Pages

few health tips

1.         ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ అరకప్పు  టొమాట జ్యూస్ అరకప్పు కలిపి అందులో కొద్దిగా తేనే కల్పిత్రాగితే వ్యాధి నిరోధక శక్తీ పెరుగుతుంది .

 2.      మెంతులు  దొరగ  వేయించి  మిక్సి  పట్టి  అరస్పూన్ పొడి కొద్దిగా నీళ్ళ లో కల్పి పరగడుపున లేక   అన్నం  తినే ముందు కానీ అది త్రాగితే  కొలెస్ట్రాల్ , ట్రై గ్లిసరైడ్స్ తగ్గిపోతాయి .


3.     ఈ మెంతి  పొడి షుగర్ వ్యాధికి కూడా మంచిది .


4.     చేమదుంప  ధైరాయిడ్  గ్రంధి పని తీరును మెరుగుపరుస్తుంది .  షుగర్ వ్యాధి ఉన్నవారు  వేపుడు కాకుండా కూరలాగా చేసుకుని తినవచ్చు.  ఇది ఎముకలకు బలాన్నిస్తుంది .


5.     జీలకర్ర దోరగా వేయించి  పొడి చేసి , అందులో ఉప్పు కలిపి ప్రతిరోజు  అన్నం లో ఒక చెంచా పొడిని కలిపి తింటూ ఉంటె అజీర్ణం , కొలెస్ట్రాల్ , అసిడిటీ, ఆకలి వేయక పోవటం వంటి సమస్యలు తగ్గుతాయి .

