్య జరిగిన ప్రదేశం రైల్వే స్టేషన్.  అది చాలా మంది జనం ఉన్న బహిరంగ ప్రదేశం.  కనీసం ఒక 50 - 60 మంది చుట్టూ చూస్తూ ఉన్న సమయం లో వాడు ఈ హత్య చేసి పారిపోయాడంటే మన సమాజం లో ఎంత గా చైతన్య రహితం గా మారింది అనేది తెలుస్తోంది .  అసలు గొడవలు, దాడులూ జరుగుతుంటే వాటిని ఆపటానికి ప్రయత్నించ కుండా ఏదో చోద్యం చూస్తూ నిలబడి ఆ తర్వాత కొవ్వొత లూ, దీపాలు పట్టుకుని రోడ్లపై తిరగటం, చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం అంటూ పువ్వులు పెట్టి ప్రార్ధనలు చెయ్యటం ఎంత వరకు సబబు ?     ఆరోజు రైల్వే స్టేషన్ లో ఈ హత్య జరిగినప్పుడు అక్కడ ఒక్క మగాడు కాదు అసలు ఒక్క మనిషి కూడా లేదా అని నాకు అడగాలి అనిపిస్తోంది.  అక్కడ ఉన్నవారిలో ఏ కొద్దీ మంది గట్టిగా ప్రయత్నించినా ఆ వ్యక్తి ని ఈ దారుణం చెయ్యకుండా ఆప గలిగే వాళ్ళు. ఆ అమ్మాయి ప్రాణం కాపాడ గలిగే వాళ్ళు.  మనం సినిమా హీరోల్లాగా అందరితో ఫైట్లు చెయ్యక్కర్లేదు.  ఆ సందర్భానికి తగినట్లు మనం వ్యవహరించి మనకు చేతనైన మార్గం లో హింసని ఆపగలిగేతే అది చాలు . కానీ అంత మంది  లో ఏ ఒక్కరు గట్టిగా ఏయ్ ! ఎవడ్రా నువ్వు ? ఏంటి నువ్వు చేస్తున్న పని అని గట్టిగా అరిస్తే కూడా వాడు ఒక్కసారి ఆగిపోయేవాడు.  మిగిలిన జనం అందరూ కలిసి ప్రయత్నిస్తే వాడిని ఆపగలిగే వారు .  కానీ అలా ఎవరు చెయ్యలేదు.  అందరూ ఏదో సినిమా చూస్తున్నట్లు నిలబడి పోయారు .  ఇంకా బాధ కలిగించే విషయం ఏమిటంటే వాడు అలా ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యం గా పొడిచి వెళ్లిపోతుంటే ఎవరు పట్టుకోవటానికి ప్రయత్నించలేదు సరికదా ఆ అమ్మాయి నెత్తుటి మడుగులో మృత్యువు తో పోరాడుతూ ఉంటే ఏ ఒక్కరూ కూడా ఆమెను రక్షించటానికి కూడా ప్రయత్నించ లేదు దాదాపు 20 ని,, ఆమె అలానే ఉంది .  చివరికి ప్రాణాలు వదిలింది .  ఇది చాలా హృదయ విదారక మైన సంఘటన .  అక్కడ ఆ సమయం లో ఒక్క మగాడు లేడా? ఈ ప్రశ్నవిషయం తెలుసుకున్న ప్రతి వ్యక్తి మనసులో కలుగుతోంది .
   ఈ సంఘటన గురించి విన్నప్పుడు నాకు ఈమధ్య కాలం లో నా కళ్ళముందు జరిగిన రెండు విషయాలు గుర్తుకు వచ్చాయి.  ఒకసారి  నేను ఇంకా కొంత మంది నా స్నేహితులు కలిసి బజారులో నడిచి వెళ్తున్నాము .  అక్కడ ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయ్యింది కారణం ఏమిటా అని చూస్తున్నాము.  అక్కడఒక ఎడ్లబండి ఒక ఫ్లయ్ ఓవర్ కింద నుండి U-టర్న్ తీసుకుంటోంది.  కానీ ఎందుకో బండి ఒక్కసారిగా ఆగిపోయింది .  ముందుకు కదలడం లేదు. ఆ బండి వాడు ఆ ఎద్దుని ముందుకు కదలమని గట్టిగా కొడుతున్నాడు.  ఆ ఎద్దు ఎంత ప్రయత్నించినా ఆ బండి కదలటం లేదు.  బండి వాడు కొడ్తున్న దెబ్బలకి ఆ ఎద్దు చర్మం చిట్లి రక్తం కారుతోంది.కానీ చుట్టూ ఉన్న జనం వాళ్ళ దారిన వాళ్ళు వెళ్లిపోతున్నారు.  సూట్లు, బూట్లు వేసుకున్నవాళ్ళు , ఇంకా ఎందరో రకరకాల మనుషులు ఉన్నారు అక్కడ.  కానీ ఎవరూ మాట్లాడటం లేదు .  ఆ బండి వాడిని ఆ ఎద్దుని కొట్టటం ఆపమని ఎవరూ చెప్పటం లేదు .  వాడు కూడా దాన్ని ఇంకా హింసిస్తున్నాడు .  పాపం ఆ ఎద్దు ఇంకా తన శక్తిని అంతా ఉపయోగించి బండిని లాగటానికి ప్రయత్నిస్తోంది .  అప్పుడు నేను ఇంకా నా స్నేహితులు ఒక విషయాన్ని గమనించాము .  అది ఏమిటంటే ఆ బడి లో ఉన్న ఇనుప కడ్డీలు ఆ వంతెన కింద ఉన్న పిల్లర్లలో ఇరుక్కున్నాయి.  అందువల్ల ఆ ఎద్దు బండిని లాగలేకపోతోంది.  నేను ఆ బండి వాడిని గట్టిగా ఆగమని అరిచాను .  దానికి వాడు ఆగి కిందికి దిగి వచ్చాడు.  అప్పుడు వాడికి ఈ విషయం చూపించి వాడిని గట్టిగా కేకలేసాను అసలు విషయం గమనించకుండా ఆ ఎద్దుని కొట్టినందుకు .  అప్పుడు వాడు సిగ్గుతో తల వంచుకున్నాడు.  ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ విషయం గమనించి ఆశ్చర్య పడ్డారు .  అప్పుడు అందరూ ఏదో నిద్ర నుండి మేల్కొన్నట్లు వఛ్చి సహాయం చేసి ఆ కడ్డీల్ని పక్కకి జరిపారు.  అప్పుడు బండిని ఎద్దు ముందుకు లాగ గలిగింది.  నేను , నా స్నేహితులు అక్కడ ఉన్న వారినీ, ఆ బండి వాడినీ కూడా గట్టిగా కేకలేశాము.అలానే ఇంకొక సారి మేము బైకులపై వెళ్తున్నాము ఆ ప్రదేశం ఊరికి బయట ప్రదేశం.  అప్పుడు మాకు కొన్ని అరుపులు వినబడ్డాయి.  మేము ఆ శబ్దం వస్తున్న వైపుకి వెళ్ళాము.  అక్కడ కొంత మంది వ్యక్తులు ఒక మనిషిని కలబడి కొడుతున్నారు.  ఆ వ్యక్తి ఆ దెబ్బలకి తట్టుకోలేక అరుస్తున్నాడు.  అది చూసిన మేము వాళ్ళ దగ్గరికి పరిగెత్తాము ఆపమని అరుస్తూ .  ఆ కొడుతున్న వ్యక్తులు మమ్మల్ని చూడగానే కొట్టటం ఆపివేసి పారిపోయారు.  మేము ఇతనిని తర్వాత హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాము.  అతను బాగానే ఉన్నాడు .ఇది ఎందుకు రాస్తున్నానంటే ఈ రెండు సంఘటనల్లో కూడా మేము ఆ హింసకు పాల్పడుతున్న వ్యక్తుల్ని ఆపటానికి ప్రయత్నించాము. మేము ఆపగలిగాము.
కానీ ఈ అమ్మాయిని ఒక వ్యక్తి అంత దారుణం గా హింసించి చంపుతుంటే అక్కడి వారు భయపడి అవతలకు వెళ్లిపోయారట.  వాడు ఒక్క మనిషి పైగా వాడి చేతిలో పెద్ద ఆయుధాలు ఏమి లేవు.  చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కలిసి గట్టిగా అడిగితే వాడు అప్పుడే పారిపోయేవాడు.  కానీ వారు ఆపని చేయలేదు.  ఇంకా దారుణమైన సంగతి ఏంటంటే వాడు వెళ్ళిపోయినాక కూడా ఆఅమ్మాయి నెత్తుటి మడుగులో కొట్టుకుంటుంటే ఏ ఒక్కరూ ఆమెకు సహాయం చెయ్యలేదు.  కళ్ళముందు మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకున్నారు .  ఇది మానవత్వం సిగ్గు పడవలసిన విషయం.మన సమాజం లో మనకు ఒక అలవాటు బాగా ఉంది.  అది ఏమిటంటే మనం ఎప్పుడూ ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తుంటాము మనల్ని నడిపించటానికి.  స్వతంత్ర పోరాటం లో గాంధీగారు వచ్చే వరకు మనకు ఐకమత్యం గా పోరాడాలి అని అనిపించలేదు.  ఇది అన్ని సందర్భాల్లో పనికిరాదు.  ఎవరికోసమో ఎదురు చూడకుండా మనుషులుగా మన కనీస బాధ్యత మనం నిర్వర్తిస్తే చాలు చాలా మంచి పనులు చెయ్యవచ్చు.  మనం కనీసం మనుషులుగా ప్రవర్తించి మానవత్వాన్ని కాపాడుదాం.

