Pages

short story - final part

     సభ అంతా ప్రశాంతంగా ఉంది .  అందరూ రత్నాచార్యుడు  ఏమి చెబుతాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .  అప్పుడు వైద్యుడు ఆ పత్రాన్ని పరిశీలించి " మహారాజా! ఈ లేఖ లో యు. రా . అనగా  యువరాజు  సి . అనగా శిరస్సు ను ఖ . అనగా ఖండించెను .  యువరాజు శిరస్సు ను ఎవరో నరికి చంపారు ప్రభు !"అని చెప్పాడు వైద్యుడు .  ఆ మాటలు విన్న మహారాజు నిర్ఘాంత పోయాడు .  "ఫణీంద్ర ! నీకు అంత తెలుసు కదా నిజం చెప్పు" అంటూ రాజు గర్జించాడు.  అప్పటికే భయం తో వొనుకుతున్న ఫణీంద్ర నాకు ఏమీ తెలియదు ప్రభూ అంటూ బుకాయించాడు.
    "చూడండి రాజా ! ఈ ఫణీంద్ర బాగా చిన్న వాడు .  ఈర్ష్యతో , ఆవేశం తో యువరాజు ను డొక్కలో పొడిచి చంపాడు .  నీళ్ళలో పడవేసాడు .  ఆ దృశ్యాన్ని నేను చూసాను ." అంటూ చెప్పుకుపోతున్నాడు వైద్యుడు .      "ఇది నేను నమ్మను .  ఈ పని నేను చేసినట్లు సాక్ష్యం ఏమిటి ?" అని అడిగాడు ఫణీంద్ర .  సాక్ష్యం కావాలా ?  అయితే చూపిస్తాను . నేను పండితుడిని కాను .  వైద్యుడిని .  మారు వేషం లో వచ్చాను .  అంటూ తన వేషం తీసి చూపించాడు .
     "ఆచార్యా !  మీరు దేవుడిలా వచ్చారు .  మా యువరాజు ఏమి అయ్యాడు ?  చెప్పండి  అంటూ వైద్యుడు రాత్నాచార్యుడి  చేతులు పట్టుకున్నాడు  మహారాజు .  "మహారాజ! మీరు చాలా మంచివారు , ధర్మ ప్రభువులు .  కనుక దైవం మీతోనే ఉన్నాడు . అందుకే మీ కుమారుని కాపాడాడు నా ద్వారా .  యువరాజుని భద్రం గా మీ దగ్గరకు చేర్చాను " అని అంటూ యువరాజు వేషం తీసేసి చూపించాడు రత్నాచార్యుడు.
   ఒక్క సారిగా కనుల ముందు కనిపించిన పుత్రుని చూసి రాజు ఆనందంతో పొంగిపోయాడు .  అతనిని కౌగలించుకొని నుదురు ముద్దాడాడు .  ఈ విషయం అంతా తెలిసిన మహారాణి  సభకు వచ్చిరాజేంద్రను  ఆనంద భాష్పాలతో అక్కున చేర్చుకుంది .    రాజకుమరున్ని జీవితునిగా చూసిన ఫణీంద్ర నివ్వెరపోయాడు .  పారిపోవాలని ప్రయత్నించాడు .  అది గమనించిన ఫణీంద్ర తండ్రిగారైన మహామంత్రి  అతడిని బంధించమని రాజ భటులను ఆజ్ఞాపించాడు .  ఆయన ఆజ్ఞ మేరకు ఫణీంద్ర ను గొలుసులతో బంధించారు .
    మహారాజు మహా మంత్రి తో " మీరు మా కుటుంబానికి తరతరాలుగా సేవలు అందిస్తున్నారు .  ఈ క్లిష్ట సమయం లో మా కర్తవ్యమ్ ఏమిటి అని అడిగాడు .  దానికి మహామంత్రి " మహారాజా ! చట్టం, న్యాయం అందరికీ సమానమే .  ఇక్కడ కూడా మనం చట్టం లో ఈ నేరానికి నిర్ణయించిన శిక్ష నే అమలు పరచాలి " అని అన్నాడు .మా రాజ్య స్తాపన అప్పట్లో మీరే చేసారు. మా పెద్దల తగ్గరనుంచి మీరే గురువులు  సలహాదారులు ఇప్పుడు ఇంత బాధాకరమైన  సందర్బం  వస్తుంది  అనుకోలేదు అంటూ రాజుగారు కాస్తంత బాధతో మాట్లాడుతున్నారు .  "రాజా ! తప్పు ఎవరు చేసినా తప్పే .  న్యాయం అనేది నిష్పక్షపాతం గా ఉండాలి .  ఫణీంద్ర చేసింది రాజ ద్రోహం .  ఇతనికి ఉరి శిక్ష ఖరారు చేయటమే తగిన నిర్ణయం " అంటూ తీర్పు వెలువరించాడు .  మంత్రి పరిషత్తు ఆమోదించింది .  కానీ రాజుగారు మాత్రం తన నిర్ణయాన్ని వెలువరించలేదు .