short story - final part

     సభ అంతా ప్రశాంతంగా ఉంది .  అందరూ రత్నాచార్యుడు  ఏమి చెబుతాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .  అప్పుడు వైద్యుడు ఆ పత్రాన్ని పరిశీలించి " మహారాజా! ఈ లేఖ లో యు. రా . అనగా  యువరాజు  సి . అనగా శిరస్సు ను ఖ . అనగా ఖండించెను .  యువరాజు శిరస్సు ను ఎవరో నరికి చంపారు ప్రభు !"అని చెప్పాడు వైద్యుడు .  ఆ మాటలు విన్న మహారాజు నిర్ఘాంత పోయాడు .  "ఫణీంద్ర ! నీకు అంత తెలుసు కదా నిజం చెప్పు" అంటూ రాజు గర్జించాడు.  అప్పటికే భయం తో వొనుకుతున్న ఫణీంద్ర నాకు ఏమీ తెలియదు ప్రభూ అంటూ బుకాయించాడు.
    "చూడండి రాజా ! ఈ ఫణీంద్ర బాగా చిన్న వాడు .  ఈర్ష్యతో , ఆవేశం తో యువరాజు ను డొక్కలో పొడిచి చంపాడు .  నీళ్ళలో పడవేసాడు .  ఆ దృశ్యాన్ని నేను చూసాను ." అంటూ చెప్పుకుపోతున్నాడు వైద్యుడు .      "ఇది నేను నమ్మను .  ఈ పని నేను చేసినట్లు సాక్ష్యం ఏమిటి ?" అని అడిగాడు ఫణీంద్ర .  సాక్ష్యం కావాలా ?  అయితే చూపిస్తాను . నేను పండితుడిని కాను .  వైద్యుడిని .  మారు వేషం లో వచ్చాను .  అంటూ తన వేషం తీసి చూపించాడు .
     "ఆచార్యా !  మీరు దేవుడిలా వచ్చారు .  మా యువరాజు ఏమి అయ్యాడు ?  చెప్పండి  అంటూ వైద్యుడు రాత్నాచార్యుడి  చేతులు పట్టుకున్నాడు  మహారాజు .  "మహారాజ! మీరు చాలా మంచివారు , ధర్మ ప్రభువులు .  కనుక దైవం మీతోనే ఉన్నాడు . అందుకే మీ కుమారుని కాపాడాడు నా ద్వారా .  యువరాజుని భద్రం గా మీ దగ్గరకు చేర్చాను " అని అంటూ యువరాజు వేషం తీసేసి చూపించాడు రత్నాచార్యుడు.
   ఒక్క సారిగా కనుల ముందు కనిపించిన పుత్రుని చూసి రాజు ఆనందంతో పొంగిపోయాడు .  అతనిని కౌగలించుకొని నుదురు ముద్దాడాడు .  ఈ విషయం అంతా తెలిసిన మహారాణి  సభకు వచ్చిరాజేంద్రను  ఆనంద భాష్పాలతో అక్కున చేర్చుకుంది .    రాజకుమరున్ని జీవితునిగా చూసిన ఫణీంద్ర నివ్వెరపోయాడు .  పారిపోవాలని ప్రయత్నించాడు .  అది గమనించిన ఫణీంద్ర తండ్రిగారైన మహామంత్రి  అతడిని బంధించమని రాజ భటులను ఆజ్ఞాపించాడు .  ఆయన ఆజ్ఞ మేరకు ఫణీంద్ర ను గొలుసులతో బంధించారు .
    మహారాజు మహా మంత్రి తో " మీరు మా కుటుంబానికి తరతరాలుగా సేవలు అందిస్తున్నారు .  ఈ క్లిష్ట సమయం లో మా కర్తవ్యమ్ ఏమిటి అని అడిగాడు .  దానికి మహామంత్రి " మహారాజా ! చట్టం, న్యాయం అందరికీ సమానమే .  ఇక్కడ కూడా మనం చట్టం లో ఈ నేరానికి నిర్ణయించిన శిక్ష నే అమలు పరచాలి " అని అన్నాడు .మా రాజ్య స్తాపన అప్పట్లో మీరే చేసారు. మా పెద్దల తగ్గరనుంచి మీరే గురువులు  సలహాదారులు ఇప్పుడు ఇంత బాధాకరమైన  సందర్బం  వస్తుంది  అనుకోలేదు అంటూ రాజుగారు కాస్తంత బాధతో మాట్లాడుతున్నారు .  "రాజా ! తప్పు ఎవరు చేసినా తప్పే .  న్యాయం అనేది నిష్పక్షపాతం గా ఉండాలి .  ఫణీంద్ర చేసింది రాజ ద్రోహం .  ఇతనికి ఉరి శిక్ష ఖరారు చేయటమే తగిన నిర్ణయం " అంటూ తీర్పు వెలువరించాడు .  మంత్రి పరిషత్తు ఆమోదించింది .  కానీ రాజుగారు మాత్రం తన నిర్ణయాన్ని వెలువరించలేదు .
   ఆ రాత్రి అంతా ఆలోచించాడు రాజుగారు .  తెల్లవారింది .  ఫణీంద్ర ను ఇనుప గొలుసులతో బంధించి సభ లో రాజుగారి ముందు ప్రవేశ పెట్టారు .  అందరూ రాజు గారు ఏమి నిర్ణయం వేలువరిస్తాడా అని ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .  అప్పుడు రాజుగారు " కొద్ది రోజులు మేము మా కుమారుడు లేక పుత్ర శోకం తో బాధ పడ్డాము .  మళ్ళీ ఇలా మా గురువుగారు , మహా మంత్రి ఆ బాధ అనుభవించడం మాకు ఇష్టం లేదు .  కనుక మేము ఫణీంద్ర కు యావజ్జీవ కారాగార శిక్ష విదిస్తున్నాము " అని ప్రకటించాడు .     రాజుగారి తీర్పు విన్న సభికులు అందరూ రాజు గారిని అభినందించారు .  మహా మంత్రి  "మహారాజా ! మేము ఫణీంద్ర చేసిన పనులకు సిగ్గు తో తల ఎత్తుకోలేక పోతున్నాము .  మేము అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటూ శేషజీవితం గడుపుతాము " అని అన్నాడు .  రాజుగారు దానికి ససేమిరా ఒప్పుకోలేదు. కానీ మంత్రి గారు ఒప్పించారు .  అప్పుడు రాజు , మంత్రి వర్యా ! మా యువరాజు పట్టాభిషేకం వరకూ అయినా ఉండండి  అని అడిగాడు .  అందుకు అంగీకరించాడు  మహా మంత్రి.
     రాజుగారు వైద్యుడు రత్నాచార్యుడిని అభినందించాడు .  తమ యువరాజును కాపాడి తమకూ , రాజ్యానికి మేలు చేసినందుకు ఏమినా కోరిక కోరుకోమన్నాడు .  కానీ అందుకు వైద్యుడు అంగీకరించలేదు .  మహారాజా ! మేము మా విధిని నిర్వర్తిన్చాము .  మాకు ఇంకా ఏమి కోరికలు లేవు అని అన్నాడు .  అప్పుడు రాజుగారు ఆయనని ఘనం గా సన్మానించాడు . యువరాజు పట్టాభిషేకానికి వైద్యుని కుటుంబ సమేతం గా రమ్మని ఆహ్వానించాడు మహారాజు . 
      యువరాజు పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించి ఏర్పాట్లు చేసారు . దానికి రెండు రోజుల ముందు వైద్యుడు తన భార్య ను , కుమార్తె ను తీసుకుని రాజ మహలుకు వచ్చాడు .  వైద్యుని యొక్క కుమార్తె గిరిజ అందానికి , ఆమె స్వభావానికి ముగ్దురాలైంది మహారాణి .  యువరాజు రాజేంద్ర కూడా గిరిజను వివాహం చేసుకోవాలని అనుకుని తన తల్లిదండ్రులకు తెలియపరిచాడు .  వారు అందుకు అంగీకరించి రత్నాచార్యుడు దంపతులకు ఈ విషయం తెలుపగా వారు ఆశ్చర్య చకితులై ఆనందం తో అంగీకరించారు .  నిర్ణయించిన శుభ ముహూర్తం లో యువరాజుకి వివాహం పట్టాభిషేకం జరిగాయి .  దానితో రాజ పరివారం , ప్రజలు కూడా ఆనందించారు . 