ఐలయ్య గారి కొత్త కోణం -- కొన్ని చిన్న చిన్న సందేహాలు

ఈ మధ్య కాలం లో కంచె ఐలయ్య గారి వ్యాఖ్యలు విన్న తర్వాత కొన్నిసందేహాలు కలుగుతున్నాయి.  ఆయనను, ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా అర్ధం చేసుకోవాలో తెలియటం లేదు.  ఎందుకంటే ఆయన మాటలు అంత లా అయోమయాన్ని కల్గిస్తున్నాయి .

1.  ఈ సమాజం లో 5% ఉన్న బ్రాహ్మణులపై దాడి ఎందుకు చేస్తున్నారో తెలియదు .  ఖచ్చితం గా ఈ అనవసర ప్రేలాపనలు , కాలక్షేపం వెనుక కొంత మంది ఇతర మతాలూ , కమ్యునిస్టులు ఉన్నారు అని కొంత మంది మేధావుల అభిప్రాయం . 

2.  స్వతంత్ర సమరం లో మొదటి కాంగ్రెస్ సభలో ఉన్నది ఎక్కువ మంది అందరూ బ్రాహ్మణులే ఒక్క గాంధీ గారు తప్ప .  వారంతా వారి ఆస్తులు అన్నీ ఇచ్చేసి ఉద్యమం కోసం అంకితం అయిపోయారు . 

3.  మరొక పక్క సంఘ సంస్కర్తలు రామకృష్ణ పరమహంస , దయానంద సరస్వతి , వినోభా భావే వంటి వారు చాల మంది బ్రాహ్మణులే .

4.  జగదీశ్చంద్ర బోస్ , ఎల్లాప్రగ్గడ సుబ్బారావు , మోక్షగుండం విశ్వేశ్వరయ్య , ప్రకాశం పంతులుగారు , కందుకూరి వీరేశలింగం , గురజాడ అప్పారావు పి .వి నరసింహారావు , ఇందిరా గాంధీ మన్మోహన్సింగ్ , బూర్గుల రామకృష్ణ రావు వంటి వారు ఎందరో బ్రాహ్మణులు మేధావులు ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడ్డారు .

5.  బ్రిటిష్ వారి కాలం లో భారత సైన్యాన్ని 3, మండలాలు గా విభజించారు.  కలకత్తా , ముంబై మరియు ఢిల్లీ.  ఈ సైన్యం లో ఎక్కువగా మూడు రకాల వారు ఉన్నారు బ్రాహ్మణులు , క్షత్రియులు మరియు ముస్లింలు.  ఇతర వర్ణాలు , మతాల వారు చాలా చాలా కొద్దీ మంది మాత్రమే ఉన్నారు .

6.  ఒక సారి ఈ ఐలయ్య గారు ఏమి రాశారంటే బ్రాహ్మణుల భూములను తెలంగాణ లో రెడ్డివారు , ఆంధ్ర ప్రదేశ్ లో కమ్మ వారు , కాశ్మీరు లో ముస్లిమ్స్ తీసేసుకున్నారు అని .  అటువంటి  రెడ్డివారు , కమ్మవారు ఇతర కులాల వారు సినీరంగం లో, ఇంకా ఇతర వ్యాపారాల్లో కోట్లు సంపాదిస్తున్నారు .  మరి వారు ఇప్పుడు ఉత్పత్తి లో భాగం అవుతున్నారా ?  వారు ఎంత పండిస్తున్నారు వ్యవసాయం చేసి ?

7.  ఇక ఎంత మంది దళితులు వారి వారి కుల వృత్తులు చేస్తున్నారు?  వారు కూడా వారి వృత్తులు మాని చదువుకుని ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారు .  ఇంకా రాజకీయ నాయకులుగా కూడా ఉన్నారు .  మంత్రులు, ముఖ్యమంత్రులు , రాష్ట్రపతులు, ఇలా ఉన్నత పదవుల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు. 