   ఆ రాత్రి అంతా ఆలోచించాడు రాజుగారు .  తెల్లవారింది .  ఫణీంద్ర ను ఇనుప గొలుసులతో బంధించి సభ లో రాజుగారి ముందు ప్రవేశ పెట్టారు .  అందరూ రాజు గారు ఏమి నిర్ణయం వేలువరిస్తాడా అని ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .  అప్పుడు రాజుగారు " కొద్ది రోజులు మేము మా కుమారుడు లేక పుత్ర శోకం తో బాధ పడ్డాము .  మళ్ళీ ఇలా మా గురువుగారు , మహా మంత్రి ఆ బాధ అనుభవించడం మాకు ఇష్టం లేదు .  కనుక మేము ఫణీంద్ర కు యావజ్జీవ కారాగార శిక్ష విదిస్తున్నాము " అని ప్రకటించాడు .     రాజుగారి తీర్పు విన్న సభికులు అందరూ రాజు గారిని అభినందించారు .  మహా మంత్రి  "మహారాజా ! మేము ఫణీంద్ర చేసిన పనులకు సిగ్గు తో తల ఎత్తుకోలేక పోతున్నాము .  మేము అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటూ శేషజీవితం గడుపుతాము " అని అన్నాడు .  రాజుగారు దానికి ససేమిరా ఒప్పుకోలేదు. కానీ మంత్రి గారు ఒప్పించారు .  అప్పుడు రాజు , మంత్రి వర్యా ! మా యువరాజు పట్టాభిషేకం వరకూ అయినా ఉండండి  అని అడిగాడు .  అందుకు అంగీకరించాడు  మహా మంత్రి.
     రాజుగారు వైద్యుడు రత్నాచార్యుడిని అభినందించాడు .  తమ యువరాజును కాపాడి తమకూ , రాజ్యానికి మేలు చేసినందుకు ఏమినా కోరిక కోరుకోమన్నాడు .  కానీ అందుకు వైద్యుడు అంగీకరించలేదు .  మహారాజా ! మేము మా విధిని నిర్వర్తిన్చాము .  మాకు ఇంకా ఏమి కోరికలు లేవు అని అన్నాడు .  అప్పుడు రాజుగారు ఆయనని ఘనం గా సన్మానించాడు . యువరాజు పట్టాభిషేకానికి వైద్యుని కుటుంబ సమేతం గా రమ్మని ఆహ్వానించాడు మహారాజు . 
      యువరాజు పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించి ఏర్పాట్లు చేసారు . దానికి రెండు రోజుల ముందు వైద్యుడు తన భార్య ను , కుమార్తె ను తీసుకుని రాజ మహలుకు వచ్చాడు .  వైద్యుని యొక్క కుమార్తె గిరిజ అందానికి , ఆమె స్వభావానికి ముగ్దురాలైంది మహారాణి .  యువరాజు రాజేంద్ర కూడా గిరిజను వివాహం చేసుకోవాలని అనుకుని తన తల్లిదండ్రులకు తెలియపరిచాడు .  వారు అందుకు అంగీకరించి రత్నాచార్యుడు దంపతులకు ఈ విషయం తెలుపగా వారు ఆశ్చర్య చకితులై ఆనందం తో అంగీకరించారు .  నిర్ణయించిన శుభ ముహూర్తం లో యువరాజుకి వివాహం పట్టాభిషేకం జరిగాయి .  దానితో రాజ పరివారం , ప్రజలు కూడా ఆనందించారు . 

    .

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online