    .

story part - 5

"మాది కోసల రాజ్యం .  మా తండ్రి గారు ఇంద్ర నీల చక్రవర్తి .  మా తల్లి గారు రాణి లక్ష్మి కల్యాణి ." అని చెప్పాడు రాజేంద్ర వినయంగా .  ఆ తరువాత వైద్యుని కుటుంబానికి  ఫణీంద్ర చేసిన మొత్తం ద్రోహం అంతా వివరం గా చెప్పాడు .  ఫణీంద్ర కుతంత్రం విన్న వారు ముగ్గురూ ఆశ్చర్య చకితులయ్యారు .  కొద్ది రోజులు రత్నాచార్యుని వైద్యం తో పూర్తిగా కోలుకున్నాడు రాజేంద్ర .  ఆ తరువాత వారు ఇద్దరు కలిసి ఒక పధకం ఆలోచించారు ఫణీంద్ర మోసాన్ని బయట పెట్టటానికి .  ఇద్దరూ మారు వేషాలలో కోసల రాజ్యానికి వచ్చారు . రాజ్య ప్రధాన ద్వారం వద్ద వీరిని రాజ్య రక్షక భటులు అడ్డుకున్నారు .   "అయ్యా ! మేము ఇద్దరం గురు శిష్యులం మా గురువుగారు మహా పండితులు .  మహారాజు వద్ద మా ప్రతిభ ను ప్రదర్శించి ఏమైనా బహుమానం పొందాలని వచ్చ్చాము .  కాస్తంత అనుజ్ఞ ఇవ్వండి లోనికి వెళ్ళటానికి " అని అన్నాడు మారు వేషం లో ఉన్న యువరాజు రాజేంద్ర .
          కొద్దిసేపు వేచి ఉన్న తరువాత వారికి లోనికి వెళ్ళటానికి అనుమతి లభించింది .  ఇద్దరూ లోనికి ప్రవేశించారు.  సభ లో రాజుగారు సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు .  యువరాజు రాజేంద్ర కి తన తండ్రిని చూడగానే భరించలేని ఆనందం , బాధ ఒకేసారి కలిగాయి .  అతని కన్నుల్లో నీరు చూసి రత్నాచార్యుడు ఆటను ఎక్కడ బయట పడిపోతాడో అని ఆందోళన చెంది, అతని చేతిని గట్టిగా నొక్కి కొద్దిసేపు తనని తానూ సంభాలించుకోమని చెవిలో చెప్పాడు .  "మహారాజా ! వీరు ఇరువురు మహా పండితులట.   వీరి పేరు రత్నాచార్యులు.  ఆ ప్రక్కన ఉన్న వ్యక్తీ ఈయన శిష్యుడు"  అని చెప్పాడు  వారిని తీసుకు వచ్చిన భటుడు .
     అప్పుడు మహారాజు వారిరువురికి స్వాగత సత్కారాలు చేసాడు .  పిమ్మట "స్వామీ ! ఎంత మంది పండితులు వచ్చినా ఈ ప్రత్యెక వాక్యానికి అర్ధం చెప్పలేక పోతున్నారు .  తమరు  మహా పండితులు అని విన్నాము .  దయ చేసి ఈ ప్రహేళిక ను పూరించండి .  ఇది మా యువరాజు మాకు పంపిన చివరి సందేశం .   యు .రా .సి.ఖ . అంటే అర్ధం తెలిపి మాకు, మా చక్రవర్తి కి మేలు చెయ్యండి" అని వినయం గా అడిగాడు మహా మంత్రి .దానికి రత్నాచార్యుడు " నేను నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను .  కానీ నాకు అసలు ఏమి జరిగిందో వివరం గా చెప్పండి " అని అడిగాడు .  అప్పుడు మహామంత్రి  ఫణీంద్ర చెప్పిన అన్ని విషయాలు పూర్తిగా చెప్పి ఆ పత్రాన్ని ఆయన చేతిలో పెట్టాడు .
       అప్పుడు ఈ గురు శిష్యులు ఇద్దరికీ ఫణీంద్ర చేసిన మొత్తం కుట్ర పూర్తిగా అవగతమైంది .  మహారాజు తన పుత్రుని తలచుకొని బాధ పడసాగాడు .  ఈ పండితుడు ఈ ప్రసన కు ఏమి సమాధానం చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు సభికులు అందరూ .  అప్పుడు రత్నాచార్యుడు  ఆ పత్రాన్ని చూసి ఇందులో చెప్పటానికి పెద్ద విషయం ఏముంది మహారాజ ! ఇది చాలా చిన్న  విషయం అని చాలా తేలికగా అన్నాడు .  అప్పుడు మహారాజు "  ఆచార్యా ! ఇప్పటి వరకూ ఎవరూ కూడా ఈ ప్రహేళికను వివరించలేక పోయారు .  మీరేమో చాలా తేలికగా చెప్తాను అంటున్నారు . ఇంతకీ  విషయాన్ని వివరించండి". అంటూ సంతోషం గా లేచి దగ్గరకు వస్తూ అన్నాడు .
       అప్పుడు  నేను చెప్పింది గుర్తు ఉందిగా అంటూ వైద్యుని చెవిలో గుసగుస లాడాడు రాజేంద్ర .  ఓ .. ఇది నువ్వు కత్తిపోటుకు గురి అయినప్పుడు రాసిన్దేగా అంటూ అడిగాడు వైద్యుడు .  అవునని తల ఊపాడు రాజేంద్ర ."మహారాజా ! మీకు ఈ పత్రాన్ని ఇచ్చిన వ్యక్తిని ఇక్కడకు పిలిపించండి . మొత్తం పరిశీలించి చెబుతాము" అని అన్నాడు రత్నాచార్యుడు .  ఆచార్యుడు ఇంత బాగా నటిస్తున్నందుకు ఆనంద పడ్డాడు రాజేంద్ర . కానీ స్వంత రాజ్యం లో తండ్రి ముందు తను కూడా నాటకం ఆడుతున్నందుకు బాధ పడ్డాడు .  కానీ పరిస్థితులు అనుకూలం గా లేనప్పుడు రాజనీతి లో ఇటువంటివి సహజం అని తనను తానూ సమాధాన పరచుకున్నాడు .  పైగా ఇంత కుట్ర చేసిన ఆ యువ మంత్రి  ఎలా ఉన్నదో తెలియాలి కదా. అని అనుకుంటూ ఉన్నాడు .  రాజుగారు సరేనంటూ ఫణీంద్ర ని తీసుకురమ్మని భటులను పంపారు .
       ఈ విషయం అంతా తెలుసుకున్న ఫణీంద్ర తన మనసులో " ఇంత వరకూ ఎవ్వరూ కూడా ఇలా చెయ్యలేదు .  నన్ను పిలవటం గానీ అనుమానించటం గానీ జరుగ లేదు .  వీరికి నా నిజస్వరూపం ఏమైనా తెలిసి పోయిందా ఏమిటి " అని అనుకున్నాడు .  కొంచం భయం భయం గా సభ లోనికి వచ్చాడు .