8.  అగ్ర వర్ణాల వారు అన్ని పన్నులు కట్టాలి , కడుతున్నారు కూడా.  మరి ఆ డబ్బును ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి ?  దళితులు ఇంకా సమాజం లో ఉన్న వెనుకబడిన వర్గాల వారికి అభివృద్ధి చెయ్యటం కోసం ఉపయోగించటం లేదా ?  మరి అది సమాజ నిర్మాణం లో భాగం అవటం కాదా? 
 
9. ఇక ఇప్పటి రేజర్వేషన్స్ వలన వెనుకబడిన వర్గాల వారికి అంతా మంచి జరుగుతోంది . అగ్ర వర్ణాల వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా తక్కువ మంది ఉంటున్నారు. అన్ని రకాల పోటీ పరీక్షల్లోనూ వారికి అత్యుత్తమ ర్యాంకులు , మార్కులు వస్తేనే గానీ సీట్లు రావు. కానీ ఈ వెనుకబడిన వర్గాల వారికి ఈ పోటీ పరీక్షల్లో మంచి మార్కులు రాకున్నా సీట్లు , ఉద్యోగాలు వచ్చేస్తాయి . మరి ఇంకా వారిలో కొందరు మార్కులు వఛ్చిన వారు General-category లో కూడా సీట్లు, ఉద్యోగాలు సంపాదిస్తున్నారు . మరి ఇప్పుడు వారికి కలుగుతున్న కష్టం నష్టం ఏమిటో ఐలయ్య గారే వివరించాలి

10.  ఒక్క వ్యవసాయం చెయ్యటం అంటే particular,గా పొలం స్వయంగా దున్ని పంట పండిస్తేనే అది సమాజ నిర్మాణానికి మనవంతు గా చేసిన కృషి అని అంటే ఇంక మిగిలిన వారు అందరూ అన్ని వృత్తులు వారు , అన్ని వర్గాలవారు కూడా ఈ సమాజ నిర్మాణం లో ఏమి పాలుపంచుకోకుండా ఫలితాన్ని మాత్రమే అనుభవిస్తున్నారని ఐలయ్య గారి అభిప్రాయం అని మనం భావించాలా ?

  అదే కనుక నిజమైతే ఐలయ్య గారు ఇంకా ఆయన మద్దత్తు దారులు కూడా ఆ వర్గం లోకే వస్తారు కదా మరి ఇంకా ఈ బ్రాహ్మణులు మరియు అగ్రవర్ణాల వారిపై ఈ వ్యాఖ్యలకు అర్ధం ఏమిటి ?
 

why is it necessary to eat Jamuns this season?

        Jamu, jambol, java plum or Indian blackberry are not only nutritious and refreshing, but are also effective in combating sun's heat and a number of health problems.

       Popular for its sweet and slightly sour flavour, and that soft & fleshy consistency, jamuns are a pure delight for everyone, especially considering the fact that they're a rich source of proteins, vitamins, antioxidants, flavonoids, manganese, potassium, phosphorous and calcium.
 
      They contain several nutrients and vitamins that help fight various diseases like cancer, diabetes, infections and liver problems. But that's not all that jamuns can do.



Five health benefits of jamuns:
 
  1. Jamuns are low on calories, which makes them the perfect healthy snack. They also aid digestion and promote natural bowel movement.
  2. Jamun juice has bioactive phytochemicals that minimise the risk of liver disease and cancer.
  3. They are also known to be effective in treatment of diabetes. Extracts of bark, leaves and seeds are used in combination with herbs to reduce levels of glycosuria and blood sugar.
  4. Jamun juice acts as a natural astringent and is used as a mouthwash, as it eliminates bad breath.
  5. The pulp of this fruit is used in the treatment of gingivitis (bleeding gums)


ఎదలో సడి

మధురమైన సంగీతం ఆత్మను చుట్టేస్తుంది
సరసమైన పరిమళం మనసును వెతికి పట్టేస్తుంది
సంస్కారపు స్నేహం మనిషిని కొలిచేస్తుంది
ఆమె చూపులు గుండెకు వల వేస్తాయి
చల్లని వెన్నెల లో చిక్కని చక్కని బొమ్మలా
తెల్లని మబ్బుల వంటి వస్త్రాలు ధరించిన స్వచ్చత సోయగం
కనుల కొలనులో నడిచి వెళ్తున్న ఆమె రూపం
వయస్సు వనం లో వచ్చి పడింది తారాజువ్వలా
అనుభూతుల గూడు లో ఒదిగింది అందమైన గువ్వలా
ఆమె నవ్విందంటే నా వయస్సు పాల పొంగులా
ఆమె పొడవాటి జడ వంకలు తిరిగిన సెలయేరులా
వెన్నెల రాత్రిళ్ళు ఆ కౌగిళ్లు యవ్వనపు ఆనవాళ్ళు
ఆమె పై సాగే ఊహలు మల్లె దండల పరిమళాలు
ఎంతైనా చిక్కకుండా పోతున్న ఆ నడుము పట్టేసిన చేతుల్లా
ఆమె వయ్యారంగా వచ్చి వాలింది నా ఒళ్లో
ముగింపు లేని ప్రేమ లేఖల్లా
నా మనస్సును జివ్వున లాగే ఆమె నవ్వుల కోసం
పడిఉంటాను జన్మ జన్మ లా .....
  

