"మాది కోసల రాజ్యం . మా తండ్రి గారు ఇంద్ర నీల చక్రవర్తి . మా తల్లి గారు రాణి లక్ష్మి కల్యాణి ." అని చెప్పాడు రాజేంద్ర వినయంగా . ఆ తరువాత వైద్యుని కుటుంబానికి ఫణీంద్ర చేసిన మొత్తం ద్రోహం అంతా వివరం గా చెప్పాడు . ఫణీంద్ర కుతంత్రం విన్న వారు ముగ్గురూ ఆశ్చర్య చకితులయ్యారు . కొద్ది రోజులు రత్నాచార్యుని వైద్యం తో పూర్తిగా కోలుకున్నాడు రాజేంద్ర . ఆ తరువాత వారు ఇద్దరు కలిసి ఒక పధకం ఆలోచించారు ఫణీంద్ర మోసాన్ని బయట పెట్టటానికి . ఇద్దరూ మారు వేషాలలో కోసల రాజ్యానికి వచ్చారు . రాజ్య ప్రధాన ద్వారం వద్ద వీరిని రాజ్య రక్షక భటులు అడ్డుకున్నారు . "అయ్యా ! మేము ఇద్దరం గురు శిష్యులం మా గురువుగారు మహా పండితులు . మహారాజు వద్ద మా ప్రతిభ ను ప్రదర్శించి ఏమైనా బహుమానం పొందాలని వచ్చ్చాము . కాస్తంత అనుజ్ఞ ఇవ్వండి లోనికి వెళ్ళటానికి " అని అన్నాడు మారు వేషం లో ఉన్న యువరాజు రాజేంద్ర .
కొద్దిసేపు వేచి ఉన్న తరువాత వారికి లోనికి వెళ్ళటానికి అనుమతి లభించింది . ఇద్దరూ లోనికి ప్రవేశించారు. సభ లో రాజుగారు సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు . యువరాజు రాజేంద్ర కి తన తండ్రిని చూడగానే భరించలేని ఆనందం , బాధ ఒకేసారి కలిగాయి . అతని కన్నుల్లో నీరు చూసి రత్నాచార్యుడు ఆటను ఎక్కడ బయట పడిపోతాడో అని ఆందోళన చెంది, అతని చేతిని గట్టిగా నొక్కి కొద్దిసేపు తనని తానూ సంభాలించుకోమని చెవిలో చెప్పాడు . "మహారాజా ! వీరు ఇరువురు మహా పండితులట. వీరి పేరు రత్నాచార్యులు. ఆ ప్రక్కన ఉన్న వ్యక్తీ ఈయన శిష్యుడు" అని చెప్పాడు వారిని తీసుకు వచ్చిన భటుడు .
అప్పుడు మహారాజు వారిరువురికి స్వాగత సత్కారాలు చేసాడు . పిమ్మట "స్వామీ ! ఎంత మంది పండితులు వచ్చినా ఈ ప్రత్యెక వాక్యానికి అర్ధం చెప్పలేక పోతున్నారు . తమరు మహా పండితులు అని విన్నాము . దయ చేసి ఈ ప్రహేళిక ను పూరించండి . ఇది మా యువరాజు మాకు పంపిన చివరి సందేశం . యు .రా .సి.ఖ . అంటే అర్ధం తెలిపి మాకు, మా చక్రవర్తి కి మేలు చెయ్యండి" అని వినయం గా అడిగాడు మహా మంత్రి .దానికి రత్నాచార్యుడు " నేను నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను . కానీ నాకు అసలు ఏమి జరిగిందో వివరం గా చెప్పండి " అని అడిగాడు . అప్పుడు మహామంత్రి ఫణీంద్ర చెప్పిన అన్ని విషయాలు పూర్తిగా చెప్పి ఆ పత్రాన్ని ఆయన చేతిలో పెట్టాడు .
అప్పుడు ఈ గురు శిష్యులు ఇద్దరికీ ఫణీంద్ర చేసిన మొత్తం కుట్ర పూర్తిగా అవగతమైంది . మహారాజు తన పుత్రుని తలచుకొని బాధ పడసాగాడు . ఈ పండితుడు ఈ ప్రసన కు ఏమి సమాధానం చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు సభికులు అందరూ . అప్పుడు రత్నాచార్యుడు ఆ పత్రాన్ని చూసి ఇందులో చెప్పటానికి పెద్ద విషయం ఏముంది మహారాజ ! ఇది చాలా చిన్న విషయం అని చాలా తేలికగా అన్నాడు . అప్పుడు మహారాజు " ఆచార్యా ! ఇప్పటి వరకూ ఎవరూ కూడా ఈ ప్రహేళికను వివరించలేక పోయారు . మీరేమో చాలా తేలికగా చెప్తాను అంటున్నారు . ఇంతకీ విషయాన్ని వివరించండి". అంటూ సంతోషం గా లేచి దగ్గరకు వస్తూ అన్నాడు .
అప్పుడు నేను చెప్పింది గుర్తు ఉందిగా అంటూ వైద్యుని చెవిలో గుసగుస లాడాడు రాజేంద్ర . ఓ .. ఇది నువ్వు కత్తిపోటుకు గురి అయినప్పుడు రాసిన్దేగా అంటూ అడిగాడు వైద్యుడు . అవునని తల ఊపాడు రాజేంద్ర ."మహారాజా ! మీకు ఈ పత్రాన్ని ఇచ్చిన వ్యక్తిని ఇక్కడకు పిలిపించండి . మొత్తం పరిశీలించి చెబుతాము" అని అన్నాడు రత్నాచార్యుడు . ఆచార్యుడు ఇంత బాగా నటిస్తున్నందుకు ఆనంద పడ్డాడు రాజేంద్ర . కానీ స్వంత రాజ్యం లో తండ్రి ముందు తను కూడా నాటకం ఆడుతున్నందుకు బాధ పడ్డాడు . కానీ పరిస్థితులు అనుకూలం గా లేనప్పుడు రాజనీతి లో ఇటువంటివి సహజం అని తనను తానూ సమాధాన పరచుకున్నాడు . పైగా ఇంత కుట్ర చేసిన ఆ యువ మంత్రి ఎలా ఉన్నదో తెలియాలి కదా. అని అనుకుంటూ ఉన్నాడు . రాజుగారు సరేనంటూ ఫణీంద్ర ని తీసుకురమ్మని భటులను పంపారు .
ఈ విషయం అంతా తెలుసుకున్న ఫణీంద్ర తన మనసులో " ఇంత వరకూ ఎవ్వరూ కూడా ఇలా చెయ్యలేదు . నన్ను పిలవటం గానీ అనుమానించటం గానీ జరుగ లేదు . వీరికి నా నిజస్వరూపం ఏమైనా తెలిసి పోయిందా ఏమిటి " అని అనుకున్నాడు . కొంచం భయం భయం గా సభ లోనికి వచ్చాడు .

0 comments:
Post a Comment