short story - part - 4

అలా ప్రయత్నాలు చేసి , చేసి విసిగి పోయిన రత్నాచార్యుడు  ఇంటికి చేరుకుంటున్నాడు .  ఇంతలో ఇంటిలోనుండి ఏవో అరుపులు పెద్దగా వినిపిస్తున్నాయి .  దానితో ఆందోళన చెంది కంగారుగా పరుగున వచ్చి లోనికి చూసాడు .  అతని భార్యా , కుమార్తె  లోపల గదిలో తలుపులు వేసుకుని ఉన్నారు . రాజకుమారుడు రాజేంద్ర ఎదురుగా ఒక పెద్ద పులి నిలబడి ఉంది .  ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ , వెర్రి చూపులు చూసే రాజేంద్ర పులిని చూసిన హతాత్పరినామం తో అటూ ఇటూ ఆయుధం కోసం వెతకసాగాడు .   రత్నాచార్యుడు రాజేంద్ర ఏమి చేస్తాడా అని చూస్తున్నాడు .  కానీ అతనికి కూడా భయం గానే ఉంది .  ఎందుకంటే రాజేంద్ర కు ఏమి విద్యలు వచ్చో  పూర్తిగా తెలియదు .  అందుకే తన దగ్గర ఉన్న బాకు తీసుకుని సిద్ధం గా ఉన్నాడు ఆ పులిపై విసరటానికి .  కానీ ఇంతలో రాజేంద్ర అటూ ఇటూ చూసి అక్కడ  అన్నం ఉడుకుతున్న పొయ్యిని చూసాడు .  వెంటనే వేగం గా ఆ పొయ్యి లోని మండుతున్న కట్టెను తీసుకుని పులికి చూపించాడు .  దానితో దాని ముందుకు వచ్చి ఆ మంటను చూపి దడిపించసాగాడు .  ఆ మంటను చూసి భయపడి పులి అడవి లోకి పారిపోయింది .  ఆ విషయం చూసి వైద్యుడు చాలా ఆనందించాడు .  ఇంతలో ఈ కదలికల కారణంగా అలిసిన రాజేంద్ర కళ్ళు తిరిగి కింద పడ్డాడు .  వెంటనే వైద్యుడు , ఇంట్లో ఉన్న అతని భార్య , కూతురు గబగబా అతని దగ్గరకు వచ్చారు .  వైద్యుడు అతని ముఖం పై నీరు చల్లి అతనికి స్పృహ రప్పించాడు .  స్పృహ వచ్చిన రాజేంద్ర వైద్యుడిని చూసి " ఆచార్యా !  మీరు ఎవరు ?  నేను ఇక్కడ ఎందుకు వున్నాను ?  నన్ను పొడిచిన మంత్రి  కుమారుడు ఏమయ్యాడు " అని ప్రశ్నించాడు రాజేంద్ర మాటలు విన్న వైద్యుడు "కుమారా ! నువ్వు కోలుకున్నవా ?  నీ ఆరోగ్యం గురించి నేను చాలా ఆందోళన పడ్డాను .  నువ్వు ఆ భగవంతుని దయ తో మామూలు స్థితి కి చేరుకున్నావు . " అంటూ ఆనంద భాష్పాలు తో రాజేంద్రను హత్తుకున్నాడు .  అతనికి జరిగిన విషయం అంతా వివరంగా చెప్పాడు రత్నాచార్యుడు.  " ఇన్నాళ్ళూ మా కుటుంబం అంతా నీ సేవ లోనే ఉన్నాము .  ఈమె నా భార్య సౌదామిని , ఇదిగో ఈమె నా కుమార్తె గిరిజా రత్న తిలక . అని పరిచయం చేసాడు  వైద్యుడు .  యువరాజు కు తెలివి వచ్చి అంతా మాములుగా మాట్లాడుతున్నాడు అని ఆనంద పడింది గిరిజ .  అతని వంక సూటిగా చూడలేక సిగ్గు తో ముడుచుకు పోయింది మొగ్గలా .  ఆమెను చూసి రాజేంద్ర చాలా ఆశ్చర్య పోయాడు ఆమె అందానికి ముగ్ధుడై పోయాడు .  ఇంత అందాల రాసిని నేను ఎక్కడా చూడలేదు .  అని ఏవో ఊహల్లో మునిగిపోయాడు రాజేంద్ర . 
   ఇంతలో "  కుమారా ! నీకు గతం గుర్తు వచ్చింది కదా !  నీ తండ్రి గారు ఎవరూ ?  మీ రాజ్యం ఎక్కడా ?  మీ తండ్రి గారి నామధేయం ఏమిటి ?  అసలు ఏమి జరిగిందో వివరం గా చెప్పగలవా ?" అని ప్రశ్నించాడు వైద్యుడు .