some health tips

1.  జీలకర్ర ని నూనె లేకుండా వేయించి దానిని పొడి చేసి కొద్దిగా ఉప్పు కలిపి  ఒక చెంచా పొడిని  ప్రతిరోజు భోజనం మొదటి ముద్ద లో కొద్దిగా ఆవునెయ్యి తో తింటే ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది .  షుగర్ కూడా కంట్రోల్ లోకి వస్తుంది . 
2.  రోజు ఒక గ్లాసు పలుచని మజ్జిగ తాగండి .  దానివల్ల బి.పీ . కంట్రోల్ అవుతుంది . షుగర్ కి కూడా మంచిది కొలెస్ట్రాల్ తగ్గుతుంది .  ఒంటి లోని వేడి తగ్గుతుంది .  కాల్షియం తక్కువ ఉన్న వారికి ఇది చాలా మంచిది .  రాత్రి పూట పెరుగు తినకూడదు .
3.  భోజనం ప్రారంభం లో ఒక స్పూన్ ఆవునెయ్యి వేసుకుని తినండి .  ఆవు నెయ్యి తినటం వల్ల కొలెస్ట్రాల్ ప్రాబ్లం రాదు .  కీళ్ళు అరిగిపోకుండా కాపాడుతుంది .  ఇంకా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది .  ఎముకలు బలం గా అరిగిపోకుండా ఉంటాయి .
4.  సైనస్ తో బాధ పడేవారు మంచి ఆవునెయ్యి తీసుకుని దానిని కరిగించి రోజు రాత్రిపూట నిద్ర కి ముందు రెండు ముక్కుల్లో 3 చుక్కలు వంతున వేసుకుని పడుకుంటే ఆ ప్రాబ్లం తగ్గుతుంది ఇంకా బ్రెయిన్ నరాలకు , ముక్కు గొంతు కు కూడా మంచిది .
5.  మనిషి లో ఉండే వాత, పిత్త , కఫము అనబడే 3 సమానముగా ఉంచేది త్రిఫలా చూర్ణం .  ఇది అన్ని ఆయుర్వేదం షాపులలో దొరుకుతుంది .  రోజు రాత్రి పూట ఒక స్పూన్ పొడిని అరగ్లాసు నీటిలో గాని , మజ్జిగ లో గానీ కలుపుకుని తాగితే అది చాలా రకాలైన అజీర్ణ సమస్యలు తగ్గిస్తుంది .  ఇంకా మనకు హాని కలిగించే ee-koli. వంటి బాక్టీరియా ను కూడా చంపుతుంది .
6.  త్రిఫలా చూర్ణం కళ్ళకు , చర్మానికి, జుట్టు కు కూడా మంచిది .  గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగినా , తేనే లో కలుపుకుని ఒక స్పూన్ తీసుకున్నా కూడా మంచిది . 
7.  ప్రతిరోజు 2 వెల్లుల్లి గర్భాలు తినండి .  అలా చేయటం వల్ల B.P. కంట్రోల్ లో ఉంటుంది .  గుండెల్లో మంటని అదుపులో పెడుతుంది.  కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది .  అలానే ఉల్లి పాయను రోజు తినటం వలన రక్తం సాఫీగా , గడ్డలు కట్టకుండా ఉంటుంది .  ఇంకా వీటి వలన చాలా లాభాలు ఉన్నాయి .  కనుక ఇవి తప్పక ఆహారం లో చేర్చుకోండి. 

సరి అయిన సమయం లో మంచి నీళ్ళు తాగటం వల్ల ఉపయోగాలు

      రోజు మనం మంచి నీరు తగినంత తాగక పోతే మనకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి .  ఈ విషయం మన అందరికీ తెలుసు .  కానీ కొన్ని కొన్ని సార్లు మనం ఎప్పుడు మంచి నీరు తాగితే మనకు మేలు ఎక్కువగా ఉంటుందో తెలుసుకోవటం చాలా అవసరం .


      మనం రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసులు మంచి నీరు తాగాలి.  అందువల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి . దీనివల్ల మన చర్మం ఆరోగ్యవంతం గా నునుపుగా , త్వరగా ముడతలు పడకుండా ఉంటుంది . అంతే కాకుండా మనకు ఉన్న అసిడిటీ అజీర్ణం వంటి సమస్యలను కూడా కొంత వరకు తగ్గిస్తుంది

 2 గ్లాసులు నీరు నిద్ర లేవగానే తాగితే  అంతర్గత అవయవాలు సక్రమంగా పని చేస్తాయి
1 గ్లాస్ నీరు భోజనానికి అరగంట ముందు తాగితే జీర్ణ శక్తి పెరుగుతుంది
1 గ్లాసు నీరు స్నానం చేయటానికి ముందు తాగితే బి .పీ . కంట్రోల్ లో ఉంటుంది
1 గ్లాసు  పడుకునే ముందు తాగితే నిద్రలో స్ట్రోక్ , హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది .

ఇదీ మన అన్నదాతల పరిస్థితి

    ఇటువంటి రైతులు ఏ ప్రభుత్వానికీ కనిపించరు మరి !! ఈ సంఘటనలకు ప్రభుత్వాలు తల దించుకోవాలి.  ఇది ఎప్పుడో బి .సి . లలో జరిగింది కాదు .  ఈ మధ్య నే జరిగింది.  భారత దేశం వ్యవసాయ ఆధారిత దేశం అని , 90% ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం సాగిస్తారని చదువుకున్నాము . కానీ నేడు వ్యవసాయం లేదు, చెట్లు , చేమలూ లేవు. గుట్టలూ , పుట్టలూ లేవు.  అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారమే  లేకుంటే ఐ .టి, కంప్యూటర్స్, లేకపోతే పనికిరాని చదువులతో యూనివర్సిటీ లలో రాజకీయాలు. 
   ఏ రోజు అయితే చిత్తశుద్ధి తో ప్రభుత్వాలు ప్రకృతి , పర్యావరణం, చెట్లు, పొలాలు, వ్యవసాయం , పంటలు , రైతులను పట్టించుకుంటారో, వాళ్ళ కోసం ప్రజలు, ప్రజా ప్రతినిధులు నిజం గా అంకితం అవుతారో ఆనాడు భారత దేశం అన్ని రంగాల్లో ముందు ఉంటుంది, అని అనేవారు స్వతంత్ర సమారా యోధులు మా తండ్రి గారు.  ఎక్కడో యూనివర్సిటీ లలో చదువుతున్నామని చెబుతూ వయస్సు అంతా అక్కడ గడిపేస్తూ , కొంత మంది నాయకుల ఫోటోలు గోడల నిండా అంటిస్తూ , వారి భజనలు చేస్తూ , వర్తమానం మరిచి , బాధ్యతలను మరిచి, పనికిరాని రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకొనే కొన్ని రాజకీయ పార్టీల చేతుల్లోపడి మోసపోయి , తీవ్ర భావజాలం పెంచుకొని , భారత దేశాన్ని తిట్టుకుంటూ , సమ సమాజ స్థాపన కై కలలుకన్న స్వతంత్ర సమరయోదులు , సంఘ సంస్కర్తలు , దేశ భక్తుల ఆశయాలకు తూట్లు పొడుస్తూ , గడుపుతున్న వారు కొందరు .ఇంకొందరు ఉపకార వేతనాలు ఇస్తుంటే తీసుకుని తల్లితండ్రుల ఆశలు నెరవేర్చి , కష్టపడి పదిమందిని ప్రయోజకులను తయారు చేయవలసిన యువకులు కొందరు కొన్ని రాజకీయ పార్టీల ప్రభావం తో తీవ్రవాదం వైపుకు మళ్లి బ్రతుకును బుగ్గి పాలు చేసుకుంటున్నారు.  ఎప్పుడో జరిగిన సంఘటనలు , మను వాదం , బ్రాహ్మణ వాదం అంటూ తలకు ఎత్తుకొని ఇచ్చిన రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చారో అది సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన లేక యూనివర్సిటీ ల గోడల నిండా తిట్టుకుంటూ వ్రాయడానికే కొందరు విద్యార్ధుల జీవితాలు సరిపోవడం లేదు.  అటువంటి విద్యార్ధులను ఇంకా ప్రక్క దోవ పట్టిస్తూ పత్రికలు  చిమ్ముతున్న విషపురాతలు.  పీ హెచ్ డి అయిపోయి డాక్టరేట్ లు తీసుకున్న మేధావులు పిచ్చి వాళ్ళు గా రోడ్లపై తిరుగుతుంటే ఏ ఒక్క పత్రిక అయినా , సంస్థ అయినా , రాజకీయ పార్టీ అయినా గుర్తిస్తుందా ?
   కానీ ఏ యూనివర్సిటీ లో అయిన ఒక ఓ .సి . చనిపోతే ఏ రాజ కీయ పార్టీ కూడా పట్టించుకోదు.  కానీ ఈ మధ్య జరిగిన  యూనివర్సిటీ విద్యార్ధి ఆత్మహత్య సంఘటనకు ఎక్కడో ఢిల్లీ నుండి రాజకీయ నాయకులు ఎగేసుకొని రెండు వోట్లు దొరుకుతాయేమో అని లగెత్తుకొచ్చారు .  అలానే కేరళ రాష్ట్రం నుండి కూడా వివిధ రాజకీయ పార్టీల నాయకులు వచ్చారు. ఇలా ప్రతి విషయం కులం, మతం, ప్రాంతం, రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారు.  నిజానికి విద్యార్ధుల భవిష్యత్తు ఎవరు కోరుకుంటున్నారు? విద్యార్ధులు కూడా మాకులం వారే మాకు ఆత్మా గౌరవం అంటూ ప్రతిదీ కులం కోణం లో చూడటం మానివేయాలి .  కొన్ని చోట్ల పీ హెచ్ డి చేస్తూ నెలకు 25,000 ఉపకార వేతనం తీసుకుంటున్నారు.  యూనివర్సిటీ వాళ్ళు ఇస్తున్నారు కూడా.  అది మంచిదే .  మేము పీ హెచ్ డి చేస్తున్న రోజుల్లో ఒక్కరు కూడా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు .  పార్ట్ టైం జాబు చేసుకుంటూ పీ హెచ్ డి పూర్తి చేసాము.  అలా ఉంది చదువుల పరిస్థితి .  ఇక ఆటలు ఆడేవారికి కోట్లు రూపాయలు ఇచ్చేస్తారు .  పాటలు పాడే వారికి లక్షలు ఇచ్చేస్తారు .  కానీ రైతులు ఇలాంటి అన్నదాతలు ఆత్మా హత్యలు చేసుకున్నప్పుడు ఏ cm. రాలేదు .  1500 మంది అన్న దాతలు పొలాలు ఎండిపోయి , అప్పులు చేసి , కష్టం కలిసిరాక , బంగారం , ఇల్లు , పొలాలు తాకట్టు పెట్టి , అప్పులు తీర్చలేక భయపడి , బెంబేలెత్తి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్క CM. గానీ , మంత్రులు గానీ , రారు .  అన్ని రాజకీయ పార్టీలు ,cm. లు , అందరు ప్రజా ప్రతినిధులు , మీకు మేము అండగా ఉంటాము అని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి , పల్లెలకు వెళ్లి  అక్కడి రైతుల గుండె తలుపు తట్టి నిలబడితే ఇన్ని రైతు ఆత్మహత్యలు జరిగేవి కావు . ఇప్పటికైనా రైతులు, సైనికులు దేశానికి ఎంతో అవసరం అని, జై జవాన్ , జై కిసాన్ అని గుర్తు పెట్టుకొని వారి శ్రేయస్సు కోసం భారత దేశం తపించాలి.  రైతులు కనపడితే నమస్కారం చెయ్యండి .  కష్టాల్లో ఉన్న రైతులకు యువకులు , ఉద్యోగులు తగినంత సాయం చెయ్యండి.  మనకు అన్నం  పెట్టిన అన్నదాత ఋణం కొంతైనా తీర్చుకోండి .  అన్నదాతల కుటుంబాలకు ప్రోత్సాహం  గా అందరూ నిలబడాలి . 
పచ్చని పంట పొలాలను పాడుచేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వాలు దగ్గరుండి చేయిస్తున్నాయి .  మరి అప్పుడు రైతులు ఏమి పండిస్తారు ?  ఎక్కడ పండిస్తారు ?  ఆకలి వేస్తే బంగారం , డబ్బులు , బిల్డింగ్స్ , సిమెంట్ ఎవ్వరూ తినరు .  గుప్పెడు అన్నం, గ్లాసు నీళ్ళు ప్రాణం నిలబెడతాయి అని ఎవ్వరూ మరిచిపోరాదు .

సంబరాలు

భయంకరమైన వేడి జ్వాలల సెగలు
మచ్చుకైనా కానరాని ఓ నీటి చినుకు
భూములన్నీ పగిలి విచ్చుకున్న జాడలు
చెట్లు అన్నీ నిస్సత్తువను చిందిస్తున్న రూపాలు
మాడుముఖం వేసుకుని బాధ పడుతున్న మహా వృక్షం
దానినే గీక్కుంటూ పైకి పాకిన ఆ లతరాజం
వృక్షం, తీగల పరిస్థితులు దొందూ దొందే
మహా వృక్షం లత ను వెక్కిరిస్తున్నట్లు గా ఉంది దృశ్యం
నాకే గతి లేదు నీకు ఎక్కడ ఇంకా ధృతి ?
నీటి చుక్క లేక ఎండిపోతున్న లతరాజం
అయినా చివర్లో ఎక్కడో చిన్న చిన్న చిగురుటాశలు
ఆకుపచ్చగా చైతన్యాన్ని రాగులుస్తున్న చిన్ని చిన్ని ఆకులు
మేఘాలు పడుతున్నాయి మెరుపులు ఉరుములతో
ఒక్క చుక్క వర్షం జాడ మాత్రం లేని సత్యం
మాటి మాటికి గాలి దెబ్బ కు కిందపడి మూలుగుతున్న లతరాజం
పడుతూ లేస్తూ ఓ చినుకు కోసం కునుకులు తీస్తోంది
ఓ చినుకు చాలు జీవితం నిలబడటానికి
కాలాన్ని గట్టిగా పట్టుకుని ఆశలు నింపు కుంటోంది
అవే వేడి జ్వాలలు, అవే ఉరుములు మెరుపులు
ఇంతలో కారు మేఘాలు ఒక్క సారిగా కురుస్తున్నాయి
తను పడిన కష్టానికి , చూపిన సహనానికి అభిషేకిస్తున్నాయి నీళ్ళు
లతరాజం నింపు కుంటోంది కొత్త ఉత్తేజం
కొసల్లో మొలిచిన చిన్ని ఆకులు రెపరెప లాడిస్తున్నాయి విజయపతాకం
ఇక మాకు మంచి రోజులు వచ్చాయి అని
తన కఠిన పరీక్షల ఫలితమే ఈ సంబరం అని  

 

Spondylosys and some remedies

    ఈ మధ్య  కాలం లో ఎక్కువ మంది బాధ పడుతున్న మరొక సమస్య Spondylosys.  అంటే మెడ దగ్గర  నరాలు , discs, వాటిల్లో కలిగే సమస్య ఇది .  మన దిన చర్య లో మనకు తెలియకుండానే కొన్ని సార్లు చేసే కొన్ని పనుల వల్ల ఈ సమస్య వస్తుంది .  ఈ సమస్య నుండి బయట పడటానికి కొన్ని సులువైన ఉపాయాలు , కొన్ని రకాల వ్యాయామాలు చేస్తే మంచిది .