story part - 3

     వైద్యుడు రత్నాచార్యుడు  రాజేంద్ర ను ఎలాగోలా లేపి కూర్చుండ పెట్టాడు . అతనిని అతని గురించిన ప్రశ్నలు అడగటం మొదలు పెట్టాడు .  కానీ రాజేంద్ర తలకు తగిలిన గాయం వల గతం మర్చిపోయాడు .  ఏమి అడిగినా చెప్పలేక పోతున్నాడు .  మాటిమాటికీ తడబడుతూ వెర్రి చూపులు చూస్తూ ఏమి గుర్తు లేక తడబడుతున్నాడు . అతని స్థితిని అర్ధం చేసుకున్న వైద్యుడు అతని గాయాలకు లేపనం పూసి ,ఏదో కషాయం అతనికి పట్టించి  అతనికి సపర్యలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు .       కాలం అలా గడుస్తోంది .  ఇక్కడ కోసల రాజ్యం లో  రాజు గారు ఎందఱో పండితులను పిలిపించి యువరాజు పంపిన ఆ "యు . రా .సి .ఖ ." అన్న దాని అర్ధం తెలుసుకోవటానికి ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు . ఎంత ప్రయత్నం చేసిన దాని అర్ధం తెలియటం లేదు .  రాజు గారు తన తరువాత రాజ్యానికి వారసులు లేరని దిగులు పడుతున్నాడు . వయో భారం తో బాధ్యతలు నిర్వహించటం కష్టం గా ఉంది రాజు గారికి .  మహా మంత్రి  కూడా వృద్ధుడు  అవటం తో ఫణీంద్ర మహా మంత్రి అయ్యాడు .  ఇంకా రాజ కార్యాలు అన్నీ ఫణీంద్ర చక్క బెట్టవలసి వస్తోంది .  కానీ ఫణీంద్ర కి ఏమాత్రం అనుభవం లేదు పైగా దుడుకు స్వభావం .  దానివల్ల కొందరు అధికారులు రాజుగారితో మోర పెట్టుకున్నారు .కానీ ఏమి చేయలేక రాజుగారు  "చేతికి అంది వఛ్చిన యువరాజుని దూరం చేసావు .  అతనే ఉంది ఉంటె నాకు, ప్రజలకు ఈ బాధలు తప్పేవి .  ఇంకా మనస్సాంతి ఉండేది అని , ఇలా ఎందుకు చేసావు భగవంతు  ఇక్కడ అడవిలో వైద్యుడు రత్నాచార్యుడు రాజేంద్ర ను మామూలు మనిషిని చెయ్యటానికి పరిపరివిధాలుగా ప్రయత్నిస్తున్నాడు .  అతనికి రాజేంద్ర యువరాజు అని తెలుసు .  కానీ ఎ రాజ్యానికి వారసుడో తెలియదు .  ఆటను ఎక్కడివాడో తెలుసుకోవటానికి అడవి అంతా గాలిస్తున్నాడు .  నదిలో అతడు పడిన చోటులో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని వెతికాడు కానీ ఏమి దొరకలేదు .  యువరాజుకి గతం గుర్తుకు రావటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు .  సంజీవని మూలిక దొరికితే బాగుండు అని అనుకుంటున్నాడు .  తన చిన్న తనం లో ఒక కద ప్రచారం లో ఉండేది .  కీకారణ్యం లో కాకులు పెట్టిన గూడు చూడాలి .  అందులో పాము పడుకుని ఉన్నదా అని చూడాలి ఒక వేల అలా కనిపిస్తే ధైర్యంగా ఆ గూడు తీసుకుని పారే నీళ్ళలో వెయ్యాలి అప్పుడు ఆ పాము కాస్తా పుల్లలా మారుతుందట .  అదే సంజీవని అని చెప్పేవారు .  కానీ వైద్య శాస్త్రం లో అటువంటివి లేవు .  అందువల్ల అది అంత బోగస్ అని అనుకున్నాడు . డా అంటూ దేవుని దగ్గర మోర పెట్టుకుంటున్నాడు రాజుగారు .

story part - 2

            ఒక్క సారిగా ప్రసాంతతను భగ్నం చేస్తూ పెద్ద శబ్దం నీళ్ళలో .  దానికి అదిరిపోయిన పక్షులు చెట్లగుబుర్ల లోనుండి రెక్కలు టపటపా శబ్దం చేస్తూ గాల్లోకి ఎగిరిపోయాయి .  అక్కడే మూలికలు ఏరుకుంటున్న రత్నాచార్యుడు ఆ శబ్దానికి ఉలిక్కిపడి పక్కకి చూసాడు .  గుర్రపు డెక్కల అలికిడి విని చెట్ల గుబుర్ల చాటున దాక్కుని ఎవరికీ కనపడకుండా అంతా గమనించ సాగాడు .
        ఇతనిని గమనించని ఫణీంద్ర , రాజేంద్ర ను నీళ్ళలోకి పడవేసి వెంటనే గుర్రం పై వేగంగా వెళ్ళిపోయాడు .  ఆటను వెళ్ళిన తరువాత కొంత సేపు వేచి చూసి అప్పుడు చెట్ల గుబురులో నుండి బయటకు వచ్చి నది వైపుకు వెళ్ళాడు వైద్యుడు .  అక్కడ నీళ్ళలో ఉన్న రాజేంద్ర ను చూసాడు .  నీళ్ళు తగలటం తో స్పృహ లోకి వఛ్చిన రాజేంద్ర కొద్దిగా కదులుతూ మూలుగుతున్నాడు .      పరీక్షగా చూసిన వైద్యుడు రత్నాచార్యుడు ఫరవాలేదు , ఇతనిని బ్రతికించా వచ్చు అని అనుకున్నాడు .  అటూ  ఇటూ పరికించి చూసి ఒక తాడు తెఛ్చి నీళ్ళలో కనిపిస్తున్న రాజేంద్ర కాలికి ఉచ్చు వేసి తన గుర్రానికి కట్టి మెల్లిగా నీటినుండి బయటకు తీసాడు .  ఆ తర్వాత అతన్ని తన నివాసానికి తీసుకు వచ్చాడు .  అతని గాయానికి మందు పూసి పక్క పై పడుకోబెట్టాడు . 
      పక్షుల కిల కిలా రావాలు విని కళ్ళు తెరిచి చూసాడు వైద్యుడు .  అప్పుడే తెలతెల వారుతోంది .  సూర్య కిరణాలు ముఖం పై పడుతున్నాయి .  రాత్రి అంత కాపలా గా ఉండటంవల్ల కొంచం అలిసిపోయి నిద్రల్లోకి ఎప్పుడు జారుకున్నదో తెలియలేదు .  నిద్ర లేవగానే వెంటనే ఒక్కసారి అంత గుర్తు వచ్చింది .  వెంటనే ఆత్రుతగా రాజేంద్ర వైపు చూసాడు .ఆటను ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు . సూర్య కిరణాలు ముఖం పై పడటం తో మెల్లమెల్లగా కళ్ళు తెరిచి కాళ్ళు చేతులు కదిలిస్తూ లేవటానికి ప్రయత్నిస్తున్నాడు రాజేంద్ర .  అతనిలో కదలికలు చూసి రత్నాచార్యుడు ఆతను బ్రతుకుతాడని ఆనంద పడ్డాడు .        ఇక గుర్రం పై చాలా దూరం ప్రయాణం చేసి మంత్రి  కుమారుడు కోసల రాజ్యం చేరుకున్నాడు .  మంత్రిగారి బంధువులు , రాజకుమారుని స్నేహితులు , రాజ భటులు అందరు ఎదురేగి స్వాగతం పలికారు  రాకుమారుడు రాజేంద్ర గురించి అందరూ ఆరా తీయసాగారు .  ఫణీంద్ర ముందుగా తన తండ్రి గారైన మంత్రి వద్దకు వెళ్లి ఆయన కౌగిలించుకొని ఏడవటం మొదలు పెట్టాడు .  దానితో కంగారు పడ్డ తల్లిదండ్రులు ఇద్దరూ ఏమి జరిగిందని అడగటం మొదలు పెట్టారు .  రాజకుమారుడు తిరిగి రాలేదన్న వార్త తెలిసిన రాజ దంపతులు పరుగు పరుగున వచ్చి ఆందోళన పద సాగారు .  అసలు ఏమి జరిగిందో చెప్పు కుమారా !  నేను సైన్యాన్ని పంపుతాను అని లాలిస్తూ అడగ సాగాడు మంత్రి .  రాజుగారు కూడా ఫణీంద్ర ను దగ్గరకు తీసుకుని " నాయనా ! నాకు అయినా చెప్పు .  అసలు ఏమి జరిగింది ?" అని బ్రతిమలాడ సాగాడు .