   ఇంకా ఈ సమస్య ఉన్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి  అవి :- .
1.బరువులు ఎత్తకూడదు .
2.బండి పై బరువులతో ప్రయాణం చెయ్యరాదు.
3.సీట్ లో నిటారుగా కూర్చోవాలి.
4.వంకర గా , వంగిపోయి అలా వివిధ postures. లో కూర్చోకండి
5.ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారు , మధ్య  మధ్య లో  సీట్ లో నుండి లేచి అటూ ఇటూ నడవండి .
6.అలానే రోజు కొద్దిసేపు బోర్లపడుకుని వీపు ఎముకలకు , నడుముకు వెన్నుపాము కు విశ్రాంతి ఇవ్వండి .
   ఇలా పడుకోవటం వల్ల వెన్నుపాము మరియు ఎముకలపై ఒత్తిడి తగ్గుతుంది .
7.అలానే ఒక దుప్పటిని roll. చేసి మెడ క్రింద ఉంచి తలను కొంచెం ఎత్తిపెట్టి వెల్లకిలా కాసేపు పడుకోండి .

 అయితే ఈ విధం గా బోర్లపడుకోవతం వంటివి భోజనం , బ్రేక్ ఫాస్ట్  చేసాక వెంటనే చెయ్యకండి .
8. painkillers. ని ఎక్కువగా వాడకండి .  అసలైతే పూర్తిగా మాని వెయ్యటం మంచిది .
9. పై పైన massages. చేసుకోండి ఆయిల్స్, ఇంకా creams. వాడి .  మహా నారాయణ తైలం తో massage. చేస్తే చాలా లాభం ఉంది .
10.ఈ massage.అయినాక ఆ joints. పై  వేడి నీటిని పైన పోసుకుంటే చాలా విశ్రాంతి ఉంటుంది .


 
ఇక spondylosis. తో బాధ పడే వారికి ఆయుర్వేదం లో ఒక మందు ఉంది .  అది Spondylon.  ఇవి capsules.  ఇది చాలా సేఫ్ డ్రగ్.  నేను వాడుతున్నాను.  ఆ అనుభవం తోనే వ్రాస్తున్నాను.  ఇది మామూలుగా రోజు ఒకటి మాత్ర వేసుకోవాలి .  ఒక వేళ బాధ ఎక్కువగా ఉంటె కొన్ని రోజులు ఉదయం ఒకటి , సాయంత్రం ఒకటి మాత్ర చొప్పున వేసుకోవాలి . 

Vitamin D n calcium deficiency n remedies

   ఇప్పుడు అందరు ఎదుర్కొంటున్న సమస్య కీళ్ళ నెప్పులు , అరిగిపోవటం .  పూర్వ కాలం లో నెయ్యి, నూనెలూ ఎక్కువగా వాడే వారు.  ఇప్పుడు అలా వాడితే పడటం లేదు .  ఎందుకంటే పాలు , వెన్న , రకరకాల పశువుల మేతల ద్వారా తయారవుతున్నాయి పశువులలో.  అందుకే అవి కొలెస్ట్రాల్ గా మారి పోతున్నాయి.  పైగా పూర్వం అంత శారీరక శ్రమ ఇప్పుడు ఉండటం లేదు .  అందుకే జాఇంట్స్ మధ్యలో ఆయిల్ లాంటి ద్రవం లేక పోవటం వల్ల కూడా అరిగిపోతున్నాయి .  అందుకే భోజనం ప్రారంభం లో శుద్ధమైన ఆవునెయ్యి కొద్దిగా వేసుకుని ప్రారంభించండి .  ఆవునెయ్యి అయితే ఒంటికి మంచిది .
    ఇంకా చాలా మంది లో విటమిన్ D. తక్కువ గా ఉంటుంది .  ఒకసారి విటమిన్ D. టెస్ట్ చేయించుకుని చూడండి.

 ఈ విటమిన్ మన శరీరం లో ఉండవలసిన క్వాంటిటీ వివరాలు :-

డెఫిషియన్సీ:   <10.0 ng./ml.
insufficiency.: 10-30 ng./ml.
sufficiency.:    30-100ng./ml.
Toxicity.:       >100ng./ml.


మన శరీరం లో ఈ D. విటమిన్ ఎంత ఉందొ తెలుసుకున్నాక తక్కువగా ఉంటె మాత్రలు వాడాలి . D.3.  Uprise-D3.60K. మాటలు వారానికి ఒకటి తీసుకుని 4 వారాలు వేసుకోవాలి .  ఈ D. విటమిన్ కొవ్వులలో కరుగుతుంది కనుక ఇది వేసుకున్నాక కొద్దిగా వెన్న లేదా నెయ్యి , లేకుంటే ice.cream. తినాలి .
ఇంకా mushrooms, చేపలు తినే వారికి ఈ విటమిన్ వాటిల్లో లభిస్తుంది .
    D. విటమిన్ లేకపోతే కాల్షియం శరీరం లోకి ఇంకదు.  కాల్షియం లేక పోతే ఎముకలలో బలం ఉండదు .  అప్పుడు అవి అరిగిపోతుంటాయి.  మన శరీరం లో D. విటమిన్ ఎక్కువగా ఉంటె అది ఇన్సులిన్ యాక్షన్ ను మరింత పెంచుతుంది.  డయాబెటీస్ పై నియంత్రణ ఉంచుతుంది.  అంటే విటమిన్ D. తీసుకోవటం ద్వారా డయాబెటీస్ ను ఎదుర్కోవచ్చు.  ఇది చాలా రోగాలను నివారించటం లో , ఎదుర్కోవటం లోను ఉపయోగ పడుతుంది.
    D. విటమిన్ సూర్యరశ్మి లో లభిస్తుంది .ఉదయం వేళ 6-00 నుండి 7-30 మధ్య సూర్య రశ్మి లో గడపాలి అప్పుడు సహజ సిద్ధం గా D. విటమిన్ లభిస్తుంది.  విదేశాల్లో D. విటమిన్ కలిపిన పాలు , పెరుగు, డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి.  కానీ అవి అన్నీ ఇంకా ఇక్కడ దొరకటం లేదు .  కొన్ని రకాల ఆహార పదార్ధాలలో ప్రకృతి సిద్ధం గా విటమిన్ D. ఉంటుంది అది మాంసాహారులకు దొరుకుతుంది.  శాఖాహారులకు పాలు వంటి చాలా కొద్ది రకాల ఆహార పదార్ధాలలో మాత్రమే ఇది దొరుకుతుంది . 