     అప్పుడు ఫణీంద్ర  "రాజా ! ఏమి చెప్పమంటారు ?  మేమిద్దరం చాలా దూరం ప్రయాణం చేయటంవల్ల  అలిసిపోయి అడవిలో ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుంటే మాకు కొంచం నిద్ర పట్టింది .  నేను తిరిగి మెలకువ వచ్చి చూసే సరికి విషపు పురుగు కాటుకు గురి అయ్యి బాధ పడుతున్నాడు రాజేంద్ర .  నేను ఏంటో ప్రయత్నించి చూసాను .  కాని నా మిత్రుడిని దక్కించుకోలేక పోయాను .  ఇక చేసేది ఏమి లేక అక్కడే నదిలో శవాన్ని పడవేసి ఏడ్చుకుంటూ తిరిగి వచ్చాను " అని చెప్పాడు ఫణీంద్ర .తమ కుమారుని మరణ వార్త విన్న రాజ దంపతులు దుక్ఖితులై రోదించ సాగారు .  అందరు వారిని పరామర్శించ సాగారు .  తను చెప్పిన విషయాన్ని అందరు నమ్మడం తో ఫణీంద్ర సంతోషించాడు .
    ఇక్కడ అడవిలో వైద్యుని ఇంట్లో ఉన్న రాజేంద్ర ను బ్రతికించటానికి రత్నాచార్యుడు  అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు .  సపర్యలు చేస్తూ రాత్రింబగళ్ళు  కంటికి రెప్పలా కాపాడుతున్నాడు .  మెల్ల మెల్ల గా రాజేంద్ర మత్తు లో నుండి బయటకు వచ్చాడు .  కాని తలకు తగిలిన గాయంకారణం గా ఎక్కువ గా ఏమి మాట్లాడ లేక పోతున్నాడు .  ఫణీంద్ర అతడిని నదిలో పడవేసినప్పుడు ఒక రాయి గట్టిగా తగలటం వాళ్ళ తలకు గాయమైంది రాజేంద్రకు .  ఈ కారణం గా పదేపదే నిద్రలోకి జారుకుంటున్నాడు రాజేంద్ర .  అతడిని మామూలు స్థితి లోనికి తీసుకు రావటానికి రత్నాచార్యుడు తన వైద్య విద్యా పరిజ్ఞానాన్ని అంత ఉపయోగిస్తున్నాడు .
      ఇక్కడ కోసల రాజ్యం లో ఫణీంద్ర ను అన్ని వివరాలు గ్రుచ్చి గ్రుచ్చి అడుగుతున్నారు . అతను కూడా ఎవరికీ అనుమానం రాకుండా బ్రహ్మాండం గా నటిస్తూ రాజేంద్ర నుతలుస్తూ  ఏడుస్తున్నాడు .  అందువల్ల అక్కడి వారు ఎవరూ కూడా అసలైన  విషపు పురుగు వీదేనని గుర్తించ లేక పోయారు .  ఇంతలో ఫణీంద్ర  రాజుగారితో "రాజా ! నా మిత్రుడు నాకు ఒక పత్రము పై ఏదో రాసి ఇచ్చాడు .  అది మీకు అందించమని చెప్పాడు  అంటూ " ఆ పత్రాన్ని రాజుకు అందించాడు .    ఆ పత్రాన్ని చదివితే అందులో  " యు .రా .సి .ఖ "  అని మాత్రం రాసి ఉంది .  ఎంత ప్రయత్నం చేసినా అక్కడ ఉన్న సభికులు ఎవ్వరికీ దాని అర్ధం బోధ పడలేదు .  రాజు గారు దాని అర్ధం తెలుసుకోమని మంత్రి పరిషత్తు కు అప్పచెప్పారు . త్వరగా దీని రహస్యాన్ని చేదించండి అని ఆజ్ఞ జారి చేసాడు .

A Short Story - మంత్రం చాటు కుతంత్రం Part - 1 ( by Marimganti. Ranganayakamma)

       అది కోసల రాజ్యం .  ఆ రాజ్యం పొలిమేరల్లో  అంతా దట్టమైన అడవితో నిండి పోయింది .  దాని మధ్యలో అడ్డం గా పరవల్లు తొక్కుతూ ప్రవహిస్తున్న మహానది .  అక్కడ ఎన్నో మూలికలు , ఔషధ మొక్కలు ఉన్నాయి .  ఎవర్నీ పట్టించుకోకుండా తనకు కావలసిన మూలికలు తెమ్పుకుంటున్నాడు వైద్యుడు  రత్నాచార్యుడు.  అక్కడికి దగ్గరలో ఉన్న ఒక వేప చెట్టు కింద ఇద్దరు రాజకుమారులు భోజనం చేస్తున్నారు .  వారి మాటలు ఈ వైద్యుని చెవిన పడుతున్నాయి .         ఫణీoద్రా!  నీవు మంత్రి గారి అబ్బాయివి .  నేను రాజు గారి అబ్బాయిని .  ఇద్దరం ఇంత వరకు ఎటువంటి భేషజాలు లేకుండా సంతోషం గా గడిపాము .  చాలా బాగుంది .అన్నాడు రాజ కుమారుడు రాజేంద్రుడు .   ఇక చదువులతో పని లేదు .  నీవు కోసల రాజ్యానికి మహామంత్రి వి అవుతావు.  నీకు ఏమి తక్కువా ?  మా తండ్రి గారు శూరసేన మహారాజుకి మీ కుటుంబం అంటే  చాలా ఇష్టం కదా !"  అలా అలా మాట్లాడుతూనే ఉన్నాడు రాజేంద్రుడు .  ఏమిటి ఫణీoద్ర! ఇంతసేపు నేనే మాట్లాడుతున్నాను , నువ్వు ఏమి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.  పైగా ఏంటి తీక్షణం గా చూస్తున్నావు ? అంటూ గంభీరం గా అడిగాడు రాజేంద్రుడు . 
      " నా కంటే చదువు , తెలివి తేటలు అన్నిట్లోనూ అర్హతలు సాధింఛి పై స్థాయి లో ఉన్నాడు .  రాజ్యానికి తిరిగి వెళ్ళాక నేను రాజ దర్బారు లో మా తల్లితండ్రుల ముందు , సామంతుల ముందు , ఇతర అధికారుల ముందు నేను తల దించుకుని నిల్చోవలసి వస్తుంది .నేను విద్య లో ఎలా రాణించ గలను ? రాజ కుమారుడు బాగా చదివి ఎన్నో అర్హతలు , పతకాలు సంపాదించాడు .  నా దగ్గర ఒక్కటి కూడా లేదు .   నన్ను అందరూ తెలివి తక్కువ వాడు , వెర్రి వాడు  అని అంటారేమో ?  అని బాధ పడుతున్నాడు  మంత్రి కుమారుడు ఫణీoద్రుడు.  అంతేకాదు , తన చేతగానితనం  తో రాజకుమారుడి పై ఈర్ష్య తో , ద్వేషం తో రగిలి పోతున్నాడు .  మంత్రి పరిషత్తు వారు నన్ను సభ లో లేకుండా చేస్తారేమో , నా భవిష్యత్తు ఏమిటి ":అని ఆలోచిస్తూ కోపం తో ఊగిపోతున్నాడు  మంత్రి కుమారుడు .
  ఈ ఆలోచనలతో రాజేంద్రునితో మాట మాట పెంచాడు . చివరకు తన ఒరలోని కత్తిని  తీసి రాజేంద్రుని డొక్కలో పొడిచాడు ఫణీoద్ర.
   మా తండ్రి గారు , మీ తండ్రి గారు  మా తండ్రి గారు మంచి స్నేహితులు .  నిన్ను కూడా మంచిగా చదివించాలని ఇక్కడకు పంపించారు . మేం నీకు ఏమి ద్రోం చేసామని ఇలా తెగబడ్డావు ? అంటూ రాజేంద్ర గట్టిగా అడిగాడు .
   " నువ్వు కోసల రాజ కుమారుడవు . నువ్వు రాజ్యం చేరకూడదు .  నువ్వు చేరితే నా ప్రతిభ బైట పడుతుంది .  నా డొల్ల తనం , నా తెలివి తక్కువ తనం , అంత తెలిసిపోతుంది .  రాజ దర్బారు లో నాకు ఇక స్థానం ఉండదు .  అందుకే నిన్ను చంపుతున్నాను ." అంటూ కసిగా సమాధానం చెప్పాడు ఫణీoద్ర.     అసలు విషయం తెలుసుకున్న రాజేంద్రుడు చాలా ఆశ్చర్యం లో మునిగిపోయాడు .  చాలా బాధ పడ్డాడు .  "  నీ చివరి కోరిక ఏమిటో చెప్పు , అది నేను తీరుస్తాను  అంటూ వికటాట్టహాసం తో అడిగాడు ఫణీoద్ర. 
      దానికి రాజేంద్ర ఆలోచించి ఒక పత్రం ఇవ్వమని అందులో  యు . రా . శి. ఖ .  అని వ్రాసి , ఇది ఒక మంత్రం .  దీన్ని చదివితే , అర్ధం చేసుకుంటే రాజ్యానికి మంచిది , అందుకే దీన్ని రాజు గారికి అందించగలవు  అని అంటూ పడిపోయాడు రాజేంద్ర .
    ఫణీంద్ర  ఆ కాగితాన్ని అటూ ఇటూ తిప్పి చూసుకున్నాడు .  ఎంత చదివినా ఆ మాట అర్ధం కాలేదు .  చివరకు దాన్ని కూడా దాచుకున్నాడు .  నిస్తేజం గా పడివున్న రాజేంద్ర ని తీసుకుని గుర్రం పై అడవిలోనికి కొంత దూరం తెసుకు వెళ్ళాడు . 

uses of Honey n cinnamon

1.  Arthritis.  కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్లు కొంచం నీళ్ళలో ఒక స్పూన్ తేనే , ఒక స్పూన్ దాల్చిని చెక్క పొడి కలిపి మెత్తని పేస్టు లా చేసి శరీరం లో నొప్పి , వాపు ఉన్న చోట  రాసి మసాజు చేస్తే నొప్పి త్వరగా తగ్గుతుంది .  అలాగే రోజు ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక చెంచ దాల్చినిచెక్క పొడిని కలిపి బ్రేక్ఫాస్ట్  ముందు తీసుకుంటే chronic-arthritis. తగ్గుతుంది .
2.  Hair-loss.  దీనితో బాధ పడేవారు హాట్ ఆలివ్ ఆయిల్ , దాల్చిని చెక్క పొడి , ఒక చెంచ తేనే మిక్స్ చేసి దీన్ని తల స్నానానికి ముందు తలకు పట్టించి 15 నిమిషాల తరువాత తల స్నానం చేసుకోవాలి.  ఇది చాలా బాగా పని చేస్తుంది .
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online