        కాల్షియం  కూడా మనకు ఆహారం ద్వారా లభిస్తుంది .  పాలు , పెరుగు , పాల ఉత్పత్తులు  అయిన వెన్న , పనీర్ , మొదలైనవి ఇంకా మొలకేత్త్తిన పెసలు , సెనగలు , ఆకు కూరలు, కాప్సికం వంటి కూరగాయల్లో, నువ్వుల్లో అది కూడా నల్ల నువ్వుల్లో  కూడా ఉంటుంది .  ఇవి ఎక్కువగా తీసుకుంటే కాల్షియం మనకు లభిస్తుంది .  కాల్షియం తీసుకుంటే రాళ్ళు వస్తాయి అని కొందరికి భయం .  అందుకే English tablets. వాడటానికి వెనకాడతారు.  అటువంటి వారి కోసం ఇంకొక Ayurveda tablet. ఉంది  దాని పేరు  Asthiposhak. 
Asthiposhak. మాత్రలు వాడుతున్నంత కాలం అవి వాడే వారు కాకర కాయ , నేరేడు కాయలు , వాటికి సంబంధించిన పదార్ధాలు తినరాదు .

ప్రేమ ప్రసాదం

ఆమె గుడికి వచ్చింది
కనుబొమ్మల విల్లుల్లోంచి చూపుల బాణాలు విసురుతోంది
దొండపండు నే వెక్కిరించెంత ఎర్రగా మెరుస్తున్న పెదవులు
ఆమె చిరునవ్వులు మల్లెమొగ్గలను కురిపిస్తున్నాయి
ఆమె కనుల కొలనులో నా రూపమే కనిపిస్తోంది
మనసు ఉప్పొంగి పైకి ఎగసింది
పువ్వుల గుత్తులను ఆమె చుట్టూ కప్పేసింది
మనసు పల్లకీలో ఆమెను కూర్చోబెట్టాను
ఊహల బోయీలు సుతారం గా ఆమెను మోస్తున్నారు
నా ప్రేమ పట్టపు రాణి కి నా హృదయం సింహాసనం అయ్యింది
మాట మాట కలపాలని,
వలపు కోట కట్టాలని
ఆ తేనే బిందువులు పెదవులకు అద్దుకోవాలని
ఆమె వైపుకు దగ్గర దగ్గర గా జరిగాను
ఒక చూపు దేవునిపై , పది చూపులు ఆమె పై వేసాను
దేవతను చూసింది చాలు , దేవుడిని చూడండి ఇక
మధ్య మధ్య లో ..... ఆమె వెటకారం ...
మా వాళ్ళు వచ్చారటగా మీ ఇంటికి సంబంధం కోసం
అవును నన్ను మీ  ఇంటికి సాగనంపటానికి
అవునూ ... వచ్చారా ! మీరే పంపించారా !
కిల కిలా నవ్వుతూ ఆమె అందమైన వెటకారం
అర్చకుడు నాకు ఇచ్చిన గులాబీ ని
ప్రేమ ప్రసాదం గా ఆమె చేతిలో పెట్టాను
 

కాషాయీకరణం అంటే

ప్రపంచ దేశాల్లో కాస్తంత హిందుత్వం మిగిలి ఉన్న దేశం భారత దేశం.  దాన్ని ఒక్క దాన్నీ కూడా నాశనం చేయాలనీ స్వదేశం లోనే కొంత మంది కంకణం కట్టారు.  మరి ఏమి చేస్తారు ? 
    హిందువుల ఉనికికే ప్రమాదం ఏర్పడి నప్పుడు, హిందువులు అంతా సంఘటితం అయి రక్షించుకోవాలి.  స్వదేశం , మతం సంస్కృతి నాశనానికి బయట దేశాల వాళ్ళ కంటే దేశం లోపలే ఎక్కువ శత్రువులు ఉన్నారు.  89% మెజార్టీ హిందువుల మనోభావాలు వదిలేసి మైనారిటీ ల కోసం కులం , మతం లేని రాజ్యాంగం అని వ్రాసారు.  అది హిందువులకు మాత్రమే కాకుండా ఇతర మతాల వారు కోసం వ్రాసింది .  ఇతర మతాల వారు ఎవరైనా వారి మత ప్రచారం చేసుకోవచ్చు.  హిందువులు ఏదైనా మతం గురించి గానీ , తమ మతం గురించి గానీ మాట్లాడ కూడదు.  మాట్లాడితే అది మత వాదం, మత మౌధ్యం, మతోన్మాదం అని పిలుస్తారు ఇక్కడ .హిందూ మతం అంటే బాంబులు , మానవ బాంబులు కానేకాదు.  నేరం చెయ్యొద్దు అని చెప్పేదే హిందూ మతం.  కాశాయికరణం కంటే ప్రమాద కరమైనవి  ఇంకా ఎన్నో ఉన్నాయి.  అవి ఎక్కువ ఒంటికి పట్టించుకుంటే బుర్ర చెడిపోయి తుపాకులు చేతబట్టి, అడవులకు వెళ్ళిపోవడమే.  ఇక అక్కడ టెలిఫోన్ ఎక్స్చేంజి లు , నీటి వంతెనలు , ఆకాశవాణి కేంద్రాలు పెల్చేయడం దాకా పోతుంది.  కనీసం అడవులలోకి వెళ్లి జీవితాన్ని త్యాగం చేస్తున్నాము అని చెప్పేవాళ్ళు రోడ్లు , మంచి నీరు , గిట్టుబాటు ధరలు , రైతుల ఆత్మ హత్యలు లాంటి కనీస సమస్యలు ను అయినా పరిష్కరించ లేక పోతున్నారు.  వారు అడవిలోకి వెళ్ళటం ఏమి లాభమో అర్ధం కాదు . 
   కాషాయీకరణం వల్ల అంత ప్రమాదం ఏమి పొంచి లేదు .  అన్ని పార్టీల్లోనూ , అన్ని సంస్థలలోనూ, అన్ని మతాల్లోనూ ఉంటున్నారు. 

    కాషాయీకరణం  అంటూ ఈ మధ్య కొందరు ఈ విషయాన్ని పదేపదే వల్లిస్తున్నారు.  కాషాయీకరణం, బ్రాహ్మణ వాదం , మను వాదం అంటూ పదేపదే వల్లే వేస్తున్నారు .  అన్ని రంగాల్లో S.C.,S.T., BC. మరియు ఇతర కులాల వారు కనిపిస్తున్నారు .  బ్రాహ్మణులు ఉన్నత స్థానాల్లో అనేది ఎప్పుడో అంతరించి పోయింది.  మనువుని తిడుతూ అంబేద్కర్ ని ఆధునిక మనువు గా పిలుస్తాము .  అసలు మనుస్మృతి కి ఈ యుగం లో సంబంధం లేదు .  ఇప్పుడు తీసుకోవలసింది పరాశర స్మృతి  కొన్ని కులాలను వెనకేసుకొచ్చిన పక్షపాతి మనువు అని తిడుతూ ఉంటారు .  కానీ ఆధునిక రాజ్యాంగం లో కులం మతం ప్రస్తావన లేకుండా నడుస్తుందా ?  పైగా మనువు లాగానే కొన్ని కులాలకు ప్రాధాన్యం ఇచ్చారు రాజ్యాంగ కర్త .     
       ఇక కాషాయీకరణం అంటే వేదాంతం, పురాణాలు , పురాణ పురుషులు , తత్వవేత్తలు , సంఘ సంస్కర్తలు ,ఎన్నో వస్తాయి.  అయినా కాషాయీకరణం  వల్ల వచ్చె నష్టాలు ఏమి లేవు . కాబట్టి కాషాయీకరణం  అంటే ఏదో నక్సలిజం, తీవ్ర వాదం లాగా మాట్లాడటం ఏమి బాగోలేదు.  అంత ధైర్యం, తెగింపు ఉన్నవాళ్ళు ఇతర కులాల , మతాల పై కూడా విమర్సలు చేసి చూడండి.  మత సంస్థ లు అంటూ విమర్శలు చేస్తున్నారు.హిందువులది మతోన్మాదం అని అంటున్నారు.  మరి ముస్లిం లీగ్ ముందు ఏర్పడిందా ? లేక R.S.S. ముందు ఏర్పడిందా ? గమనిస్తే చాలు. ముస్లింలీగ్ ఏర్పడిన 30 సo,, కు R.S.S. ఏర్పడింది . 
  సర్వేజనాః సుఖినో భవంతు అని చెప్తుంది హిందూమతం .  ఇప్పుడే , ఇక్కడే ఆ మతం ఉనికిని కోల్పోయే ప్రమాదం లో పడితే గళం విప్పుతున్నారు .  ఏది ఏమైనా మెజార్టీ ప్రజల మనోభావాలు మైనార్టీ లు , వీరి మనో భావాలు మెజార్టీ లు ఇలా ఒకరికొకరు గౌరవించుకోవాలి . 
  ప్రతి విషయానికీ కుహనా సెక్యులరిజం అంట గట్టడం, సందర్భం లేక పోయినా హిందూ మతాన్ని, భావ జాలాన్ని విమర్శించటం, తిట్టటం మానుకోవాలి.  హిందూఇజం సంస్థల్లో ఇప్పుడు ఎక్కువ BC. SC. స్థ వారే ఉంటున్నారు .ఈ విషయాన్ని అందరు గ్రహించి గౌరవించాలి .  కాషాయికరణం లో రామాయణ ధర్మం ఉంది , భారత ధర్మం ఉంది , భాగవతం పరమాత్మ కధలు ఉన్నాయి, భక్తీ ఉంది , జ్ఞానం ఉంది , మూఢ నమ్మకాలు ఖండించే ఆచార్యులు ఉన్నారు .  వాగ్గేయ కారులు ఉన్నారు.   కవులు , పండితులు, రచయితలు , సంఘ సంస్కర్తలు హిందూ మతం మతం కంటే ధర్మం అని పిలుస్తారు .
    బౌద్దం , జైనం వంటి మతాలు హిందూ మతం లోనుండి వచ్చినవే.  అవి భగవంతుని కంటే జ్ఞానానికి ప్రాముఖ్యతను ఇచ్చాయి .
  ఎన్నో అనాగరిక ఆచారాలను , 75 మతాలను త్రోసిపుచ్చి మూఢ నమ్మకాలను పారద్రోలి, 6 మతాలు ముఖ్యం అని శంకర , రామానుజ , మద్వ  త్రిమతా చార్యులు కృషి చేసారు.  వివేకానంద, రామకృష్ణ పరమహంస, రాధాకృష్ణన్, రమణ మహర్షి వరకు కోటాను కోట్ల మంది తాత్వికులు ఈ భారత భూమి పుట్టుక నుంచి ఉన్నారు.  అదే కాషాయీకరణం అని తెలుసుకోండి .

        ఈ మధ్య కొంత మంది కంచే ఐలయ్య వంటి మేధావులు మేము రామాయణ భారతాలు వంటి హిందూ మత గ్రంధాలు చదవలేదు. చదవము కూడా ఎందుకంటే అవి అన్ని మత వాదాన్ని సమర్దిస్తాయి అని అంటున్నారు .  కానీ అసలు హిందూ మతం గురించి తెలుసుకోకుండా విమర్శ చెయ్యటం ఎంత వరకు సబబు ?  దయ చేసి ముందు హిందూ మతాన్ని గురించి పూర్తి గా తెలుసుకోండి .  కాషాయీకరణం అనగానే భయ పడకండి.  ముందు తెలుసుకుని ఆ తరువాత అందులోని లోటుపాట్లను విమర్శించండి . 

ప్రేమే కట్నం

మేఘాలు ముసిరి ఒక మాదిరి వర్షం ప్రారంభం అయ్యింది
జొన్న చేలు కంకుల బరువు తో ఊగుతున్నాయి .
ఆమె కాలి గజ్జెల చప్పుడు తో వయ్యారం గా నడుస్తోంది
వర్షం పెద్దగా పడ్తోంది తడిసిపోయాను .
ఆమె ప్రక్కకు జరిగింది ఫర్వాలేదు లోపలి రావచ్చు
కొంటె కళ్ళతో ఆహ్వానం పలికింది
ఆమె కూడా కొంచెం కొంచెం తడిసిపోయింది
ఆమె అందాలన్నీ విందు వినోదం చేస్తున్నాయి
 నేను సిగ్గు పడి మెలికలు తిరుగుతున్నాను
కాలేజీ కి వెళ్ళలేదు తోటలో బొప్పాయి పండ్లు దింపు తున్నాము
పైట సవరించుకుంటూ చిరునవ్వు తో సమాధానం
నేనూ అంతే బైట పక్షులు రాకుండా కంకులు కాపలా కాస్తున్నా !
చదువు అయిపోతోంది గా ఇక సెటిల్ అవ్వడమేనా?
మనసుని , తడి చొక్కా ని పిండుకుంటూ అడిగాడు
మీ వాళ్ళు కట్నం అడుగుతున్నారుగా
బుంగ మూతి తో రుస రుస లాడుతూ వెళ్ళిపోయింది
చమేలీ ! నాకు నువ్వే ముద్దు
కట్నం వద్దే వద్దు .. గట్టిగా అరిచాను
వెనక్కి చూసి నవ్వింది .  పైట చెంగు తో ముఖం దాచుకుంది
పెదవి కొరుకుతూ కొంటెగా నా వైపు వాలు జడ విసిరింది .

 

 
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online